Featured Books
  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నులి వెచ్చని వెన్నెల - 21

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

"సారీ. నేను నిన్ను హర్ట్ చేశాను." విచార వదనంతో అంది సమీర. "కానీ ఇది కూడా పూర్తి నిజం. వాళ్ళిద్దరి చేతుల్లోకన్నా కూడా నీ చేతుల్లో ఎక్కువగా సుఖపడుతున్నా. నేను సెక్స్ గురించి నిన్ను పెళ్లి చేసుకోదలుచుకోలేదు. నువ్వు సెక్స్ విషయం లో అంత కాపబుల్ కాకపోయినా నిన్ను పెళ్లిచేసుకుందామనుకున్నా. కానీ.................." తను చెప్పదలుచుకున్నది నొక్కి చెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగి అంది సమీర. ".......................నీ చేతుల్లో నేను చాలా సుఖపడుతున్నా. ఈ విషయంలో నిన్ను నేను ఎలా కన్విన్స్  చెయ్యాలో తెలియదు." మళ్ళీ విచారవదనం తో అంది.

"నువ్వు నన్ను ప్రత్యేకంగా కన్విన్స్ చెయ్యాల్సిన అవసరం లేదు. అది చేస్తూన్నప్పుడు, ఆ స్త్రీ మొహంలోకి చూస్తూ ఆమె పూర్తిగా సుఖపడుతోందా లేదా అని చెప్పగలను." మళ్ళీ తన నడుముని కదుపుతూ అన్నాడు అనురాగ్.

"అది ఆ ఒక్క స్త్రీ అనుభవంతోనే తెలుసుకున్నవా?" నొసలు చిట్లించింది సమీర.

"ఐ యాం సారీ. నాకు ఇంకా కొంతమంది తో కూడా సంభందం వుంది. ఇలాంటి బ్యూటీ ని అనుభవించే ఛాన్స్ పోతుందేమోనని ఆ రోజు అబద్ధం చెప్పాను." నవ్వి అన్నాడు అనురాగ్ తన నడుముని ఇంకా ఆలా కదుపుతూనే.

"రాస్కెల్, రోగ్ .........." తన కౌగిలిని ఇంకా బిగించి అనురాగ్ కుడిబుగ్గ మీద కొరికింది సమీర.

ఎదో ట్రిగ్గర్ చేసినట్టుగా, సడన్ గా సమీరలో వేడి దింపుకొని ఆమె మీద గాలి తీసిన బెలూన్ లా వాలిపోయాడు అనురాగ్.

"రిలాక్స్ .........రిలాక్స్ యువర్ సెల్ఫ్. అంత సుఖం ఇచ్చిన తరువాత ఇలా నీరస పడిపోవడం సహజమే." కొరికిన చోట ముద్దుపెట్టి అంది సమీర. "ఇలాగే వుండు కాస్సేపు ప్లీజ్." అతను ఎడమపక్కకి ఒదగబోతూవుంటే కౌగిలి బిగించి, ఆపి అంది. ఎందుకనో అది పూర్తయిన తరువాత కూడా కాస్సేపు తను అలాగే వుండాలనిపిస్తుంది సమీరకి, నిజానికి తరంగ్, నిరంజన్ లప్పుడు కూడా ఇలా అనిపిస్తూ వుండేది

కొద్ది క్షణాల పాటు అలాగే వున్నాక. ఆమె ఎడమ బుగ్గమీద తనూ ముద్దుపెట్టి, కిందకి దిగి డ్రెస్ చేసుకోవడం మొదలుపెట్టాడు అనురాగ్.

“ఇచ్చిన గడువు రోజుకి ఆ స్మరణ్ అసైన్మెంట్ పూర్తి చేస్తాడు. అతనిమీద నాకు పూర్తి నమ్మకం వుంది.” డ్రెస్ చేసుకుంటూ అన్నాడు అనురాగ్.

తనూ లేచి డ్రెస్ చేసుకోవడం మొదలుపెట్టింది సమీర. “నీకిచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను. ఒక డిటెక్టీవ్ ని అపాయింట్ చెయ్యడానికి ఒప్పుకున్నాను. నువ్వూ నీ మాట నిలబెట్టుకుంటావుగా.” అడిగింది.

అనురాగ్ సమీర దగ్గరికి వచ్చి, కౌగలించుకుని కుడి చెంప మీద ముద్దుపెట్టుకున్నాడు. “నీకా విషయంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. పెళ్ళిచేసుకుని నీకు భర్తగా మాత్రమే కాదు, సి ఈ ఓ గా నీ కంపెనీ కి కూడా ఎప్పుడూ అండగా వుంటాను.” అన్నాడు.

ఆ మాట వినగానే అనురాగ్ ని మరోసారి కౌగలించుకుని రెండు బుగ్గల మీద ముద్దులు పెట్టింది సమీర.

“ఇంకో రెండు ముద్దులు ఎక్కువ పెట్టావంటే, నిన్ను మరోసారి బెడ్ మీదకి తీసుకెళ్లి మొత్తమంతా మళ్ళీ మొదటినుండి మొదలుపెట్టాల్సి వుంటుంది.” చిలిపిగా నవ్వుతూ అన్నాడు అనురాగ్.

“నో, ఈరోజుకి మోతాదుకి మించి సుఖపడిపోయాను. ఇంక సుఖపడే ఓపిక లేదు.” అనురాగ్ చుట్టూ తన చేతులు తీసి, అనురాగ్ చేతులనుండి విడిపించుకుని అంది సమీర. “అన్నట్టు నిన్ను డిన్నర్ కి ఇన్వైట్ చెయ్యమని ఆంటీ ఇంక కజిన్ సంజయ్ సజెస్ట్ చేశారు. నేనూ నువ్వు లవ్లో పడ్డాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని తెలియగానే, నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి అయపోయావు వాళ్ళకి.”

“తప్పకుండా అలాగే వస్తాను. మీ ఆంటీ కి ఇంక సంజయ్ కి నా మీద ఎప్పుడూ మంచి అభిప్రాయమే వుంది.” అనురాగ్ అన్నాడు.

“అది నిజమే. నిన్ను అర్ధం చేసుకోవడానికి నాకు మాత్రమే ఎక్కువ కాలం పట్టింది.” నవ్వింది సమీర. “ఇంక వెళ్లివస్తాను. ఈ రోజు ఈవెనింగ్ నువ్వు మా ఇంటికి డిన్నర్ కి వస్తున్నట్టుగా, మా ఆంటీ కి చెప్తాను. నువ్వు రావడం మర్చిపోకు.”

అలాగ చెప్పాక అక్కడనుండి వెళ్ళిపోయింది సమీర.

&&&

"నువ్వు ఇంకా మా సమీ లవ్ లో పడతారని నేనెప్పుడూ అనుకోలేదు. ఎంత కోపంగా ఉండేది నువ్వంటే తను." నిర్మల అంది అనురాగ్ తో.

నిర్మల, సంజయ్ సజెస్ట్ చెయ్యడంతో అనురాగ్ ని ఇంటికి డిన్నర్ కి ఆహ్వానించింది సమీర. ఆ రోజు సాయంత్రం వచ్చాడు. అందరూ కలిసి డైనింగ్ హాల్లో, డైనింగ్ టేబుల్ మీద డిన్నర్ చేస్తూ వున్నారు.

"నేను మాత్రం వూహించాను. ఇలాంటి లవ్ స్టోరీలు ఎన్ని చూడలేదు? మొదట కోపం, తరువాత అదే కోపం లవ్ గా మారడం." మల్లిక అంది. 

"జస్ట్ నీకు లాగే. నువ్వు సంజయ్ మీద ఎంత కోపంగా వుండేదానిని. ఇప్పుడు మీరిద్దరూ గ్రేట్ లవర్స్."

అది విని అక్కడ అందరూ నవ్వుతూ వుండగా, మల్లిక బుగ్గలు మాత్రం కోపంతో ఎర్రబడిపోయాయి.

"ఏయ్ సమీ. ఎదో నువ్వు చెప్పావని కాకపోతే నేనీ రాస్కెల్ ని ఎప్పటికీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకునేదాన్ని కాదు." కోపంగా అంది మల్లిక.

"నేను మాత్రం? సమీ గురించి కాకపోతే అసలు పెళ్లే చేసుకోకూడదనుకున్నాను." సంజయ్ చిరునవ్వుతో అన్నాడు.

"ఆల్రైట్, ఆల్రైట్. ఇద్దరూ భార్యాభర్తలు అవ్వాలని నిర్ణయించుకున్నారు కదా. ఇంక తన్నుకోకండి” నిర్మల అంది.

ఆ విషయం విన్నాక మరోసారి అందరూ నవ్వారు అక్కడ మల్లికతో పాటుగా

"ఆనందకర సంఘటనలు జరుగుతూవున్నాయి. సమీర ఇంక నువ్వూ, మల్లిక ఇంక సంజయ్ భార్యాభర్తలు కాబోతూ వున్నారు. సమీర సమస్య కూడా పూర్తిగా తీరిపోయి, తనకే భయం లేకుండా వుంటే మనకెంతో ఆనందకరంగా వుంటుంది." నిర్మల అంది.

"ఒక్క రెండు రోజులు ఓపిక పట్టండి ఆంటీ. మా అంకుల్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. సమీ మేడం కి ఎవరివల్ల ప్రమాదమో చెప్పడమే కాకుండా, ఆమెకి ఇకపై ఎవరివల్ల ప్రమాదం లేకుండా చూస్తారు." మేనక అంది.

ఆ తరువాత అలాగే మాట్లాడుకుంటూ డిన్నర్ పూర్తి చేశారు అందరూ. డిన్నర్ పూర్తయ్యాక అక్కడనుండి వెళ్ళిపోయాడు అనురాగ్.

&&&

"మీరిచ్చిన ఆ నిరంజన్ భార్య ఫోన్ నంబర్ కి ఫోన్ చేసి మాట్లాడాను. ఆవిడ మీకు చెప్పని విషయం ఏమిటంటే, ఆ నిరంజన్ ఒక సైకియాట్రిస్ట్. వాడే మిమ్మల్ని హిప్నోసిస్ లోకి పంపించి ప్రోగ్రాం చేసివుండాలి." స్మరణ్ అన్నాడు.                          

"కానీ వాడు నన్నెలాగా అలా చెయ్యగలడు? వాడిదగ్గర నేనెప్పుడూ కాన్షస్ గానే వున్నాను." షాకింగా అంది సమీర.

"ఒక కాపబుల్ సైకియాట్రిస్ట్ అలా చెయ్యగలడు. కొన్ని వందలమందిని ఒక్కసారి హిప్నోసిస్ లోకి పంపగల సమర్థులు కూడా వున్నారు." చిరునవ్వుతో అన్నాడు స్మరణ్.

"ఇదింకా నాకు నమ్మశక్యం కాకుండానే వుంది." అదే షాకింగ్ లో వుంది సమీర.

"వాడు మీతో వున్నప్పుడు ఎలా వుండేవాడో, ఎలా మాట్లాడేవాడో జాగ్రత్తగా గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకే అర్ధం అవుతుంది."

కింద పెదవిని పళ్ళమధ్య బిగబట్టి ఆలోచనలో పడింది సమీర.

ఆ రోజున తనని హిప్నోసిస్ లోకి పంపి, తన హల్యూసీనేషన్స్ కి ఇంకా డ్రీమ్స్ కి కారణం ఏమిటో తెలుసుకోవడం మాత్రమే కాకుండా, అవి మరి రాకుండా కూడా చూస్తానని చెప్పడంతో, స్మరణ్ తో పాటుగా ఆ ప్రదేశానికి ఆ గదిలోకి వచ్చింది సమీర. ఆ సమయంలో సమీరని ఒక గదిలో కుర్చీలో ఉంచాడు స్మరణ్. ఆ కుర్చీ ఎలాంటిదంటే అందులో వెనక్కి వాలి ప్రశాంతంగా నిద్రపోవచ్చు కూడా.

కాస్సేపటి తరువాత పెదవిని రిలీజ్ చేసి చెప్పడం మొదలు పెట్టింది సమీర. "మీరు చెప్పింది నిజమే కావచ్చు. కొన్ని కొన్ని సందర్భాల్లో వాడు మాట్లాడుతూ వున్నప్పుడు ఎదో మగతలోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉండేది. నన్ను గట్టిగా హగ్ చేసుకుని నా చెవిలో ఎదో చెప్పేవాడు, ఆ చెప్పేదేమిటో అర్ధం చేసుకునేలోపు నిద్రలోకి వెళ్లిపోయేదాన్ని. వాడు నన్ను రిలాక్స్ చెయ్యడానికి ఎదో చేస్తున్నాడనుకున్నాను కానీ నన్ను హిప్నోసిస్ లోకి పంపి ప్రోగ్రాం చేస్తున్నాడనుకోలేదు."

"వాడు మిమ్మల్ని ఏం ప్రోగ్రాం చేసాడన్నది ఇప్పుడు మిమ్మల్ని హిప్నోసిస్ లోకి పంపి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అలాగే మిమ్మల్ని డీ-హిప్నోటైజ్ చేసి అలాంటి డ్రీమ్స్ ఇంకా హల్యూసీనేషన్స్ మీకు ఇకపై లేకుండా చేస్తాను." స్మరణ్ అన్నాడు.

"కానీ వాడు అదంతా ఎందుకు చేసాడు? అలా చెయ్యడం వల్ల వాడికి కలిగే ప్రయోజనం ఏమిటి?"

"వాడు అదంతా తనంత తనుగా చేసివుండడు. వాడితో ఎవరో చేయించి వుంటారు." స్మరణ్ అన్నాడు. "కొంచెం ఇన్వెస్టిగేషన్ చెయ్యాల్సి వుంది. వాళ్లెవరో తెలుసుకుని మీ కిచ్చిన గడువు రోజున మీకు చెప్తాను. ఆ రోజు ఇంకెంతో దూరంలో లేదు కదా. మీరిప్పుడు నన్ను మిమ్మల్ని హిప్నోసిస్ లోకి పంపి చెయ్యవలసినిది చెయ్యనివ్వండి."  

"సరే నేనిప్పుడు ఏం చెయ్యాలి?" సమీర అడిగింది.

"మీ సైకాలజిస్ట్ ఫ్రెండ్ అప్పుడప్పుడు మిమ్మల్ని హిప్నోటైజ్ చేస్తూంటారని మేనక చెప్పింది. సో మీకు ప్రొసీజర్ తెలిసే ఉంటుంది. కుర్చీలో వెనక్కివాలి ప్రశాంతం గా కళ్ళు మూసుకోండి." స్మరణ్ అన్నాడు

సమీర అలాగే చేసింది.

"రిలాక్స్ .........రిలాక్స్ యువర్ సెల్ఫ్." అని మొదలుపెట్టాడు స్మరణ్. కాస్సేపటి తరువాత తనకేమైందో సమీరకి బోధపడలేదు. స్మరణ్ ఎదో అడుగుతూ వున్నాడు, తానేదో చెప్తూవుంది. కానీ తనేం అడుగుతున్నాడు, తనేం చెపుతూంది అన్నది బోధపడలేదు. అలా ఎంతసేపు గడిచిందో సమీరకి గుర్తులేదు.

"ఇప్పుడు మీరు మీ హిప్నోసిస్ లోనుండి బయటకి వస్తూ వున్నారు. నేను అయిదు అంకెలు లెక్కపెట్టేలోగా, మీరు ఈ హిప్నోసిస్ నుండి పూర్తిగా బయటకి వస్తారు.” స్మరణ్ అన్నాడు

తరువాత స్మరణ్ అయిదు అనగానే హిప్నోసిస్ లోనుండి బయటకి వచ్చింది సమీర.

"మీరు అలాంటి హల్యూసీనేషన్స్ కి సబ్జెక్ట్ కావడానికి ఇంకా మీకు అలంటి డ్రీమ్స్ రావడానికి ఆ నిరంజనే కారణం. కాన్షస్ గా మీకు తెలియక పోయినా మీ షబ్ కాంషస్ మైండ్ కి అంతా తెలుసు. హిప్నోసిస్ లో ఉండగా మీరెలా హిప్నోటైజ్ చెయ్యబడ్డది మీరంతా చెప్పారు." స్మరణ్ అన్నాడు.

"మై గాడ్!" గుండెల మీద చేతులు వేసుకుని అంది సమీర.  

"మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. మీకు ఇకపై అటువంటి డ్రీమ్స్ రాకుండా, మీరలాంటి హల్యూసీనేషన్స్ కి సబ్జెక్ట్ కాకుండా డీ-హిప్నోటైజ్ చేసాను. అయినా మీకటువంటి సమస్య మళ్ళీ వస్తే మిమ్మల్ని మళ్ళీ డీ-హిప్నోటైజ్ చేస్తాను." స్మరణ్ అన్నాడు.

"థాంక్ యు వెరీ మచ్ సర్." సమీర అంది.

"యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇంకిప్పుడు మీరు వెళ్లిపోవచ్చు." స్మరణ్ అన్నాడు.

ఆ తరువాత అక్కడనుండి ఇంటికి వచ్చేసింది సమీర.

&&&

"రేపు మాణింగ్ లెవెన్ కల్లా ఇక్కడికొచ్చి అన్నివిషయాలు చెప్తానన్నారు డిటెక్టీవ్ స్మరన్. ఆ తరువాత నాకెటువంటి సమస్య ఉండబోదని కూడా అన్నారు." సమీర అంది.

"ఆశ్చర్యంగా వుంది. నిజంగానే ఈ డిటెక్టివ్ చాలా కాపబుల్ అనిపిస్తూ వుంది. చాలా రోజుల కిందటే విషయాలన్నీ ఆయనకి తెలిసివుండాలి. ఎందుకనో రేపటివరకూ ఆగారు." మల్లిక అంది.

ఈ సారి మల్లిక, సమీర ఇద్దరూ మల్లిక రూంలో బెడ్ మీద కూచుని మాట్లాడుకుంటూ వున్నారు.

"నాకు అలాగే అనిపిస్తూంది. నన్ను హిప్నోసిస్ లోకి పంపించాక ఆ స్మరణ్ చాలా విషయాలనే తెలుసుకున్నాడనిపిస్తోంది. కానీ హిప్నోసిస్ లో నేను ఏం మాట్లాడానో అసలు గుర్తు లేదు." సమీర అంది.

"డీప్ హిప్నోసిస్ లో చెప్పినవి సబ్జెక్టు కి గుర్తువుండవు. అలాగే హిప్నోటిస్ట్ హిప్నోసిస్ లో మాట్లాడినదంతా మర్చిపోయేలా ప్రోగ్రాం చేసినా, అవి గుర్తుకు రావు." కాస్త ఆగి మళ్ళీ అంది మల్లిక. "నిన్ను అయన హిప్నోసిస్ లో ఉండగా బాగా ప్రోగ్రామింగ్ చేసి ఉండాలి. అందుకనే ఆ తరువాత నీకు ఆ డ్రీం రాలేదు, నువ్వు నిద్రలో నడవలేదు కూడా."

"అంతే కాకుండా నాకెలాంటి విజువల్ అండ్ ఆడిటరీ హల్యూసీనేషన్స్ కూడా కలగడం లేదు ఆ తరువాత. చూస్తూ ఉంటే అయన మంచి సైకాలజిస్ట్ అని కూడా అనిపిస్తూ వుంది." సమీర అంది. 

"నాకింకా ఏమనిపిస్తూంది అంటే నింజంగానే అయన చెప్పినట్టుగా నీ హల్యూసీనేషన్స్ కి ఇంక మీ డాడ్ ని అంతగా భయపెట్టిన విషయానికి సంభందం వుండివుండాలి. అదేమిటో మాత్రమే వూహించలేకపోతున్నాం."

"అందుకు ప్రయత్నించడం మాత్రం ఎందుకు?" నవ్వింది సమీర. "రేపు పదకొండు దాటక మొత్తం అంతా క్లియర్ అయిపోతుంది కదా."

అది విని మల్లిక కూడా చిరునవ్వు నవ్వింది. కానీ ఎందుకనో తన మొహం సడన్గా సీరియస్ అయిపోయింది.

"ఏమిటే ఏం జరిగింది? ఎందుకు సడన్గా ఇలా అయిపోయావు?" మల్లిక మొహంలోకి చూస్తూ అడిగింది సమీర.

"ఎందుకో గతం గుర్తుకొచ్చింది. ఎంత స్నేహంగా ఉండేవాళ్ళం. అన్నీ ఏ అరమరికలు లేకుండా పంచుకునేవాళ్ళం. మనమధ్య ఏ సీక్రెట్స్ ఎప్పుడూ లేవు."

"ఎస్, యు ఆర్ రైట్." తలూపింది నవ్వింది సమీర. "అన్నీ మనం పంచుకున్నాం. నిజానికి బాయ్ ఫ్రెండ్ ని కూడా. మనలాంటి ఫ్రెండ్స్ ఎవరూ వుండరు." కాస్త ఆగాక అంది ముడతలు పడ్డ మొహంతో. "కానీ అందుకు నువ్వు ఇలా సీరియస్ గా అయిపోవాల్సిన అవసరం ఏం వుంది?"

"ఒకవేళ నేను లేకుండా పోతే. నాకేమన్నా అయితే." నొసలు ముడేసింది మల్లిక కూడా.

"మరొకసారి అలంటి మాట అన్నావంటే చంపేస్తాను." మల్లిక మెడ మీద చేతులు వేసి, పిసికినట్టుగా అభినయిస్తూ కోపంగా అంది సమీర. "నేను కలలో కూడా అటువంటిది భరించలేను. దయచేసి ఆలా మాట్లాడకు." ఆ చేతులని తీసివేసి మామూలుగా అవుతూ అంది.

"నో సమీ. ఇక్కడ ఎవరికి ఎవరూ శాశ్వతం కారు. నిన్ను అంతగా ప్రేమించిన నీ డాడ్ నీ గురించి ఉండిపోగలిగారా? ఒకవేళ నా టైం పూర్తయితే నేను నీ గురించి వుండిపోగలనా?"

"నీ టైం పూర్తయి నువ్వు వెళ్ళిపోతే, నీ వెనకతలే నేనూ వచ్చేస్తాను. మల్లిక ఈ భూమ్మీద లేకుండా సమీర కూడా ఉండదు."

"సమీ..........." ఆవేశంగా అంది మల్లిక. "...........దయచేసి ఆలా మాట్లాడకు."

"నేనలా మాట్లాడితే నువ్వెలా భరించలేవో, నువ్వలా మాట్లాడితే నేనూ భరించలేను." సడన్గా నవ్వింది సమీర. "ఇది మనం ఎంతో ఆనందించాల్సిన సమయం. నీతో సంజయ్ పెళ్ళికి, నాతొ అనురాగ్ పెళ్ళికి కూడా నిర్ణయాలు అయిపోయాయి. ఇప్పుడు మనం దేనిగురించి విచారించాలి?"

అది విన్నాక మల్లిక చిన్న నవ్వు నవ్వింది కానీ ఆ మోహంలో అనీజీనెస్ అలాగే వుంది. నిజానికి గత కొద్దీ రోజులుగా మల్లిక కొంచెం అనీజీ గానే కనిపిస్తూ వుంది కానీ సమీర పట్టించుకోలేదు. తన జీవితం గురించి తానే చాలా భయపడుతూ, కన్ఫ్యూజన్ లో ఉండడం వల్ల మల్లికని ఏమీ అడగలేక పోయింది.

"నువ్వు ఏమీ ఆలోచించకుండా ఆనందంగా వుండు. నీ లైఫ్ సంజయ్ తో, నా లైఫ్ అనురాగ్ తో ఎంతో బావుంటాయనడం లో సందేహం లేదు."

అది విన్నాక నవ్వింది మల్లిక. ఆ తరువాత ఇద్దరూ మరికొంత సేపు మాట్లాడుకున్నారు, సమీర ఆ గదిలో నుండి వెళ్ళిపోబోయేముందు.

&&&

"మేం అలా గుడికి వెళ్లి వస్తాం." సమయం పది అలా అవుతూ వుంటే సమీర దగ్గరకి వచ్చి అంది మల్లిక.

మల్లిక తో పాటుగా నిర్మల ఇంకా సంజయ్ కూడా వున్నారు.

"కాసేపట్లో డిటెక్టీవ్ స్మరణ్ వస్తారు. అయన వచ్చివెళ్ళాక వెళ్లొచ్చు కదా." సమీర అంది.

"అయన వచ్చేది పదకొండు గంటలకి. ఆ సమయానికల్లా వచ్చేస్తాం." నిర్మల అంది. "నీ జీవితం ఇకపై ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని దేవుడిని ప్రార్ధించడానికి వెళుతున్నాం. వద్దనకమ్మా."

"ఒకే ఆంటీ." తలూపింది సమీర.

తరువాత వాళ్లతో పాటుగా ఎంట్రన్స్ వరకూ వెళ్ళింది. వాళ్ళు కారులోకి ఎక్కుతూ వుంటే అలా చూస్తూ నిలబడింది.

మల్లిక కారులోకి ఎక్కిందల్లా ఎందుకనో కారు దిగి పెరిగెట్టుకుని సమీర దగ్గరకి వచ్చి గట్టిగా  కౌగలించుకుని, కుడి బుగ్గమీద ముద్దు పెట్టుకుంది "ఐ లవ్ యు సమీ." అలా అంటూ వున్నప్పుడు ఎందుకో మల్లిక గొంతు వణికింది.

"ఐ లవ్ యు టూ" నవ్వింది సమీర. కానీ అంతలోనే తన మొహం ఎందుకో సీరియస్ అయిపోయింది. "ఏయ్, ఎందుకిలా ఎమోషనల్ అయిపోతున్నావు?"

"తెలీదు, నాకు తెలీదు." ఒక హెల్ప్లెస్స్ ఎక్సప్రెషన్ తో తలూపుతూ అంది మల్లిక అలాగే సమీరని పట్టుకుని. "ఎనీహౌ నా వల్ల ఏ తప్పులు జరిగినా క్షమిస్తావు కదా?"

"పళ్ళు రాలగొడతాను మరోసారి ఇలా మాట్లాడావంటే." మల్లిక పట్టునుండి విడిపించుకుని అంది సమీర కోపంగా. "మన మధ్య క్షమాపణలేమిటి?"

దానికి ఏమీ చెప్పకుండా, చటుక్కున వెనక్కి తిరిగి, వేగంగా వెళ్లి కారులో కూచుంది మల్లిక. ఆ తరువాత, సంజయ్ డ్రైవ్ చేస్తూవుంటే ఆ కారు అక్కడనుండి వెళ్ళిపోయింది.

ఏమీ అర్ధంకాక అయోమయంగా తిరిగి ఇంట్లోకి వచ్చింది సమీర.

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)