రాజు అనే ఒక కొడుకు ఉండేవాడు.తనకి కేవలం ఆరు సంవత్సరాలు మాత్రమే ఉంటాయి.
కానీ ఈ చిన్న వయసులో నే తండ్రి అంటే ఎంతో ప్రేమ చూపిస్తాడు .
తన తండ్రిపేరు రాజా ఒక రైతు జీవితం గడుపుతున్న, ఒక చదువుకున్న తెలివయిన వాడు.
తన తండ్రి చేసే పనీని దగ్గరి నుంచి చూసిన రాజు తన తండ్రి లాగానే ఆలోచిస్తాడు
తన తండ్రి లాగానే పనులు చేస్తాడు.
పొల్లాం నుంచి వచ్చిన తండ్రికి రాగానే మంచి నీళ్లు తెచ్చి ఇస్తాడు.
ముఖం, కాళ్ళు కడుక్కొని వచ్చిన తండ్రికి తుడుచుకోవటానికి టవల్ తెచ్చి ఇస్తాడు .
తన తండ్రి చెప్పక ముందే" నాన్న అన్నం తిందామా " అని అడిగి,
అమ్మతో "అమ్మ నాన్నకు నాకు అన్నం వేసుకు రా" అని ,అమ్మకు చెబుతాడు.
చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకున పిల్లలు పెద్దయిన తరువాత వల్ల తంద్రిదంద్రులను పట్టించుకోవడం లేదు .
చిన్నప్పటి నుంచి పిల్లల్ని హాస్టల్స్ లో వేసి వాళ్లకు అమ్మ నాన్న ప్రేమకు మనమే దూరం చేస్తున్నాం .. చిన్నప్పుడు నీ దగ్గర వుండని వాడు.. పెద్యక నిన్ను ఎలా తన దగ్గర వుండానిస్తాడు ..
కాబ్బట్టి తన బాల్యం లో మనం వుందాం తన జీవితం లో మనకి చోటు వుంచుకుందాం..
తండ్రి కొడుకు ప్రేమను చూసి అమ్మ కు కొంచం ఈర్ష కలిగేది . తన కొడుకు నాన్న మీద చూపించే ప్రేమలో కొంచం కూడా తన మీద చూపిస్తలేడు అనీ,
రాజు వాళ్ల తాత ,రాజు వాళ్ళ నాన్న కు 11 సంవత్సరాలు వున్నపుడే చనిపోయాడు .
రాజు వాళ్ళ తాత "వాటర్ ట్యాంక్ "మీద నుంచి కింద పడి కొన్ని రోజులకు ఆరోగ్యం పాడు అయ్యి, చనిపోయాడు .
అప్పటి నుంచి రాజా కు తన తండ్రి ప్రేమ దూరం అయింది.అందుకే కావచ్చు
'దేవుడు మన నుంచి ఒక్కటి తీసుకపోతే ,దానిని ఇంకో రూపం లో తిరిగి ఇస్తాడు.'
అందుకే రాజాకి తండ్రి దూరం అయిన తన కొడుకు రూపంలో తిరిగి తన తండ్రి ని ఇచ్చాడు.
రాజు కూడా తన తండ్రికే తండ్రి అయ్యి కొడుకుల ప్రేమ ను పచ్చుతున్నాడు.
అందుకే మనం జీవితం లో కోరుకున్న వ్యక్తి, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దూరం అయితే కొందరు చనిపోవాలి అనుకుంటారు .
కానీ మన జీవితంలో ఒక్కటి మనం ఎంత కోరుకున్న వుండడం లేదు అంటే అంతకు మించింది మన జీవితం లోకి ఏదో రామోతుంది అని అర్థం.
రాజా జీవితం
రాజా ..తన తండ్రి చనిపోయిన తరువాత చాలా కష్టపడ్డారు .అప్పుడు 8 వ తరగతి చదువుతున్నాడు .
అప్పటి వరకు చదువులో బాగా రాణించిన అతను అప్పటి నుంచి వెనక అడుగు వెయ్యడం మొదలుపెట్టాడు.
తండ్రి చనిపోయిన తరువాత ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యతలు అన్ని తన భుజాల మీద వేసుకుని మోసాడు.
తన తండ్రి ఆరోగ్యం బాగుచేసుకొనే ప్రయత్నం లో అప్పుల ఉచ్చులో చిక్కుకు పోయాడు.
ఒక పక్క అమ్మ కు వ్యవసాయ పనిలో సాయం చేస్తూ ఇంకోపక్క తన పోలీసు అవ్వాలి అనే కల కోసం పోరాటం చేశాడు కానీ
కానీ కుటుంబం అనే బాధ్యతల మధ్యలో తన కల ను నిర్లక్షం చేశాడు.
కానీ జీవితం లో ,తన బాధ్యతల నిర్వతించడం లో విజయం సాధించాడు.
చిన్నప్పుడు తన కుటుంబం పడిన కష్టం అంతా ఇంత కాదు. తిండికి,బట్టకు అన్నిటికీ కడుపును చప్పుకొని జీవించేవారు.
ఒక పూట అన్నం వుంటే ఇంకో పూట కాలి కడుపుతో పడుకున్న రోజులు ఎన్నో వున్నాయి.
అడుకొనే వయసులోని నాగలి కట్టి చెను ,చెలక దున్నడం నేర్చుకున్నాడు.
ఒక చేత పెన్ను ,పేపర్ పట్టుకున్నాడు ఇంకో చేతుతో నాగలి, పారా పట్టుకున్నాడు.
డిగ్రీ పట్టా తీసుకొనే టైం కి భూమి పట్టా తీసుకున్నాడు.
ఎన్ని ఇబ్బందులు వచ్చిన వాటిని అన్నిటిని ఎదురుకొని తన కంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు.
కన్న తండ్రి ఎలాంటి వాడు అయినా పిల్లల దృష్టిలో వాళ్ళు హీరో లాగానే వుంటారు.
పిల్లలు తన తండ్రిని చూసే అన్ని నేర్చుకుంటారు .కానీ తండ్రి తన నుండి దూరం అవుతే వాళ్ళు "లెక్కలు లేని పక్షులు అయిపోతారు" .
వాళ్లకు ఎగారాలి అని వున్న వాళ్లకు ఎగరడం నేర్పించే తండ్రి లేదు.
కొందరు పిల్లల పెదాయక తమ తండ్రులను "అస్సలు నువు నన్ను ఎందుకు కన్నావ్ " అనీ ప్రశ్నిస్తారు? నేను ఏమి అడిగిన ఇవ్వడం లేదు అని నీలదిస్తారు .
కానీ ప్రతి తండ్రి తన పిల్లలకు తన స్థాయిని మించి ఇస్తూనే వుంటాడు .కానీ మనం అవ్వి ఏమీ చూడము .
తండ్రి లేని వాడిని అడగండి ,తండ్రి లేని జీవితం ఎంత భారంగా వుంటుందో.
ఏడాదికి కనీసం ఒక అంగి కూడా కొనడు ..కానీ తన పిల్లలకు ప్రతి పండగకు ఒక కొత్త డ్రెస్ తీసుకుంటాడు.
రాజా తన తండ్రి గురించి ఇలా అన్నాడు,
నాన్న నువ్వు నా ధైర్యం , నువ్వు నా పక్కన లెక్కున నువ్వు చెప్పిన మాట నాకు బలం, నువ్వు ఏమి మా పక్కన లేవు అని బాధ పడకు,నువ్వు లేకున్నా నువ్వు లేని లోటు మన కుటుంబానికి నేను రాన్నివాను.
"నువ్వు చేసే పని నేను చేసి అమ్మకు ఇంటి భాద్యతలు కు తోడుగా " వుంటాను.
"పెళ్లి అయిన అక్కకు నువ్వు చూపించే ప్రేమ నేను చూపిస్తూ ఎప్పుడు జాగర్తగా చూసుకుంటాను".
చదువుకుంటున్న తమ్మునికి ఎలాంటి కష్టం రాకుండా వెనుక వుండి నేను ఏదురుకుంటను. అనీ తండ్రికి మాట ఇచ్చాడు .
ఇన్ని ఇచ్చిన తన కొడుకు ,రాజా కు ...తన తండ్రే కొడుకు రూపం లో రాజు గా పుట్టాడు.