జాంబి ఎంపరర్ (The Zombie Emperor)
సుమంత్ ఇల్లు – రాత్రి (కొనసాగింపు)
మీనాక్షి సుమంత్‌ను దగ్గరికి తీసుకుని, కళ్ళల్లో నీళ్ళు నింపుకుని, "చెబుతాను రా... ఇన్నాళ్ళూ ఎవరికీ తెలియని నా గతాన్ని నీకు చెబుతాను..." అని అంటూ కథ చెప్పడం మొదలుపెట్టింది.
ఆదిత్య యొక్క గతం (ఫ్లాష్‌బ్యాక్)
అప్పుడే అక్కడ ఆగిపోయిన ఆదిత్య కథ కూడా మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి చెప్తారు. "ఇదే ఊరు మా మొదటి పరిచయం!" అని.
ఆదిత్య గట్టిగా నవ్వుతూ, "ఏంట్రా! మా ప్రేమలో ఒక్క అడుగు... నీ పాపం! ఆ ఒక్క అడుగుతో మా జీవితాలను నాశనం చేశావు! మేమిద్దరం కలుసుకున్నది మొదటిగా..."
రెండు కథలు ఒకేసారి, ఒకే ప్రవాహంలో సాగుతాయి, ఇద్దరు ఒకేసారి చెప్తున్నట్టుగా:
"రంగనాధపురం!"
రాంబాబు జ్ఞాపకాలు – ఫ్లాష్‌బ్యాక్ – రంగనాధపురం – అడవి – ఉదయం 6:00AM
అడవిలో ఏదో భీకరమైన శబ్దం. కరెక్ట్‌గా 6:00 సమయం.
బలమైన శరీరంతో, పంది మాంసాన్ని తన భుజాన వేసుకొని గట్టిగా నడుస్తూ వస్తున్నాడు ఆదిత్య. అప్పుడే సైకిల్ మీద వస్తాడు అతని ప్రాణ స్నేహితుడు, బెస్ట్ ఫ్రెండ్ రాము.
రాము: "ఏంట్రా బాబు! పందిలాగా అంత పెద్ద పందిని వేసుకొని వస్తున్నావు? నీ పని బాగుంది. రాత్రి అంతా తిరగడం, దొరికిందాన్ని పగలు తీసుకువచ్చి నాకు ఇవ్వడం. నేను ఎండకు సైకిల్ తొక్కి తొక్కి మాంసాన్ని అమ్ముకుంటూ బ్రతకడం. ఇదేంటో జీవితం! నీకు రాత్రి నాకు పగలు... పని తప్పదు!"
రాము నవ్వుకుంటూ, "సరే, ఈరోజు ఆదివారం కదా! నువ్వే వెళ్తావా? నన్ను వెళ్లి ఇవ్వమంటావా?" అని అడుగుతాడు.ఫ్లాష్‌బ్యాక్ – రంగనాధపురం – అడవి – ఉదయం 6:00AM (కొనసాగింపు)
రాము: "ఆ... అది నా ప్లేస్, నేను మాత్రమే వెళ్లాలి!"
ఆదిత్య నవ్వుతూ, "సరే సరే, ఇక నేను కూడా వెళ్తాను, మళ్ళీ లేట్ అవుతుంది!" అని అంటూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోతాడు.
ఆదిత్య గతం (మీనాక్షి వివరణతో)
సగం పంది మాంసాన్ని తన భుజం మీద వేసుకొని ఒక పెద్ద భవనం దగ్గరికి వెళ్ళాడు ఆదిత్య. గేట్ దగ్గర నిలబడి గట్టిగా గేటును శబ్దం చేశాడు.
మీనాక్షి (వర్తమానం): "అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉండేది. ప్రతివారం చూడకుండా ఉండలేకపోయేదాన్ని. ఈసారి వస్తాడా రాడా అని అలాగే చూస్తూ ఉన్నా... ఇంతలో అక్కడికి వచ్చాడు!"
ఇంతలో ఆదిత్య దగ్గరికి మీనాక్షి నాన్న వచ్చాడు. ఆదిత్యను చూసి ప్రభాకర్‌ను పిలిచి, "ప్రభాకర్, అతనికేం కావాలో ఇచ్చి పంపించు!" అని అన్నాడు.
ప్రభాకర్ చిన్నగా తిట్టుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే, ఆదిత్య చెమట పట్టి, చొక్కా సగం చినిగినట్టుగా, మొహం మీద జిడ్డు జిడ్డుగా ఉండడంతో ప్రభాకర్‌కు పెద్దగా నచ్చలేదు. అతనికి ఎందుకో చాలా కోపంగా ఉంది. ఆదిత్య దగ్గరున్న మాంసాన్ని తీసుకున్నాడు.
ఆదిత్య చిన్నగా కన్ను కొడుతూ పైన ఉన్న మీనాక్షికి సైగ చేస్తాడు. ప్రభాకర్ వైపు తిరిగి, "ఏంటి సార్? ఎప్పుడు పంది మాంసమేనా? అప్పుడప్పుడు నేను చెప్పింది కూడా తినండి! రాత్రి చేసిన సాంబార్లో పొద్దున్నే అన్నం కలుపుకొని, ఒక పండు మామిడికాయ తీసుకొని, రెండిటినీ అలా నోట్లో పెట్టుకొని తింటే ఉంటుంది సార్!" అని వస్తువులు కొడుతూ చప్పుడు చేస్తూ ఉంటాడు.
అది విన్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. అంటే వాళ్ళు అప్పటికి ఎప్పుడూ ఎక్కువగా సిటీలోనే ఉంటూ, మందులు, బర్గర్లు, చిప్స్, అలాగే పిజ్జాలు వంటివి తిన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా పల్లెటూర్లో ఆదిత్య చెప్పింది వినగానే వాళ్ళందరికీ నోరు ఊరడం మొదలుపెట్టింది
మీనాక్షి నాన్న చిరాగ్గానే, "సరే, వెళ్ళు!" అని అంటాడు.
అలాగే ప్రభాకర్ తన మనసులో ఇలా అనుకుంటున్నాడు: 'వీడేంటి? ఇక్కడ ఉన్న నన్ను చూసి మాట్లాడుతూ, ఎవరికో సిగ్నల్ ఇస్తున్నట్టుగా చేస్తున్నాడు?' అని పైన ఉన్న మీనాక్షిని చూస్తాడు. పైన చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది మీనాక్షి. ప్రభాకర్‌కు ఎక్కడో కాలినట్టు అనిపిస్తుంది.మరుసటి రోజు ఉదయం
అలా కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం చూపిస్తారు. మీనాక్షి తన నాన్నతో మాట్లాడుతోంది: "నాన్న, నేను ఇప్పుడే బయటికి వెళ్లి వస్తాను. ఫ్రెండ్స్‌తో కలిసి మాట్లాడి ఆయన వస్తాను. మళ్ళీ మనం వెళ్లిపోవాలి కదా!" అని అంటూ బయటికి వెళ్తుంది. తన వెనకాలే తన అన్నయ్య జగదీష్ కూడా ఎక్కడికో వెళ్తున్నాడు.
రాముడి ఇల్లు – ఉదయం
ఇప్పుడు రాము వాళ్ళ ఇంటి దగ్గరికి మీనాక్షి చేరుకుంటుంది. "ఏంటి అన్నయ్య! నీ ఫ్రెండ్ ఇంకా బయటికి రాలేదా? కేవలం ఆదివారం మాత్రమే బయటికి వస్తాడు అని మాట్లాడుతుంటే..." అని మీనాక్షి మాట్లాడుతూ ఉండగానే, "లేదు మేడం గారు, ఆదిత్య గారు ఇప్పుడే వచ్చారు!" అని ఆదిత్య వెనకనుంచి వచ్చి ఒక ఫైర్ ఫ్రూట్లో కనిపించే పువ్వు లాంటిది చూపిస్తాడు. అది చాలా అద్భుతంగా ఉంది – ఎర్రటి రంగులో, అక్కడక్కడ బ్లూ కలర్ రంగులతో మెరిసిపోతోంది. దాన్ని చూడగానే మీనాక్షి "ఎంతో అద్భుతంగా ఉంది! చాలా బాగుంది!" అని చేతుల్లోకి తీసుకొని తలలో పెట్టుకుంటుంది.ఉదయం (కొనసాగింపు)
అప్పుడే జగదీష్ ఎక్కడికో వెళ్తూ ఉంటే, రాము మరియు ఆదిత్య ఇద్దరూ ఒకేసారి అతడిని చూస్తూ, "ఏంటి? మీ అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడు? ఏంటి సమస్య?" అని అడుగుతారు.
మీనాక్షి ఆదిత్య వైపు చూస్తూ ఇలా అంటుంది: "మా అన్నయ్యకు ఒక విచిత్రమైన వ్యాధి. ఎప్పుడో ఒకసారి కాళ్లు, చేతులు చచ్చుబడిపోయి కింద పడిపోతాడు. అదేంటి? ఏదో స్ట్రోక్ అనుకుంటా. అలా వచ్చినప్పుడు కింద పడిపోతాడు. ఒకవేళ అది ఎక్కువైతే చచ్చిపోతాడు. దానికోసమే నాటు మందుల కోసం వెతుకుతున్నాడు. అందుకే ప్రతివారం మేము ఇక్కడికి వస్తున్నాం. మా అన్నయ్య దైవల్లే..." అని ఆదిత్య కళ్ళల్లోకి చూస్తూ, "...ఇక్కడికి వస్తున్నాం!" అని నొక్కి చెబుతుంది.
అలా ఆలోచిస్తూ ఉండగా, దూరం నుంచి వీళ్ళిద్దరినీ – అంటే ఆదిత్య మరియు మీనాక్షి – ఇద్దరూ నవ్వుకుంటూ ఉండటాన్ని వర్మ చూస్తూ ఉన్నాడు. 'ఇక ఇక్కడికి రావడం తప్పు అవుతుంది ఏమో! వీడేంటి మా అమ్మాయితో ఇలా మాట్లాడుతున్నాడు? ఆడపిల్ల చిన్న పిల్ల! తనకేం తెలుసు? వీడి మగపిల్లాడు కదా, పెద్దవాడే కదా? ఎందుకు ఇలా చూస్తున్నాడు? నాకు గాజు బొమ్మను మట్టి పాలు చేసేలా ఉన్నాడు. ఒక అందాల అద్దంలో పెట్టి యువరాణిలా చూసుకోవాలి!' అని అనుకుంటూ వర్మ కోపంతో బయటికి వచ్చి ఒక్కసారిగా మీనాక్షిని గట్టిగా కొట్టి, "ఇంటికి పద! ఏం చేస్తున్నావ్ ఇక్కడ?" అని బెదరగొట్టి ఇంటికి పంపిస్తాడు. మీనాక్షి కూడా ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతుంది.
అదంతా చూస్తున్న ఆదిత్య గుండెలో గుణపం దింపినంత కోపం, బాధ కలుగుతాయి.