అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో గోవిందుడు అనే రైతు ఉండేవాడు. ఎంతో కష్టపడి పని చేసి, 200 అవులు కొనుగోలు చేసి, అడవిలో మేపుతూ జీవించేవాడు. ఆయన భార్య లక్ష్మి, వారికి నలుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు.
గోవిందుడు మొదటి ఇద్దరు కొడుకులను చదువుకోనివ్వలేదు. మిగతా ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలను మాత్రం పాఠశాలకు పంపేవాడు. మొదటి కొడుకు పని చేయాలంటే బద్ధకస్తుడు, కానీ రెండవ కొడుకు భట్టు మాత్రం పగలంతా కష్టపడి పని చేసి, సాయంత్రానికి ఇంటికి వచ్చేవాడు.
కొంతకాలం తర్వాత, ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు జరిగాయి. కానీ భట్టుకు పెళ్లి అయినా, కష్టాలు మాత్రం తగ్గలేదు. లక్ష్మి గారు మిగతా పిల్లలతో ఒకలా, భట్టుతో మాత్రం మరోలా వ్యవహరించేది.
ఒకరోజు, భట్టు భార్య మంగీ ఆరోగ్యంగా లేకపోవడంతో, ఆసుపత్రికి తీసుకెళ్లాలని అడిగాడు. కానీ గోవిందుడు, లక్ష్మి గారు "ఇది అంతా నాటకం, పని చేయకుండా తప్పించుకోవడం" అని అనేశారు. ఆ రోజు భట్టు అడవిలో ఉండగా, మంగీ అనారోగ్యంతో పడిపోయింది.
సాయంత్రం ఇంటికి వచ్చి చూసిన భట్టు, "నాన్నగారు, ఇలా ఎందుకు చేశారు? ఆసుపత్రికి తీసుకెళ్లకుండా ఎందుకు వదిలేశారు?" అని ప్రశ్నించాడు. అప్పుడు గోవిందుడు "ఇది నాటకం" అని అనడంతో, భట్టు కోపంతో "నాకు ఈ ఇల్లు వద్దు, నా వాటా ఇవ్వండి" అని అడిగాడు.
గోవిందుడు "నీకేమివ్వాలి? నువ్వు సంపాదించిందేముంది?" అని తిడుతూ గొడవ చేశాడు. భట్టు బాధతో ఆసుపత్రికి వెళ్లి మంగీకి చికిత్స చేయించి, తర్వాత రేకుల ఇంట్లో వాసం మొదలుపెట్టాడు.
ఆయనకు ఐదుగురు పిల్లలు. ఒక రూపాయి లేకపోయినా, కూలీ పనులు చేసి, రెండు ఇల్లు కట్టించాడు, ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేశాడు, కుటుంబం సంతోషంగా జీవించేది.
కాలం గడిచింది. భట్టు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. వాళ్లలో ఇద్దరు కొడుకులు, తాతయ్య ఆస్తి గురించి అడిగారు. "నాన్నా, మీకు కూడా ఆస్తి ఉండాలి కదా? మీ అన్నల దగ్గర అడగాలి కదా?"
ఒక రోజు, భట్టు తన తమ్ముళ్ల దగ్గరికి వెళ్లి, తాతయ్య ఆస్తిలో తన హక్కు అడిగాడు. అప్పుడు చంద్రా, సోము ఇద్దరూ కలసి, "నువ్వెవరు? మా అన్నయ్యవే కాదు!" అని తిడుతూ, సోము మీదుగా చెయ్యి కొట్టాడు. చెయ్యి విరిగిపోయింది. పెద్ద గొడవ జరిగింది. ఆసుపత్రి, పోలీసు కేసు. భట్టుపై హింసా కేసు నమోదైంది. కొన్ని నెలలు జైలు జీవితం.
జైలు నుంచి బయటకు వచ్చిన భట్టు, "నాకు రావలసినది న్యాయం. ఆస్తి కాదు, గౌరవం కావాలి" అని తన పనుల్లో నిమగ్నమయ్యాడు.
ఒక రోజు సోము మద్యం తాగి, ఇంటిముందు భట్టును తిడుతూ "నీ బాధ ఏమిటి?" అని కేకలు వేసాడు. భట్టు మొదట వదిలేశాడు, కానీ తిరిగి తిరిగి తిడుతుండగా, గొడవకు దారి తీసింది. అందరూ కలసి విడదీసారు, కానీ భట్టు లుంగీలో కళ్ళు ఇరుక్కోవడంతో ఒకచోట పడిపోయాడు.
ఆ సమయాన్ని ఉపయోగించి, చంద్రా, సోము కలసి ధాడి చేశారు. భట్టు రాయితో ప్రతిఘటించాడు. చంద్రా గాయపడ్డాడు.
అప్పుడు భట్టు అన్నాడు: "తమ్ముళ్లు గొడవ పడుతుంటే, అన్నయ్యగా నువ్వు ఆపకుండా, కలిసే దాడి చేస్తావా?"
గొడవ ముగిసిన తర్వాత, మళ్లీ పోలీసు కేసు. ఈసారి రేప్ కేసు అని తప్పుడు ఆరోపణ. భట్టు కోర్టులో నిలబడి, "నిజం మీకు చూపిస్తాను. నిజమే అయితే, మీరు వేసే శిక్షను నేను అంగీకరిస్తాను" అని ధైర్యంగా చెప్పాడు.
కోర్టులో భట్టు ధైర్యంగా నిలబడి అన్నాడు: "మీరు నన్ను ఏ కేసులోనైనా విచారించండి. నిజం మీ ముందు ఉంచండి. నిజమే అయితే, మీరు వేసే శిక్షను నేను అంగీకరిస్తాను."
ఆ మాటలు కోర్టులో ఉన్నవారిని కదిలించాయి. విచారణ ప్రారంభమైంది. సాక్ష్యాలు, సమయాలు, చికిత్సా రిపోర్టులు, అన్నీ భట్టు చెప్పినదే నిజమని నిరూపించాయి.
రేప్ కేసు తప్పుడు ఆరోపణగా తేలింది. కోర్టు భట్టును నిర్దోషిగా ప్రకటించింది. ఆ రోజు, భట్టు మౌనంగా బయటకు వచ్చాడు. అతని కళ్ళలో విజయం కాదు, వేదన, విరక్తి, విముక్తి కనిపించాయి.
ఇంటికి వచ్చాక, తన పిల్లలను చూసి నవ్వాడు. "మీ నాన్న నిజం కోసం నిలిచాడు. అది చట్టం ముందు గెలిచింది. కానీ మనసు ముందు ఓడిపోయింది."
ఆ రోజు నుండి, భట్టు తన కుటుంబాన్ని మరింత ప్రేమగా చూసుకున్నాడు. ఆస్తి కోసం కాదు, ఆత్మగౌరవం కోసం జీవించాడు. తన పిల్లలకు న్యాయం, ధైర్యం, సత్యం అనే విలువలు నేర్పాడు.
కాలం గడిచింది. భట్టు తన నిజాయితీ, కష్టపడి జీవించే ధైర్యంతో ఊరంతా గౌరవించే వ్యక్తిగా మారాడు. వూరిలో ఎవరికైనా సమస్య వస్తే, "భట్టు గారిని అడిగితే పరిష్కారం వస్తుంది" అనే నమ్మకం ఏర్పడింది. ఆయన మాటకు విలువ, ఆయన నడకకు గౌరవం, ఆయన ధైర్యానికి భయం కూడా కలిగేది.
ఒకసారి, ఊరిలో గొడవ జరిగితే, భట్టు వచ్చి మౌనంగా నిలబడ్డాడు. గొడవ ఆగిపోయింది. అంతటి ప్రభావం ఆయన వ్యక్తిత్వానికి.
చంద్రా, సోము వంటి తమ్ముళ్లు, ఆయనను తక్కువచేసినవారు, ఇప్పుడు ఆయన పేరు వినగానే తలవంచే స్థితికి వచ్చారు.
ఊరంతా భట్టు అనే పేరును గౌరవంగా పలుకుతుంది.
ఆయన పిల్లలు కూడా తండ్రి నడకను గౌరవంగా చూస్తారు. "నాన్నగారి జీవితం మా పాఠశాల" అని అంటారు.
భట్టు తన జీవితాన్ని ఆస్తి కోసం కాదు, ఆత్మగౌరవం కోసం నిర్మించాడు. ఆయన కథ, ఊరంతా చెబుతుంది. ఆయన పేరు, ఊరంతా గౌరవిస్తుంది.
నేను... ✍️ Naik 💞