Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నులి వెచ్చని వెన్నెల - 7

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

హమ్మయ్య! కావాలనుకున్నట్టుగానే చెప్పింది, రిలీఫ్ గా అనుకున్నా, అనకుండా వుండలేకపోయింది సమీర. "కానీ ఆ బాత్రూం లో అనుభవం, ఇంకా బెడ్ మీద అనుభవం కూడా చాలా రియలిస్టిక్ గా వున్నాయి. నా ఇమాజినేషన్ అని ఎంతమాత్రం అనిపించడం లేదు. ఆ తరంగ్ గాడు...............జస్ట్ ఎలా చెప్పాలో నాకు తోచడం లేదు. నిజంగా వాడు అది చేస్తూన్నట్టుగానే అనిపించింది. వాడు రియల్ గా చేస్తూన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యానో, అలానే ఫీల్ అయ్యాను."

"మన షబ్-కాన్షస్ కి మనకి కొన్ని కొన్ని ఇమాజినేషన్స్ రియల్ అనిపించేలా చేయగలిగే శక్తి వుంది. ఇట్స్ జస్ట్ దట్. డోంట్ వర్రీ." నవ్వి అంది మల్లిక. "అయినా ఆ తరంగ్ సెక్స్ చేసిన తీరు మరిచిపోవడం కష్టమే. అదలా గుర్తుకొస్తూ వుండడం లో ఆశ్చర్యం ఏమీ లేదు."

"షట్ అప్. నేను ఇది కాదు నీ దగ్గరనుండి వినాలనుకున్నది." కోపంగా అంది సమీర.

"ఆల్రైట్. ఇంతకీ నువ్వు నా దగ్గరనుండి ఏది ఎగ్జాట్ గా వినాలనుకున్నావు, చెప్పు?" చిరునవ్వుతో అంది మల్లిక.

"నువ్వది చెప్పేసావు. నేను వినేసాను కూడా." మల్లికని కౌగలించుకుని తన కుడి బుగ్గమీద మరోసారి ముద్దుపెట్టుకుంది సమీర. "నా ఆడిటరీ ఇంకా సెన్సువరీ హల్యూసీనేషన్స్ కి నేనేం భయపడాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు మన షబ్-కాన్షస్ మనని అలాంటి వాటికి సబ్జెక్ట్ చేస్తుంది, అంతే కదా."

"అబ్సల్యూట్లీ రైట్." తలూపింది మల్లిక, సమీర పట్టునుండి విడిపించుకుంటూ. "ఎనీహౌ నేను నీ విషయంలో అంతగా భయపడాల్సిన అవసరం లేదనే అనిపిస్తూంది. ఈ సారి నా ఫీలింగ్ ఇంకా డ్రీమ్స్ రాంగ్ అయివుండొచ్చు. నేను కోరుకున్నది కూడా అదే."

"హమ్మయ్య. ఇప్పుడు నాకు పూర్తి రిలీఫ్ గా వుంది." మొహంలో ప్రశాంతతో అంది సమీర. "నా డాడ్ నాతొ అంతగా నాతో ఏం చెప్పదలుచుకున్నారో కూడా తెలిసిపోతే, నాకు ఇంకా ఎక్కువ రిలీఫ్ గా వుంటుంది."

"దాని గురించి ఇప్పుడు అంతగా టెన్షన్ పడకు. అదీ మనకి తెలిసిపోతుందనే ఆశిద్దాం. ఇప్పుడు నేనూ నీ కూడా వున్నాగా. ఇద్దరం కలిసి ట్రై చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది." మరొకసారి సమీర భుజాల చుట్టూ తన కుడిచేతిని వేసి, దగ్గరకి తీసుకుంటూ అంది మల్లిక.

"అనురాగ్ కూడా నాకు ఈ విషయంలో మాటిచ్చాడు, నువ్వూ అందుకు హెల్ప్ చెయ్యడానికి సిద్ధంగా వున్నావు. నాకు కచ్చితంగా డాడ్ చెప్పదలుచుకున్నది ఏమిటో తెలిసే తీరుతుంది అనిపిస్తోంది."

"అనురాగ్.................అనురాగ్ నీకు మాటిచ్చేడా? అంత ఫ్రెండ్షిప్ మీ ఇద్దరి మధ్య ఎప్పుడు కుదిరింది? నీకు అనురాగ్ అంటే అసలు పడదు కదా." మొహంలో సర్ప్రైజింగ్ ఎక్సప్రెషన్ తో అడిగింది మల్లిక.

"అనురాగ్ విషయంలో నా ఆటిట్యూడ్ కొంత మారింది. నేను అప్పుడు ఆలోచించినంత నెగటివ్ గా ఇప్పుడు అనురాగ్ గురించి ఆలోచించడం లేదు. నువ్వూ, ఆంటీ ఇంకా సంజయ్ తరచూ అనురాగ్ గురించి చెప్పేది నిజమే అనిపిస్తూంది. తనంత గుడ్ క్యారక్టర్ కాకపోతే డాడ్ అసలు తనని బేర్ చేసేవారు కాదు." ఆలా మాట్లాడుతూన్నప్పుడు సమీర మొహం సిగ్గుతో ఎర్రబడింది తనెంత కోపంగా అనురాగ్ గురించి మాట్లాడేదో గుర్తుకు వచ్చి. ఇదేదో నిజంగా ఓటమిని ఒప్పుకుంటున్నట్టుగా వుంది.

"ఇది నిజంగా చాలా గుడ్ డెవలప్మెంట్ సమీ." సమీర ఫీలింగ్ ని అసలు పట్టించుకోనట్టుగా అంది మల్లిక. "మీ డాడ్ అంతగా డెవలప్ చేసిన ఈ బిజినెస్ ని నిలబెట్టాలంటే మీ ఇద్దరి మధ్య గుడ్ కోఆర్డినేషన్ చాలా అవసరం. అది కూడా సెట్ అయింది. ఇంకిప్పుడు దేనిగురించి ఆందోళన పడక్కరలేదు."

ఇద్దరూ అలా మాట్లాడుకుంటూనే వుండిపోయారు, నిర్మల వచ్చి సప్పర్ కి పిలిచే వరకూ కూడా. సప్పర్ పూర్తయిన తరువాత, ఇద్దరూ సమీర గదిలో, సమీర బెడ్ మీద నిద్రపోయారు. 

&&&

"తన పేరు నీరజా చక్రవర్తి. నాకు అన్నివిధాలుగా సూటబుల్ అనిపించిన కాండిడేట్. నీకు నచ్చితే, ఇప్పటినుండి తానే నీ పెర్సనల్ సెక్రటరీ. నీ ఛాంబర్లోకి పంపించనా?" తన ఛాంబర్లో, తను తన కుర్చీలో కంఫర్టబుల్ గా సెటిల్ అయిన అరగంటలో ఇంటర్ కం లో చెప్పాడు అనురాగ్.

"నీకంత సూటబుల్ అనిపిస్తే నాకు అలానే అనిపిస్తుంది. ప్లీజ్ సెండ్ హర్ అలాంగ్ విత్ హర్ ఫైల్."

తనలా అన్నాక, ఒక పది నిమిషాల్లో తన ఛాంబర్ డోర్ మీద టాపింగ్ సౌండ్ ఇంకా 'మే ఐ కమ్ ఇన్ మాడం' అన్న ఫిమేల్ వాయిస్ వినిపించేయి సమీరకి.

"స్యూర్ యు మె"

తనలా అన్నాక, సుమారుగా ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు వున్నఅమ్మాయి వచ్చి నిలబడింది సమీర ముందు. మొహం కళగాను, మనిషి అట్ట్రాక్టీవ్ గాను వుంది. జస్ట్ ఆమెని చూస్తూ వుండగానే, అనురాగ్ కరక్ట్ కాండిడేట్ నే సెలెక్ట్ చేసాడనిపించింది.

"ప్లీజ్ మేక్ యువర్ సెల్ఫ్ కంఫర్టబుల్ ఇన్ దిస్ చైర్ ..........." చైర్ ని చూపిస్తూ, అనురాగ్ చెప్పిన పేరు గుర్తుకురాక ఆగింది సమీర.

"నీరజ………....నీరజా చక్రవర్తి మాడం. చక్రవర్తి నా హస్బెండ్ నేమ్." సమీర చూపించిన కుర్చీలో డెలికేట్ గా సెటిల్ అవుతూ అంది నీరజ.

"ఒకే నీరజా. నాకు నిన్ను చూస్తూంటే చాలా మంచి అభిప్రాయం కలుగుతూంది. నీ ఫైల్ నేను ఇప్పుడు చూడ్డం జస్ట్ ఏ ఫార్మాలిటీ. నువ్వు నా సెక్రటరీ గా సెలెక్ట్ అయిపోయవనే అనుకో." తన ఫైల్ గురించి చెయ్యి జాపుతూ అంది సమీర.

"థాంక్ యు మాడం." ఫైల్ అందిస్తూ అంది నీరజ

   "నేమ్: నీరజా చక్రవర్తి. వైఫ్ అఫ్........లేట్ సందీప్ చక్రవర్తి." ఫైల్ లో అలా చూసాక, షాక్ కొట్టినట్టుగా తలెత్తి, నీరజ మొహంలోకి చూసింది సమీర. "దట్ మీన్స్......................"

"ఎస్ మాడం. నా హస్బెండ్ చనిపోయి రెండు సంవత్సరాలు అవుతూంది. తానొక ఆక్సిడెంట్ లో చనిపోయారు."

"ఐ యాం సారీ. అబ్సల్యూట్లీ సారీ." మొహంలో హర్ట్ ఫీలింగ్ తో అంది సమీర.

"ఇట్స్ ఆల్రైట్ మాడం. నేను ఆ ఫాక్ట్ కి అలవాటు పడిపోయాను." నీరజ చిరునవ్వుతో అన్నా, ఆ మొహంలో విచారం తాను అందుకు అలవాటు పడలేదు అని తెలియచేస్తూ వుంది.

"యు ఆర్ వెరీ యంగ్ నీరజా. జస్ట్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఏజ్డ్. మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోలేదు?" ఫైల్ లో తక్కిన వివరాలు చూస్తూ అడిగింది సమీర.

"మాది ఏరంజెడ్ మ్యారేజ్. నాకు లవ్ లాంటివాటి గురించి తెలీదు. మా పెళ్లయిన రెండు సంవత్సరాలకే నా హస్బెండ్ పోయారు. కానీ, ఆ రెండు సంవత్సరాలలో మా మధ్య డెవలప్ అయిన అనుబంధం, ప్రేమ గురించి నేను మాటల్లో చెప్పలేను. కనీసం నా జీవితంలో ఇంకో మనిషి గురించి ఆలోచించడం కూడా నాకు సాధ్యం అయ్యే విషయం కాదు. నా పేరెంట్స్ కూడా నన్ను మళ్ళీ పెళ్లి చేసుకొమ్మని చాలా బలవంత పెట్టారు. కానీ నేను ఒప్పుకోలేదు. నా హస్బెండ్ నాకిచ్చిన తీపి గుర్తు, నా కూతురు 'సుస్మిత' లోనే నా హస్బెండ్ చూసుకుంటూ జీవితం గడుపుతున్నా, ఇకపైన కూడా అలాగే చేస్తా. ఇంకో వ్యక్తి తో నా జీవితం పంచుకోవడం అన్న వూహ కూడా భరించలేను."

"ఐ యాం ఒన్స్ అగైన్ సారీ, నీరజా. మీ ఫీలింగ్స్ గురించి ఆలోచించకుండా నేనలా అన్నాను." మొహంలో విచారంతో అంది సమీర.

"నో, మాడం. ప్లీజ్ మీరు ఫీల్ అవ్వకండి. నా పేరెంట్స్ కూడా మీలా ఆలోచించే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని చాలా బలవంత పెట్టారు. అలా ఆలోచించడం చాలా నాచురల్. చనిపోయిన తరవాత కూడా నా హస్బెండ్ గురించి నేనలా ఆలోచించడం చాలా మందికి విపరీతంగా అనిపిస్తుంది. దానికి నేనేం చెయ్యలేను."

"మీ లేట్ హస్బెండ్ ని మీరింకా ఇలా ప్రేమిస్తూ వుండగలగడం, మీ మీద నా గౌరవాన్ని పెంచాయి. మీ ఫైల్ లో నేనింకేది చూడాల్సిన అవసరం వుందనుకోవడం లేదు." ఆ ఫైల్ ని మూసి టేబుల్ మీద పక్కన పెట్టిసి మళ్ళీ అంది సమీర. "నౌ ఐ విల్ గివ్ యు ఏ బ్రీఫ్ అబౌట్ వాట్ యు హావ్ టు డు ఎవ్విరి డే."

తరవాత నీరజకి క్లియర్ గా చెప్పింది సమీర తాను ఏమేం చేస్తూ ఉండాలో ప్రతిరోజూ

&&&

"నాకొక పెర్సనల్ సెక్రటరీ ని అపాయింట్ చేసుకున్నా. పేరు నీరజా చక్రవర్తి. అనురాగ్'స్ సెలెక్షన్. నాకు బాగానే అనిపించింది. నన్ను సాటిస్ ఫై  చేస్తుందనే అనుకుంటున్నా."  సప్పర్ చేస్తూన్నప్పుడు అంది సమీర.

"థాంక్ గాడ్! ఈ సెక్రటరీ నీకు ఇబ్బందులు కలిగించ కూడదని కోరుకుంటున్నా. పాత సెక్రటరీ తో నువ్వు చాలా ఇబ్బందులు పడి, ఆఖరికి తనని జాబ్ నుండి రిమూవ్ చెయ్యాల్సి వచ్చింది." మల్లిక అంది.

"ఎనీహౌ నీకు అనురాగ్ మీద కోపం కొంత తగ్గినట్టుగానే వుంది. తనమీద డిపెండ్ అవుతున్నావు." చిరునవ్వుతో అన్నాడు సంజయ్.

అది వినగానే సమీర బుగ్గలు ఎందుకనో సిగ్గుతో ఎర్రబడిపోయాయి. తనెంతో నెగటివ్ గా మాట్లేడేది అనురాగ్ గురించి. "కానీ ఇక్కడ బాగా బాధ కలిగించే విషయం ఒకటి వుంది. ఇరవై ఎనిమిది సంవత్సరాలకే తానొక విడో. రెండు సంవత్సరాల కిందట తన హస్బెండ్ ఆక్సిడెంట్  లో చనిపోయాడు ఒక చిన్న పిల్లని తన గుర్తుగా మిగిల్చి."  

"చాలా బాధ కలిగించే విషయం. అలా జరిగి వుండకూడదు." మల్లిక అంది ఒక విచారకరమైన ఎక్స్ప్రెషన్ తో

"దేవుడి లీలలు అర్ధం చేసుకోవడం కష్టం. ఆ అమ్మాయికి అన్ని విధాలుగా అండగా ఆ దేవుడు ఉండాలని కోరుకుంటున్నా." నిర్మల అంది.

"ప్రతీది నీకు ఒక దేవుడి లీలే. నా మామ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ కె ఆక్సిడెంట్ లో చనిపోయినా అది నీకు దేవుడి లీలే. నా డాడ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ కె హార్ట్ అటాక్ తో చనిపోయినా అది నీకు దేవుడి లీలే. ఇప్పుడు ఈ అమ్మాయి భర్త తనని ట్వంటీ ఎయిట్ ఇయర్స్ కె విడో ని చేసినా, అదీ నీకు దేవుడి లీలే." సమీర కోపంగా అంది. "ఇక్కడ ఈ అమ్మాయికి అండగా నిలబడింది నేను. ఆ దేముడు కాదు."

"నీతో నేను అర్గ్యూ చెయ్యలేను. చెప్పాగా దేవుడి లీలలు అర్ధం చేసుకోవడం కష్టం. మనం కేవలం మనకి జరిగిన నెగటివ్ ఇన్సిడెంట్స్ గురించి మాత్రమే ఆలోచిస్తాం. పాజిటివ్ ఇన్సిడెంట్స్ గురించి ఆలోచించం. దేవుడి కృప లేకుండానే మీ డాడ్ బిజినెస్ లో రాణించ గలిగారా?"

"ఆంటీ, డాడ్ బిజినెస్ లో రాణించగలిగింది తన ఇంటలిజెన్స్ తో, ఇంకా.................." సమీర కోపంగా ఇంకా ఎదో అనబోయింది.

"సమీ. స్టాప్. దిస్ ఈజ్ నాట్ సంథింగ్ వుయ్ హావ్ టు అర్గ్యూ లైక్ దిస్." మల్లిక కల్పించుకుంటూ అంది.

"ఐ యామ్ సారీ ఆంటీ." సడన్గా తన మిస్టేక్ గ్రహించింది సమీర. అందరు పెద్దవాళ్లలాగే తన ఆంట్ కి కూడా దేవుడు అంటే చాలా నమ్మకం, ట్రాడిషన్స్ అంటే చాలా గౌరవం. తన ఆంట్ తాలూకు బిలీఫ్స్ ఇంకా ట్రాడిషన్స్ అన్నీ తెలిసికూడా తనలా అర్గ్యూ చెయ్యడం తప్పే. "నేనింకెప్పుడూ అలా మాట్లాడను."

నిర్మల ఎదో అనబోతూ వుండగా, అంతకన్నా ముందుగానే అంది మల్లిక సంజయ్ మొహంలోకి చూస్తూ. "ఏం బాబూ, నువ్వేమన్నా మారావా, లేకపోతే ఇంకా అలాగే వున్నావా?"

"ఏ విషయంలో నేను మారాలి? నాకు అర్ధం కావడం లేదు." అర్ధం కానట్టుగా నటిస్తూ చిరునవ్వుతో అన్నాడు సంజయ్.

"నటించకు. నేను దేనిని వుద్దేశించి అన్నానో నీకు తెలుసు." కోపంగా అంది మల్లిక. "అదే బ్లాక్ మ్యాజిక్, షాడో వరల్డ్, అక్కల్ సైన్స్ అంటూ తిరుగుతావు కదా. అదేమైనా తగ్గిందా లేదా, ఇంకా అలాగే వున్నావా?"

"ఆ విషయంలో ఇతగాడిని మార్చడం ఎవరివల్ల కాదు." నిర్మల కి కూడా కోపం వచ్చింది. "వాడిని చాలా సంవత్సరాలుగా చూస్తూనే వున్నావు కదా. అయినా అలాంటి ఆశ ఎలా పెట్టుకున్నావు?"

"మీరందరూ అలా ఎందుకు ఆలోచిస్తారో నాకు బాధపడడం లేదు." సంజయ్ కూడా కోపంగా అన్నాడు. “ఆ బ్లాక్ మేజిక్, షాడో వరల్డ్ లాంటివి మీరనుకుంటున్నంత చెడ్డ విషయాలు కావు."

"నీకెలా నచ్చ చెప్పాలో అర్ధం కావడం లేదు. అవి నిన్ను.................."

"మల్లికా ప్లీజ్. మీరిద్దరూ ఈ విషయంలో ఆర్గ్యుమెంట్ మానేయండి." సమీర బతిమాలుతున్నట్టుగా మల్లిక మొహంలోకి చూస్తూ అంది.

"సమీ. నువ్వెందుకు అర్ధం చేసుకోవు? ఇందులో నీ తప్పూ వుంది. నువ్వెప్పుడూ తనని మార్చడానికి ప్రయత్నించవు. తనకెప్పుడూ దగ్గరలోనే వున్నా, నేను చేసేపాటి ప్రయత్నం కూడా చెయ్యవు." సమీర వేడుకోలుని పట్టించుకోకుండా అంది మల్లిక.

"నేను పట్టించుకో లేదా, మార్చే ప్రయత్నం చెయ్యలేదా? తననే అడుగు, చేసేనో లేదో?" సంజయ్ ముఖంలోకి చూస్తూ అంది సమీర.

"అఫ్ కోర్స్, ఎస్. తను నాతొ చాలా సార్లు చెప్పిచూసింది." తలూపి ఒప్పుకున్నాడు సంజయ్. "కానీ నేను చేస్తున్నది తప్పు కాదని తెలిసినప్పుడు నేనెందుకు మారతాను?"

మల్లిక ఇంకా ఎదో కోపంగా అనబోతూ వుంటే, నిర్మల ఆపి అంది. "సరే ఇప్పుడు నువ్వు వచ్చావు కదా. నువ్వు ట్రై చేసి మార్చు. మేమేమన్నా వద్దంటామా?"

"ఎస్, ఆంటీ చెప్పింది రైట్." సమీర కూడా చిరునవ్వుతో అంది. "నీకు సంజయ్ గురించి మా ఇద్దరికన్నా కూడా ఎక్కువ కాన్సర్న్ వున్నట్టు వుంది.  ఆ బాధ్యత నువ్వు తీసుకుని మార్చు."

తరువాత మల్లిక, ఇంకా సంజయ్ ఇద్దరూ కూడా సైలెంట్ అయిపోయారు నిర్మల ఇంకా, సమీర మాటల్లో ఇండైరెక్ట్ మీనింగ్ గమనించి. తరువాత ఇంక పెద్దగా మాటలు లేకుండానే సప్పర్ పూర్తయింది.

&&&

"గత రెండు రోజులుగా చాలా వుత్సాహంగా కనిపిస్తూ వున్నావు." ఆరోజు ఆఫీస్ లో వర్క్ అంతా పూర్తయ్యాక, అనురాగ్ అన్నాడు తన మొహంలోకి సూటిగా చూస్తూ.

"నీకు చెప్పడం మర్చిపోయా." కుర్చీలో వెనక్కి జారగిలబడి సంతోషం గా నవ్వుతూ అంది సమీర. "మల్లిక వచ్చింది. ఇక తను నాతోనే వుండబోతూ వుంది. ఇక్కడే దగ్గరలో ప్రాక్టీస్ పెట్టుకుంటానని చెప్పింది."

"ఇది నిజంగానే చాలా సంతోషించాల్సిన విషయం. మల్లిక నీకు చాలా మంచి ఫ్రెండ్ అన్న విషయం నాకు తెలుసు." అనురాగ్ కూడా చిరునవ్వుతో అన్నాడు.

"థాంక్ యూ అనురాగ్. నా గురించి నువ్వు నిజంగానే చాలా మంచి సెక్రటరీ ని సెలెక్ట్ చేసావు. ఈ రెండు రోజుల్లోనే నేను తనతో చాలా సాటిస్ ఫై అయ్యాను. నిజానికి పాత సెక్రటరీ అనుభవం తో ఇంకో సెక్రటరీ అంటేనే నాకు భయం పట్టుకుంది." గట్టిగా నిట్టూరుస్తూ అంది సమీర.

"మెన్షన్ నాట్. నీకు ఇక్కడ అన్ని విధాలుగా బాగా ఉండేలా చూస్తే అది నాకే ఎక్కువ ఉపయోగం. నా వర్క్ ప్రెజర్ తగ్గుతుంది." ఆ చిరునవ్వుని కొనసాగిస్తూ అన్నాడు అనురాగ్. "అందరూ ఒక్కలా వుండరు. ఒక్కళ్ళ తో కలిగిన అనుభవంతో మనం అందరిమీద భయం పెట్టుకోకూడదు."

"యు ఆర్ రైట్." తలూపి అంది. ఇంత త్వరగా తనకి అనురాగ్ తో ఇలాంటి చక్కటి రిలేషన్షిప్ డెవెలప్ కావడం తనకే ఆశ్చర్యం గా వుంది. ఎంత కోపంగా ఆలోచించేది అనురాగ్ గురించి తను?

"నువ్వంటే నాకు చాలా రోజులు కోపంగా వుండేది తెలుసా?" సడన్ గా తనకి ఎందుకు అలా అనాలని అనిపించిందో తెలీదు కానీ అనేసింది.

అనురాగ్ మొహం సడన్ గా సీరియస్ గా మారి పోయింది. తనూ కుర్చీలో వెనక్కి జారగిలబడి, దీర్ఘంగా నిట్టూర్చి అన్నాడు. "అప్పుడు నీ కోపం అర్ధం చేసుకోగలను. మీ డాడ్ నా వల్ల అంతగా హర్ట్ అయితే, నీకు కోపం రావడం లో తప్పేముంది? నిజానికి అలా ప్రవర్తిస్తూన్నందుకు నా మీద నాకే కోపం వచ్చేది. కానీ తప్పలేదు."

అనురాగ్ మొహంలోకి అలాగే చూస్తూ వుంది సమీర. ఒక కొత్త అనురాగ్ ఆవిష్కరించబడుతూన్నట్టుగా వుంది.

"మీ డాడ్ ఒక జీనియస్. పది లక్షల పెట్టుబడి తో ప్రారంభించిన వ్యాపారం మూడులక్షల కోట్ల రూపాయలకి తీసుకురాగలిగారు. కానీ అయన తీసుకునే కొన్ని, కొన్ని నిర్ణయాలు బిజినెస్ ని చాలా నష్టపరుస్తాయనిపించేవి. అందుకనే తీవ్రంగా అపోజ్ చేసేవాడిని. వదలి వెళ్లిపోతానని బెదిరించేవాడిని. నేను బిజినెస్ లో చాలా కీ అయిపోవడం వల్ల, నన్ను వదులుకునే పరిస్థితుల్లో అయన లేరు. అందుకనే ఎంత ఇష్టం లేకపోయినా, నా ఇష్టాలకి వ్యతిరేకం గా వెళ్లలేక పోయారు."

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)