Read Not the end - 15 by Ravi chendra Sunnkari in Telugu Mythological Stories | మాతృభారతి

Featured Books
  • ఆత్మీయబంధం

                                         స్నేహం చదువు ఆత్మీయత పట...

  • తనువున ప్రాణమై.... - 23

    ఆగమనం.....సిక్స్ ఫీట్ నువ్వు చాలా బాగుంటావు!! మండపం మీద లైటి...

  • అంతం కాదు - 15

    ఇక రుద్ర మరియు అక్షర ఇద్దరూ ఒకేసారి రుద్రమనుల రాజ్యం నుంచి ఒ...

  • పాణిగ్రహణం - 8

       విక్రమ్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.  కారు దిగి ఆఫీస్ వంక చూస్త...

  • మన్నించు - 9

    ప్రేమ వ్యక్తి పైనా? వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పైనా? ... వ్యక...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అంతం కాదు - 15

ఇక రుద్ర మరియు అక్షర ఇద్దరూ ఒకేసారి రుద్రమనుల రాజ్యం నుంచి ఒక్కసారిగా మాయమై, మళ్ళీ ఒక్కసారిగా భూమి మీద ప్రత్యక్షమయ్యారు. ఇద్దరూ తమ రూమ్‌లో ఉన్నారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ, "ఇంత పెద్దది జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉన్నా ఏదో లోటు," అన్నది అక్షర. వెంటనే రుద్ర మరింత చిన్నగొంతుతో, "అది ఏంటో నాకు తెలుసు. తండ్రి లేని బాధ నాకు తెలుసు. నాకు ఉన్నా లేకున్నా ఒకటే. నీకు ఇప్పుడు లేకున్నా అంతే. ఇప్పుడు మనమిద్దరం తప్ప మనల్ని ఓదార్చే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి మనమే ఓపిక పట్టుకోవాలి," అని అంటూ అక్షర భుజం మీద చేయి వేసి మెల్లగా తల నిమిరాడు.

ఆ రోజు నైట్ అలా పడుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని ఒకే మంచంలో పడుకొని ఉండగా, మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది.

సుమిత్ ప్రవేశం, సరదా సంభాషణ

మళ్ళీ సుమిత్ వెతుక్కుంటూ నీరసంగా వస్తాడు. ఆ రోజు పెళ్ళిలో తప్పించుకుని వెళ్ళిపోయిన సుమిత్, అప్పటినుంచి వాళ్ళిద్దరినీ వెతుకుతూనే ఉన్నాడు. ఎవరూ కనిపించలేదు. ఒక్కసారిగా తన రూమ్‌లో చూసిన వాడికి ఏడవాలో, నవ్వాలో తెలియలేదు. "రుద్ర! రుద్ర!" అని అరుస్తూ ఒక్కసారిగా మంచం దగ్గరికి వచ్చాడు. అక్షర కూడా పడుకొని ఉండడంతో, "ఏమైందిరా? ఎక్కడికి వెళ్లారు ఇన్ని రోజులు? నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా?" అని అంటూ తట్టి లేపాడు. ఇద్దరూ ఉలిక్కిపడి లేచారు. సుమిత్‌ని చూడగానే ఇద్దరూ అతి కష్టం మీద పక్కకు జరిగి కూర్చున్నారు.

"ఏంట్రా బాబు, నీ బుగ్గలు?" అని రుద్ర అంటాడు.

"సారీ, సారీ బాస్. మీరు చాలా సీరియస్ పనిలో ఉన్నారని తెలియక ఇలా వచ్చాను," అని మొహం ఒక పక్కకు పెట్టుకొని తిప్పుకొని చెబుతూ, "ఏంటి మేడంగారు, అప్పుడెప్పుడో వంట చేసి పోయారు. మళ్ళీ ఈ అన్నయ్యను మర్చిపోయావా?" అని సుమిత్ మాట్లాడటం మొదలుపెట్టాడు.

"ఏంట్రా బావా! నువ్వు తల తింటున్నావే? ఆకలేస్తుందా? స్పీకర్స్ తింటావా?" అని తనపై చెయ్యి పైకెత్తి, ఒక్కసారిగా ఒక తినే పదార్థం చూపించాడు.

"ఎక్కడికి వెళ్ళావు?"

"అక్షర వాళ్ళ ఊరికి వెళ్ళాను. అక్కడ మ్యాజిక్ నేర్చుకున్నాను. ఇద్దరం ఇప్పుడే వచ్చాము," అని అనగా, "పెద్ద జర్నీ చేశారు," అని సుమిత్ మాట్లాడుతూ, "సరే, ఈరోజు పొద్దు ఓన్నే అయింది. మీరు ఇంకా మంచం నుంచి దిగలేదు. వంట చేస్తే నా కడుపులో కొంచెం పోసుకుని నా పని మీద నేను వెళ్ళిపోతా. మళ్ళీ నీ పనులు చాలా బిజీగా చేసుకోవచ్చు," అని మాట్లాడుతూ వెళ్లి టేబుల్ మీద కూర్చున్నాడు.

రుద్ర, అక్షర, సుమిత్ కలిసి భోజనం

స్పీడ్‌గా వెళ్లి వంటగదిలో వంట చేసి వచ్చేసరికి రుద్ర, సుమిత్ ఇద్దరూ మొహం కడుక్కొని ఫ్రెష్ అప్ అయి వచ్చారు. ఇక అక్షర కూడా వాళ్ళిద్దరికీ ఫుడ్ పెట్టేసి తను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసింది. ముగ్గురూ కలిసి తినడం మొదలుపెట్టారు. కొద్దిసేపటికి ఫుల్‌గా తిని గట్టిగా త్రేన్పుతూ, "సరే, బాయ్! సారీ, సారీ గాయ్స్!" అని అంటూ "నేను ఇక్కడ వెళ్తున్నాను, మీ పని మీరు కానివ్వండి," అని చెబుతూ వెళ్ళిపోతాడు.

ఆయన వెళ్ళాక, ఇద్దరూ (రుద్ర, అక్షర) ఒకరినొకరు చూసుకుని నవ్వుకొని, "శివ దగ్గరికి వెళ్ళాలి, వెళ్దామా? చాలా రోజులయింది. అప్పుడెప్పుడో చూశాను. కలిసి అప్పుడే విడిపోయాం. ఇప్పుడు వెళితే విడిపోకూడదు," అని అనుకుంటూ మాట్లాడుకుంటూ, పని ఫినిష్ చేసి కొద్దిసేపటికి శివ దగ్గరికి వెళ్తారు.ఎపిసోడ్ 11: లింగయ్య రహస్యాలు, కొత్త శత్రువులు, పెళ్లి ప్రస్తావన

ఆ తర్వాత శివ దగ్గరికి వెళ్లి వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటూ, శివ దగ్గర ఉన్న సూట్ గురించి తెలుసుకుంటూ, అలాగే శివకు రుద్ర యొక్క శక్తుల గురించి కొంచెం కొంచెం అర్థమవుతూ ఉండగా, వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా మారిపోతారు. అప్పుడే రుద్ర వాళ్ళ తాతయ్య లింగయ్య బయట నుంచి లోపలికి వస్తూ, "ఎలా ఉన్నావ్ రుద్ర? తిన్నావా? మేమందరం బాగున్నాం. నేనెవరో తెలుసు కదా?" అని అడుగుతూ వస్తాడు లింగయ్య.

లింగయ్య హెచ్చరికలు, రుద్ర సందేహాలు

లింగయ్య శివ దగ్గరికి వచ్చి, "హలో శివగారు, మీరు అన్నీ నేర్చుకున్నారా అని అనుకుంటున్నాను. ఇక రాబోతున్నది పెద్ద యుద్ధమే. నాకు రుద్ర మీద ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ నాకు నీ మీద డౌట్. అన్నీ నేర్చుకో. ఎంత పెద్ద షూట్ ఉంటే మాత్రం నీ బలం నీకు ఉండాలి. రుద్రకు అటువంటి సమస్య ఏమీ లేదు. కాబట్టి నువ్వే రెడీగా ఉండు," అని అంటూ ఉంటాడు.

రుద్ర అయోమయంగా చూస్తూ, "నువ్వేనా లింగయ్య? మా తాతకు ఏంటి? తాతయ్యా, బాగున్నావా? ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా? అది సరే కానీ, నీకు ఇదంతా తెలుసా? మరి నన్ను అప్పుడే ఎందుకు ఆపలేదు? ఇంత దూరం వచ్చి, ఇన్ని కష్టాలు పడి, కనీసం తెలిసి తెలియని వాళ్ళని కూడా కాపాడలేకపోయాను. సొంత మామయ్యను కాపాడలేకపోయాను. ఇప్పుడు నాకు ఇంత పెద్ద భారం పెట్టావు. ఈ ప్రపంచాన్ని నేను కాపాడగలనా? ఏదో యుద్ధం రాబోతోంది అంటున్నావు?" అని అంటాడు.

"ఏంటి రుద్ర, నీ ఆలోకంలో అతన్ని ఎంత సింపుల్‌గా, ఓ చిన్నచిన్న రోబోలు? అసలు నీకు అవసరమే లేదు! నా బాధ అంటావా? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇక నువ్వు అంటావా, నీ తలరాత అది. నేనేం చేయలేను. వచ్చినప్పుడు నువ్వు సరిగా యూజ్ చేసుకుని ఉంటే అప్పుడే ఒక తెలివైన యోధుడిగా మారిపోయేవాడివి," అని లింగయ్య మాట్లాడటం మొదలుపెడతాడు. ఆ మాటలకు అందరూ బిత్తరపోయి చూస్తున్నారు. రుద్రకు అయోమయంగా ఉంది, అక్కడ ఎక్కడో జరిగిన యుద్ధం గురించి తాతయ్యకి ఎలా తెలిసిందని.

కొత్త శత్రువులు, భవిష్యత్ యుద్ధం

"అసలు క్లారిటీగా చెప్పు తాతయ్యా! ఇప్పటికే నాకు క్లారిటీ మిస్ అయితే ఏం జరుగుతుందో నాకే తెలియదు," అని అడగ్గా, లింగయ్య చెప్పడం మొదలుపెడతాడు: "చెప్తా. తొందరపడకు. సుందరి వదిన, జాన్, అదే సిరీస్ కంపెనీ ఓనర్, ఇప్పుడు పెద్ద ప్లాన్ చేయబోతున్నాడు. అక్కడక్కడా ఉన్న వాళ్ళ చేత మేము కనిపెడుతున్నాం. ఇప్పుడు అతను ఒక రోబోట్‌ను, ఒక స్పేస్ షిప్‌ను కనిపెట్టాడు. అలాగే ఏదో బ్లూ కలర్ ఇచ్చాను కదా, కానీ అతని దగ్గర రెడ్ కలర్ లిక్విడ్ ఉంది. ఇప్పుడు దాని వల్ల ఎటువంటి ఉపయోగం ఉందో తెలియదు కానీ, అది కూడా పవర్‌ఫుల్ అని అనిపిస్తుంది. అలాగే ఒక నల్ల కత్తి, అది కూడా పవర్‌ఫుల్ అనిపిస్తుంది. కాబట్టి మీరందరూ చాలా పవర్‌ఫుల్‌గా రెడీ కావాలి. ఇప్పుడు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు, కానీ చిన్న చిన్న హింట్స్ మాత్రం నాకు వస్తూనే ఉంటాయి," అని చెప్పడం ముగించాడు లింగయ్య.

లింగయ్య విచిత్రమైన సూచన

"సరే తాతయ్యా, అతను ఎప్పుడు యుద్ధానికి దిగుతున్నాడు?" అని అనగా, "అది మాత్రం చెప్పలేము, కానీ నువ్వు మాత్రం పెళ్లి చేసుకో! శివ చేసుకున్నాడు, నువ్వు కూడా చేసుకో. ఆ తర్వాత నువ్వు కచ్చితంగా పిల్లల్ని కనాలి," అని టకటకా చెప్పడం మొదలుపెట్టాడు లింగయ్య.

"ఏంటి? ఒకపక్క ప్రపంచం అంతమవుతుందని చెబుతూనే, మళ్ళీ మరోపక్క ఇప్పుడే పెళ్లి చేసుకోమంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావు? మేము మిషన్స్ అనుకుంటున్నావా?" అని అరుస్తున్నాడు రుద్ర. శివ కూడా, "అవును, మీ తాతయ్య ఏంటో పెళ్లి మీద, ఫస్ట్ నైట్ మీద ఉన్నాడు. చాలా ఇదిగా ఉన్నాడు," అని శివ కూడా అరుస్తున్నాడు.

భవిష్యత్ తరాల ప్రాముఖ్యత

వెంటనే అక్షర మాట్లాడుతూ, "ఏంటి తాతయ్యా, నువ్వు మాట్లాడేది? ఫస్ట్ మేము ప్రపంచాన్ని కాపాడతాం, తర్వాత పెళ్లి పిల్లల గురించి ఆలోచిద్దాం," అని అంటే, ఒక్కసారిగా తాతయ్య పెద్దగా నవ్వుతూ, "ఏంటి మీరు ప్రపంచాన్ని కాపాడతారా? సగం నాశనం చేయకుంటే చాలు! మీ అందరి మొహం చూసారా? ఒక్కొక్కరికి ఒక్కొక్క విచిత్రమైన చెప్పులు ఉన్నాయి. కనీసం ఆ రోజు మీ నాన్నను కూడా కాపాడుకోలేకపోయారు. ఇప్పుడు ప్రపంచాన్ని కాపాడతారా? ఇప్పుడు మీ నుంచి వచ్చే పిల్లలు మాత్రమే రేపటి రోజున యుద్ధాన్ని ఆపగలరు. అది కూడా తెలియదు ప్రపంచాన్ని కాపాడుతాడు, ప్రపంచాన్ని," అని చెడామడా తిట్టడం మొదలుపెట్టాడు లింగయ్య.