Read Vennela Poolu - 14 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెన్నెల పూలు - 14

వెన్నెల పూలు

ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"మేమూ అదే అనుకుంటున్నాం. మేము ఆ చింటూ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. వాడు దొరికినా చాలా ప్రశ్నలకి సమాధానాలు తెలుస్తాయి." అలా అన్నాక ఇంకా మాట్లాడాల్సినది ఏమీ లేదనుకుని కుర్చీలోనుంచి లేచింది సుస్మిత.

ఆమెతో పాటుగా తామూ లేచారు భుజంగరావు, రేవతి, ఇంకా చక్రవర్తి కూడా.

"ఎలాంటి సాయం కావాల్సి వచ్చినా మొహమ్మాట పడకుండా అడగండి. మేమున్నామని మర్చిపోవద్దు. మేము మీ కుటుంబానికి చాలా కావాల్సినవాళ్ళం." సుస్మిత వెనగ్గా వస్తూ అన్నాడు భుజంగరావు.

"థాంక్ యూ అంకుల్, గుర్తున్చుకుంటాను." అలా అన్నాక అక్కడనుండి వేగంగా వెళ్ళిపోయింది సుస్మిత.     

 "మనకి ఏదీ తెలియనట్టుగా బాగా నటించాం కదా." మళ్ళీ అందరూ వచ్చి కుర్చీల్లో సెటిల్ అయ్యాక చక్రవర్తి అన్నాడు.

"మన తెలివితేటలూ అవసరమైన చోట తప్ప అన్నిచోట్లా పనిచేస్తాయి." చిరాగ్గా అన్నాడు భుజంగరావు. "వాళ్ళు ఏం మౌనంగా లేరు. విషయాలన్నింటినీ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది డేంజర్ సిగ్నల్."

"నేను ఒప్పుకుంటాను. తవ్వడం మొదలుపెడితే విషయం ఎప్పటికో అప్పటికి బయటకి రాకుండా ఉండదు. ఆ చింటూ పోలీసులకి దొరికితే పరిస్థితి ఏమిటి? విషయం అంతా చెప్పేకుండా ఉంటాడా?" రేవతి భయం గా అంది.

"ఇవతల ఈ చీఫ్ ఏమో నిమ్మకి నీరెత్తినట్టుగా వున్నాడు. ఇలా ఇంతింత జరిగిపోతూవుంటే అలా మౌనంగా ఎలా వున్నాడు?" చక్రవర్తి భయం గా అన్నాడు.

"వాడు సామాన్యుడు కాదు. వాడి ప్లాన్ లు వాడికి ఉంటాయి." భుజంగరావు అన్నాడు.

"ఏమో అనుకున్నాను కానీ, వాడి సైకియాట్రిస్ట్ పెళ్ళామే మనల్ని కాపాడుతూంది. వాడికి తను అన్నీ గుర్తుకు వచ్చేలా చేసివుంటే ఈపాటికే పెద్ద చిక్కుల్లో పడివుండేవాళ్ళం." రేవతి అంది.

"అందువల్ల చిక్కుల్లో పడేది ఆ చీఫ్ మనం కాదు, మనమెందుకు భయపడాలి?" చక్రవర్తి అన్నాడు.

"వాడు ములగాల్సి వస్తే మనల్ని కూడా ముంచుతాడు. వాడు చిక్కుల్లో పడితే మనం పడ్డట్లే." భుజంగరావు అన్నాడు.

వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటే భుజంగరావు ఫోన్ మోగింది. "చీఫ్!" భయంగా అన్నాడు భుజంగరావు. "మనం వాడి గురించి మాట్లాడుకున్నప్పుడల్లా వాడు ఫోన్ చేస్తూనే వున్నాడు." అంటూనే ఆ కాల్ అటెండ్ చేసాడు.

"ఫోన్ స్పీకర్ లో పెట్టు. ఇప్పుడు నా మాటలు ముఖ్యంగా నీ కూతురు వినాలి."

ఫోన్ స్పీకర్ లో పెట్టాక, సుస్మిత వచ్చివెళ్లిన విషయం, వాళ్ళు చింటూ గురించి తెలుసుకున్నది చెప్పే ప్రయత్నం చేశాడు భుజంగరావు.

"నీ సోది ఆపు. నువ్వు ఎక్కువ మాట్లేడే ప్రయత్నం చెయ్యకు. నాకు అన్నివిషయాలు తెలుస్తాయి, ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను. నువ్వు కేవలం నేను చెప్పేది జాగ్రత్తగా విని, నా ఆర్డర్లు తూచా తప్పకుండా పాటించు."

"అలాగే చీఫ్." అసహనాన్ని అణచుకుంటూ అన్నాడు భుజంగరావు.

"ముందు ఒక విషయానికి కంగ్రాట్యులేట్ చెయ్యాలి నిన్ను. మంచి అందమైన కూతుర్ని కన్నావ్. అంతేకాదు ఎంతమంది మగాళ్లతో సుఖం అనుభవించినా ఇంకా ఏ మగాడు టచ్ చెయ్యనట్టుగానే కనిపిస్తూ వుంది." సడన్ గా నవ్వాడు చీఫ్.

"చీఫ్..............." కోపంగా అరిచాడు భుజంగరావు.

రేవతి మొహం కూడా కోపంతో జేవురించుకుపోయింది.

"నీ కూతురేదో పెద్ద పతివ్రత అన్నట్టుగా మాట్లాడతావేం? దానిగురించి నాకు తెలియదనుకుంటున్నావా?" చీఫ్ కూడా కోపంగా అరిచాడు. "రూమ్ నం.201, హోటల్ రెడ్ ఇన్క్. మీకు తెలిసిన హోటల్. ఈ రోజు రాత్రి తొమ్మిదిగంటలకి తను అందులో నా కోసం వేచిచూస్తూ ఉండాలి. తెల్లవారగానే పంపించేస్తాను."

"చీఫ్ ఇదేం బాగా లేదు." ఎంతో కోపంతో వున్నా చిన్నగా అన్నాడు భుజంగరావు

"రేపు మార్నింగ్ ఇంటికిరాగానే నీ కూతుర్ని అడుగు, చాలా బావుందని చెప్తుంది." వికృతంగా నవ్వాడు చీఫ్. అంతలోనే సీరియస్ గా అన్నాడు. "తను రాకపోతే మాత్రం అసలు బావుండదు. మీ జీవితాలు ఎంతగా నా మీద ఆధారపడివున్నాయో, నాకు కోపం వస్తే ఏం చేస్తానో మీకు బాగా తెలుసు." ఆ తర్వాత ఆ ఫోన్ కాల్ కట్ అయిపోయింది.

"విన్నావుగా ఆ చీఫ్ ఏమన్నాడో?" రేవతి మొహంలోకి చూస్తూ అన్నాడు భుజంగరావు.

"డాడ్ ఏమిటి నువ్వంటున్నది? ఆ చీఫ్ తో పడుకోవడానికి నన్ను ఆ హోటల్ కి వెళ్ళమంటావా?" కుర్చీలోనుండి లేచి కోపంగా అరిచింది రేవతి.

"నేను ఏమనడం లేదు. మీ ఇద్దరికీ కూడా ఆ చీఫ్ గురించి బాగా తెలుసు. బాగా అలోచించి ఏం చెయ్యాలో మీరే డిసైడ్ చేసుకోండి." అలా అన్నాక భుజంగరావు అక్కడనుండి వెళ్ళిపోయాడు.

"గాడ్! ..........." నిస్సత్తువగా కుర్చీలో కూలబడి, వెనక్కి వాలి, మొహాన్ని చేతులతో కప్పుకుంది రేవతి.

"ఎందుకు మరీ అంతలా ఫీలవుతావ్? నీ జీవితం లో ఆ చీఫ్ ఇంకో మగాడు. ఇప్పటివరకూ వున్న మగాళ్లకన్నా మంచిఅనుభవం ఇస్తాడేమో." చిరునవ్వుతో అన్నాడు చక్రవర్తి.

"ఇతర మగాళ్లతో నా అనుభవం అడిగితెలుసుకుని ఆనందించే వెధవ్వి నువ్వు. నువ్విలా మాట్లాడ్డం లో ఆశ్చర్యం లేదు." మొహం మీదనుండి చేతులు తీసి, చక్రవర్తి మొహంలోకి కోపంగా చూస్తూ అంది రేవతి.

"నా కింక్స్ నచ్చే కదా నాతొ రిలేషన్షిప్ కంటిన్యూ చేసావ్. ఆ చీఫ్ కూడా మంచి కింకీ అనివిన్నాను. వాడితో కూడా నువ్వు ఎంజాయ్ చేస్తావు. కంగారుపడకు." రేవతి మాటలకి కోప్పడకుండా చిరునవ్వుతో అన్నాడు చక్రవర్తి.

ఆ మాటలకి ఏం మాట్లాడకుండా కుర్చీలో వెనక్కివాలి కళ్ళుమూసుకుంది రేవతి.

"అయినా ఆ చీఫ్ ఒక నిజం చెప్పాడు. ఇప్పటికీ ఏ మగాడు టచ్ చెయ్యనట్టుగానే వున్నావ్. ఆ చీఫ్ కి కూడా నువ్వు మంచి అనుభవం ఇస్తావ్. అందులో సందేహం లేదు."

ఇంక అక్కడ వుండలేనట్టుగా కుర్చీలోనుండి లేచి అక్కడనుండి వెళ్ళిపోయింది రేవతి.      

&&&

"అంటే నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావన్నమాట." శరత్ మొహం లోకి సూటిగా చూస్తూ ఒక  సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అడిగింది శకుంతల.

ఆ రోజు సాయంత్రం వచ్చి శకుంతలా దేవిని ఆమె రూమ్ లో కలిసాడు శరత్. ఆ సమయం వరకూ నెర్వస్ గా అనిపిస్తూవున్నా ఆ మూమెంట్ కి ఎదో మొండి ధైర్యం వచ్చింది.

"అవును" అన్నాడు.

"ఇంతకీ మా అమ్మాయిని ఎందుకు ప్రేమించావు? అందంగా వుందనా?"

"అంతే అయివుండాలి." నవ్వాడు శరత్. "అరవింద్ చెల్లెలిగా నాకు తనతో పరిచయం వుంది. తనలాగే మంచి క్యారక్టర్. చలాకీ గా యాక్టివ్ గా ఉంటుంది. అయినా కూడా తనతో నేను ప్రేమలో పడ్డానికి మెయిన్ రీజన్ అందమే అయి ఉంటుంది. కానీ ఇక్కడో ముఖ్యమైన విషయం వుంది."

"ఏమిటో అది?" కళ్ళు చిట్లించింది శకుంతల.

"మొదట లవ్ ని ఎక్స్ప్రెస్ చేసింది, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది, తనే. నేను అంత సాహసం చెయ్యలేదు."

"ఏం? ఎందుకని?"

"సొసైటీ లో మీ లెవెల్ నాకు తెలుసును కదా. నేనూ బాగా చదువుకునే వున్నా, మీతో సరితూగను. అందుకనే ధైర్యం చెయ్యలేకపోయాను."

"నేనిది ఎక్స్పెక్ట్ చేసాను." చిన్న నవ్వు నవ్విందావిడ. "మీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఎంతవరకూ ఫిక్స్ అయ్యారు? నేను కాదంటే ఏం చేస్తారు?"  

కాసేపు ఏం చెప్పాలో తెలియక మౌనంగా వుండిపోయాడు శరత్. "ఈ విషయం గురించయితే అసలు ఏమీ ఆలోచించలేదు." కొంత సమయం తరువాత అన్నాడు

"ఆలోచించకపోతే ఎలా? ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం ఇదే కదా."

"పెళ్లిచేసుకోము. మిమ్మల్ని బాధపెట్టి పెళ్ళిచేసుకుని ఉద్దేశం అయితే మాకు లేదు."

"అయితే అదేం ప్రేమ? ప్రేమలో ఆమాత్రం సీరియస్నెస్ లేని నీకు నా కూతుర్నిచ్చి ఎలా పెళ్ళిచెయ్యగలను?" మళ్ళీ అదే సీరియస్ ఎక్స్ప్రెషన్ తో అడిగిందావిడ.

"దీనికి నా దగ్గర సమాధానం లేదు. కాకపోతే మా ఇద్దరికీ కూడా మిమ్మల్ని బాధపెట్టే ఉద్దేశం లేదు. ఒక తల్లిని కూతురు ప్రేమించడం అసాధారణమైన విషయం ఏమీ కాదు. కానీ తను మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతుందీ అంటే ఏ విషయానికీ మిమ్మల్ని బాధపెట్టడానికి ఇష్టపడదు. కాబట్టి మీరు ఇష్టపడరంటే నన్ను పెళ్లిచేసుకోవడానికి తను  ఇష్టపడదు . తను ఇష్టపడని పనిని నేనూ చెయ్యలేను."

"బాగుంది మీ ప్రేమికుల వ్యవహారం!" సడన్ గా నవ్విందావిడ. "కానీ మీకా సమస్య రానివ్వను. మీ ప్రేమకి, పెళ్ళికి నా అభ్యంతరం లేదు."

"థాంక్ యూ వెరీ మచ్ ఆంటీ." బోలెడంత ఆనందం మొహం లో ద్యోతకమవుతూ అవుతూ ఉంటే అన్నాడు శరత్.  

"అరవింద్ నీ గురించి నాతో మాట్లాడాడు. సుస్మిత ని నీకిచ్చి పెళ్ళిచేస్తే బావుంటుందని కూడా అన్నాడు. కానీ ఇంత త్వరగా సుస్మిత కి పెళ్ళిచేసేద్దామని నేను అనుకోలేదు. కాబట్టి ఆ విషయం గురించి తరువాత ఆలోచిద్దామని అన్నాను."

"మీరు సరే అనివుంటే మేమిద్దరం లవ్ చేసుకుంటున్న విషయం మీకు చెప్పివుండేవాడు. మీరు తరువాత ఆలోచిద్దాం అనడం వల్ల తనూ అది పోస్టుపోన్ చేసివుంటాడు. మా లవ్ గురించి  మీతో మాట్లాడతానని తను నాతొ అన్నాడు."

"అంతే అయివుండొచ్చు." శకుంతల అంది.

అంతలో అక్కడికి ట్రే లో రెండు కాఫీ కప్పులు పెట్టుకుని టిబ్బూ వచ్చాడు.

"యూజ్ లెస్ ఫెలో. ఏమీ ఆలోచించకుండా ఎందుకిలా వచేస్తావ్? మేమిక్కడ మాట్లాడుకుంటున్నాం కదా." టిబ్బూ మొహం లోకి చూస్తూ అరిచింది శకుంతల.

"సారీ మేడం." చిన్నబుచ్చుకున్న మొహం తో తిరిగివెళ్ళిపోబోయాడు టిబ్బూ.

"ఎలాగూ తెచ్చి తగలడ్డావు కదా. ఇచ్చే వెళ్ళు." చిరాగ్గా అంది.

ఆ చిన్నబుచ్చుకున్న మొహం తోనే కాఫీ కప్పులు వాళ్ళిద్దరికీ డిస్ట్రిబ్యూట్ చేసి అక్కడనుండి వెళ్ళిపోయాడు టిబ్బూ.

"వీడేమో ఆ పనికిమాలిన వెధవని ఇక్కడ కి తీసుకొచ్చి పెట్టాడు. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్టుగా వాడు అలా చేసాడు. వాడు అరవింద్ ని ఆ బంగ్లాకి పంపించి ఉండకపోతే, తన పరిస్థితి ఇలా ఉండేది కాదు కదా." టిబ్బూ అక్కడనుండి వెళ్ళిపోయాక అదే చిరాకుతో అంది శకుంతల.

"అరవింద్ ఆ బంగ్లా లో ఏం చూసి అలా అయివుంటాడో నాకు అసలు అర్ధం కావడం లేదు." అయోమయం నిండిన మొహం తో అన్నాడు శరత్.

"మాకే అర్ధం కానీ విషయం నీకేం అర్ధం అవుతుంది?" నిట్టూరుస్తూ అంది శకుంతల. "ఇన్ని రోజులుగా వెళుతున్నా. ఎప్పుడూ అక్కడ ఎలాంటి విచిత్రం చూడలేదు. అలాంటిది వాడక్కడ ఎదో చూసి అలా అయ్యాడంటుంది నా కోడలు. నాకేం బోధపడ్డం లేదు."

"ఆ చీఫ్ ఎవరు? ఆ చీఫ్ కి ఈ విషయం అంతటితోటి సంబంధం ఏమిటి? చింటూ అలా చేసినందుకు, చింటూ మీద వాడికి కోపం దేనికి? నాకూ చాలా పజ్లింగ్ గానే వుంది." ఆశ్చర్యం తో నిండింది శరత్ మొహం.

"ఆ చీఫ్ గురించి తెలుసుకున్నది నువ్వే కదా? మా గురించి చాలా ట్రబుల్ తీసుకుంటున్నావ్. థాంక్ యూ." కృతజ్ఞత నిండిన మొహం తో అంది శకుంతల.

"మీరు అలా అనవలసిన అవసరం లేదు." శరత్ అన్నాడు. "నేను, సుస్మిత ప్రేమించుకోవడం కన్నా ముందే అరవింద్, నేనూ  మంచి స్నేహితులం. అరవింద్ నన్ను మంచి పొజిషన్ లో సెటిల్ చేసి నా ప్రొబ్లెమ్స్ అన్నీ తీర్చాడు."   

శకుంతల ఎదో అనబోతూ ఉండగా ఆ గదిలోకి ప్రవేశించారు సుస్మిత, సమీర.

"హాయ్ మామ్" సుస్మిత శకుంతల దగ్గరకి వచ్చి, కౌగలించుకుని, ఆమె కుడిబుగ్గమీద ముద్దుపెట్టుకున్నాక ఆమె పక్కన వున్న కుర్చీలో కూచుంది.

"మీరు శరత్ తో ఏం మాట్లాడతారో అన్న సస్పెన్స్ భరించలేకపోయింది. మీరేమనకుండా ధైర్యం కోసం కూడా నన్నుతెచ్చుకుంది." దగ్గరలో వున్నఇంకో కుర్చీలో కూచుంటూ అంది సమీర. "జస్ట్ శరత్ మీతో మాట్లాడ్డానికి వచ్చినప్పుడే అతనితో తన లవ్ విషయం నాకు చెప్పింది మీ అమ్మాయి."

"ఫీల్ రిలాక్స్డ్ . ఆంటీ మన పెళ్ళికి ఒప్పుకున్నారు. " చిరునవ్వుతో అన్నాడు శరత్.

"నేననుకుంటూనే వున్నాను నువ్వు ఒప్పుకుంటావని." అన్నాక మరోసారి తన తల్లిని కౌగలించుకుని ముద్దుపెట్టుకోబోయింది సుస్మిత. 

"పెట్టిన ముద్దులు చాలు." శకుంతల సుస్మిత ని ఆపుతూ అంది చిరునవ్వుతో. "శరత్ నాకు తెలుసు. అరవింద్ తన గురించి నాకు చెప్పాడు. అలాంటి మంచివ్యక్తి చేతుల్లో నిన్నుపెడితే నాకూ మనశాంతి గా ఉంటుంది. అందుకనే ఒప్పుకున్నాను."

"నేను చెప్పాను నువ్వు ఒప్పుకుంటావని, అయినా తను అనవసరంగా టెన్షన్ పడ్డాడు." చిరునవ్వుతో శరత్ మొహం లోకి చూస్తూ అంది సుస్మిత.

"ఒకే. ఒకే. ఇది నిజంగా సెలెబ్రేట్ చేసుకోవాల్సిన విషయమే. కానీ......" గట్టిగా నిట్టూరుస్తూ అంది శకుంతల. ".......ప్రస్తుత సమస్య మీకు తెలుసు. రోజూ ఆఫీస్ కి వెళ్ళివస్తూవున్నా అరవింద్ కేమీ గుర్తుకు రావడం లేదు. తనకెప్పుడు అన్నీ గుర్తుకు వచ్చి మామూలుగా అవుతాడో నాకు బోధపడ్డం లేదు."  

"ఈ విషయం లో మనకేమన్నా చెప్తే డాక్టర్ సమీర గారే చెప్పాలి. " సమీర మొహం లోకి చూస్తూ అన్నాడు శరత్.

“ఏముంది? తను ఎప్పుడూ చెప్పేదే చెప్తుంది." సుస్మిత కూడా సమీర మొహం లోకి చూసింది.

అందంగా నవ్వింది సమీర. "మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్ధమైంది. నిజానికి నేనూ తనకి అన్నీ ఎప్పుడు గుర్తుకు వస్తాయా అని చూస్తున్నాను. కానీ........."

"ప్లీజ్ వదినా." సమీర చిన్న గ్యాప్ ఇవ్వగానే మొదలుపెట్టింది సుస్మిత. "బ్రో కి విషయాలన్నీ గుర్తుకు వచ్చేస్తే చాలా పజిల్స్ విడిపోతాయి. ముఖ్యం గా బ్రో అన్నీ మర్చిపోయి నన్ను, మామ్ ని కూడా స్ట్రేంజర్స్ లా ట్రీట్ చెయ్యడం నేను తట్టుకోలేకపోతున్నాను. నాకు తెలుసు, నువ్వు కావాలనుకుంటే తనని హిప్నోటైజ్ చేసి అన్నీ గుర్తుచేసుకునేలా చేయగలవు."

"ఐ యాం సారీ. నేను తన సైకియాట్రిస్ట్ ని. నేను తనని హిప్నోటైజ్ చేసే అన్నీ గుర్తుచెయ్యల్సిన అవసరం వచ్చిందనిపిస్తే తప్ప, అలా చెయ్యలేను." సమీర ధృడంగా చెప్పింది.     

"నో మోర్ డిస్కషన్స్ ఆన్ దిస్ ఇష్యూ." సుస్మిత ఎదో అనబోతూ ఉంటే శకుంతల ఇంటెరెప్ట్ చేస్త్తూ అంది. "సమీర కేవలం తన సైకియాట్రిస్ట్ మాత్రమే కాదు, తన భార్య కూడా. తను త్వరగా పూర్తి మామూలుగా అవ్వాలని మనకన్నా ఎక్కువగా తనే ఆత్రుత పడుతుంది. కాబట్టి ఈ విషయం లో తనదే ఆఖరి నిర్ణయం."

"ఒకే మామ్." సుస్మిత నిట్టూరుస్తూ అంది.

ఆ తర్వాత కాసేపు మాట్లాడుకున్నాక అక్కడనుండి వెళ్లిపోయారు వాళ్ళందరూ.        

&&&

తను రాస్తూవున్న నోట్ బుక్ ని మూసి, డ్రాయర్ లో పెట్టి, క్లోజ్ చేసాక దాన్ని లాక్ చేసి కీ హ్యాండ్బ్యాగ్ లో పెట్టుకుంది శకుంతల. తను తన నోటితో చెప్పలేని తన జీవితం గురించి తన వాళ్ళకి తెలియాల్సిన రోజు ఒకటి వస్తుంది. అందుకనే కుదిరినప్పుడల్లా ఈ బంగళాలో ఈ కుర్చీలో కూచుని రాస్తూ వుంది. ఈ రోజుకే తను తనకి చలపతి తో పరిచయం కావడం, చలపతి తనకి తన పరీక్షలకి చక్కగా చదువుకునేలాగా సహాయం చెయ్యడం వరకూ రాసింది. కుర్చీలో వెనక్కి వాలి కళ్ళుమూసుకున్నతనకి, తాను రాయబోయేది అంతా కూడా కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తూ వుంది.      

"నన్ను క్షమించు. నిన్నెప్పటికీ కాపాడాలని వుంది. కానీ నీ అమ్మమ్మకి ఇవ్వడానికి నా దగ్గర ఇంక డబ్బులు లేవు." శకుంతల మొహం లోకి బాధగా చూస్తూ అన్నాడు చలపతి.

"నిన్ను క్షమించాలా? దేనికి?" చలపతి ని కౌగలించుకుని, రెండుబుగ్గల మీద ముద్దుపెట్టుకుని అతని మొహంలోకి చూస్తూ అడిగింది శకుంతల . "నా పరీక్షలన్ని రోజులు నేను డిస్టర్బ్ కాకుండా చక్కగా చదువుకునేలా చేసినందుకా? లేకపోతె అంతడబ్బు నా అమ్మమ్మకి ఇచ్చి కూడా నా వంటిమీద చెయ్యి కూడా  వెయ్యకుండా వుంటున్నందుకా? దేనికి?"

"నువ్వు ఆ మగాళ్ల చేతుల్లో ఎంత నరకయాతన అనుభవిస్తున్నావో నాకు తెలుసు. ఒక కోటి రూపాయలు ఇచ్చయినా నిన్ను ఈ నరకం నుండి రక్షించాలని నాకువుంది. కానీ........."

"ఇంక ఆపేయ్." చలపతి నోటికి తన కుడిచేతిని అడ్డుపెడుతూ అంది శకుంతల. "నన్ను ఇంతగా ప్రేమించే ఒకవ్యక్తి వున్నాడన్న ఆలోచన నాకు ఎంతయినా శక్తిని ఇస్తూంది. ఎంతబాధనైనా భరిస్తాను. ఒక్క విషయం చెప్పు." తన చేతిని తొలగించి, కౌగిలిని అలాగే ఉంచి, అతని మొహంలోకి అలాగే చూస్తూ అడిగింది. "నా అమ్మమ్మ కి ఇచ్చిన డబ్బంతా ఎక్కడినుండి వచ్చింది నీకు?"

"ఎక్కడినుండో వచ్చింది. అదంతా అవసరమా నీకు?" చిరాకుపడుతూ తన కౌగిలినుండి విడిపించుకోబోయాడు చలపతి.

"చెప్పకపోతే నా మీద ఒట్టు. చెప్పు, ఆ డబ్బు అంతా నీకు ఎక్కడినుండి వచ్చింది?" తన కుడిచేతిని తీసుకుని తన నెత్తిమీద పెట్టుకుంటూ అడిగింది. "మేం తప్పులు చేస్తూ బతికేవాళ్ళం. ఇలా అడుగుతున్నాననుకోకు. ఏదన్నాతప్పుచేసి సంపాదించలేదు కదా?"

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలో పబ్లిష్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు.)