Read Oh my... - 5 by vasireddy varna in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • మౌనం మట్లాడేనే - 4

    ఎపిసోడ్ – 4ఎదురుగాలిలో నిలిచిన నిశ్శబ్దంఅలా సముద్రపు ఒడ్డులో...

  • అంతం కాదు - 4

    అంతం కాదు సిరీస్: రుద్ర పవర్ ఆఫ్ రుద్రమణులుఎపిసోడ్ 8: గతం ను...

  • ఓ మనసా... - 5

    నీ టెన్షనే చెప్తుంది మా ఇద్దరి మధ్యలో నువ్వు ఎంత స్ట్రెస్ తీ...

  • తనువున ప్రాణమై.... - 11

    ఆగమనం.....ఇటువంటి సిట్యుయేషన్ లో ఎవరైనా ఏం చేస్తారు!! కూర్చొ...

  • థ జాంబి ఎంపరర్ - 2

    అతని చేతిలోని గ్లాసు టేబుల్‌పై పగిలిపోయింది."నాకు తిరిగి అక్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఓ మనసా... - 5








నీ టెన్షనే చెప్తుంది మా ఇద్దరి మధ్యలో నువ్వు ఎంత స్ట్రెస్ తీసుకుంటున్నావో  అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్న ప్రతాప్ వర్మ ఇట్స్ ఓకే నువ్వు కూడా వెళ్ళు. 

నువ్వు వెళ్తేనే వాడు కొంచెం కంట్రోల్ లో ఉంటాడు అని నెక్స్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడని అడిగారు.



సాటర్డే అంకుల్. సెకండ్ ఆఫ్ ఫ్రీ టైం ఉంటుందని ఆఫ్టర్నూన్ అనౌన్స్ చేశానని రీజన్ చెప్పాడు.



శనివారమా..?? అని ప్రతాప్ వర్మ గ్యాప్ తీసుకుంటే 


ఏ అంకుల్ వేరే ఏదైనా వర్క్ ఉందా అని అడిగాడు ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టు అనిపించి.


నో నో ఉదయ్ నాట్ లైక్ దట్. యాక్చువల్ గా శనివారం మంచిది కాదు. ఇంటర్వ్యూ సోమవారానికి పోస్ట్ ఫోన్ చెయ్.


అంకుల్ బట్ సాటర్డే ఇంటర్వ్యూ అని అనౌన్స్ చేసేసాను.


అయితే ఏమైంది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న అందరికీ ఇంటర్వ్యూ మండే అని రిటర్న్ మెసేజ్ పంపించండి.

ఈసారైనా అమ్మాయిని కాకుండా క్వాలిఫైడ్ అబ్బాయి దొరికితే సెలెక్ట్ చేయి అని ఆర్డర్ వేసినట్టే చెప్పి కాల్ కట్ చేశాడు ప్రతాప్ వర్మ.


కట్ చేసిన ఫోన్ వైపు అసహనంగా చూసి ఈ తండ్రి కొడుకుల ఇద్దరి మధ్యలో చస్తున్న ఇప్పుడు ఈ విషయం వాడికి చెప్తే వాడు ఏం చేస్తాడోనని రానా గురించి తలుచుకుంటూ తల పట్టుకుని చైర్ లో కూలబడ్డాడు ఉదయ్.


అతని టెన్షన్ ఇంకా పెంచుతూ సరిగ్గా అప్పుడే రానా నుంచి ఫోన్ వచ్చింది. 


వాల్ క్లాక్ చూసాడు ఉదయ్.. సరిగ్గా 6:00 చూపిస్తుంటే వీడు.. వీడి టైం సెన్స్ చంపుతున్నాడు వెధవ అని ప్రస్టేట్ అవుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా అన్నాడు. 


ఏంటి ఏంటి రా..?? ఎక్కడ చచ్చావ్ అని కంగుమంది ఫోన్లో రానా వాయిస్.

ఇంకెక్కడ చస్తాను, ఆఫీసులోనే ఉన్నాను అని చిరాకుగా వినిపిస్తున్న ఉదయ్ వాయిస్ తో ఆ పెద్దమనిషి ఫోన్ చేశాడా అని షార్ప్ గా ప్రశ్న రానా సైడ్ నుంచి. 



ఇప్పుడు అదంతా చెప్పడం ఎందుకని స్టార్ట్ అయ్యాను వస్తున్నా అని కాల్ కట్ చేయడానికి చూస్తే వచ్చాక చస్తావ్ అని రైస్ చేసిన గొంతుతో ఫస్ట్ ఐ వాంట్ ఆన్సర్ అన్నాడు రాణా.


ఇప్పుడు నిజం చెప్తే మళ్లీ గొడవ గొడవ చేసి పెడతాడని న్యూ ప్రాజెక్ట్ సెమినార్లో అంకుల్ తో పాటు నువ్వు కూడా ఉండాలి కదా దాని గురించి అడిగారని మిగతా మ్యాటర్ మొత్తం కట్ చేసి అదొక్కటే చెప్పాడు. 


అటువంటి పెద్ద మనుషులతో ఉండే అర్హత మాకు లేదులే. అందుకే మా లోకంలో మేము జోగుతున్నాము అని అంతేనా ఇంకా ఏమైనా ఎక్స్ట్రాలు అడిగాడా అంటూ తండ్రి మీద కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంటే 

ఇంకేమీ అడగలేదు అని బాధగా చెప్పి రాను రాను చెడిపోతున్నావు రా అంటే అబ్బా ఛా మాకు తెలియదులే మరి.  

చెప్పింది చాలు కానీ మూసుకొని స్టార్ట్ అవ్వు, టెన్ మినిట్స్ లో ఇక్కడ ఉండాలి. వచ్చాక ‌నాతో పాటు నిన్ను కూడా చెడగొడతాను అని కాల్ కట్ చేసాడు రానా. 




అందరూ కలిసి చేసిన తప్పులకి వీడి లైఫ్ స్పాయిల్ అయింది. ఇలా ఎంత కాలం?? 

తిరిగి ఎప్పటికీ మీరు లైఫ్ సెట్ అవుతుడాని తనకు తెలిసిన నిజాలను తలుచుకుంటూ ఫీలవుతూనే రాణా దగ్గరికి స్టార్ట్ అయ్యాడు ఉదయ్.




రాణా లేకుండానే ప్రతాప్ వర్మ మేనల్లుడు వివేక్ తో కలిసి మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చాడు.


పోర్టికోలో కార్ పార్క్ చేసి మావయ్య వచ్చేసాం అనడంతో సీట్ లో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్న ప్రతాప్ వర్మ బయటకు చూశారు.


ఇంద్ర భవనం లాంటి తన మాన్షన్ చూస్తున్న ప్రతాప్ వర్మలో కొడుకు తనతో లేడు అన్న అసహనం.


ప్రతాప వర్మ ఫీలింగ్ తెలియనిది కాదు వివేక్ కి.


మావయ్య మీరు ఇలా సింగల్ గా కంపెనీ వర్క్స్ అన్ని మేనేజ్ చేయడం చూస్తుంటే నాకు చాలా కష్టంగా ఉంది అంటూ సానుభూతి పండించాడు.


ఫస్ట్ నువ్వు కంపెనీ వర్క్స్ లో నీ రెస్పాన్సిబిలిటీస్ ప్రొపర్ గా తెలుసుకో. ఆ తర్వాత నా గురించి ఫీల్ అవ్వచ్చు అని ఒక కార్నర్ స్మైల్ తో రోమాటికి ఛాన్స్ లేకుండా చురక అంటించి కార్ దిగేసాడు ప్రతాప్ వర్మ.




ఏంటి డ్రైవర్ గా ఈయన గారిని తీసుకెళ్లి తీసుకు రావడమే నా రెస్పాన్సిబిలిటీ నా..?? ప్రతాప్ వర్మ దగ్గర తన మాట సాగక వచ్చిన కడుపు మంటతో స్టీరింగ్ ని పట్టుకొని ఊపేస్తూ 

24 గంటలు ఈయనతో పాటు తిరుగుతూ ఇంక నేను ఎప్పుడు వర్క్ నేర్చుకుంటాను ఎప్పుడు రెస్పాన్సిబులిటీ తీసుకుంటానని ఇరిటేట్ అవుతూ కార్ దిగి రాణా కి ఫోన్ చేశాడు.


గెస్ట్ హౌస్ లో బుడ్డి బుడ్డి డ్రెస్సులు వేసుకున్న భామల మధ్య ఓపెన్ షవర్ బాత్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు రాణా.

బికినీ బేబీస్ తో డాన్స్ చేస్తున్న, ఎగురుతున్న అతని ముఖంలో చిన్న స్మైల్ కూడా లేదు.


వీళ్ళకి దూరంగా జస్ట్ డ్రింక్ చేస్తూ కూర్చున్నాడు ఉదయ్.


స్క్రీన్ మీద వివేక్ నంబర్ కనిపించి ఆ టైంలో చేయడంతో ఇంపార్టెంట్ కాల్ అని బ్యూటీ బేబీస్ మధ్యన ఉన్న రానని పక్కకు లాగి వివేక్ మాట్లాడు అన్నాడు ఫోన్ చేతిలో పెట్టి


నా బామ్మర్ది గాడు, ఆ ముసలోడు ఏదో చెప్పి ఉంటాడు అందుకే కాల్ చేశాడని అంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి పోయావా ఇంటికి అని అడిగాడు.

ఆ ఇప్పుడే వచ్చాను బావ అన్నాడు చిరాకుగా.


@@@@@@@@@@@@@@@@@@@@@⁨


షేర్ యువర్ కామెంట్స్ అండ్ రేటింగ్స్.

థాంక్యూ...
____వర్ణ_____