క్షంతవ్యులు

(7)
  • 192.7k
  • 4
  • 53.1k

తొలినవలని మొదటి ముద్దుతో పోల్చడం అతిశయోక్తి కాదు. ఈ 1956 నవల నేటి భీమేశ్వర చల్లా నాటి సి. బి. రావు గా రచించినది. చిన్ననాటి నేస్తాలు, రామం, శశి, యుక్త వయసులో ప్రేమవలలో చిక్కుకుంటారు. కాని విధి వారి వివాహ బంధానికి యమ పాశం అడ్డువేయాగా రామం శశిని కోల్పోతాడు. చనిపోయిన ప్రియురాలిని తన ప్రేమలో సజీవింపించడం రామం జీవిత లక్ష్యం చేసుకుంటాడు. ఆ మానసిక స్థితిలో ఉన్న అతని జీవితంలోకి యశోరాజ్యం తన ప్రేమానురాగాలతో అడుగిడుతుంది. ఒకవైపు శశి ప్రేమానూ మరువలేక, యశో అనురాగాన్నీ వీడలేక 'రామం బాబు' సతమత మవుతుంటే

Full Novel

1

క్షంతవ్యులు - 1

క్షంతవ్యులు భీమేశ్వర చల్లా (సి.బి.రావు) Part I Originally published by Adarsa Grandha Mandali, Vijayawada. అంకితము - ప్రపంచంలోని ‘క్షంతవ్యులు’ కు. E-book: image: Painting of Nirmala Rau (author’s spouse) DTP Work Jyothi Valaboju (writer, editor, and ...మరింత చదవండి

2

క్షంతవ్యులు - 2

క్షంతవ్యులు – Part 2 చాప్టర్ 2 కొన్ని కొన్ని సంఘటనలు, ముఖ్యంగా మనమెన్నడూ ఆశించననవి, జీవిత కాలక్రమాన్నే మార్చేస్తాయి. తిన్నగా సాఫిగా జీవితపు బాట వక్రమార్గాలు తొక్కుతుంది. దీనికి కారణం వెతకటం అవివేకమూ, అవాంఛనీయమూ కూడాను. లోకాన్ని చూసిన పెద్దలు క్రింద పెదిమ నొక్కిపెట్టి ‘విధిచేష్టలు’ అంటారు. ఏమో అయివుండవచ్చు, కానీ ఈ విధి, ఈనియంత, ఇంత పక్షపాతంగా ఎందుకు ఉంటాడా అని అసహ్యం వేస్తూవుంటుంది. ఎవరైనా సుఖపడుతూంటే ఇతగాడు ఓర్వలేడు. ఏమయితేనే, సుశీ సాంగత్యమూ, స్నేహమూ నాకు లభించాయి. ఎనిమిది సంవత్సరాల తర్వాత పసి యవ్వనంలో తిరిగి ఈమె నాకు దొరికింది. సంతోషించానని వేరే చెప్పాలా? ఆనందంగా, ఆహ్లాదంగా, కులాసాగా ఆ సంవత్సరము గడిపేశాము. క్లాసులో సుశీకి ఎప్పుడూ నాకంటే ఎక్కువ మార్కులు వచ్చేవి. సుశీ కొంటెగా ‘‘నన్ను చూసి మార్కులు వేస్తున్నారు, జర్మన్ ప్రొఫెసర్ కి నేనంటే చాలా ఇష్టం తెలుసా’’ అంది. ఓసారి క్లాసులో ...మరింత చదవండి

3

క్షంతవ్యులు - 3

క్షంతవ్యులు – Part 3 చాప్టర్ 5 ఆ మరునాడు ఉదయం నిద్రలేచిన వెంటనే ఏదో ఒక పీడకల వచ్చినట్టయింది. మా అమ్మ దగ్గరకు వెళ్లి ఏదో పాడుకల వచ్చింది. సుశీకి ఎలావుందో ? ఆస్పత్రికి ఇప్పుడే వెళ్లి వస్తాను’’ అన్నాను. ఆమె కళ్లలోని కన్నీరు చూడగానే సుశీ నిజంగా మరణించిందనే విషయం స్ఫురణకు వచ్చింది. అప్పుడు నాకు కళ్లవెంట నీరు రాలేదు. కళ్లు చీకట్లు కమ్మాయి. అక్కడే కూలిపోయాను. సుశీ మరణం నాజీవితంలోని అతి ముఖ్యమైన సంఘటన. అది నాలోని కోరికలని, నమ్మకాల్ని సమూలంగా వూడబెరికింది. దైవం మీద నా విశ్వాసం సడలింది. భవిష్యత్తులో నా ఆలోచనల్ని, అభిప్రాయాల్ని, చేష్టలనీ తీర్చిదిద్దింది. దైవం నాకు అన్యాయం చేశాడనే అభిప్రాయం నా హృద‌ యంలో హత్తుకుపోయింది. అది ఎన్నడూ మాసిపోలేదు. చనిపోయినా సుశీకి నేను అన్యాయం చేయకూడదనే దృఢ‌ నిశ్చయానికి వచ్చాను. జీవితంలో ఇక వాటిని గురించి యోచించకూడదనుకొన్నాను. చాలా కాలంవరకు ...మరింత చదవండి

4

క్షంతవ్యులు - 4

క్షంతవ్యులు – Part 4 చాప్టర్ 9 ఒక వారం రోజులు దొర్గిపోయాయి. ముస్సోరి వాతావరణం నా శరీరానికి సరిపడింది. మనస్సుకూడా బాగయింది. యశో నన్ను పిక్నిక్ స్థలాలకి తీసుకుని వెళ్లేది. అప్పటికి ఆమె నన్ను ఏ విధంగా భావిస్తోందో తేటతెల్లమయింది. ఎవరో ‘బాదల్ బాబు’ అనే ఒక పురుషుడిని ఊహించుకుంది, ఈమె నన్ను మొదటిసారి చూసిన ఆ అశుభముహూర్తాన నేనే అతగాడినని ఈమెకు తట్టింది. “నమస్కారమండి” అన్నప్పుడు నేను పడిన తడబాటు ఈమె నమ్మకాన్ని దృఢతరం చేసింది. ఈమె మెదడులోంచి ఈ మిథ్యను ఎలా పోగొట్టటం? కాలమే ఈ సమస్యకి పరిష్కారం తీసుకువస్తుందని ఆశించాను. ఆమె నామీద ప్రదర్శించే అనురాగం, శ్రద్దా అవాంఛనీయమని ఆమెకు చూపించుదామనుకున్నాను. లేక మనస్సులో నాకు తెలియకుండానే ఆమె యెడఅభిమానం దాగియుందేమో? యశోకి సుశీ విషయం తెలిసివుంటుందనే ఆలోచనతో నన్ను నేనే మోసపుచ్చుకునే వాడిని, అలాకాకపోతే ఆమెకు ఇదంతా ఎందుకు చెప్పను? ఆరోజు రాత్రి ...మరింత చదవండి

5

క్షంతవ్యులు - 5

క్షంతవ్యులు – Part 5 చాప్టర్ 13 యశోకి సుశీ సంగతి తెలుసునేమో అనే ఆశతో అంతవరకూ వున్నాను. ఆనాటి తర్వాత ఆమె బట్టి ఆ ఆశ నిరాశ అని తెలిసింది. ఇక ఏమైనా ఈ వార్త ఈమెకు చెప్పాలి. ఆ నిశ్చయానికి వచ్చిన తర్వాత ఇంకా చాలా రోజులు గడిచిపోయాయి. ప్రతి రాత్రి ఆమెకు చెప్దామనుకునేవాడిని. కానీ నోట మాట వచ్చేది కాదు. రాత్రి భోజనం అయిన తర్వాత ఇద్దరమూ కలిసి నవలలు చదివేవాళ్లం. వాటిలోని పాత్రలను గురించి చర్చించేవాళ్లం. ‘‘మీరు నవలల్లో ఎవరిపక్షం వహిస్తారు. విసర్జించబడిన ప్రేమికూడా లేక వివాహం చేసుకున్నవాడా?’’ అడిగింది ఒక రాత్రి యశో. ‘‘సాధారణంగా విసర్జించబడినవాడే యశో. అతనికి ఎంత దు.ఖం కలుగుతుంది చెప్పు. ఒక సారి హృద‌యమర్పించిన తర్వాత ఏం జరిగినా తిరిగి తీసుకోలేడుగా,’’ అన్నాను. ‘‘అయితే మీరు ఎవరి ప్రేమనూ తిరస్కరించరు కదా?’’ అంది యశో ఎంతో ఆశతో ...మరింత చదవండి

6

క్షంతవ్యులు - 6

క్షంతవ్యులు – Part 6 చాప్టర్ 16 ఆ ఉత్తరం అందిన ఒక వారం రోజుల తర్వాత ముస్సోరీ బయలుదేరాను. దానిముందర, వెళ్లటమా, అని నాలో నేను చాలా తర్కించుకున్నాను. ఏకాంతజీవితంలో పూర్తిగా విసిగిపోయాను. యశో సన్యాసిని అయిందంటే నేను నమ్మలేకపోయాను. ఆమెను చూడాలనే వాంఛ ఆ వార్త విన్న తర్వాత హెచ్చింది. అయినా యశో ఉత్తరం ఒక సన్యాసిని రాసిన దానిలా అనిపించడంలేదు! లఖియా కూడా అక్కడే ఉందని విని ఆమెని చూడాలనే ఆత్రుత కలిగింది. ఆమె కథ నేనెన్నడూ మరువలేదు. యశో, లఖియా అక్కడ కలుసుకోవటం ఎంత ఆశ్చర్యంగా ఉంది. వెళ్లటానికే నిశ్చయించాను. అన్ని భారాలతోపాటు ఇంటిభారం, భూముల భారం బాబయ్యమీద పెట్టాను. డెహ్రాడూన్ చేరుతూ అనుకున్నాను - మొదటి సారి వెళ్ళినప్పుడు నా రాక కోసం యశో ఆమె తండ్రి ఎదురుచూస్తున్నారు రైల్వే ప్లాట్ఫారం మీద, ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు స్వర్గంలో ఉన్నాను. ఇంకొకామె ఆశ్రమంలో ఉంది. మొదటిసారి ...మరింత చదవండి

7

క్షంతవ్యులు - 7

క్షంతవ్యులు – Part 7 చాప్టర్ 18 ఆ మరునాడు మధ్యాహ్నం, నన్నూ సరళనీ వెంటబెట్టుకుని యశో గురువుగారి వద్దకు బయలుదేరింది. వెళ్లాలనే మాలో ఏమంత ఎక్కువగా లేదు. అయినా యశో పట్టుపట్టింది. వారి ఆశీర్వాదం పొందితే శుభం చేకూరుతుందంది. వెళ్లటంవల్ల మాకు నష్టమేమీ లేదు పోతే యశో ఇంత గౌరవించే ఈ సన్యాసిని చూసినట్టవుతుంది. అంతవరకు నాకు సన్యాసులంటే నమ్మకమూ లేదు. అపనమ్మకమూ లేదు. అసలు నిజమైన సన్యాసిని నేను చూడలేదు. దగ్గరలోనే ఉంది ఆయన నివాసం. మిగతావాటికంటె ఆ కుటీరం పెద్దదిగా కనబడింది. యశో ముందర లోపలికి వెళ్లింది, నేనూ సరళా గుమ్మంవద్ద నుంచుని తొంగిచూస్తూ ఉండిపోయాం .. ఇక్కడ కాస్త ఆగి ఈ గురువుగారి గురించి చెప్పాలి. నేను అనుకున్నట్టు తానేమి ముసలివాడు కాదు, నలభై సంవత్సరాలు మించవు. నల్లటి పొడుగాటి గెడ్డంవుంది. ఒంటినిండా బ్రహ్మాండమైన బొచ్చువుంది, ఎలుగుబంటువలె. ఒక పచ్చటి పంచ కట్టుకుని ఒక ఎత్తైన ...మరింత చదవండి

8

క్షంతవ్యులు - 8

క్షంతవ్యులు – Part 8 చాప్టర్ 21 ఎవరిని దుర్భాషలాడని భాషలో, ఎంతో సున్నితంగా లఖియా ఆత్మకథ సాగింది. తనలాగా అంత విపులంగా నా చేతకాదు, అందుచేత పాఠకులకు దాన్ని క్లుప్తంగా, నాకు తెలిసిన తీరులో విన్నవిస్తాను. ఆఖరికి మరణ శయ్యమీద లఖియా భర్తకు జ్ఞానోద‌యం కలిగింది. ‘‘నేను బతికి ఉన్నంతకాలం నిన్ను బాధ పెట్టాను లఖియా, నా తర్వాతనైనా నువ్వు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా భార్యవయినందుకు నా పాపాలు నీకేమీ అంటకూడదని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నాను,’’ అని తల నిమురుతూ చెప్పాడు. అప్పుడు భర్తను తనకు దక్కించమని ఎంతో ప్రార్థించింది, కానీ దైవం అతడి నుంచి వేరుచేశాడు. చివరికయినా భర్త ఆదరణ లభించింది అతని అనురాగం పొందింది అందుకే అంతకంటె ఆనందకరమైన రోజులు తన జీవితంలో లేవు అనుకుంటుంది. ఇల్లువాకిలీ అమ్మి, భర్త అంత్యక్రియలు చేసి అప్పులు తీర్చింది లఖియా. తరువాత నుదుట కుంకుమ చెరుపుకుని, తెల్ల చీర ...మరింత చదవండి

9

క్షంతవ్యులు - 9

క్షంతవ్యులు – Part 9 చాప్టర్ 23 రానురాను నాకు గురువుగారి మీద అపనమ్మకం హెచ్చింది. అందులో ఆయన మీద కోపం కూడా నామాటకంటే గురువు మాటలకు యశో ఎక్కువ విలువ ఇచ్చేది. ఎప్పుడూ ఆయన మాట జవదాటదు. అయన సేవకు వెనకాడేది కాదు. ఈమె మీద ఇంత అధికారం ఎలా వచ్చింది ఈయనకు. గురువుగారితో నా ప్రతిఘటన యశో ప్రవర్తనలో మార్పు తెచ్చింది. పూర్వపు శ్రద్ధా, మమకారమూ నా మీద సన్నగిల్లేయి. రాత్రిళ్లు ఆలస్యంగా పడుకున్నా ఏమీ అనేది కాదు. బ్రేక్‍ఫాస్ట్ చెయ్యక పోయినా పట్టించుకునేది కాదు. రాత్రిళ్లు ఏదైనా సరదాగా మాట్లాడుదామనో, గంగవొడ్డుకు వెల్దామనో నేనంటే, ‘‘నిద్రవస్తుంది, అలసిపోయాను,’’ అనేది. ఆ ప్రవర్తనకి కారణం నాకేమీ అంతుబట్టలేదు. నా మనస్సుకు అమితంగా బాధ కలిగేది. లఖియా కూడా మా సంగతి గ్రహించినట్లు కనబడింది. కాని ఆమె కూడా ఏమీ అనలేదు. అప్పుడప్పుడు సరళ వచ్చేది. ఆమెతోకూడా నేను పూర్వమంత చనువుగా ...మరింత చదవండి

10

క్షంతవ్యులు - 10

క్షంతవ్యులు – Part 10 చాప్టర్ 25 ఆ మధ్యాహ్నం మేము చేరేటప్పటికి సరళ ఒక్కతె ఉంది ఇంటిలో. "రా యశో, ఆహ్వానిస్తే ఆయన నాకు బోనస్ తీసుగొచ్చేరు," అంది సరళ. "రాజేంద్ర క్లినిక్ లో వున్నారా?" అన్నాను. "మీతో వచ్చిన తంటానే ఇది, కాని వాళ్లకు కంచాలు అయిన వాళ్ళకి విస్తర్లు," అంది సరళ నవ్వుతూ. "ఆయనకైతే పస్తులన్నవిషయం చెప్పటం మర్చిపోయావు సరళా," అంది యశో నవ్వుతూ. "నాకుకోపం తెపిద్దామనుకుంటే మీది వృధాప్రయాస, రోజులుమారాయి," అన్నాను. అప్పుడే దిల్ బహాదూర్ మంచినీళ్ళు తెచ్చేడు, మమల్నిగుర్తుపట్టి నమస్కరించేడు. "దిల్ బహాదూర్, డాక్టర్ గారికి బంధువు లొచ్చేరని చెప్పు," అంది సరళ. ఆ రాత్రి నేనూ రాజేంద్రా మేడమీద కూర్చుని వున్నాము. సరళా, యశో కింద వున్నారు. ‘‘అయితే రామంబాబూ. మీరిక్కడే వుండిపోకూడదా? అక్కడికీ, ఇక్కడికీ ఎందుకు వెళ్లటం? మాది లంకంత ఇల్లు. ఏం చేసుకుంటాము చెప్పండి. మేమిద్దరమూ, మా మామగారు కూడా ఇక్కడకు రావటం మానేశారు,’’ అన్నాడు రాజేంద్ర. మేము ఉదయం వాళింట్లో అడుగుపెట్టినప్పట్నుంచి ఇదే ధోరణి. యశోని సరళ, ...మరింత చదవండి

11

క్షంతవ్యులు - 11

క్షంతవ్యులు – Part 11 చాప్టర్ 27 మరునాడు ఉదయాన్నే కాశీ చేరుకున్నాము. ఇల్లు దొరికేవరకూ ఏదైనా హోటల్లో వుందామన్నాను కాని యశో ఆంధ్ర ఆశ్రమం వైపు మొగ్గు చూపింది. త్వరలోనే గంగ ఒడ్డున ఒక మూడు గదుల ఇల్లు . కొనుక్కుని అందులోకి మకాంమార్చాము. ‘‘మనకి రెండు గదులు చాలు. ఒకటి వంటకి, మరొకటి పడకకి, మూడోది ఏం చేద్దాం చెప్పండి?’’ అంది యశో పాలు పొంగిస్తూ. ఆప్రశ్న కి సమాధానము తన కెంత తెలుసో నాకూ అంతే తెలుసు. ప్రతిరోజు సూర్యోదయవేళ మేమిద్దరం కలిసి గంగాస్నానం చేసే వాళ్ళం. వారానికొసారి సాయంకాలం బోటు మీద గంగపై విహరించేవాళ్లం. అన్నిటి కన్నా నాకు అదే నచ్చింది. అప్పుడప్పుడు ఒక రాత్రికి బోటు అద్దెకు తీసుకుని రాత్రంతా అందులోనే గడిపేవాళ్లం. అన్నివేళలా మాయిద్దరి జీవన బాట ఒకటైనా, కాశీ విస్వేస్వరుడి కొలువులో మాత్రం మాది వేరే దారి. యశో ఆ దైవం ఎదుట అరమోడ్పు కన్నులతో తన్మయిస్తే నేను తనను పరవసిస్తూ చూసే వాడిని. ‘‘దేముడి ...మరింత చదవండి

12

క్షంతవ్యులు - 12

క్షంతవ్యులు – Part 12 చాప్టర్ 29 ప్రయాణ బడలిక తీర్థయాత్రలు విసుగూ ఇంకా తీరక ఆమరునాటి మధ్యాహ్నం నేను పోతుంటే. యశో గదిలోకి ‘‘బాదల్ బా బూ. బాదల్ బాబూ’’ అంటూ అరచినట్లుగా వచ్చింది. ‘‘ఏమిటి సుందరీ, ఏమైంది ?’’ అన్నాను నిద్రమత్తు ఇంకా వదలలేదు. ‘‘ఇంకెప్పుడూ అలాగా అలా పిలవకండి,‘‘అంది తను చెవులు మూసుకుని. నేను ఆశ్చర్యపోయాను. సుందరీ అనే పేరు తనకు నచ్చిందని ఆమే ఒక సారి చెప్పింది. పరిహాసమేమో అనుకున్నాను. ముఖం చూస్తే వెలవెల పోయింది . తన చేతిలో ఉత్తరం నా నా పక్క మీద పెట్టి తిరిగిచూడకుండా వెళ్ళిపోయింది కన్నీళ్లు తుడుచుకుంటూ . తీరా చూస్తే అది సరళ రాసింది. వణికే చేతులతో దాన్ని చదవటం ప్రారంభించాను. ‘‘ప్రియమైన యశోకి, నా సంగతి తర్వాత చెప్తాను. మొదట లఖియా విషయం చెప్పనీ, ఎలాచెప్పేది? ఆ విషయం తలచుకుంటూంటే హృద‌యం పగిలిపోతూంది. ఆమె కథ విని, నువ్వు ఒకసారి ...మరింత చదవండి

13

క్షంతవ్యులు - 13

క్షంతవ్యులు – Part 13 చాప్టర్ 31 రాజేంద్ర కారు నడుపుతున్నాడు. నేనతని పక్కన కూచున్నాను. సరళ కొడుకుని పెట్టుకుని కొద్దిగా ఇరుకుగా యశో దాయి లతో వెనకాల సీట్లో కూర్చుంది. ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండి ఎవరమూ పేదవి విప్పలేదు,పెద్దల మూడ్ గ్రహించేడో ఏమిటోచడి చప్పుడు లేకుండా బాబు నిద్రపోతున్న పోతున్నాడు లఖియా నా యాచన తిరస్కరించింది. శిక్షాకాలం ఏదో విధంగా గడిచిపోతుంది. ఆ సత్ప్రవర్తన వల్ల అది తగ్గించబడవచ్చుకూడా. ఆ తర్వాత ఆమె మా వద్దకు వస్తుంది. ఇహపరాలను లక్ష్యం చేయకుండా ఆమెను సుఖపెడతాను. జీవితమంతా చీకటిమయం కాదని నిరూపిస్తాను. ఈదారిలో ఎన్ని ఆటంకాలున్నా లెక్కచెయ్యను, అనుకున్నాను. కానీ నా ఆశలన్నీ లఖియా మాటలతో వమ్ములయ్యాయి. ఈమె ఇంకా ఎన్ని కష్టాలు పడాలని రాసివుందో. లఖియాని ధనసహాయం స్వీకరించమని అర్థించగలిగే ధైర్యం ఎవరికీ లేదు, ఎవరి వద్ద నుంచీ ఏమీ స్వీకరించదు అనుకున్నాను. చివరికి ఇంటికి చేరేము. ...మరింత చదవండి

14

క్షంతవ్యులు - 14

క్షంతవ్యులు – Part 14 చాప్టర్ 33 ఒక నెల ఎడబాటు తర్వాత యశోని తిరిగి కలుసుకున్నాను. మనిషి ఎంతో చిక్కిపోయింది. ముఖం మీద అలసట, స్పష్టంగా కనబడుతున్నాయి. చలికాలం అది. తను నా వులన్ కోటు పట్టుకుని, కాశ్మిర్ శాలువ కప్పుకున్నా, వణకుతూ, ప్లాటుఫారం మీద నా రాక కై ఎదురు చూస్తూంది. రైలు దిగిన వెంటనే నా కోటు ఇచ్చి వెంటనే తొడుక్కోమంది. టాక్సీలో ఇంటికి వెళ్తున్నాము ఒకరినొకరం హద్దుకు కూచుని. ‘‘జబ్బుపడ్డావా అమ్మీ,’’ అడిగాను తన చేయి తీసుగుని. “లేదే, ఎందుకలా అడుగుతున్నారు?’’ అంది నీరసంగా నవ్వుతూ. ‘‘నీ వాలకం చూస్తే అలానే వుంది,’’ అన్నాను రుగ్దకంఠంతో. ‘‘ఇదంతా విరహం బాదల్ బాబూ. ఇక ఇప్పటి నుంచీ మిమ్మల్ని ఒక్కరినీ ఎక్కడికీ పంపించను. ఎడబాటంటే ఏమిటో తెలిసి వచ్చింది’’ అంది హఠాత్తుగా ఒడిలో తల పెట్టి కళ్లు మూసుకుని. ‘‘నేనెలా అనిపిస్తున్నాను,’’ అన్నాను నా తల త్రిప్పి తన కళ్ళలోకి చూస్తూ ‘‘మీరు ...మరింత చదవండి

15

క్షంతవ్యులు - 15

క్షంతవ్యులు – Part 15 చాప్టర్ 35 కళ్లుతెరచి చూసేటప్పటికి ఆస్పత్రి మంచం పడుకుని వున్నాను. యశో నాకాళ్ల వద్ద కూర్చుని వుంది. లఖియా, సరళ మంచం వద్ద రెండు కుర్చీల్లో కూర్చొని వున్నారు. అప్పటికి సంగతి గ్రహించాను. రైల్లోంచి దిగే ప్రయత్నంలో కాస్త దెబ్బలు తగిలివుంటాయి. వారంతా పరధ్యానంగా వున్నారు. వారి వాడిపోయిన ముఖాలు చూసేక నా శరీరంలో నీరసం ఇంకా పెరిగిందనిపించింది . ‘‘మీ ప్రయాణం ఆపేశాను కదూ,’’ అన్నాను. అందరూ ఒక్కసారి తుళ్లిపడ్డారు. క్షణకాలం అంతా నివ్వెరపోయారు. యశో గబగబా లేచివచ్చి నాగుండెల మీద వెక్కివెక్కి ఏడుస్తూ పడిపోయింది. అంత దుఃఖాన్ని నేనింతవరకూ ఎప్పుడూ చూడలేదు. యశో తల హృద‌యం మీద వుండడంతో ఆయాసం కూడా పుట్టుకు వచ్చింది. ‘‘కాస్త తలతియ్యి యశో ఆయాసంగావుంది, ఎందుకు చెప్పు ఇంత ఏడుపు,’’ అన్నాను. లఖియా చటుక్కున లేచినించుని యశోని లేవదీసింది. యశో ముఖం చూస్తే నాకెంతో భయం వేసింది. ఎంత పాలిపోయింది? ...మరింత చదవండి

16

క్షంతవ్యులు - 16 - last part

క్షంతవ్యులు – Part 16 చాప్టర్ 39 ఇంటికి తీసుకొచ్చేసింది యశో, కాలుకి బదులు ఒక ధృడ‌మైన కర్ర చేతికి లభించింది. అయినా దాని అవసరం అట్టే కలుగలేదు. యశో నా వెంట ఛాయలా వుండేది. నీడకూడా అప్పుడప్పుడూ మనకు కనబడదు. కాని యశో అలా కాదు. కొన్నాళ్లు పోయిన తర్వాత కూర్చొని నడుపుకోవడానికి వీలున్న ఒక కుర్చీకొంది. అందులో కూర్చుని ఇంట్లో తిరిగేవాడిని. సాయం సమయాల్లో బయటకు తీసుకెళ్తానంటే నేనే వద్దనేవాడిని, అభిమానంతో సిగ్గుతో హృద‌యం దహించుకుపోయేది. కుంటివాడిని కుర్చీలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తూంటే లోకులేమనుకుంటారు. అప్పుడప్పుడు వెన్నెల రాత్రుల్లో నిద్రావస్తలో వున్న కాశీనగరంలో గంగ ఒడ్డుకు వెళ్లినప్పుడు గడిపిన వెన్నెల రాత్రులు జ్ఞ‌ప్తికి వచ్చేవి. వాటికీ వీటికీ ఎంత తేడావుంది. నయనాలతో నవ్వుతూ నన్ను లేవదీయండీ . అన్న ఆ యశోకీ కుర్చీతోసుకుపోతున్న ఈమెకీ ఎంత బేధముంది. తామరతూడుల్లాంటి ఈమె చేతులను చూసి తన్మయుడైన ఆ వ్యక్తికీ ఈ నిరర్ధకుడికి ఎంత ...మరింత చదవండి