Featured Books
  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

  • అరె ఏమైందీ? - 14

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 3

                                           మనసిచ్చి చూడు...3డీప్...

  • అరె ఏమైందీ? - 13

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నులి వెచ్చని వెన్నెల - 10

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

"నువ్వూ నీ డాడ్ ఎలా వుండేవారో నాకు బాగా తెలుసు. నీకు నీ చిన్నతనం నుండి మామ్ లేకపోవడం వల్ల అన్నీ ఆయనే అయిపోయారు. నీ ప్రతివిషయం ఆయనతో షేర్ చేసుకునే దానివి, ఎంతో ఇంటిమేట్ గా ఆయనతో వుండేదానివి. అయన అలా చనిపోవడం నీకు తీర్చలేని లోటు." కాస్త ఆగి మళ్ళీ అంది మల్లిక. "అందువల్ల షబ్-కాంషస్ గా నువ్వు, నీ లైఫ్ పార్టనర్ తో ఒక హస్బెండ్ ని తెచ్చుకోవడమే కాదు, డాడ్ లేని లోటుని కూడా తీర్చుకోవాలనుకుంటున్నావు. దట్ మీన్స్, నువ్వు అనురాగ్ లో కేవలం హస్బెండ్ ని మాత్రమే కాదు, డాడ్ ని కూడా చూస్తావు."

"నువ్వు మాట్లాడేది చాలా డిస్గస్టింగా వుంది. దయచేసి మరెప్పుడూ ఇలా మాట్లాడకు." షాక్ తో నిండిపోయింది సమీర మనసు అది వినగానే.

"బట్ ఐ జస్ట్ వాంట్ టు సే ది ఫాక్ట్ టు యు ఈవెన్ ఇట్ ఈజ్ హర్టింగ్." నవ్వింది మల్లిక. "ముందు ముందు నీకే అర్ధం అవుతుంది నేను చెప్పేదాంట్లో ఎంత నిజముందో."

"ఆల్రైట్. ఇప్పటికైతే మాత్రం నాకు ఆ ఆలోచనే చాలా ఇబ్బందిగా వుంది." మోహంలో ఫుల్ అనీజీనెస్ తో అంది సమీర. మల్లికతో ఇబ్బంది ఇదే. ఏ విషయాన్నీ అయినా ఇలాగే, ఎదుట మనిషి ఫీలింగ్ తో సంబంధం లేకుండా చెప్పేస్తుంది.

"ఎనీహౌ ఒక విషయం లో మాత్రం నీకు కంగ్రాట్స్. నీకు అందులో మాత్రం మంచి సుఖం ఇస్తాడు. నాకు డౌట్ లేదు."

"ఎదో వాడితో పడుకొని వచ్చినట్టుగా చెప్తున్నావు." చిరాగ్గా అంది సమీర. "ఇప్పటివరకూ వాడు పెళ్లే చేసుకోలేదంటే వాడసలు అందుకు పనికొస్తాడా, రాడా అని నాకు అనుమానం గా వుంది."

"పెళ్ళైన ప్రతిమగాడు పెళ్ళాన్ని సుఖపెడుతున్నట్టు కాదు. అలాని పెళ్లిచేసుకొని మగాడు అందుకు పనికిరానట్టూ కాదు. మొహంచూసి చెప్పొచ్చు వాడదెలా చేస్తాడో. నీతో బెట్. ఒక్కసారి వాడితో పడుకున్నాక చెప్పు, వాడు నిన్ను సుఖపెట్టలేదని. నేను సైకాలజిస్టుగా ప్రాక్టీస్ మానేస్తాను."దృఢం గా అంది మల్లిక.

"నేనిప్పుడు సెక్స్ సుఖం గురించి ఆలోచించడం లేదు. ఆ విషయం గురించి చాలా రోజులుగా మర్చిపోయాను. ఇప్పుడు నేను ఒకే విషయం గురించి భయపడుతున్నాను. అదికూడా నా ప్రాణాలు పోతాయని కాదు, డాడ్ ఇంత ప్రాణంగా డెవలప్ చేసిన బిజినెస్ వదిలేసి వెళ్లిపోతానని, దాని మీద ఆధారపడ్డవాళ్ళందరిని వీధిపాలు చేస్తానని."

"నో సమీ. అలా జరగదు. జరగనివ్వను. నీ ప్రాణాలకి, నా ప్రాణాలు అడ్డువేసి నిన్ను నేను కాపాడతాను. నీకు నేను మాట ఇస్తున్నాను.” సమీర కుడిచేతిని తనరెండు చేతుల్లోకి తీసుకుని సున్నితంగా నొక్కుతూ అంది మల్లిక.

ఆ చేతిని విడిపించుకుని, మల్లికని కౌగలించుకుని, తన ఎడమ బుగ్గమీద ముద్దుపెట్టుకున్నాక అంది సమీర. "నువ్వు చెప్పకపోయినా నాకా విషయం తెలుసు. ఎనీహౌ ఇప్పుడు నువ్విలా చెప్పాక ఇంకా రిలీఫ్ గా వుంది."

"అయితే ప్రస్తుతానికి హ్యాపీగా పడుకో. రేపు మనం అన్నివిషయాలు మరోసారి మాట్లాడుకుందాం. నాకు నిద్ర వస్తూంది." సమీర పట్టునుండి విడిపించుకుని, ఆవలిస్తూ బెడ్ మీద పడుకుంది మల్లిక.

గట్టిగా నిట్టూర్చి, మల్లిక పక్కనే తనూ నడుం వాల్చింది సమీర. అయితే ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో తనకే తెలియలేదు.    

&&&

మళ్ళీ అదే ఏడుపు. అదే అడుగుల శబ్దం. ఏవో కేకలు. "నేను నిన్ను వదలను. నిన్ను చంపే తీరతాను. వాడిని ఏం చెయ్యలేక పోయాను.  వాడి కూతిరివయిన నిన్ను సాధించి తీరతాను."

"ఎవరు నువ్వు? మా డాడ్ నీకేం అన్యాయం చేశారు?" ఆందోళనగా అరుస్తోంది సమీర.

"సాధిస్తాను. నిన్ను సాధిస్తాను. వాడిమీద తీర్చుకోలేని పగంతా నీ మీద తీర్చుకుంటాను."

"ముందు నువ్వెవరో చెప్పు. తరవాత మాట్లాడు. నా డాడ్ మీద నీకెందుకు కోపం." అదే మాడ్యులేషన్ తో తనూ అరుస్తోంది సమీర.

ఆవిడలా ఎదో అంటూనూ వుంది. సమీర అరుస్తూనూ వుంది.

"సమీ లే. ఏంటలా అరుస్తున్నావు?"

అయోమయంగా లేచికూచుని, మల్లిక మొహంలోకి చూసింది సమీర.

"బాడ్ డ్రీం ఏదన్నా వచ్చిందా? ఎంతగట్టిగా అరుస్తున్నావో తెలుసా?" సమీర భుజం చుట్టూ చెయ్యివేసి దగ్గరకి తీసుకుని అడిగింది మల్లిక.

"మై గాడ్! నిజంగానే చాలా బాడ్ డ్రీమ్!" దీర్ఘంగా ఊపిరి తీసుకుంటూ అంది సమీర. "కానీ నాకు అది డ్రీం అనిపించడం లేదు. ఆవిడ నిజంగానే నామీద పగబట్టి అలా అంటూ వుంది."

"డోంట్ బి సిల్లీ సమీ. ఇప్పటివరకూ నువ్వు నిద్రపోయావు. నిద్రలో కలలకి తప్ప వేరేవాటికి అవకాశం ఉంటుందా చెప్పు? నువ్వు ఆ నీరజ చెప్పినదాని గురించే ఆలోచిస్తూ వున్నావు. సో, నీ షబ్-కాంషస్ అలాంటి డ్రీం ప్రొజెక్ట్ చేసింది." మల్లిక అంది.

"నాకలా అనిపించడం లేదు. నాకలలో కనిపించినావిడ ఎలా వుందో తెలుసా? జుట్టు విరబోసుకుని, ఎర్రటికళ్ళతో, చాలా భయంకరంగా………......" సమీర మొహం అంతా మరోసారి భయంతో నిండి పోయింది.

"కలలు ఎలాగన్నా వచ్చే అవకాశం వుంది. ఎలా వచ్చినా కలలు, షబ్-కాంషస్ ఇమాజినేషన్ తప్ప ఇంకేం కాదు. అందువల్ల నీకు కలిగే హాని ఏమీ లేదు. జస్ట్ హ్యాపీగా పడుకో. తక్కిన విషయాలన్నీ, రేపు ఉదయాన్నే మాట్లాడుకుందాం." సమీర ని బలవంతంగా బెడ్ మీద పడుకోబెడుతూ అంది మల్లిక.    

"కానీ మల్లికా…………....."

"నా మీద ట్రస్ట్ వుంటే ప్రస్తుతానికి ఇంకేం ఆలోచించకుండా పడుకో. నేను నిన్ను పట్టుకునే పడుకుని, నీకేం కానివ్వను. ఒకే?" సమీరని ఆపుతూ అంది మల్లిక.

ఇంక ఒప్పుకోక తప్పలేదు సమీరకి. కానీ ఒకరకమైన భయం, అనీజీనెస్ మనసులో అలాగే ఉండిపోయాయి.

&&&

మర్నాడు ఆఫీస్ కి వెళ్లిన తరువాత కూడా తనలో ఆ భయం, అనీజీనెస్ అలాగే వున్నాయి. ఎందుకో అనురాగ్ ని వెంటనే చూడాలనిపించి, సెల్ కి కాల్ చేస్తే, స్విచ్డ్ ఆఫ్ వచ్చింది. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ వుంటే, నీరజ తన ఛాంబర్ లోకి వచ్చింది, రావడానికి పెర్మిషన్ తీసుకున్నాక. 

"అనురాగ్ ని ఒకసారి నా ఛాంబర్ కి రమ్మని చెప్పు." నీరజ తో అంది.

"నాకు ఒక హాఫ్ ఏన్ అవర్ కిందట ఫోన్ చేసి, తనకి ఒంట్లో బాలేదని, ఈ రోజు ఆఫీస్ కి రానని చెప్పారు మాడం." నీరజ అంది.

"ఒంట్లో బాలేదా? ఏమైంది?" కంగారుగా అడిగింది సమీర.

"ఆ విషయం చెప్పలేదు. నేను కూడా అడగలేదు." ఇబ్బందిగా, ఎదో తప్పు చేసిన ఎక్సప్రెషన్ తో అంది నీరజ.

"ఒకే. ఒకసారి నేను తనింటికి వెళ్లి వస్తాను." సమీర రియాక్షన్ జస్ట్ ఆటోమేటిక్. ఏవీ పట్టించుకోకుండా వెంటనే అనురాగ్ ఇంటికి చేరుకుంది.      

&&&

"ఏమిటిది సమీరా! నాకు జస్ట్ కొంచం ఫీవర్ గా వుండి ఈ రోజు కి రెస్ట్ తీసుకుందామనుకున్నాను. దానికే నువ్విలా పరిగెత్తుకుని రావాలా?" చిరాకు పడుతూ అడిగాడు అనురాగ్.

ఇద్దరూ మునపటి ప్రకారంగానే తను అక్కడవున్న సోఫాలో, ఇంకా అనురాగ్ దానికి ఆపోజిట్ గా వున్న కుర్చీలో సెటిల్ అయ్యారు.

"నీకు ఫీవర్ గా వుందా? నన్ను చూడనీ." చనువుగా ముందుకొచ్చి అనురాగ్ నుదిటిమీద చెయ్యిపెట్టింది సమీర. "ఎస్, యు హావ్ ఫీవర్. డాక్టర్ దగ్గరికి వెళదాం పద."

"ఇనఫ్ సమీరా." కోపంగా అన్నాడు అనురాగ్. "ఇంత చిన్న ఫీవర్ కె డాక్టర్ దగ్గరికి వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది."

"ఎనీహౌ ఆ పని అన్నా చేసావా?" అనురాగ్ కోపం అసలు పట్టించుకోకుండా అడిగింది.

"ఆ చేసాలే." అనురాగ్ ఇంకా కోపంగానే వున్నాడు. "నువ్వొక పెద్ద కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ వి. ఆర్డినరీ ఆడపిల్లవి కాదు. ఒక ఎంప్లాయీ గురించి ఆందోళన పడి ఇలా పరిగెత్తుకుని వచ్చావంటే, ఎవరన్నా ఏమనుకుంటారు అని కూడా ఆలోచించు."

"ఇంతవరకూ వచ్చింది కాబట్టి చెప్తున్నా." సడన్గా డెసిషన్ కి వచ్చేసింది సమీర. "నువ్వు కేవలం ఒక ఎంప్లాయీ మాత్రమే అని అనుకుంటే ఇలా వచేదాన్ని కాదు. యు ఆర్ ఏ లాట్, లాట్ మోర్ దెన్ దట్ టు మీ. ఇన్ ఫాక్ట్....................." తను చెప్పబోయేది నొక్కిచెప్పడానికి అన్నట్టుగా కాస్త ఆగింది సమీర. "…………….…..ఐ యాం ఇన్ లవ్ విత్ యు."

ఆ విషయానికి ఆశ్చర్యపడతాడనుకుంటే చిన్నగా నవ్వాడు అనురాగ్. "అయితే ద్వేషం, లేకపోతె ప్రేమ. ఎనీహౌ ఇలాంటి ఫీలింగ్ కి ఎదో పేరుందనుకుంటా. ఇన్ఫాట్యుయేషన్."

"డామిట్. ఇన్ఫాట్యూయేట్ అవ్వడానికి నేనేమి టీనేజర్ ని కాదు. ట్వేన్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ వుమన్ ని. లవ్ ఏంటో, ఇన్ఫాట్యుయేషన్ ఏంటో నాకు తెలుసు. ఐ యాం సీరియస్ లీ ఇన్ లవ్ విత్ యు."

"ఎనీ హౌ ఈ లవ్ ఫీలింగ్ అవతల వ్యక్తిచేత కూడా అంగీకరించబడాలి అన్నది ఒక ట్వేన్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ వుమన్ కి చెప్పాల్సిన అవసరం వుంటుందని నేను అనుకోవడం లేదు. నీ లవ్ నాకు అంగీకారం కాదు."

"ఏం, ఎందుకు కాదు? నువ్వు నన్ను ఎందుకు ప్రేమించలేవు?" అనురాగ్ షర్ట్ ఫిల్ట్ ని రెండుచేతులతో పట్టుకుని, తీవ్రంగా అతని మొహంలోకి చూస్తూ అడిగింది.

"నువ్వు ఫోర్స్ చేసి ఎవరిలోనూ, ఏ ఫీలింగ్ పుట్టించలేవు సమీరా. నేను నిన్ను ప్రేమించలేను. అది నావల్ల అవ్వదు." అదే దృఢస్వరంతో అన్నాడు అనురాగ్.    

"బహుశా నీకు ఇంకో విషయం కూడా తెలిసే వుండొచ్చు. అదే వచ్చిన ఫీలింగ్ ని బయటకి వెళ్లగొట్టడం. ముఖ్యంగా లవ్ ఫీలింగ్ ని కూడా అయ్యేపని కాదు. చాలా బలంగా ఫీలవుతున్నాలవ్ నీ వైపు నేను. ఆ ఫీలింగ్ ని వదలగొట్టుకోవడం సాధ్యం కాదు. ఇది లేని ఫీలింగ్ ని కలిగించుకోవడం కన్నా కూడా కష్టమైనా విషయం. సో,........................" తను మళ్ళీ వచ్చి సోఫాలో మామూలుగా సెటిల్ అయి నవ్వుతూ అంది. "............................నన్ను ప్రేమించడానికి నువ్వు  ప్రిపేరవ్వడమే మంచి విషయం."

 "నీకొచ్చిన ఫీలింగ్ ని వదలగొట్టుకోలేకపోతే అది నీ ప్రాబ్లెమ్. దానికి నేనేం చెయ్యలేను. నాకు లేని ఫీలింగ్ ని తెచ్చుకోలేను." అనురాగ్ మోహంలో చిరాకు, సమీరలో అసహనం ఇంకా ఎక్కువ చేసేస్తోంది..               

“అలా ఫీలింగ్ ని తెచ్చుకోలేకపోవడమే నీ ప్రాబ్లమ్ అయితే, డోంట్ వర్రీ. నాకన్నా ఎక్కువగా నీకు ఆ ఫీలింగ్ కలిగేలా చేసే పూచీ నాది. కానీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు." చిరాకంతా అణచుకుని చిరునవ్వుతో అంది సమీర.      

"ఓహ్, గాడ్!" ఇర్రిటేటింగ్ గా అన్నాడు అనురాగ్. "నువ్వేం చిన్నపిల్లవి కాదు. కాస్త అలోచించి చూడు. అది ఎంత అసంబద్ధంగా వుందో నీకే బోధపడుతుంది."

"ఎందుకు అది అసంబద్ధం గా వుందో నువ్వే చెప్పు నాకు." ముందుకు వంగి అంది సమీర. "ఐ యామ్ రెడీ ఫర్ ఏ బిగ్ డిస్కషన్ నౌ."

"వెరీ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ థింగ్." కుర్చీలో వెనక్కి జారగిలబడి అన్నాడు అనురాగ్. "నీకూ నాకూ మధ్య వున్నా హ్యూజ్ ఏజ్ గాప్. నీకన్నా నేను ఇరవై సంవత్సరాలు పెద్దవాడిని."

కుర్చీలో వెనక్కి జరగిలబడి గలగలా నవ్వింది సమీర. "ఆ విషయమై నాకులేని బాధ నీకెందుకు?"

"నీకు లేకపోవచ్చు, కానీ నాకుంది. నాకన్నా అంత చిన్నపిల్లని నేను లవ్ చెయ్యలేను. ఒక చిన్నపిల్లగా నువ్వు నా కళ్ళముందు తిరగడం నాకింకా బాగా గుర్తు. నెక్స్ట్ఇంపార్టెంట్థింగ్. నీ డాడ్ అంటే నాకు అపారమైన గౌరవం. నీకు నాకు మధ్య రేలషన్శిప్ నీ డాడ్ పొరపాటున కూడా ఊహించి వుండరు. నాక్కూడా కనీసం అలంటి వూహ కూడా ఎప్పుడూ రాలేదు. సో నేను నిన్ను లవ్ చెయ్యడం అన్నది సంథింగ్ ఇంపాజిబుల్."

"నాకదంతా తెలీదు. కానీ నాకున్న ఇంకో క్వాలిటీ గురించి కూడా నీకు బాగానే తెలిసివుంటుంది. అయినా చెప్తాను విను." అలాగే అనురాగ్ మొహంలోకి సూటిగా చూస్తూ అంది సమీర. "నేను కావాలనుకుంటున్నది ఏం చేసైనా సరే దక్కించుకోవడం. నిన్ను దక్కించుకోవాలని అనుకుంటున్నా. దక్కించుకునే తీరతాను." ఆమె గొంతులో దృఢత్వం వచ్చి చేరింది.

"నాకిష్టం లేనిది నేనెప్పుడూ చెయ్యలేదు. నిన్ను లవ్ చెయ్యడం అన్నది నేను బొత్తిగా ఇష్టపడని విషయం." కుర్చీలోనుంచి లేచి నిలబడ్డాడు అనురాగ్.

తనూ సోఫాలోనుండి లేచి నిలబడింది సమీర. తనేం చేస్తూందో అనురాగ్ గ్రహించేలోగానే, మీదపడి గట్టిగా కౌగలించుకుని, స్ట్రెయిట్ గా అతని పెదవులమీద ముద్దు పెట్టింది.

"జస్ట్ నేనెంత కమిటెడ్ గా వున్నానో చెప్పడానికి ఇది ఒక టోకెన్ మాత్రమే. నన్ను ప్రేమించడం తప్ప నీకు వేరే దారి లేదు. అందుకు నువ్వు ఎంత త్వరగా ప్రిపేర్ అయితే అంత మంచిది. సారీ ఫర్ డిస్టర్బింగ్ యు. టేక్ రెస్ట్ అంటిల్ యు రికవర్ ఫుల్లీ." ఆలా అన్న తరువాత వేగంగా అక్కడనుండి వెళ్ళిపోయింది సమీర.   

&&&

"నిన్ను వదలను. నిన్ను వదలను. నిన్ను సాధించే తీరతాను."

"ఆగు. ఎవరు నువ్వు? నామీద నువ్వెందుకు పగ సాధించాలి?" ఆందోళనతో నిండిపోయి వుంది సమీర గొంతు

"నా పగ నీ మీద కాదు. మీ నాన్న మీద. మీ నాన్న చేసినదానికి, మీ నాన్నని వదల్లేదు. నేను బతికుండగా ఏం చేయలేకపోయినా, నేను చచ్చాక వాడిని చంపి సాధిస్తున్నా. ఇకపైనా వాడిని వదలను. అలాగే నిన్నూ చంపేస్తాను. చచ్చే వరకూ చిత్రహింసలు పెడతాను. నిన్ను బాధపెడితేనే మీ నాన్న ఎక్కువ బాధపడేది"

"నన్నేమన్నా చెయ్యి. కానీ మా డాడ్ ని ఏం చెయ్యకు.చంపేసావుకదా.ఇంకాయన్నివదిలెయ్యి. దయచేసి విను." ఆందోళన ఇంకా ఎక్కువ అయింది సమీరలో.

"మీ ఇద్దరినీ వదలను. చంపడం తప్ప నీ డాడ్ ని అతను బతికుండగా  ఏమీ చెయ్యలేకపోయాను. మీ నాన్నని చిత్రహింసలు పెడుతూనే వుంటాను. మీ నాన్న బాధపడితే నువ్వింకా ఎక్కువ బాధపడతావని నాకు తెలుసు." ఆవిడ అరుస్తూ వేగంగా నడుస్తూ వుంది.

"చెప్పేది విను. మా డాడ్ ఎప్పుడూ ఎవరికీ తెలిసి అన్యాయం చెయ్యలేదు. నీ విషయంలో ఎదో పొరపాటు జరిగింది." ఆలా అంటూ ఆవిడ వెనకతలే పరుగుపెడుతూ అంది సమీర.

"సమీ. ఆగు. నువ్వేం చెయ్యబోతున్నావో బోధపడుతోందా?"

చటుక్కున ఈ లోకంలోకి వచ్చి, అయోమయంగా వెనక్కి తిరిగింది సమీర. వెనకాతలే నిలబడి వుంది మల్లిక ఆందోళననిండిన మొహంతో.

"మై గాడ్! సమీ. నేనిప్పుడు నీ భుజాలు పట్టుకుని ఆపి వుండకపోతే, నువ్వీ మేడమీద నుండి దూకేసి వుండేదానివి. నువ్వేం చేస్తున్నావో నీకసలు బోధపడుతూందా?" అదేఆందోళనతో అడిగింది మల్లిక.

"ఏమిటి నువ్వంటున్నది?” ఒక్కసారిగా సమీర ఒళ్ళు ఝల్లుమంది. తను నిజంగానె మేడ మీద పిట్టగోడ దగ్గర వుంది. అసలు తను మేడ మీదకి ఎలా వచ్చింది?

"నువ్వు ఈ రైలింగ్ మీదకి ఎక్కి కిందకి దూకేయబోతూ వున్నావు. నేను సమయానికి వచ్చి నిన్ను కిందకి లాగేసాను."

"ఓహ్, గాడ్! నిజమా!" మల్లికని కౌగలించుకుని అరిచింది సమీర.

"రిలాక్స్! పర్లేదులే. ప్రమాదం తప్పింది కదా." తనూ సమీరని కౌగలించుకుని, తన కుడిభుజం మీద తడుతూ అంది మల్లిక.

"ఇప్పటికి పర్లేదు. కానీ ఇన్ ఫ్యూచర్ మరోసారి ఇలా చెయ్యదని నమ్మకమేమిటి?"

ఎప్పుడు వచ్చాడో తెలియదు, కానీ సంజయ్ తామిద్దరి వెనకాల నిలబడి వున్నాడు.

"నువ్వెప్పుడు వచ్చావ్ సంజయ్?" మల్లిక అడిగింది.

"సమీర రూంలో నుండి అరుపులు, కేకలు వినిపించి నిద్రలేచి బయటకి వచ్చి చూస్తే,  నువ్వు గాభరాగా సమీర వెనకాతల వెళ్లడం చూసి నేనూ ఫాలో అయ్యాను. తను రైలింగ్ మీదకి ఎక్కి కిందకి దూకేయబోవడం నేనూ చూసాను. అసలు ఆ సమయంలో నువ్వు తనని పట్టుకుని కిందకి లాగి వుండకపోతే ఏం జరిగివుండేది?" ఆందోళనగా అడిగాడు సంజయ్.

సమీర మోహంలో ఆందోళన ఇంకా ఎక్కువ అయిపోయింది.

"తనని నువ్వు ఇంకా గాభరా పెట్టకు. ముందు మనం కిందకి వెళదాం పద." సమీరని అలాగే పొదివిపట్టుకుంటూ అంది మల్లిక.

&&&

"అసలు ఇలా ఎందుకు జరిగింది? తాను మేడ మీదనుండి కిందకి దూకేయబోవడం ఏమిటి?"

అందరూ కిందకి వెళ్లే సమయానికి నిర్మల కూడా లేచే వుంది. జరిగినది సంజయ్ చెప్పాక, ఆమె ఆందోళనగా అడిగింది.

"నాకూ ఏమీ అర్ధం కావడం లేదు. సమీర ఇలా ఎందుకు చెయ్యబోయింది? తనకేం జరిగింది అసలు?" సమీర మొహంలోకి ఆందోళనగా చూస్తూ అన్నాడు సంజయ్.

"డాడ్ పోయిన తరవాత నేను చాలా డిస్టర్బ్ అయ్యాను. కొన్ని సందర్భాల్లో నేను ఏం చేస్తున్నానో నాకే బోధపడడం లేదు." విషయాలన్నీ ఆంటీ కి, కజిన్ కి తెలిసి వాళ్ళు కూడా డిస్టర్బ్ అవడం సమీరకి ఇష్టంలేదు. అందుకని అన్ని విషయాలు వాళ్ళకి చెప్పదలుచుకోలేదు.

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)