ఉలిక్కిపడి లేచిన రుద్ర ఏదో పట్టుకోవడానికి ఆపుతున్నట్టుగా, ఒక్కసారిగా చేశాడు. ఎక్కడో ఉన్న కారు ఒక్కసారిగా ఆగి కింద పడుతుంది. ఆ వెంటనే రుద్ర మేల్కొని, "ఏం జరిగింది అసలు?" అని అనుకుంటూ ఉండగా, పక్కన ఉన్న అక్షరను చూసి, "ఎవరు? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు?" అని అడిగాడు.
సుమిత్ కూడా లేచి, "ఏమైందిరా, అట్రా రు?" అని అంటూ ఉండగా, అక్షర ఒక్కసారిగా కళ్ళు తెరుస్తూ, "హాయ్ రుద్ర! అప్పుడే మర్చిపోయావా?" అని అడిగింది.
మాట్లాడుతూ సుమిత్, "తాగి ఉన్నాడు కదా, మర్చిపోయాడు. అదే రాత్రి నువ్వు తాగి ఉన్నప్పుడు తనే నిన్ను తీసుకువచ్చింది. అంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తుందిలే అని ఇక్కడే పడుకోమని అంటే, తను ఇక్కడే పడుకుంది. చాలా మంచి అమ్మాయి!" అని అన్నాడు.
"ఓ సారీ అండి, మీకు ఇబ్బంది కలిగించినట్టు ఉన్నాను" అని రుద్ర అన్నాడు. "సరే, నాకు చిన్న పని ఉంది" అని అంటూ బయలుదేరాడు.
అక్షర చిన్నగా, "ఏంటి ఇతను? కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. రాత్రి 'బుజ్జి' అంటూ మాట్లాడాడు!" అని మనసులో అనుకుంది. "సరే, ఇంక నేను వెళ్తాను" అని సుమిత్‌కి చెప్పింది.
"ఆగండి! ఎక్కడికి వెళ్తారు? కనీసం మీరైనా ఇక్కడ ఉండి ఈరోజుకి వంట చేసి వెళ్తారా?" అని సుమిత్ సిగ్గు లేకుండా అడిగాడు.
అక్షరకి కావాల్సింది కూడా అదే కాబట్టి, "సరే అండి, మీరు అడిగారు కాబట్టి చేస్తాను" అని అంటూ వంటగదిలోకి వెళ్లి చకచకా తనకు తెలిసిన విధంగా వంటలు చేసి పెట్టింది.
(సీన్ 5: హనుమంతుడి ఛాయ)
ఇలా ఇక్కడ ఉండగా, ఎక్కడో ఒక ముసలి వ్యక్తి, ఒక అబ్బాయిని కారులో నుంచి బయటికి తీసి, ఆకాశంలో ఎగురుతున్న ఒక నీడను చూశాడు. అది చూడడానికి కొండని ఎత్తుకుని వెళ్తున్న హనుమంతుడిలా దృశ్యంలో కనిపించింది.ఎపిసోడ్ 7: కలలు, కలయికలు, మరియు రహస్యాల ఆవిష్కరణ
(సీన్ 1: ముసలి వ్యక్తి మరియు శివ - రహస్య స్థావరం)
హనుమంతుడిలా కొండని ఎత్తుకుని వెళ్తున్న నీడను చూసిన ఆ ముసలి వ్యక్తి (ఇతను గతంలో రుద్ర చిన్నతనంలో లాకెట్ ఇచ్చిన వ్యక్తి, అలాగే రుద్రమణుల రాజ్యంపై దాడి జరిగినప్పుడు అమ్మాయిని లోపలికి పంపించిన బాబీ తాత అయ్యుండవచ్చు) ఆరాధనతో దండం పెట్టి, ఆ అబ్బాయిని (రుద్ర కలలో కనిపించిన వ్యక్తి, శివ) తీసుకువెళ్తాడు.
"ఈ నీడను చాలా రోజులకు చూస్తున్నాను. రుద్ర తన శక్తిని తనకే తెలియకుండా ఉపయోగిస్తున్నట్టున్నాడు" అని ఆ ముసలి తాత తన మనసులో అనుకున్నాడు. "నా మనవడే!" అని ఆనందంగా తలుచుకున్నాడు.
తను ఎత్తుకున్న ఆ అబ్బాయి (శివ) ని ఒక అండర్‌గ్రౌండ్ స్థావరంలోకి తీసుకువెళ్ళి, నీలిరంగు కాంతులతో మెరుస్తున్న, ఎంతో కష్టపడి తయారుచేసిన ఒక పెద్ద రూమ్‌కి తీసుకువెళ్తాడు. అక్కడ మరో ముసలి వ్యక్తి ఉంటాడు.
కొద్దిసేపటికి శివ తల విదిలించుకుంటూ కళ్ళు తెరిచి, పక్కన ఉన్న ముసలాయనను చూసి, "ఓల్డ్ మ్యాన్! నువ్వేంటి ఇక్కడ? నేను ఎక్కడున్నా? మనం ఎక్కడున్నాం?" అని చుట్టూ చూశాడు. అతని మీద 'SRS' అనే పేరుతో ఒక బ్లూ కలర్ సూట్ ఉంది, అది తనదే అని అతనికి గుర్తుంటుంది. "అవును, ఇంకో వ్యక్తిని చూసి," "మీరే కదా నాకు ఆ లిక్విడ్ ఇచ్చింది? నేను ఎలా మర్చిపోతా? అయినా ముసలాయన, నువ్వేంటి ఇంటి దగ్గర ఉండకుండా? మా అన్న కొడుకుని నువ్వు చూశావు కదా? ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు?" అని అడగడం మొదలుపెట్టాడు.
ఒక పక్క నుంచి డోర్ తెరుచుకుని, అన్న శివ, వదిన, మరియు అన్న కొడుకు నాని - ముగ్గురు బయటికి లోపలికి వస్తారు. వాళ్ళని చూసి శివ, "అన్నా! వదినా! నానీ! మీకేం కాలేదు కదా? శ్వేత ఎక్కడ?" అని ఆందోళనగా అడగడం మొదలుపెట్టాడు.
వెంటనే ఓల్డ్ మ్యాన్ (తాత) మాట్లాడుతూ, "శ్వేత బండి పోయిందంట కదా, దానికోసం వెతుకుతూ ఉంది. ఇంతలో నువ్వు నాకు ఫైటింగ్ చేయడం, నేను వీళ్ళను కాపాడటం, అదే టైంలో మన కేసు గెలవడం... ఆ రోజున అయితే నిన్ను ఆ 'సిరీస్' కంపెనీ వాళ్ళు చంపించడానికి ప్రయత్నించడం... ఇలా అన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు శ్వేత ఎక్కడా లేదు, తన ఫ్రెండ్ దగ్గరే ఉంది కాబట్టి టెన్షన్ పడకు" అని చెబుతూ ఊరడించాడు.
ఇలా సీన్ కట్ అవుతుంది.
(సీన్ 2: అక్షర, శ్వేత పరిచయం)
మరో వైపు చూపించగా, రుద్ర బయటికి వెళ్ళాడు. అక్షర కూడా, "సరే, ఇక మీరు తిన్నారు కదా, నేను వెళ్తాను" అని అనుకుంటూ తన పసుపు రంగు బైక్ తీసుకుని ఆలోచిస్తూ ఉంటుంది. "బైక్ ఎవరిదో గానీ, పాపం బండి పోయిందని ఎంతలా బాధపడుతున్నారో" అని అనుకుంటూ వేగంగా వెళుతూ ఒక చోట ఆగింది. "ఇక్కడికి రావాలి" అని చుట్టూ చూస్తూ ఉండగా, అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది.
ఆ అమ్మాయి (శ్వేత) తన బండిని చూసి, "ఎవరు మీరు? ఆ బండిని తీసుకుని ఎందుకు ఇలా వాడుకుంటున్నారు? కనీసం అడిగారు అన్నా లేదే? ఒక రోజంతా ఏం చేస్తున్నారు?" అని దబాయించడం మొదలుపెట్టింది. ఒక పక్క నుంచి పోలీసులు వచ్చి, "ఏమ్మా! నీ బైక్ దొరికిందా? ఇక మేము వెళ్తాం" అని అంటూ వెళ్లిపోయారు.
ఆ వెంటనే అక్షర శ్వేతను చూస్తూ, "సారీ అండి, నిన్న అర్జెంట్ పని ఉండి తీసుకువెళ్ళాను. మళ్ళీ మీకు చెబుదామనుకున్నా, కానీ మీరు ఎక్కడా కనిపించలేదు. అందుకని తీసుకువెళ్ళాను, సారీ!" అని చెబుతూ, "నా పేరు అక్షర, నీ పేరు ఏం?" అని శ్వేతను అడిగింది.
శ్వేత, "నా పేరు శ్వేతా" అని చెబుతుంది. ఇద్దరూ అలా కలిసి కాఫీ షాప్‌కి వెళ్లి కాఫీ తాగుతూ, ఇద్దరూ స్నేహితులు అయిపోయారు.
(సీన్ 3: రుద్ర కేసు ఛేదన)
మరో పక్క, రుద్ర తన ల్యాప్‌టాప్ దగ్గర కూర్చుని, కొన్ని రోజులుగా జరుగుతున్న సంఘటనను వన్ బై వన్ చూస్తున్నాడు. ఒక కేసు అతనికి కనిపిస్తుంది. ఎవరో కొంతమంది హ్యాకర్లు ఒకచోట నుంచి డబ్బును 'తరలిస్తున్నామని' చెప్పి పోలీసుల డబ్బు కొట్టేయడం, ఆ తర్వాత అది మళ్ళీ రిసీవ్ చేయడం, ఆ తర్వాత ఎవరు రావడం... ఇలా విచిత్రమైన ఒక కేసులో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అలాగే మధ్య మధ్యలో తను అనుకున్నట్టే స్కానర్లను స్కాన్ చేసి డబ్బులు లాక్కోవడాన్ని ఎవరో గమనించి, దానిమీద ఒక బగ్‌ను సెట్ చేయడం, దాని తర్వాత ఆ అబ్బాయి (శివ) కనిపించకుండా పోవడం, అతనిని 'శివ' అని పిలవడం... ఇలా మొత్తం సీన్ కలిసిపోయి ఒక స్టోరీలో కలిసిపోతుంది.