మణి పగిలిపోవడం, లింగయ్యకు కొత్త జన్మ
చివరి క్షణంలో విక్రమ్ విసిరి గోడకేసి కొట్టాడు. మణి గుర్తుకు వస్తుంది. వెంటనే ఒక ఖడ్గం లాంటిది సృష్టించి ఆ ఖడ్గంలో డైమండ్ లాంటి మణిని ఇన్సెట్ చేయగానే, ఆ కత్తికి మరింత శక్తి వచ్చినట్టుగా ఆ గదతో ఈ కత్తి పోరాడుతూ ఉంది. అలా మరోసారి మరో గంట సేపు పోరాడారు. ఇదంతా వినడానికి చాలా బోర్ కొడుతున్నా, మీ అస్త్రం పెద్దపెద్దగా యుద్ధం చేసుకుంటున్నారు. చివరి క్షణంలో రావణ్ "రావణాసుర అస్త్రం!" అని అంటూ పైకి ఎగిరి గదను నల్లటి కత్తిలా మార్చి ఒక్క వేటు ఆ కత్తి మీద వేశాడు. వెంటనే ఆ కత్తి రెండు ముక్కలవుతుంది. దానిలోని మణి ఒక్కసారిగా ఎగిరి ఎక్కడో పడుతుంది. ఇక విక్రమ్‌కు కూడా ఓపిక లేక అలా పడిపోయాడు.
విక్రమ్‌ను పట్టుకొని తల పట్టుకొని, గొంతుకేసి చెయ్యి పట్టి పైకి లేపి "ఏంట్రా? ఇప్పుడన్నా ఇస్తావా, ఇవ్వవా?" అంటాడు. "నువ్వు కొట్టిన దెబ్బకు అది ఎక్కడ ఎగిరి పడింది. అంతా నీ వల్లే!" అని అంటూ రావణ్‌ను ఎగిరి తంతాడు. రావణ్ కూడా ఎగిరి దూరంగా పడతాడు. ఇలా వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉన్న సమయంలో దూరం నుంచి ఒక ముసలి వ్యక్తి గొంతు వినిపిస్తుంది. "రావణ్!" అని "నీ అంత తెలివి తక్కువ వ్యక్తిని నేను చూడలేదు. ఆల్మోస్ట్ రావణాసురుడి శక్తిని పొందిన నువ్వు ఇంత తెలివి తక్కువగా ఫైటింగ్ లోకి దిగుతావని, ఆ ఎర్రోడు విక్రమ్ కంటే ఇంత దారుణంగా ప్రయత్నిస్తావని నేను అసలు అనుకోలేదు. ఇప్పుడు ఆ డైమండ్ వేరే చోటుకు వెళ్ళింది. పద అక్కడికి వెళ్దాం" అని అంటాడు. "ఏంట్రా విక్రమ్? నువ్వే చేసావా? ఏం చేశావు?" అని మళ్ళీ కొట్లాడుతూ ఉంటే "చెప్పేది అర్థం కాలేదా? మీ ఇద్దరూ రండి, ఈ భూమి ఇప్పుడే అంతమవుతుంది" అని అంటున్నాడు ముసలి వ్యక్తి లింగయ్య.
జాన్ కుట్ర, భవిష్యత్ యుద్ధం
ఇద్దరూ వెళ్లి పక్కన కూర్చుంటారు. లింగయ్య ముందు కూర్చుని ఇద్దరూ "ఒకరిని మించిన ఒకరు వెర్రి గొర్రెల్లా ఉన్నారు కదరా" అని అంటాడు. వెంటనే విక్రమ్ "మీరే కదా ఆ జన్మలో నాకు శక్తులు నేర్పించింది? మీ కంటే పెద్ద" అని అంటూ ఉండగా, "మీరు చాలా మంచి వాళ్ళు అందుకే అప్పుడు నేను దొంగతనం చేస్తున్న కనుక్కోలేకపోయారు" అని గట్టిగా నవ్వుతాడు. "దొంగల్ని పట్టుకోవడం నా పని కాదు కదా? ఇప్పుడు వస్తున్నాడు చూడు నీ మొగుడు" అని అంటూ చిన్నగా నవ్వుతాడు లింగయ్య. వెనక్కి తిరిగి చూడగా కార్లు అప్పుడే దిగుతున్నాడు ఆదిత్య పోలీస్ ఆఫీసర్. "సారీ, క్షమించు. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు అన్నదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇప్పుడు దొంగల ఒడిలో ఉన్నానని నాకు అర్థం అయ్యేలా చేసినందుకు థాంక్స్. ఆ గుండుగాన్ని గట్టిగా కొట్టి పట్టి కొడితే నిజమంతా చెప్పాడు" అని అన్నాడు. "ఓ గుండుగా, ఎంత పెద్ద తప్పు చేశావురా? సారీ, అది పెద్ద తప్పు కాదు. వాళ్ళు అక్కడ ఎన్ని ప్రాణాలు తీశారు మీకు తెలియదు. ఆ జాన్ గాడు ఎంత పాపిష్టోడు మీకు తెలియదు" అని అంటున్నాడు విక్రమ్. "అది నాకు ఇప్పుడే తెలిసింది. వాడు ఇప్పుడు పెద్ద ప్రయోగం చేయబోతున్నాడు. ఏదో లాకెట్ లాంటిది తయారుచేసి తన మిషన్‌లో అప్‌డేట్ చేసి ఏదో చేయబోతున్నాడు. అది భూమి అంతమా లేదా టెలిపోర్టాలో అర్థం కావడం లేదు" అని అంటాడు. "మీరు వెళ్లకపోతే ఇప్పుడు అదే జరుగుతుంది" అని అనడంతో లింగయ్య, విక్రమ్, రావణ్ అందరూ ఆదిత్య బండిలో ఎక్కి బయలుదేరుతారు.
ఘటోత్కజ షిప్, ట్విస్ట్!
కొద్దిసేపటికి ఒక పెద్ద అపార్ట్‌మెంట్ దగ్గరికి వచ్చారు. చుట్టూ సీసీ కెమెరాలతో, కొంతమంది యోధులతో, గన్నులు పట్టుకొని ఫుల్ డ్రెస్ ధరించి ఉన్న వాళ్ళు ఎవరైనా వస్తే చంపేస్తాం అన్నట్టుగా చుట్టూ తిరుగుతూ ఉన్నారు. "ఏంట్రా, ఇంత పెద్ద బందోబస్తు పెట్టారు?" అని అంటూ ఉంటే "మనకెంత సింపుల్ కదా?" అని రావణ్ తన శక్తిని ఉపయోగిస్తూ యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆదిత్య పోలీస్ ఆఫీసర్ కాబట్టి చాలా సింపుల్‌గా ఫస్ట్ వెళ్లిపోయాడు. జాన్ ఎక్కడున్నాడో వెతుక్కుంటూ వెళ్తున్నాడు. ఇక మళ్ళీ విక్రమ్ మరియు రావణ్ కలిసి పోరాటం మొదలుపెట్టారు. అక్కడున్న యోధుల్ని అతలాకుతలం చేసి, రక్తపాతం సృష్టించి ముందుకు వెళుతున్నారు. చివరిగా వాళ్ళు వెళ్లేసరికి సక్సెస్ అయినట్టుగా ఆనందంతో మరోసారి ఓపెన్ చేస్తాడు. ఒక పెద్ద లాంచర్ మీద ఒక పెద్ద టెలిపోర్టర్ లాంటిది ఒక విమానం సైజులో ఉంది. అది గాల్లోకి ఎగురుతూ ఉండగా రావణ్ తన శక్తిని ఉపయోగించి కొన్ని చేయించిన సృష్టించి దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అందులో ఉన్న నాగమణి పవర్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండడంతో అది ఆగలేక పోతుంది. కానీ ఇదంతా చూస్తూ ఉన్న లింగయ్య నిరాశ పడిపోతాడు.
"నేను మా నాన్నకి ఇచ్చిన మాట మర్చిపోయాను" అని అంటూ గుహ దగ్గరికి వెళ్లి రెండు కాళ్ళ మీద కూర్చుని "నన్ను క్షమించు నాన్న, నీ మాటలు నేను అర్థం చేసుకొని ఎప్పుడు నిజాయితీగా ఉండి అప్పుడే నాగమణి కాపాడి ఉంటే ఇప్పుడు ఇంత ప్రమాదం వచ్చేది కాదు. ఇది నా వల్లే" అని అంటాడు. చిన్నప్పుడు లింగయ్య అన్నాడు, "దీన్ని పోగొట్టుకోవడం అంటే మన ప్రాణం పోయినట్టే. నువ్వు వెతికి కనిపెట్టగలిగితేనే మన వంశంలో నువ్వు ఉంటావు, లేదంటే మీకు నాకు సంబంధం లేదు" అని. ఆకాశంలోకి ఎగురుతున్న విమానాన్ని ఆపడానికి ఎంత ప్రయత్నించినా కానీ ఆగడం లేదు. విక్రమ్ కూడా ప్రయత్నించాడు. దాని పైకి ఎక్కి గట్టిగా బద్దలు కొట్టడం మొదలు పెట్టాడు. ఆ దెబ్బకు మణి సగం విరిగి కింద పడిపోయింది. మిగతా సగం విమానంతోనే వెళుతూ ఉండగా, విరిగిన సగం యొక్క శక్తి అక్కడే గుహలో పడి ఉన్న లింగయ్యకు వేడి ద్వారా తెలిసి ఆ శక్తి కొంచంగా లింగయ్య శరీరంలోకి చేరుతుంది. అది పగిలిపోవడం వల్ల వచ్చిన శక్తి ఆ వెంటనే అతని ముసలితనం ఎగిరిపోయింది. కండలు తిరిగిన యోధుడిలా మారిపోయాడు అతను. మెల్లగా కన్నీళ్లు వేడిగా మారుతూ కింద బండను కరిగించడం మొదలుపెట్టాయి. "నాన్న, నీ కోరిక నా చావుతో నెరవేరేలా ఉంది" అని చిన్నగా నవ్వుతూ బయటికి వచ్చి రెండు కాళ్ళను ఒక్కసారిగా భూమికి గట్టిగా అదిమి పైకి ఎగురుతాడు. తన మెడలో ఉన్న ఎప్పుడూ ధరించిన టవల్ తనకు ఒక సూపర్ మ్యాన్‌లా తన వెనకాల ఎగరడం మొదలుపెట్టింది. తను గాల్లోకి ఎగురుతూ "విక్రమ్, రావణ్! ఆగిపోండి" అని అంటాడు. రావణ్ కిందికి దిగిపోతాడు కానీ విక్రమ్ పెద్దగా పట్టించుకోకుండా తన శక్తినంత ఉపయోగిస్తూ గట్టిగా కొడుతున్నాడు. విక్రమ్ కలలో కనిపిస్తుంది. అలా కట్ చేస్తే ఆకాశంలోకి దాని కంటే వేగంగా ముందుకు వెళుతున్నాడు. విమానం ముందు వెళ్లిపోతున్నాడు. దాని ముందుకు వెళ్లి అంతకంటే దూరంగా వెళ్లి స్పీడ్‌గా వస్తూ "నాన్న, నీ కోరిక నేను నెరవేరుస్తాను" అని అంటూ ఒక్కసారిగా ఢీ కొడతాడు. అంతే ఒక బ్లాస్ట్. లింగయ్య చనిపోతాడు. అది అంతమైపోతుంది. కానీ జాన్ తప్పించుకుంటాడు సగం మణితో.
అప్పుడే ఒక పెద్ద ట్విస్ట్! రుద్రాక్ష రుద్రమణి స్టోరీలో ఘటోత్కజుడి యొక్క షిప్ బయలుదేరుతూ ఉండగా, ఇక్కడ చిన్న టైం ట్రావెల్ జరిగి, అక్కడెక్కడో జరిగిన చిన్న ముక్క సంఘటన యొక్క మొక్క టెలిపోర్టేషన్ వల్ల విక్రమ్, విక్రమార్క ఉన్న ప్రదేశంలోకి వెళుతుంది. అది ఎప్పుడు తెలుసా? జాన్ వాళ్ళ నాన్న వెతుకుతున్న సమయానికి వెళ్లి జాన్ వాళ్ళ నాన్న చనిపోతాడు. ఈ మొత్తానికి కారణం జాన్. కానీ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు జాన్. "ఇదెక్కడి విడ్డూరం!" అని కదంతా వింటూ ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోతారు. "ఆ తర్వాత ఏం జరిగింది విక్రమ్?" అని అంటారు. "ఏముంది? మేమందరం చాలా బాధపడ్డాం. చనిపోయాడు అని అనుకున్నా. కానీ అప్పుడే యముడు లింగయ్యను ఆత్మను బంధించి మరోసారి మీ గ్రహంలో పుట్టించాడు" అని చెప్పాడు. "అక్కడ తర్వాత ఏమైంది?" "తర్వాత ఏముంది? మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. దానికి ముందు చంపేయాలనుకున్నాను. అప్పుడే ఆ సగం మణితో అతను తప్పించుకొని టైం ట్రావెల్ చేసి మళ్ళీ మీ లోకంలోకి వచ్చాడు. అందుకే అంతకుముందు అసురులతో కలిసి ఎలా ప్లాన్ చేశాడో అర్థం కావడం లేదు. కానీ అప్పుడు అర్జున్ నన్ను చూశాడు. మకరఅసురూ డిని చంపేశాను. తర్వాత వచ్చి పెళ్లి చేసుకున్నాను" అని కథ ముగించాడు.