Read The Endless - 21 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 21

క్లాస్ రూమ్ – నెక్స్ట్ రోజు:

సామ్రాట్ పక్కనే ఉన్న పిల్లలు సరదాగా మాట్లాడుతుంటారు. మొదటిసారి, అతను కూడా వాళ్లతో కలిసిపోతాడు. కానీ… రాధ వశంగా లేదు!

రాధ ఎప్పటికీ హుషారుగా ఉండే అమ్మాయి. ఎవరితోనైనా ఫ్రీగా మాట్లాడగలదు. కానీ… సామ్రాట్ మాత్రం ఆమెతో మాట్లాడటం కష్టంగా ఫీల్ అవుతున్నాడు.

ఆమె దగ్గరకు వెళ్లి మాట్లాడాలని అనుకుంటాడు… కానీ మాటలు రావడం లేదు.

రాధ చూస్తూ నవ్వుతోంది.

"ఏంటి సామ్రాట్! స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చిన వాడు… నాతో మాత్రం మాటలే రావట్లేదా?"

సామ్రాట్ హడలిపోతాడు. "అదేమీ… అలా కాదు…!"

సామ్రాక్ తో రాదా ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా తప్పుకొని వెళ్ళిపోతున్నాడు చాలా ఇబ్బందిగా అనిపించింది ఎందుకని అందరితో మాట్లాడే వ్యక్తి నాకు ఎందుకు మాట్లాడటం లేదు అని ఆలోచిస్తూ ఉంది చాలా సిగ్గుపడుతూ పెద్దగా మాట్లాడుకుండా ఉంటాడు సామ్రాట్ ఒక రోజు ఎవరూ లేని సమయం చూసి రాదా ఒకసారిగా వెళ్తున్న సామ్రాట్ చేయి పట్టుకొని గిట్టుగా కూడా అదిమిపెట్టి ఏంటి ఏమనుకుంటున్నావో అందరితో మాట్లాడి నాతో మాట్లాడకపోతే నేనేమైనా శత్రువా లేదంటే నీకు ఎప్పుడన్నా గొడవ చేశానా తిట్టానా కొట్టానా ఎందుకురా? నీకెందుకురా అని అడగడం మొదలు పెట్టింది ఒకసారిగా చెమటలు పట్టిన సామ్రాట్ గడగడ వణుకుతున్నట్టుగా మాటలు మాట్లాడకుండా లేదు సారీ అండి నేను ఎవరితో మాట్లాడలేను అని అంటూ గుటికల్ మింగుతూ మాట్లాడుతున్నాడు. ఎందుకురా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావ్ అని రాదా కొంచెం వదులుతుంది

అలా వెనక్కి తిరిగి వెళుతున్న రాదను ఒక్క క్షణం చూసి బుగ్గలు కళ్ళు మూసుకొని రాదా కొంచెం స్పీడుగా వెళ్ళిపోవా అని అంటాడు ఎందుకు అని వెనక్కి తిరిగి చూసుకొని కొంచెం సిగ్గుతో ఏంట్రా నువ్వు కూడా అలా చూస్తావా అని అనుకుంటూ సరే ఇప్పుడు ఎలాగా చూసావు కదా ఇప్పుడు చెప్పు నా ప్రశ్నలకు మనిద్దరం కలిసిపోయాం కదా మాట్లాడుతున్నావ్ కదా అని అంటుంది వెంటనే సామ్రాట్ ఆ మీకు ఏం కావాలి చెప్పండి అండి కాదు నా పేరు రాధా పేరు పెట్టి పిలవచ్చు నువ్వు. ఇంత తెలివైన వ్యక్తివి ఎందుకు నాతో మాట్లాడాలంటే అంత భయపడుతున్నావ్ అని  అని అడుగుతుంది రాధానిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అని అడుగుతాడు ఆ నిజమే చెప్పు అబద్ధం నాకెందుకు కూరగాయ కూడా చేసుకోలేను చిన్నదాన అవుతుంది నాకు ఇష్టమైన వ్యక్తులతో నేను పెద్దగా మాట్లాడలేను ఎందుకంటే వాళ్లు నన్ను చూసి ఎగతాళి లేదా తప్పుగా అనుకుంటే నేను భరించలేను అని అంటాడు నేను ఎందుకు అనుకుంటా ఎందుకు చెప్పు కదా అంతే అని అంటాడురాధా కొంచెం చిరునవ్వుతో, చేతులు మడిచి, "చెప్పు! ఎందుకు ఇష్టమైన వాళ్లతో మాట్లాడలేవో చెప్పు!"

సామ్రాట్ కొంచెం తికమక పడుతూ, "ఒకసారి చెప్పా కదా?"

రాధా వెంటనే, "అంతేనా? ఏం చెప్పావు? నాకు అర్థం కాలేదు!"

సామ్రాట్ కొంచెం బుర్ర నులిమి, "నేను చెప్పా... అయిపోయింది...!"

రాధా కళ్ళు పెద్దగా చేసి, "ఇదేనా నీ సమాధానం? పక్కనే ఉన్న పిల్లలంతా నవ్వుతున్నారు కదా! సరే, బాగుంది, ఇంక నువ్వు మాట్లాడటం కష్టమే!"

అని వెనక్కి తిరిగి వెళ్లిపోయేలా నటిస్తుంది

ఎన్నిసార్లు చెప్పాలి మేడం నాకు ఇష్టమైన వాళ్ళు లేదా నన్ను ఇష్టపడని ఇష్టమైన వాళ్లకు నేను ఏదైనా మాట్లాడి నేను తికమక్కగా చెప్తే నన్ను వాళ్ళు అసహ్యించుకుంటారు అది నాకు నచ్చదు అని చెప్తాడు

రాధా చిన్నగా నవ్వుకుంటూ, "నువ్వు చెప్తున్నది వినిపిస్తున్నా కానీ అర్థం కావట్లేదు సామ్రాట్! నువ్వు చెప్పినంత మాత్రాన వాళ్లు నిన్ను అసహ్యించుకుంటారని నీకెలా తెలుసు?"

సామ్రాట్ తలనిండా టెన్షన్‌తో, "నాకు అనుభవం ఉంది! నాకిష్టమైన వాళ్లతో మాట్లాడినప్పుడల్లా వాళ్ల ముఖాల్లో ఏదో అసహనంగా కనిపిస్తుంది. అందుకే మాట్లాడకపోవడం మంచిది!"

రాధా కొంచెం కఠినంగా, "అసలు, నువ్వు నీకు ఇష్టమైన వాళ్లతో నిజంగా మాట్లాడావా? లేకపోతే, నీ భయం వల్ల అలా అనుకుంటున్నావా?"

సామ్రాట్ మూసికుండిపోయాడు. అసలు తనకు ఈ ప్రశ్న ఎప్పుడూ ఎదురవలేదు. కాస్త ఆలోచించి, "నిజంగా మాట్లాడిన అనుభవం తక్కువే. కానీ, నా భయం నిజమే!"

రాధా కుర్చీలో కూర్చొని, "సరే, నువ్వు ఇష్టమైన వాళ్లతో మాట్లాడినప్పుడు వాళ్లు అసహ్యించుకున్నట్టు అనిపించిందని అంటావు. నేను నీకు ఇష్టమైనదాన్నేనా?"

సామ్రాట్ ఒక్కసారిగా అటూ ఇటూ చూశాడు. ఇది ఏం ప్రశ్న?!

సామ్రాట్ ఒక నిశ్వాసం విడిచి, "అది చెప్పాలనిపించింది రాధా... కానీ భయపడ్డాను! నువ్వు నవ్వుకుంటావేమో, సీరియస్‌గా తీసుకోకపోతావేమో అని. పైగా, ఇంతకాలం ఏమీ చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్పినంత మాత్రాన నీకు అర్థమవుతుందా?"

రాధా ఓ క్షణం ఆశ్చర్యంగా చూస్తూ, "నాకు అర్థం చేసుకోవడం కన్నా, నువ్వు చెప్పడం ముఖ్యమేమో సామ్రాట్! ఐదు సంవత్సరాలుగా నా వెనకాల తిరిగినప్పుడల్లా నీకు ఒక్కసారి కూడా నాతో నిజంగా మాట్లాడాలని అనిపించలేదా?"

సామ్రాట్ తలదించుకుని, "అనిపించింది... కానీ నువ్వు నన్ను అలా చూడవు అనుకున్నా. అందరితో నవ్వుతూ మాట్లాడే నువ్వు, నాకు కూడా అంతే దగ్గరగా ఉంటావని అనుకోలేకపోయాను!"

రాధా కొంచెం హాస్యంగా, "అంత భయపడి ఉంటే ఇంత కాలం నా దగ్గరే ఎందుకు ఉండేవి? ఎవరి బాగా ఇష్టమైతే వాళ్ల దగ్గరే ఎక్కువ ఉండాలనిపిస్తుంది, కదా?"

సామ్రాట్ ఒక్కసారిగా తలెత్తి, "అదేనా నిజం? నువ్వు కూడా నన్ను ఇష్టపడతావా?"

రాధా గట్టిగా నవ్వుతూ, "ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాను, ఐదు సంవత్సరాలుగా నవ్వుకుంటున్నాను, ఐదు సంవత్సరాలుగా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాను… మరి, నీకే అర్థం చేసుకోవాలి, సామ్రాట్!"

సామ్రాట్ గట్టిగా ఆలోచిస్తూ పెద్దగా కళ్ళు తెరిచి ఆంటే నిజంగా మీరు నన్ను ఇష్టపడుతున్నారా మీ చుట్టూ అంత మంది అందమైన అబ్బాయిలు ఉన్నప్పుడు నన్ను ఎలా చూస్తారు అని అనుకున్నా నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు అని అంటూ దగ్గరికి వస్తున్నాడు ఇక రాధ కూడా మరింత దగ్గరికి వస్తూ ఒక్కసారిగా హత్తుకుంటారు అక్కడి నుంచి ప్రేమ స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు తిరగడం కాఫీ తాగడం చట్టబట్టలు వేసుకొని కాలేజ్ అంతా తినడం చదువులు సామ్రాట్ రాధకు తెలియని విషయాలు చెప్తే రాదా సామ్రాట్ కు తెలియని విషయాలు చెబుతూ ఉండేది ఇలా రెండు నెలలు గడిచిపోతుంది

సామ్రాట్ గట్టిగా ఆలోచిస్తూ పెద్దగా కళ్ళు తెరిచి తింటే నిజంగా మీరు నన్ను ఇష్టపడుతున్నారా మీ చుట్టూ అంత మంది అందమైన అబ్బాయిలు ఉన్నప్పుడు నన్ను ఎలా చూస్తారు అని అనుకున్నా నిజంగా మీరు చాలా మంచి వాళ్ళు అని అంటూ దగ్గరికి వస్తున్నాడు ఇక రాధ కూడా మరింత దగ్గరికి వస్తూ ఒక్కసారిగా హత్తుకుంటారు అక్కడి నుంచి ప్రేమ స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు తిరగడం కాఫీ తాగడం చట్టబట్టలు వేసుకొని కాలేజ్ అంతా తినడం చదువులు సామ్రాట్ రాధకు తెలియని విషయాలు చెప్తే రాదా సామ్రాట్ కు తెలియని విషయాలు చెబుతూ ఉండేది ఇలా రెండు నెలలు గడిచిపోతుంది

ఈ రెండు నెలలు సామ్రాట్, రాధా జీవితాల్లో మరపురాని రోజులు అవుతాయి. ఇద్దరూ కలిసి కాలేజ్‌లో ప్రతి మూలలో నవ్వుతూ, మాట్లాడుకుంటూ గడిపేస్తుంటారు. క్లాస్‌లు మధ్యలో లేచి బంక్ కొట్టడం, రాత్రి లాంగ్ డ్రైవ్‌లు, బీచ్ దగ్గర కూర్చొని అనవసరమైన విషయాల గురించి గంటల కొద్దీ చర్చించడం… అన్నీ కొత్త అనుభూతులుగా మారతాయి.

ఒక రోజు రాత్రి, కాలేజ్ దగ్గర ఉన్న చిన్న టిఫిన్ సెంటర్‌లో కూర్చొని ఇద్దరూ కాఫీ తాగుతుంటారు. సామ్రాట్, రాధా చేతిని పట్టుకుని, "ఇదంతా కలలా అనిపిస్తోంది. నేను జీవితంలో ఎప్పుడూ ప్రేమలో పడతానని అనుకోలేదు. నువ్వు నిజంగా నా జీవితంలోకి వచ్చావా?" అని ప్రశ్నిస్తాడు.

రాధా చిరునవ్వుతో, "నీ లైఫ్‌లో నేను లేవనుకుంటే, నీ బ్రెయిన్‌లో, నీ హృదయంలో ఎవరు ఉన్నారు సామ్రాట్?" అని చిన్నగా చెడుగుడు పెట్టుతుంది.

సామ్రాట్ మెల్లిగా నవ్వుతూ, "అదే నా భయం రాధా… నేను నిన్ను నమ్మి, నా జీవితాన్ని నీ చేతుల్లో పెట్టేశా. కానీ… ఎప్పుడైనా నువ్వు నన్ను వదిలేసిపోతే?"

రాధా చిరునవ్వుతో, "నువ్వు నాకెంత ఇష్టమో నీకర్థం కాదు. కానీ, ఒకసారి నీకు నా ప్రేమ మీద నమ్మకం వచ్చాక… నీ భయాలు కూడా మాయమైపోతాయి!"

అది విన్న సామ్రాట్ ఆమెను దగ్గరికి లాగి హత్తుకుంటాడు.

నిజంగా నా భయాలు పోతాయి నిజంగా అని అడుగుతాడు అలా వాళ్ళు మాట్లాడుకుంటున టైంలో ఆ కాలేజ్ కెమెరా నుంచి ఎవరో గమనిస్తున్నారు ఒకసారిగా వాళ్ళు ఎవరికి ఫోన్ చేసి సార్ మీ అమ్మాయి ఎవరితోనో పక్కపక్క నవ్వుతూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. కొంపతీసి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా మీ అమ్మాయిని జరా కాపాడుకోండి అని అంటాడు వెంటనే అటు పక్క నుంచి ఎవరో ఏంటి అవునా? ఇంకా కొన్ని రోజులు చూడండి వాళ్ళిద్దరూ అలాగే దగ్గరగా ఉన్నారు అని అనిపిస్తే వెంటనే అతనిని పట్టుకొచ్చేయండి పనికొక మాస్ వార్నింగ్ ఇద్దాం అని అంటాడు కచ్చితంగా సార్ చేద్దాం అలాగే చేద్దాం అని అంటాడు. అలా సీన్ కట్ అవుతుంది

తన మనసులో ఇప్పుడు ఆ ఫోన్ మాట్లాడిన వ్యక్తి మాట్లాడుకుంటే ఇలా అనుకుంటున్నాడు ఏంటి నా కూతురిని ఎవరు ప్రేమిస్తున్నాడు నా కూతురు కూడా అంత ఈజీగా వాడి ప్రేమలో ఎలా పడిపోయింది అసలు ఎవడు వాడు కనుక్కోవాలి అని అనుకుంటూ అక్కడ సీన్ కట్ అవుతుంది. మరి పక్కా విలన్ ధర్మ ధర్మా అని పేరు పెట్టుకున్నంత మాత్ర ధర్మ వైపు ఉంటారనుకోవడం ఎంత తప్పు ఇప్పుడు అతను ఏమనుకుంటున్నాడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ధర్మ తన చుట్టూ సైంటిస్టులతో ఎప్పటికీ తేలుతుంది మీ విషయం అసలు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చింది మీరు నాకు ఇచ్చింది మీరు దీంట్లో ఏ రహస్యాలు ఉన్నాయ్ అన్నది మీరు దాని మొహం చూసారా నల్లతి కవచం వేసుకున్న దున్నపోతుల ఎలా పడుకుందో దాని గురించి నన్ను అడుగుతున్నారు అలాగని ఆధునిక కాలంలో లేదు అలాగా పురాతన కాలంలో లేదు ఏంటిది నాకేంటి అని అంటాడు

వెంటనే మరో సైంటిస్టు లేదు సార్ ఇది ఒక ప్రాతన కాలం నుంచి ఉన్నది దీన్ని మేము సముద్రంలో చేపలు పడుతుండగా చేపలు పట్టే వాళ్లకు దొరికింది వాళ్ళు దీన్ని అంగడిలో అమ్మారు అది చివరికి మా చేతులకు వచ్చింది దాన్ని మేము మీ చేతిలోకి ఇచ్చాము దీన్ని గమనించినప్పుడు మా అందరికీ అర్థమైంది ఏంటంటే ఇది యుగయుగాల నుంచి వస్తూ ఉంది ప్రతి యుగంలో ఏం జరుగుతుందో రాసి ఉంటుంది ఆ యుగం అంతమైన తరువాత దీంట్లో పేపర్లో అంతమైపోతాయి అంటే ఆ యుగం అయిపోయింది కొత్త యుగానికి నాంది పలుకుతుంది ఇప్పటికి ఇది ఇంకా అల్లా కాలేదు కాబట్టి ఇంకా యుగం అంత మొదటి దశలోనే ఉంది. ఎప్పుడైతే రెండో దశలోకి ఎంటర్ అవుతుందో అప్పుడే భూమి అంతమవుతుంది అదే టైంలో ఇది తీర్చుకుంటుంది ఇది తెచ్చుకోవాలంటే ఏదో ఒక కీ జరుగుతూనే ఉంటుంది దాన్ని తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఇది తెచ్చుకుంటుంది అంతవరకు ఆలోచించకండి ఇది ఎప్పుడైతే తెచ్చుకుంటుందో మీ జబ్బుకు రోగానికి మొత్తానికి ఒక పులిస్టాప్ వస్తుంది అని అంటాడు ఒక సైంటిస్ట్ అదంతా వింటూ సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటాడు ఇది సముద్రంలో దొరికింది కాబట్టి దీనికి లేదా ఏదైనా సముద్రంలో ఉండే అవకాశం ఉంది ఫస్ట్ దాన్ని వెతికించండి అని అంటాడు సైంటిస్ట్ ఇక ఆలోచిస్తూ ఉంటాడు ధర్మ