ఒక సుందరమైన, శాంతమైన అడవి. అక్కడ ఒక జింక మరియు ఒక కుందేలు నివసించేవి. అవి ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతి రోజు కలిసి తిరుగుతూ, అడవిలోని అందాలను ఆస్వాదించేవారు. వారి మధ్య ఉన్న బంధం ఎంతో బలమైనది.
ఒక రోజు, వారు ఇద్దరూ కలిసి అడవిలోకి వెళ్లారు. పూలను చూస్తూ, చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటూ, ఎంతో ఆనందంగా గడిపారు. కానీ ఆ రోజు కుందేలు కొంచెం అస్వస్థంగా అనిపించుకుంది. దాని కడుపు నొప్పితో బాధపడుతోంది.
ఒక రోజు, కుందేలు కొంచెం అస్వస్థంగా అనిపించుకుంది. ఆమె కడుపుతో ఉంది. బయటకు వెళ్లడం, ఎక్కువగా తిరగడం ఆమెకు కష్టంగా మారింది.
అప్పుడు జింక ప్రేమతో ఇలా చెప్పింది:
"నీవు కడుపుతో ఉన్నావు మిత్రమా, నీవు విశ్రాంతిగా ఇక్కడే ఉండు. నేను వెళ్లి మన ఇద్దరికీ ఆహారం తెచ్చుకుంటాను."
కుందేలు నవ్వుతూ, "నీ ప్రేమ నన్ను బలంగా ఉంచుతుంది. నీవు నా కోసం చేస్తే చాలు," అని చెప్పింది.
జింక కోసం ఎదురు చూపులు ?
అది వెళ్లింది. కానీ... ఆ రోజు సాయంత్రం అయ్యింది. రాత్రి చీకటి కమ్ముకుంది. కుందేలు తన చిన్నారులను జన్మించింది. ఆమె ఆనందంతో పాటు, ఆందోళనలో కూడా ఉంది. "ఇంకా రాలేదే... ఏమైందో ఏమో?" అని ఆలోచనల్లో పడిపోయింది.
వెళ్లి చూడాలనిపించింది. కానీ... తన పసిపిల్లలు పక్కన ఉన్నారు. వారి కోసం ఆమె ఎక్కడికీ వెళ్లలేకపోయింది. ఆమె మనసు బాధతో నిండిపోయింది. "నా మిత్రురాలు... నన్ను వదిలి ఎక్కడికి పోయిందో?" అని ఆమె కన్నీటి చుక్కలతో ఆకాశాన్ని చూస్తూ ఎదురు చూసింది.
ఆ రాత్రి నిద్ర ఆమెకు రాలేదు. ఆమె హృదయం ఆశతో, భయంతో, ప్రేమతో నిండిపోయింది. జింక తిరిగి వస్తుందా? లేదా... ఆహారం కోసం వెళ్లిన ఆ ప్రయాణమే చివరిదా?
ఆ రాత్రి కుందేలు తన చిన్నారులను ఒడిలోకి తీసుకుని, జింక కోసం ఎదురు చూస్తూ, ఆకాశాన్ని చూస్తూ, మౌనంగా ఉంది. "ఎక్కడివో మిత్రమా... నీవు వెళ్లిన దారి ఎటో నాకు తెలియదు. కానీ నీ ప్రేమ నాకు తెలుసు."
ఆమె మనసు ఆందోళనతో నిండిపోయింది. అయితే... మరుసటి రోజు ఉదయం, అడవి నిశ్శబ్దంగా ఉంది. పక్షులు గానం చేయడం మానేశాయి. చెట్లు కూడా కదలడం లేదు.
కాలం గడిచిన మిత్రత్వం
అడవి మారింది. కొన్ని నెలలు... కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. కుందేలు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. అడవి అంతా తిరుగుతూ, స్వేచ్ఛగా జీవించేవారు. కుందేలు మాత్రం... మౌనంగా, లోపలే ఉండిపోయింది. జింక జాడ ఎక్కడా కనిపించలేదు. "ఏమైందో ఆమెకు... ఎందుకు తిరిగి రాలేదు?" అనే ఆలోచన రోజూ ఆమెను వెంటాడేది.
ఆమె మనసు లోపలే ఒక కోరిక: "ఒకసారి అయినా నా మిత్రురాలిని చూడాలని ఉంది..."
కాలం మరింత ముందుకు సాగింది. ఒక రోజు... ఆమె గుడిసెల ముందు ఓ మృదువైన అడుగుల శబ్దం. ఆమె తలెత్తి చూసింది. జింక... ఆమె ముందుంది. కళ్ళలో కన్నీరు, ముఖంలో చలనం.
కుందేలు అప్పటికే ముసలిదానయ్యింది. ఆరోగ్యం బలహీనమైంది. కళ్ళు మసకబారినవి. జింకను చూసి... "ఎక్కడికి పోయావు మిత్రమా?" "ఏమైపోయావు?" "నీ కోసం తిరిగాను... వెతికాను... కానీ నీ జాడ ఎక్కడా కనిపించలేదు..."
అని ఆమె కన్నీటి చినుకులతో జింకను చూస్తూ ఏడ్చింది. ఆమె స్వరం లోపల నిండిన బాధ, ప్రేమ, మరియు నిరీక్షణను ప్రతిబింబించింది.
జింక మౌనంగా ఆమె దగ్గరకు వచ్చింది. తన తల కుందేలు ఒడిలో పెట్టింది.
జింక కథ – మిత్రత్వానికి క్షమాపణ
జింక మౌనంగా తలవంచింది. తర్వాత, మృదువైన స్వరంతో చెప్పింది:
"మిత్రమా... నిజంగా నన్ను క్షమించు. నీవు కడుపుతో ఉన్నావు, అందుకే నేను మన ఇద్దరికీ ఆహారం తెచ్చేందుకు వెళ్లాను. ఆ మాట నిజమే. కానీ అక్కడ నాకు ఒక పెద్ద ప్రమాదం ఎదురైంది. నాలుగు వేటగాళ్లు నన్ను వెంబడించారు. వారి నుండి తప్పించుకోవడానికి నేను ఎన్నో అడవులు దాటి పారిపోయాను. ఆ పరుగు, ఆ భయం... నన్ను పూర్తిగా మారిపోయేలా చేసింది. ఎక్కడున్నానో, ఎలా వెళ్లానో కూడా గుర్తుండలేదు. దారి మర్చిపోయాను."
ఆమె కళ్ళలో కన్నీరు మెరుస్తోంది. "అక్కడినుండి నిన్ను వెతుకుతూ, తిరిగి రావడానికి చాలా కాలం పట్టింది. ఈ రోజు నీ ముందుకు రావడం నా జీవితంలో గొప్ప క్షణం. నన్ను నిజంగా క్షమించు మిత్రమా..."
కుందేలు మౌనంగా ఆమెను చూస్తోంది. ఆమె కన్నీటి చినుకులు జింక ముఖంపై పడుతున్నాయి. "నీ ప్రేమ, నీ ప్రయత్నం నాకు తెలుసు. నీ మాటలు నా హృదయాన్ని తాకాయి. నువ్వు తిరిగి వచ్చావు... ఇదే నాకు చాలును."
జింక మృదువుగా అడిగింది: "అవునే మిత్రమా, నేను వెళ్లినప్పుడు నీవు కడుపుతో ఉన్నావు కదా... నీ పిల్లలు ఎక్కడ? వాళ్లు ఎలా ఉన్నారు?"
కుందేలు నవ్వుతూ సమాధానం ఇచ్చింది: "ఇందాకే బయటికి వెళ్లారు.
ప్రతి రోజు నీ గురించి అడగకపోతే వాళ్లకు కాలమే గడవదు. ‘ఆమె ఎప్పుడు వస్తుంది? ఎక్కడ ఉంది?’ అని అడుగుతారు. అదేంటో... నీ మాటల్లోనే వాళ్లు ఎదిగారు."
అంతలోనే, కుందేలు పిల్లలు తిరిగి వచ్చారు. వాళ్లు జింకను చూసి ఆశ్చర్యపోయారు. "మీరు ఎవరు? మా అమ్మ మాటల్లో ఉండే మిత్రురాలా?"
జింక నవ్వుతూ తల ఊపింది. "అవును పిల్లలూ... నేను మీ అమ్మ మిత్రురాలిని. ఆమెతో ఎన్నో రోజులు గడిపాను. ఆమె ప్రేమ, ఆమె ధైర్యం నాకు జీవితం ఇచ్చాయి."
కుందేలు మౌనంగా నవ్వింది. "ఇదిగో మాటల్లోనే వచ్చారు నా పిల్లలు. ప్రతి రోజు నువ్వు ఉన్నావని, నువ్వు తిరిగి వస్తావని చెప్పాను. ఇప్పుడు వాళ్లు నిన్ను కలవడం... నా మాటలకు జీవం వచ్చింది."
ఆ రోజు, జింక కుందేలు పిల్లలతో పరిచయం అయ్యింది. ఆమె వారికి తన కథను, తల్లి ప్రేమను, మిత్రత్వం విలువను వివరంగా చెప్పింది. ఆ అడవి మళ్లీ జీవంతో నిండిపోయింది. మాటల్లో మిగిలిన మిత్రత్వం... ఇప్పుడు మళ్లీ జీవంగా మారింది.
మీ ఆశీస్సులతో
నేను... ✍️ Naik 💞