Read Vennela Poolu - 15 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెన్నెల పూలు - 15

వెన్నెల పూలు

ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"నీ మీద ఎంత ప్రేమ వున్నా ఆ ప్రేమ కోసం తప్పులు చేసే స్థాయికి నేను దిగజారను." తన చేతిని తీసేడానికి ట్రై చేస్తూ అన్నాడు చలపతి కోపంగా.

"అయితే ఆ డబ్బు ఎలా వచ్చిందో చెప్పు?" అదే తీవ్రతతో అడిగింది.

"మా అమ్మ బంగారం ఉంటే అమ్మేసాను." అతని స్వరం లో ఎదో బాధవుంది. "తనేలేదు. ఇంక ఆ బంగారం తో పనేంటి?"

కరెంట్ షాక్ కొట్టినట్టుగా అతనిని విడిచిపెట్టి దూరంగా జరిగి అతని మొహంలోకి ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది. "ఒక ఉంపుడు గత్తె కోసం తల్లిబంగారం అమ్మేశావా?"

"తల్లినే అమ్మేసే వాళ్ళున్నారు. బంగారం ఎంత విషయం?" అప్పుడే అక్కడికి వచ్చిన తన అమ్మమ్మ అంది. "ఒరేయ్ అబ్బాయ్. మళ్ళీ దీని దగ్గరికి రావాలంటే బాగా డబ్బు పట్టుకురా. ఉట్టుట్టినే కౌగలించుకుంటాను, ముద్దులుపెట్టుకుంటాను అంటే కుదరదు."

"అంత డబ్బిచ్చి కూడా తను నన్ను కనీసం ముట్టుకోలేదు." శకుంతల కోపంగా అంది.

"వద్దని నేను చెప్పనా? అలా వాడు నిన్నేం చెయ్యకుండా వదిలేస్తే అది వాడి ఖర్మ." తన మొహం లోకి చూస్తూ అలా అన్నాక, చలపతి మొహం లోకి చూస్తూ కోపంగా అంది తన అమ్మమ్మ. "రేయ్, మరోసారి నువ్వు ఇలా ఉత్తిచేతులు ఊపుకుంటూ వచ్చి నా మనవరాలిని ముట్టుకోవడానికి, మాట్లాడ్డానికి ప్రయత్నించావంటే కాళ్ళిరగ్గొడతాను. వస్తే అప్పట్లా బాగా డబ్బులతో రా. లేకపోతె ఈ చుట్టుపక్కల కనిపించకు. ముందు ఇక్కడనుండి పో."

"నీకసలు మనసన్నదే లేదా?" తన అమ్మమ్మ మొహంలోకి బాధగానూ, కోపంగానూ చూస్తూ అంది శకుంతల.            

"మనసేమిటి నా తలకాయ్. మనం సుఖం గా బతకాలంటే మనక్కావల్సింది మంచి అందమైన శరీరం, దానిని చక్కగా వాడుకోగలిగిన తెలివితేటలూ. వయసు ఉడిగి, ఈ అందం పోయాక నీ దగ్గరికి ఎవడు వస్తాడే? ఇప్పుడు నా దగ్గరికి ఎవడొస్తున్నాడు? నీ ఆమ్మో వీధులు ఊడ్చే వాడు, పెట్టెలు మోసేవాడికి కూడా ఒప్పుకోవాల్సివస్తూంది. ఒకోసారి ఇద్దర్నీ, ముగ్గుర్నీ కూడా ఒకేసారి పంపించాల్సి వస్తూంది."

అప్పుడప్పుడు తన తల్లి పెడుతూన్న అరుపులు, ఏడుపులు గుర్తుకు వచ్చి బాధతో నిండిపోయింది శకుంతల హృదయం. ఎంత అవి తనకి అలవాటు అయిపోయినా తనకి తట్టుకోవడం కష్టం గానే వుంది.

"నేను ఎవడెవడు ఎంతెంత ఇచ్చి నీ దగ్గరికి వస్తున్నాడో నీకు చెప్తాను. దానినిబట్టే నువ్వు వాడు చూస్తానన్నది చూపించు. చేసేదానికి ఒప్పుకో. నీ దగ్గరికి వచ్చే ప్రతివొక్కడికీ వాడు అడిగే ప్రతి దానికి తింగరగా ఒప్పుకోకు."

తనకీ పడుకోవడం అలవాటయిపోయినా ఆ మాటలు వింటూంటే కత్తితో నిలువుగా కోస్తూన్నంత బాధగా వుంది. 

"అవతల మునసబు గారబ్బాయి మూడు లక్షలిచ్చి నీ గురించి గదిలో సిద్ధం గా వున్నాడు. నిన్ను బాగా సిద్ధం చేసి తీసుకువస్తానని ఇలా వచ్చాను. వాడు చేసేదాన్ని ఏదన్న కాదన్నావని తెలిసిందో తోలు వలిచేస్తాను. ఆలా దేభ్యం మొహం వేసుకుని చూసింది చాలు. ముందు నడువు."

తన అమ్మమ్మ తనని కుడి చెయ్యిపట్టుకుని లాక్కువెళుతూంటే యాంత్రికంగా ఆమెతో పాటు నడిచింది. తన తల్లి గది దగ్గరికి వచ్చేసరికి, లోపలనుండి వినపడుతూన్న తన తల్లి ఏడుపు తో, ఇంకా మగాళ్ల నవ్వుతో తన మనసు ఇంకా బాధతో నిండిపోయింది. లోపల ఎంతమంది వున్నారు? వాళ్ళు తన తల్లిని ఏం చేస్తున్నారు? ఆలోచించడానికి అవకాశం ఇవ్వకుండా తనని అలాగే లాక్కుని వెళ్లి మునసబుగారి అబ్బాయి వున్న గదిలోకి తోసి తలుపు మూసేసింది తన అమ్మమ్మ.

ఆ మునసబు గారి అబ్బాయి తన శరీరం తో ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటూవున్నా, తన తల్లి అనుభవించే బాధ ముందు అది ఎక్కువ అనిపించలేదు. కారిపోతూవున్న కన్నీటిని అప్పుడు తుడుచుకోవడానికి ప్రయత్నించలేదు, ఇప్పుడూ ప్రయత్నించడం లేదు.

దీర్ఘంగా నిట్టూరుస్తూ కళ్ళు మూసుకుంది శకుంతల      

&&&

కాలం అలా గడుస్తూ ఉంటే ఒక మంచి జరిగింది. అదేమిటంటే తన అమ్మమ్మ చనిపోయింది హార్ట్ అటాక్ తో. తన చావుతో తనకీ, తన తల్లికీ కలిగిన సంతోషం ఇంతా అంతా కాదు.

     "బహుశా కన్న తల్లి చనిపోయిందని సంతోషించే మొదటివ్యక్తిని నేనే అయివుంటాను ఈ ప్రంపంచంలో." తన తల్లి అంది.

“నువ్వు కన్న కూతురివని కూడా లేకుండా అమ్మమ్మ నీ చేత వ్యభిచారం ఎలా చేయించగలిగింది?” తను, తన తల్లి ఇంకా చలపతి వరండాలో కూచుని మాట్లాడుకుంటూ వుండగా తను అడిగింది తన తల్లి మొహంలోకి చూస్తూ.

“వ్యభిచారం తప్పు నేరం కాదు అన్న టైమ్ నుండి అది వృత్తిగా తీసుకుని బ్రతుకుతూ వస్తూన్న కుటుంబం ఇది. ఈ వంశం లో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు జరగవు. కానీ విటుల ద్వారా వచ్చిన కడుపులు ఒకటి రెండు వుంచుకోనిస్తారు. పుట్టింది ఆడపిల్లలు అయితే పరవాలేదు, మగపిల్లలైతే వారిని చంపేడమో, లేదా ఏదన్నా అనాధ శరణాలయం లో ఇచ్చివెయ్యడమో చేస్తారు. అదేం ఖర్మో తెలీదు, మన వంశం లో పుట్టే ఆడపిల్లలు అందంగానే వుంటారు. నువ్వు నాలా అందంగా పుట్టినందుకు నాకు సంతోషం కన్నా బాధే ఎక్కువ కలిగింది.” తన తల్లి కాస్త   ఆగాక మళ్ళీ అంది. “నా అమ్మమ్మ ఈ వంశం లో  ఆచరిస్తూ వచ్చినదాన్ని అనుసరిస్తూ వచ్చింది. వాళ్ళు మనసు లేకుండా తనతో చేయించినట్టుగానే మనతో చేయించింది.”

“పెళ్ళిళ్ళు లేవు, సంసారాలు లేవు. ఏం సుఖపడాలని, అనుభవించాలని డబ్బు కోసం మనల్ని అలా రాచి రంపాన  పెట్టింది?”

“అది చెప్పడం కష్టం. తను అంతగా మనతో వ్యభిచారం చేయించి సంపాదించిన డబ్బంతా ఏం చేసిందో కూడా తెలియడం లేదు.” నిట్టూరుస్తూ అంది తన తల్లి.

“ఆ దిక్కుమాలిన డబ్బు గురించి మీరు ఆలోచించొద్దు. మీరిద్దరూ నాతో వచ్చెయ్యండి. ఇక్కడనుండి చాలా దూరం వెళ్ళిపోయి ఎక్కడన్నా గౌరవప్రదమైన జీవితం గడుపుదాం.” తమిద్దరి మొహాల్లొకి చూస్తూ అన్నాడు చలపతి. “నేను మీ అమ్మాయిని పెళ్లిచేసుకుంటాను.”

   “నీ అంత మంచి వ్యక్తి ని నేను ఎక్కడా చూళ్ళేదు.” చలపతి మొహం లోకి కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ అంది తన తల్లి. “నీ లాంటి వ్యక్తి లభించడం నా కూతురి అదృష్టం.”    

ఆ తరువాత ఎక్కువకాలం ఆగలేదు ఆ వూళ్ళో తాము. అక్కడనుండి చాలా దూరం గా ఈ టౌన్ లోకి తీసుకొచ్చి, ఇక్కడకి దగ్గరలోనే ఒక ఇంట్లో వుంచేడు తమని చలపతి. ఇల్లు చిన్నదే అయినా చాలా సౌకర్యవంతం గా వుంది. తమకి కావాలిసినవన్నీ అమర్చిపెట్టేవాడు. తనెక్కడో చిన్న వుద్యోగం చేస్తున్నట్టుగా చెప్పాడు. కాకపోతే ఆ వచ్చే జీతం అవసరాలన్నీటికీ సరిపోతూ వుందో లేకపోతే అప్పులేమన్నా చేస్తున్నాడో మాత్రం చెప్పలేదు.

ఆ రోజు శలవు. పగలే తన దగ్గరికి వచ్చిన చలపతి లో ఏదో ఆశ, కోరిక కనిపించాయి. తను తన మీద చేతులు వెయ్యగానే, గట్టిగా కౌగలించుకుని రెండుబుగ్గల మీద ముద్దులు పెట్టింది.

“నన్ను క్షమించు, పెళ్లయ్యే వరకూ అగుదామనుకున్నాను కానీ…….”

ఏదో చెప్పబోతూ వున్న చలపతి పెదవుల మీద ముద్దు పెట్టింది తను. ఇంక ఆ తరువాత తమ మధ్య మాటలు లేఫు.   చలపతి తనని తీరు తీరు గా అనుభవించాడు. అప్పటివరకూ తను చాలా మంది చేతుల్లో నలిగింది. వాళ్ళందరూ కేవలం వాళ్ళ వాంచని మాత్రమే తీర్చుకున్నారు తప్ప ఎవరిలోనూ ప్రేమలేదు. వాళ్ళకెవరికీ తన శరీరమే తప్ప మనసు అవసరం లేదు. సెక్స్ తనూ కూడా ఎంజాయ్ చేయగలదని కేవలం చలపతి తో సెక్స్ లో పాల్గొన్నాక మాత్రమే తెలిసింది. కాకపోతే తను చలపతిలో కనిపెట్టిన విషయం, సెక్స్ సమయంలో వంటిమీద బట్టలు ఉండడం ఇష్టం ఉండదు. తనకది తప్పనీ అనిపించలేదు.

ఆ తరువాత తనూ, చలపతి చాలా సార్లు సెక్స్ లో పాల్గొన్నారు. తనెప్పుడూ కాదనలేదు, అలాగే అతని లాగే ఎంజాయ్ చేస్తూ కూడావుంది. తనని చాలా చోట్ల కి తీసుకునివేళ్ళాడు. తమిద్దరూ కలిసి చాలా ఫోటోలు కూడా దిగారు. తన తల్లి తమని త్వరగా పెళ్లిచేసుకోమని అడుగుతూవుండేది. వుద్యోగం లో తనకి కొంచెం వత్తిడి వుందని, అది అయిపోగానే పెళ్లిచేసుకుంటానని చెప్తూ వుండేవాడు. తను మాత్రం ఎప్పుడూ అలా ఆతృత పడలేదు. చలపతి మీద తనకి నమ్మకం వుంది. తమకి ఏ ఇబ్బంది కలగనివ్వడు.

ఇదిలా వుండగా తను బాగా బాధపడే ఒక సంఘటన జరిగినది. తన తల్లి కూడా చనిపోయింది. తనకి బాగా జబ్బు చేసింది. హాస్పిటల్ చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ వుండగా చనిపోయింది. తన అమ్మమ్మ ద్వారా వచ్చిన కాస్త డబ్బు తన ట్రీట్మెంట్ కి సరిపోయింది. తన తల్లికి తను చనిపోతున్నానన్న బాధకన్నా, తన పెళ్లి చూడకుండా చనిపోతున్నానన్న బాధే ఎక్కువ అయిపోయింది.

“మన పెళ్లి చూడకుండా అత్తయ్య చనిపోవడం నాకూ చాలా బాధగా వుంది. ప్రస్తుతం కొంచెం ఇబ్బందుల్లో వున్నాను. త్వరలోనే నిన్ను పెళ్లిచేసుకుంటాను.” చలపతి అన్నాడు.

“నువ్వు నన్ను ఎప్పుడు పెళ్లిచేసుకున్నా ఇబ్బంది లేదు. ముందు నీ ఇబ్బందులన్నీ తీరనీ. ఏ లోకం లో వున్నా మన పెళ్లి కాగానే, నా తల్లి సంతోషిస్తుంది.” తను అంది.

పెద్దగా తేడా లేకుండానే కాలం గడుస్తూంది. ఒకరోజు తనతో చలపతి అన్నాడు. “నా ఒక్కడి జీతం తో ఇబ్బందిగా వుంది. నువ్వూ ఏదన్నా ఒక వుద్యోగం లో చేరతావా?”

తను గట్టిగా నవ్వి అంది. “నేను అంత కష్టపడి డిగ్రీ పాస్ అయింది ఖాళీ గా ఇంటిదగ్గర కూచోడనికి కాదు కదా. ఇంటి దగ్గర అసలే ఖాళీగా వుండలేకపోతున్నాను. ఏదన్నా వుద్యోగం చూడు. తప్పకుండా చేస్తాను.”

“వుద్యోగం అయితే సిద్ధం గానే వుంది.” తను అన్నాడు. “నేను పనిచేసే కంపనీ అధినేత వర్ధన్ వర్మ గారి దగ్గర సెక్రటరీ గా చేరతావా? చాలా మంచి జీతం ఇస్తారు.”

“నాకేం అభ్యంతరం లేదు. నువ్వు నన్ను అక్కడ ఎప్పుడు జాయిన్ అవ్వమంటే అప్పుడు జాయిన్ అవతాను.” తను అంది.                               

“సరే అయితే. రేపే నిన్ను అక్కడకి తీసుకెళ్తాను.” చలపతి అన్నాడు. “కానీ ఒక్కమాట. ఆ వర్ధన్ వర్మ తో నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నాకు చెప్పు, కానీ నువ్వేం అతనితో అనకు. అతను చాలా మంచివాడే. కాకపోతే భార్య చనిపోయింది, కొంచెం ఆడవాళ్ళ బలహీనత వుంది. అందుకని ప్రత్యేకంగా చెప్తున్నాను.”

“నా శరీరం తో ఇష్టంవచ్చినట్టుగా ఆడుకున్నవాళ్లనే నేను ఏమీ అనలేదు, జస్ట్ మాటలకి నేనెందుకు రియాక్ట్ అవతాను? సరే అతను ఏమన్నా నేను నీతో చెప్తాను కానీ అతన్ని ఏమీ అనను.” తను ప్రామిస్ చేసింది.

“అంతకన్నా ముఖ్యమైన విషయం.” సడన్ గా కాషస్ ఎక్స్ప్రెషన్ తో అన్నాడు. “మన మధ్య వున్న సంబధం గురించికానీ, మనం పెళ్లి చేసుకోబోతూ వున్నట్టుగానీ ఎవరితోనూ అనకు. మనకి పెళ్లయ్యేవరకూ ఇది రహస్యంగానే వుంచు.”

తనకి అందుకు కారణం కనిపించలేదు. కానీ ఎప్పుడూ తన మంచిగురించి ఆలోచించే చలపతి ని తను కారణం ఆడగడలుచుకోలేదు. అందుకూ అంగీకరించింది. ఆ మర్నాడే తనని వర్ధన్ వర్మ గారి దగ్గరకి తీసుకెళ్లడం, ఆయన దగ్గర తను సెక్రటరీ గా జాయిన్ అవడం జరిగిపోయాయి

&&&

చలపతి చెప్పింది దృష్టిలో ఉంచుకుని కొంచెం నెగటివ్ థింకింగ్ తోటే వెళ్ళింది వర్ధన్ వర్మ గారి దగ్గరికి శకుంతల, కానీ అయన ఇంచుమించులో ఆరడుగుల పొడుగుతో అందంగా ఉండడమే కాదు, తన మాట తీరులోనూ అదీ ఒక చిన్నపిల్లాడిలా, అమాయకంగా అనిపించారు. ఆయనకి ఆడవాళ్ళ బలహీనత ఉందంటే తనకి నమ్మబుధ్హి కాలేదు. అదే విషయం చలపతికి చెప్తే చలపతి నవ్వాడు.

"నువ్వు చెప్పింది నిజమే. కాకపోతే ఇటీవలే భార్య చనిపోయి, మంచి వయసులో వున్నాడు. నువ్వా ఇంత అందంగా వున్నావ్ . ఒకవేళ నీవైపు ఆకర్షించబడి, తేడాగా ప్రవర్తించినా నువ్వు షాక్ అవ్వకూడదని ఆలా చెప్పాను."

తను కూడా నవ్వి ఊరుకుంది అది విన్నాక. కాకపోతే వర్ధన్ వర్మ, మాటలలో అమాయకంగా, చిన్నపిల్లాడిలా కనిపించినా, బిజినెస్ విషయం లో చాలా సమర్థుడని గ్రహించింది. ఆ బిజినెస్ ని ఆయనే స్టార్ట్ చేసి ఆ స్థితి కి తెచ్చారు.   

కాకపోతే చలపతి చెప్పిన ఒక విషయం మాత్రం నిజం అయ్యేలాగే కనిపించింది. ఆయన తన పట్ల ఏమీ వెగటుగా, వెకిలిగా ప్రవర్తించడం లేదు. కానీ ఎదో ఆకర్షించబడుతూన్నట్టుగా కనపడుతూ వున్నారు. కాకపోతే తను అది సీరియస్ గా తీసుకోలేదు.

ఒకరోజు తనూ అయన తన ఛాంబర్ లో ఉండగా, తనని కూచోమని చెప్పి అయన అన్నారు. "మిస్ శకుంతలా, కొన్ని విషయాలు నాకు మాట్లాడడం రాదు. కొన్ని విషయాలు సరిగ్గా డీల్ చెయ్యలేను. నీ విషయం లో నేను తొందరపడుతున్నానేమో తెలీదు. కానీ కొన్ని విషయాలలో తొందరపడకపోతే అవి చేజారి పోతాయని మాత్రం తెలుసు."

"సార్ మీరు ఏం చెప్పదలుచుకున్నా నాతో సూటిగా చెప్పొచ్చు." తన గుండె వేగం పెరిగిపోతూ వుంది. అయన ఏం చెప్పదలుచుకున్నారో అర్ధం చేసుకోగలుగుతూ వుంది.     

"చలపతి నువ్వు తన కజిన్ వని, నీకు ఎవరూ లేరని చెప్పాడు. అంతే కాదు నువ్వు తన బాధ్యత అని, సాధ్యమైనంత త్వరలో నీకు పెళ్ళిచేద్దామని ఆలోచిస్తున్నానని చెప్పాడు."

అర్ధం చేసుకోలేక అయోమయం లో పడింది శకుంతల. తామిద్దరి మధ్య వున్నా సంబంధం గురించి, తామిద్దరూ పెళ్లిచేసుకోబోవడం గురించి ఎవరికీ చెప్పొద్దన్నాడు  ఓకే, కానీ తనకి తను పెళ్ళిచేసేద్దామనుకోవడం ఏమిటి?

"నా భార్య చనిపోయాక నన్ను పెళ్లిచేసుకోమని నా బంధువులందరూ బలవంతం చేస్తూవున్నారు. కాకపోతే నాకే పెళ్లిమీద మనసుపోలేదు. కాకపోతే నిజం చెప్తున్నా, నిన్ను చూసాక మొదటిసారి నాకు పెళ్లిచేసుకోవాలనిపించింది. ఇది కేవలం నీ బాహ్యసౌందర్యానికి నేను ఆకర్షించబడి చెప్తూన్నమాట కాదు. బయటకి కనిపించనిది ఏదో నీలో నేను చూశానని చెప్పలేను. కానీ నిన్ను పెళ్ళిచేసుకుంటే నేను ఆనందం గా ఉండగలనని చాలా గట్టిగా అనిపిస్తూంది. అలాగే కచ్చితంగా నిన్నూ ఆనందపరచగలను."

తన ఆలోచనలతో నిమిత్తం లేకుండా ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తనకీ చలపతి కి వున్నసంబంధం గురించి తనకి గట్టిగా అరిచి చెప్పాలని వుంది. కానీ ఆయన్ని ఇంటెరెప్ట్ చేసి ఎలా చెప్పాలో బోధపడ్డం లేదు.   

"నేను నిన్ను పెళ్లిచేసుకుందామనుకుంటున్నాను. నీకు తొందరేమీ లేదు. బాగా ఆలోచించుకునే సమాధానం చెప్పు." అలా అన్నాక ఆయన కుర్చీలోనుండి లేచారు.

"కానీ సర్ ..............." చలపతి చెప్పినదంతా గాలికొదిలేసి, తామిద్దరి మధ్య వున్నా సంబంధం గురించి, తాము పెళ్లిచేసుకోవాలనుకుంటున్న విషయం గురించి చెప్పేయాలనుకుంది శకుంతల.

"మరి నేను వస్తాను. నాకు చాలా అర్జన్ట్ పనులు వున్నాయి. నీ దగ్గరనుండి నేను పాజిటివ్ ఆన్సర్ మాత్రమే వినాలనుకుంటున్నాను ." అలా అన్నాక తనకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అక్కడనుండి వెళ్లిపోయారు అయన. తననుండి నెగటివ్ గా ఏది వినడానికి అయన సిద్ధం గా లేరని తనకి అర్ధం అయిపొయింది.    

&&&

"ఏం జరుగుతూందో నాకసలు అర్ధం కావడం లేదు." విషయమంతా క్లియర్ గా చలపతి కి వివరించి చెప్పాక అంది తను. "అసలు నువ్వు నాకు వేగంగా పెళ్లి చేద్దామనుకోవడమేమిటి? నువ్వలా అనకపోతే అయన నాకలా ప్రొపోజ్ చేసి వుండేవారే కాదనుకుంటా." చివర్లో కోప్పడింది.

"నువ్విందులో గాభరా పడాల్సినది ఏమీ లేదు. అంతా నేను అనుకున్నట్టుగానే జరిగింది. రేపు ఆయన్ని కలవగానే నీకు ఆయన్ని పెళ్లిచేసుకోవడానికి ఏం అభ్యంతరం లేదని చెప్పు." చిరునవ్వుతో అన్నాడు చలపతి.

"ఏమిటి నువ్వు అంటున్నది?" తన జీవితం లో తనెప్పుడూ అంతగా షాక్ అవలేదు.

"మరీ అంతగా షాక్ అయిపోవద్దు. ఇది మన దరిద్రం పూర్తిగా తీరిపోవడానికి వచ్చిన ఒక మంచి అవకాశం. ఎంతో ప్లాన్ చేసి ఇంతవరకూ తెచ్చాను. నువ్వు దీనిని తెలివితక్కువగా నాశనం చెయ్యొద్దు."

తనకేం బోధపడ్డం లేదు. ఏం మాట్లాడాలో తెలియడం లేదు. అయోమయం గా అలా చూస్తూ ఉండిపోయింది.

"ఎందుకలా చూస్తావు? నేనేమన్నా నీ అమ్మమ్మ లా ఎవడితోనన్నాపడుకుని డబ్బులు సంపాదించమని చెప్తున్నానా?  చక్కగా ఒక మహారాజులాంటి వ్యక్తిని పెళ్ళిచేసుకుని ఆనందంగా జీవితం గడపమని చెప్తున్నాను."

తానింకా షాక్ లోనే వుంది. ఇదంతా ఎదో కల. చలపతి ఎప్పుడూ ఇలా మాట్లాడడు. ఇదంతా నిజం అయ్యే అవకాశం లేదు.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)