Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నులి వెచ్చని వెన్నెల - 8

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

"ఎస్, యు అర్ రైట్." తలూపి అంది సమీర. "ఒకసారి డాడ్ బ్యాంకు లో కంపెనీ షేర్స్ ప్లెడ్జి చేసి, లోన్ తీసుకుని, కొత్త ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేద్దామనుకున్నారు. అందుకు నువ్వు ఎంతమాత్రం ఒప్పుకో లేదు.  అప్పుడు డాడ్ బాగా హర్ట్ అయ్యారు. తను చాలా ఆశ పడ్డారు, ఆ కొత్త యూనిట్ స్టార్ట్ చేద్దామని. నువ్వంతగా అడ్డుపడకపోతే స్టార్ట్ చేసేవారు. నువ్వు వెళ్ళిపోయినా పర్లేదు కొత్త యూనిట్ స్టార్ట్ చేసేమని డాడ్ కి నేను సలహా కూడా ఇచ్చాను." సమీర అంది.

"నేను ఆ ఆలోచనని అంతగా అపోజ్ చెయ్యడానికి, ముఖ్యంగా రెండు కారణాలు వున్నాయి. మొదటిది, ఆ స్పేర్ పార్ట్శ్ తయారు చెయ్యడం లో మనకి అసలు అనుభవం లేదు. అందుకు కావలసిన స్కిల్ల్డ్ పీపుల్ మనదగ్గర లేరు. అంతేకాకుండా ఆ స్పేర్ పార్ట్శ్ కి చాలా కాంపిటీషన్ కూడా వుంది, మనం మనకి కావాల్సిన స్పేర్ పార్ట్శ్ అన్నీ చాలా కాంపిటీటివ్ ప్రైస్ కి కొంటున్నాం కూడా. డాడ్ మనకి కావాల్సినవన్నీ, మన దగ్గరే తయారుచేసుకోవచ్చని మాత్రమే వాటిగురించి ప్రొడక్షన్ యూనిట్ పెట్టాలని ఆలోచించారు. రెండవది, చాలా హ్యూజ్ క్వాంటిటీ అఫ్ షేర్స్ ప్లెడ్జి చేసి లోన్ తీసుకోవడం. అప్పటివరకూ మనం మన కంపెనీ షేర్స్ ప్లెడ్జి చెయ్యలేదు. అది నాకు నచ్చలేదు."

"మోస్ట్ ఐరానికల్ థింగ్" నవ్వి అంది సమీర. "నీ ఆలోచన కరక్ట్ అని ప్రూవ్ అయింది. అప్పుడు ఆ స్పేర్ పార్ట్శ్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన కంపెనీలు చాలా లాస్ పేస్ చేశాయి. అసలు అలా  స్టార్ట్ చేస్తూన్నవాళ్ళని చూసే డాడ్ స్టార్ట్ చేయాలనుకున్నారు. ఆ యూనిట్ స్టార్ట్ చెయ్యకపోవడం వల్ల మనం చాలా సేవ్ అయ్యాం."

"అంతే కాదు సమీరా.  తరవాత స్టాక్ మార్కెట్ డౌన్ అవ్వడం వల్ల, మన కంపెనీ షేర్స్ కూడా చాలా డౌన్ అయ్యాయి. చాలా కాలంపాటు ఆ లోవర్ ప్రైస్ దగ్గరే మన కంపెనీ షేర్స్ వుండిపోయాయి. మనం మన కంపెనీ షేర్స్ ప్లెడ్జి చేసి వుంటే,  మనం బ్యాంక్ కి మన షేర్స్ ఇంకా చాలా ఇవ్వాల్సి వచ్చి ఉండేది అప్పుడు." అనురాగ్ అన్నాడు.

"ఆ విషయం కూడా మేమిద్దరం మాట్లాడుకున్నాం అప్పుడు. కాకపోతే డాడ్ వున్నంతకాలం నా ఇంవోల్వ్మెంట్ ఇంతగా లేదు బిజినెస్ లో." గట్టిగా నిట్టూర్చి అంది సమీర. 

"మరొక ఇన్సిడెంట్ ఏమిటంటే, ఒక హెవీ ఫారిన్ మెషిన్ పర్చేజ్ డీల్ లో డాడ్ కి అమెరికన్ డాలర్ ఫ్యూచర్స్ కొనమని సలహా ఇచ్చాను. ఎందుకంటే డాలర్ బాగా అప్ప్రీసియేట్ అవ్వొచ్చని నాకు అనిపించింది. అందుకు అవకాశం లేదని డాడ్ కొట్టి పారేశారు. అప్పుడు మరొక సారి డాడ్ ని నేను వెళ్లిపోతానని బెదిరించాల్సొచ్చింది మీ డాడ్ చేత డాలర్ ఫ్యూచర్స్ కొనిపించడానికి."

"ఎస్, అది కూడా మేం డిస్కస్ చేసుకున్నాం." మరొకసారి అందంగా నవ్వింది సమీర. "నిజంగానే మెషిన్ పర్చేజ్ డీల్ అమౌంట్ పేమెంట్ డేట్ కి డాలర్ చాలా అప్ప్రీసియేట్ అయిపోయింది. ఆ  డాలర్ ఫ్యూచర్స్ కొని వుండకపోతే   చేయాల్సివచ్చిన డాలర్ పేమెంట్ లో  చాలా నష్టపోయి వుండేవాళ్లం." గట్టిగా నిట్టూర్చి మళ్ళీ అంది సమీర. "ఇలాంటి విషయాలు చాలానే వున్నాయి. మోస్ట్ అఫ్ ది థింగ్స్ లో నువ్వే రైట్ అని ప్రూవ్ అయ్యావు. గమనించాల్సిన విషయం ఏమిటంటే, డాడ్ హర్ట్ అయినప్పుడు మేమిద్దరం మాట్లాడుకున్నట్టుగా, ఆ విషయం లో మాకు లాభం వచ్చాక మాట్లాడుకోలేదు. అందుకనే చాలా కాలంపాటు నీ మీద నాకు కోపమే వుండిపోయింది. డాడ్ తరువాత ఆనందపడ్డారన్న దానికన్నా, ముందు నీవల్ల హర్ట్ అయ్యారన్న విషయమే నన్ను ఎక్కువ బాధించింది. నీ మీద చాలా కాలం కోపంగా ఉండేలా చేసింది." తనేంటి ఇంతగా ఓపెన్ అయిపోతూంది, ఆశ్చర్యపడుతూనే అనేసింది సమీర.

"నెవర్ మైండ్." నవ్వేసి అన్నాడు అనురాగ్. "ఎనీహౌ, ఇప్పుడు నాకు బోధపడిన విషయం ఏమిటంటే, ప్రజెంట్ నీకు నా మీద కోపం లేదు.  బోధపడని విషయం ఏమిటంటే, ఈ మార్పు నీలో ఎలా వచ్చింది?"

"ఆంటీ, కజిన్ ఇంకా మల్లిక కూడా నీగురించి ఎప్పుడూ నాకు బ్రెయిన్ వాష్ చేస్తూనే వున్నారు. వాళ్ళకి ఎప్పుడూ నీ మీద గుడ్ ఒపీనియన్ వుంది. కాకపోతే చాలాకాలం పాటు, నేనే నా థింకింగ్ మార్చుకోలేక పోయాను. ఎందుకు సడన్గా ఇలా ఆలోచించాను అన్నది నేను కూడా నీకు చెప్పలేను."

"ఆల్రైట్, ఆల్రైట్, నో ప్రాబ్లెమ్." మరోసారి నవ్వి అన్నాడు అనురాగ్. "నీకు నా మీద కోపం పోయింది. సో, మనిద్దరికీ మధ్య గుడ్ కోఆర్డినేషన్ వుంటుంది. అది మనిద్దరం ఎంతగా ప్రేమించే మీ డాడ్ స్టార్ట్ చేసిన ఈ బిజినెస్ చక్కగా నడవడానికి చాలా అవసరం."

"యూ ఆర్ రైట్ అనురాగ్. నా తరువాత డాడ్ కి ఈ బిజినెస్ అంటేనే ప్రాణం. డాడ్ అంతగా ఇష్టపడ్డ ఈ బిజినెస్ చక్కగా కాపాడాల్సిన భారం నా మీద వుంది." ధృడంగా అంది సమీర. "నీకూ, నాకు మధ్య అన్ని అరమరికలు తొలగి పోయి, ఇద్దరం డాడ్ బిజినెస్ కాపాడడానికి, డెవలప్ చెయ్యడానికి  ఇలా పూనుకోవడం నాకు చాలా ఆనందంగా వుంది."

"ఎస్, సమీరా. అది ఖచ్చితంగా జరుగుతుంది." ఆలా అన్నాక అనురాగ్ మొహం సడన్గా సీరియస్ గా మారింది. "నీ హ్యాపీ మూడ్ ని స్పాయిల్ చేస్తూ, ఇది చెప్పాలని లేదు. కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను."

"ఏంటది అనురాగ్." అది వినగానే సమీర మొహం ఆందోళనతో నిండింది.

"మీ డాడ్ అంతగా ఆందోళన పడి నీతో మాట్లాడాలనుకున్న విషయం నీ సేఫ్టీ కి సంబంధించిందేనని నాకు చాలా గట్టిగా అనిపిస్తూంది. బి కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా వుంటానని నాకు మాట ఇవ్వు."

అనురాగ్ నుండి అలా వినగానే సమీర గుండె భయంతో నిండిపోయి, ఏం మాట్లాడలేక అలాగే వుండిపోయింది.

"నువ్వు అనవసరంగా భయపడకు. మీ డాడ్ అంతగా నీతో మాట్లాడాలనుకున్న ఆ విషయం ఏమిటో, నీ సేఫ్టీ కి ఎలాంటి ముప్పు వుందో తెలుసుకునే ప్రయత్నం నేనూ చేస్తాను. నువ్వు మాత్రం నీ పూర్తి జాగ్రత్తలో వుండు చాలు."

"ఒకే అనురాగ్. అలాగే." తలూపి అంది సమీర.

&&&

"అనురాగ్ చెప్పింది కరక్ట్ అనే నాకూ అనిపిస్తోంది. ఎస్, హి ఈజ్ రైట్. బిజినెస్ గురించి అయితే అంకుల్ అంతగా ఆందోళన పడివుండేవారు కాదు. అయన ఆందోళన పడింది నీ సేఫ్టీ గురించి. కానీ నీకు ఏ రకమైన ప్రమాదం వుండి వుంటుంది అన్నదే ఎంత ఆలోచించినా బోధపడడం లేదు." అనురాగ్ తనతో అన్న విషయం సమీర మల్లిక తో చెప్పాక, మల్లిక అంది.

"అదే నాకూ బోధపడడం లేదు. కనీసం ఆ విషయం మీ ఎవరితోనన్నా షేర్ చేసుకుని వుంటే బాగుండి వుండేది." విచారంగా అంది సమీర.

ఇద్దరూ ఆ సమయంలో సమీర గదిలో బెడ్ మీద కూచుని మాట్లాడుకుంటూ వున్నారు. మల్లికకి ప్రత్యేకంగా ఒక గది కేటాయించినా, తను మాత్రం సమీర ఇంటిదగ్గర ఉన్నంతసేపూ సాధ్యమైనంత సమయం సమీరతోటె గడుపుతూ వుంది.

"అలా ఆలోచించి ప్రయోజనం లేదు. ఆ విషయం గురించి ఏ రకంగానైనా మనకి తెలుస్తుందేమో చూడాలి. ఎనీ హౌ, అంకుల్ డైరీ నువ్వు పూర్తిగా చదివావా? ఎక్కడైనా ఏదైనా హింట్ వదలివున్నారేమో అందులో."

"చదివాను. కానీ డాడ్ అందులో దానికి సంబంధించి ఏమీ రాయలేదు, ఎలాంటి హింట్ కూడా ఇవ్వలేదు."

సమీరకి ఆ డైరీ చదువుతున్నంతసేపూ చాలా కష్టంగా అనిపించింది. అంతసేపూ డాడీయే గుర్తుకువచ్చారు. అందుకనే పూర్తిగా కాన్సంట్రేట్ చేసి చదవలేకపోయింది కూడా.

"ఆ డైరీ తీసుకురా. మనిద్దరం కలిసి జాగ్రత్తగా చదువుదాం. ఎక్కడో ఎదో ఒక క్లూ వదిలే వుంటారు." మల్లిక అంది.

"వద్దు మల్లికా. ఆ డైరీ లో డాడ్ రైటింగ్ ని చూసి తట్టుకోలేను. చెప్పానుగా నేను ఆ డైరీ మొత్తం చదివాను. అందులో కూడా డాడ్ ఎలాంటి హింట్ ఇవ్వలేదు." చిరాగ్గా అంది సమీర.

"నువ్వు ఆ డైరీ పట్ల ఫీలయ్యే వ్యవహారం చూస్తూవుంటే నువ్వు అది సరిగ్గా చదవలేదని ఖచ్చితంగా చెప్పగలను. మనిద్దరం ఇప్పుడది చదివే తీరాలి. స్టాప్ ఫీలింగ్ లైక్ దట్ అండ్ గెట్ ది డైరీ."

సమీరా గట్టిగా నిట్టూర్చి, బెడ్ దిగి, అక్కడవున్న అల్మైరా ని ఓపెన్ చేసి, అందులోవున్న తన డాడ్ తాలూకు డైరీని తీసుకుని, మల్లికకి ఇచ్చాక మళ్ళీ ఆమె పక్కనే కూచుంది.

"నువ్వు ఫీలయినట్టుగానే నేనూ ఫీలవుతున్నాను అంకుల్ రైటింగ్ చూస్తూ వుంటే.  కానీ మనకి తప్పదు. ఇది నీ లైఫ్ కి సంభందించిన విషయం." ఒకటి, ఒకటిగా డైరీలో కాయితాలు తిరగేస్తూ అంది మల్లిక. "ఎస్, యూ ఆర్ రైట్. మీ డాడ్ ఇందులో ఎలాంటి హింట్ ఇవ్వలేదు. మీ డాడ్ కి డైరీ రాసే అలవాటు వున్నా అయన రెగ్యులర్ గా రాయలేదు. ఎప్పుడైనా ముఖ్యమైన విషయాలని మాత్రమే అయన రాసారు. అలాగే వాటికీ డేట్ కూడా ఇవ్వలేదు. అయన రాసిన డేట్ లో అవి జరిగాయని నేను అనుకోను." డైరీని కాసేపు చదివాక కిందపెడుతూ అంది మల్లిక.

"యూ ఆర్ రైట్. అయన డైరీని చూసి నేనూ అలాగే అభిప్రాయం పడ్డాను." వద్దనుకుంటూనే ఆ డైరీని చేతుల్లోకి తీసుకుని, అందులో కాగితాలని తిరగేస్తూ అంది సమీర. "లాస్ట్ పేజీ మీద రాసింది చాలా మైనర్ ట్రాన్సాక్షన్. రా మెటీరియల్ పూర్చేజ్ లో డీలర్ ని మారుస్తూన్న విషయం గురించి రాసారు అంతే." ఇంకా కాయితాలని తిరగేస్తూ అంది సమీర.

"ఎందుకిలా మనకి ఒక పెద్ద పజిల్ని మీ డాడ్ మిగిల్చారో నాకూ అర్ధం కావడం లేదు. విషయం నీ సేఫ్టీ కి సంభందించినది అయినప్పుడు అది ఎందుకు ఆయన అంత సీక్రెట్ గా వుంచారు?" మల్లిక అంది ముడతలు పడ్డ నొసలుతో.

"నో, మల్లికా. డాడ్ ఇక్కడ ఎదో రాసారు." సడన్ గా అని, బెడ్ మీద నుండి కిందకి దిగింది సమీర. "నేనిది ఎలా మిస్సయ్యాను అసలు?"

"ఏమిటి? దేనిగురించి రాశారు? నీ సేఫ్టీ గురించా? నేను మాత్రం ఇప్పుడు అంతా చూసాను కదా, ఎలా మిస్సయ్యాను?" మల్లిక కూడా హడావిడిగా బెడ్ దిగి, సమీర పక్కకి వచ్చి నిలుచుంది.

"ఇది అయన ఆఖరు పేజీల్లో రాసారు, ఫ్యూచర్ డేట్ లో. నాకూ అయన రైటింగ్ చూస్తూండడమే చాలా బాధగా అనిపించడం వల్ల నేను మిస్సవ్వడం లో ఆశ్చర్యం లేదు. ఫ్యూచర్ డేట్ లో ఏమీ రాసి వుండరనే వుద్దేశంతో నువ్వూ కాన్సన్ట్రేటెడ్ గా చూడలేదు." చిన్నగా వణికింది సమీర గొంతు మాట్లాడుతూన్నప్పుడు.

"ముందు ఆయన ఏం రాసారో చదువుదాం. వచ్చి కూర్చో."

బలవంతంగా సమీరని బెడ్ ఎడ్జ్ మీద కూలేశాక, తనూ సమీర పక్కనే కూచుంది మల్లిక. సమీర ఆతృతగా పైకే చదవడం మొదలుపెట్టింది ఆ పేజీ లో ఏముందో. తక్కిన అన్ని పేజీల్లోలా కాకుండా, ఎదో గిలికినట్టుగా, కంగారు, కంగారు గా రాసివుంది అక్కడ.

"ఇది నాకు సమీరకి ఎలా చెప్పాలో బోధపడడం లేదు, తనసలు నమ్ముతుందా? నేనే అసలు నమ్మలేకపోతున్నాను, ఇలాంటి సమస్య ఈ ఫ్యామిలీ కి వచ్చి పడిందని. తనని నమ్మించకపోతే, ఒప్పించకపోతే తన ప్రాణాలకే ప్రమాదం. చావు అంచుల్లో తను వుంది. ఇది తను అసలు ఊహించని విషయం. తెలిస్తే అసలు తట్టుకోలేదు. కానీ తెలియచేయక పోతే................."

ఆ పాసేజ్ ఆగిన చోటే ఆగి మల్లిక మొహంలోకి రెట్టించిన ఆందోళన తోటి చూసింది. "మై గాడ్! డాడ్.................డాడ్ అసలు ఏం చెప్పదలచుకున్నారు నాతో?"

"ఆ కిందని కూడా ఎదో రాశారు. అది కూడా చదువు. మొత్తం చదివాక ఆలోచిద్దాం." మల్లిక మొహం కూడా ఆందోళనతోనే వుంది.

"సమీ అమెరికా నుండి వెంటనే బయలుదేరి వస్తానని మాట ఇచ్చింది. కానీ అంతకాలం వుంటానని నాకు నమ్మకం కలగడం లేదు. తను వచ్చేలోగానే నేను చనిపోతే తనకా విషయం గురించి తెలిసేదెలా? తనకా విషయం గురించి తెలియకపొతే తనని తను చావునుండి ఎలా కాపాడుకోగలుగుతుంది? నేనిప్పుడే ఇక్కడే ఆ విషయం గురించి రాస్తాను. తను తప్పకుండ ఈ డైరీ చూస్తుంది. నేను అబద్ధాలు చెప్పనని తనకి తెలుసు."

ఆ తరువాత రాత ఇంకా చాలా గజిబిజిగా వుంది, ఎంతో కష్టపడుతూ రాసినట్టుగా.

"మై గాడ్! నేనిక రాయలేను. ఈ గుండెనొప్పి భరించలేను. సమీ ని ఇంకా..........."

"డాడ్........." చేతుల్లో పుస్తకాన్ని పక్కన పడేసి, మొహాన్ని రెండుచేతుల్లో కప్పుకుని, భోరుమంది మల్లిక.

"రిలాక్స్, రిలాక్స్ సమీ. మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయాలు చాలా వున్నాయి. నువ్విలా అయిపోతే ఎలా?" సమీర భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరకి తీసుకుని అంది మల్లిక.

"డాడ్ ఎలాంటి పరిస్థితుల్లో ఆ డైరీ రాసారో నీకర్థమవుతూందా? తను ఆ సమయంలో విపరీతమైన గుండెపోటుతో చనిపోబోతూ వున్నారు. అలాంటిసమయంలో కూడా అది రాసి నన్ను ప్రొటెక్ట్ చేయాలనుకున్నారు." ఇంకా భోరుమని ఏడుస్తూనే అంది సమీర.

"అంతే కాదు సమీ. ఆ విషయం వల్లే, ఆంటే దేనివల్ల నీకు ప్రమాదం వుందని భయపడ్డారో దానివల్లే, అంకుల్ కి గుండెపోటు వచ్చింది. లేకపోతె తనలా సఫర్ అయ్యేవారు కాదు, చనిపోయేవారు కాదు."

మొహం మీదనుండి చేతులు తొలగించి షాకింగా చూసింది మల్లిక మొహంలోకి సమీర.

"ఎస్ సమీ. నీ గురించి అంతగా ఆందోళన పడేలా చేసిన ఆ విషయమే అంకుల్ గుండెపోటుకు కారణం. మన ప్రస్తుత కర్తవ్యం అదేమిటో తెలుసుకోవడం. ఇలా ఆందోళన పడడం కాదు."

"యు అర్ రైట్. యు అర్ అబ్సల్యూట్లీ రైట్." తలూపి అదే షాకింగ్ ఎక్స్ప్రెషన్ తో అంది సమీర. "కానీ మనం ఇప్పుడు ఏం చెయ్యాలి?"

"అది నేను ఆలోచిస్తాను. నువ్వు మాత్రం వేరే ఏ ఆలోచన లేకుండా రిలాక్స్ అవ్వు. నీ కంపెనీ కి సంభందించిన పనులు చూసుకో. నీకే ప్రమాదం రాకుండా చూసుకునే బాధ్యత నాది."

ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా వుండిపోయింది సమీర.

"నువ్వెంత ఇష్టపడకపోయినా నేను చెప్పకుండా ఉండలేను. ఏమీ తెలియని చిన్నవయసులో నా పేరెంట్స్ చనిపోతే, నన్ను నిన్ను చూసుకున్నటుగానే చూసుకుని పెంచి పెద్ద చేశారు మీ డాడ్. నాకు కావలసినిది చెయ్యనిచ్చారు. ఏం చేసినా అంకుల్ ఋణం నేను తీర్చుకోలేను. ఆయనకి ప్రాణం అయిన నిన్ను కాపాడుకోలేకపోతే నేను వుండి ఎందుకు? నీ ప్రాణాలకి ఏ ప్రమాదం లేకుండా చూసే పూచినాది. ఆ విషయం గురించి ఏం ఆందోళన పడకుండా నువ్వు నిశ్చింతగా వుండు. ఇకనుండి కంటికి రెప్పలా నీ వెంటే నేను వుంటాను."

"థాంక్ యు మల్లి, ……….. థాంక్ యు వెరీ మచ్. నువ్విలా అంటూ వుంటే నాకు చాలా రిలాక్స్డ్ గా వుంది." సడన్గా మల్లికని కౌగలించుకుని, ఆమె కుడిబుగ్గమీద ముద్దుపెట్టుకుని అంది సమీర.

"నువ్విలా మరోసారి అన్నావంటే నీ ప్రాణాలు తీస్తాను." సమీర పట్టునుండి విడిపించుకుని కోపంగా అంది మల్లిక. "క్లోజ్ ఫ్రెండ్స్ మధ్య థాంక్స్ లు సారీలు ఉండకూడదని చెప్పానా లేదా నీకు?"

"ఐ యాం సారీ. మర్చిపోయాను." నవ్వుతూ అంది సమీర.     

"సారీలు కూడా వుండకూడదన్నాను కదా." తనూ నవ్వేసింది మల్లిక.           

అప్పటికి ఎదో రిలాక్స్డ్ గా ఫీల్ అయినా, ఆ తరువాత మళ్ళీ ఆందోళన పడకుండా వుండలేకపోయింది సమీర. రాత్రంతా తన డాడ్ డైరీలో రాసిందే గుర్తుకు వస్తూ వుంది.

&&&

ఆఫీస్ కి వెళ్లే సమయానికి నార్మల్ అయిపోయి హ్యాపీ మూడ్లోకి వచ్చేసింది సమీర. అందుకు కారణం ఉదయాన్నే మల్లిక మరోసారి తనని ఆందోళన పడొద్దని, తనంతా చూసుకుంటానని గట్టిగా చెప్పడం.

డోర్ ఓపెన్ చేసి తన ఛాంబర్ లోకి అడుగుపెట్టబోతూ చటుక్కున ఆగి పోయింది సమీర. అప్పటికే నీరజ తనకి అపోజిట్గా వున్న కుర్చీలో కూచుని వుంది. తను వెళ్లే సమయానికే నీరజ తన ఛాంబర్లో వెయిట్ చేస్తూవుండడం రోజూ జరుగుతూ వున్నదే. కానీ ఈ రోజు తను ఎవరితోనో మాట్లాడుతూంది. ఎవరూ లేని ఆ ఛాంబర్లో తను ఎవరితో మాట్లాడుతోంది? ఫోన్లో బ్లూ టూత్ తో ఏమైనా పెర్సనల్ విషయాలు మాట్లాడుతూ వుందా? తన ఛాంబర్లో తన ఫోన్ పెర్సనల్ మేటర్స్ కి యూజ్ చెయ్యొద్దని చెప్పిన తరువాత ఆలా చేస్తూందని అనిపించడం లేదు. తిన్నగా వెళ్లి తన సీట్లో కూచోవాలనుకున్నా, తన మాటల్లో తన పేరు వినిపించడం తో ఆగిపోయింది.

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)