Read Not the End - 34 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • అంతం కాదు - 34

    ఇంకా ఆ ఆత్మ అనుకుంటూ ఈ దేవుళ్ళ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చిం...

  • భ్రమ

    ఏడేళ్ల వేణు తన చిన్న ప్రపంచంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు....

  • అనుకోని పరిచయం

    ️అనుకోని పరిచయం ️మన జీవితంలో కొన్ని పరిచయాలు అనుకోకుండా జరుగ...

  • మీరా (One Love, One Revenge) - 1

    భారత దేశం మొత్తానికి సంచలనంగా మారిన మీరా rape & murder case...

  • అడవిలోని మిత్రత్వం

    ఒక సుందరమైన, శాంతమైన అడవి. అక్కడ ఒక జింక మరియు ఒక కుందేలు ని...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 34

ఇంకా ఆ ఆత్మ అనుకుంటూ ఈ దేవుళ్ళ వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది కానీ నాలాంటి ఒక అసురుడు వల్ల నాకు కనీసం ఇదేనా దక్కింది ఈ ధర్మ నన్ను ఎప్పుడు ఒక బ్రతికున్న మనిషిలా చేసి నా శక్తులతో ఈ ప్రపంచాన్ని ఏలాలో అని అనుకుంటున్నాడు. అతనికి చేయాల్సిన పని గుర్తుకొస్తుంది వెంటనే గట్టిగా అరుస్తాడు కెమెరా బ్యాక్ సైడ్ కి తిరుగుతుంది అతను వెనక్కి తిరిగి మాట్లాడడం మొదలు పెడతాడు అక్కడికి కొంతమంది సైనికులు వచ్చారు వాళ్ళ కళ్ళు నల్లగా చేతి గోర్లు ఎర్రగా శరీరమంతా నలుపు రంగులో విచిత్రంగా కనిపిస్తూ భయానకంగా ఉన్నారు వాళ్ళ నోటి నుంచి కొన్ని రకాల దంతాలు బయటకు వచ్చాయి వాళ్ళు చూడ్డానికి ఒక రాక్షసుడు కనిపిస్తున్నారు వాళ్లకి కూడా శరీరం ఉన్నట్టు అనిపించడం లేదు వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడి నుంచి భైరవ అనే వ్యక్తి వాళ్ళందరిని తోసుకుంటూ ముందుకు వచ్చి మోకాళ్ళ మీద నిలబడి ప్రపంచవ్యాప్తంగా తెలిసిన సత్యం శకుని మరణించాడు కానీ ఆ తెలివితేటలు బుద్ధిబలం ఉన్న వ్యక్తి చనిపోతాడా ఆలోచన శక్తి కలిగిన వ్యక్తి మరణిస్తాడా శరీరం కోల్పోయిన అంతమాత్రాన చనిపోయినట్టు కాదు ఆ ఆలోచన ఎంత పవర్ఫుల్ ఈ ప్రపంచానికి తెలియజేసే రోజు వస్తుంది మై లార్డ్ అని ఒక పెద్ద స్పీచ్ ఇచ్చాడు. భైరవ పరవాలేదు భైరవ నువ్వు అనుకున్నది ఎప్పుడు ఒకసారి నెరవేరుతుంది మనం ఇంకా లాస్ట్ పూజ చేయాలి దీనికోసం ఒక మహిళ కావాలి దాని వివరాలు చెప్తున్న రాసి పెట్టుకో లేదా గుర్తుపెట్టుకో మోహిని నక్షత్రం మే తొమ్మిది రాత్రి ఒకటి నర తన పేరు మోహిని తను ఎక్కడుందో కనుక్కోండి వెంటనే తనని పట్టుకోండి అని చెప్తాడు భైరవ మల్లి రెండు కాళ్ళ మీద నిలబడి తన చేతిని గుండాల మీద అదుముకుంటూ మీరు చెప్పింది కచ్చితంగా చేస్తా మైలాడ్ అంటాడు అప్పుడు దంతాలతో గుర్రం గా ఒక నల్ల పులిలా చేతులంతా అక్కడక్కడ బలంగా మొలచిన వెంట్రుకలు గొర్ల చివర కత్తిలా కనిపిస్తున్న అందరూ దాన్ని చూసి భయపడతారు అతనికి నాలుగడుగులు వెనక్కి వేశారు మిగతా సైనికులు బైరవ ఇంకా మాట్లాడుతూ చూసారా ప్రభువు నా రూపం చూసే వీళ్ళు ఇంతలా భయపడుతున్నారు అసలు మీ రూపాన్ని చూసి పరిస్థితి ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి అని గట్టిగా నవ్వుతూ రెండు అడుగులు వెనక్కి వేసి మరోసారి గుండెలకు చెయ్యిని తగిలించి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు భైరవఇక అక్కడున్న సైనికులందరూ వెళ్లిపోతారు ఇక చిక్కుని ఇలా ఆలోచిస్తున్నాడు ఆరోజు నా జీవితాన్ని మార్చేసింది అంతాన్ని ఆపింది అది ఒక గొప్ప రోజు నా దృష్టిలో నుంచి ఎప్పుడు తప్పించుకోలేదు ఈ ధర్మ చేసిన చిన్న పని వాళ్ళ నాకు కనీసం శరీరం మిగిలింది అని అనుకుంటున్నాడు ఆత్మ ఇంకా బయటికి వెళ్లి ఆ నక్షత్రం మీద ఎవరున్నారని తన కింద పని చేస్తే కొంతమంది చేత మాట్లాడిస్తున్నాడు. వాళ్లు కంప్యూటర్లు ఆ డేట్ ప్రకారం ఎప్పుడు ఎక్కడ ఎవరు పుట్టారని సచ్ చేయగా ఆ టైం విన్న పక్కనే ఉన్న అమ్మాయి బెదిరిపోతుంది ఏంటి వీళ్ళు నా పేరు నా డేట్ టైం అన్నా నక్షత్రం అన్ని తీసుకొని సరిచేస్తున్నారు ఏం జరుగుతుంది వీళ్లకు నేను బొమ్మల మారిపోతున్నానా వీళ్ళకు ఏదైనా మంచి పని జరగడానికి నన్ను ఉపయోగించుకుంటున్నారా ఇది మంచిదా చెడ్డదా అని అనుకుంటే ఆలోచిస్తూ రెండు మూడు అడుగులు వెనక్కి వేయగానే ఒకసారిగా వెనకనుంచి భైరవ వస్తాడు బలంగా ఆ అమ్మాయి మెడ పట్టుకొని నిన్ను వెతకడానికి ఇంత టైం పట్టింది అని అంటుంది చుట్టూ ఉన్న సైంటిస్టులు ఎవరు నువ్వు అమ్మాయిని వదిలిపెట్టు అని అడుగుతారు వాళ్ళందరూ కలిసి భైరవని పట్టుకొని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వెంటనే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఇతనే మనకు ఫోన్ చేసి కమాండ్ ఇచ్చిన అందరూ రెండు అడుగులు వెనక్కి వేస్తారు అతను మోహిని పట్టుకొని లాక్కు వెళ్తూ ఉండగా మోహిని తనకే తెలియకుండా తనకున్న స్పేస్ పవర్ తో ఆ భైరవను రెండు అడుగులు వెనక్కి తోసి స్పేస్ ఎనర్జీతో పరిగెత్తడం మొదలుపెట్టింది చుట్టూ అరుపులు అంటున్నారు ఒకసారి చూస్తాడు అందరూ మౌనం అయిపోతారు అతను పూర్తిగా క్రూరమైన రూపంలోకి రావడం మొదలుపెట్టాడు అతడు బయటికి వచ్చాయి శరీరం వింతగా మారింది గోర్లు పెరిగాయి అందరూ బెదిరిపోయారు నా రూపాన్ని చూసిన మీరు ఎవరు బ్రతికుండ కూడదు అని అంటూ స్పీడ్ గా కదులుతూ తన గోర్లతో అక్కడున్న వాళ్ళందరి పీకలు ఒకేసారి ఒకే టైంలో నరికి పారేశాడు. వాళ్ళందరూ తలలు తెగిపడిపోయాయి అక్కడ రక్తం మడుగులో తేలుతూ ఉంది వాళ్ళ శరీరం మోహిని పరిగెడుతుండగా, ఆమె చుట్టూ నెగటివ్ ఎనర్జీ చీకటి గాలుల్లా అల్లుకుంది. ఆ శక్తి భైరవ చుట్టూ తిరుగుతూ, అతని ఆదేశం కోసం ఎదురుచూస్తోంది. చనిపోయిన వారి బాధ, రక్తపు గాయాలు, తీరని అరుపులు—ఇవన్నీ ఆ నెగటివ్ ఎనర్జీలో కలగలిసిపోయాయి.అప్పుడే భైరవ గట్టిగా అరుస్తూ, "నాకు చీకటి చాలు... ఇప్పుడు నీవే నా ఎనర్జీ!" అని అంటాడు.మోహిని నెమ్మదిగా వెనక్కి నడుస్తూ, తన భయాన్ని ధైర్యంగా మార్చుకుని, "నా పేరు తెలుసు అన్నావు కదా? కానీ నా పేరే 'మాయ'. మోహిని ఒకసారి మాయ చేస్తే జీవితాంతం వదలదు. నీకూ అదే జరగబోతోంది భైరవ!" అని అంటుంది.అతను నవ్వుతూ, ఆ నవ్వులో నిప్పులు రగులుతున్నట్టుగా, "నువ్వు పగ పడితే భయపడతాం అనుకున్నావా? మేము భయపడే మనుషులం కాదు... అసురులం!" అని అంటాడు.ఒక్కసారిగా అతను రెండు అడుగులు ముందుకు వచ్చి, మోహిని మెడ గట్టిగా పట్టుకుంటాడు. అతని గోళ్లు ఆమె మాంసంలోకి దిగుతాయి, ఆమె శ్వాస ఆగిపోతుంది. కానీ అదే సమయంలో...ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక థండర్ బోల్ట్ వచ్చి భైరవ మీద పడుతుంది. వేల వోల్ట్ల శక్తిని అతను ఒక చేతితో పట్టుకుని, "ఇది ప్రయత్నించావా? మీ శక్తి అయిపోయింది మోహిని. ఇప్పుడు నన్ను ఆపలేవు!" అని అంటాడు.అతను మోహిని జుట్టు పట్టుకుని లాగి, భూమికి అడుగు దూరంలోకి ఎత్తుతాడు. ఏడు అడుగుల ఎత్తు ఉన్న భైరవ ముందు ఐదున్నర అడుగుల మోహిని గాలిలో ఉన్మాదంగా వేలాడుతుంది.ఆమెకు తలపోటు వస్తుంది. శరీరం అణిచివేయబడుతోంది. ఆమె కళ్ల నుంచి కన్నీళ్లు కాకుండా, నెగటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. ఆ శక్తి భైరవ లోపలికి వెళ్తుంది.అతని కళ్లు ఒక్కసారిగా ఎరుపు నుంచి నీలం రంగుకు మారుతాయి. ఆ ఒక్క క్షణం అతను తన పట్టు సడలిస్తాడు. మోహిని కళ్లు తిరిగి అతని చేతిలో పడిపోతుంది.