Read Vennela Poolu - 23 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెన్నెల పూలు - 23

వెన్నెల పూలు

ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"నేను కూడా అంతే వదినా." సుస్మిత అంది. "ఇంతకీ నువ్వెప్పుడు అది చేద్దామనుకుంటున్నావ్? ఎక్కడ?"

"వన్ ఆర్ టు డేస్ లో. బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో. నేను మీకు చెప్తాను. మీరందరూ అక్కడ వుండొచ్చుకూడా." అలా అన్నాక ఇంక తర్వాత అడగబోయే ప్రశ్నలకి సమాధానం చెప్పడం ఇష్టం లెదన్నుట్టుగా లేచినిలబడింది సమీర. "వస్తా మరి. మెంటల్ కేర్ కి వెళ్ళాలి. అక్కడ అటెండ్ కావాల్సిన కేసెస్ వున్నాయి."

"యూజెలెస్ ఫెలో. పనయ్యాక బయటకి పొమ్మని కూడా నేనే చెప్పాలి. పో అవతలకి." శకుంతల టిబ్బూ మీద అరవడం వినిపించింది బయటకి వచ్చేస్తున్న సమీర కి.

"మేడం ..........." తన గదిలోకి అడుగుపెట్టబోతూవున్న సమీర టిబ్బూ గొంతువిని వెనక్కి తిరిగింది.

"ఏంటి టిబ్బూ?" టిబ్బూ మొహం లోకి చిరునవ్వుతో చూస్తూ అడిగింది.

"మీరు అరవింద్ బాబు కి గతం అంతా గుర్తుకువచ్చేలా చెయ్యగలరా? ఆ బాబు కి తరవాత ఇబ్బందేమీ ఉండదు కదా."

"ఐ యాం కాన్ఫిడెంట్ టిబ్బూ. చెయ్యగలననే అనుకుంటున్నాను. అండ్ ........" కాస్త ఆగి అంది. "............ నీ అరవింద్ బాబు కి ఇబ్బంది ఏమీ ఉండదు."

"చాలా సంతోషం మేడం." టిబ్బూ మొహం లో సడన్ గా చిరునవ్వు, సంతోషం కనిపించాయి. "నా అరవింద్ బాబు ని మళ్ళీ మామూలుగా ఎప్పుడు చూస్తానా అని వుంది."

"కావాలంటే నేను నీ అరవింద్ బాబు ని హిప్నటైజ్ చేసే సమయం లో నువ్వూ అక్కడ ఉండొచ్చు టిబ్బూ." సమీర సజెస్ట్ చేసింది.

"శకుంతల మేడం ఏమంటారో ఏమో, ఆవిడ ఒప్పుకుంటే నేను తప్పకుండా అలాగే వస్తాను." అలా అన్నాక అక్కడనుండి వెళ్ళిపోయాడు టిబ్బూ.

గట్టిగా నిట్టూర్చి తన గదిలోకి ప్రవేశించింది సమీర. ఇప్పుడు తను తెమిలి వెళ్లదలుచుకున్నది బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ కి కాదు. సుస్మిత లవర్ శరత్ దగ్గరికి. కాసేపటి క్రితమే అతనికి ఫోన్ చేసి తనువస్తున్నట్టుగా చెప్పింది. సుస్మితని మాటల్లో పెట్టి అతని అడ్రస్ తీసుకుంది.

&&&

"మీరు నాతో మాట్లాడ్డానికి ప్రత్యేకంగా ఇక్కడకి రావాల్సిన అవసరం ఏముంది సమీరా? నేనే అక్కడికి వచ్చేవాడిని కదా." ఇద్దరూ హాల్లో సెటిల్ అయ్యాక సంభాషణ మొదలుపెట్టాడు శరత్.

"మనిద్దరి మధ్య సంభాషణ అక్కడి వాళ్ళకి తెలియకూడదు. ముఖ్యంగా సుస్మిత కి. అందుకనే నేనే నీ దగ్గరికి వచ్చాను. నేనిక్కడికి వస్తున్నట్టుగా అక్కడివాళ్లెవరికీ తెలియదు కూడా." సమీర అంది.

"నాకు అర్ధం కావడం లేదు సమీరా. అలా ఎందుకు?" ఒక అయోమయం ఎక్స్ప్రెషన్ తో అడిగాడు శరత్.

"నేను అరవింద్ ని హిప్నటైజ్ చేసి అతనికి గతం అంతా గుర్తుకొచ్చేలా చేద్దామనుకుంటున్నా. ఆ క్రమం లో అతనికి గతం తో పాటుగా, ఆ రోజు తను ఆ బంగ్లాలో ఏం చూశాడో కూడా గుర్తుకువచ్చే అవకాశం వుంది."

"రియల్లీ?" ఆశ్చర్యంగా అన్నాడు శరత్. "కానీ మీరు అందుకు ఒప్పుకోవట్లేదని, తనకి నాచురల్ గానే అన్నీ గుర్తుకురావాలంటున్నారని సుస్మిత చెప్పింది."

"అలాగానే అనుకున్నా. కానీ ఇటీవల తన గతం గుర్తుకొచ్చీ రాక తనలో స్ట్రగుల్ ఎక్కువ అయింది. అందుకనే హిప్నోసిస్ లోకి పంపి అంతా గుర్తుకువచ్చేలా చేద్దామనుకుంటున్నా." గట్టిగా నిట్టూర్చి అంది సమీర. "అఫ్కోర్స్, ఇలాంటి పాజిబిలిటీ కూడా నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేసాను. కాకపోతే నాచురల్ గా తనకి అంతా గుర్తుకువచ్చేస్తుందేమో చూద్దామనుకున్నా. తను సఫర్ అవ్వడం చూస్తూంటే ఇంక వెయిట్ చెయ్యడం మంచిది కాదు అనిపించింది. అందుకనే ఇటువంటి నిర్ణయానికి వచ్చాను."

"ఇది మంచి నిర్ణయం గానే నాకూ అనిపిస్తూంది సమీరా. కానీ…......." కాస్త ఆగి అడిగాడు శరత్. ".......... ఇది మీరు వాళ్ళెవరికీ తెలియకుండా చేద్దామనుకుంటున్నారా? నా హెల్ప్ ఎమన్నా మీకు కావాలా? అందుకనే వాళ్ళకి తెలియకుండా నాతొ మాట్లాడ్డానికి ఇలా వచ్చారా?"

"నో మిస్టర్ శరత్. నేనిది చెయ్యబోతున్నట్టుగా వాళ్ళకి తెలుసు. నా ఆంటీ ని, సుస్మిత ని ఇంకా టిబ్బూ ని కూడా అక్కడ ఆ సమయంలో  ఉండమని చెప్పను."  కాస్త ఆగి అంది సమీర. "మీరు కూడా ఆ సమయం లో అక్కడ ఉండాలి."

"నాకేం అభ్యంతరం లేదు సమీరా." మళ్ళీ శరత్ మొహం ఆశ్చర్యంతో నిండింది. "అరవింద్ నాకు బెస్ట్ ఫ్రెండ్. మీరు జస్ట్ ఫోన్ లో అడిగినా నేను వచ్చి అక్కడ వుంటాను. దానికి మీరు ఇలా నా ఇంటికి ప్రత్యేకంగా వచ్చి రిక్వెస్ట్ చేయనవసరం లేదు. అంతేకాకుండా ఈ మీటింగ్ ఇలా మీరు సీక్రెట్ గా ఉంచాలని ఎందుకు అనుకుంటున్నారో నాకు బోధపడడం లేదు."

"మిస్టర్ శరత్.........." ఇంక కుర్చీలో కూచోలేనట్టుగా లేచి నిలబడింది సమీర. "………అరవింద్ లాంటి ఒక ఫిజికల్లీ అండ్ సైకాలజికల్లీ యాంగ్ గై సడన్ గా ఒక దృశ్యం చూసి, తట్టుకోలేక షాక్ కి గురయ్యి బ్లాంక్ మాడ్ అయిపోయాడు. రేపు నేను అరవింద్ ని హైప్నోటైజ్ చేసి గతం అంతా గుర్తుకొచ్చేలా చేసే క్రమం లో ఆ రోజు తను ఆ బంగ్లా లో ఏం చూశాడో కూడా అతనికి గుర్తుకువస్తుంది. అదప్పుడు మనకందరికీ కూడా తెలుస్తుంది. కానీ .........." తను చెప్పబోయేది నొక్కిచెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగి అంది సమీర. ".......... సుస్మిత తన ఓన్ సిస్టర్. ఆ విషయం గురించి తెలిసాక సిమిలర్ ఎఫెక్ట్ తనమీద కూడా వుండదంటారా?"

షాక్ తో తను కూడా కుర్చీలోనుండి లేచినిలబడ్డాడు శరత్. "అసలు మీరేం చెప్పదలచుకున్నారు డాక్టర్ సమీరా?” ఆందోళనగా అడిగాడు

"ఎస్, మిస్టర్ శరత్. ఒక ఇరవైతొమ్మిదేళ్ళ ఆరోగ్యంగా వున్న కుర్రాడిని సడన్ గా బ్లాంక్ మాడ్ గా మార్చేసిన దృశ్యం ఎంత ఇంటిమేట్, పవర్ఫుల్ ఇంకా పెర్సనల్ అయివుంటుంది? అది ఒకవేళ ఆ ఫ్యామిలీ కి సంబంధించినదే అయితే? అరవింద్ కి ఓన్ సిస్టర్ అయిన సుస్మిత మీద కూడా అది అలాంటి ఎఫెక్టే చూపించొచ్చు కదా."

"మీరు చెప్పింది నిజమే. అన్నీ కన్సిడర్ చేసిచూస్తే అరవింద్ ఆ బంగ్లా లో ఏదో చూసే అలా అయ్యాడన్న విషయం బోధపడుతూంది. మీ లాజిక్ కరెక్ట్. ఎస్, అది ఏమైనా సరే సుస్మిత ని కూడా చాలా ఎఫెక్ట్ చెయ్యడానికి అవకాశం వుంది." సమీర రీజనింగ్ బోధపడి సాలోచనగా అన్నాడు శరత్.

"మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. మీరు ఆ సమయం లో అక్కడవుంటే తనకి చాలా సపోర్టింగా ఉంటుంది."

"తప్పకుండా అలాగే. మీరు ఎప్పుడు ఎక్కడ తనని హిప్నోటైజ్ చేసి, గతాన్ని గుర్తుచెయ్యబోయేది నాకు చెప్పండి. నేను అప్పుడు అక్కడ వుంటాను." శరత్ కాస్త ఆగి సుస్మిత ఎదో అనబోయే లోగానే మళ్ళీ అన్నాడు. "ఎనీహౌ సుస్మిత అప్పుడు అక్కడ ఉండడం అవసరం అంటారా? ఎదో ఇబ్బందిపెట్టే విషయం తెలుస్తుందన్నప్పుడు తనని ప్రస్తుతానికి తప్పించవచ్చు కదా?"

"తన బ్రదర్ కి తెలిసాక తనకి తెలియడానికి ఎక్కువ సమయం పట్టదు. అదేదో అప్పుడే తెలిస్తే, మనమందరం దగ్గరవుండి సర్దిపుచ్చడానికి అవకాశం ఉంటుంది."

"మీరు చెప్పేది నిజమే. అలాగే అయితే." తలూపి అన్నాడు శరత్.

"వన్ ఆర్ టు డేస్ లో నేను బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో ఇది ఎరేంజ్ చేస్తాను. మీకు ప్రీయర్ గా ఇంటిమేట్ చేస్తాను. ప్లీజ్ మీరు తప్పకుండా అక్కడవుండాలి." ఒక బతిమాలుతున్న ఎక్స్ప్రెషన్ తో అంది సమీర.

"మీరు నన్ను ఇలా అడగాల్సిన అవసరం లేదు. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ ఇంకా, లవర్ కి సంభందించిన విషయం. నేను తప్పకుండా అక్కడవుంటాను."

"ఒకే. మరింక నేను వెళ్ళొస్తాను." వెనక్కి తిరిగి రెండడుగులు వేసింది.

"వన్ మూమెంట్ సమీరా."      

శరత్ అలా అనగానే సమీర వెనక్కి తిరిగి అతని ముఖంలోకి చూసింది.

"శకుంతలా మేడం కూడా అదే ఫ్యామిలీ కి సంభందించిన మనిషి. ఆ విషయం నాలెడ్జి లోకి వచ్చిన తరువాత తనూ సిమిలర్ గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం వుంది. తన గురించి ఏం ఆలోచించారు?" భృకుటి మూడేసి అడిగాడు.

"తను మెచ్యూరిటీ వున్న మనిషి. పెద్దావిడ. అటువంటి విషయాల్ని తను తట్టుకోగలదనుకుంటున్నాను. అయినా అందరికీ మనం ఏర్పాట్లు చెయ్యలేం కదా, సుస్మిత విషయం లో లా. నేనైతే మాత్రం ఆ సమయం లో ఆవిడని కూడా అక్కడ వుండమనే చెప్పాను. "

"ఒకే సమీరా."

శరత్ అలా అన్నాక గట్టిగా నిట్టూర్చి గడప వరకూ వచ్చింది సమీర.

"డాక్టర్ సమీరా. ఆఖరుగా ఒక్క విషయం." శరత్ అని తొందరగా సమీర దగ్గరికి వచ్చాడు.

మరోసారి వెనక్కి తిరిగి శరత్ మొహంలోకి చూస్తూ అంది సమీర. "చెప్పండి."

"మీరు అరవింద్ ఆ రోజు ఆ బంగ్లాలో చూసినదేమిటో గెస్ చేశారు కదా."

ఎదో అనీజీ ఎక్స్ప్రెషన్ తో నిండిపోయింది సమీర మొహం. "మీరు నన్ను ప్రశ్నలేం అడక్కండి మిస్టర్ శరత్." అలా అన్నాక వేగంగా అక్కడనుండి వెళ్ళిపోయింది. 

&&&

"ఓహ్ గాడ్! ఆఖరికి ఆ రోజు వచ్చింది. ఆ చీఫ్ ఎవరు, మొత్తం మిస్టరీ అంతా విడిపోతుందంటే నాకు చాలా ఎగ్జైటింగ్ గా వుంది. ముఖ్యంగా నా బ్రో ఆ రోజు ఆ బంగ్లాలో ఏం చూశాడో తెలుసుకోవాలని నాకు చాలా ఆతృతగా అంది." చిన్నపిల్లలా ఆనందపడుతూ అంది సుస్మిత.

అరవింద్ ని హిప్నోటైజ్ చేసి అతనికి గతమంతా గుర్తుకువచ్చేలా చెయ్యడానికి ఒక రోజు, ప్లేస్ ఫిక్స్ చేసి అందరికీ చెప్పింది సమీర. ఏక్సెప్ట్ శకుంతలా, ఇంకా టిబ్బూ తప్ప తక్కిన అందరూ అక్కడ వున్నారు. ఒక రూమ్ లో చక్కగా రిలాక్స్ అవ్వగలిగిన కుర్చీలో కూచుని వున్నాడు అరవింద్. అతని చుట్టూతా సుస్మిత, శరత్, అభినవ్, తనూజ కుర్చీల్లో కూచునివుంటే, సమీర తనకి దగ్గరలో నిలబడివుంది.  నిరంజన్ తను కూడా ఉండాల్సిన అవసరం ఉంటుందా అని అడిగాడు. సమీర అవసరం లేదని చెప్పింది.

"అదేమిటి? లాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల కదా నేను నా గతం మర్చిపోయింది? ఇంక మరి ఈ మిస్టరీ ఏమిటి, నేను ఆ బంగ్లాలో ఎదో చూడ్డమేమిటి? చీఫ్ ఎవరు?" ఆశ్చర్యంగా అడిగాడు అరవింద్.

"లేదు అరవింద్. నువ్వారోజు ఆ బంగ్లాలో తట్టుకోలేనిది ఎదో చూసే షాక్ తో బ్లాంక్ మాడ్ అయ్యావని మేమందరం నమ్ముతున్నాం. దానిని సపోర్ట్ చేసేలా కొన్ని సంఘటనలు కూడా జరిగాయి." గట్టిగా నిట్టూర్చి అంది సమీర.

"అయితే ఆ సంఘటనలు ఏమిటో కొంచెం వివరించి చెప్తావా?" అదే ఆశ్చర్యంతో అడిగాడు శరత్.

"నీకు నీ గతం అంతా గుర్తుకు రాగానే మొత్తం పజిల్ అంతా విడిపోతుంది. ఇప్పుడు వాటన్నిటిగురించి చెప్పి టైం వేస్ట్ ఎందుకు?"

"ఎస్, బ్రో. ముందు నిన్ను హిప్నటైజ్ చేసి నీకు గతమంతా గుర్తుకొచ్చేలా చెయ్యనీ. అన్ని విషయాలు తెలుస్తాయి. ఇంకా ఈ విషయం లో లేట్ వద్దు." అదే ఉత్సాహంతో అంది సుస్మిత.

"ఒకే కానీ........." సడన్ గా ముడిపడింది అరవింద్ భృకుటి. "........మామ్, టిబ్బూ ఎక్కడ? మీరందరూ ఇక్కడఉన్నప్పుడు వాళ్లిద్దరూ ఇక్కడ ఎందుకులేరు?"

"నేను ఆ ఇద్దరికీ కూడా ఇక్కడ ఉండమని చెప్పాను. మరెందుకు రాలేదో నాకు తెలియదు." సమీర అంది.

"మామ్ కి మొదటినుండీ నిన్ను హిప్నటైజ్ చేసి ఇబ్బందిపెట్టడం ఇష్టం లేదు. అందుకని రాలేదు. టిబ్బూ ని ఏవో పనులు చేయించుకోవడానికి ఆపేసి ఉంటుంది. అంతా సవ్యంగా పూర్తయిన తరువాత వాళ్ళూ సంతోషిస్తారు. వాళ్ళ గురించి అలోచించి సమయం వేస్ట్ చెయ్యొద్దు." సుస్మిత అంది.

"ఎస్, అరవింద్. యువర్ సిస్టర్ ఈజ్ రైట్." సమీర అంది.   

"ఆల్రైట్. అలాగే కానీ. ఐ యామ్ రెడీ టు బి హిప్నోటైజ్డ్." ఆ కుర్చీలో వెనక్కి జారగిలబడి కళ్ళుమూసుకుంటూ అన్నాడు అరవింద్.       

"కానీ నేను నిన్ను హిప్నటైజ్ చేసి, అంతా గుర్తుకువచ్చేలా చేసేముందు, నిన్నొక ప్రశ్న అడగలనుకుంటున్నా. మన ప్రేమ నిజమేనని, అందులో ఎటువంటి లోపం లేదని నువ్వునమ్ముతున్నావా?" అరవింద్ ముందు నిలబడి అతని మొహం లోకి చూస్తూ అడిగింది సమీర.

"ఇదేం పిచ్చి ప్రశ్న. అసలు అడగాల్సిన ప్రశ్నయేనా ఇది?" కళ్లుతెరిచి సమీర మొహంలోకి చూస్తూ చిరునవ్వుతో అడిగాడు అరవింద్. "నేనలా మాడ్ గా అన్నిరోజులు వున్నాను. గతం గుర్తుకురాకుండా వున్నా నన్ను పెళ్లిచేసుకున్నావ్. ఇదంతా ప్రేమతో కాకుండా ఎందుకుచేస్తావ్? నీ మీద నా ప్రేమ విషయమై నీకేమన్నా సందేహం ఉందేమో, కానీ నా మీద నీ ప్రేమ విషయం లో నాకెలాంటి సందేహం లేదు."

"అయితే నువ్వు నాకొక మాట ఇవ్వాలి." అరవింద్ ముందు తన కుడి చేతిని జాపి అంది సమీర. "నా చేతిలో నీ చెయ్యివేసి నువ్వు నాకు ఆ ప్రామిస్ చెయ్యాలి."

"ఇది చాలా ఫ్యూలిష్ గా వుంది సమీ." కుర్చీలోనుండి చిరాకుగా లేచి నిలబడుతూ అన్నాడు అరవింద్. "ఎందుకిలా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నావ్?"

"ప్లీజ్ అరవింద్. నువ్వు నా ప్రేమ గురించి చెప్పినదంతా నిజమే అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి. ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు." బతిమాలుతున్నట్టుగా అంది సమీర.

"ఆల్రైట్, ఆల్రైట్. ఏం మాట ఇవ్వాలి చెప్పు?" తన ముందు ఉంచిన సమీర కుడిచేతిలో తన కుడిచేతిని ఉంచి అడిగాడు అరవింద్.

"నీకిప్పుడు ఏం తెలిసినా, ఎలాంటిది తెలిసినా, ఆవేశ పడనని, ఎమోషనల్ అవ్వనని నాకు మాట ఇవ్వాలి. అలాగే మన ప్రేమ మీద నమ్మకముంచి నేను చెప్పినట్టు వింటానని మాటఇవ్వాలి." సమీర అంది. 

"సమీ, నేను ఆల్రెడీ........" ఎదో చెప్పబోయాడు అరవింద్.

"ప్లీజ్ అరవింద్. నేను నిన్ను హిప్నటైజ్ చేసి నీ గతం అంతా గుర్తుకు వచ్చేలా చెయ్యాలంటే, నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి." సమీర పట్టుదలగా అంది.

"ఒకే అయితే." గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు అరవింద్. "నేను నీకు ప్రామిస్ చేస్తున్నా. నాకు ఎలాంటి విషయాలు తెలిసినా నేను ఎమోషనల్ బాలన్స్ కోల్పోను. నీ ప్రేమ మీద నమ్మకం తో వుంటాను. నువ్వు చెప్పినట్టు వింటాను. ఇది చాలా?"

"దట్స్. ఇనఫ్." తన చేతిని తీసి, రెండు చేతులతో అరవింద్ ని కౌగలించుకుని, అతని కుడిబుగ్గమీద ముద్దుపెట్టుకుంటూ అంది సమీర.

"హియర్ ఈజ్ ఆడియన్స్." తనూజ చిరునవ్వుతో అంది.

"ఐ యాం సారీ." అరవింద్ విడిచిపెట్టి సిగ్గుతో ఎర్రబడ్డ బుగ్గలతో అంది సమీర. "ఎనీ హౌ ఐ యామ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ రెడీ టు హిప్నటైజ్ యు టు మేక్ యు రెమెంబెర్ యువర్ పాస్ట్. ప్లీజ్ సిట్ అగైన్." అరవింద్ ని మరోసారి ఆ కుర్చీలో కూచోబెడుతూ అంది సమీర. "నువ్వు జస్ట్ కుర్చీలో వెనక్కి జరగిలబడి, ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నేను చెప్పేది విను. చాలా ఆలోచనలు నీ మనసులోకి రావచ్చు. వాటిని వేటినీ పట్టించుకోకుండా నా వాయిస్ మీద కాన్సంట్రేట్ చెయ్యి చాలు."

"డాక్టర్ సమీరా. అంత చిన్న ప్రాసెస్ ద్వారా తనకి తన గతం అంతా గుర్తుకొచ్చేలా చెయ్యగలరా?" అభినవ్ అడిగాడు.

అభినవ్ మొహం లోకి చూసినవ్వింది సమీర. "అతని  సబ్కాంషస్ ఆల్రెడీ అతనికి గతాన్ని గుర్తుచేసే ప్రయత్నం ప్రారంభించింది. సో, ఐ యాం కాన్ఫిడెంట్, సింపుల్ హిప్నటైజింగ్ ద్వారా తనకి తన గతాన్ని గుర్తుచెయ్యగలనని. ఇది వర్క్ అవుట్ అవ్వకపోతే అప్పుడు ఆలోచిద్దాం."

"ఒకే..... ఒకే....... నువ్వు ప్రారంభిద్దామనుకున్నది ఎదో ప్రారంభించు. ఎక్కువసేపు ఇలా కూచోవాలంటే నాకు ఇరిటేటింగా వుంది." అరవింద్ అన్నాడు.

"ఆల్రైట్. ఐ స్టార్ట్ నౌ."

సమీర అలా అన్నాక ఇంకా ఎదో అనబోయేలోగా శరత్ అన్నాడు. "జస్ట్ ఏ మూమెంట్ డాక్టర్ సమీరా."

ఏమిటన్నట్టుగా కొశ్చినింగ్ ఎక్స్ప్రెషన్ తో శరత్ వైపు చూసింది సమీర. దానికి సమాదానం ఇవ్వకుండా, సుస్మిత ముందుకొచ్చి, సమీర అరవింద్ ముందు వుంచినట్టుగానే, తన కుడిచేతిని సుస్మిత ముందు ఉంచాడు శరత్. "నీ అన్నయ్య నీ వదినకి చేసినలాంటి ప్రామిస్ నువ్వు నాకూ చేయగలవా?" అని అడిగాడు.

"నువ్వడుగుతున్నదేమిటో నాకు బోధపడడం లేదు." అయోమయం గా చూసింది సుస్మిత.

"అదే, నీకిప్పుడు ఎలాంటి విషయం తెలిసినా ఎమోషనల్ గా ఆన్-బాలన్స్ అవ్వనని, మన ప్రేమ మీద నమ్మకం వుంచుతానని, నా మాట వింటానని."

"నీకేమన్నా పిచ్చెక్కిందా? అటువంటి ప్రామిస్ నేనెందుకు చెయ్యాలి?" కోపంగా అడిగింది సుస్మిత.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)