Read Oh my... - 3 by vasireddy varna in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • థ జాంబి ఎంపరర్ - 1

    జాంబి ఎంపరర్ (The Zombie Emperor) అలా కట్ చేస్తే... ఒక నిశ్శ...

  • తనువున ప్రాణమై.... - 10

    ఆగమనం.....దెబ్బ తగలకుండా, దెయ్యం ఎలా వదులుతుంది నీకు!!ఏదో లవ...

  • అంతం కాదు - 2

    అమ్మాయి అలా వెళ్తూ ఉండగా రుద్రకు ఇక్కడ ఏదో తెలుస్తుంది. తన ద...

  • ఓ మనసా... - 3

    ఒక స్ట్రాంగ్ సెండ్ ఆఫ్ కిస్ తో టీనా లిప్స్ బైట్ చేసి నొప్పిన...

  • చంద్రుడు

    మానవ భావోద్వేగాలు, చెప్పని కథలు మరియు వ్యక్తిగత అంతర్దృష్టుల...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఓ మనసా... - 3




ఒక స్ట్రాంగ్ సెండ్ ఆఫ్ కిస్ తో టీనా లిప్స్ బైట్ చేసి నొప్పిని కవర్ చేస్తున్న టీనా ఫేస్ కి నీలాంటి యావరేజ్ ఫిగర్ నాలాంటి క్రషింగ్ మిషన్ ను కెలకకూడదు.

డోంట్ రిపీట్ దిస్ అని పొమ్మన్నాడు.


నేను యావరేజ్ ఫిగర్..??? తన బ్యూటీ మీద ఉన్న ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉడుక్కుంటూ అడిగింది.



తన ఆన్సర్ చెప్పకుండా షట్ అప్ అండ్ గెట్ అవుట్ నాకు కావాలంటే కాల్ చేస్తా అప్పుడు దాకా నా ప్రిమిసెస్ లో నీ ఎంట్రీ ఉండకూడదు అని వార్నింగ్ ఇచ్చినట్టే చెప్పాడు రానా.


రానా ఇచ్చిన వార్నింగ్ కి దడుచుకొని విసురుగా బయటకు వచ్చిన టీనా ని చూస్తూ ఈ పొట్టి దానికి కూడా డోస్ పడింది.

వీడేంటో ఈ మధ్యన అసలు అర్థం కావడం లేదు నాకు. అందరితో ఎంజాయ్ చేస్తాడు అందరికీ మళ్లీ కనబడకూడదని వార్నింగ్ ఇస్తాడు అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు ఉదయ్.


టీనా క్లీన్ చేసిన పర్సనల్ రూమ్ లో మిర్రర్ ముందు హెయిర్ సెట్ చేసుకుంటున్నాడు రానా.


ఏరా బుద్ధుందా నీకు ఈ పొట్టి దాన్ని కూడా పంపించేస్తే ఇంకొకరిని ఎక్కడి నుంచి తీసుకు రావాలని లోపలికి రావడమే రానా మీద సీరియస్ అవుతుంటే.



ముయ్యరా ఆ పొట్టిదేమి ఉత్తమ జాతి కన్యారత్నం కాదు. దాని అకౌంట్ లో చాలా ఎంట్రీస్ ఉన్నాయి. డబ్బు కోసం నన్ను ప్రొవొక్ చేసిన అటువంటి క్యారెక్టర్ మన ఆఫీసులో ఉండటం కరెక్ట్ కాదు.

దాని వల్ల మనకి కానీ బిజినెస్ కి కానీ సింగిల్ పెన్నీ యూస్ లేదు. అది తప్ప భూమి మీద అమ్మాయిలే లేనట్టు మాట్లాడకు అని ఇరిటేట్ అవుతూనే ఫ్రంట్ రూమ్ లో టేబుల్ దగ్గరికి వచ్చి టెండర్ ఫైల్ తీసుకోవడంతో

అప్పటి వరకు గంటు పెట్టుకున్న ముఖంతో ఉన్న ఉదయ్ వస్తున్నావా అంటూ ఎక్సైట్ అవుతూ అమ్మాయి మేటర్ వదిలేసాడు.



మనుషుల ఫీలింగ్స్ తో పని లేని ఆ ముసలోడి దగ్గర నువ్వు మాట పడడం ఏంట్రా ..?? పద అంటూ బయటికి రావడంతో వెంటే నడిచాడు ఉదయ్.


కారు దగ్గరికి వెళ్లే వరకు టెండర్ గురించి డిస్కస్ చేసిన రానా కార్ దగ్గరికి రాగానే డోర్ ఓపెన్ చేస్తూ ఫైల్ ఉదయ్ చేతికిచ్చి నెక్స్ట్ పిఏ ఎప్పుడు వస్తుంది అని అడగడంతో మళ్ళీనా అంటూ నీరసంగా చూసాడు ఉదయ్.

లేదంటే ఆ వర్క్ నువ్వు చేయాలి అని కంపెనీ మేనేజర్ ఆర్ మై పర్సనల్ సెక్రెటరీ.. విచ్ వన్ యు వాంట్..???
ఆ  ప్రశ్న ఉదయ్ కి వదిలేసి కార్ ఎక్కి కూర్చున్నాడు.


రాణా కు పర్సనల్ సెక్రెటరీ అనేసరికి టారెత్తిన ఉదయ్ అంకుల్ కి ఎవరి సెకండ్ నేనే ఆన్సర్ చేయాలి ఇదంతా నా వల్ల కాదు. 

దాని కన్నా వీడికి పర్సనల్ సెక్రెటరీ పట్టుకోవడమే బెటర్ అనుకుంటూ వెళ్లి రానా సైడ్ సీట్ లో కూర్చోగానే కారు వాయు వేగంతో రోడ్డు మీదకి దూసుకెళ్లింది.





ఫాస్ట్ గా వచ్చిన బైక్ బ్రేక్ కూడా వేయకుండా మెయిన్ గేట్ దగ్గరే వదిలేసి అంతకన్నా ఫాస్ట్ గా చైత్ర చైత్ర అని అరుస్తూ స్టెప్స్ నుంచి పైకి పరిగెత్తాడు వికాస్.

ఒక చిన్న ఇండిపెండెంట్ హౌస్ అది. 

కింద ఇంటి ఓనర్స్ ఉంటుంటే పైన రెండు చిన్న చిన్న రూమ్స్ తో ఉన్న పెంట్ హౌస్ లో రెంట్ ఉంటుంది చైత్ర.


ఇంటి బయట క్యాన్ కేన్ ఉయ్యాలలో కూర్చుని ఆన్లైన్లో జాబ్స్ హంటింగ్ తో ఫోన్ లో బిజీగా ఉంది చైత్ర. 

వికాస్ అరుపులకి ఉలిక్కి పడుతూ చూసింది.



బయటే ఉండడంతో ఇక్కడే ఉన్నావా అంటూ దగ్గరికి వచ్చిన వికాస్ ను ఎందుకు అలా అరుస్తున్నావు? కింద ఆంటీ వాళ్ళు దడుచుకుంటారు నీ అరుపులకి అంది ఫోన్ స్క్రీన్ ఆఫ్ చేస్తూ.


ఓకే ఓకే సారీ వాళ్ళ విషయం మర్చిపోయి ఎక్సైట్మెంట్లో కొంచెం ఓవర్ చేశాను. ఎక్స్ క్యూస్ చేయమని ముందు చెవులు పట్టుకున్నాడు.


ఓకే, డోంట్ రిపీట్ ఇట్ అగైన్ అని చైత్ర ఒక స్మైల్ ఇవ్వడంతో నీకు ఒక గుడ్ న్యూస్ అంటూ తనతో తెచ్చిన న్యూస్ పేపర్ చైత్ర కి ఇచ్చాడు సర్కిల్ చేసిన పర్టికులర్ జాబ్ కాలమ్ చూడమని.


అది చూసిన చైత్ర కళ్ళు మెరిసాయి.

బట్ చాలా మంది కాంపిటీటర్స్ ఉంటారు అంది నిరుత్సాహంగా.


సో వాట్ వుంటే ఉండనివ్వు యు ఆర్ ద బెస్ట్ డెఫినెట్ గా నువ్వు సాధిస్తావని చైత్ర షోల్డర్ తట్టాడు వికాస్.



అతని మోటివేషన్ కి కృతజ్ఞతగా చూసి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పు అని అడిగింది వెంటనే.


చైత్ర ఇన్నోసెన్స్ కి చిన్న స్మైల్ తో మై డియర్ స్వీట్ చైత్ర ఆల్ ది బెస్ట్ ఈ జాబ్ నీకే పక్కా. 

రాసి పెట్టుకో అని కాన్ఫిడెంట్ గా చెప్పి డే ఆఫ్టర్ టుమారో డైరెక్ట్ ఇంటర్వ్యూ. జస్ట్ 24 అవర్స్ ముందు నీ పేరు రిజిస్టర్ చేసుకుంటే చాలు.

నా చైత్ర ని కొట్టిన వాళ్లు ఉండరు. ప్రిపేర్ వెల్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు.




షేర్ యువర్ కామెంట్స్ అండ్ రేటింగ్స్.

థాంక్యూ...

____వర్ణ_____