Read My Heart is for You. - 2 by Kotapati Niharika in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా మనసు నీ కోసం - 2

హేమంత్ (రౌద్ర తమ్ముడు) హాస్పిటల్‌లో...
"నర్సు, ఈరోజు మధ్యాహ్నం నుంచి నేను ఉండను. నా పేషెంట్స్‌ని అక్షితకు ఫార్వర్డ్ చేయండి. నాకు కొంచెం ముఖ్యమైన పని ఉంది," అన్నాడు డాక్టర్ హేమంత్.
"ఓకే డాక్టర్," అంది నర్సు.
"హేమంత్ తన ఫోన్ తీసుకుని, శాలిని నంబర్‌ ఎలాగైనా కనిపెట్టాలి. అతని మనసులో ఆలోచనలు మొదలవుతాయి."
'శాలిని ఏం చేస్తుందో? ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడే నా ప్రేమ విషయం చెప్పి ఉండాల్సింది. తను ఏమో ఫారిన్ వెళ్ళిపోయింది, కాంటాక్ట్‌లో కూడా లేదు. ఎలా అయినా తనని కనిపెట్టాలి. నాకు ఇప్పుడు తను చాలా అవసరం,' అనుకుంటూ ఉండగా, అతని ఫోన్ రింగ్ అయ్యింది. అతని అన్నయ్య రౌద్రవర్మ కాల్ చేస్తున్నాడు.
"హలో అన్నయ్య, చెప్పు," అన్నాడు హేమంత్.
"ఈరోజు వెళ్ళాలి గుర్తుందా? తొందరగా రా," రౌద్రవర్మ అడిగాడు.
"ఎందుకు లేదు అన్నయ్యా, వస్తా," అన్నాడు హేమంత్.
"సరే, బై," అని రౌద్రవర్మ ఫోన్ పెట్టేశాడు.
నర్సు వచ్చింది. "డాక్టర్, పేషెంట్స్ వచ్చారు, పిలవనా?" అని అడిగింది.
"ఓకే, పిలువు," అన్నాడు హేమంత్.
అన్విత ఇంట్లో...
"అమ్మా, ఈరోజు ఈవినింగ్ ఫంక్షన్ ఉంది. కొంచెం టౌన్‌లో పని ఉంది. చూసుకొని తొందరగా వస్తాను. సరేనా?" అన్విత అడిగింది.
"సరే, నీ ఇష్టం. అయినా నువ్వు అన్నీ నన్ను అడిగి చేస్తున్నావా ఏంటి? వెళ్ళు," అంది సునీత కాస్త విసుగ్గా.
"ఏంటి అమ్మా అలా మాట్లాడుతున్నావు? నీకు వాళ్ళు ఎలా నచ్చారు?" అన్విత ఆశ్చర్యంగా అడిగింది.
"సరే అయితే ఇంకో సంబంధం చూస్తాను," అంది సునీత.
"కొంచెం టైమ్ ఇవ్వు అమ్మా. చాలా టైమ్ ఉంది. ఎందుకు అంత తొందరగా నెట్టేయాలని చూస్తున్నావు?" అన్విత బతిమాలింది.
"అలా కాదు. నీ పెళ్లి చేయాలని నాకు ఉండదా?" సునీత అంది.
"ఉంటుంది కానీ, కొంచెం టైమ్ తీస్కో అమ్మా, ఎట్ లీస్ట్ మూడు నెలలు," అన్విత కోరింది.
"సరే అయితే, ఆ తర్వాత నుంచి మళ్ళీ చూస్తా. అప్పుడు ఏమీ అనకూడదు," సునీత ఒక షరతు పెట్టింది.
"సరే అమ్మా, నేను వెళ్తాను. టైమ్ అవుతుంది," అన్విత అంది.
"ఎలా వెళ్తావు ఒక్కదానివే? కిరణ్ ఎలాగూ కాలేజీ కోసం ఇప్పుడు టౌన్‌కి వెళ్తాడు, వెళ్ళు వాడితో," సునీత సలహా ఇచ్చింది.
"సరే అయితే అమ్మా, ఒకసారి పిన్నిని కలిసి వాడితో వెళ్తా," అని అన్విత చెప్పింది.
"సరే, జాగ్రత్త," సునీత అంది.
"సరే అమ్మా, బాయ్," అని అన్విత తల్లికి వీడ్కోలు పలికింది.
అన్విత పిన్ని ఇంట్లో...
సరళ (అన్విత పిన్ని) ఎదురు వచ్చి, "ఏమిటి అన్విత, స్కూల్‌కి వెళ్ళలేదా?" అని అడిగింది.
"ఈరోజు ఈవినింగ్ యానివర్సరీ పిన్నీ," అన్విత చెప్పింది.
"ఓకే," అంది సరళ.
"టౌన్‌లో పని ఉంది. కిరణ్తో వెళ్దాం అని," అన్విత అంది.
"అవునా? ఉండు, వాడు రెడీ అవుతున్నాడు," అంది సరళ.
"హ్మ్మ్," అని అన్విత కూర్చుంది.
"కాఫీ తాగుతావా?" సరళ అడిగింది.
"వద్దు పిన్నీ, ఆల్రెడీ తాగా," అన్విత అంది.
"హాయ్ అక్కా," అంటూ కిరణ్ వచ్చాడు.
"హాయ్ రా," అంది అన్విత.
"రెడీనా? వెళ్దామా?" కిరణ్ అడిగాడు.
"వెళ్దాం," అంది అన్విత.
"సరే, బై అమ్మా," అని కిరణ్, అన్విత ఇద్దరూ సరళకు వీడ్కోలు పలికారు.
"హ్మ్మ్," అని సరళ వాళ్ళిద్దరికీ టాటా చెప్పింది.
బస్లో వెళ్తుండగా...
కిరణ్ ఫోన్ రింగ్ అయ్యింది. "స్వప్న (రౌద్రవర్మ చెల్లి). వస్తున్నా, బయలుదేరా," అని ఫోన్‌లో చెప్పి పెట్టేశాడు.
"ఎవరు రా స్వప్న?" అన్విత అడిగింది.
"హ్మ్మ్, అది... అది..." కిరణ్ తడబడ్డాడు.
"ఏంటిరా? సాగదీస్తున్నావ్? చెప్పు, ఏంటి విషయం?" అన్విత అడిగింది.
"ప్రేమించుకుంటున్నాం అక్కా. ఆరేళ్ళ నుంచి," కిరణ్ సిగ్గుపడుతూ చెప్పాడు.
"నేను ఎప్పుడూ చూడలేదే?" అన్విత ఆశ్చర్యంగా అడిగింది.
"మేమిద్దరం కలిసి ఇంటర్, ఇంజనీరింగ్ కాలేజెస్‌లో చదువుకున్నాం. అప్పటి నుంచి ఫ్రెండ్స్. తను చాలా సరదాగా ఉంటుంది, ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. నాకు మొదట్లో తను కేవలం మంచి ఫ్రెండ్ అనుకున్నా. కానీ మెల్లిమెల్లిగా తనతో గడిపే ప్రతి క్షణం నాకు చాలా నచ్చేది. తను పక్కన లేకపోతే ఏదో వెలితిగా అనిపించేది. తన నవ్వు, తను మాట్లాడే విధానం... అన్నీ నన్ను తన వైపు లాగాయి," కిరణ్ చెప్పాడు.
"అలా మా స్నేహం మెల్లిగా ప్రేమగా మారింది. ఒకరికొకరం అర్థం చేసుకున్నాం. నా ప్రతి కష్టంలోనూ, సంతోషంలోనూ తను తోడుగా ఉంది. తను లేని జీవితాన్ని ఊహించుకోలేను అక్కా," కిరణ్ గంభీరంగా అన్నాడు.
"జాబ్ వచ్చిన తర్వాత, మేమిద్దరం సెటిల్ అయిన తర్వాతే ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు. కానీ ఇప్పుడు ఆఫీస్ పని మీద తను వస్తుందని తెలిసింది. అందుకే బయలుదేరాం," కిరణ్ వివరించాడు.
"పరిచయం చేస్తా ఉండు అక్క," కిరణ్ అన్నాడు.
"సరే అయితే," అన్విత ఒప్పుకుంది.
కాఫీ షాప్‌లో...
"హాయ్," అని స్వప్న, కిరణ్, అన్విత ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. అలా ముగ్గురూ కాఫీ షాప్‌లో కూర్చుని కాసేపు మాట్లాడుకున్నారు.
"హ్మ్మ్ సరే, పని చూసుకొని వెళ్తా. టైమ్ అవుతుంది," అని అన్విత చెప్పింది.
"బై అన్వితా," అని కిరణ్ అన్నాడు.
"బై," అంది అన్విత.
పని చూసుకొని అన్విత అక్కడి నుంచి తన ఊరికి బయలుదేరింది.
రౌద్రవర్మ ఇంట్లో...
రౌద్రవర్మ ఇంటికి వెళ్లి, "అమ్మా, రెడీనా? స్వప్న, హేమంత్ వచ్చారా?" అని అడిగాడు.
"హ్మ్మ్, వచ్చారు. రెడీ అవుతున్నారు," రేవతి అంది.
"సరే అమ్మా, నేను వెళ్లి రెడీ అవుతా," అని రౌద్రవర్మ అన్నాడు.
అందరూ కలిసి ఊరికి బయలుదేరారు.