Read This is our story - 3 by Harsha Vardhan in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఇది మన కథ - 3

‘నీకు ఎందుకు ఇలా అనిపించింది. ఇది కరెక్టేనా?’అని అడిగింది. ముద్దు పెడితే ఏమీ అనకుండా ఆ ప్రశ్న అడగటంతో నాకు ధైర్యం వచ్చింది.
.
‘కరెక్టో కాదో అన్నది ప్రశ్న కాదు. నీకు నేనంటే ఇష్టమా కాదా చెప్పు. నాకు నువ్వు కావాలి. జీవితాంతం నీ తోడు కావాలి’ అన్నాను. అంతే లతలా నన్ను పెనవేసుకొని ‘లవ్‌ యూ టూ డియర్‌’ అని నా నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టింది. ఆ క్షణం ఈ ప్రపంచాన్ని జయించిన అనుభూతి కలిగింది నాకు. ఆ రోజు నుండి మా ఇద్దరి ప్రపంచం కొత్తగా మొదలయ్యింది. ఎన్నో కబుర్లు, సినిమాలు, పార్టీలు, అలకలు, ఆనందాలతో జీవితం రంగుల హరివిల్లులా సాగుతూ.. ఒక్క క్షణం కూడా ఒకరిని విడిచి ఇంకొకరం ఉండలేని ప్రేమలోకంలో విహరించసాగాం. అలా అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఇలా సడన్‌గా తరుణ్‌తో నా పెళ్లి అంటూ వెడ్డింగ్‌ కార్డు ఇచ్చింది. నా ఆలోచనలకు బ్రేక్‌ వేస్తూ బేగంపేట్‌ వచ్చింది.
∙∙
నేను వెళ్లేసరికి వెడ్డింగ్‌ డ్రెస్‌ సెలక్షన్‌లో బిజీగా ఉన్నారు ఇద్దరూ. ‘తరుణ్‌.. మీట్‌ మై బాస్‌ ఇన్‌ మై ఫస్ట్‌ జాబ్‌. అఫ్‌కోర్స్‌ ఇప్పుడు మాత్రం తనే నాకున్న ఒకే ఒక్క క్లోజ్‌ ఫ్రెండ్‌ అనుకో’ అని నన్ను పరిచయం చేసింది. ఆ మాటకు నా హృదయం భగ్గుమంది. ‘ఎంతకు తెగించావే రాక్షసి. నేను క్లోజ్‌ ఫ్రెండ్‌ అంతేనా? ఇంకేమీ కానా? అయినా ఎలా చెపుతావు లే!’అని మనసులో అనుకున్నాను. మొహం మీద బలవంతంగా నవ్వు పులుముకొని ‘హాయ్‌’ అన్నాను. ఇంకేం మాట్లాడబుద్ధి కాలేదు. వాళ్లిద్దరినీ అలా చూస్తుంటే బాధ, కోపం, కసి, చిరాకు.. మనసంతా చేదుగా అయిపోయింది.
.
మానస లేకుండా నేను అసలు జీవించగలనా! ఎక్కడి నుండి ఊడిపడ్డాడు ఈ ఇడియట్‌ తరుణ్‌ గాడు? మమ్మల్ని వేరు చెయ్యటానికే పుట్టినట్లున్నాడు. నాకు వాడంటే అసూయ, అసహ్యం రెండూ కలిగాయి. షాపింగ్‌ అయిపోయింది. వస్తుంటే ‘మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి. ఇది నా నుండి ఇన్విటేషన్‌’ అన్నాడు తరుణ్‌. ‘ష్యూర్‌.. సీ యూ’అని చెప్పి బయట పడ్డాను. మానస ఎప్పటికైనా నాకే సొంతం కావాలి. తను లేకుంటే నాకు చావే దిక్కు అనిపించింది. దేవుడా ఎలాగైనా ఈ పెళ్లి ఆపు అని జీవితంలో మొదటిసారి దేవుడికి మొక్కుకున్నాను. కానీ దేవుడు నా మొర ఆలకించలేదు.
వైభవంగా వాళ్ళిద్దరి పెళ్లి జరిగిపోయింది. ఆ రోజు ఏడ్చి ఏడ్చి నా కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి. నా కళ్ల ముందు అంతా శూన్యం. ఇంత చేసినా ఆశ్చర్యంగా నాకు మానస మీద కోపం మాత్రం రావట్లేదు. ప్రతిరోజు తన గొంతు వినాలని, తనని చూడాలని అనిపించి పిచ్చెక్కేది. కాల్‌ చేస్తే జస్ట్‌ హాయ్, బాయ్‌ అని రెండు మూడు మాటలు మాట్లాడి ఫోన్‌ కట్‌ చేసేది అంతే. ఇప్పుడు నా భవిష్యత్తు గురించి నేనో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. అది ఎంత కఠినమయినా కచ్చితంగా ఆచరణలో పెట్టాలని డిసైడ్‌ అయ్యాను. వాళ్ళ పెళ్ళైన వారం రోజుల తరువాత ఒక రోజు ఉదయాన్నే ఫోన్‌ చేసింది మానస .
.
‘హేయ్‌.. ఏం చేస్తున్నావ్‌? మరిచిపోయావా మమ్మల్ని? ఈ రోజు నేను ఆఫీస్‌కి వెళ్లట్లేదు. ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాను. వచ్చేయ్‌ ఇంటికి’ అంది. అడ్రస్‌ అడిగి జుట్టు కూడా సరిగ్గా దువ్వుకోకుండా బయటపడ్డాను. ఎందుకు రమ్మంది? క్యాజువల్‌గానా లేక ఇంకేదైనా చెప్పటానికా? నాలో అంతులేని ప్రశ్నలు. నేను వెళ్లేసరికి తరుణ్‌ ఇంకా పోలేదు. రెడీ అయ్యి షూ వేసుకుంటున్నాడు. నన్ను చూసి ఆశ్చర్యంగా ‘అరే చెప్పకుండా వచ్చారు? ముందే చెపితే నేను కూడా లీవ్‌ పెట్టే వాడిని కదా! ఎనీవే ఆఫ్టర్‌ నూన్‌ వచ్చేస్తాను. లంచ్‌ ముగ్గురం కలిసే చేద్దాం. బాయ్‌’ అంటూ వెళ్ళిపోయాడు. వీడికి మా ఇద్దరి మీద డౌట్‌ వచ్చే అవకాశం అస్సలు లేదులే అనుకున్నాను.
నన్ను చూస్తూనే గట్టిగా కౌగిలించుకొని ‘మిస్‌ యూ బేబీ..’ అంటూ ముద్దు పెట్టింది మానస. నాకు ఏడుపు ఆగలేదు. ‘ఎందుకిలా చేశావ్‌? నన్ను ఒంటరిగా ఎందుకు వదిలేశావ్‌? నువ్వు నిజంగా నన్ను ప్రేమించావా?’ నిలదీశాను. నా నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ ‘ఇప్పుడేమైంది? నిన్ను దూరం పెట్టను అని చెప్పాగా. నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రేమే’ అంది. ‘మరి అలాంటప్పుడు ఆ తరుణ్‌గాడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నన్నెందుకు పెళ్లి చేసుకోలేదు?’ కొంచెం కోపంగా అడిగాను. ‘ఎందుకంటే ఇద్దరు ఆడవాళ్లు పెళ్లి చేసుకుంటే లోకం ఒప్పుకోదు కాబట్టి.
.
చూడు అమృతా.. నాకు నీ ప్రేమ కావాలి. సోషల్‌ లైఫ్‌ కావాలి. అలాగే పిల్లలు కూడా కావాలి. అందుకోసం తరుణ్‌ని పెళ్లి చేసుకున్నాను. కానీ నా మనసులో మాత్రం నువ్వే ఉంటావు..’ అని చెప్పుకుంటూ పోతోంది. తన నుండి దూరంగా జరిగి ‘ప్రేమంటే రెండు దేహాల కలయిక మాత్రమే కాదు. రెండు మనసుల అపూర్వ సంగమం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే నా మనసులో నువ్వు మాత్రమే ఉంటావు. ఇంకో వ్యక్తికి చోటు ఉండదు. కానీ నువ్వు అలా కాదు. నీది నిజమైన ప్రేమ కాదు’ అన్నాను. ‘అమృతా.. ప్లీజ్‌ అలా అనకు. నన్నర్థం చేసుకో’ నా చేతులు పట్టుకుంటూ అడిగింది.
‘ఒకే జెండర్‌ అయినా, జెండర్స్‌ వేరైనా.. ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ ఉన్నప్పుడు మూడో వ్యక్తితో రిలేషన్‌ అంటే అది మొదటి ప్రేమికుడు లేదా ప్రేమికురాలికి ద్రోహం చేసినట్లే అవుతుంది. ఇంకా చెప్పాలి అంటే అది మానసిక వ్యభిచారం లాంటిదే’ స్థిరంగా చెప్పాను. ‘అమృతా.. చెప్పానుగా.. సమాజం కోసం.. ఇంకా చెప్పాలంటే మా పేరెంట్స్‌ కోసమే నేను తరుణ్‌ని పెళ్లి చేసుకుంది. నాకు నువ్వే ప్రాణం’ అంది. ‘నేను నీ ప్రాణమే అయితే నన్నిలా వదిలేసే దానివి కాదు. జీవితాంతం నాకు తోడుగా ఉండేదానివి. నీ కోసం ఎవ్వరినైనా ఎదిరించి బతకటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు? నీది స్వార్థం. నిజమైన ప్రేమకు కావాల్సింది నమ్మకం. అది నీ మీద నాకు ఇప్పుడు లేదు. మళ్ళీ నా జీవితంలో ప్రవేశించాలని చూడకు. గుడ్‌ బై’ అని చెప్పి బయటకు నడిచాను.

మరి మన హీరో ఏం చేసి ఉంటాడు ..?

ఏమో చూద్దాం..!!

ఇంకా ఉంది...🫡