Featured Books
  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

  • అరె ఏమైందీ? - 14

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 3

                                           మనసిచ్చి చూడు...3డీప్...

  • అరె ఏమైందీ? - 13

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నులి వెచ్చని వెన్నెల - 4

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

అనురాగ్ కూడా కుర్చీలోనుంచి లేచి సమీరకి అపోజిట్ గా వచ్చాడు. "నిజంగా ఒక విషయం గురించి మీ డాడ్ అంతగా ఆందోళన పడ్డారా? ఇది నాకు ఆశ్చర్యంగా వుంది. ఏ విషయం గురించి అయినా అలా ఆందోళన పడే మనస్తత్వం కాదాయనది. సమస్యలని చాలా సులువుగా సాల్వ్ చేస్తారు." సడన్గా అనురాగ్ మోహంలో కూడా ఆందోళన, ఇంకా ఆశ్చర్యం కనిపించాయి.

"ఎస్, అనురాగ్. అదే నాకూ ఆందోళనగా వుంది. డాడ్ నే ఆందోళన పెట్టిన ఆ విషయం ఏమిటో నాకూ ఎంత ఆలోచించినా బోధపడడం లేదు." అనురాగ్ కూడా అలా ఆందోళన పడడం తన ఆందోళనని ఇంక ఎక్కువ చేసింది.

 "ఆయన రాసిన డైరీ చదివావా? డాడ్ కి డైరీ రాసే అలవాటు వుంది. అందులో ఏమైనా మెన్షన్ చేసి వుండొచ్చు."

"చదివాను. అందులో కూడా ఏం మెన్షన్ చెయ్యలేదు."

"అందర్నీ నువ్వు క్లియర్ గా మళ్ళీ మళ్ళీ అడిగావా? వాళ్ళు బహుశా మర్చిపోయి వుండొచ్చు."

"ఆంటీ కానీ, సంజయ్ కానీ, మల్లిక కానీ ఇంకా డాక్టర్ అంకుల్ కూడా వాళ్ళతో డాడ్ ఏదైనా అంత ముఖ్యమైన విషయం చెప్తే, నాకు చెప్పడం మర్చిపోరు. అందులోనూ నేను అడిగిన తరవాత కూడా అది వాళ్ళకి గుర్తు రాకుండా ఉండదు. ఐ యాం స్యూర్ అనురాగ్. డాడ్ వాళ్ళతో అది షేర్ చేసుకోలేదు." ఆలా అన్నాక సమీర వెళ్లి, మళ్ళీ తన కుర్చీలో కూర్చుంది.

"వాళ్ళతోనే షేర్ చేసుకోని విషయం, మీ డాడ్ నాతో షేర్ చేసుకోక పోవడం లో ఆశ్చర్యం లేదు. మా ఇంటిమసీ అంతా బిజినెస్ విషయాలవరకే పరిమితం." తానూ వచ్చి కుర్చీలో కూచున్నాక అన్నాడు అనురాగ్.     

"అయితే డాడ్ అంతగా ఆందోళన పడింది బిజినెస్ కి సంబంధించిన విషయం కాదంటావా?" కుర్చీలో వెనక్కి జరగిలబడుతూ అడిగింది సమీర.

"కాదనే అనిపిస్తూంది. డాడ్ బిజినెస్ లో చాలా, చాలా పెద్ద సమస్యలే ఫేస్ చేశారు. వాటిని చాలా ఫ్రీగా నాతో షేర్ చేసుకునే వారు. అంత నీతో తప్ప ఇంకెవరితోనూ షేర్ చేసుకోలేనంత పెద్ద సమస్య బిజినెస్ లో ఏం వస్తుంది?" భృకుటి ముడేసాడు అనురాగ్.

"యు ఆర్ రైట్. నాకూ అదే అనిపిస్తూంది. బిజినెస్ లో చాలా పెద్ద పెద్ద సమస్యలే నాతో నవ్వుతూ షేర్ చేసుకునే వారు డాడ్." మళ్ళీ ముందుకు వంగి టేబుల్ మీడ్ తన రెండు మోచేతులతో బాలన్స్ అయింది సమీర. "కానీ మా ఇంట్లో వారెవ్వరితోటి షేర్ చేసుకోలేని పెద్ద పర్సనల్ సమస్యలు మాత్రం ఏం వచ్చే అవకాశం వుంది? నా ఆంటీ తోటి,  కజిన్ తోటి, మల్లిక తోటి ఇంకా డాక్టర్ అంకుల్ తోటి కూడా చాలా చాలా క్లోజ్ డాడ్. మా మధ్య చాలా అనురాగం ఇంకా ఆత్మీయత కూడా వున్నాయి. నీక్కూడా ఆ విషయం తెలుసు కదా."

"అఫ్ కోర్స్, ఎస్. నాకు ఆ విషయం తెలుసును. కానీ ఆలోచిస్తూంటే నాకు ఒకలా అనిపిస్తూంది." సమీర తన ముఖంలోకి చూస్తూండగా తనుకూడా టేబుల్ మీద మోచేతుల్తో బాలన్స్ అయ్యాడు. "మీ డాడ్ హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. అదీ నీతో అలా మాట్లాడిన తరువాత. చాలా ముఖ్యం గా ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, ఆయనకదప్పుడే, చాలా రీసెంట్ గా తెలిసిన విషయం అయివుంటుంది. తను హార్ట్ ఎటాక్ తో ఆ తర్వాత వెంటనే చనిపోతానని అయన అనుకోలేదు కాబట్టి ఆ విషయాన్నీ ఎవెరితోటీ షేర్ చేసుకోలేదు. ఒకవేళ తను చనిపోతానని ముందుగానే ఆయన ఊహించి వుంటే, మీ ఆంటీ తోటి, ఇంకా తనతో క్లోజ్ గా వుండేవాళ్ళతో షేర్ చేసుకుని ఉండేవారు."

"యు ఆర్ రైట్. ఐ అగ్రీ." తలూపి అంది సమీర మళ్ళీ కుర్చీలో వెనక్కి జరగిలబడుతూ.

"ఎనీహౌ సమీరా. నేను నీకొక విషయం చెప్పదలచుకున్నాను." టేబుల్ మీద అలాగే చేతుల్తో బాలన్స్ అవుతూ, స్ట్రెయిట్ గా సమీర మొహంలోకి చూస్త్తూ అన్నాడు అనురాగ్.

"ఐ యామ్ ఆల్ ఇయర్స్. టెల్ వాట్?" క్యూరియాసిటీ తో నిండిపోయింది సమీర మొహం.

"మీ డాడ్ అంతగా ఆందోళన పడే విషయం ఒకే ఒక్కటి వుంది. అది నీ గురించి. బహుశా నీ సేఫ్టీ కి ఏదైనా ముప్పు ఉందని ఆయనకి అనిపించిందేమో. బీ కేర్ఫుల్ సమీరా."  

"ఏం చెప్తున్నావ్ అనురాగ్? నాకు చాలా భయంగా వుంది నీ మాటలు వింటూంటే." మరోసారి తన రెండు మోచేతుల్తో బల్లమీద బాలన్స్ అవుతూ ఆందోళనగా అనురాగ్ మొహంలోకి చూస్తూ అంది సమీరా. "నా లైఫ్ డేంజర్ లో వుందనా నీ వుద్దేశం?"

"ఎస్, ఆలోచిస్తూంటే నాకదే అనిపిస్తూంది. ఎందువల్ల, ఎలాగ అన్నది చెప్పలేను కానీ నీ లైఫ్ గురించి ఆలోచించే నీ డాడ్ ఆందోళన పడ్డారనిపిస్తూంది."

ఆ మాటలు తనలో భయాన్ని ఇంకా ఎక్కువ చేస్తూవుంటే, ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సమీర.                              

"నువ్వు అనవసరంగా ఆందోళన పడకు. జాగ్రత్తగా మాత్రం వుండు." తన కుడిచేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని, జెంటిల్ గా నొక్కుతూ అన్నాడు అనురాగ్. "వర్ధన్ రావు గారికి ఎంతో ముఖ్యమైన నువ్వు నాకూ ముఖ్యమే. నిన్ను కాపాడుకునే బాధ్యత నా మీద కూడా వుంది. ఏం చెయ్యాలో నేనూ ఆలోచిస్తాను, కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా వుండు."

తన మనసులో వున్న ఆందోళన అంతా ఒక్కసారిగా గాలికి ఎగిరి పోయింది అనురాగ్ అలా తన కుడిచేతిని తన రెండుచేతుల్లోకి తీసుకోగానే. ఎదో తెలియని మధురానుభూతితో నిండిపోయింది ఆమె హృదయం. తన చేతుల్ని వదిలేయ బోతున్న అనురాగ్ చేతుల్ని తన రెండు చేతుల్తో గట్టిగా పట్టుకుని అంది సమీర.

"డు యు రియల్లీ మెంట్ వాట్ యు సెడ్? నిజంగానే నా గురించి కేర్ తీసుకుంటావా?"

"నీకా డౌట్ ఎందుకొస్తూంది అసలు?" తన చేతుల్ని సమీర చేతులనుంచి బలవంతంగా విడిపించుకుంటూ అన్నాడు అనురాగ్. జరుగుతున్నది అప్పుడే గమనించినట్టుగా అనీజీనెస్ తో నిండిపోయింది అతని మొహం. "నీ డాడ్ ఆంటే నాకెంత గౌరవమో, ఇంకా నేను ఎంతగా ఆయన్ని అభిమానిస్తానో నీకు తెలియదు. ఆయనకి ప్రాణం అయిన నీకు నేను ఏదీ కానివ్వను. ఐ ప్రామిస్ యు దట్."

"థాంక్ యు అనురాగ్. థాంక్ యు వెరీ మచ్." చాలా రిలాక్స్డ్ గా ఫీల్ అవుతూ కుర్చీలో వెనక్కి జారగిలబడి అంది సమీర.

తనంత హాపీగా, అంత సంతోషంగా తను చెప్పిన దానికి ఫీలవుతూన్నది, తనని జాగ్రత్తగా చూసుకుంటానన్నందుకు మాత్రమే కాదు, ఎందుకు అన్నది బోధపడుతూ వుంది. కానీ ఎందుకు సడన్గా తన మీద ఇలా తనకి ఇష్టం లాంటి ఫీలింగ్ కలుగుతూంది అన్నది మాత్రం బోధపడడం లేదు. అనురాగ్ కొత్తగా అరైజ్ చేసిన డౌట్ వల్ల కలిగిన భయం, ఇంకా అప్పుడు తనిచ్చిన హామీ వల్ల కలిగిన ఆనందం సమపాళ్లలో వున్నాయి సమీరలో.

"నువ్వు నాకు థాంక్స్ చెప్పకు సమీరా. అది నా రెస్పాన్సిబిలిటీ." తనూ కుర్చీలో వెనక్కి జరగిలబడి అందులో సౌకర్యంగా సెటిల్ అవుతూ అన్నాడు.

"ఓహ్, నౌ బిజినెస్."

సమీర అలా అన్నాక ఆ ఇద్దరూ చాలా సేపు బిజినెస్ విషయాలు చర్చించుకున్నారు.  తను తన కేబిన్ లో నుండి వెళ్లబోయే ముందు అన్నాడు అనురాగ్. "నీకు పర్సనల్ సెక్రటరీ గురించి ఒక ఎంప్లాయిమెంట్ ఏజెన్సీ ని కాంటాక్ట్ చేసాను. వాళ్ళు కొంతమంది సూటబుల్ కాండిడేట్స్ ని పంపిస్తామని అన్నారు. త్వరలోనే నీకొక పెర్సనల్ సెక్రటరీని ఏర్పాటు చేస్తాను."

"ఆ బాధ్యత నువ్వే పూర్తిగా తీసుకో. నేను సెలెక్ట్ చేసుకుంటే మునపటిలాగే పెద్ద డిసాస్టర్ అవుతుంది." నవ్వుతూ అంది తను.

అనురాగ్ కూడా నవ్వి వెళ్ళిపోయాడు.      

&&&

బెడ్ మీద అనీజీ గా దొర్లుతూ వుంది సమీర. అనురాగ్ అలా చెప్పిన తరువాత చాలా భయపడిపోయింది. కాకపోతే తను తన కుడిచేతిని అలా తన చేతుల్లోకి తీసుకుని, అలా ప్రామిస్ చేసాక తనకేం జరిగిందో బోధపడడం లేదు. ఎదో మధురానుభూతి. తనింకా తనని అలాగే తనలోకి తీసుకోవాలని, ముద్దుపెట్టుకోవాలని. అప్పటివరకూ అనురాగ్ మీద వున్ననెగటివ్ ఫీలింగ్ ఏమైపోయిందో బోధపడడం లేదు.

కాకపోతే తను అనురాగ్ వైపు అలా అట్ట్రాక్ట్ అవ్వడం పట్లమాత్రం తనకి పెద్దగా ఆశ్చర్యంలేదు. సిక్స్ ఫీట్ హైట్, సిక్స్ ప్యాక్ బాడీ మాత్రమే కాదు. చాలా హ్యాండ్సమ్ పర్సనాలిటీ అయిన అనురాగ్ వైపు ఏ అమ్మాయి అయినా యిట్టె అట్ట్రాక్ట్ అవుతుంది. బట్, ఒకే ఒక నెగటివ్ ఫాక్టర్ తనలో.  ప్రస్తుతం తనకి నలభై రెండేళ్లు.

అంత హ్యాండ్సమ్ పర్సనాలిటీ వున్నా, అంత మంచి పొజిషన్ లో వున్నా అనురాగ్ ఇప్పటివరకూ ఎందుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడో తనకి అర్ధం కాదు. తనకి ఏమైనా లవ్ ఎఫైర్ కానీ, లవ్ ఫెయిల్యూర్ కానీ వున్నాయా? ఇప్పటివరకూ ఎప్పుడూ తనకి అనురాగ్ గురించి ఇలా ఆలోచించాలని అనిపించలేదు. ఇప్పుడు అనిపిస్తూ వుంది.

తనేమీ కొంపతీసి అనురాగ్ తో లవ్ లో పడలేదు కదా? ఆ ఆలోచన రాగానే చిన్న చిరునవ్వు వచ్చి చేరింది సమీర పెదవులమీదకి. ఇప్పటివరకూ తనకి బిజినెస్ గురించి ఆలోచనలే తప్ప లవ్ గురించి ఆలోచనలు లేవు. లవ్ ఆంటే ఎలా వుంటుందో కూడా తెలియదు. బహుశా ఎవరి గురించయినా ఇలా ఆలోచిస్తూ వుండడమే లవ్ ఏమో. మల్లిక ని అడగాలి. తనకి చాలా విషయాలు తెలుసు.    

మల్లిక మనసులోకి రాగానే, ఆలోచనలన్నీ మల్లిక మీదకి మళ్ళి పోయాయి. తనతో ఫ్రెండ్షిప్ లో మల్లిక కి ఒకటే కంప్లైంట్. చిన్నప్పటినుండి మల్లిక కూడా చాలా అందంగా ఇంకా అట్ట్రాక్టీవ్ గా ఉండేది. అబ్బాయిలందరూ తనవెంట కూడా పడుతూ ఉండేవారు. కాకపోతే అది కేవలం తను తన కూడా లేనప్పుడు మాత్రమే. ఒకవేళ తను మల్లిక తో ఉంటే వాళ్ళ అటెంషన్ అంత తనమీద ఉండేది. నిజానికి ఎలాంటి వాళ్ళ పక్కన ఉన్నాకూడా ఇమ్మీడియేట్ గా ఎదుటివాళ్ళ అటెన్షన్ తన మీదకి వచ్చేసేది.

"ఎందుకే ఇంత అందంగా వున్నావు? నువ్వు నా పక్కన ఉంటే నన్నెవరూ పట్టించుకోవడం లేదు." ఒకరోజు కోపంగా అంది.

"అయితే నీకు దూరంగా వుండమంటావా? మనమిద్దరం ఫ్రెండ్షిప్ కటీఫ్ చేసేసుకుంటే మంచిదేమో." తను చిరునవ్వుతో అంది.

"నో, నో, అంతమాట అనకు. నేను ఏదైనా వదులుకో గలను కానీ నీతో ఫ్రెండ్షిప్ మాత్రం కాదు." గాభరాగా అంది

"కానీ నీకొక్క విషయం తెలియదు." మల్లిక మొహంలోకి చూస్తూ అంది తను. "నా ఈ గొప్ప ఆస్తులు కానీ, ఈ అందం కానీ నాకు ఆనందాన్ని ఇవ్వడం లేదు. నాకు కావాల్సినదల్లా ఒక సాధారణ ఆడపిల్లలా ఆనందంగా వుండగలగడం. ఇలా ఏ విషయంలోనూ ఎక్స్ట్రార్డినరీ గా వుండడం కాదు."

"నీ సఫరింగ్ నాకు అర్ధం అవుతూంది. కానీ ఒక సాధారణ ఆడపిల్ల ఎలా ఆలోచిస్తుందో నీకు తెలిస్తే నీ ఆలోచనలో కొంత మార్పు వస్తుంది. తానెప్పుడూ కూడా చాలా రిచ్ గా వుండాలని, చాలా అందంగా వుండాలని, ఇంకా బాగా అందంగా డబ్బున్న అబ్బాయి తనని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ వుంటుంది."

ఇలాంటి సంభాషణ తమ మధ్య కొత్త కాదు

"నీకు మనుషుల మనస్తత్వాల మీద మంచి పట్టువుంది మల్లికా. నువ్వు నా మనస్తత్వం అర్ధం చేసుకోగలిగావు. అలాగే ఒక ఆర్డినరీ అమ్మాయి గురించి నువ్వు చెప్పినది కూడా నిజమే అని నాకు అనిపిస్తూంది. నువ్వెందుకు సైకాలజీ చదవకూడదు." ఆలా తన మనసులో సైకాలజీ చదవాలని, సైకాలజిస్ట్ కావాలన్న ఆలోచనకి తను పునాది వేసింది.    

మనుషుల మనస్తత్వాల మీద మాత్రమే కాదు, చాల విషయాల్లో మల్లిక కి మంచి పట్టు వుంది. ఎప్పుడూ తనతో మాత్రమే వున్నట్టుగా కనిపిస్తూ వున్నా, తనకి ఏ అవగాహనా లేని అన్ని విషయాల గురించి తనకెలా తెలిసేదో తనకి అర్ధం అయ్యేది కాదు.

"పిల్లలు ఎలా ఏర్పడతారో నీకు తెలుసా?" తామిద్దరూ ఆరోతరగతి చదువుతూ వున్నప్పుడు కాబోలు, ఒకరోజు తనని అడిగింది మల్లిక.

"మామ్స్ కడుపులో గాడ్ పెడతాడు వాళ్ళని. ఆంటీ చెప్పింది నాకు ఓ రోజు." తనకి సందేహం వచ్చి అడిగినప్పుడు, తన ఆంటీ చెప్పిన సమాధానం గుర్తొచ్చి చెప్పింది.

"యు ఆర్ రాంగ్. గాడ్ జస్ట్ లైక్ దట్ గా పెట్టేడు. ఆలా పిల్లలు కడుపులో ఏర్పడాలంటే చెయ్యాల్సింది వేరే వుంది."

ఆ పదకొండు,పన్నెండు ఏళ్ల వయసులో మల్లిక పిల్లలు ఎందుకు ఎలా ఏర్పడతారో చెప్తూ ఉంటే మొదట ఏవగింపుగా అనిపించింది, కానీ తరవాత తరవాత చాలా థ్రిల్ ఫీలింగ్ కలిగింది. ఆ విషయం గురించి తనకి తెలియకుండానే ఆలోచించడం మొదలు పెట్టింది, ఆలా ఆలోచిస్తూ ఉంటే ఎందుకు తనకి ఆలా థ్రిల్లింగా అనిపిస్తూ వుందో బోధపడేది కాదు.

ఇంకా కొన్ని రోజుల తరవాత మరొక విషయం మోసుకొచ్చింది మల్లిక. "ఒక ఆడపిల్ల మామ్  కావాలంటే తను పెద్దమనిషి కావాలి. తను పెద్ద మనిషి కాకుండా ఏ ఆడపిల్ల మామ్ కాలేదు."

"పెద్ద మనిషి కావడం అంటే ఏమిటి?" తన ఇగ్నోరెన్సు మీద తనకే కోపం వస్తూంది. మల్లిక కి తెలిసిన విషయాలన్నీ తనకెందుకు తెలియడం లేదు.

పెద్దమనిషి కావడం అంటే ఏమిటో మల్లిక వివరంగా చెప్పాక  తన మనసు భయం తో నిండిపోయింది. "మై గాడ్! నాలోనుంచి బ్లడ్ ఆలా బయటకి పోతుందా?" తను భయంగా అడిగింది.

"ఎస్, కాకపోతే అప్పుడు మాత్రమే కాదు. తరువాత ప్రతీ నెలా. ప్రతీ వుమన్ కి అది మస్ట్. కాకపోతే నీకు అందులో ఎలాంటి పెయిన్ వుండదు. నీకు ఇంకో విషయం తెలుసా?"

తనకింకా భయంగానే వుంది. "నాకు తెలియదని కచ్చితంగా చెప్పగలను."

"ఆల్రైట్. నిన్ను ఎడ్యుకేట్ చెయ్యడానికి నేనున్నాను కదా." తను నవ్వింది. "సెక్స్ లో పూర్తి మజా కావాలంటే పెద్దమనిషి అయ్యాకే అది చేయించుకోవాలి. పెద్దమనిషి కాకుండా సెక్స్ చాలా కష్టంగా వుంటుంది."

"మై గాడ్!" ఒక హారిఫిక్ ఎక్సప్రెన్ తో అంది తను. "నీకు తెలియని విషయాలు అంటూ ఎమన్నా ఉన్నాయా? ఇన్ని విషయాలు ఎలా తెలిసాయి నీకు?"

"నీకు నువ్వుగా ఉండిపోతే నీకు ఏ విషయాలు తెలియవు. నీకన్నా పెద్ద వాళ్ళతో కూడా కలిసి తిరిగితేనే నీకన్ని విషయాలు తెలిసేది."

ఇదంతా మల్లికకి తనకన్నా సీనియర్లతో కలిసి తిరగడం వల్ల కలిగిన జ్ఞానమని తనకి బోధపడింది. తనకి పెద్దగా అందరితోటి ఫ్రెండ్షిప్ చేసే అలవాటు లేదు. తనలో అప్పటికి పెద్ద బ్యాక్ డ్రాప్ కలుపుగోలుతనం లేక పోవడం.

చిత్రమైన విషయం ఏమిటంటే, సెక్స్ గురించి, పెద్దమనిషి అవ్వడం గురించి పూర్తిగా తెలిసిన మల్లిక కన్నా కూడా ముందు తానే పెద్ద మనిషి అయింది, తను ఎనిమిదో తరగతి చదువుతూవున్న సమయంలో, తన పదమూడో ఏట. అయితే మల్లిక చెప్పింది మాత్రం నిజం. అందులో తనకి ఎలాంటి నొప్పి లేదు. అది అంత ఈజీ గా వుండడం వల్ల ప్రతినెలా తనలా అవ్వాల్సి వస్తుందన్న భయం కూడ పోయింది సమీర లో. అంతే కాకుండా తన అత్తయ్య కూడా తను పెద్దమనిషి కాగానే, తనకి ఆ విషయం లో ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదని చాలా వివరించి చెప్పింది.

"కంగ్రాట్యులేషన్స్" తన దగ్గరికి వచ్చి అంది మల్లిక.

"ఏమిటి? దీనికి కూడా నువ్వు నన్ను కంగ్రాట్యులేట్ చెయ్యాలా?" చిరాగ్గా అడిగింది తను.

"ఎస్, హండ్రడ్ పర్శంట్. ఒక వుమన్ జీవితంలో ఇది చాలా పెద్ద స్టెప్. మామ్ కావాలంటే పెద్దమనిషి అయ్యే తీరాలి. మామ్ కాకుండా ఏ వుమన్ జీవితం ఫుల్ఫిల్ కాదు."

"ఆల్రైట్. థాంక్స్." ఇంకా చిరాగ్గానే వుంది తనకి.

"అంతేకాదు. ఇప్పుడు నువ్వు సెక్స్ లో ఫుల్ సాటిస్ఫ్యాక్షన్ పొందగలవు. అలాగే ఏ మగాడికయినా ఫుల్ సాటిస్ఫ్యాక్షన్ ఇవ్వగలవు. జస్ట్ ఏ మగాడితోనయినా సెక్స్ చేసి చూడు. నీకు ఎంత మజా వస్తుందో." తన మొహంలోకి సూటిగా చూస్తూ అంది తను.

"షట్ యువర్ మౌత్. నేను కనీసం అలాంటి ఆలోచన కూడా రానివ్వను. అదెంత తప్పో నాకు తెలుసు." కోపంగా అరిచి చెప్పింది తను.

నిజానికి తను అలాగే వుండాలనుకుంది, ఒకొక్క సారి సెక్స్ చేయాలన్న కోరిక చాలా విపరీతంగా కలుగుతూవున్నా కూడా. అలాగే వుంది కూడా తన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోకి వచ్చేవరకూ. కాకపోతే అప్పుడు వేసవి సెలవుల్లో, తన డాడ్ ఫ్రెండ్ సుదర్శన్ తన ఫ్యామిలీతో తన ఇంటికి దగ్గరలోనే ఇల్లు తీసుకుని స్థిరపడ్డాడు. తరంగ్ సుదర్శన్ ఒక్కగానొక్క కొడుకు.

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)