. ప్రభాకర్ మెడ నుంచి, ఆదిత్య గోర్ల నుంచి ప్రభాకర్ శరీరంలో నుంచి రక్తం పీల్చుకుంటున్నాడు. అతని శక్తి ఇంకా పెరిగినట్టు అనిపిస్తూ ఎరుపు కళ్ళు ఇంకా ఎర్రగా మారుతున్నాయి. అలాగే ఎక్కడో ఉన్న జాంబీలు కూడా ఇంకా ఎర్రగా కళ్ళు మారుతూ శరీర భాగాలు వికృతంగా మారుతూ ఉండగా అక్కడ సీన్ కట్ అవుతుంది.ప్రభాకర్‌ను పట్టుకొని గట్టిగా అరుస్తూ, ఆదిత్య ఇలా అన్నాడు: "ఇప్పుడే స్టార్ట్ అయిందిరా నా 20 ఏళ్ళ ఆకలి! మొత్తం ప్రపంచాన్ని అతలాకుతలం చేసే శక్తిగా మారబోతుంది. మీరు చేసిన చిన్న తప్పు ఇప్పుడు మీ ప్రాణాలకు!" అంటూ, ఒక్క నొక్కడంతో అతను పూర్తిగా భగ్గుమని అంటుకున్న అగ్గిపుల్లలా బూడిదలా మారిపోయాడు!
అంతే, ఆదిత్య దూరంగా వచ్చి చేతులు దులుపుకొని, తన ఎర్రటి కళ్ళతో చూడగానే ఆ బూడిద మరోసారి మానవ రూపం ధరించి ఒక జాంబీ ప్రభాకర్‌గా మారిపోయాడు. అతని కళ్ళల్లో ఎరుపు. ఎవరినో పట్టుకొని తాగాలని కోరిక. ఎందుకంటే, ఇంతకుముందే ఆదిత్య తన రక్తాన్ని పూర్తిగా తాగేయడం వల్ల అతనికి శక్తి ఉన్నా, అతనికి మరో శక్తి కావాలి. అది మరో వ్యక్తి రక్తం కావాలి. మాంసం తినాలి – ఇది అతని కోరిక.
వెంటనే తన డ్రెస్ మీద పడిన రక్తాన్ని చూసుకుంటూ లోపలికి వెళ్లి ఫ్రెషప్ అయ్యి బయటికి వస్తాడు ఆదిత్య. అప్పటికి అతలాకుతలం అవుతూ, రౌండ్‌గా తిరుగుతూ, అటూ ఇటూ దొర్లుతూ ఉన్న ప్రభాకర్‌ను చూసి చిన్నగా నవ్వుతూ బయటికి వెళ్ళాడు. బయట పనిచేస్తున్న కొంతమంది వర్కర్స్‌ను పిలిచి లోపల క్లీన్ చేయమని పంపించాడు.
మానవ వాసన తగలగానే లోపలికి వచ్చిన ఇద్దరు వర్కర్స్‌ను ఒకే ఉదుటున పట్టుకొని కింద పడేసి, పీకను కొరికి రక్తం తాగడం మొదలుపెట్టాడు ప్రభాకర్. వెంటనే వెళ్తున్న ఆదిత్యకు ఒళ్ళు గగుర్పొడిచింది. మొత్తం రక్తం తాగిన తర్వాత అతని ఒళ్ళు మళ్ళీ మామూలైంది. అంటే, అక్కడ ప్రభాకర్ కూడా పూర్తి జాంబీగా రూపాంతరం చెందాడు. ఇప్పుడు సైలెంట్‌గా అతను కూడా స్నానం చేసి ఆదిత్య దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. కానీ చుట్టూ తిరుగుతున్న మానవులను చూస్తుంటే అతనికి మళ్ళీ ఆకలి మొదలవుతుంది. కానీ ఆదిత్య ఒక్క చూపుతోనే అతనిని ఆపేసాడు.
అప్పుడే అటు పక్క వెళుతున్న కారును ఆపి, ఒకవేళ దగ్గరికి పొమ్మని చెప్పాడు. లోపల కూర్చోగానే ప్రభాకర్‌కి ఒళ్లంతా జివ్వుమంటున్నట్టు, ఒకటే ఆకలి. లోపల డ్రైవర్ సీటులో కూర్చుని ఉన్న అతనిని చూస్తూ అతని మెడ నరాలను గుడ్డిగా చూస్తూ ఉన్నాడు ప్రభాకర్.
ఇంతలో, అక్కడ వర్కర్స్ చనిపోయారు కదా – వాళ్ళు ఒక్కసారిగా లేచారు! వాళ్ళ కళ్ళు కూడా ఎర్రగా మారాయి. వాళ్ళు ఇతరుల రక్తం కోసం వెతకడం మొదలుపెట్టారు.
ఐలాండ్ – మరొక చోట
అక్కడెక్కడో ఉన్న ఒకచోట ఒక మంచి బాలుడిగా ఉన్న ఒక పిల్ల జాంబీ కళ్ళు పూర్తిగా ఎర్రగా మారి, ఆపై తెల్లగా మారిపోయాయి! అంతే, అతని శరీరం ఉబ్బడం మొదలుపెట్టింది. చుట్టూ ఉన్న పిల్ల జాంబీలను తనలో కలుపుకోవడం మొదలుపెట్టాడు. ఆ ఐలాండ్‌లో అంత పెద్ద స్థితికి ఆ పిల్ల జాంబీ చేరుకోగానే అక్కడ ఒక్క జంప్ చేస్తుంది!
వర్మ భవనం – ప్రస్తుత సమయం
అక్కడ కట్ చేస్తే... వర్మ యొక్క భవనంలో చూపిస్తారు. అప్పుడే తను "నేను ఎలాగైనా మిమ్మల్ని కాపాడాలి, కానీ ఎలా? ఇంత పెద్ద ఆర్మీ ఉంది. నేను నిజంగా కాపాడగలనా?" అనుకుంటున్న టైంలోనే బయట ఆదిత్య కారు దిగుతాడు. దిగి దిగకు ముందే అక్కడున్న గేట్లను ఒక్క పంచుతో పగలగొట్టి లోపలికి వెళ్తాడు. అడ్డం వచ్చిన వాళ్ళను ఒక్క తోపుతో విసిరి కొడితే పైకి ఎగిరి పడిన మనుషులను ప్రభాకర్ కొరికి రక్తం తాగడం మొదలుపెట్టాడు. అతని పని అదే అన్నట్టుగా ఉండగా, చిన్నగా నవ్వుతూ ఉన్నాడు ఆదిత్య.వర్మ ప్యాలెస్ – ప్రస్తుత సమయం (కొనసాగింపు)
ఆదిత్య లోపలికి వెళ్తూ ఉండగా, గేట్ అడ్డం వస్తుంది. అతని ఎదురుగా ఒక వ్యక్తి వెళ్తున్నాడు – అతని పేరు మహర్షి వివిద్. అతడు ఆదిత్యను చూడగానే భయంతో చెమటలు పడుతూ, వణికిపోతూ ఉండగా, ఆదిత్య "మీ గురువుకి చెప్పు, నన్ను బంధించడం ఈ ప్రపంచానికి ఎంత కష్టమో, ఎంత నష్టమో తెలుస్తుంది!" అని అంటూ ఒక్క తన్నుతో గేట్‌ను బ్రద్దలు కొడతాడు. గురూజీ మహర్షి వివిద్ భయంగా పారిపోతాడు.
గేట్ తెరుచుకోగానే, అంతకుముందు ప్రభాకర్ చంపేసిన సైనికులు పూర్తిగా జాంబీలుగా మారి, ఆదిత్యకు సైన్యంగా ఏర్పడ్డారు. లోపలికి రాగానే, వారు ఇతరులను చంపడం, వాళ్ళ రక్తాన్ని తాగడం, మరియు వాళ్ళ మాంసాన్ని ఆప్యాయంగా తింటూ పూర్తిగా ఆరగించడం మొదలుపెట్టారు.
ఆ వికృత సంఘటనలన్నీ చూస్తున్న వర్మ కుటుంబ సభ్యులు భయంతో వర్మ వెనకాలకు వెళ్లారు. వర్మ ఒక అడుగు ముందుకు వేసి, "జగదీష్! నువ్వేనా? ఏంట్రా ఇలా మారిపోయావు?!" అని దగ్గరికి వస్తూ ఉండగా, పూర్తిగా జగదీష్ రూపంలో ఉన్న ఆదిత్య దగ్గరికి వచ్చిన వర్మను గట్టిగా చెయ్యి పట్టుకొని గోడకేసి కొట్టాడు.
వర్మ కూడా ఏం తగ్గకుండా, పడిన వెంటనే తన నోటి నుంచి వస్తున్న రక్తాన్ని తుడుచుకుంటూ, "నువ్వు జగదీష్ కాదు! వాడు చచ్చిపోయాడు! నాకు అర్థమైంది, నువ్వు ఎవరు!" అని అంటూ ఉండగా, ఆదిత్య "వేటగాడు!" అని గట్టిగా నవ్వుతాడు.
అంతే, వర్మకు వీడు వాడే అని అర్థమైపోతుంది. "అయినా నువ్వు ఎలా వచ్చావురా?" అని వర్మ అడుగుతూ ఉండగా, ఆదిత్య "నువ్వు చంపింది నన్ను, నా ఆత్మను కాదు కదా, మిస్టర్?" అని అంటూ, "ఛీ ఛీ ఛీ! మిస్టర్ కాదు, మామాజీ!" అని అంటూ దగ్గరికి వస్తూ ఉంటాడు.
"చూడు! నువ్వు ఏమైనా చెయ్, కానీ నా ఫ్యామిలీని వదిలేయ్!" అని అంటాడు వర్మ.
కానీ ఆదిత్య, "నువ్వు వదిలేశావా? నువ్వు వదిలేశావా, ముసలి నక్కా?" అని అంటాడు.
"అయితే మీ వాళ్ళు చనిపోయారని నేను చెప్పానా? వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు! కాబట్టి నువ్వు నా కుటుంబాన్ని ఏమి చేయకూడదు! అయినా నీకు ఏం హక్కు ఉంది నా కుటుంబాన్ని చంపి తినడానికి? అయినా నువ్వు జాంబీగా మారడం నా తప్పా?" అని అంటున్నాడు వర్మ.