అన్విత చాలా అందంగా రెడీ అవుతుంది. ఆకుపచ్చ రంగు చీరలో ఆమె మరింత తేజస్సుతో మెరిసిపోతోంది. అప్పుడే కిరణ్ అక్కడికి వచ్చి, "అక్కా, నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు తెలుసా?" అని ప్రశంసించాడు.
"అవునా? థాంక్స్ రా," అన్విత నవ్వింది.
"అక్కా, ఫంక్షన్‌కి స్వప్న కూడా వస్తుంది," కిరణ్ చెప్పాడు.
"అవునా? సరే అయితే," అన్విత అంది. "రెడీ అయిపోయా. స్కూల్‌లో కొంచెం ప్రిపరేషన్స్ ఉన్నాయి, వెళ్తాను," అంది.
"సరే అక్కా, నేను కూడా వస్తాను," అన్నాడు కిరణ్.
"అమ్మా, బై. వెళ్తున్నాం," అని అన్విత తల్లికి చెప్పింది.
"హ్మ్మ్, నైట్ లేట్ అవుతుందిగా, జాగ్రత్తగా రా. కిరణ్‌తోనే రా," తల్లి సునీత ఆందోళనగా చెప్పింది.
"సరే అమ్మా, వెళ్లొస్తా," అని ఇద్దరూ బయలుదేరారు.
కారులో రౌద్రవర్మ కుటుంబం...
"ఎలా ఉంది హేమూ, హాస్పిటల్? ఏమైనా డబ్బులు అవసరమవుతాయా?" రౌద్రవర్మ తమ్ముడిని అడిగాడు.
"వద్దు అన్నయ్యా, సరిపోతాయి. హాస్పిటల్ బాగా రన్ అవుతోంది," హేమంత్ అన్నాడు.
"నీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి స్వప్నా? బాగా చదువుకుంటున్నావా?" రౌద్రవర్మ చెల్లిని అడిగాడు.
"హా, బాగా చదువుకుంటన్నా అన్న. ప్లేస్‌మెంట్స్ వాళ్ళు వస్తారంట. ఇంక ఇంటర్వ్యూలకి ప్రిపేర్ అవ్వాలి," స్వప్న చెప్పింది.
"హ్మ్మ్. ఎందుకురా నీకు జాబు? మన ఆఫీస్‌లోనే వర్క్ చేయొచ్చుగా?" రౌద్రవర్మ అన్నాడు.
"హ్మ్మ్, చూద్దాం అన్నయ్య," అని స్వప్న సమాధానం దాటవేసింది.
స్కూల్‌లో వార్షికోత్సవ వేడుకలు...
అన్విత వచ్చి డెకరేషన్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటుంది. నెమ్మదిగా ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు.
డ్యాన్స్ చేసే వాళ్ళు రెడీగా ఉన్నారా లేదా అని కూడా అన్విత చెక్ చేసుకుంటుంది.
ప్రిన్సిపాల్ ప్రమీల అన్విత దగ్గరకు వచ్చి, "అంతా రెడీనా అన్విత? గెస్ట్స్ వస్తున్నారు," అని అడిగింది.
"అవును మేడమ్, అంతా రెడీ," అన్విత నిశ్చింతగా చెప్పింది.
"అయితే నేను గెస్ట్స్‌ని రిసీవ్ చేసుకుంటాను," అని ప్రిన్సిపాల్ వెళ్ళింది. అప్పుడే రౌద్రవర్మ కుటుంబం కారు స్కూల్ ముందు ఆగింది.
పుష్ప (అన్విత బెస్ట్‌ఫ్రెండ్) అన్విత దగ్గరకు వచ్చింది. "ఏంటే, ఇంత లేట్?" అని అడిగింది అన్విత.
"నీకు చెప్పలేదు కదా, పెళ్లి చూపులు జరిగాయి," పుష్ప అంది.
"అవునా? చెప్పలేదు! ఫిక్సయిందా?" అన్విత ఆత్రుతగా అడిగింది.
"ఫోన్ చేసి చెప్తాం అన్నారు," పుష్ప చెప్పింది.
"హ్మ్మ్, సరే," అన్విత అంది.
"బాగున్నావే! నేను అబ్బాయినై ఉంటే నిన్నే చేసుకుంటాను అంటుంది పుష్ప.
"ఆపవే జోక్స్!" అన్విత నవ్వింది.
"వెళ్దాం పదా, గెస్ట్స్ వచ్చారు అంట," అని ఇద్దరూ స్టేజ్ వైపు వెళ్ళారు.
కుమార్, అన్వితను చూశాడు. "ఈ చీరలో సింపుల్‌గా చాలా బాగున్నావు," అన్నాడు.
"థాంక్స్," అన్విత అంది.
"స్క్రిప్ట్ చెక్ చేసుకున్నావా? గెస్ట్స్ వచ్చారు, మనం స్టేజి మీదకు వెళ్దాం," అన్నాడు కుమార్.
ఇద్దరూ వెళ్ళారు. ప్రిన్సిపాల్ ప్రమీల రౌద్రవర్మ కుటుంబాన్ని తీసుకువస్తుంది.
అన్విత మైక్ తీసుకుని గెస్ట్‌లందరికీ స్వాగతం పలికింది. రౌద్రవర్మ, అన్విత ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. రౌద్రవర్మ కళ్ళలో మెరుపు కనిపిస్తుంది.
కుమార్ కూడా రౌద్రవర్మ గురించి ఇంట్రడక్షన్ ఇస్తాడు.
ఇంకా ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. పాటలు, డ్యాన్స్‌లు అన్నీ జరుగుతున్నాయి.
ఒకటవ తరగతి విద్యార్థులు డ్యాన్స్ చేస్తుంటే, ఒక చిన్న పాప భయం వేసి ఏడుస్తూ ఆగిపోతుంది. అప్పుడే అన్విత వచ్చి పాప తో పాటు తను కూడా డ్యాన్స్ చేస్తుంది. అందరూ ఒక్కసారిగా చప్పట్లు కొడతారు.
"బెస్ట్ టీచర్" అవార్డు అన్వితకు కూడా వస్తుంది. బహుమతి ప్రదానం చేయడానికి రౌద్రవర్మ వేదికపైకి వచ్చాడు. అన్విత తీసుకోడానికి వస్తుంది. తీసుకునేటప్పుడు ఇద్దరి చేతులు అనుకోకుండా టచ్ అవుతాయి.
అన్విత వెళ్తుంటే అనుకోకుండా పడబోతే రౌద్రవర్మ హెల్ప్ చేస్తాడు.
"థ్యాంక్స్," అని చెప్తుంది అన్విత.
అప్పుడే కుమార్ ఇదంతా చూసి కొంచం కోపం వస్తుందీ కానీ కామ్ అవుతాడు.
ఫంక్షన్ అయిపోతుంది. ఇంక డిన్నర్‌కి వెళ్తారు అందరూ.
అప్పుడే స్వప్న అన్వితను చూసి మాట్లాడడానికి వస్తుంది. రేవతి (రౌద్రవర్మ తల్లి) కూడా వస్తారు.
"నీకు తెలుసా తను?" అని అడుగుతారు.
"హా అమ్మా, మా క్లాస్‌మేట్ సిస్టర్,"స్వప్న అంది.
"అవునా? చాలా బాగా డ్యాన్స్ చేశావు," రేవతి ప్రశంసించింది.
"థాంక్స్ ఆంటీ. నాకు రాదు, నేనూ వేస్తే పాప కూడా వేస్తుంది అని," అన్విత వినయంగా చెప్పింది.
"అమ్మా, ఇక్కడ ఉన్నారా? వెతుకుతున్నా," అంటూ రౌద్రవర్మ వచ్చాడు.
కాసేపు అయిన తర్వాత అన్వితతో మాట్లాడుతున్న స్వప్న, రేవతిలను చూసి రౌద్రవర్మ ఆగి, "మీకు అన్విత తెలుసా?" అని అడిగాడు.
"హాయ్, మీరు డ్యాన్స్ బాగా చేసారు," అని రౌద్రవర్మ అన్వితతో అన్నాడు.
"థ్యాంక్స్," అన్విత అంది.
"ఫ్రెండ్ వెయిట్ చేస్తుంది, వెళ్తాను," అని అన్విత చెప్పింది.
"అమ్మా, నేను కాసేపు తర్వాత వస్తా," స్వప్న అంది.
"సరే, తొందరగా రా," రేవతి చెప్పింది.
"కిరణ్ ఎక్కడ వదిన?" రౌద్రవర్మ స్వప్నను అడిగాడు.
"డిన్నర్ చేస్తున్నాడు రా, వెళ్దాం," స్వప్న అంది.
ఇద్దరు కలిసి వెళ్తారు. స్వప్న కిరణ్ దగ్గరకి వెళ్తుంది.
అన్విత డిన్నర్ చేయడానికి వెళ్లి తన ప్లేట్ తెచ్చుకుంటుంది.
అప్పుడు కుమార్ వస్తాడు. "నీతొ మాట్లాడాలి అన్విత."
"ఏంటి చెప్పండి సర్," అన్విత అడిగింది.
అప్పుడే పుష్ప వస్తుంది. "ఏంటి అన్వీ, ఇక్కడ ఉన్నావా? అంతా వెతుకుతున్నారు."
"అవునా రా, తిందాం," అన్విత అంది.
కుమార్ ముఖం చిరాకుతో నిండింది. (అంతా చెడగొట్టింది పుష్ప, కాసేపు తర్వాత రావొచ్చుగా) అని మనస్సులో అనుకుంటాడు.
"ఏం లేదులే, తిను," అని కుమార్ మాట మార్చాడు.
"హ్మ్మ్," అన్విత తల ఊపింది.
"అవును అన్వితా, నీ బెస్ట్ ఫ్రెండ్ శాలిని గెస్ట్ కదా? రాలేదు ఏమి ఫంక్షన్‌కి?" పుష్ప అడిగింది.
"ఓహ్ అవును! ఫోన్ చేసింది, ఫ్లైట్ లేట్ అయ్యింది సో వస్తానంది. మర్చిపోయా, వుండు కాల్ చేస్తా," అని అన్విత వెంటనే ఫోన్ తీసింది.
ఫోన్ లిఫ్ట్ చేసిన శాలిని, "నేను వస్తున్నా, కానీ ఒక్కసారి వెనక్కి చూడు!" అంది.
వెంటనే అన్విత వెనక్కి తిరిగి చూడగానే, శాలిని కనిపించింది. "షాలూ!" అంటూ సంతోషంగా శాలినిని గట్టిగా హగ్ చేసుకుంది అన్విత.
అప్పుడే రౌద్రవర్మ ఫ్యామిలీ అక్కడకి స్వప్న కోసం వెళ్ళటానికి వస్తుంది. హేమంత్, శాలినిని చూస్తాడు. అతని కళ్ళలో ఆశ్చర్యం, ఏదో తెలియని భావం మెరుస్తుంది.