Read Oh my... - 1 by vasireddy varna in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • అంతర్జాతీయ మాతృ దినోత్సవం

    అంతర్జాతీయ మాతృ దినోత్సవం (ఆంగ్లం: Mother's Day) కని పెం...

  • ఉత్తరం

    ఉత్తరం " ఏమిటి ! సాంబయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చి అప్పుడే పద...

  • ఓ మనసా... - 1

    కోట్లాది ఆస్తులకు ఒక గాను ఒక్క వారసుడు. వంటి చేత్తోనే తన వ్య...

  • స్వగతం - 1

    స్వగతం....నేను జీవితంలో చాలా మందిని కలిశాను,కొంత మంది పేర్లు...

  • ఆర్థిక శాస్త్రవేత్త

    ఆర్థిక శాస్త్రవేత్తఇల్లంతా ఎంత సందడిగా ఉండేది. అమ్మమ్మ ఎప్పు...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఓ మనసా... - 1




కోట్లాది ఆస్తులకు ఒక గాను ఒక్క వారసుడు. వంటి చేత్తోనే తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఏక చత్రాధిపత్యంతో ఏల గల ఘటికుడు.

అహంకారం ఆవేశం అతనికి పెట్టని ఆభరణాలు. ఎవరిని నమ్మకపోవడమే అతని విలక్షణత. అమ్మాయిలంటే చిన్న చూపు తేలిక భావం. 

తండ్రిని ద్వేషించే పుత్రరత్నం. అతని ముందు నిలబడి మాట్లాడాలంటేనే వణికిపోయే తత్వం అతని చుట్టూ ఉన్నవారికి.

కుటుంబాన్ని వెలి వేసి తనదైన ప్రపంచంలో ఎటువంటి బంధాలకు బాంధవ్యాలకు చోటు ఇవ్వకుండా ఒంటరి రాక్షసుడిగా బతికే అతను. 


అల్లారం ముద్దుగా అనురాగాల మధ్యన పెరిగిన నిండు జాబిలి. అభిమానమే మెండైన ఆభరణం. నలుగురిని కలుపుకుపోయే తత్వం, తప్పు చేస్తే ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఆమె లక్షణం. 

గుండె లేని ఈ మొండి మనిషి చల్లని జాబిలి జత కడితే... 

జత కాగలడా..?? ఆ జాబిలి ప్రేమను అందుకోగలడా..??

మనసు చేసే ఆ వింత మాయను తెలుసుకోండి.....❤️‍🔥



*****************



అందమైన ఆహ్లాదకరమైన ఓ సాయంత్ర సమయం.

చుక్కలు చంద్రుడి పక్కన ఆకాశంలో మెరవడానికి సిద్ధమవుతున్న వేళ, చల్లని చిరుగాలి మనసుకు హాయిగా అనిపిస్తుంటే తనతో ఉన్న అబ్బాయి తో క్లైమేట్ చాలా బాగుంది.

థాంక్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఈవెనింగ్ చుట్టూ ఉన్న గ్రీనరీని ఇష్టంగా చూస్తూ చెప్పింది ఆమె.


నీకు ఇలా ఉంటే నచ్చుతుందనే ఇక్కడికి తీసుకొచ్చాను అని ఆమె ఫేస్ లో కనిపిస్తున్న ప్రసన్నతకు ఇదే కరెక్ట్ టైం నా ప్రపోజల్ తన ముందు ఉంచడానికి అనుకుంటూ

అప్పటి వరకు తనలో తానే ట్రైల్స్ వేసుకున్న మాటలన్నీ మనసులో మరోసారి  రిపీట్ చేస్తూ ఆమె కోసం కొన్న డిజైనర్ గోల్డ్ రింగ్ పాకెట్ లోంచి బయటకు తీసాడు.



మొదటి చూపుకే ఆమె అందానికి ఎట్రాక్ట్ అయిన, తన ఫీలింగ్స్ ని ఎప్పుడు బయట పడనివ్వకుండా చాలా కంట్రోల్ గా ఉన్న అతను ఈరోజు ఆమెకి తన మనసులోని మాట చెప్తున్నాడు.


చాలా టెన్షన్ గా ఉంది అతనికి...

ఇన్ని రోజుల పరిచయంలో ని తన ప్రేమను ఆమె ముందు ఉంచుతున్న అతనికి ఆమె యస్ చెప్తుందన్న కాన్ఫిడెన్స్ ఫుల్ గా ఉన్న ఎందుకో టెన్షన్ గా ఉంది.

ఆమె రియాక్షన్ ఎలా ఉంటుందోనన్న ఆలోచనతో గొంతు సెట్ చేస్తున్నట్టు ఉ.. ఉ.. అని చిన్నగా సౌండ్ చేసే సరికి నేచర్ తో కనెక్ట్ అయిన ఆమె తిరిగి చూసింది మెరిసే కళ్ళతో.



ఒత్తైనా కనుబొమ్మల మధ్యన మెరుస్తున్న నల్లటి ఆమె కను పాపలలో తన ఫేస్ చూసుకుంటు 

ఐ లవ్ యువ్..!! ఆ ఒక్క మాటలోనే తన మనసులోని ప్రేమంతా తెలిసేలా చెప్పి గోల్డ్ రింగ్ ఆమె ముందు ఉంచాడు.


అతని ప్రపోజల్ వింటూనే ఆమె ఫేస్ డల్ అయితే గోల్డ్ రింగ్ బాక్స్ క్లోజ్ చేసి నిలబడుతూ సారీ అంది.


నేనంటే నీకు ఇష్టం కదా,  మరి సారీ ఎందుకు.. అని ఒక రకమైన షాక్ స్టేట్లో అడిగిన అతని గొంతులో సన్నటి వణుకు.


నువ్వంటే నాకు ఇష్టమే, బట్ ప్రేమించి పెళ్లి చేసుకునే అంత ఇష్టం కాదు. నాకంటూ ఎవరూ లేని జీవితంలో నువ్వు నాకు మంచి ఫ్రెండ్ లా చాలా ఇష్టం.

అంతకు మించి నేను ఎప్పుడు ఇలా ఊహించలేదు. అసలు నీ నుంచి నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదని స్పష్టంగా చెప్పినా ఆమెలో కూడా చిన్న గిల్టీ ఫీలింగ్.

నిన్ను బాగా అర్థం చేసుకున్న నేను నీకు మంచి భర్తగా ఉండగలను. నీకు ఏ కష్టం రాకుండా చూసుకోగలనన్న నమ్మకం నాకుంది.

ఇప్పటి వరకు నీకు నా మీద ప్రేమ లేకపోవచ్చు ఇప్పటి నుంచి ప్రేమించు అని ఆమె లేకపోతే బతకలేనన్నట్టు, ఆమె జీవితం అన్నట్టు చెప్పాడు.



అతని ప్రేమ అర్థం అవుతుంటే చిప్పిల్లుతున్న కళ్ళతో నా మనసులో మరొకరు ఉన్నారు.

అతనినే నేను ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాము అని తన ప్రేమ గురించి చెప్పింది.

అలా అస్సలు ఊహించని అతనికి చాలా షాకింగ్ గా అనిపించి ఏమంటున్నావ్ అన్నాడు నమ్మలేనట్టు.

నన్ను క్షమించు అని ఆయన కన్నా ఒక్క రోజు ముందు నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసి ఉంటే నా మనసు ఆయన వైపు అట్రాక్ట్ అయ్యేది కాదేమో అంది.


ప్రేమ పెళ్లి అని ఆమె అంత క్లియర్ గా చెప్తుంటే అతని చేతిలోని గోల్డ్ రింగ్ బాక్స్ నేల మీదకు జారి పడిపోయింది


హు.. ఒక్క క్షణం చాలు ప్రేమ పుట్టడానికి అంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు మన విషయంలో అది నిజమైందని చాలా విరక్తిగా అని నీ దృష్టిలో నేను ఒక మంచి స్నేహితుడిని మాత్రమే, కానీ నా దృష్టిలో నువ్వు నా జీవితం. 

నా జీవితంలో నువ్వు లేకపోయినా సరే నువ్వు కోరుకున్న వ్యక్తితో నీ జీవితం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తనకు దక్కని ఆమెని మరోసారి తనివి తీర చూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ


రెండు అడుగులు ముందుకు వేసిన అతను మరోసారి వెనుకకు తిరిగి చూడగా కళ్ళనిండా కన్నీళ్ళతో క్షమాపణ చెప్తున్నట్టుగా చూస్తుంది ఆమె.


నా గురించి ఆలోచించకు, బాధపడకు నేను బాగుంటాను అని నమ్మకంగా చెప్పి నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను ఉన్నానని మాత్రం మర్చిపోకు. 

జాగ్రత్త అని వెళ్ళిపోయాడు.


ఇన్ని సంవత్సరాల స్నేహం ఇలా ఒక లవ్ రిజెక్షన్ తో దూరమవుతుంటే బాధగా అతనినే చూస్తూ బెంచ్ మీద కూలబడింది ఆమె.


**********



21 అంతస్థుల బిల్డింగ్ కాంపౌండ్ లోకి హై స్పీడ్ తో రాకెట్ల వచ్చి ఆగింది బ్లాక్ రేంజ్ రోవర్.

కార్ ను చూడడమే స్పీడ్ గా వచ్చి డోర్ ఓపెన్ చేసే లోపే లోపల నుంచి డోర్ ఓపెన్ అవడంతో స్టిఫ్ గా సెల్యూట్ చేసిన సెక్యూరిటీకి ఫుల్ టెన్షన్ కారులో ఉన్న వ్యక్తి అంటే.

కాలి షూస్ నుండి హెయిర్ జెల్ వరకు ప్రతిదీ కాస్ట్లీ, లగ్జరీ, అండ్ బెస్ట్ బ్రాండ్ అవుట్ ఫిట్స్ లో బ్రాండ్ కె బ్రాండ్ అంబాసిడర్ గా కార్ లోంచి దిగిన 6.2" కటౌట్.... రాణా రణదీర్ వర్మ.

అస్సలు స్మైల్ అనేది లేని పేస్ తో ఎప్పుడు ఫుల్ బ్లాక్ అండ్ బ్లాక్ లో కోపానికి మరోక రూపంగా ఉండే రాణా మరో పేరు డెవిల్.

పొగరు, అహంకారం, డబ్బు ఉందన్న బలుపు, జాలి దయా లేని రాతి మనిషి..  అని రాణా కు ఇలాగే చాలా చాలా బిరుదులు ఉన్నాయి.

చెప్పుకోవడానికి కూడా అతని ఫేస్ లో సీరియస్ నెస్ తప్ప మరో కోణం స్టాఫ్ లో ఒక్కళ్ళు కూడా చూడలేదు. అయితే ఒకటి డెవిల్ కోపంలో హెచ్చుతగ్గులు అందరికీ సుపరిచితమే.

పాయింటెడ్ మౌంట్ కార్ల్ షూస్ తో కార్ దిగడమే రాణా చేతిలో నుంచి సన్నగా వణుకుతున్న చేతితో బ్రీఫ్ కేస్ సెక్యూరిటీ తీసుకోగా వాకింగ్ రోబో లా ఆఫీస్ లోకి ఎంటర్ అయ్యాడు రాణా.


టక్ టక్ మని అతని షూస్ నుంచి వస్తున్న శబ్దానికి ఫస్ట్ ఫ్లోర్ లో స్టాఫ్ మొత్తం అలర్ట్ అయ్యి నిలబడి విష్ చేస్తుంటే రాణా వైపు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు.

ఎవరిని పట్టించుకోకపోవడమే అతని స్టైల్. ఇది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. 

పర్టికులర్ గా రాణా ఎవరినైనా రిటర్న్ విష్ చేసిన, స్పెషల్ గా పలకరించిన ఆ రోజుతో ఆఫీసులో వాళ్ళ చాప్టర్ క్లోజ్.

అందుకనే రాణా నుంచి ఎవరు ఎటువంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయరు.


హా బేబీ, ఐ యాం హియర్. జస్ట్ వెయిట్ టు మోర్ మినిట్స్ అంటూ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న తన చాంబర్ కి వెళ్లడానికి లిఫ్ట్ వైపు నడుస్తున్న అతని కళ్ళు అంతలోనే స్టాఫ్ మొత్తాన్ని స్కాన్ చేసేసాయి.



రాణా వెనుక వచ్చిన సెక్యూరిటీ స్టెప్స్ నుంచి బ్రీఫ్ కేస్ తో పైకి పరుగు పెట్టాడు.

స్టైల్ గా లిఫ్ట్ లోకి ఎంటర్ అవ్వడమే కోట్ రిమూవ్ చేసి షోల్డర్ మీద వేసుకుంటున్న రాణా మాస్ లుక్కు కి కళ్ళు రెపరెపలాడించిన ఓ ఆఫీస్ పాప 

పెదవులు తడుపుకుంటూ, గుండెల మీద చేయి వేసుకొని లాంగ్ బ్రీత్ తో చైర్ లో కూలబడింది.

ఏముంటాడే మన బాస్. ఆ స్టైల్, ఆ బాడీ, ఆ హైట్.. అబ్బబ్బా ఒక్కసారి అలా టచ్ చేస్తే చాలని సొల్లు కారుస్తుంటే

షాక్ కొట్టి చస్తావ్. బాస్ సెక్రటరీల లిస్ట్ తెలుసుగా. ఎక్కువ ఊహించకుండా క్లీన్ మైండ్ తో నీ వర్క్ మీద ఫోకస్ చెయ్. 

లేదంటే పెళ్లికి పనికి రాకుండా పోతావని సొల్లు కారుస్తున్న ఆ పిల్లకి కొలీగ్ వార్నింగ్ ఇచ్చి తన సీట్ కి పోయింది.



చిరుత కళ్ళు, స్టైల్ గా ట్రిమ్ చేసిన రఫ్ బియర్డ్, షార్ప్ గా స్టైల్ గా ఉండే మీసం తో పర్ఫెక్ట్ వీ షేప్ లో ఉండే ఆరు పలకల దేహం.

ఎదురుగా నిలబడి షర్ట్ బటన్స్ రిమూవ్ చేస్తూ తినేసేలా చూస్తున్న అతని ఆకలికి హ్యాండిల్ చేయగలనా అని భయంతో గుటకలు మింగుతూ బ్యాక్ స్టెప్ వేసింది టీనా.

నిజంగానే తినేస్తాడు. వర్క్ లో ఎంప్లాయిస్ ని బెడ్ మీద అమ్మాయిల్ని. 

దేనిని కూడా నార్మల్ గా హ్యాండిల్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు రాణా కు.



వాట్..?? భయం తెలుస్తున్న టీనా బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేస్తూనే షార్ప్ గా అడిగాడు.


నథింగ్ బేబీ, యు లూకింగ్ సో హాట్ అంది తన భయం కవర్ చేసుకుంటూ.


ఐ నో ఐ యామ్ హాట్ అని షర్ట్ పక్కకు విసిరేసి రెండు చేతులు రెండు పైకెత్తి మజిల్స్ స్ట్రెచ్ చేస్తూ నువ్వెందుకు భయపడుతున్నావ్ అని అడిగాడు.

నీ కటౌట్ చూసి భయమేస్తుంది అని చెప్పలేక ఒక సెక్సీ స్మైల్ ఇచ్చిన టీనా రెక్క పట్టి లాగి బెడ్ మీదకు తోసి ఆమె మీదకు చేరాడు.



రాణా స్పీడ్ కి టెన్షన్ తో టీనా గుండె వేగం పెరగగ బేబీ స్మూత్ గా అంది రిక్వెస్ట్ చేస్తున్నట్టే.

ఈ రాణా దగ్గర స్మూత్ నెస్ ఎక్స్పెక్ట్ చేయకు అని ఫుల్ ఆటిట్యూడ్ తో చెప్పి డార్క్ రెడ్ కలర్ లిప్స్టిక్ తో టెంప్ట్ చేస్తున్న టీనా లిప్స్ ని లాక్ చేసాడు.


హార్డ్ గా ఇస్తున్న కిస్ తో టీనా బాడీలోని ప్రతి పార్ట్ ని రఫ్ గా క్రష్ చేస్తూ ఇంటిమసీకి ప్రిపేర్ అవుతున్న రాణా హ్యాండ్లింగ్ ఎలా ఉంటుందో ఒక ఇమేజినేషన్ కి వచ్చిన టీనా భయంతో రానా ను తోసేసింది.


టీనా తోసిన 6.2 ఇంచెస్ ఆ భారీ కటౌట్ ఒక్క ఇంచ్ కూడా కదలలేదు.

బట్ ఆమే రిజెక్షన్ తెలుస్తుంటే అప్పటికే ఫుల్ ఫీలింగ్స్ తో ఉన్న రాణా ఆర్ యువ్ మాడ్ అని సీరియస్ అవుతూ టీనా ను విధిల్చికొట్టి బెడ్ దిగేసాడు.


నో నో బేబీ.. సారీ సారీ అంటూ కింద పడేసిన షర్ట్ తీసుకుంటున్న రాణా ను వెనక నుంచి గట్టిగా హత్తుకుని ప్లీజ్ బేబీ డోంట్ యాంగ్రీ అని రిక్వెస్ట్ చేస్తుంది టీనా.


ఎలా కనిపిస్తున్న నీ కంటికి..?? వెనుక నుంచి వాటేసుకున్న టీనాను ముందుకు లాగి చాలా సీరియస్ గా అడిగాడు. 

సారీ అంటూ నెమ్మదిగా దగ్గరికి వచ్చింది టీనా. 


నా మూడ్ చెడగొట్టావ్ దొబ్బెయ్ అన్నాడు చిరాగ్గా.

అతని వల్ల భయం కలిగిన, ఇప్పుడు అతని కోపం తెలుస్తున్న, సెక్సీ హాంక్ లా పిచ్చెక్కిస్తున్న రాణా ను వదలాలని లేదు ఆమెకి



అమ్మాయిల కళ్ళకి అతిలోక మన్మధుడు లా కనిపించే అతని రూపాన్ని ఇష్టపడని ఆడపిల్ల ఉండదు. 


దానిలోను రానా పట్టిక్యులర్గా రమ్మని పిలిస్తే ఇక ఆ రాత్రి స్వర్గమే. 

స్వర్గాన్ని చూపించి నరకంలో సృహ కోల్పోయేలా చేసే రానా చివరికి డబ్బుల కట్టలతో ముంచెత్తుతాడు. 


సెక్స్ విత్ మనీ కావాలనుకున్న ఏ ఆడపిల్ల అయినా రానా ను రిజెక్ట్ చేయడం ఇంపాజిబుల్.


ఇప్పుడు టీనా కూడా అటువంటిదే.

రానా బాడీ కింద నలగాలని తహతహలాడుతుంది. 

అతను ఇచ్చే డబ్బులతో ఎంజాయ్  చేయడానికి ఉవ్విళ్లూరుతోంది.



❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥❤️‍🔥


నోట్.. 
కథలోని పాత్రలన్నీ కల్పితం. ఎవరిని ఉద్దేశించినవి కావు. స్టోరీ మీద సర్వహక్కులు నావి. నా పర్మిషన్ లేకుండా కాపీ చేయడానికి ప్రయత్నించకండి.


మై డియర్స్ ...
స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో ఇవ్వండి.

థాంక్యూ..💞

Varna..❤️‍🔥