బతుకమ్మ మరియు దసరా హాలిడేస్ ఇవ్వడం తో మా పిల్లలు ఎంతో సంబర పడుతున్నారు .
ఎప్పుడు అమ్మమ్మ ఇంటికి పోవాలి అనీ..
ఈరోజె స్కూల్ లో హాలిడేస్ ఇచ్చారు ..స్కూల్ నుంచి రాగానే " మమ్మీ " అంటూ స్కూల్ బ్యాగ్ పక్కకు పడేసి నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి
ఇలా అంటున్నాడు.
"అమ్మ.. రేపటి నుంచి నాకు స్కూల్ లేదు ..రేపు అమ్మమ్మ ఇంటికి పోవుడే అంటున్నాడు."
దానితో "నేను రేపు కాదు డాడీ 3,4 రోజుల తరువాత పోదాం .."
"ఇప్పుడు పోదాం అంటే నాన్న మనల్ని పంపించాడు.. ఎందుకంటే పండుగ ఇంక చాలా రోజులు వుంది. మళ్ళీ నాకు బావి దగ్గర కూడా పని వుంది ..
ఇప్పుడే పోతే బావి దగ్గర చెలక పని ఎవ్వరూ చేస్తారు డాడీ"
అని అన్నాను .
"లేదూ రేపే పోదాం ఆటు" మారం చేస్తున్నాడు.
నా 6 సంవత్సరాల కొడుకు కు ఎలా నచ్చ చెప్పాలో తెలియలేదు.
"లేదు రేపు పోదాం" అంటూ కింద పడుకుని ఏడుస్తున్నాడు.
తనని బుజ్జగించాలి అనీ
" సరే డాడీ రేపు పోదాం" అని అబద్ధం చెప్పను.
కానీ "నువ్వు అయితే హోమ్ వర్క్ మొత్తం పూర్తి చెయ్యి" అనీ చెప్పను.
కింద పడుకున్న అతను వెంటనే లేచి " సరే మమ్మీ "అని
లేచి కన్లు తుడుచుకొని ఇంట్లోకి బ్యాగ్ తీసుకొని వెళ్లాడు.
అమ్మమ్మ ఇల్లు అంటే పిల్లలకు ఎంత ఇష్టమో వారి అమ్మలకు కూడా అంతే ఇష్టం .
పండగ దగ్గరకి వస్తుంది అని తెలిసిన అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లాలి అని
ప్రతి పెళ్లి అయిన ఆడపిల్లకు అనిపిస్తుంది.
కానీ మన ఇష్టం వచ్చినప్పుడు అమ్మ వాల్ల ఇంటికి వెల్ల లేము కదా.
ఇంట్లో వున్న భర్త పర్మిషన్ తీసుకోవాలి.అత్త మామ పర్మిషన్ తీసుకోవాలి.
వాళ్ళు చెప్పిన పనులు అన్ని పండగ ముందు చేసి పెడుతనే పోనిస్తారు .
ఇంట్లో మనం చేసే పని ఏది పెండింగ్ వున్న పంపించటానికి ఆలోచిస్తారు.
ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే నేను వున్నాను.
పండగకు వారం ముందు పోదాం అనుకుంటే
"మొక్కజొన్న చేను కోయాలి...పత్తి ఏరాలి "అని మా అత్త నేను పోత ఆనక ముందే తానే ముందుగా అంటుంది.
కానీ పిల్లలతో మనం ఏది చెబితే వాళ్ళు అదే నమ్ముతారు .నేను అబద్ధం చెప్పాను అనీ నా బాబు కు తెలిస్తే ..
తను కూడా చిన్నప్పటి నుంచి అబద్ధం చెప్పడం నేర్చుకుంటాడు.
"ప్రతి ఒక్క పిల్లలు వారి తల్లిదండ్రుల నుంచే మంచి చెడులను నేర్చుకుంటారు .కాబట్టి మనo ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు.
కానీ నిజానికి నేను చెప్పింది పూర్తిగా అబద్ధం మాత్రం కాదు.
నిజంగానే మేము రేపు అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నo కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లడం లేదు.
రేపు మాకు ఒక ఫంక్షన్ ఉంది.
అక్కడికి అమ్మా నాన్న కూడా వస్తారు.
అందుకే నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్దామని తనతో చెప్పాను.
రాత్రి నా బాబుకు అన్నం పెట్టేటప్పుడు మనం ఉదయం 3 గంటలకి లేచి రెడీ అయి వెళ్లాలి .
కాబట్టి త్వరగా తిని పడుకో లేకపోతే పొద్దున తీసుకుపోను అని చెప్పాను.
అప్పుడే వాళ్ళ డాడీ బావి దగ్గర నుంచి ఇంటికి వచ్చాడు.
రాగానే పరిగెత్తుకుంటూ వెళ్లి "డాడీ మేము రేపు అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నామంటూ" తనకు చెప్పాడు.
అలా అనగానే వాళ్ళ డాడీ
"సరే ఉదయాన్నే లేచి వెల్దురు కానీ హోంవర్క్ రాసి, తిని పడుకో "అని చెప్పాడు.
ఆప్పుడు తన కలలో కనిపించే ఆనందం అంతా ఇంతా కాదు .
చక చకా బుక్స్ దగ్గరికి వచ్చి బ్యాగు తీసుకుని హోమ్ వర్క్ రాయడం మొదలుపెట్టాడు.
9 గంటల వరకు హోంవర్క్ రాసి బెడ్ పైకి వెళ్లి పడుకున్నాడు.
పక్కకు ఉన్న వాళ్ళ చెల్లి అల్లరి చేస్తుంటే "చెల్లె నువ్వు త్వరగా పండుకోకపోతే నేను రేపు నిన్ను తీసుకుపోను అన్నట్టు "తనకి చెబుతున్నాడు .
అలా అనుకుంటూ కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు.
నేను కూడా త్వరగా ఉదయం లేవాలి కాబట్టి త్వరగానే పడుకున్నాను.
పడుకునే ముందు మూడు గంటలకు అలారం పెట్టుకుని ఫోన్ పక్కకు వినిపించేంత దూరంలో పెట్టాను.
ఇలా పడుకున్నాను లేదో అలా తెల్లారింది అనిపించింది.
ఉదయం 3 గంటలకు ఫోను అలారం మోగుతూనే ఉంది.
అదేంటో కానీ ఏటైనా వెళ్లాలి అనుకుంటే అనుకోకుండానే అనుకున్న టైంకి నిద్రలేస్తాం.
నేను లేచి బయటకు వెళ్లి స్నానాల కోసం హీటర్ తెచ్చి నీళ్లు పెట్టాను.
నా బాంబు దగ్గరికి వచ్చి "డాడీ తెల్లవారింది లే వెళ్లాం అంటూ" లేపాను.
కొంచెం అటు ఇటు కదిలి అలాగే గాడ నిద్రలోకి వెళ్తున్నాడు.
మళ్లీ ఇంకోసారి తట్టి లేపి "నేను అమ్మమ్మ దగ్గరికి వెళ్తున్నాను నువ్వు పడుకో " అనీ,
నేను అనగానే ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు.
బయటికి వెళ్లి ఇద్దరం బ్రష్ వేసుకొని వచ్చాము.
వచ్చి తన చెల్లిని కూడా లేపాము తను మాత్రం అస్సలు లేవడం లేదు.
అటు ఇటు చేసి మా పాపను కూడా నిద్ర లేపి అందరం స్నానాలు చేసి రెడీ అయ్యాము.
వాళ్ల డాడీ మాతో పాటు రావడం లేదు ఎందుకంటే తనకు బావి దగ్గర పని ఉండడంతో మేము ముగ్గురం మాత్రమే వెళ్తున్నాం.
మేము వెళ్లవలసిన బస్సు 4:30 కి బస్ స్టాప్ లో ఉంటుంది . అందుకే మేము 4.15 వరకు స్టాప్ దగ్గరికి వెళ్ళాము.
వీళ్ళ డాడీ మమ్మల్ని బండిమీద బస్టాండ్ వరకు తీసుకొని వెళ్ళాడు.
మేము బస్సు ఎక్కి వరకు అక్కడే ఉండి బస్సు ఎక్కించి తను ఇంటికి వచ్చాడు.
మేము ఫంక్షన్ దగ్గరి కి చేరుకొని సరికి 12 అయ్యింది.
ఇక్కడ జరుగుతున్న ఫంక్షన్ మా నాన్న సైడ్ వాళ్లది.
అమ్మ ,నాన్న ఇంక అక్క కూడా ఫంక్షన్ కి వచ్చారు.
అమ్మమ్మని చూసినప్పుడు నా బాబు కలలో చూసిన సంతోషం నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
అమ్మమ్మను తాతను చూసి దూరం నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లి వాళ్ళ సంఖలో ఎక్కి కూర్చున్నాడు.
"వచ్చావా నాన్న అంటూ" అమ్మ నాన్న అంటూ ఆచెంప ఈచెంప ముద్దులాడుతున్నారు.
నన్ను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఒక వయసు వచ్చాక అమ్మ నాన్నకి కూడా వారి పిల్లల మీద కంటే కూడా మనవలు మనవరాలు మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది.
అక్కడికి మా చుట్టాలందరూ వచ్చారు .వాళ్ళని అందర్నీ చూడడం నాకు చాలా సంతోషం అనిపించింది.
పెళ్లయిన ఆడపిల్లకు తన పుట్టింట్లో ఏదైనా వేడుక జరగడం తనకు ఒక పండగ లాంటిది.
చాలా రోజుల తర్వాత చిన్ననాటి జ్ఞాపకాలు అన్ని గుర్తు చేసుకున్నాము.
అందరం కలిసి ఫంక్షన్ ను చాలా బాగా చేసుకుని ఇంటికి బయలుదేరుతున్నాము.
తను నాతో రాకుండా అమ్మతో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పాడు.
తన సంతోషాన్ని ఎందుకు వద్దని చెప్పాలి అని "సరే వెళ్ళు" అని పంపించాను.
నాకు కూడా వాళ్లతో పాటు వెళ్లాలని ఉంది .కానీ వెళ్ళలేని పరిస్థితి నాది.
నా బాబును అమ్మ వాళ్లతో వదిలేసి ..నా పాపను తీసుకొని మా ఇంటికి బయలుదేరాను.
కానీ తనని విడిచి వెళుతున్నప్పుడు మనసులో ఏదో బాధ.
వాళ్లు ఇటికి ఎలా వెళ్తారో ..తనని జాగ్రత్తగా చూసుకుంటారో లేదో అంటూ మనసులో ఏదో భయం భయంగా అనిపిస్తుంది.
అమ్మ చాలా బాగా చూసుకుంటుంది కానీ నా కన్న పేగు మాత్రం ఆగాడం లేదు.
ఎంతైనా
మన అమ్మ నాన్న మీద కంటే కూడా మనం కన్నపిల్లల మీదనే ప్రేమ ఎక్కువగా ఉంటుందంట.
నాకు ఇంటికి వచ్చే దారిలో మొత్తం తన ఆలోచనలే..
నాతో పాటు తీసుకొని వస్తే బాగుండు అనిపించింది కానీ రెండు రోజుల తర్వాత నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా.
మళ్లీ వెళ్లేటప్పుడు ఒంటరిగా వెళ్ళాలి .
ఇద్దరు పిల్లలు తీసుకొని వెళ్లడం చాలా ఇబ్బందిగా ఉంటుంది అని పంపించాను.
వాళ్లు కూడా క్షేమంగా ఇంటికి చేరారు ఇంటికి వెళ్ళగానే నాకు ఫోన్ చేశాడు.
"మమ్మీ అంటూ "మూతి అంత దగ్గర చేసుకుని అలిగినట్టుగా ముఖం పెట్టుకొని కూర్చున్నాడు.
ఇక్కడ నేనెంత బాధపడుతున్నానో తను కూడా అంతే బాధపడుతున్నాడు అనిపించింది.
తను బాధపడుతున్నాను కాబట్టి నాకు అలా అనిపించిందేమో అనిపించింది .
ఎంతైనా తల్లి ప్రేమ కదా అలానే ఉంటుంది
కానీ నా బాధను అంత దాచుకొని తనకు మాత్రం ధైర్యాన్ని చెప్పాను.
రెండు రోజుల్లో వస్తాను ఇంతలో నువ్వు మంచిగా తిని ఆడుకో అని చెప్పడంతో కొంచెం కుదుట పడ్డాడు.
ఇంతక ముందు కూడా తను నన్ను వదిలి రెండు మూడు సార్లు వెళ్ళాడు.
ఆప్పుడు బాగానే వుండేవాడు.కానీ ఇప్పుడే ఇంటికి వెళ్ళగానే ఏడుస్తున్నాడు.
ఇంతక ముందు తను వెళ్లినపుడు నాకు కూడా ఏం అనిపించేది కాదు .
కానీ ఈరోజు తనని వదలి వస్తుంటే అదో రకం లాంటి బాధ.
కానీ అన్ని బాధల ఇది అనిపించం లేదు.. ఇదో రకం ఫీలింగ్ లా వుంది..
అందుకే అంటారు అని బాధలు ఒకేలా వుండవు అనీ..
నేను నా బాబు కోసం ఎంత బాధ పడుతున్నానో..
నా అమ్మ నాన్న కూడా నాకోసం అంతే బాధ పడుతున్నారు కావచ్చు అనిపించింది.
నాన్న .."రా బిడ్డ ఇప్పుడే పండగకు అని" అడిగాడు.
మీ అల్లుడు వారం రోజుల ముందు పోతావా ..తరువాత పొద్దువ్ కానీ రా ..అన్నాడు.
మళ్ళీ "ఇంటి దగ్గర కొంచం పని వుంది నాన్న "అని చెప్పి వచ్చాను.
నేను కన్నవాళ్ళ కోసం.. నేను అంతా పరితపిస్తున్నానో .. నా కన్న వాళ్ళు నా కోసం అంతే పరితపిస్తుంటారు.
ఎప్పుడెప్పుడు పండగకు పుట్టింటికి వెళ్ళాలి ..అని ప్రతి ఆడపిల్ల అనుకుంటుంది.
కన్న వారి ప్రేమ కోసం వేచి వున్న అందరికీ ఈ కథ అంకితం.
రంగు రంగులా పువ్వులతో బతకుమ్మని పేర్చీ,
పసుపు ముద్దతో గౌరమ్మ నీ చేసి,
మన జీవితాలను చల్లగా చూడమని ఆ గౌరమ్మను వేడుకుందాం...
హ్యాపీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు.