Read Not the end - 66 by Ravi chendra Sunnkari in Telugu ఏదైనా | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 66

హనుమంతుడు ఇంకా మాట్లాడుతూ, "అన్ని జీవుల కంటే మానవ జీవితం ఎంతో గొప్పది. ప్రతి దేవుడు కూడా మొదటిగా మానవ జీవితాన్ని అనుభవించిన తర్వాతే దేవుడు అవుతాడు. అలాంటిది మీరు మానవులుగా పుట్టారు. ఇప్పుడు టైం సెట్టింగ్‌తో సమానంగా ఎనర్జీ ఫోర్స్ వెతుక్కున్నారు, కొత్త రోగాలను తెచ్చుకున్నారు. వాటికి సమాధానం మెడిసిన్ అనుకుంటున్నారు. కానీ ఇన్ని చేస్తున్న మనుషులు ఒక చిన్న చిన్న ప్రశ్నలకు సమాధానాలు వెతకలేక పోతున్నారు. ఒక మనిషి ఇంటి ముందు రెండు బైకులు ఉంటాయి, అవి రెండిటినీ తప్పించుకొని పోతాడు కానీ ఆ రెండిటినీ సమానంగా చేసి ఇంటి ఎదురుగా దారి చేసుకోలేడు. అలాంటి చిన్న చిన్న పనులు చేయకుండా పెద్ద పెద్ద పనులు మాత్రం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వారు చిన్న చిన్న పనులను కూడా ఆపకుండా పూర్తిగా చేస్తారు, అప్పుడే మానవ జీవితం పూర్తి అవుతుంది," అని చెబుతూ ఉంటాడు.

హనుమంతుడు మళ్ళీ మాట్లాడుతూ, "ఇంతకంటే దరిద్రమైంది ఏంటంటే, భూమ్మీద జన్మించిన ప్రతి దేవుడైన, మనిషి అయిన, జీవి అయిన, తన సంతోషంగా ఉండలేడు. తన సంతోషాన్ని తన బిడ్డలకు కానీ కుటుంబానికి కానీ ఇవ్వాలనుకుంటాడు. వారికి తెలియని విషయమంటే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళు కూడా ఇలాగే అనుకుంటారు. వాళ్ళు కూడా డబ్బు సంపాదించాలని రాత్రి పగలు తిండి మానేసి కష్టపడుతూ ఉంటారు. ఇదే జీవిత సత్యం," అని అంటాడు హనుమంతుడు.

సామ్రాట్ పోరాటం, గరుడ ప్రవేశం

సామ్రాట్ వద్ద చూపిస్తారు. సామ్రాట్ మెడలోని నాగశేషు, వాసుకి పాములు రెండు గరుడాసురుడిని అడ్డుకుంటున్నాయి. గరుడాసురుడు పాము యొక్క తలలను పట్టుకుని కొరకడానికి ప్రయత్నిస్తున్నాడు. సామ్రాట్ కూడా దాని మీద దాడి చేస్తున్నాడు కానీ గరుడాసురుడు తన రెక్కలతో తప్పించుకుంటున్నాడు. ప్రతి తగిలే దెబ్బ రెక్కలకు తగులుతూ ఉంటే, రెక్కలు 'దండం' అంటూ శబ్దం చేస్తున్నాయి. అవి ఒక పనిచేస్తున్నాయి గరుడాసురుడికి.

అప్పుడే మరో నెమలీక సత్యయుగ గ్రహం నుంచి మళ్ళీ వెనక్కి వచ్చిన నెమలీక మరోసారి గ్రహం తిరిగింది. మరో టెలిపోర్ట్ ఓపెన్ అయింది. అప్పటికే వాసుకి మరియు నాగశేషుడికి దెబ్బలు తీవ్రంగా తగలడంతో, అప్పుడు అక్కడికి గరుడ పక్షి పెద్ద శబ్దంతో ప్రజలందరినీ బిత్తరపోయేలా, అసురులకు భయం పుట్టేలా గర్జిస్తూ బయటకు వచ్చింది.

గరుడ రాగానే గరుడాసురుడిని అడ్డుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరుగుతుంటే, మరోపక్క హనుమంతుడు, "చూసావా భూమ్మీద ఏం జరుగుతుందో?" అని చూపిస్తున్నాడు. భూమ్మీద ధర్మ ఆత్మా భయంకరమైన రోబోట్లను, ఏఐ ద్వారా ఇతర టెక్నాలజీ కలిగిన వస్తువులను ఉపయోగించి మనుషులను చంపడం మొదలుపెట్టాడు. కొంతమంది కాళ్లు చేతులు విరిగిపోతే, వాళ్ళ బాధల నుంచి నెగటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. అలాగే దాన్ని ఒకచోట భద్రపరుస్తున్నాడు. "చూసావా దీన్ని? కానీ ఆపకుంటే ఈ శకుని మరింత విజృంభిస్తాడు. ఇప్పటికే అసుర లోకం నుంచి సగం మంది వచ్చేశారు. మిగతా వాళ్ళు దిగితే ఇంకా మనం గెలవడం కష్టం కాబట్టి వాళ్ళను ఆపడానికి ఎవరో ఒకరిని పంపించు," అని అనగా, "అయితే రుద్ర, మనం లోకంలో ఉన్న విశ్వాను మరియు వాళ్ళ సైన్యాన్ని పంపిస్తాను," అని అంటాడు.

"వాళ్లతో పాటు ఇంకెవరైనా మన బలమైన వ్యక్తిని పంపించాలి," అని అనగా, అప్పుడే యుద్ధంలో బలంగా పోరాడుతున్న సామ్రాట్‌ను చూస్తాడు. ఎలాగు సామ్రాట్‌కు ధర్మాకు ఇంతకుముందు ఫైట్ జరిగింది కాబట్టి, ఇప్పుడు ఎలాగైనా సామ్రాట్‌ను పంపించాలని సిద్ధం అవుతున్నాడు. అప్పుడే తన శక్తులతో రుద్ర మనుల లోకంలో ఉన్న విశ్వాతో కాంటాక్ట్ అవుతాడు. "విశ్వా, ఇప్పుడు నీకు పని పడింది. ఇంతకుముందు వచ్చావు కదా, అలాగే ఇప్పుడు రా. నీ సైన్యం చాలా ముఖ్యం," అని అంటాడు. "ఇంతసేపు ఎదురుచూస్తున్నాను," అని అంటూ భూలోకం మీద ఒక్కసారిగా ప్రత్యక్షమవుతాడు ఈ యుద్ధానికి ఎప్పుడో సిద్ధమైనట్టుగా. దిగగానే రోబోట్లను అంతం చేయడం మొదలుపెట్టారు ఆ లోక వాసులు.

రుద్ర రూపాంతరం: యుద్ధభూమిలో ఆంజనేయుడు

రుద్రను తన శక్తులతో కాంటాక్ట్ అవుతూ, "సామ్రాట్, నువ్వు ఇక్కడ పని చేయనవసరం లేదు. ఇక్కడ గరుడ వచ్చాడు కాబట్టి, గరుడ ఇక్కడ ఉన్న సైన్యాన్ని మొత్తం చూసుకుంటాడు. నీ బాధ్యత ఇప్పుడు భూమి పైన ఉంది. నీకోసం సైనికులు కూడా ఉన్నారు కాబట్టి యుద్ధానికి సిద్ధం కా!" అని అంటూనే తన శక్తిని అక్కడే ఉండి, ఎక్కడో ఉన్న సామ్రాట్‌ను మాయం చేస్తాడు. అప్పుడే అందరికీ అర్థం అవుతుంది. రుద్ర దిగితే ఆట మరింత రసవంతరంగా మారుతుంది అని అనుకుంటూనే మిగతా వాళ్ళు యుద్ధం చేయడం మొదలుపెట్టారు.

సామ్రాట్ ప్లేస్‌లోకి ఇప్పుడు గరుడ ముందుకు వచ్చాడు. అతను పక్షి రూపం నుంచి మానవుడిగా మారి, తన గరుడ పక్షుల బలమైన రెక్కలతో, రెక్కల కింద చేతులతో, చేతుల్లో ఆయుధంతో, నల్లటి కవచం లాంటిది తన పొట్టు చుట్టూ తగిలించుకొని, కింద కూడా ఒక చిన్న సంచి లాంటి ఈకలతో చేసిన ప్యాంటుగా ధరించాడు. అతను తన చేతులతో యుద్ధం చేస్తున్నాడు. తన ఆయుధమైన ఈక లాంటి ఆయుధం, అది ఖడ్గంగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి తన రెక్కలు, అవి షీల్డ్‌గా ఉపయోగపడతాయి. ఎవరైనా దాడి చేసినప్పుడు అది చుట్టూ చుట్టుకుంటుంది. అప్పుడు ఆ దాడి ఎందుకు పనికి రాకుండా మాయమైపోతుంది. ఇప్పుడు అటుపక్క ఉన్న గరుడాసురుడు కూడా ఒక మానవ శరీరాన్ని ధరించాడు. అతని చుట్టూ నల్లటి కవచం, రెక్కలకు మధ్యలో కొంచెం లైట్‌గా బూడిద రంగు కలర్ మిక్స్ అయి ఉంది. వాళ్ళిద్దరూ చేతులతో కొట్టుకుంటూ తమ సైన్యాలను ఆదేశిస్తూ ఉన్నారు. అంత దూరం ఎగిరి పడుతున్నారు.

దుర్యోధనుడు వర్సెస్ విక్రమ్: కర్ణుడికి మళ్ళీ పరీక్ష

ఇప్పుడు దుర్యోధనుడు దగ్గర చూపిస్తారు. దుర్యోధనుడు మరియు కర్ణుడు (అలియాస్ విక్రమ్) ఒకరినొకరు కొట్టుకుంటూనే ఉన్నారు. శరీరాలపై దెబ్బలతో గాయాలు ఏర్పడ్డాయి కానీ శరీరం మొత్తం ప్రశాంతంగానే ఉంది. ఎందుకంటే వాళ్ళకు కవచాలు ఉన్నాయి కాబట్టి శరీరానికి ఏమీ కావడం లేదు. దుర్యోధనుడు, "రేయ్! ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు నా వైపు వస్తావా, రావా?" అని అంటూ తన చేత్తో కొడుతూ ఉంటే, మరో పక్క ఉన్న విక్రమ్ కూడా, "ఏంట్రా! బెదిరిస్తున్నావా? నువ్వంటే నాకు చాలా గౌరవం మిత్రమా. ప్రశాంతంగా చనిపోవాలని నిర్ణయించుకో!" అని అంటూ ఇతను కూడా దాడి చేశాడు. అలా వాళ్ళిద్దరూ అసలు ఒప్పుకోవడమే లేదు. ఒకరంటే ఒకరికి ప్రాణం కానీ ఏదో శత్రుత్వం, ఎందుకు అర్థం కావడం లేదు.

సామ్రాట్ ధర్మా యుద్ధం: కృష్ణుడి లీల

అదే టైంలో భూమిపైన చూపిస్తారు. అక్కడ సామ్రాట్ ప్రత్యక్షం అవ్వగానే ధర్మా ఆత్మా, "రారా పిల్ల!" అని చిన్నగా వెటకారంగా నవ్వుతూ ఉంటే, "ఎవరు పిల్ల?" అని సామ్రాట్ కూడా నవ్వుతూ, "చూసుకుందాం రా! అప్పుడు భయపడి పారిపోయావే, ఇప్పుడు ఎలా వచ్చావు? అంత ధైర్యమా? మళ్ళీ పరశురాముడు రాడని నమ్మకమా?" అని అంటున్నాడు. "ఇప్పుడు ఎవరు వచ్చినా ఏమీ చేయలేరు. చేయాల్సిన పని మాత్రం చేసేసా. ఒకే ఒక్క బటన్ నొక్కగానే ఈ ప్రపంచాలు అనేవి ఎక్కడున్నాయో, ఎలా ఉన్నాయో కూడా మనుషులకు తెలియకుండా అయిపోతుంది," అని క్రూరంగా గట్టిగా నవ్వుతున్నాడు ధర్మా ఆత్మా. "నువ్వు అది చేసినప్పుడు చూద్దాం రా!" అని అంటూ పరిగెడుతున్నాడు సామ్రాట్.

తన చేతిలో పరిగెడుతూనే చిన్నగా రౌండ్‌గా తిప్పగానే ఒక ఫ్లూట్ లాంటిది బయటికి వస్తుంది. ఫ్లూట్‌ను ఊదుతూ సౌండ్ చేస్తూ పరిగెడుతున్నాడు. అతను ఒక్కసారిగా గాల్లో ఎగిరాడు. గాల్లో తేలుతున్నాడు. ఫ్లూట్ వాయిద్యానికి, దాంట్లో నుంచి వస్తున్న "శ్రీకృష్ణ హరికృష్ణ" అని పాట మ్యూజిక్ ఆ జంతువులన్నిటిని మైమరిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఆవులు, మేకలు, నెమళ్లు వంటివి నాట్యం చేస్తున్నట్టుగా సామ్రాట్ చుట్టూ తిరుగుతున్నాయి. ఒక్కసారిగా ఆపిన సామ్రాట్, "యుద్ధానికి సిద్ధమా?" అని అంటూ ఫ్లూట్ ఆపేసాడు. ఆవులు కేకలేస్తున్నాయి, ఎద్దులు రంకలు వేస్తున్నాయి. రోబోట్లు చుట్టూ ఒక్కసారిగా యుద్ధానికి సిద్ధమయ్యాయి. అవి గుద్దుతూ ఉంటే ఒక్కో రోబోట్, ఏఐ పరికరాలు మొత్తం చెల్లాచెదురైపోతున్నాయి. "ఎందుకు ఆ కృష్ణుడు వీటిని ఇంత ప్రేమగా చూసుకునేది?" అనుకున్న టైంలోనే, ప్రజలు కూడా "ఆ జంతువులే అంత చేసినప్పుడు మనుషులం మనమెంత చేయాలి!" అని అంటూ వాళ్ళు కూడా తమ చేతుల్లో పారలు, గడ్డపారలు, ఇంకా విరిగిపోయిన మిషన్ యొక్క అవయవాలు పట్టుకొని తమ ఎదురుగా వస్తున్న రోబోట్లను, ఎలక్ట్రానిక్ వస్తువులను అన్నింటిని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు.

అదే సమయంలో విశ్వ సైన్యం ముందుకు వస్తూ ఉండగా, మనుషులు చేస్తున్న విధ్వంసం చూసి, "వీళ్ళు మనకంటే క్రూరంగా ఉన్నారే! దొరికిన దాన్ని పిండి పిండి చేస్తున్నారు. ఇక మనం అవసరమా రుద్ర గాడికి ఇంకేం పని లేదు," అని అనుకుంటూ తిట్టుకుంటూ పక్కకు వెళ్లి కూర్చుంటారు. "మానవులతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలిసిందా ధర్మ?" అని అంటాడు. "అవును నాకు తెలుసు కదా. నేను కూడా మానవుడినే కదా ఒకప్పుడు! నాకంటే క్రూరుడు ఎవరైనా ఉంటారా?" అని అంటున్నాడు ధర్మా ఆత్మా.

శకుని చిరాకు: అంతం కాదు... ఆరంభం!

ఇప్పుడు శకుని దగ్గర చూపిస్తారు. చిరాకుగా, "ఈ ధర్మ గాడు, ఈ నా అల్లుడు దుర్యోధనుడు ఏం జరుగుతుంది? యుద్ధం చేసి చంపేయంట్రా అంటే ఆటలు ఆడుకుంటున్నారు. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. మధ్యలో ఈ గరుడ అవసరమా? ఈ శ్రీకృష్ణుడికి మొత్తం ఎక్కడున్నా అసురులందరినీ దించాలని ఇంత కోరిక ఎందుకు? అయినా అతడు ఇప్పటికే చనిపోయి ఉండాలి. అతని శరీరం కనిపించకుండా, శరీరం లేని మనసు ఏం చేస్తుంది?" అని క్రూరంగా నవ్వుకుంటూ యుద్ధాన్ని తిలకిస్తున్నాడు.

ఇప్పుడు గరుడ, గరుడాసురుడు ఇద్దరు కొట్టుకుంటున్న ప్లేస్‌లో చూపిస్తే, ఇప్పుడు గరుడ మాట్లాడుతూ, "ఏంట్రా అసురా! నువ్వు నా రూపం మరియు నెగటివ్ ఎనర్జీ కలిగినంత మాత్రాన నాతో గెలవగలను అనుకుంటున్నావా? చూసావా మూషికాసురుడు ఎంత దయనీయ పరిస్థితిలో చనిపోయాడు? నీకు అంతకంటే భయంకరమైన శిక్ష విధించి, భయంకరమైన చావును ప్రసాదిస్తా. తర్వాత నీ సైన్యం మొత్తం మా శ్రీకృష్ణుడి చెంతకు చేరాల్సిందే. ఎందుకంటే అధిపతి లేని సైన్యం ఎందుకు పనికిరాని గోళం ఒకటే," అని అంటూ మరోసారి ఢీకొట్టడం మొదలుపెట్టారు. ఇద్దరికీ ఒకే శక్తులు కానీ నెగటివ్ మరియు పాజిటివ్ అన్నట్టుగా, దైవశక్తులు దుష్ట శక్తులుగా ఇద్దరు ఒకే రకంగా పోటీ పడుతున్నారు. ఒకరినొకరు ఒకేసారి గుద్దుకుంటున్నారు, ఒకరిని ఒకరు ఒకేసారి పొడుచుకుంటున్నారు. ఇద్దరికీ చెమటలు పట్టినా యుద్ధాన్ని ఆపడం లేదు.

అలాగే ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది. విక్రమ్ మరియు దుర్యోధనుడు ఇద్దరు ఒకరినొకరు కొట్టుకుంటూ ఉండగా, ఇక దుర్యోధనుడికి అలసట వచ్చిందో లేదా కోపం పెరిగిందో అర్థం కావడం లేదు కానీ, తన దుష్టశక్తులను వదలడం మొదలుపెట్టాడు. అతను నెగటివ్ ఎనర్జీగా కలిసిపోయాడు. విక్రమ్ అయోమయంగా చూస్తూ ఉంటే, ఒకసారి వెనకాల నుంచి, మరోసారి ముందల నుంచి ఎగిరెగిరి కొడుతున్నాడు. అతని దెబ్బలకు విక్రమ్‌కు నీరసంగా అనిపిస్తుంది. "ఇక నావల్ల కాదు," అని అంటూ తన బాణాన్ని తీసే ఓపిక కూడా లేకుండా తప్పించుకుంటూ ఉన్నాడు. అటూ ఇటూ దొర్లుతూ ఉండగా, చివరిగా ఒక్క వేటుతో చంపేయాలని దుర్యోధనుడు గాల్లోకి ఎగిరాడు. ఒక విచిత్రమైన అరుపుతో గట్టిగా తన చేతిలో ఉన్న గదను విక్రమ్ వైపు విసిరాడు.

విక్రమ్ పునరుత్తేజం: శక్తిపీఠం, రుద్ర రూపాంతరం

కానీ గద కింద పడుతుంది కానీ, అంతకంటే ముందు దుర్యోధనుడిని పట్టుకున్న విక్రమ్ తన కళ్ళు. "ఏంట్రా! నేను ఓడిపోతాను అనుకున్నావా? నాకు ఎనీ టైం రీఛార్జిబుల్ బ్యాటరీ ఉందిరా!" అని అంటూ తన కళ్ళు మూసుకోగానే ఐదు రకాల స్తంభాల మధ్యలో శక్తిపీఠం ఉంది. అతను కళ్ళు మూసుకొని కింద పడిపోయిన టైంలో అతను శక్తిపీఠం దగ్గరికి వెళ్ళాడు. అది ధ్యానం చేస్తే ఎనర్జీని ఇస్తూనే ఉంటుంది. రెండు నిమిషాలు చేయగానే అతనికి సగం శక్తి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఆ శక్తితోనే పసుపు రంగు కళ్ళతో వింతగా చూస్తూ, ఇప్పుడు దుర్యోధనుడు ఎక్కడున్నాడో చూడ్డానికి సిద్ధమవుతూ, గద పడిన సమయంలో ఆ గదను విసిరిన చెయ్యని పట్టుకొని నేలకేసి 'దవేలు' అని కొట్టాడు. "అంతం కాదు!" అని అంటూ మరోసారి ఆకాశంలోకి విసిరి మరొకసారి భూమికేసి కొట్టాడు. అదే టైంలో మరో చరిత్ర దుర్యోధనుడు విక్రమ్ చెయ్యని పట్టుకొని, "నేను కూడా అంతేరా!" అని అంటూ, "అంతమవుతానేమో చూద్దామా? ఎవరు స్పీడ్‌గా అంతమవుతారు?" అని గిరగిరా తిరుగుతూ భూమి లోపలికి స్వరంగం చేసుకుంటున్నారు. వాళ్ళ దూకుడు అస్సలు ఆగడం లేదు.

మరోపక్క గరుడాసురుడు, గరుడ ఇద్దరు కొట్టుకుంటూ, "ఏంట్రా! నేను అంతమవుతాను అన్నావు? నేను అంతం కాదు, ఆరంభం మాత్రమే!" అంటూ గరుడ కూడా మళ్ళీ కొట్టడం మొదలుపెట్టాడు. ధర్మాత్మా, మరి సామ్రాట్ ఇద్దరు మళ్ళీ ఒకరిని ఒకరు కొట్టుకుంటూ ఆకాశంలో గిరగిరా తిరుగుతూ భూమి ఆకాశాలను బద్దలు చేస్తున్నారు. "రేయ్ ధర్మ, నీ అంతం నేను కచ్చితంగా చూస్తా. ఈసారి పరశురాముడు కాదు, నేనే నిన్ను ఒక పంచ్‌తో చంపేస్తా!" అని అంటూ ఉంటే, ధర్మా ఆత్మా కూడా ఇలా అంటుంది, "నన్ను ఇంతకుముందు అంతం చేశారు. నేను అంతం కాదు!" అని అంటూ మళ్ళీ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు.

ఇదంతా చూస్తున్నారు రుద్ర. "ఏంటి హనుమ! ప్రతి ఒక్కరూ 'అంతం కాదు', 'అంతం కాదు' అంటున్నారు. కానీ ఈ 'అంతం కాదు' అనే దాంట్లోనే అంతం ఉంది. ఇది అసలు అర్థం కావడం లేదు," అని అంటూ ఉంటే, గట్టిగా నవ్వుతున్నారు గణేశుడు మరియు కార్తికేయ.

హనుమంతుడు, "చూడు రుద్ర, నువ్వు మాత్రం 'నేను అంతం కాదు' మాత్రం అనకు. ఇప్పుడు అందరూ అంతమైపోతారు," అని అంటున్నాడు. అసలు ఏం జరుగుతుందని అనుకుంటున్న టైంలోనే, మరోపక్క గాల్లోకి ఎగిరిన ధర్మా ఆత్మా, "ఓకే, ఇప్పుడు అంతానికి సిద్ధమా? నేను మాత్రం అంతం కాదు!" అని మరోసారి గట్టిగా నవ్వుతూ తన గుండెల మీద ఉన్న చిన్న బటన్ లాంటిది నొక్కగానే అతను లాస్ట్ అయిపోతాడు. "ఇది నా అంతమే కాని, నాతోపాటు భూమి కూడా అంతమైపోతుంది," అని అంటూ మాయమైపోతాడు. అదే క్షణం ఐదు రకాల భూములు చూపిస్తారు. ఆకాశంలో పైకి, చాలా పైకి స్పేస్‌లోకి తీసుకువెళ్ళిన తర్వాత ఇలా కనిపిస్తుంది: ఐదు రకాల భూములు ప్లేసులు మారుతున్నాయి. ఐదు రకాల భూములు రౌండ్‌గా తిరుగుతున్నాయి. ఒకదాని వెనకాల ఒకటి కాకుండా ఒకదాని పక్కన ఒకటి చేరుకొని రౌండ్‌గా ఉన్నాయి. మధ్యలో ఏదో కనిపిస్తుంది కానీ ఏంటనేది కనిపించడం లేదు. అది చూడ్డానికి బ్లాక్ పవర్ నిండిన ఒక చిన్న బాల్ లా కనిపిస్తుంది కానీ భూమి అంత సైజుకి ఎలా మారిందో ఎవరికి అర్థం కావడం లేదు.

అదే టైంలో నెగటివ్ ఎనర్జీతో నిండిన శకుని ఇలా అంటున్నాడు, గట్టిగా నవ్వుతూ, "అంతం కాదురా!" గొంతు ప్రతిధ్వనిస్తూ ఉండగా, అతని చుట్టూ భయంకరమైన నెగటివ్ ఎనర్జీ చేరుకోవడం మొదలుపెట్టింది. "అంతే! ఇదే! ఇదే నాకు కావాల్సింది. ధర్మాత్మ, నిన్ను నేను మళ్ళీ బ్రతికిస్తాను," అని అంటూ శపథం చేస్తూ గాల్లోకి ఎగురుతాడు.

హనుమంతుడి ప్రబోధం, రుద్ర రూపాంతరం

శకుని మరింత భయంకరంగా నవ్వుతూ, "చూస్తావా?" అని అంటూ నెగటివ్ ఎనర్జీ పూర్తిగా పరవడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరూ నెగటివ్ శక్తి కింద పడిన వ్యక్తులు అందరూ తమ భావాలను పోగొట్టుకోవడం మానేసి, తమ బాధలను ఎక్కువగా గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. ఇది మానసికంగా, శారీరకంగా పూర్తిగా అదుపుతప్పిన మనుషులను ప్రయత్నిస్తుంది. ప్రతి మనిషి, భావ్యేయులు, అసురుడు అనే తేడా లేదు. శకుని ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ అతనికి తొక్కి పడుతున్నారు.

ఇక్కడ ప్రస్తుతానికి అదే టైంలో అంటే హనుమంతుడు, కార్తికేయ, గణేశుడు అందరూ నవ్వుతున్న టైంలోనే గణేశుడు, "అన్నయ్య, రెండు సార్లు అయిపోయింది. ఇంకొకసారి కానీ కనిపించింది అంటే మనమందరం వెళ్ళిపోవాలి," అని అనుకుంటున్న టైంలోనే ఒక నెమలీక మళ్ళీ అక్కడ ప్రత్యక్షమవుతుంది. అది అటూ ఇటూ ఊగుతూ తాను అక్కడే మాయమైపోతుంది అని అంటూ ఉంటే, "అసలు ఏం జరుగుతుంది? నాకు అర్థం కావడం లేదు. ఇంతమందిని వదిలేసి నేను వెళ్లడం, నేను పిరికివాడు అనిపించుకోవడం నాకు నచ్చదు. నువ్వే చెప్పావు కదా, ప్రతి మనిషి ఒకరికి సహాయం చేయాలి, లేదా చేయలేకపోతే వదిలేసేయాలి అని. నేను చేయగలను. నీ శక్తి మీద నాకు నమ్మకం ఉంది. నేను నీ వారసుడిని అని నేను నిరూపించుకునేదాకా నాకు మనశ్శాంతి ఉండదు," అని అంటూ ఉండగా, హనుమంతుడు ఇలా అంటాడు: "నువ్వు నిజంగా నా భక్తుడివి! నా పేరును స్మరిస్తూ, శ్రీరాముని ఆరాధిస్తూ, నీ నమ్మకంతో ముందుకు అడుగు వెయ్యి. కచ్చితంగా గెలుస్తావు. అంతకంటే ముందు నీ స్నేహితులందరికీ ఒకచోట చేర్చుకో. అప్పుడే మీరు ఇంకా ప్రశాంతంగా బ్రతకగలరు." అని అంటూ అక్కడున్న దైవశక్తులు ఒక్కసారిగా మాయమైపోతాయి. అంతకుముందు పరశురాముడు, అశ్వద్ధామ అక్కడి నుంచి మాయమైపోతారు.

రుద్ర మహారూపం: 26 డైమండ్స్ ఆర్మర్

ఇప్పుడు రుద్ర పైకి ఆకాశంలోకి ఎగురుతాడు. అతను కళ్ళు మూసుకుంటాడు. తన బట్టలు 'ఫటాఫట్' మంటూ చినిగిపోతాయి. కండలు తిరిగిన దేహం మొదలవుతుంది. ఆ తోక తనకు డ్రెస్‌లా మారి చిన్నగా కవర్ చేస్తూ అదొక మామూలు డ్రెస్‌గా మారిపోతుంది. అలాగే తోక బయటకు వస్తూ ఆకాశంలో అటూ ఇటూ ఊగుతూ ఉంది. అతడు పూర్తిగా హనుమంతుడు రూపంలోకి మారాడు.

అదే టైంలో ఎక్కడి నుంచో సామ్రాట్ అక్కడికి వస్తాడు. రుద్ర పక్కకు వచ్చి నిలబడతాడు. తను కూడా తన చుట్టూ గోల్డ్ కలర్ ఆర్మర్ మరియు చేతిలో ఫ్లూట్‌తో సిద్ధమవుతున్నాడు. "ఇప్పుడు ఇక్కడే ఉండు సామ్రాట్. నేను చెప్పినప్పుడు రా!" అని అంటూ ఆకాశంలోకి ఎగురుతాడు. ఎక్కడి నుంచో 26 డైమండ్లు గాల్లో దూసుకుంటూ వస్తున్నాయి. అగ్ని, నిప్పు, గాలి, భూమి అంటూ తేడా లేకుండా 26 డైమండ్లు పెద్దవి కొట్టుకుంటూ వస్తున్నాయి. అది చూడ్డానికి ఎలా ఉందంటే ఒక్కో గ్రహాన్ని బద్దలు కొట్టిన ఆయుధంలా కనిపిస్తున్నాయి.

పాట మొదలవుతుంది: శ్రీ ఆంజనేయం భజే వజ్రకాయం...

శ్రీ

ఈ పాట మొదలయ్యేసరికి ఒక్కో స్టెప్పు దాటుతూ ఆకాశంలో కదులుతున్నాడు. అతను ఆకాశంలో ఎగిరిన తర్వాత ఐరన్ మ్యాన్‌ మాదిరి ఒక్కో డైమండ్ వచ్చి ఒక్కో భాగానికి తగులుతూ విచిత్రమైన రంగులు అతనికి ఆర్మర్‌లా తయారవుతుంది. ప్రతి కండకు అవి సురక్షితమైన, బలమైన ఆయుధాలుగా మారాయి. బలమైన కవచంలా తయారవుతున్నాయి.రుద్ర విజృంభణ: దివ్యకాంతితో అసుర సంహారం

రుద్ర గాల్లో ఎగురుతూ, గాల్లోనే స్టెప్పులు వేస్తూ, ఒక్కో అడుగు ఆకాశంలోకి వేస్తూ స్పీడ్‌గా పరిగెడుతున్నాడు. అతని చుట్టూ హనుమంతుడి రక్షణగా వేగం కనిపిస్తుంది. తన నోటి నుండి "జై శ్రీరామ్! జై హనుమాన్!" అనే పదాలు గట్టిగా వినిపిస్తుండగా, మరోసారి వెనకాల మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. అదే టైంలో రుద్రమనుల లోకం నుంచి వచ్చిన విశ్వా సైన్యం అక్కడ ప్రత్యక్షమవుతారు. నెగటివ్ ఎనర్జీని తరిమికొట్టడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. వాళ్లు కూడా అక్కడ చిక్కుకునే పరిస్థితిలో ఉండగా, ఏవో బుల్లెట్ల లాంటివి స్పీడ్‌గా వస్తున్నాయి. అవి కాంతి తరంగాలలో ఉన్న ఎక్కడి నుంచి వస్తున్నాయని చూడగా, సామ్రాట్ యొక్క తల్లిదండ్రుల సైన్యం అవి. వాళ్లు ఒక్కోచోట ఒక్కో మిర్రర్ పెట్టి, ఎక్కడో సత్యయుగ గ్రహంలో జరుగుతున్న పూజలోని వెలుగును ఇక్కడ ప్రసరిస్తున్నారు.

ఈ పాట అయిపోయిన వెంటనే ఇక రుద్ర రుద్రం మొదలుపెట్టాడు. అతని చేతి నుంచి వస్తున్న భయంకరమైన వెలుగులు అతని ముందున్న చీకటిని తొలగిస్తున్నాయి. అతని నోటి నుంచి వస్తున్న నామస్మరణలు అసురశక్తిని బెదరగొడుతున్నాయి. అతను ఒక్కో అడుగు వేస్తుండగా, అతని అడుగు కింద పడిన ప్రతి ఒక్కరు అంతమైపోయే అంత బలంగా కనిపిస్తున్నాయి. తన ఎదురుగా వస్తున్న రాక్షసుడిని తన చేతులతో పట్టుకొని విసిరి కొడుతూ ఉంటే, తన వెలుగు పడిన ప్రతిచోట ఆ నెగటివ్ శక్తి తగ్గిపోతూ వస్తుంది.

సామ్రాట్ పశ్చాత్తాపం: ధర్మా ఆత్మ విధ్వంసం

అలా అక్కడ కట్ చేస్తే, "అమ్మ! అబ్బా!" అంటున్న శబ్దాలు. రుద్ర ఇలా అడుగుతాడు, "సామ్రాట్! ఏం చేశావురా? అసలు భూమికి ఏం జరుగుతుంది? ఈ నెగటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది?" అని అంటూ ఉంటే, సామ్రాట్ తల దించుకొని, "అంతా నేనే చేశాను. వాడితో పెట్టుకోకుండా ఉండి ఉన్నా, నువ్వు చేసే పనికి లాభం ఉండేది. కానీ ఇప్పుడు ఎటువంటి లాభం లేదు," అని అంటూ ఉంటాడు సామ్రాట్.