చివరి భాగం: పోరాటం మొదలవుతుంది
ఆ మాటలు విన్న తర్వాత అక్షర భయపడుతుంది, కానీ తన శక్తి తెలుసు కాబట్టి నిమ్మళంగా కూర్చుంటుంది. ప్రతి ఒక్కరూ పోరాటం చూడటానికి సిద్ధమవుతున్నారు. అందరి ముందు కాఫీ టీలు వచ్చి పడుతున్నాయి. అందరూ ప్రశాంతంగా కూర్చుంటున్నారు. రుద్ర ఒక అడుగు వేశాడు. చుట్టూ ప్లే గ్రౌండ్ తయారైంది. చెట్లతో చేసింది ఏమీ లేకుండా దూరంగా ఉన్న కత్తిని తన చేతిలోకి రప్పించుకుంటాడు. ఇక పోరాటం మొదలవుతుంది.
పోరాటం మొదలవుతుంది
పోరాటం మొదలైంది. రుద్ర తన కళ్ళతో, చేతులతో అటు ఇటు తిప్పుతూ అక్కడ జరుగుతున్న యుద్ధాన్ని తన వైపు తిప్పుకుంటున్నాడు. జాన్‌కు అలాంటి శక్తులు ఏమీ లేవు. తన చేతిలో ఉన్న కత్తిని నమ్ముకొని పోరాటానికి దిగాడు. ఆ కత్తితో పోరాడుతుండగా సమయం గడిచిపోతోంది. ఏం జరుగుతుందో తనకే తెలియకుండా పోరాటాన్ని ముగించడానికి ప్రయత్నిస్తున్నాడు జాన్. చుట్టూ రోబోలు అందరినీ పట్టుకున్నాయి. కానీ రుద్ర ఇక, "నువ్వు మారవులే, మారవురా నువ్వు!" అంటూ కళ్ళు మూసుకున్నాడు.
రుద్ర విస్ఫోటనం & జాన్ అంతం
ఒక్కసారిగా అతని చుట్టూ బంగారు రంగు వెలుతురు మధ్యలో త్రిశూలం వెలసింది. ఆ వెలుతురికి అక్కడున్న మనుషులందరూ మాయమైపోయారు. తన వాళ్ళు, పక్కన వాళ్ళు ఇలా ఒక్కసారిగా మాయమైపోయారు. "ఇక నీ అంతం నా చేతిలోనే!" అంటూ తను హనుమంతుడిలా మారిపోయాడు. అతని చేతిలో గద వచ్చింది. రుద్ర చుట్టూ 26 డైమండ్లు తిరుగుతున్నాయి. అతని శరీరం నుంచి 25 డైమండ్లు బయటికి వచ్చాయి. ఒక్కసారిగా అతని గుండెల మీద ఉన్న 26వ డైమండ్ మెరుపు మెరిసింది. ఆ పవర్‌తో జాన్‌ను ఒక్కసారిగా కొట్టాడు. అతను సిక్సర్ వెళ్ళిపోయాడు. జాన్ దగ్గరికి వెళ్లి కాళ్లు పట్టుకొని, "చూడు, నీ అంతం ఎంత సులభంగా వస్తుందో!" అని అంటూ నేలకేసి కొట్టాడు. జాన్ చేతిలో ఉన్న కత్తి ఒక్కసారిగా ముక్కలైపోయింది.
ఇక తనకు చావు మూడిందని భయపడిన జాన్, తన చేతిలో ఉన్న లిక్విడ్‌ను తన శరీరంలోకి ఇంజెక్ట్ చేసుకున్నాడు. ఒక్కసారిగా ఒక పెద్ద వెలుగు వచ్చి జాన్ పగిలిపోయాడు. ఆ తర్వాత రుద్ర ఆ శరీరాన్ని బూడిద చేసి ఒక కుండలో దాచిపెట్టాడు. అంతా కుదుటపడింది.
పునరుజ్జీవం & కొత్త ఆరంభం
ఆ తర్వాత ఒక్కసారిగా మరోసారి ఏదో కనిపించింది. మాయమైన వారందరూ ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారిగా వాళ్ళ రూపం మారిపోయింది. అందరూ రుద్రల్లా మారిపోయారు. అలా వారందరూ రుద్రల్లో కలిసిపోయారు. ఈసారి మళ్ళీ మరో వెలుగు. ఈసారి రుద్ర మాయమై తన రూమ్‌లో ప్రత్యక్షమయ్యాడు. మరోసారి ఒక వెలుగు, టెలిపోర్ట్ లాంటిది విడుదలయ్యింది. అందులో నుంచి, "విశ్వాసం అయిపోయిందా? పంపించనా?" అని అడిగింది. "అవును," అన్నట్టు రుద్ర చెప్పాడు. వెంటనే అందులో నుంచి అక్షర, అమ్మ, నాన్న, లింగయ్య, శివ అందరూ బయటకు వచ్చారు. వాళ్ళందరినీ రుద్ర కాపాడాడు.
ముగింపు: కొత్త జీవితం
సీన్ కట్: తర్వాత శివ ఒక హెడ్‌మాస్టర్‌గా మారిపోయాడు. ఒక కంపెనీ పెట్టాడు. రుద్ర దానికి ఓనర్‌గా ఉన్నాడు. ఇలా సీన్ కట్ అయ్యి, టీ తాగుతున్న రుద్ర, శివల మధ్య సన్నివేశంతో ముగుస్తుంది.
ఇక జాన్ కథ ముగిసిన తర్వాత, రుద్ర, శివ టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు.
శివ: ఇది సరే శివా, ఇక కథ అయిపోయింది కదా, ఇంకేంటి విశేషాలు?
రుద్ర : (ఆశ్చర్యంగా) ఆ! నీకు అసలు విశేషాలు చెప్పడం మర్చిపోయా కదా! అప్పుడు నన్ను రుద్రమనుల లోకంలో అందరూ 'మానవుడు మానవుడు' అని అన్నారు కదా... ఎందుకని అన్నారో నీకు అర్థం అవుతుందా?
శివ : (ఆలోచిస్తూ) లేదు!
రుద్ర : చెప్తా విను. ఎందుకంటే అంతకుముందే సామ్రాట్ అలాగే విక్రమ్ అని ఇద్దరు యువకులు వచ్చారు. వాళ్ళు ఆల్మోస్ట్ చూడడానికి నాలాగే ఉన్నారు. అది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత విశ్వా చెప్పాడు!
శివ : (ఆత్రుతగా) ఏంటి, కొత్త కథనా
:రుద్ర
(అవునన్నట్టు తల ఊపుతూ) అవును!
శివ: ఏంటవి?
రుద్ర : ఆ చెప్తా. నాకు తెలిసిన జ్ఞానం ప్రకారం ఐదు రకాల భూములు అంటే పార్లర్ వరల్డ్ (Parallel Worlds) అంటే సమాంతర లోకాలు అనేవి ఉన్నాయి. వాటిల్లో రెండు ప్రపంచాల నుంచి ఈ విక్రమ్, సామ్రాట్ అనే వ్యక్తులు వచ్చారు. కానీ దాంట్లో విచిత్రం ఏంటంటే కొంచెం కొంచెం పోలికలు నాలాగే ఉన్నారు!
రుద్ర: (నవ్వుతూ) సరే, ఇప్పుడు నువ్వు చూస్తావా?
శివ: (ఆవునన్నట్టు తల ఊపుతూ) అవును!
రుద్ర: సరే, నీ సూట్ వేసుకో!
వెంటనే శివ తన మెడ దగ్గర ఉన్న చిన్న బటన్‌ను నొక్కుతాడు. వెంటనే అది ఒక సూట్‌లా మారిపోయి శివను పూర్తిగా కప్పేస్తుంది. రుద్ర కూడా తన శరీరంతోనే పైకి లేస్తాడు. ఒక టెలిపోర్టర్ ఓపెన్ అవుతుంది. అప్పుడే ఆకాశంలో ఎంతో ఎత్తుకు వెళ్ళిన తర్వాత ఐదు రకాల భూములు కనిపిస్తాయి. అందులో ఒకటే ఈ స్టోరీ పేరు పడుతుంది: kai కలియుగ చివర్లు ఏఐ రాజ్య పాలన
KAI (కై): కలియుగ చివర్లు ఏఐ రాజ్య పాలన - మొదటి భాగం
ప్రవేశ సన్నివేశం: ఒక అగాధ రహస్యం
సిరీస్ ప్రారంభం: ఒక అబ్బాయిని ఇద్దరు వ్యక్తులు పడవల్లో సముద్రంలోకి తీసుకెళ్తున్నారు. అతని గుండెల మీద రక్తం మడుగు పారుతూ ఉంది, అతని మొహం మీద దెబ్బలు, గాయాలు. అతని కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉన్నాయి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సముద్రంలో ఒక చోట విసిరేస్తారు. ఆ వ్యక్తి కళ్ళల్లోంచి కారుతున్న నీళ్లు ఒక ఉప్పెనలా తయారయ్యి, అందులో ఒక వీడియో కనిపిస్తుంది. అది చీకటి రాత్రి. ఆ చీకటి రాత్రిలో ఒక వెలుగు సముద్రాన్ని రెండుగా చీల్చుకుంటూ ఎక్కడికో వెళ్తుంది. అది పూర్తిగా గమనిస్తే బంగారు రంగు శరీరంతో, కండలు తిరిగిన దేహంతో కనిపిస్తూ ఉన్నాడు హనుమంతుడు. లంకకు వెళ్ళాడు, లంకను... (అక్కడ సీన్ కట్ అవుతుంది).
KAI మూవీ స్టోరీ: ఒక కొత్త శకం
మళ్ళీ ఓపెన్ చేస్తే, KAI మూవీ స్టోరీ -
4125 ప్రపంచం ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని చివరికి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టింది. AI ప్రధాన అంశంగా మారిన భూమి పైన ఒక అమాయకమైన అబ్బాయితో స్టోరీ మొదలయ్యి, తను ప్రేమలో గెలవాలని తాపనతో చావుకు సిద్ధమై తిరిగి పునర్జన్మ పొంది లోకాన్ని ఎలా కాపాడాడు? విలన్ చిన్నప్పటి నుంచి గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఒక కొత్త రకం AIని కనిపెట్టి ప్రపంచాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు హీరో గెలిచాడా? విలన్ గెలిచాడా? ఇప్పుడు శ్రీకృష్ణుడు తనువు చాలించిన టైంలో మిస్సయిన హృదయం ఇప్పుడు ఎక్కడ ఉంది? హనుమంతుడు ఎందుకు హీరోని (అమాయకమైన అబ్బాయిని) హీరోగా మార్చాలి అనుకుంటున్నాడు? తన ప్రేమలో గెలిచాడా? చివరికి ఏం జరిగింది? కలియుగాంతాన్ని గురించి రహస్యాలు చెప్పిన పుస్తకం ఏంటి? ఇవి అన్నీ తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి, KAI మొదటి భాగం.
రహస్యాల పుస్తకం & నిరాశపడిన గురువు
"హనుమంతుడు దూకిన సమయంలో ఒక కొత్త ప్రపంచం ఏర్పడింది. అది ఇంతవరకు ఎవరికీ కనిపించలేదు," అని ఒక ప్రొఫెసర్ మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ ఉన్న పిల్లలు ఎవరూ ఆ ప్రొఫెసర్ మాట వినడం లేదు. ఇంకా ప్రొఫెసర్ కూడా మాట్లాడటం ఆపేశాడు. "ఎంత చెప్పినా ఈ కాలం కుర్రవాళ్లకు, పిల్లలకు ఏమీ అర్థం కావడం లేదు. మరి పదండి," అని చెప్పి ఒక సీక్రెట్ రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ వింత వింత వస్తువులు, ప్రార్థనల్లో కావాల్సిన వస్తువులు, చిన్నచిన్న ఫోటోలు, విగ్రహాలు అన్నీ కనిపిస్తున్నాయి. వాటిలో ఒక వింతైన పుస్తకం దాగి ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ "బోరింగ్, ఈ క్లాస్‌కు అనవసరంగా రావడం తప్పు అయిపోయింది" అని అనుకుంటున్నారు.
కానీ అందులో ఒక కుర్రవాడు ఆసక్తిగా చూస్తున్నాడు. ప్రతి వస్తువును, ప్రతి విగ్రహాన్ని తనిఖీ చేస్తున్నాడు. మెల్లగా ఒక బాక్స్ (గ్లాస్ బాక్స్?) ఉన్న ఒక ప్లేస్‌కు చేరుకుంటాడు. అందులో ఒక పుస్తకం ఉంది. చుట్టూ ఆర్మర్ లాంటి బుక్. ఆ బుక్ ఓపెన్ కావడం లేదు. ఆ కుర్రవాడు ఆసక్తిగా, "హలో సార్, ఇలా రండి!" అని అడుగుతాడు. టీచర్/ప్రొఫెసర్ హ్యాపీగా, "ఏమైంది? నీకు ఏమైనా దేని గురించేనా తెలియాలా?" అని అడుగుతాడు. "అవును సార్!" అని ఆ కుర్రవాడు అంటాడు. "ఏంటది?" అని చాలా హుషారుగా వస్తాడు. కనీసం ఒక్కడైనా ఈ పుస్తకాన్ని లేదా ఈ వస్తువుల గురించి అడుగుతున్నాడు అని చాలా సంతోషపడుతున్నాడు.
ఆ బుక్ చుట్టూ ఒక గ్లాస్ బాక్స్ లాంటిది ఉంది. ఆ పుస్తకాన్ని తాకడానికి లేదు, కేవలం చూడడానికి మాత్రమే అక్కడ పెట్టి ఉంచారు. ఆ కుర్రవాడు, "సార్, ఈ పుస్తకం ఏంటి? చాలా విచిత్రంగా ఉంది. చూడగానే ఆసక్తిగా అనిపిస్తుంది!" అని అడుగుతాడు. ప్రొఫెసర్, "ఎవరికి తెలియదు కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు దీని పేరు KAI (కై) అని పిలుస్తారు. ముందు తెలుసుకుంటుంది అని అంటారు. దీంట్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. పురాణాల్లో జరిగిన సంఘటనలు ఇప్పటికీ ఎలా పనికి వస్తాయి? ఇప్పుడున్న AI కంటే అప్పుడున్న శక్తులు ఎంత బలమైనవి? అన్నీ తెలుసుకునేలా దీంట్లో బుక్కులు రాసి ఉంచారు. దీన్ని తెరవడం అసాధ్యం. దీనికి టైం ఎప్పుడు వస్తుందో అప్పుడే తెలుసుకుంటుంది. ఇంకా ఏమైనా కావాలా?" అని అడుగుతాడు. ఆ కుర్రవాడు నిరాశగా, "అవునా?" అని అంటూ సైలెంట్ అయిపోతాడు.
ఆ బుక్కు గురించి చెబుతున్నప్పుడు, ఎవరో కెమెరాల నుంచి చూస్తూ, "ఆ ప్రొఫెసర్‌ని పట్టుకోండి!" అని అంటాడు. ఒక్కసారిగా కొంతమంది సైనికులు వచ్చి ఆ ప్రొఫెసర్‌ని పట్టుకొని వెళ్ళిపోతారు. స్టూడెంట్స్ అందరూ "ఇదే కొత్త కాదు" అని అనుకుంటూ వెళ్లిపోతారు.
భవిష్యత్ ప్రపంచం: AI నగరాలు
ఇక స్టూడెంట్స్ అందరూ బయటికి వెళ్లిపోతారు. ఆ కుర్రవాడు కూడా స్టూడెంట్స్ అందరూ బయటకు వెళ్ళగానే తన చేతుల్లో ఉన్న చిన్న డివైస్ లాంటిది ఆకాశంలోకి విసిరి, తన చేతిలో ఉన్న రిమోట్‌ను నొక్కగానే అదొక బైసైకిల్‌లా మారిపోతుంది. దాని భూమి వైపు తిరిగి స్పీడుగా తిరుగుతూ ఏదో ఫ్లో వచ్చినట్టుగా అది సైకిల్/బైక్ పైకి ఎగురుతుంది. చుట్టూ పెద్ద పెద్ద భవనాలు, రంగురంగుల డిజైన్లు. అలాంటి కార్లు, బైకులు అన్నీ ఆకాశంలో తిరుగుతూ బిజీబిజీగా ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కింద రోడ్డుపైన చిన్న చిన్న బండ్లు, పెద్ద పెద్ద స్పీడ్ బస్సులు, స్పీడ్ ట్రైన్లు, బుల్లెట్ బండ్లు ఇలా రకరకాల వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరు వాళ్ళ పనిలో మునిగిపోతున్నారు కానీ చుట్టూ ప్రపంచాన్ని గ్రహించడం మర్చిపోయారు. చిన్న పిల్లలు ఎప్పుడైతే బైసైకిల్ ఎక్కారు అప్పటినుంచి వాళ్ళు తమ వెయ్యి కెమెరాలను చూస్తూ ఎంజాయ్ చేస్తూ తమ ఇంటికి చేరుకుంటున్నారు.
ఇక కార్లు చూడ్డానికి పక్షుల ఆకారంలో (గద్ద, రాబందు వంటివి), స్పీడుగా వెళ్ళడానికి ముక్కు సూటిగా ముందల్లా ఒక గద్ద ముక్కు షేప్‌లో కనిపిస్తూ వెనకాల అంతా స్టీల్ ప్లేట్స్, నానో లైట్స్ ఉన్నాయి. రోడ్డు మీద వెళ్ళే వాటికి వెనకాల వేవ్ లాంటిది వచ్చి స్పీడును పెంచుతుంది. ఆకాశంలో ఎగిరే వాటికి గాండ్లు నేలవైపు కిందికి తిరిగి స్పీడ్‌గా రెండుగా తిరిగేకొద్దీ అప్పుడు కూడా ఒక ఎనర్జీ వేవ్ లాంటిది వచ్చి ఆకాశంలో ముందుకు వెళ్ళడానికి సిద్ధం చేయడానికి మళ్ళీ కార్ వెనకాల నుంచి ఒక వేవ్ వస్తుంది. కింద, పైన స్పీడ్ అప్ పెరగడంతో ముందుకు చాలా స్పీడుగా పక్షుల అంత స్పీడ్‌గా ఎగిరిపోతుంది. ఇక అక్కడ ఉన్న బండ్లకు ఎటువంటి నెంబర్ ప్లేట్ కానీ అక్కడ ఏమీ లేదు. కిలోమీటర్‌కు ఒకసారి లైట్ టవర్ ఒకటి వస్తుంది. ఇప్పుడు మనకున్న సిగ్నల్ లైట్ ఎలాంటిదో అప్పుడు లైట్ టవర్ అలాంటిది. లైట్ టవర్ పడినప్పుడు దాన్ని అసలైన రంగు బయటికి వస్తుంది. ప్రతి రంగు ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. గోల్డెన్, బ్రౌన్, బ్లూ అండ్ ఎల్లో ఇలా మిక్స్డ్ కలర్లు కలిసి ఉంటాయి. ఎప్పుడైతే ఆన్‌లైన్ మీద పడుతుందో ఆ కలర్ వెలుగుతుంది. దాంతోపాటు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని నెంబర్, ఆర్సీ ఇలాంటివి ఆ లైట్‌కు సిగ్నల్ ద్వారా అందిస్తుంది. ఆకాశంలో అక్కడక్కడ, నేల మీద అక్కడక్కడ ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. వాహనాలు వెళ్ళడానికి ఎంతో ప్లేస్‌ను రోడ్డు ఆక్రమించి ఉంటుంది. చెప్పలేనంత వాహనాలు, మనుషులు తిరుగుతూ ఉంటారు. కనీసం ఒక జంతువు తినడానికి ప్లేస్ లేనంతగా మనుషులు ఉంటారు అక్కడ.
అక్కడ ఎటువంటి ట్రాఫిక్ సౌండ్స్ ఉండవు. కేవలం ఒక సిగ్నల్ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆక్రమించింది. ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు. చాలా స్మూత్‌గా జరిగిపోతూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా నియమం తప్పి AI తప్పు చేసినచో, దాన్ని డిస్‌కనెక్ట్ చేసి వేరే AIని అప్‌లోడ్ చేస్తారు అక్కడున్న గవర్నమెంట్.
విలన్ ప్రవేశం & అతని రహస్యం
(కట్ చేసి)
ఇక అదే ప్లేస్‌లో వేరే రూమ్‌లో ఉన్న వ్యక్తి, "చూడు, ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా? దీని గురించి ఎవరికీ చెప్పకూడదు. అయినా కలియుగం అంతం ఇవన్నీ స్టూడెంట్స్‌కి ఎందుకు చెప్పాలి? వాళ్లకి ఎవరికైనా ఆసక్తి కలిగి దీని గురించి తెలుసుకోవాలంటే మీ వల్ల అందరు చనిపోతారు!" అని బెదిరిస్తూ ఉంటాడు. తన ఎదురుగా ఒక వ్యక్తి చూడ్డానికి ముసలి వ్యక్తిలా ఉన్నా చాలా బలంగా కనిపిస్తున్నాడు. "ఇంకోసారి ఇలా చేస్తే ఎవరిని బ్రతకనివ్వను. కేవలం చూసారా? వెళ్ళారా? అంటే ఉండాలి. దాని గురించి ఎవరికైనా చెప్పావు అనుకో, అస్సలు బాగోదు!" అని అంటాడు. ఇంకో దెబ్బ ఆ ప్రొఫెసర్‌ని కొట్టి బయటికి పంపిస్తాడు.
ఆ ప్రొఫెసర్, "నువ్వు ఇంత దుర్మార్గుడివి కాబట్టే నీకు అలాంటి శిక్ష వేశారు. లేదంటే ఎందుకు వేస్తారు?" అని అనుకుంటాడు. ఆ వ్యక్తికి చిన్నప్పటి నుంచి గుండె జబ్బు ఉంది. ఎప్పుడు చనిపోతాడో తన కూడా తెలీదు. తన చావును ఆపాలని ప్రకృతికి ఎదురునిలిచి AIని ప్రిపేర్ చేస్తున్నాడు. దానివల్ల అతని గుండె ఆగిన కానీ శరీరం బ్రతికే ఉంటుంది. ఎందుకు అంటే AIని తనలో ఇన్సెట్ చేసుకుంటే తనని ఆ AI తనలో ఉండి కాపాడుతుందని ధైర్యంతో ఏదో ప్రయోగం చేస్తూ ఉంటాడు.