Read Vennela Poolu - 22 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెన్నెల పూలు - 22

వెన్నెల పూలు

ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"అంతేకాదు సమీ. ఎప్పుడన్నా మనం ఎవరం లేనప్పుడు ఏదన్నా స్ట్రేంజ్ ప్లేస్ లో అంతా సడన్గా గుర్తుకువచ్చేసినా కూడా ప్రాబ్లెమ్ గానే ఉంటుంది. అంతకన్నా ప్లాన్డ్ గా హిప్నోసిస్ లోకి పంపి ఆ విషయం తో పాటుగా అతనికి అన్నీ గుర్తుకు వచ్చేలా చెయ్యడం బెటరే."

"ఎక్జాట్లీ సర్. నా ఉద్దేశం అదే." సమీర తలూపి అంది. "ఈ విషయం లో మీ అభిప్రాయం తెలుసుకోవాలనే ఇప్పుడు మీతో దీనిగురించి మాట్లాడాను."

"నా అభిప్రాయం లో కూడా అరవింద్ సఫర్ అవుతూవుంటే ప్రయత్నంతో అతనికన్నీ గుర్తుకొచ్చేలా చేసేడమే మంచిది. నువ్వు ఆలోచిస్తూన్నదీ నిజమే.   అతని వైఫ్ గా నీ ఎమోషన్ కూడా నాకు అర్ధం అయింది. కానీ జీవితంలో మనం కొన్ని పరిణామాలు ఎదుర్కోక తప్పదు."

"థాంక్ యు వెరీ మచ్ సర్, నేను చెయ్యదలుచుకున్నదాని గురించి నేను కన్విన్స్ అయ్యాను. నా పేషేంట్స్ ని చూసి నేను ఇంటికి వెళతాను." కుర్చీలోనుండి లేచింది సమీర.

"సమీరా, అసలు నువ్వు అరవింద్ ని ఆ బ్లాంక్ మ్యాడ్నెస్ నుండి బయటకి రప్పించడానికి ఏ టెక్నీక్ వాడావో నాకు చెప్పనేలేదు." అలా కుర్చీలో కూచునే సమీర వైపు చూస్తూ అన్నాడు నిరంజన్.

అందుకు తనేం టెక్నీక్ వాడిందో గుర్తుకువచ్చి సిగ్గుతో మొహం కందగడ్డలా ఎర్రగా మారింది సమీరకి. "ప్రత్యేకంగా ఏ టెక్నీక్ వాడలేదు. మామూలు ప్రాసెస్ లోనే తను సెన్సెస్ లోకి వచ్చాడు. వస్తాను." అంటూ వెనక్కి తిరిగింది.

"డాక్టర్ సమీరా........" సమీర నాలుగడుగులు వేసిందో లేదో వెనకనుండి మళ్ళీ పిలిచాడు నిరంజన్.

"ఎస్, సర్." వెనక్కి తిరిగి నిరంజన్ మొహంలోకి చూసింది సమీర.

"ఆ రోజు అరవింద్ అక్కడ ఏం చూసివుంటాడో నువ్వు గెస్ చేసావు కదా."

కాసేపు ఏవో నీడలు కదలాడాయి సమీర మోహంలో. దీర్ఘం గా నిట్టూర్చి "నో సర్" అని చెప్పి అక్కడనుండి బయటపడింది.  

&&&

"సారీ. నేను మీతో ఎక్కువ సమయం స్పెండ్ చేయలేకపోతున్నాను."

తనూజ ఇంకా అభినవ్ ల మొహాల్లోకి చూస్తూ అంది సమీర. ఆ సమయం లో తనూజ రూమ్ లో వాళ్లిద్దరూ బెడ్ మీద ఒకరిపక్కన ఒకరు కూచునివుంటే, వాళ్ళకెదురుగుండా కుర్చీలో కూచునివుంది సమీర.

"నువ్వెప్పుడూ అలా ఫీల్ అవ్వనవసరం లేదు. ఒక సైకియాట్రిస్ట్ గా బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో నువ్వెంత బిజీగా ఉంటావో నాకు తెలుసు. అయినా నువ్వు ఎంతో కొంత సమయం మాతో స్పెండ్ చేస్తూనే వున్నావు." తనూజ అంది.

"మోర్ ఓవర్ నేను మీకు ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. మీరు తనకి బ్రెయిన్ వాష్ చేసివుండకపోతే, తను నాతో పెళ్ళికి వొప్పుకునివుండేది కాదని తనూజ చెప్పింది." అభినవ్ అన్నాడు.

అది విని నవ్వింది సమీర. "తను జీవితమంతా పెళ్లిచేసుకోకుండా అలాగే ఉండిపోతుందేమోనని నేను భయపడ్డాను. తన సిద్ధాంతాల్ని అర్ధం చేసుకుని, అంగీకరించే వ్యక్తిని తప్ప వేరేవాళ్లని పెళ్లిచేసుకోవడం అక్కకి ఇష్టం లేదు. అలంటి వ్యక్తి సృష్టిలో ఉంటాడని నేను అనుకోలేదు. ఎందుకంటే తన సిద్ధాంతాల్ని, స్వంత చెల్లెలుగా నేనే అర్ధం చేసుకుని అంగీకరించలేకపోయాను. అటువంటిది మీరొకరు దొరికారు ఆఖరికి ఆ సిద్ధాంతాల్ని అర్ధంచేసుకుని, అంగీకరించి, తన జీవితం లో ప్రవేశించడానికి. అందుకు నేనే మీకు థాంక్స్ చెప్పాలి."

అందుకు తనూజ, అభినవ్ ఇద్దరూ నవ్వారు.

"అయినా ఇప్పటికీ నాకు అనుమానమే. ఇతను కేవలం నా అందం చూసిమాత్రమే లవ్లో పడ్డాడు. కొద్దిరోజులు పోయి నా అందం మీద మోజు తగ్గక, నా సిద్ధాంతాలు కష్టంగా అనిపించొచ్చు."

"అటువంటి రోజు ఒకటి ఎప్పటికీ రాదనే నా గట్టినమ్మకం." అరవింద్ అన్నాడు ఒక డిటర్మిన్డ్ ఎక్స్ప్రెషన్ తో.

"అక్కా నువ్వు అటువంటి అనుమానాలు ఏవీ పెట్టుకోవద్దు. మీరిద్దరూ చూడముచ్చటగా, ఓ ఇద్దరు పిల్లల్ని కూడా కని చాలా కాలం ఆనందంగా జీవిస్తారు." చిరునవ్వుతో అంది సమీర.

"ఒకే, ఒకే. కానీ అందుకుముందుగా పెళ్లికావాలి కదా. మీ సిస్టర్ కి పెళ్లిలాంటి వాటిమీద అంతగా నమ్మకం లేదు కానీ నాకు వుంది. పెద్ద హంగామా తో అవసరం లేదు కానీ కనీసం రిజిస్టర్ మ్యారేజ్ అన్నా చేసుకోవాలి. నిజానికి పెళ్లిచేసుకునే ఇక్కడనుండి వెళదామనుకుంటున్నాం. అందుకు మీ హెల్ప్ కావాలి." అభినవ్ అన్నాడు.

"ఎస్ సమీ, అభినవ్ కావాలనుకుంటున్నాడు కాబట్టి నాకు ఒప్పుకోక తప్పలేదు. మేం రిజిస్టర్ మ్యారేజ్ ఇక్కడే చేసుకుని వెళదామనుకుంటున్నాం. నువ్వు కొంచెం హెల్ప్ చేస్తావా?" తనూజ అడిగింది.              

"నువ్వు నన్ను ఇలా అడగాల్సిన అవసరం లేదక్కా. నీ చెల్లెలుగా అది నా బాధ్యత. కానీ........." అంటూ ఆగింది సమీర.

"నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు సమీ. నువ్వు దేనికీ సంశయించాల్సిన అవసరం లేదు." అలా అంటూ అభినవ్ మొహంలోకి కూడా చూసింది తనూజ.

"అవునండీ. మా మ్యారేజ్ జరిపించే  విషయం లో కూడా మీకేమన్నా ప్రోబ్లం ఉంటే చెప్పండి. మేము ఎక్కడన్నా పెళ్ళిచేసేసుకోగలం. అదిపెద్ద విషయం కాదు." అభినవ్ అన్నాడు.

"నో, నో, అదికాదు. మీ పెళ్లి, అది రిజిస్టర్ మ్యారేజ్ అయినా, ఏ ప్రకారంగా అయినా సరే, దగ్గరుండి జరిపించాలని నా కోరిక. కాకపోతే మీరు కొంతకాలం వెయిట్ చెయ్యగలరా?" సమీర అడిగింది.

"మీరు ఎంతకాలం కావాలంటే అంతకాలం వెయిట్ చేస్తాం. మా పెళ్లి జరగడానికి కారణమే మీరు." అభినవ్ అన్నాడు.

"అవును సమీ. ఎప్పుడు నీకు కన్వీనియంట్ గా ఉంటుందంటే అప్పుడే పెళ్లిచేసుకుంటాం. దానికేం ప్రాబ్లెమ్ లేదు. ఎంతకాలమైనా వెయిట్ చేస్తాం కానీ నువ్వు లేకుండా మాత్రం మేము పెళ్లిచేసుకోము." తనూజ అంది.

"థాంక్ యు వెరీ మచ్ టు బోథ్ ఆఫ్ యు." సమీర నవ్వి అంది. "మీరిద్దరూ పెళ్లిచేసుకునే ఇక్కడనుండి వెలుదురు గాని."

"బట్ సమీ. మరీ ఎక్కువరోజులు మేమిక్కడవుండడం బావుండదు కదా." ఒక అనీజీ ఎక్స్ప్రెషన్ తో అంది తనూజ. 

"మీరెంత కాలం ఇక్కడవున్నా ఎవరికీ వచ్చిన ఇబ్బందేమీ లేదు. నువ్వలాగ ఆలోచించాల్సిన అవసరం లేదు." సమీర అంది.

"అవుననుకో. కానీ నా ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ నాకు వుంటాయికదా. వాటిగురించన్నా వెళ్ళాలి." తనూజ అంది.

"రెండురోజుల్లో సమ్మర్ హాలీడేస్. కోర్టులకి సెలవులు. ఇంకేం ప్రొఫెషనల్ కమిట్మెంట్స్?" భృకుటి ముడేసింది సమీర.

"అన్ని కోర్టులకి సెలవులు కాదు. కొన్ని అర్జెంటు పనులు కూడా వున్నాయి చూడాల్సినవి. సో, మళ్ళీ వస్తాం లే. అప్పుడు మాత్రం మేము ఇక్కడ మా పెళ్ళిచేసుకుని వెళతాం." ఆలా అని నవ్వుతూ అభినవ్ వైపు చూసింది. అభినవ్ కూడా నవ్వాడు.

"పోనీ ఒక్క వారం రోజులు వుండలేరా? ఈ వారం రోజులు కాగానే మీ పెళ్లికూడా నేను దగ్గరవుండి జరిపించేస్తాను. ప్లీజ్." బతిమాలుతున్న ధోరణిలో అంది సమీర.     

"నిజంగా మా అవసరం నీకుంది అంటే వారం కాదు నెలన్నా సరే మేము ఇక్కడే ఉంటాం. ఎన్ని అర్జెంటు పనులైనా పోస్టుపోన్ చేస్తాను." తనూజ అంది.

"మా పెళ్లి కూడా అంత తొందర కాదు. మీకు పూర్తిగా ఎప్పుడు వీలయితే అప్పుడు చేసుకుంటాం. కానీ విషయం ఏమిటి? మీలో సడన్గా ఎదో ఆందోళన కనిపిస్తోంది." అభినవ్ అన్నాడు.

"ఎస్, సమీ. విషయం ఏమిటో మాకు పూర్తిగా చెప్పు. నీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మేము నీకు ఇస్తాం." తనూజ అంది.

"అరవింద్ లో స్ట్రగుల్ స్టార్ట్ అయింది. గతం గుర్తుకు వచ్చి, రాక చాలా సఫర్ అవుతున్నాడు. అందుకని అతన్ని హిప్నోసిస్ లోకి పంపి మొత్తం గతం అంతా గుర్తుకు వచ్చేలా చేద్దామనుకుంటున్నా." సమీర అంది.

"మంచిదేగా. ఇందులో ఆందోళన పడాల్సినది ఏముంది? మీరు అతనికి గతం అంతా గుర్తుకు వచ్చేలా చేసేస్తే అతనికి ఆ సఫరింగ్ కూడా ఉండదు." అభినవ్ అన్నాడు.

"నేను అభినవ్ కి మొత్తం విషయం అంతా చెప్పేసాను." తనవైపు కొశ్చిన్ మార్క్ మొహం తో చూసిన సమీర తో అంది తనూజ.

"గతం గుర్తుకువచ్చాక, ఇప్పుడు ఏదైతే సఫర్ అవుతున్నాడో, అరవింద్ ఆ సఫరింగ్ కి పదిరెట్లు ఎక్కువ సఫర్ అయ్యే అవకాశం వుంది."  

"నువ్వేం అంటున్నావో నాకు బోధపడడం లేదు సమీ, అలా ఎందుకు జరుగుతుంది?" ఆశ్చర్యంగా అడిగింది తనూజ.

ఇంక కూర్చోలేనట్టుగా కుర్చీలోనుండి లేచి నిలబడింది సమీర. "అక్కా, ఒక ఇరవైతొమ్మిదేళ్ళ సైకాలజికల్లీ అండ్ ఫిజికల్లీ హెల్తీ పర్సన్ ఎలాంటి విషయం చూసివుంటే అలా షాక్ కి లోనయి బ్లాంక్ మాడ్ అవుతాడు? అరవింద్ ఒకరకం గా లక్కీ. తన గతం అంతటితోపాటు ఆ విషయాన్నీ కూడా మర్చిపోయాడు. లేకపోతె ఈ పాటికి నరకం అనుభవిస్తూ ఉండేవాడు."

"లాజికల్ గా ఆలోచిస్తే నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తూంది సమీ." సాలోచనగా అంది తనూజ.

"నేను అరవింద్ కి గతం అంతా గుర్తుకువచ్చేలా చేయకపోవడానికి మెయిన్ రీజన్ అదే. నేను అతనికి కేవలం సైకియాట్రిస్ట్ నే అయితే ఇలా ఆలోచించేదాన్ని కాదు. కానీ ఇప్పుడు నేను అతని భార్యని. అతనిమీద ప్రేమపుట్టి కావాలని పెళ్లిచేసుకున్నదాన్ని. అతను సఫర్ అవుతూ ఉంటే చూడలేను."

తనూజ కానీ, అభినవ్ కానీ దానికి ఏం  మాట్లాడలేదు. నిజానికి దానికి ఏం చెప్పాలో వాళ్ళకి తెలియలేదు.

"గతం గుర్తుకు వచ్చిందంటే , ఆ రోజు బంగ్లాలో తను చూసిన విషయం కూడా అరవింద్ కి గుర్తుకు వస్తుంది. అది తట్టుకోలేడు. అంతేకాదు. ఇప్పటివరకూ అరవింద్ కి లాక్ ఆఫ్ ఆక్సిజన్ వల్ల మాత్రమే అటువంటి పరిస్థితి వచ్చిందని చెప్తూవస్తున్నాను. ఎదో భరించలేనిది చూడడం వల్ల అలాగ అయ్యానని ఆలోచన కూడాలేదు తనకి. సో ఇట్ వుడ్ బి ఏ రుడెస్ట్ షాక్ ఫర్ హిం ఒన్స్ హి నోస్. 

ఆ భయం తోటే అరవింద్ కి గతం గుర్తు చేసే ప్రయత్నాన్ని వాయిదా వేస్తూ వచ్చాను.  కానీ ఇటీవల అరవింద్ గతం గుర్తుకు వచ్చీ, రాక విపరీతం గా సఫర్ అవుతూవున్నాడు. ఏదన్న స్ట్రేంజ్ ప్లేస్ లో, లేదా మనం ఎవరం లేనప్పుడు సడన్ గా  గతం అంతా గుర్తుకువచ్చేసే ప్రమాదం వుంది. అప్పుడది ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో ఊహించలేం. అందువల్ల సాధ్యమైనంత త్వరగా తనని హిప్నోసిస్ లోకి పంపి గతం అంతా గుర్తుకువచ్చేలా చెయ్యడం మంచిది అనుకుంటున్నాను."  

"తప్పకుండా అలాగే చెయ్యి. నువ్వు భయపడేంతగా ఏమీవుండదు." తనూజ అంది.

"లేదక్కా లేదు. నేను తనని ఒక నరకం లోనుండి ఇంకో నరకం లో పడేస్తున్నాను అంతే. ఈ నరకం ఇంకా బాధాకరం. తను భరించబోయే బాధని తలుచుకుంటూవుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ బాధ నావల్లే అతనికి కలుగుతూంది." ఇంక తట్టుకోలేనట్టుగా మొహాన్ని చేతుల్లోదాచుకుని నేలమీద కుప్పకూలిపోయింది సమీర.

సమీర ని అలా చూస్తూ షాకయిపోయారు తనూజ, అభినవ్. తనూజ మొట్టమొదటిసారిగా సమీర అలా ఏడవడం చూస్తూ వుంది.

"మై గాడ్! సమీ. నువ్వెప్పుడూ ఇలా ఏడవడం నేను చూడలేదు. ఒక సైకియాట్రిస్ట్ నని మర్చిపోయావా? ఇంత ఎమోషన్ అయిపోయావ్." సమీర పక్కనే కూలబడి తనని చేతుల్లోకి తీసుకుంటూ అంది తనూజ.

"ప్రేమ కి సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్ లు అతీతం కారు. ఆమె చెప్పినట్టుగా ఇప్పుడు తను అయన భార్య కాకుండావుండివుంటే ఇంత ఫీలయ్యేవారు కాదు. ప్రేమించి పెళ్లిచేసుకున్నాక అయన బాధపడతాడంటే ఫీలింగ్ ఇలా కాకుండా ఎలావుంటుంది?" అభినవ్ కూడా వాళ్ళపక్కనే కూచుంటూ అన్నాడు. "కానీ డాక్టర్ సమీర. ఒక్కమాట. ఇది ఆయన్ని ఎంతో బాధపెట్టే విషయమే అయినా, ఒక పెద్ద ఇష్యూ సాల్వ్ అవుతుంది. అది ఎంత కష్టమైన విషయం అయినా కొంతకాలానికి అలవాటుపడతాడు. నిజం ఎంత చేదుగావున్న అది ఒప్పుకోవడం మంచిది. అబద్ధం లో ఎంతకాలం బతుకుతాం? గతం మర్చిపోయి ఎంతకాలం ఉంటాడు?"

"ఎస్ సమీ. అభినవ్ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం. అయినా ఐ స్టిల్ ఫీల్, నువ్వు భయపడ్డంతగా విషయం ఉండదు. ప్లీజ్ రిలాక్స్." సమీర ని ఇంకా పొదువుకుంటూ అంది తనూజ.

"ఆల్రైట్ అక్కా." కళ్ళు తుడుచుకుని, గట్టిగా నిట్టూర్చి, లేచినిలబడింది సమీర. "రేపో ఎల్లుండో నేనా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తాను. నాకు సపోర్ట్ గా మీరిద్దరూ అక్కడవుండాలి."     

"ఖచ్చితంగా. ఇంతకీ ఎక్కడ? బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లోనా?" తనూజ అడిగింది.

సమీర తో పాటుగా అభినవ్, తనూజ కూడా లేచినిలబడ్డారు.

"ఎస్, అక్కడే."

అలాగని బయటకి నడుస్తూవున్న సమీర ని "సమీ" అంటూ వెనకనుండి పిలిచింది  తనూజ.

"ఏంటక్కా?" వెనక్కి తిరిగి తనూజ మొహంలోకి చూస్తూ అడిగింది సమీర.

"ఆ రోజు అరవింద్ ఆ బంగ్లాలో చూసినదేమిటో నువ్వు గెస్ చేసావు కదా."

కాసేపు ఎదో అర్ధం చేసుకోలేని ఎక్స్ప్రెషన్ కనిపించింది సమీర లో. కానీ "వస్తానక్కా" అని సడన్ గా అక్కడనుండి వెళ్ళిపోయింది.          

&&&

సమీర శకుంతల రూమ్ లోకి వెళ్లేసరికి, ఆమె రూమ్ లో సుస్మిత, ఇంకా తనూ ఏదో నవ్వుతూ మాట్లాడుకుంటూవున్నారు బెడ్ మీద పక్క పక్కనే కూచుని.

"ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్"  నవ్వుతూ సమీర  ని ఇన్వైట్ చేసింది శకుంతల.

తిన్నగా వచ్చి వాళ్ళకి ఎదురుగుండా వున్న కుర్చీలో కూలబడింది సమీర.

"బ్రో ఆఫీస్ కి వెళ్లడం మొదలుపెట్టాక నువ్వు కొంచెం ఫ్రీ అయ్యావు కదా?" సమీర వైపు చూస్తూ అంది సుస్మిత.

"ఎక్కడ. తను  ఆ మెంటల్ కేర్ కి వెళుతూ, అక్కడ ఇబ్బంది పడుతూనే వుంది కదా." శకుంతల అంది.

"ఆంటీ. నేను అరవింద్ ని ఏమీ నెగ్లెక్ట్ చెయ్యడం లేదు కదా?" నవ్వి అడిగింది సమీర.

"ఎవరూ నీ అంత బాగా చూస్కో గలరని నేను అనుకోను. తను ఆఫీస్ కి వెళ్లడం మొదలు పెట్టిన తరువాత కదా నువ్వు మళ్ళీ మెంటల్ కేర్ కి వెళుతున్నావ్. నీ విషయం లో నా అంచనా తప్పుకాలేదు. నిన్ను నా కోడలిగా చేసుకుని నేను చాలా మంచిపని చేసాను." శకుంతల అంది.

"కానీ వదినా, ఆఫీస్ కి వెళ్లివస్తున్నా బ్రో లో ఎలాంటి మార్పు కనపడడం లేదు. ఏదీ గుర్తుకువస్తునట్టుగా కనిపించడం లేదు." సుస్మిత అంది.

"తనలో స్ట్రగుల్ మొదలైంది. గతం గుర్తుకు వచ్చీ రాక సఫర్ అవుతూవున్నాడు. "

సమీర అలా అనగానే దానికి ఏం అనాలో తెలియక మొహామొహాలు చూసుకున్నారు సుస్మిత, శకుంతలలు.

"తనని హిప్నోసిస్ లోకి పంపి అంతా గుర్తుకు వచ్చేలా చేద్దామనుకుంటున్నాను."

"మై గాడ్! వదినా, నువ్విలా ఎప్పుడు అంటావా అని చూస్తున్నాను." ఆనందంతో అంది సుస్మిత.

శకుంతల ఏదో చెప్పబోతూవుండగా  ట్రే లో కాఫీ కప్పులతో ఆ రూమ్ లోకి వచ్చాడు టిబ్బూ.

"నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అడక్కుండా లోపలి కి రావద్దని. ఎప్పటికి నేర్చుకుని ఛస్తావ్?" ఒక కాఫీ కప్పు తీసుకుంటూ కోపంగా అంది శకుంతల.

"మామ్........."

"సర్లే. నువ్వేం మొదలుపెట్టక్కర్లేదు." సుస్మిత ని మొదట్లోనే కట్ చేసి, సమీర మొహంలోకి చూసింది శకుంతల. "కానీ నువ్వు చెప్పావుగా, తనకి నాచురల్ గానే అంతా గుర్తుకువస్తే బావుంటుందని."

"అలాగానే అనుకున్నాను ఆంటీ. కానీ తను ఆ గతం గుర్తుకువచ్చీ, రాక చాలా సఫర్ అవుతూ వున్నాడు. ఇంకా తనని సఫర్ అవ్వనివ్వడం మంచిది కాదు అనిపిస్తూంది."

ఈ లోపుగా సుస్మిత, సమీర కూడా కాఫీ కప్పులు తీసుకుని సిప్ చెయ్యడం మొదలుపెట్టారు.

"సఫర్ అవుతున్నాడా? నాకు అలాగ ఏమీ కనిపించలేదే." సుస్మిత ఆశ్చర్యంగా అంది.

"తను పైకి అలా కనిపించడం లేదు. కానీ లోపల సఫర్ అవుతూవున్నాడు. ముఖ్యంగా మిడ్నైట్ తనకి తెలివి వచ్చేస్తూ వుంది ఆ స్ట్రగుల్ వల్ల. మళ్ళీ తేలికగా పడుకోలేకపోతూవున్నాడు."

సుస్మిత, శకుంతల ఒకరిమొహాల్లోకి ఒకరు చూసుకున్నారు ఆందోళనగా.

"కన్నతల్లినే అయివున్నా నేను ఇదేమీ తెలుసుకోలేకపోయాను." అదే ఆందోళనతో అంది శకుంతల.

"కంగారు పడాల్సిన అవసరం ఏమీలేదు. తనకి గతం అంతా గుర్తుకువచేస్తే సమస్య సాల్వ్ అయిపోతుంది." సమీర అంది. కానీ తను బయటకి అన్నది లోపల ఫీల్ అవలేకపోతూంది.

గట్టిగా నిట్టూర్చింది శకుంతల. "నువ్వు కేవలం అతని సైకియాట్రిస్ట్ వి మాత్రమే కాదు, భార్యవి కూడా. మేమందరం తనకి గతం గుర్తుకురావడం లేదని ఆందోళన పడుతూవున్నా, మమ్మల్ని సర్దిపుచ్చింది నువ్వే. ఇప్పుడు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావంటే అది ఆలోచించకుండా మాత్రం అయితే కాదు. నువ్వేం చేసినా, ఏం  చేద్దామనుకున్నా అది నేను పూర్తిగా అంగీకరిస్తాను."

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)