Read Not the End - 62 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • అంతం కాదు - 62

    శకుని విజృంభణ: మానసిక దాడినెగటివ్ ఎనర్జీ ప్రవేశించే కొద్దీ శ...

  • ఆత్మ ధైర్యం

    ఓపెన్ చేస్తే... అర్ధరాత్రి పండు వెన్నెల టైంలో... అలా నిండు చ...

  • నిజం - 2

    2వ - భాగంఆ సంఘటన జరిగిన తరువాత ఆ రోజు సురేష్ ఇంట్లొ అందరు బా...

  • సరయు

    అర్జున్ అతని కార్ లో, తన భార్య (అనిత) మరియు అయదు సంవత్సరాల క...

  • అంతం కాదు - 61

    సత్యయుగ గ్రహం: కల్కి కోసం శిక్షణఇక అక్కడ కట్ చేస్తే, మళ్ళీ హ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 62

శకుని విజృంభణ: మానసిక దాడి

నెగటివ్ ఎనర్జీ ప్రవేశించే కొద్దీ శకునిలోని పవర్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అతను గట్టిగా అరుస్తూ, "ఇప్పుడు నా తడాఖా చూపిస్తా!" అంటూ ఆ శక్తిని యుద్ధభూమిలోకి పంపిస్తాడు. పంపించిన వెంటనే అక్కడున్న మానవుల శక్తులు అణిచివేయడం మొదలుపెడతాయి. అర్జున్ యొక్క ఫీనిక్స్ మాయం అయిపోతుంది, పిల్లి కూడా మాయమైపోతుంది, గబ్బిలం మాయమైపోతుంది. ఎందుకంటే అతనికి ఎటువంటి ఎమోషన్స్ లేకపోవడం వల్ల అవి మాయమైపోతాయి. అర్జున్‌కి ఎప్పుడైతే ఎమోషన్స్ కలుగుతాయో అప్పుడు మాత్రమే అవి బయటకు వస్తాయి.

ఆ వెంటనే శివ దగ్గరికి నెగటివ్ ఎనర్జీ చేరుకుంటుంది. శివ మెడ పైన ఉన్న డైమండ్‌కు ఆ నెగటివ్ ఎనర్జీ అడ్డంగా ఒక షీల్డ్‌లా ఏర్పడింది. బయటి నుంచి శక్తి అందదు కాబట్టి, లోపలి శక్తి అంతమయ్యేంతవరకు వేచి చూసిన శకుని ఒక్కసారిగా తన దాడి చేశాడు. వెంటనే ఆ మణి యొక్క శక్తి – డైమండ్ యొక్క ఎనర్జీ – మొత్తం అయిపోవడంతో అతను కూడా రెండు కాళ్ళ మీద ఒంగిపోతాడు. అదే టైంలో శకుని మేనల్లుడు దుర్యోధనుడి పునరాగమనం జరుగుతుంది, అతని శరీరం రెడీ అయింది.

శకుని ధర్మకు మరో మెసేజ్ పంపిస్తాడు: "నీ అల్లుడు దుర్యోధనుడి శరీరం రెడీ అయింది. అతన్ని ఇప్పుడు నేను అక్కడికి పంపిస్తున్నాను." "ఎస్, ఇది నా విజయం! నాకు కావాల్సింది మెల్లమెల్లగా ఒక్కొక్కటి వస్తుంది," అని అనుకుంటున్న సమయంలోనే, మరోపక్క విక్రమార్క సైన్యం ఒక్కసారిగా అక్కడి నుంచి మాయమైపోతుంది. ఎందుకని చూడగా, టెలిపోర్ట్ దగ్గర ఏదో జరుగుతుంది. అక్కడ మహాసురుడు టెలిపోర్ట్ దగ్గర నెగటివ్ ఎనర్జీతో కాపు కాసి, వచ్చిన వాళ్ళను వచ్చినట్టే వెనక్కి పంపించడం మొదలుపెట్టాడు. విక్రమార్కకు ఎటువంటి శక్తి లేదు కాబట్టి యమపురిలోని సైన్యంతో యుద్ధం చేస్తున్నాడు. కానీ ఒక్కసారిగా అది అక్కడ కట్ అవుతుంది. అంతటితో విక్రమార్క చుట్టూ ఒక నెగటివ్ ఎనర్జీ చుట్టుకొని, అతని బాధలను, కష్టాలను వెలికితీస్తూ అతన్ని మానసికంగా కృంగదీసి, అతన్ని కూడా పడిపోయేలా చేస్తుంది.

మూషికాసురుడి దాడి, గణేశుడి ప్రవేశం

మరోసారి శకుని సైగ చేయగా, మూషికాసురుడి సైన్యం రణరంగంలోకి దిగుతుంది. అవి భూమిని తవ్వుతూ, ఎవరిని ఎక్కడ బంధించాలో అందరికీ మ్యాపింగ్ చేస్తున్నాయి. అదే టైంలో కైలాసంలో మూషిక రాజు నిలబడి భూలోకంలో జరుగుతున్నది చూస్తున్నాడు. అదే టైంలో ఎక్కడి నుంచి గణేశుడు ప్రత్యక్షమవుతాడు. "ఏంటి మూషిక, అలా చూస్తున్నావ్?" అని అడుగుతాడు గణేశుడు. "చూడండి ప్రభు, నా శత్రువు మూషికాసురుడు పాల్గొంటున్నాడు. ఇప్పుడు మనం వెళ్ళకపోతే మన మీద అందరికీ చిన్నచూపు వస్తుందేమో," అని అంటుంది. "అదేంటి అది? కార్తికేయ అన్నయ్య వెళ్ళాడు కదా, మళ్ళీ మనం అవసరమా?" అని అంటాడు గణేశుడు. "లేదు గణేశా, నేను కూడా వెళ్ళాలి. ఆ అసురుడిని నేను మాత్రమే అంతం చేయాలి," అని పట్టుబడుతుంది మూషిక.

గణేశుడు నవ్వుతూ, "బాబాయ్ చెప్పాడు కదా మనం కూడా వెళ్ళాలి అని. అలాగే వెళ్దాం," అని అంటాడు. "బాబాయా?" అని అడగ్గా, "వాసుదేవుడు," అని మూషిక చెప్పగా, "అవునా! అయితే మనం కచ్చితంగా వెళ్ళాల్సిందే," అని అంటూ ఒక పెద్ద మూషిక రూపంలో మారి, తన మీద గణేశుడిని కూర్చోబెట్టుకుంటుంది. దూకుకుంటూ ఒక్కసారిగా మాయం అవుతుంది.

విక్రమార్కకు సవాల్: మహాసురుడు & మూషికాసురుడు

అదే టైంలో అసలు వెతుకుతున్నది విక్రమార్కుని కాబట్టి, విక్రమార్క ఎప్పుడైతే కింద పడిపోతాడో, మహాసురుడు బయలుదేరుతాడు. అతని చుట్టూ నెగటివ్ ఎనర్జీ పొంగుతూ ఉండగా, విక్రమార్క దగ్గరికి చేరుకుంటాడు. తన వెనకాలే మూషికాసురుడి సైన్యం వస్తుంది. ఆ సైన్యం విక్రమార్క చుట్టూ ఒక గుంత లాంటిది తవ్వి అతన్ని భూమిలోకి లాగేస్తుంది.

భూమి లోపల మహాసురుడు, "ఏంట్రా నువ్వు నా కొడుకుని చంపుతావా? ఎంత ధైర్యం ఉంటే?" అని అంటాడు. విక్రమార్క తగ్గకుండా, "చంపడం తప్పె ఎందుకు అవుతుంది? వాడు భూలోకాన్ని నాశనం చేయాలనుకున్నాడు. అలాంటప్పుడు నేనెందుకు వదులుతాను? చంపేశా! నువ్వేం చేస్తావ్? చంపుతావా? చంపు!" అని అంటాడు. "నీకు ఎంత పొగరు! అసురుల రాజు మీదనే నువ్వింత పెద్ద కుట్ర చేస్తావా? నిన్ను అసలు వదలను. మూషికసుర, ఇతడికి నీ శక్తి ఏంటో చూపించు! నువ్వు కొరికితే ఎలా ఉంటుందో, నర నరాల్లో విషం ఎలా పాకుతుందో చూపించు!" అని అంటూ విక్రమార్క దగ్గరికి పిలుస్తాడు.

విక్రమార్క తన జీవితం ఎలాగో ముగిసిపోతుంది అని అర్థమైనట్టుగా, తన చేతిలో ఉన్న ఖడ్గాన్ని తిప్పుతూ యుద్ధానికి సిద్ధమవుతాడు. చుట్టూ ఎలుకలు వచ్చి అతన్ని చుట్టుముట్టి భయపెడుతూ, అటుపక్క ఇటుపక్క కొరుకుతూ అతనిని విసిగించడం మొదలు పెట్టాయి. అదే క్షణంలో పెద్ద మూషికాసురుడు అక్కడికి వస్తాడు. వెంటనే అతను విక్రమార్క మీదకు దాడి చేయడానికి వస్తూ ఉండగా, పైనుంచి ఏదో వస్తున్నట్లుగా మూషికాసురుడు మీద ఏదో పడుతుంది. ఆ దెబ్బకు కిలోమీటర్ దూరంలో పడతాడు మూషికాసురుడు.

యుగపురుషుల ఆశ్చర్యం, కార్తికేయ వివరణ

ఎప్పుడైతే మూషిక మహారాజు అక్కడ దిగుతాడో, కిలోమీటర్ దూరంలో పడిన మూషికాసురుడు గట్టిగా గర్జిస్తాడు. "ఏంటి, నువ్వు మళ్ళీ వచ్చావా? మన యుద్ధం మళ్ళీ మొదలు పెడదామా?" అని అంటూ వాళ్ళిద్దరూ ఒకపక్కకి వెళ్ళిపోతారు. గణేశుడు ఎలుక మీద నుంచి మాయమై తన అన్న కార్తికేయ ముందు నిలబడి, "ఏంటి అన్నయ్య, నువ్వు ఉండగానే ఇదంతా జరిగిందా?" అని అంటాడు.

వెంటనే హనుమంతుడు మాట్లాడుతూ, "మీ అన్నయ్య వచ్చాక ఇంత దారుణంగా జరిగింది. వాసుదేవుడు ఏం చెప్పాడో ఇతను ఏం చేశాడో తెలియదు కానీ, మీ అన్నయ్య వచ్చిన వెంటనే ఏదో తెలిసినట్టుగా ఏదో చేసి, దాదాపు అందరినీ పనబెట్టేశాడు," అని చిరాగ్గా అంటాడు. అశ్వద్ధామ కూడా "అవును, అసలు ఏం చేశావు నువ్వు?" అని అంటాడు. గణేశుడు కూడా మాట్లాడుతూ, "ఏం జరిగింది అన్నయ్య?" అని అంటాడు.

వాసుదేవుడి లీల: కల్కి జనన రహస్యం

ఇక కార్తికేయ చెప్పడం మొదలుపెట్టాడు. "ఆయన చెప్పింది నేను చేశాను," అని చెప్పడం మొదలు పెట్టాడు. అప్పుడు కట్ చేస్తే, పాలసముద్రం మీద, పున్నమి చంద్రుడిలా మెరిసిపోతున్న నాగు శేషు మీద పడుకొని విశ్రాంతి తీసుకుంటున్నాడు వాసుదేవుడు అయిన శ్రీకృష్ణుడు.

అదే సమయంలో రుక్మిణి వస్తుంది. "దేవా వాసుదేవా! ఏంటయ్యా నీ లీలలు? భూమ్మీద నీ రాక కోసం ఐదు మంది ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వు ఎలా? ఐదు మందిలో ఒకరికి పుడతావా? ఐదు మందికి పుడతావా? నీకు ఇప్పుడు పెద్ద చిక్కు ప్రశ్న వచ్చింది!" అని చిన్నగా నవ్వుతూ వస్తుంది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, "శరీరం ఉంటే ఒకరికి పుట్టాలి. శరీరం లేకపోతే ఐదు మందికి పుట్టవచ్చు," అని అనడంతో, అర్థం కాని రుక్మిణి, "ఏమంటున్నారు? నాకు అర్థం కావడం లేదు," అని అడుగుతుంది. "చెప్తా. కార్తికేయ వచ్చాడా?" అని అడుగుతాడు శ్రీకృష్ణుడు. వెంటనే రుక్మిణి, "ఇంకా రాలేదు, వస్తాడేమో. అయినా ఎందుకు పిలుస్తున్నారు అతన్ని?" అని అంటుంది. "అతన్ని అంటావేంటి? మనం కూడా వాడు బిడ్డలాంటి వాడే కదా?" అవును అన్నట్టు తల ఊపుతూ ఉండగానే, ఇంతలో కార్తికేయ వస్తాడు. తన వాహనమైన నెమలితో సహా.

నెమలిని చూడగానే శ్రీకృష్ణుడు ఒక చిన్న చిటికె వేయగానే ఒక నెమలీక పుడుతుంది. అది డైరెక్ట్‌గా వెళ్లి నెమలిలో ఒకలా కలిసిపోతుంది. "ఏంటి పెద్దనాన్న, ఇలా పిలిచారు?" అని అడుగుతూ ఉండగా, "ఏమీ లేదు. నువ్వు యుద్ధ భూమిలోకి చేరుకోవాలి. నేను చెప్పినట్టు మాత్రమే చెయ్యి," అని అంటూ, "ఇప్పుడు నేను నీ నెమలిలో నా నెమలీకను ఉంచాను. అది ఏం జరగాలో, ఎలా జరగాలో మొత్తం చూసుకుంటుంది. నువ్వు కేవలం అక్కడికి వెళ్లి ప్రశాంతంగా కూర్చో, యుద్ధం చేయకు," అని అంటాడు. "మరి యుద్ధం చేయనప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి పెద్దనాన్న?" అని అడగ్గా, "అది రహస్యం. కానీ నేను చెప్పిన సమయానికి నువ్వు, అలాగే గణేశుడు, మూషికం – మీరెవరూ ఉండకండి," అని చెప్పడంతో కార్తికేయ ఆశ్చర్యపోతాడు.

సరే అని సీన్ కట్ చేస్తే, ఇప్పుడు హనుమంతుడు, గణేశుడు, అశ్వద్ధామ, పరశురాముడు – అందరూ ఆ కథ విని, "ఇప్పుడేం చేశాడు?" అని అడగ్గా, "ఏం లేదు. కృష్ణుడికి వచ్చిన మాయలు ఈ ప్రపంచాన్ని మార్చగలవు. అలాంటిది ఒక చిన్న మాయ చేశాడు. దానివల్ల కృష్ణుడు ఐదు మందిలో ఒకరికి పుట్టకుండా ఐదు మందికి సమానంగా పుడతాడు. ఐదు మందిలోని శక్తులు భూమ్మీద ప్రకృతి శక్తులతో సమానం. ఆడవాళ్ళు అంటేనే ప్రకృతి శక్తులకు సమానమైన శక్తి కలిగిన వాళ్ళు. అలాంటిది ఐదు మందిలో పుట్టి ఐదు రకాల శక్తులను పొందుతాడు. అందువల్ల అతనికి శరీరం ఉండదు. ఇప్పుడు శకుని చేసిన దానివల్ల, 5 మందిలో ఉన్న కృష్ణుడి అంశలు శరీరం లేని ఒక నిగూఢమైన, శక్తివంతమైన కాంతిగా ఉండటం వల్ల అతను అందరికీ పుట్టినట్టుగా అర్థమవుతుంది. ఐదు శక్తులను సమానంగా తీసుకోగలరు," అని చెప్పి కార్తికేయ ఆపేస్తాడు.