Read Time magic by Bk swan and lotus translators in Telugu Motivational Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

కాలం చేసే ఇంద్రజాలం

జీవితమంటే కొన్ని క్షణాల సమాహారం.అంతకుమించి మరేమీ కాదు. భవిష్యత్తు నుండి వర్తమానం లోకి వచ్చే ప్రతి క్షణం మరు క్షణం మరు క్షణం లో గతం లోకి జారుకుంటుంది.ఆ క్రమంలో మనం వృధా చేసిన క్షణాలే పగిలిన దర్పణాలై మన మనసును పదేపదే గాయ పరుస్తాయి. సద్వినియోగం చేసుకుంటే ఆభరణాలై మన జీవితానికి శోభనిస్తాయి.కాంతి కిరణాలై భవితకు దారి చూపుతాయి.... అందుకనే ఇది నిజం ఆలోచించి చూస్తే క్షణం అంటే సమయంలో ఒక భాగం మాత్రమే కాదు... ఒక నిండు జీవితం.
        అటువంటి పండు వంటి మన నిండు జీవితాన్ని కలకాలం ప్రేమించాలి.గుండెనిండా అ ప్రమనే నింపుకుని కలకాలం జీవించాలి.క్షణక్షణం ఎదురయ్యే పరిస్థితిని పుష్ప గుచ్ఛంలా స్వీకరించాలి.ఆత్మవిశ్వాసంతో ఆచరించి విజయం సాధించాలి.ఓడేలా ఉన్నా పోరాడి మరీ విజయం సాధించాలి. కుడి ఎడమల దగాలే ఉన్న ఈ ప్రపంచంలో ధగధగలాడే సత్యమనే వజ్రంలా ప్రకాశించాలి.
   ఎంత విచిత్రమోకదా ఈ జీవితం... వస్తన్న క్షణాన్ని స్వాగతించి ఆస్వాదించే లోపే గతం లోకి పారిపోతుంది. ఆ గతాన్ని చరిత్రగా మార్చాలన్న తపన మాత్రం ప్రతీసారీ ఎదురౌతుంది.
ఇక్కడ జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఒకటి ఉంది... కృష్ణుడికీ నరకాసురుడికీ ఇద్దరికీ చరిత్ర వుంది.అయితే కృష్ణుడు పుట్టినందుకు పండగ చేసుకుంటారు.. నరకాసురుడు చచ్చినందుకు పండగ చేసుకుంటారు.మరి మన విషయం లో ఏం జరగాలి?
సముద్రంలోకి దూకాకా తీరం చేరేదాకా ఈదితీరాలి.. లేకపోతే తిమింగళాలు మింగేస్తాయి.. రాకాసి కెరటాలు లాగేస్తాయి... ఏదో ఎందుకో తెలియని ఈ ఆరాటాల పోరాటంలో బ్రతికిబట్టకట్టాలంటే కత్తితో పాటు డాలూ వుండాలి.కత్తి చాలా మంది దగ్గర వుంటుంది.. డాలు కోసం మాత్రం వారి చేయి ఇప్పటికీ వెతుకుతోంది.
ఎందుకంటే ఆకాశం అవకాశం ఒక్కోసారి ఒకేలా అనిపిస్తాయి. కళ్ళ ముందు కనిపిస్తున్నా అందుకోలేమేమో అని అనిపిస్తుంది... ఆకాశం లో ఎగరాలంటే విమానం కావాలి... అవకాశం అందుకోవాలంటే సహనం కావాలి.. ఆ వాహనం మన జీవన ప్రయాణ సాధనం అయితే గమనమెంత దూరమైనా గమ్యమంత కఠినమైనా... ఒక్క క్షణమైనా అలసట రానివ్వదు.
    కడలి తరంగం పడినా లేస్తుంది. దానికి మనసూ బుద్ధీ లేవు.. మనకున్నాయి.. అయినా మనమెందుకా ప్రయత్నం చేయం.మొగ్గ పువ్వవుతుంది.. పువ్వు పందె అవుతుంది... పిందె కాయ అవుతుంది.. కాయ పండవుతుంది... సరిగ్గా ఇలాగే మన ఆలోచన కూడా ధృడమైనదైతే ఆశయంగామారి తప్పక సత్ఫలితాన్ని ఇస్తుంది... భావి తరాలకు ఆదర్శ ప్రాయమవుతుంది
     నిజానికి పున్నమి చంద్రుని లో కూడా మచ్చనే చూసే తుచ్ఛమైన సమాజం ఇది. చాలావరకూ నీఛంగానే ఆలోచిస్తుంది. ఈ వ్యవస్థకు పట్టిన దురవస్థను మార్చటమే మన ముందున్న తక్షణ కర్తవ్యం.. ఇందుకోసం ఇంద్రజాలం చేయవలసిన పనిలేదు. మన ఆలోచనలు చేతలు మాటలు సరైన రీతిలో వుంటే చాలు...మొత్తం ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుణ్ణి కూడా.. ప్రపంచం మొత్తం ఒకేసారి చూడలేదు.... అలాగే ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ వుంటుంది.. అది తప్పక ఉదయిస్తుంది... కాకపోతే అందుకు కొంత సమయం పట్టవచ్చు
ఈ సత్యాన్ని గుర్తించకపోతే వేసే ప్రతీ అడుగూ అగాధం లోనే పడుతుంది.బెణికిన పాదం అడుగేయాలంటేనే వణుకుతుంది. ఆ సమయం లో కూడా శ్వాసలొదలని ఆశ ఆసరా కోసం ఎదురు చూస్తుంది..నిలువ గలిగితే జన్మ ధన్యమౌతుంది
ప్రస్తుత పరిస్థితులలో తన ప్రియ సంతానమైన మన అందరి నుంచి ఆశించేది ఇదే... మనలో అందరూ చక్రవర్తులే కానీ మన లో చాలా మంది ఈ చక్రాన్ని వక్రంగా తిప్పుతారు...అంటే పరమాత్మ స్వయంగా అందిస్తున్న ఈ సర్వోన్నత జ్ఞానాన్ని సర్వులకోసం కాకుండా స్వార్ధపూరిత దృష్ఠికోణంతో వాడుతుంటారు.
ఇది ఎవరికివారు ప్రశ్నించుకుని పరివర్తన చేసుకోవాల్సిన అంశం
మనం నిలబడటం కోసం పక్క వాళ్ళను పడేయకూడదు.. మనముందున్న వాళ్ళని మనకడ్డమనకూడదు.. 
ముందుంచడమే ముందుండటమని పరమాత్మ మనకు అనేక పర్యాయాలు తెలియజేశారు..ఇందుకోసం 'ముందుమీరు' అన్న మహా మంత్రాన్ని ఇచ్చారు.. అదే సందర్భంలో ఈ మంత్రాన్ని ఎలా వాడాలోకూడా సుస్పస్ష్ఠంగా తెలియజేశారు
ఈ భూమి సూర్యుడిచుట్టూ తిరుగుతోంది.. అలాగే విజయం వినయం చుట్టూ తిరుగుతుంది. కానీ భయానికీ వినయానికీ పిల్లికీ చెవుల పిల్లికీ ఉన్నంత తేడా ఉంది..మనకున్న విచక్షణా జ్ఞానమే దానిని మనకి విశదీకరిస్తుంది
అర్ధం లేని ఆలోచనలతో ఏవేవో భయాల వలయాలు మన చుట్టూ మనమే గీసుకుని వాటిమధ్యనే తిరుగుతుంటే ఇక శని గ్రహానికీ మనకీ తేడా ఏమిటి
విశ్వం ముందు విషయం చాలా చిన్నది... ఆ విశ్వంకూడా మన విశ్వాసం ముందు చాలా చాలా చిన్నది.. అందుకే ఆత్మ విశ్వాసం నీ ఇంటి పేరైతే విజయం నీ చిరునామా అవుతుందని కొందరంటారు
ఈ నమ్మకానికి పరమాత్మ పైన వున్న నిశ్చయం కూడా తోడైతే ఓటమికూడా మన ముందు ఓడిపోతుంది.. 
నిజానికి విజయం పుట్టింది మన కోసమే.. ఇంకా చెప్పాలంటే అది బ్రతుకుతోంది కూడా మనకోసమే... 
"విజయం మీ జన్మ సిద్ధ అధికారం సఫలత మనకంఠ హారం" అని గతి సద్గతి దాత గీతా జ్ఞాన ప్రదాత అయిన పరమ పిత పరమాత్మ మనకు వరదానం ఇచ్చారు.
ఇంత జ్ఞానం తెలిసిన మననికూడా  ఒక్కోసారి అజ్ణానం అమాంతం ఆవరిస్తుంది...నైరాశ్యం నిలువెల్లా  కమ్మేస్తుంది... " అప్పుడు కూడా నది దగ్గరగానే వుంది..తీరం మాత్రం దూరంగా వుందనిపిస్తుంది...కాలం చేసే ఇంద్రజాలమిది...ఎంతో చిత్రమైన పరిస్థితి ఇది..అయినా మనకే ఎందుకిలా జరుగుతోంది ఎలా జరుగుతోంది...  చివరికి ఈ పయనం ఎటుపోతోంది.. గమ్యమైతే స్పష్ఠంగా కనిపిస్తోంది గమనమే అస్తవ్యస్థంగా వుంది...ధైర్యానికి స్థైర్యం తగ్గినట్టుంది.. గలుపు ఏ మలుపులోనో ఇరుక్కుంది.. పిలుపైతే  వినిపిస్తోంది ... చూపుకే కనిపించకుంది.. ఈ రాతలు ఎవరికోసమని కలం అడుగుతోంది.. కాగితం మాత్రం సాగిపొమ్మంటోంది...రాసి రాసి సిరా నిండుకుంటోంది..ఊరుకోని మనసు మాత్రం ఊరికే ఊరిపోతోంది
ఇదే నైరాశ్యం తేచ్చే నీరసం.. ఈ విరసం నుండి బయటపడాలంటే ... విశ్వేశ్వరుని జ్ణాన గంగా జలం లోని పదజాలం యొక్క భావ జాలాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవాలి...ఓంశాంతి