Featured Books
  • నిరుపమ - 15

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • స్ఫూర్తిదాయకమైన జీవితం

    సాధారణంగా మన జీవితం ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండదు. కొన్నిరోజ...

  • ఆ ఊరి పక్కనే ఒక ఏరు - 4

    ఆ ఊరి పక్కనే ఒక ఏరు (ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్) శివ...

  • నిరుపమ - 14

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 9

    ఇన్స్పెక్టర్ :- "శివయ్యగారు, మీకు అనుమానం ఉంది అంటున్నారు కా...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నులి వెచ్చని వెన్నెల - 2

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

"డాడ్ మీకు తెలుసుగా ఈ మీటింగ్ ఎంత ఇంపార్టెంటో. నేనొచ్చి కేవలం వన్ వీక్ మాత్రమే అయింది, ఒక రౌండ్ అఫ్ మీటింగ్ మాత్రమే డిస్ట్రిబ్యూటర్స్ తో అయింది. ఇంకా త్రి రౌండ్స్ అఫ్ మీటింగ్స్వున్నాయి డాడ్. ఆలా ఎలా వచ్చేగలను?" తనని తన డాడ్ ఎందుకలా అడిగాడు అన్నది ఆలోచించడానికి ట్రై చేస్తూ అంది.

"మరేం పర్లేదు. అదంతా మళ్ళీ మేనేజ్ చేసుకోవచ్చు. నువ్వు ఇమ్మీడియేట్ గా బయలుదేరి ఇండియా కి వచ్చేయ్."

తను మరొకసారి షాక్ తింది. తనని తన డాడ్ అలా వచ్చేయ మన్నందుకు కాదు, ఆయన వాయిస్ లో ఆందోళన తనకి ఎక్కువ కంగారు కలిగిస్తూవుంది. తన డాడ్ గురించి తనకి బాగా తెలుసును. ఏ విషయానికి కంగారు పడే మనిషి కాదు. ఎంత పెద్ద సమస్య అయినా ఎంతో స్థిమితంగా, చక్కగా అలోచించి నిర్ణయం తీసుకుంటారు. చాలా బ్యాలన్సుడ్ మైండ్. అలాకాకపోతే తమ బిజినెస్ ని అంతగా ఎలా డెవలప్ చెయ్యగలరు? పదిలక్షల పెట్టుబడితో ప్రారంభించి మూడు లక్షల కోట్ల టర్నోవర్ కి తీసుకు రాగలిగారు.

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)

"డాడ్……………....." తన వాయిస్ లో కంగారు కనిపించకుండా ఉంచడానికి ట్రై చేస్తూ అంది. "......................ఇంకొక వన్ వీక్. ఎట్ లీస్ట్ ఇంకొక మీటింగ్ కంప్లీట్ చేస్తే వర్క్ ఒక లెవెల్ కి పూర్తి చేసినట్టుగా వుంటుంది. అప్పుడు వెంటనే బయలు దేరి వచ్చేస్తాను."

"చెప్తున్నాగా వెంటనే బయలుదేరి రమ్మని. ఎందుకు అర్గ్యూ చేస్తావ్?" తన లైఫ్ లో తనతో తన డాడ్ అలా మాట్లాడిన మొట్టమొదటి సందర్భమది. తను షాక్లోనుండి తేరుకుని ఇంకా ఎదో ఒకటి అనేలోగానే తానే అన్నారు మళ్ళీ. "ఐ యామ్ ఎక్స్పెక్టింగ్ యు యాజ్ సూన్ ఏజ్ పాజిబుల్ ఇన్ అవర్ హౌస్."

"ఒకే డాడ్." తను సడన్గా నిర్ణయానికి వచ్చేసింది బయలుదేరి ఇండియాకి, ఇంకా తన ఇంటికి వెళ్లిపోవాలని. "నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. కానీ ఒక్క విషయం చెప్పండి. ఈజ్ ఎవిరీథింగ్ ఆల్రైట్ దేర్? ఆంట్, కజిన్, మల్లికా అందరూ కులాసాగానే ఉన్నారా?"

"అందరూ కులాసాగానే వున్నారు. నువ్వలా ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేయ్. నీతో అత్యవసరంగా మాట్లాడాల్సిన విషయాలు వున్నాయి." తన డాడ్ గొంతులో ఆందోళన అలాగే వుంది.

"హండ్రెడ్ పెర్సన్ట్ నేను వచ్చేస్తాను. మీకందులో డౌట్ ఏమీ అవసరం లేదు." తను మామూలుగా ఉండడానికి ట్రై చేస్తూ అంది. "కానీ అంత ముఖ్యంగా మాట్లాడాల్సిన ఆ విషయాలేమిటో చెప్పండి. ఆర్ దే పెర్సనల్ ఆర్ రిలేటింగ్ టు బిజినెస్? నన్నిలా సస్పెన్స్ లో వుంచకండి ప్లీజ్."

"అవి ఫోన్లో చెప్పగలిగిన విషయాలు కావు. ఇన్ ప్రెసెన్స్ మాత్రమే నీతో మాట్లాడగలిగినివి. నువ్వెలాగూ వస్తున్నావు కదా వెంటనే బయలుదేరి. నువ్వు రాగానే అవన్నీ నీతో చెప్తాను."

తనకింక ఏమాత్రం మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసేసారు డాడ్. ఏమాత్రం వాటి గురించి హింట్ ఇచ్చినా తను వాటిని సీరియస్ గా తీసుకోదని భయపడ్డారేమో తెలియదు. కానీ తను ఇండియాకి బయలు దేరి వచ్చేవరకు చాలా టెన్షన్ గాను, ఆందోళనగానే వుంది. తన డాడ్ తనతో ఏం చెప్పదలుచుకున్నారన్న విషయం గురించి గెస్ చెయ్యడానికి ట్రై చేస్తూనే వుంది.

తన అభిప్రాయంలో అవి ఎంతమాత్రం బిజినెస్ కి సంబంధించినివి కాదు. బిజినెస్ కి సంబంధించిన ఏ ప్రాబ్లెమ్ ని తన డాడ్ సీరియస్ గా తీసుకోలేదు అవెంత పెద్దవైనా సరే. ఎంతో ఈజీ గా సాల్వే చేసే వారు.

కానీ పెర్సనల్ లైఫ్ లో మాత్రం ఏ ప్రాబ్లెమ్ వుంది? ఆంట్, ఇంకా కజిన్ ఇద్దరూ కూడా డాడ్ అంటే ప్రాణం పెడతారు. మల్లికకి తన డాడ్, తన స్వంత డాడ్ కన్నా ఎక్కువ. ఈ ముగ్గురూ, తను తప్ప తన డాడ్ కి పర్సనల్ రెలెటివ్స్ ఇంకెవరూ లేరు. డాక్టర్ మనోహర్ అంకుల్ ఒకరు డాడ్ తో బాగా ఇంటిమేట్ గా వుంటారు, ఇంకా ఆయనకి గొప్ప ఫ్రెండ్. ఆయనకి ఏమైనా అయినా కూడా తన డాడ్ ఆందోళన పడతారు. కానీ ఆ విషయం ఫోన్ లో చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది?

అలోచించి, అలోచించి, గెస్ చెయ్యలేక అలసిపోయి ఫ్లైట్ లో నిద్రలోకి జారి పోయింది సమీర.ఇంటికి రాగానే తన డాడ్ తో మాట్లాడి ఆ విషయాలేమిటో తెలుసుకోవాలన్న ఉత్సుకత, ఇంటికొచ్చాక తన డాడ్ డెడ్ బాడీ ని చూసి షాక్ గా మరి పోయింది.

"దగ్గర్లోనే వున్నా నేను నా ఫ్రెండ్ని కాపాడుకోలేక పోయాను. నేను వచ్చేసరికే అంతా అయిపోయింది. ఐ యాం వెరీ సారీ." మొట్టమొదటి సారిగా తను మనోహర్ అంకుల్ కళ్ళవెంపటా నీళ్లు కారడం చూస్తూ ఉంది. మరో సందర్భంలో అయితే ఎలా ఫీల్ అయ్యేదో కానీ ప్రస్తుతానికి ఏదీ పట్టించుకునే స్థితిలో లేదు.

"నేను చెప్పాను కదా. రెండవ సారి కానీ హార్ట్ ఎటాక్ వస్తే, మూడవ సారి వచ్చే అవకాశం ఉండదని. ఎదో విషయం గురించి బాగా ఆందోళన పడ్డాడని మాత్రం అర్ధం అవుతూంది." మనోహర్ అంకుల్ చెప్తూన్నదేదీ తనకి బుర్రలోకి వెళ్లడం లేదు.   

తరవాత సంఘటనలు ఏం జరిగాయో, ఎలా జరిగాయో అంతా మెకానికల్ గా అయిపోయింది. ఒక మనిషికి జీవితంలో మృత్యువు ఎంతో సహజమయిన విషయం. యాభయ్ అయిదు సంవత్సరాల వయసులో తన డాడ్ హార్ట్ ఎటాక్ తో చనిపోవడం అంత ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. కానీ తనకి తన డాడ్ డెత్ ఇప్పటికీ డైజెస్ట్ కావడం లేదు.

అందుకు కారణం తనకి తన చిన్నప్పటినుండి తన డాడ్ తో వున్న అట్టాచ్మెంటే. ఇంకా తనని ప్రేమించేవాళ్ళు వున్నా, తన మామ్ పోయిన తరువాత తానే అన్నీ అయి తనని పెంచారు. తను ఎంతో కష్టపడి డెవలప్ చేసిన బిజినెస్ కన్నా కూడా తనే ఎక్కువ అయిపోయింది తనకి. అలాంటి డాడ్ ఇంక లేరన్న ఊహే చాలా భయంకరంగా వుంది. తనలోనే చాలా ఇంపార్టెంట్ పార్ట్ మిస్ ఐపోయినట్టుగా వుంది. తను ఎంతో కొంత మళ్ళి డైలీ ఆక్టివిటీస్ లో పడ్డానికి కారణం మాత్రం తన ఆంట్, కజిన్ ఇంకా ఫ్రెండ్ మల్లిక.

"నువ్వెంత బాధ అనుభవిస్తున్నావో, ఎంత ఆందోళనలో వున్నావో నాకు తెలుసు. ఇలాంటి సమయంలో నీతో ఇలా చెప్పడానికి నాకు చాలా బాధగా వుంది. కానీ మన బిజినెస్ మీద ఆధారపడివున్న చాలా కుటుంబాల గురించి నువ్వు ఆలోచించే తీరాలి. మీ నాన్న ఎంతో కస్టపడి డెవలప్ చేసి ఈ స్థితికి తెచ్చిన ఈ బిజినెస్ ఎక్కడా వెనక పడకుండా డెవలప్ అయ్యేలాగే నువ్వు చూడాలి."

తన డాడ్ పోయి, అంతా పూర్తయి తామందరూ హాల్ లో సమావేశం అయివుండగా, తన ఆంటీ అంది.

"ఎస్ సమీ. నీ తరవాత అంకుల్ అంతగా ప్రేమించింది ఆ బిజినెస్ నే. నువ్వే గనక పూనుకుని ఆ బిజినెస్ అలాగే కంటిన్యూ చెయ్యక పోతే, అయన ఆత్మ శాంతించదు." తన కజిన్ సంజయ్ అన్నాడు.

"తనని దగ్గరుండి మామూలుగా చేసే పూచీ నాది. మీరేం కంగారు పడకండి." తనని రెండు చేతులతో దగ్గరకి తీసుకుంటూ మల్లిక అంది. "తను అన్ని రకాలుగా అంకుల్ ని పోలింది. ఎలాంటి కష్టం అయినా తట్టుకుని నిలబడుతుంది. తన తండ్రికి ప్రాణం అయినా బిజినెస్ ని వదిలేస్తుందా?"

మల్లిక చాలా కరెక్టుగానే చెప్పింది. తన డాడ్ అంతగా ఇష్టపడే బిజినెస్ ని తను ఎలా విడిచిపెట్టేస్తుంది? అంతే కాకుండా తమమీద ఆధారపడివున్న చాలా మంది లైఫ్ ల గురించి కూడా తను ఆలోచించే తీరాలి. అందువల్లే తనని తను మళ్ళీ రోటీన్లో పెట్టుకుంది. బాధని పళ్ళ బిగువున భరిస్తూ బిజినెస్ వ్యహారాలన్నీ చూస్తూ వుంది.

"ఏంటమ్మా అంత ఆలోచనలో పడిపోయావు? చెప్పాగా ఇంక  ఆ విషయం గురించి మధనపడిపోవద్దని. అదేదో బిజినెస్ కి సంబంధించిన విషయమే అయివుంటుంది. నువ్వు కొంచం బుర్రపెట్టావంటే అదేంటో తెలుస్తుంది, నువ్వప్పుడు దాన్ని సాల్వ్ చేసే కలవు కూడా. నువ్వు, నీ డాడ్ అలాంటి ఎన్ని సమస్యలు సాల్వ్ చెయ్యలేదు ఇప్పటివరకూ?"  

తన ఆంటీ తనని భుజాలు కుదిపి అలా అడిగే వరకూ తను తన ఆలోచనలనుండి ఈ లోకంలోకి రాలేదు. తను వూహించగలదు. తన డాడ్ తనతో మాట్లాడాలనుకున్న విషయం బిజినెస్ కి సంబంధించినిది కాదు. అలాగే అది తను తేలికగా సాల్వ్ చెయ్యగలిగింది కూడా అయ్యివుండదు. ఒకవేళ అలాగే అయివుంటే తన డాడ్ అంతగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కానీ తనకి తన ఆంటీ తో అలా చెప్పే ఉద్దేశం లేదు.

"ఒకే ఆంట్. నేను ఫ్రెష్ అప్ అయి ఆఫీస్ కి వెళ్తాను." గట్టిగా నిట్టూర్చి, తన ఆంటీ నుండి విడిపించుకుని బాత్రూం లోకి నడిచింది.

వంటిమీద బట్టలన్నీ తీసేసాక, తన న్యూడ్ బాడీని బాత్రూం లో వున్న నిలువుటద్దంలో చూసుకుంటూ ఉంటే చిన్న చిరునవ్వు వచ్చిచేరింది సమీర పెదాలమీదకి. నిజానికి బాగా అందంగా ఉంటే, అది ఎవరికయినా ఆనందం కలిగిస్తుంది. కానీ తనిలా ఇంత అందంగా ఉండడం సమీరకి ఆనందం కన్నా చిరాకే ఎక్కువ కలిగిస్తుంది. అందరూ తన అందానికే ఇంప్రెస్ అయి అలా మాట్లాడుతున్నారు తప్ప తన ఇంటెలిజెన్స్ కి కాదన్న అనుమానం తనకి ఎప్పుడూ వుంది. తను అందరి ఆడపిల్లల్లా మామూలుగా ఉండివుంటే తనకి అలాంటి అనుమానం వచ్చివుండేది కాదు.

సమీరకి చాలా రోజుల వరకూ అందం అంటే ఏమిటో తెలియదు. స్కూల్లో టీచర్స్ ఇంకా స్టూడెంట్స్ అందరూ తనని పొగుడుతూ, తనతో దగ్గరవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, అది కేవలం తను బాగా డబ్బు వున్న కుటుంబం లోంచి రావడంవల్ల మాత్రమే అనుకుని ఇరిటేట్ అయిపోయేది. తను ఒక మామూలు కుటుంబంలోనుండి వెళ్ళివుంటే పరిస్థితి అలా ఉండేదే కాదు అనుకునేది.

"నువ్వు ఒకవేళ అతిపేద కుటుంబానికి చెందివున్నా, నీతో వాళ్ళ వ్యవహారం అలాగే వుండివుండేది. ఎందుకంటే నువ్వు నిజంగానే చాలా అందంగా వున్నావు. నీకు ఇది ఇరిటేషన్ కలిగించే విషయమే అయినా, నువ్వు అంగీకరించే తీరాలి." ఒకరోజు తన గోడు విన్నాక, తన ఆంటీ అంది.

"నువ్వు కూడా నన్ను ఇరిటేట్ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నావా లేక ఇంప్రెస్ చేయడానికా? ఎవరికీ లేని అందం నాకెందుకు వస్తుంది?" తను ఇంకా ఇరిటేట్ అవుతూ అడిగింది.

"మీ డాడ్ గురించి నీకు పూర్తిగా తెలుసుకదా. మీ మామ్ అలాంటి యంగ్ ఏజ్ లో చనిపోయినా మళ్ళీ పెళ్లి ఊసు ఎత్తలేదు. అందం పట్ల ఏ రకంగానూ అట్రాక్షన్ లేదు తనకి. అలాంటిది తన దగ్గర సెక్రటరీ గా పనిచేసే మీ మామ్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. మీ మామ్ అంత అందంగా ఉండేది. అలాంటి మీ డాడ్ నే అట్ట్రాక్ట్ చెయ్యగలిగింది. అలాంటి మామ్ కి కూతురివి, నువ్వు అందంగా ఉండడంలో ఆశ్చర్యం ఏమైనా వుందా?"

ఇంక తనకి అంగీకరించక తప్పలేదు. అలాంటి తన డాడ్ నే లవ్ లో పడేయ గలిగింది అంటే తన మామ్ అందం మామూలు కాదు. తన మామ్ అందం తనకి రావడంలో ఆశ్చర్యం లేదు. తనకి అప్పటికి అందం అంటే ఏమిటో తెలియదు. కానీ ఫొటోలో చూసినప్పుడల్లా తన మామ్ తనకి చాలా నచ్చుతూ ఉంటుంది. తన మామ్ అలా  కార్ ఆక్సిడెంట్ లో తనకి ఆరునెలల వయసు వున్నప్పుడే మరణించి ఉండకపోతే ఎంత బాగుండేదో.      

బలవంతంగా మనసుని స్నానం చెయ్యడం మీదకి మళ్లించడానికి ప్రయత్నిస్తూంది కానీ, ఏవేవో ఆలోచనలు ముసురుకుంటూనే వున్నాయి. జస్ట్ అద్దం ముందునుండి కదలబోతూ ఉండగా తన దృష్టి నగ్నంగా ఉన్న తన పాలిండ్లమీద పడి, మరోసారి పెదాల మీదకి చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. తనకి ఏడు సంవత్సరాలో, ఎనిమిది సంవత్సరాలో వయసు వున్నప్పుడు తను తన ఆంటీ ని అడిగిన ప్రశ్న గుర్తుకు వచ్చింది. ఆ ప్రశ్న అడిగినప్పుడు తన ఆంటీ తనకి స్నానం చేయిస్తూ వుంది.

"నీ గుండెల మీద అవి అంతంత పెద్దగా వున్నాయి, నీకేమీ ఇబ్బందిగా ఉండదా?" తన ఆంటీ గుండెల మీద చాలా పెద్దగా కనిపిస్తూన్న పాలిండ్లతో ఆమెకి ఇబ్బందిగా వుంటుందనే తనకి అనిపించి వాటిని చూపిస్తూ అడిగింది.

అది విని పెద్దగా నవ్వేసింది తన ఆంటీ. "రేపు నీకూ అవి అలానే ఉంటాయి. నీకేం తెలుసు. ఒక ఆడదానికి అవే పెద్ద అట్రాక్షన్."

నిజానికి తనకీ అవి అంతంత పెద్దగా అవుతాయని, తన ఆంటీ అన్నప్పుడు తనకి చాలా భయంగా అనిపించింది. కానీ ఇప్పుడు, తన ఆంటీ చెప్పినంత పని జరిగింది. తన ఎత్తుకి, లావుకీ  తగినట్టుగా వున్నాయి అవి.

"మై గాడ్" గట్టిగా నిట్టూర్చి షవర్ ఆన్ చేసింది. చల్లటి నీళ్లు ఒళ్ళంతా కమ్ముకుంటూ ఉంటే సడన్గా ఉపశమనంగా అనిపించింది. రోజూ చేసే స్నానమే అయినా ఇలా స్నానం చెయ్యడంలో తనకు ఒక రకమైన ఆనందం ఉంది. నిజానికి భోజనం దగ్గర కన్నా కూడా స్నానం దగ్గరే తాను ఎక్కువ సమయం స్పెండ్ చేస్తుంది.

షాంపూ తో హెయిర్ క్లీన్ చేసుకున్నాక, పక్కనే ఉన్న సోప్ తీసుకుని ఒళ్ళంతా రుద్దుకోవడం మొదలు పెట్టింది. ఆలా ఒళ్ళంతా రుద్దుకున్నాక, మరొకసారి గుండెల మీద రుద్దుకుంటూ సడన్గా ఆగిపోయింది. ఒక ఇబ్బంది కలిగించే అనుభవం. ఇది కేవలం తన భ్రమా? లేకపోతే నిజంగానే ఏమైనా జరుగుతూందా? ఈ మధ్య తనెందుకు తరచూ ఇటువంటి భ్రమలకి లోనవుతూ వుంది?

తన పిరుదుల మీద ఏవో చేతుల స్పర్శ! వెంటనే తాను తన చేతులని చూసుకుంది. అవి తన గుండెల మీదనే వున్నాయి. అంతేకాకుండా తన పిరుదులమీద ఉన్న చేతులు చాలా మోటుగా వున్నాయి. ఏవో మగవాళ్ల చేతుల్లాగా.

ఒక్కసారిగా గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవడం ప్రారంభించింది సమీరకి. తనెందుకు ఇలాంటి భ్రమలకి గురవుతూ వుంది. నో, ఇది భ్రమ కాదు. భ్రమ ఇంత సహజంగా వుండే అవకాశం లేదు.   ఆ స్పర్శ ఎంతో మొరటుగా, తన పిరుదుల మృదుత్వాన్ని టెస్ట్ చేస్తున్నట్టుగా వుంది. నెమ్మదిగా కదులుతూ,ఎవరో తన వెనకాతల నిజంగానే వున్నారు. తన పిరుదుల మీద చేతులు అదిమారు. అంతలో, అందులో, ఒక చేతి తాలూకు స్పర్శ తన పిరుదుల మధ్య కాలువని అదుముతూ, ఇంకా ఆలా దిగువకు జరుగుతూ, తన గుండెలనిండా భయమే కాదు ఒళ్ళంతా సిగ్గుతో కూడా నిండి పోయింది.

చటుక్కున వెనక్కి తిరిగి చూడాలనిపించినా భయంతో ఆగి పోయింది. ఫిజికల్ గా తన వెనకాతల ఎవరో ఉన్నారన్న ఆలోచనే చాలా భయం కలిగిస్తూ వుంది. కానీ డోర్స్ క్లోజ్ చేసి వున్న బాత్రూం లోకి ఎవరైనా ఎలా రాగలరు? ఇది లాజిక్ కి దూరంగా, అసహజంగా వుంది. ఎంత నిజంలా అనిపిస్తూవున్నా, తన వెనకాతల ఎవఱోవుండి తనకిలా చేసే అవకాశం లేదు.

ధైర్యంగా ఒక్కసారి వెనక్కి తిరిగింది. ఎవరూ లేకపోవడం మాత్రమే కాదు, అప్పటివరకూ తన మీద వున్న చేతుల స్పర్శ కూడా మాయం అయింది. అంతవరకూ అంత సహజంగా అనిపించింది ఒక్కసారిగా ఎలా మాయం అయిపోయిందో బోధపడడం లేదు.

ఆ తరవాత ఇంకెంత మాత్రం బాత్రూం లో వుండలేకపోయింది. త్వరత్వరగా స్నానం పూర్తి చేసుకుని, బెడ్ రూంలోకి వచ్చేసింది తను పట్టుకెళ్లిన టవల్ తో తల, ఒళ్ళు తుడుచుకుని అదే చుట్టుకుని. అంతకన్నా కూడా వేగంగా, అక్కడే వున్న అల్మైరా లో వున్న డ్రెస్ తీసుకుని కట్టుకున్నాక, బెడ్ మీద కూల బడింది.   

నిజానికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ తనకి ఈ రోజు బాత్రూమ్లో మొదటిసారి కలిగిఉంటే తను పట్టించుకునేది కాదు, ఇంతగా మధన పడేది కాదు.  ఒక భ్రమగానే అనుకునేది. ఎక్జాట్ గా ఎప్పుడు స్టార్ట్ అయిందో తనకి గుర్తు లేదు, కానీ తను ఈ మధ్యన ఏవేవో శబ్దాలు వింటూంది. ఎవరో నవ్వుతూన్నట్టుగా..................ఏడుస్తూన్నట్టుగా.............ఇంకా తనని పిలుస్తూన్నట్టుగా………….... తనని ఇలా ఎవరో టచ్ చేసినట్టుగా అనిపించడం కూడా ఇదే మొదటి సారి కాదు. తనెందుకిలా ఏవో ఎక్స్పీరియన్స్ లకి లోనవుతూంది? తను తన డాడ్ తాలుకు డెత్ తో ఎంతో అప్సెట్ అయిపోయి వున్నా, అందువల్ల ఇలా హల్యూసీనేషన్స్ కి సబ్జెక్టు అవుతూంది అంటే మాత్రం నమ్మలేదు. ఇలా ఏవేవో ఆలోచనలతో సతమతం అయిపోతూ ఉంటే, తనని ఈ లోకంలోకి తీసుకు వస్తూ తన సెల్ ఫోన్ మోగింది. చూస్తే అనురాగ్. ఒక్కసారిగా తన మనసు ఇరిటేషన్ తో నిండిపోయింది. తనని అందరూ ప్రేమించి, అభిమానించే వాళ్లే అయినా, తనకి ఎంతో ఇరిటేషన్ కలిగించే ఒకే ఒక వ్యక్తి ఈ అనురాగ్. తమ దగ్గర ఒక వున్నత స్థానంలో పనిచేసే ఎంప్లాయీ.  తను తమ బిజినెస్ లో ఎంతో కీలక పాత్ర పోషించే వ్యక్తి అయివుండకపోతే, ఎప్పుడో ఉద్వాసన చెప్పేసేది. తనిప్పుడు ఎందుకు ఫోన్ చేసాడో అర్ధం చేసుకోగలదు              

"హలొ" ఫోన్ కాల్ అటెండ్ అయ్యాక ముక్తసరిగా అంది.

"ఈ రోజు నువ్విచ్చిన అప్పోయింట్మెంట్లు ఇంకా ఇక్కడ ఈరోజు నువ్వు చెయ్యాల్సిన ముఖ్యమైన పనులు నీకు గుర్తువున్నాయనుకుంటా. అయినా నువ్వు ఆఫీస్ కి రాకపోవడానికి కారణం ఏమిటి?"

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)