Read Not the end - 48 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • అంతం కాదు - 48

    అంటే మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు కాదు, చెప్తా. పదండి," అంటూ అ...

  • అంతం కాదు - 47

    ఇప్పుడు విక్రమ్ వీర కుందేలు అందరూ ఒక చోట నిలబడి ఉంటారు ఇప్పు...

  • అంతం కాదు - 46

    ఏంటి అలా ఏడుస్తున్న అంత చిన్నదానికి మరి నాకేం జరిగిందో తెలుస...

  • అంతం కాదు - 45

    అతను అటు ఇటు చూస్తూ ఉన్నంత లేవవే నీళ్లు ఆవిరిపోయి చెట్లు చని...

  • Siri 2.0

    ముఖ్యమంత్రి (కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి):"హ్మ్… నేను తొందరగ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 48

అంటే మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు కాదు, చెప్తా. పదండి," అంటూ అర్జున్ ముందుకు వెళ్ళాడు. కానీ అతను చాలా కష్టపడుతున్నాడు. అతని భుజంపై ఉన్న పిల్లి కూడా ఆ నెగటివ్ ఎనర్జీని పీల్చుకుంటున్నట్లు తల అర్జున్ మెడ వైపు తిప్పుకుంటూ ఉంది. ఈ పిల్లి ఎప్పుడు వచ్చింది అంటే, వాళ్ళు ఆ గ్రహం మీద ల్యాండ్ అయినప్పుడే తనలో నుంచి బయటికి వచ్చింది.

"ఇది ఎప్పుడు వచ్చిందిరా?" అని విక్రమ్, వీర అడిగారు.

"వచ్చిందిలే! మీకెందుకు?" అర్జున్ చిరాకుగా అన్నాడు.

అర్జున్ మెడ మీద నుంచి ఆ పిల్లి దిగడం లేదు. అందరూ అతన్ని గమనించారు కానీ అది ఎందుకు, ఎలా వచ్చిందో ఎవరికి అర్థం కాలేదు.

ప్రదేశం: మనోహర గ్రహం లోపల, టవర్ సమీపంలో

సరే అని అలా ముందుకు వెళుతూ ఉండగా, దూరంగా ఒక టవర్ కనబడింది. ఆ టవర్‌లో ఏదో వెలుగుతోంది. చుట్టూ వందల కొలది రాక్షస సేన ఉంది. ఆ రాక్షసులలో ఒకణ్ణి చూస్తూ మరొకడు, "బీజాసురా! ఇలాంటి పనులు చేస్తూనే మీ అన్న అమరజీవి అయిన మకరధ్వజుడు అలాగే చనిపోయాడు. ఇప్పుడు నువ్వు వెళ్తావా?" అని అన్నాడు.

దానికి బీజాసురుడు సమాధానమిచ్చాడు, "చూడు! అది ఎక్కడో జరిగింది. ఇది ఎక్కడ జరుగుతోంది? ప్రతిసారి ఎవడో వచ్చి మనల్ని చంపుతాడంటే ఎలా నమ్ముతారు? మకరధ్వజుడు ఏదో తప్పు చేసి, తప్పించుకోవడానికి ఏదో చేస్తూ చనిపోయి ఉంటాడు. నేను ఇప్పుడు ఏం తప్పు చేయలేదు కదా?"

"ఎందుకు బీజాసురా! ఇప్పుడు కూడా నువ్వు చనిపోతావేమో అని భయంగా ఉంది," మరొకడు అన్నాడు.

వెంటనే బీజాసురుడు ఒక్కసారిగా ముందుకు వచ్చి, ఆ మాట అన్నవాడి చెయ్యి పట్టుకొని గట్టిగా నేలకేసి కొడుతూ, "ఎన్నిసార్లు చెప్పాలి అపశకునం పలకవద్దని!" అని అంటూ అతన్ని ముక్కలు ముక్కలు చేసి పక్కనున్న అసురులకు విసిరేశాడు. వాళ్ళు ఆశగా వాడిని తిన్నారు.

ప్రదేశం: బంధించబడిన ప్రజలు ఉన్న గది

అదంతా చూస్తున్న విక్రమ్ భయంతో, "ఓరి దేవుడా! ఓరి నాయనా! ఏంట్రా వీళ్ళు ఇలా ఉన్నారు? వాళ్ళ మనుషులను వాళ్ళే చంపుకొని తింటున్నారు! నావల్ల కాదురా, నేను వెళ్ళిపోతా!" అని అంటూ వెనక్కి తిరిగి చూశాడు. వెనకాల ఎవరూ కనిపించలేదు. "ఓరి నీ పాసుగల్లారా! నన్ను అడ్డంగా ముంచి వెళ్ళిపోయారు కదరా! నేను ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి? మామ చందమామా!" అని అంటూ చుట్టూ తిరుగుతూ ఒక గదిలోకి వెళ్ళాడు.

అక్కడ ప్రజలందరూ బంధించబడి ఉన్నారు. "ఇక్కడ ఇంతమంది ప్రజలు ఉన్నారు! మా వాళ్ళు ఎక్కడున్నారు? అసలు ఏం జరిగిందిరా?" అని విక్రమ్ టెన్షన్ పడటం మొదలుపెట్టాడు.

అక్కడ కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి ఉన్నారు. ఒక చిన్న పిల్ల మరొకరి దగ్గరకు వచ్చి, "ఇప్పుడు ఎవరిని తీసుకువెళ్తారు? మా అమ్మను తీసుకువెళ్ళారు. మా అక్క ఒక్కతే ఉంది, వదిలేయండి!" అని అంది. ఆ దెబ్బకు విక్రమ్ నరాలు జివ్వుమన్నాయి.

"అసలు ఏం జరుగుతోందిరా అమ్మా? నేను అటువంటి వాడిని కాదు. ఎందుకు భయపడుతున్నారు?" అని అడుగుతుంటే, ఒక ముసలి వ్యక్తి, "ఏం చేయమంటావయ్యా? మా గ్రహానికి ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇదే ఫస్ట్ టైం జరిగింది. మేమందరం ఎంతో హ్యాపీగా ఉన్న టైంలో ఒక రాక్షసుడు వచ్చాడు. వాడికి ఏదో కావాలన్నాడు, కానీ మా రాజు ఒప్పుకోలేదు. మా రాజును చంపి, దీన్ని తన సొంతం చేసుకున్నాడు. చివరికి ప్రజలందరినీ బంధించాడు. ఒక్కో రోజు ఒక్క అమ్మాయిని తీసుకువెళ్ళి నాశనం చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కొంతమంది మాత్రమే మిగిలారు. ఇలా అయితే మాకు రక్షించేవాళ్ళు లేరా? మమ్మల్ని కాపాడేవారు లేరా?" అని బాధపడుతూ అన్నాడు.

ప్రదేశం: గది లోపల

"ఏంటి? ఇంత పెద్ద తప్పు చేశారా వీళ్ళు? అసలు కొడుకుల్లాంటి వాళ్ళను చంపుకొని తింటున్నారే!" అని మనుషుల గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అప్పుడే, ఒక పిల్లి పులిలా కనిపిస్తున్న ఒక పెద్ద పిల్లి, అది విక్రమ్ చుట్టూ తిరుగుతూ ఉంది. బయటికి రమ్మన్నట్టు సైగ చేస్తుంది. విక్రమ్ ఉన్న ప్రజలందరూ ఆ పిల్లిని చూసి భయపడుతున్నారు.

"ఇది ఎక్కడో చూసినట్టుంది. ఇది అర్జున్‌గాడి దగ్గర ఉన్న పిల్లి కదా? ఏంది ఇలా మారింది? కొంపతీసి ఇది కూడా బుజ్జమ్మ కాదు కదా?" అని అనుకుంటూ విక్రమ్ దాని వెనకాల వెళ్ళాడు. అది ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టు కనిపించింది.

"ఒసేయ్! ఆగవే!" అని తోక పట్టుకొని లాగుతుంటే, అది విసిరికొట్టింది. విక్రమ్ వెళ్లి వాళ్ళ మధ్యలో పడ్డాడు. వాళ్ళందరూ క్రూరంగా చూస్తున్నారు. ఇక చేసేదేమీ లేక, తను కూడా ఫైట్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఒక్క జంప్‌లో వాళ్ళందరినీ దాటుకొని మధ్యలోకి వచ్చి పడింది ఆ పెద్ద పులిలా కనిపిస్తున్న పిల్లి.ప్రదేశం: మనోహర గ్రహం, బందీలున్న గది దగ్గర

ఆ పులిపిల్ల మరియు విక్రమ్ ఒక్కసారిగా దాడి చేయడానికి సిద్ధమయ్యారు. పులిపిల్ల తన పదునైన గోర్లతో రాక్షసులను చీల్చడం మొదలుపెట్టింది. విక్రమ్ తన చేతిని పైకెత్తి, కొన్ని సూదుల లాంటి అస్త్రాలను సృష్టించి గాలిలో నిలబెట్టాడు. "రండిరా చూసుకుందాం! ఇక నువ్వా నేనా! వన్‌ వన్ ఫసక్!" అంటూ వాటిని రాక్షసుల మీదికి విసిరాడు. అవి విసిరిన ప్రతిసారీ విక్రమ్ నుండి మరో కొత్త పిన్ లాంటి అస్త్రం బయటికి వస్తూనే ఉన్నాయి. అలా ఎంతసేపు చేసినా ఇది సరిపోదు అనిపిస్తుంది.

అంతలో, బీజాసురుడు లోపలికి దిగాడు. బరిలో అతను దిగగానే రాక్షస సేన మొత్తం దూరంగా వెళ్ళిపోయింది, బీజాసురుడు ముందు నిలబడ్డాడు. బీజాసురుడిని చూసిన విక్రమ్, "ఎవడ్రా నువ్వు? ఇంత వింతగా ఉన్నావ్? మనిషివేనా?" అని అడిగాడు.

"నేను మనిషిని కాదురా తుచ్ఛ మానవుడా! అసురుడిని! బీజాసురుడిని!" అని అన్నాడు బీజాసురుడు.

"బీజాసురుడా! నేనెవరో తెలుసా? విక్రమ్! నా పేరు చెప్పగానే పంచభూతాలు నాలో కలిసిపోతాయి!" అన్నాడు విక్రమ్.

'విక్రమ్' అని శబ్దం గిర్రున తిరుగుతూ ఉండగా, బీజాసురుడి కళ్ళల్లో భయం ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. వాడు మాత్రం, "ఇదేనా విక్రమ్ అంటే?" అని బెదిరిపోతూ అడిగాడు. విక్రమ్ మరింత ధైర్యంగా, "అవునురా! నేనే!" అన్నాడు.

"అవునా? అయ్యో! ఇదేంటి? మళ్ళీ ఇక్కడికి వచ్చాడా?" అని అనుకుంటున్నాడు బీజాసురుడు. ఇప్పటిదాకా ఎంత క్రూరంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఇంత భయపడటం చూసి అక్కడ ఉన్న రాక్షసులు బెదిరిపోతున్నారు. టవర్ పైన కూర్చున్న బుజ్జమ్మ, వీర, అర్జున్ అందరూ, "ఏంట్రా ఇలా జరుగుతోంది? చంపేస్తాడు అనుకుంటే ఏంటి? భయపడుతున్నాడు?" అని అనుకుంటున్నారు.

విక్రమ్ కూడా ఆశ్చర్యపోతూ, "ఏంట్రా ఇలా? అనుకున్నా, నేనేం చేయలేదురా ఇంకా! కనీసం మొదలుపెట్టలేదురా!" అన్నాడు.

"అయ్యో, అయ్యో!" అని బీజాసురుడు భయపడిపోయి, "రేయ్! సైన్యంలో పెద్ద తలకాయలు! మీరు వెంటనే వచ్చి ఇతన్ని చంపేయండి! లేదంటే వీడు మనందరినీ చంపేస్తాడు!" అన్నాడు. ఆ దెబ్బకు సైనికులందరూ గుంపుగా రావడం మొదలుపెట్టారు.

విక్రమ్, "ఒరేయ్! ఆపండ్రా! నేను ఏం చేయలేదురా!" అని అంటున్నాడు.