Read Not the end - 68 by Ravi chendra Sunnkari in Telugu ఏదైనా | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 68

సత్యయుగ గ్రహంలో కల్కి జనన విఘ్నం: దైవశక్తుల ఆందోళన

ఇప్పుడు వాళ్ళందరికీ ఒక చిన్న వెలుగు కనిపిస్తుంది. ఏమో అరుపులు మరియు నామస్మరణలు, ఏదో శక్తివంతమైన పాట అనుకుంటా, ఎవరో బాధగా పిలుస్తున్నారు. కొద్ది సమయం వెనుకకు వెళ్తుంది, అది సత్యయుగ గ్రహంలో జరుగుతుంది. అక్కడ కట్ చేస్తే మళ్ళీ హనుమంతుడు, గణేశుడు, కార్తికేయ వైపు వస్తుంది. "హనుమ! ఇప్పుడు ఏం జరిగింది? నాకు అర్థం కావడం లేదు. కృష్ణుడు చెప్పాడు కదా తను వస్తానని! కానీ ఇక్కడ చూస్తే మహిళల కడుపులో ఉన్న శిశువులకు శరీరం లేకుండా పోయింది, అవయవాలు లేవు! ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు కల్కి ఎలా పుడతాడు?" అని టెన్షన్‌గా ఉన్నారు.

"అసలు ఏం జరిగిందో ఫస్ట్ నుంచి చూద్దాం పదండి," అని అంటూ మళ్ళీ ట్రైన్ ట్రావెల్ చేసి సత్యయుగ గ్రహం యొక్క మొదటి పూజలో కనిపిస్తుంది. పూజ మొదలైన తరువాత మాయ (ఒక గర్భిణి) వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. తన వెనకాలే ఐదు రకాల బాల్స్ వస్తాయి. అవి ఐదు మంది మహిళలు పడడంతో వాళ్లకు చిన్నగా నొప్పి వస్తుంది. ఆ అరుపు యుద్ధం మొదట్లో సైన్యానికి, హీరోలకు వినిపించిన అరుపు. అలా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కృష్ణుడు అంటే తమ కడుపులో ఉన్న బిడ్డలు తమతో ఆడుకుంటున్నారేమో అనుకుంటూ పూజలో కూర్చుంటారు. వాళ్ళు కృష్ణుడి గురించి పాట పాడుతూ, "రారా చిన్ని కృష్ణయ్య" అని పాట పాడుతూ ఉండగా చాలా గట్టిగా నొప్పి వస్తుంది. లోపల ఎవరో చెయ్యి పెట్టి దేవునినట్టుగా, తమ బిడ్డలను లాగేసుకుంటున్నట్టుగా, తమ బిడ్డలు తమతో ఏదో చెబుతున్నట్టుగా అనిపించడంతో, వాళ్ళకు కడుపులో భయంకరమైన నొప్పి, కళ్ళల్లో బాధ. వాళ్ళు ఐదు మంది ఒకేసారి కింద పడిపోయారు.

ప్రతి ఒక్కరూ టెన్షన్‌తో అటూ ఇటూ తిరుగుతూ, వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాలేదు. కొంతమంది ముసలి తాబేలు మంత్రగత్తెలు వచ్చారు. వాళ్ళు కడుపులో చూడగా వాళ్ళకు ఒక విచిత్రమైన సంఘటన జరుగుతున్నాయి. వాళ్ళల్లోకి వెళ్ళిన కడుపులోకి వెళ్ళిన నెగటివ్ వాయిస్ బిడ్డ యొక్క పూర్తి శరీరాన్ని ఆపివేసి, వాటిని కరగదీయడం మొదలుపెట్టాయి. అవి కరిగిపోయే కొద్దీ రంగులు మారుతూ ఒక దివ్యమైన వెలుగు మాత్రమే మిగిలాయి. వాటికి శరీరం లేదు, భాగాలు లేవు. అది తెలుసుకున్న తర్వాత హీరోయిన్‌లు (గర్భిణులు) బాగా తగ్గాయి. కోపంతో, "ఏం జరుగుతుంది? ఏంటి కృష్ణా! ఏం జరుగుతుంది? నువ్వు మా కడుపులో పుట్టడం నీకు ఇష్టం లేదా? మేమేమైనా తప్పు చేశామా?" అని అంటూ ఉండగా, లింగయ్య అక్కడ ప్రత్యక్షమవుతాడు. "చూడండి అమ్మ! ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? కృష్ణుని పిలవాలి కానీ, కన్నయ్య అని కాదు. రారా కల్కి!"

అదంతా చూస్తూ ఉన్న హనుమంతుడు, "ఇప్పుడు అర్థమైందా ఏం జరిగిందో? ఈ కలిపురుషుడిగా మారిన శకుని ఎంత క్రూరమైన పని చేశాడు. కానీ కృష్ణుడు చెప్పింది కూడా ఇదే కదా! శరీరం ఉంటే ఒకరికే పుట్టాలి. శరీరం లేకపోతే అందరికీ పుట్టినట్టే. కానీ ఈ శరీరం లేని రంగులు ఎలా ఒక మానవ రూపాన్ని ధరించి కల్కిగా ఎలా మారతాడు?" అని అడుగుతుంటే, మొత్తం దేవుళ్ళు అందరూ బిత్తరపోయారు.

కైలాసంలో శివుడి జ్ఞానం: నెమలీక రహస్యం

ఇప్పుడు ఈశ్వరుడు ఉన్న కైలాసంలో చూపిస్తారు. పార్వతి మాత అయోమయంగా, "ఏంటి ప్రభూ! నీకు కూడా ఈ సమస్యకు కారణం తెలియదా? పరిష్కారం తెలియదా?" అని అడుగుతుంది. "ఏంటి పరిష్కారమా? శ్రీకృష్ణుడు తలచిన పనిని నేను మళ్ళీ నీకు చెప్పడమా? నీకు తెలుసు కదా, వాసుదేవ వంశంలో ఒక అమ్మాయి కుందేలుగా మారి ఇప్పుడు ఎక్కడికి మాయమైపోయిందని. ఇది ఎందుకు జరిగింది నాకు తెలుసు కదా! ఆ తర్వాత అంతకుముందే కృష్ణుడు ఇది జరుగుతుందని ఊహించే నెమలికతో తన పనిని చాలా సులువు చేసుకున్నాడు. ఒకవేళ నెమలీక అక్కడ ప్రవేశించకుండా ఉంటే, ప్రతి ఒక్క గ్రహంలో ఉన్న శక్తులు ఆ నెగటివ్ ఎనర్జీని అక్కడే బద్దలు కొట్టేవి. అప్పుడు ఏం జరిగేది? కేవలం కృష్ణుడు 5 మందికి పుట్టి, పెద్దవాడై కలిపురుషుడిని శకునిని అంతం చేయాలి. కానీ కృష్ణుడు మాయ చేయడం వల్ల ఇప్పుడు రూపం లేని ఒక మాయ శక్తిగా ఉండడం వల్ల ప్రకృతి శక్తులను ఐదు రకాలుగా ఒకేసారి తీసుకోగలడు. ఇది నీకు అర్థం కావడం లేదా దేవి?" అని అంటాడు శివుడు.

"అది సరే మరి, కల్కిగా ఎలా మారుతాడు?" అని అంటే, "అది చూడు!" అని అంటాడు. "సరే మారిన తర్వాత కల్కి ఎలా ఉంటాడు?" అని అంటుంది పార్వతి మాత. "చూడు దేవి, నీకు ఎన్నో రూపాలలో కృష్ణుడు కనిపించాడు కానీ చాలా క్రూరంగా కనిపించిన రూపం ఏది?" అని అడుగుతాడు. "అందరికీ తెలిసిందే కదా, మహా నరసింహస్వామి అని!" అంటాడు పార్వతి. "ఇప్పుడు పుట్టబోయే కల్కి అంతకుమించి ఉంటాడు," అని అనడంతో అక్కడ సీన్ కట్ అవుతుంది.

బ్రహ్మ లోకంలో భవిష్యత్ రాత: మోహిని రూపం

ఇప్పుడు బ్రహ్మ లోకంలో చూపిస్తే, బ్రహ్మదేవుడు కూర్చొని మళ్ళీ రాత రాయడం మొదలుపెట్టాడు. "ఏంటి స్వామి!" అని సరస్వతి దేవి మాట్లాడుతూ, "మీరు మళ్ళీ రాత రాస్తున్నారు. భూమి అంతమయ్యే స్థాయికి చేరుకుంది. మీరు వినలేదా? మహా శివుడు, పార్వతి మాత ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఇప్పుడు పుట్టబోయే కల్కి చాలా క్రూరంగా ఉంటాడని చెబుతున్నారు. అంటే అతన్ని ఆపడానికి ఏ శక్తి ఉంది?" అని అడుగుతుంది సరస్వతి మాత.

బ్రహ్మదేవుడు చిన్నగా మూడు తలలు, మూడు రకాల వింత భావనలతో, "ఏంటి దేవి! నువ్వు ఇంతసేపటికి ఈ ప్రశ్న అడిగావా? నరసింహ స్వామిని ఎలాగైతే ప్రహ్లాదుడు పాట పాడాడు, ఇప్పుడు ఇలాంటి విపత్తులు మళ్ళీ అటువంటి వ్యక్తి కావాలి. మహోన్నమైన శక్తివంతుడైన కల్కి కూడా విజృంభణ తగ్గించి, ఆ పాటలో లీనమై ఎప్పుడైతే నాట్యం చేస్తాడు, అతని రూపం మోహినిలా ఎప్పుడైతే మారుతుందో, అప్పుడు కల్కి అంతర్ధానం అంతమవుతుంది, అతను ప్రశాంతంగా మారతాడు," అని చెప్పడంతో మళ్ళీ రాయడం మొదలుపెడతాడు. "అంటే ఏంటి? భూమి అంతం కాదా?" అని అంటుంది సరస్వతి. "అది నీకు చివర్లో తెలుస్తుంది దేవి," అని తన పనిలో పడతాడు. కొత్త మనుషులకు కొత్త రాతలు రాయడం మొదలుపెట్టాడు బ్రహ్మదేవుడు.

కల్కి పిలుపు: "దిగిరా కల్కి" గీతం

అలా కట్ చేస్తే హనుమంతుడు మళ్ళీ ఇదంతా చూస్తూ సత్యయుగ గ్రహంలో చూపిస్తారు. అక్కడ గర్భిణీ స్త్రీలు మొత్తం అందరూ అంటే ఐదు మంది నిలబడి, కృష్ణుడి చుట్టూ తిరుగుతూ తమ కడుపులో ఎంత నొప్పి వస్తున్నా దీపాలు పట్టుకొని ఇలా పాట పాడుతున్నారు. ఇప్పటికే యుద్ధ భూమిలో జరిగిన సంఘటనలు తెలుసుకున్న వాళ్ళు ఇలా చెప్పడం మొదలుపెట్టారు, "వెళ్ళండి! ఈ శ్రీకృష్ణుడి వెలుగును యుద్ధభూమిలో పరచండి!" అని అనడంతో అక్కడున్న సైనికులు మరియు సామ్రాట్ వాళ్ళ నాన్న యుద్ధంలోకి కొన్ని అర్థాలను (పవిత్ర వస్తువులను?) తీసుకువెళ్ళారు. ఇక్కడ నుంచి అక్కడికి సౌండ్ చేసేలా కొన్ని మైక్రోఫోన్లు తీసుకువెళ్ళారు.

పాట మొదలవుతుంది: "దిగిరా కల్కి"

(Intro – శాంతమైన సంగీతంతో ప్రారంభమవుతుంది)

(లింగయ్య)

ఆకాశానికి, భూమికి

ఓ కంటి దీపమా, బలమైన శక్తిగా నీ బలం కావాలి…

అధర్మం ఓడించగా… ధర్మం గెలిపించేందుకు!

(మాయ 1)

వెలుగు నువ్వేనా? ప్రాణవెలుగు నాదా?

శంఖనాదాలతో, చేతిలో చక్రంతో

చీకటిని చీల్చి దిగిరా కల్కి

ఈ చీకటి పుడమిని వెలిగించు కల్కి!

(రాధ)

నీవే మాకై వచ్చిన శక్తి

అధర్మం కడతేర్చే యోగి

నల్లటి కవచంతో, రౌద్ర ఖడ్గంతో

రారా కల్కి… ధర్మాన్ని నిలబెట్టరా!

(అక్షర)

రాత్రి లేదు, పగలు లేదు, మధ్యలో సంధ్యలా

గోర్లతో సంహరించిన నరసింహుడా

మనంగా బాణమై, ఆలోచనగా శక్తిగా

రావణాసురుడి ఆఖరి శ్వాసగా!

(సమంత)

రాముడి న్యాయం, కృష్ణుని నీతి

భీముడి బలం, వాసుదేవుని భక్తి

ఈ మూడు యుగాల గొప్పతనం

నిన్నే చూపిస్తుంది ఈ కలియుగం!

(అక్షర 2)

శ్వేత అశ్వంపై దిగిరా

దివ్య ఖడ్గంతో, రౌద్ర రూపంతో

చీకటి అంతం చేసి, వెలుగు నింపుతూ

కొత్త యుగానికి నాంది పలుకుతూ

పుట్టరా కల్కి… రారా కల్కి!భూముల విలీనం: శకుని విజయం, ప్రజల జ్ఞానోదయం

యుద్ధభూమిలో, భూములన్నీ పూర్తిగా కలిసిపోయే సమయం ఆసన్నమైంది. ఐదు రకాల భూముల మధ్య ఉన్న ఆ నల్లటి బ్లాక్ ఎనర్జీ నెమ్మదిగా అన్నిటినీ ఒక చోటికి చేరుస్తోంది. ఒకరి శరీరంలోకి ఒకరు వెళ్ళినట్టుగా, ఐదు భూములు ఒక్కొక్కటిగా ఒకదాంట్లోకి ఒకటి వెళ్లడం మొదలుపెట్టాయి. ఆ దెబ్బకు భూమి అల్లకల్లోలం అవుతూ, ప్రజలు కళ్ళు తిరిగి పడిపోయే స్థాయికి చేరుకున్నారు. అగ్నిపర్వతాలు ఉప్పొంగి పడిపోతూ ఉండగా, సముద్రాలు పొంగిపోతున్నాయి.

ఒక్కసారిగా ఐదు రకాల భూములు కలిసిపోవడంతో, ప్రజలు ఒక నాయకుడి కోసం ఎదురుచూస్తున్నట్టుగా అందరూ మోకాళ్ల మీద పడ్డారు. పైన ఎగురుతున్న శకుని వాళ్ళందరినీ చూస్తూ, "ఇప్పటికి ఒప్పుకున్నారు! మీ అందరినీ ఒప్పించడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డాను! ఇప్పటి నుంచి కలియుగ రాజకీయమంటే ఏంటో చూపిస్తా! చావండి!" అని అంటూ గట్టిగా నవ్వుతున్నాడు.

ఒక్కసారిగా ఏదో జరుగుతుంది. చుట్టూ వెలుగు పరుచుకుంటుంది. వెలుగు పడిన ప్రతిచోట నెగటివ్ ఎనర్జీ దూరంగా పారిపోతుంది. వాటితో పాటు ఏదో పాడిన పాటలా కనిపిస్తుంది. కానీ హీరోలు లేవలేక పోతున్నారు. వాళ్ళు ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయినట్టుగా అందరూ మోకాళ్ళ మీద కూర్చున్నారు. వాళ్ళు కూడా శకునికి లొంగిపోయినట్టుగా కనిపిస్తున్నారు.

ఒక్కసారిగా నీరు, నిప్పు, గాలి మొత్తం పంచభూతాల శక్తులు అల్లకల్లోలం చేస్తున్నాయి. ప్రపంచమంతా ఇప్పుడు ఐదు రకాల ప్రపంచంలోని వాతావరణాలు ఒక్కసారిగా కలిసిపోవడంతో, ప్రకృతి శక్తులకు పిచ్చి లేసినట్టుగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. జంతువులు పూర్తిగా చనిపోయే స్థాయికి చేరుకున్నాయి. మహా శక్తివంతమైన గుడులు (దైవశక్తులు) రూపం, రంగుల్లోకి మారిపోతున్నాయి. ఇప్పుడు కల్కి జననం ఎలా ఉందో మనకు తెలుసు. ఇప్పుడు గుడుల శక్తులు కూడా ఒకటేలా కనిపిస్తున్నాయి.

అంతటితో ఆగకుండా ఐదు రకాల భూముల్లో ఉన్న ప్రజలు ఒకరితో ఒకరు కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళందరికీ తెలిసింది ఏంటి? ఇప్పుడు మనకు రాజు కావాలి. కానీ అంతకు ముందు జరిగిందేంటి? విధ్వంసం. అంటే ఇప్పుడు కలియుగం అంతం అని పూర్తిగా అందరూ శకునికి లొంగిపోయారు. అక్కడ హీరోలు ఉన్నారు. హీరోలకు మనుషులు తెలుసు. కానీ ఐదు లోకంలో ఉన్నవారికి ఈ ఐదుగురు హీరోలు తెలుసు. వీళ్ళకు చాలా విచిత్రంగా ఉంది. ఇంతవరకు కనిపించని హీరోలు ఒక్కసారిగా తమ మైండ్‌లో మెదడడం, "వీళ్ళు మనవాళ్ళు" అనిపించడం కానీ ఎప్పుడూ చూడకపోవడం అస్సలు ప్రజలు తికమక పడుతున్నారు. ఇది ఎందుకు జరిగిందో అందరికీ తెలుసు.

దైవలోకాలలో చర్చ: అంతమా? ఆరంభమా?

పై నుంచి చూస్తున్న హనుమంతుడు, "ఇది అంతమేనా?" అని అంటున్నాడు. అశ్వత్థామ, పరశురాముడు కూడా, "అయితే మా శాపం ఇంకా విముక్తి కాదా?" అని అనుకుంటున్నారు. అందరూ "కాదా? కాదా? కాదా?" అని అనుకుంటున్నారు. కానీ శివుడు, బ్రహ్మదేవుడు మాత్రం "ఇప్పుడే ఆరంభమైంది!" అన్నట్టుగా నిశ్చలంగా చూస్తున్నారు.

పార్వతి మాత ఇలా అంటుంది, "చివరగా ఒక్క ప్రశ్న మహాదేవా! ఈ కల్కి ఇలా ఎప్పుడు వస్తాడు మనకు అర్థం కావడం లేదు. కానీ ఆ పాట పాడే వ్యక్తి ఎవరు?" అని అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన సరస్వతి దేవి కూడా, "అవును అక్క! అసలు వీళ్ళు చెప్పమంటే మనకు ఏ రహస్యం చెప్పడం లేదు. అందరూ ప్రశాంతమైన చిరునవ్వుతో ధ్యానం చేసుకుంటున్నారు. మనమే తెలుసుకోవాలి!" అని అంటూ ఒక్కసారిగా వైకుంఠానికి వెళ్లడానికి సిద్ధమవుతారు.

వైకుంఠంలో కృష్ణుడి లీల: నారదుడి ప్రవచనం

అప్పుడే వైకుంఠంలో ఉన్న పాలసముద్రం మీద పడుకొని ఉన్న శ్రీకృష్ణుడు తన శరీరంలో నుంచి ఒక ఆత్మలా బయటికి వస్తాడు. అతని చూసిన రుక్మిణి, సత్యభామ ఇద్దరూ, "స్వామి! ఎక్కడికి మీరు వెళ్తున్నారు? మీకు అక్కడ శరీరం లేదు! మీరు ఎలా ఒకటవుతారు శరీరంతో? ఈ కలియుగం అంతా ఎలా చేస్తారు? ఆ శకుని ఇంత దుర్మార్గం పని చేస్తాడని మాకు అస్సలు అనిపించలేదు కానీ, ఇలా మీరే చేయించారని తెలిసాక మాకు అసలు మెదడు పని చేయడం లేదు! మీ లీలలు ఎవరికి అర్థమవుతాయి?" అని అనుకుంటూ ఉండగా, 'థింగ్ థింగ్' అంటూ అక్కడికే నారదుడు వస్తాడు.

ఇప్పుడు వైకుంఠంలో చూపిస్తారు. వెళ్తున్న శ్రీకృష్ణుడు చిన్నగా వెనక్కి తిరిగి, "నేను అదుపు తప్పినప్పుడు మీరు మర్చిపోకండి నారద, పూర్తి విషయం చెప్పు!" అని అంటూ ఒక్క చిటికలో అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇప్పుడు నారదుడు తన చేతిలో ఉన్న వస్తువును 'టింగ్ టింగ్' అంటూ శబ్దం చేస్తూ చెప్పడం మొదలుపెట్టాడు.

"ప్రతి యుగంలో కృష్ణుడు పుట్టాడు, అంతం చేశాడు అన్నట్టుగా కాదు. ప్రతి యుగంలో చేసిన యుద్ధానికి మరో కథకు జోడిస్తూ కథను సృష్టించాడు. తలుచుకుంటే అప్పుడే అందరినీ అంతం చేయగలిగే శక్తి ఉన్న కృష్ణుడు ఎందుకు ఇంత చేశాడు? కొంతమంది శత్రువులను అలా వదిలి పెడుతూ వచ్చాడు. ఎందుకంటే కలియుగ చివర్లో ఖచ్చితంగా అతను శత్రువులు అందరూ గట్టిగా నిలబడి తనతో పోరాటం చేస్తారు. ఆ పోరాటంలో కచ్చితంగా ఎలాగూ కృష్ణుడు గెలుస్తాడు. అందరినీ ఒకేసారి అంతం చేయాలని ఆశించిన కృష్ణుడు ఇప్పుడు ఇంతటి పరిస్థితులున్నాడు. మీకు సమాధానం రాదా?" అని అనడంతో సీన్ కట్ అవుతుంది.

"కలియుగాంతంలో పాపాలను అన్నిటినీ కడిగేయాలని అనుకున్నాడు. కానీ భూమి సంగతి ఆయనకు కూడా తెలుసు కదా! భూమి పాపాలకు నిలయం. పాపం చేసిన వాళ్ళు భూమ్మీదనే ఉంటారు. అందరూ అంటారు కదా నరకంలో శిక్ష అనుభవిస్తారని, కానీ నిజం ఏంటంటే భూమి మీదనే వాళ్ళు మానసికంగా, శారీరకంగా కష్టపడి చనిపోతారు. చివరికి తమ పాపాలు పూర్తిగా కడగడానికి యమలోకంలోకి వెళ్తారు. అందరూ చూపించినట్టుగా అక్కడ ఎంతవరకు పాపాలను కడుగుతారో తెలియదు కానీ, ఒక సముద్రాన్ని ఈదుతారు. అప్పుడు ఆత్మ, 'ఈ జీవితాన్నే ఎంతో సులభంగా ఈదాను, ఈ చెరువు ఎంత?' అని అనుకుంటారు."

రాధాదేవి: ప్రేమ, జ్ఞానం, మరియు మానవత్వపు పాఠం

"అది సరే నారద మహర్షి, రాధా రాధ అంటే ఎవరు? రారు అని అడుగుతారు?" అని అడుగుతారు. వెంటనే నారదుడు చిన్నగా నవ్వుతూ, "రాధాదేవి ఒకప్పుడు కృష్ణుడు ప్రేమించిన అమ్మాయి," అని అనడంతో అందరూ ఒకసారిగా సైలెంట్ అవుతారు. అందరికీ అప్పుడు అర్థమవుతుంది ప్రేమ ఎంత గొప్పదో, అంత క్రూరమైన వాడినైనా మార్చగలిగే శక్తి ప్రేమకు మాత్రమే ఉంది. "మీ అందరూ అనుకుంటారు ఇప్పుడు తను ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి అని?" అందరూ అడుగుతారు. "గంగాదేవితో కలిసి ధ్యానం చేస్తూ ఉంది," అని చిన్నగా నవ్వుతూ అక్కడ సీన్ కట్ అవుతుంది.

ఇప్పుడు భూమ్మీద చూపిస్తారు. ప్రజలు అందరూ మోకాళ్ళ మీద ఉన్నారు కదా. వాళ్ళల్లో ధనవంతులు, డబ్బు లేని వాళ్ళు అంటే పేదవాళ్ళు, కులమత భేదాలు లేకుండా వాళ్ళకు అర్థం అవుతుంది ఏంటంటే చావు అందరికీ ఒకేలా వస్తుంది. ఒకరిని చూసి ఒకరు ఇలా అనుకుంటున్నారు, "వీడు ఎంత బాగా బ్రతికాడో కానీ ఇప్పుడు ఇలా చనిపోతున్నాడు." ఇంకొకరు ఇలా అనుకుంటారు, "నేను ఎంత బాగా బతికాను కానీ వీళ్ళతో కలిసి చనిపోతున్నాను." ఇంకొకరు ఇలా అనుకుంటాడు, "నేను ఎంత దుర్భరంగా బతికాను కానీ నాకంటే ఎంతో బాగా బ్రతికిన వాళ్ళతో చనిపోతున్నాను." ఇప్పుడు అందరికీ అర్థమైంది ఏంటంటే, చావు అందరికీ ఒకటే. చావు బ్రతుకులు అందరికీ ఒకటే. కేవలం ఈ బ్రతికే స్థాయిలో లెవెల్స్ అంటూ, మతాలు, కులాలు అంటూ అందరూ పెట్టుకుని కొట్టుకొని చివరికి ఒకేసారి చనిపోయే స్థితికి వచ్చారు అని ప్రజల్లో తమ మనసుల్లో ఇలా అనుకుంటున్నారు.

.