Read This is our story - 4 by Harsha Vardhan in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఇది మన కథ - 4

తను అలా నన్ను వదిలేసి వెళ్ళడం నేను తట్టుకోలేక పోయాను చాలా బాధ పడ్డాను .

అయినా నన్ను ప్రేమించి అమ్మ కోసం ,నాన్న కోసం ,సమాజం కోసం అని ఎవడినో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడం ఎంటి ..?

నాకు ఏమి అర్ధం కాలేదు . అయినా నేను తప్పుడు మనిషిని ప్రేమించాను అని చాల ఫీల్ అవుతూ ఉన్నాను .

అందరు ... ఆ బ్రహ్మ మనుషుల తల రాతలు రాస్తాడు అంటారు.కానీ నేను నా తలరాత నాకు నచ్చినట్టుగా రాసుకున్నాను.నాకంటూ ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకున్నాను.


మనసుకు, మెదడుకి చాలా పెద్ద తేడా ఉంది.

మనసు నమ్మడానికి కారణాలు వెతకదు,కానీ మెదడు ఎప్పుడు ఏదో ఒక కారణం వెతుకుతూనే ఉంటుంది.

మెదడు మనసు చెప్తే వింటుంది,కానీ మనసు తన మాటే తను వింటుంది.

నేను తనని ఇష్టపడటానికి ఎప్పుడు కారణం వెతక లేదు.కానీ తనని మర్చిపోవడానికి కారణాలు వెతికాను.

ఇష్టపడటం అనేది మనసుకు సంబందించినది,నమ్మకం మెదడుకు సంబందిoచినది.

ఒక్కసారి నిజంగా ఇష్టపడితే చనిపోయే చివరి క్షణం వరకు,చివరి క్షణం వరకేంటి చనిపోయిన తరువాత,ఇంకా చెప్పాలి అంటే జన్మజన్మల వరకు మర్చిపోవడం కుదరదు.

అదే నా జీవితం లో నిజం ఐయిoది.

ఒక అందమైన అమ్మాయి ని చూసాను . చూడగానే అన్ని మర్చిపోయాను తన వెనకే నడిచాను .


రెండు రోజుల వరకు తనని చూస్తూనే ఉన్నాను.

కానీ ఒక్క క్షణం ఆలోచించాను,నేను చెసేది తప్పా,ఒప్పా అని.

వేరే ఒకరిని ఇష్టపడే వారిని నేను ఇష్టపడటం తప్పు అనిపించింది.

మర్చిపోవాలి,మర్చిపోవాలి,మర్చిపోవాలి ఇలా కొన్ని వేలసార్లు అనుకోని ఉంటా.

ఏం చేసిన తనే గుర్తుకు వస్తుంది.

ఏం చెయ్యాలి,ఏం చెయ్యాలి ఇలా అనుకుంటున్నా సమయంలో తనకి ఎవరూ లవర్ లేడు అని తెలిసిన క్షణం నుండి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను .


ఒక సామేత ఉంటుంది,ప్రతి ముగింపు తరువాత ఒక కొత్త ప్రారంబం ఉంటుంది అని.

నేను ఎప్పుడూ నమ్మలేదు, కానీ అది నమ్మాలి అని నాకు కొంత కాలానికే అర్ధమయింది.

తన గురించి మర్చిపోయి ఎప్పుడు ఒంటరిగా ఉండాలి అని నిర్ణయం తీసుకున్న నాకు

మళ్ళి ఒక కొత్త ఆశను ఒక అమ్మాయి మళ్ళి కలిపించింది.

మొదట్లో తను నాకు పరిచయం ఐనప్పుడు భయం వేసింది, మొదటిసారి దెబ్బ తిన్నప్పుడే కోలుకోడానికి రెండు సంవత్సరాల పట్టింది.

మళ్ళి అలాజరిగితే మళ్ళి కోలుకోలేను అనిపించింది. అదే భయం తో తనతో లిమిట్స్ లో ఉంటూ వచ్చాను.

ఆరు నెలల్లోనే ఇద్దరం మంచి స్నేహితులమైయం.

రెండు సంవత్సరాల పడిన శ్రమ అంతా మర్చిపోయా,మళ్ళి ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టినట్టు అనిపించింది.

కోపం,బాధ,అసహ్యం,
నిరుచ్చాసం ఇలాంటివి అంటే ఏంటో మర్చిప్పోయా.

సినిమాల్లో చుపించినట్టు స్నేహమే ప్రేమ కి మొదటి మెట్టు అనే విషయం నేను ఎప్పుడు నమ్మేవాడిని కాదు,నా స్నేహితులతో ఎప్పుడు వాదించే
వాడిని,స్నేహం ప్రేమగా ఎలా మారుతుంది అని,కానీ అది నా విషయం లో నిజమైంది అనిపించింది.


కానీ తరువాత అర్ధమైంది నేను స్నేహాన్ని తప్పుగా అర్ధం చేసుకున్నాను అని.

ఒకరోజు తనతో చాట్ చేస్తునప్పుడు తనకి చెప్పాను తను అంటే నాకు ఇష్టం అని కానీ తను నన్ను ఎప్పుడు స్నేహితడు గానే బావించింది అని
చెపింది .

తను అల చెప్పగానే ఎందుకో తెలియదు నా చెంపలపై ఏదో జారుతున్నాట్టు అనిపించింది,తడిమి చూస్తే తడి గా అనిపించింది .

నాకు చాల వింతగా అనిపించింది,ఎందుకంటే ఆ తడి నా చేతికి తగిలి చాల సంవత్సరాలైంది.

ఒక్కసారిగా తల మిద ఏదో మోయలేని బరువు పెట్టినట్టు అనిపించింది.

ప్రపంచం మొత్తం కొత్తగా అనిపించింది .


తను పరిచయం ఐయే కంటే ముందు వరకు నా రోజువారీ జీవితం ఒకేలా ఉండేది.

రోజు లో 8 నుండి 10 గంటల వరకు కష్టపడే వాడిని.

ఎప్పుడు ఏదో కోల్పోయిన వాడిలా,నవ్వే తెలియని మనిషిలా ఉండేవాడిని.

తను పరిచయమైనా తరువాత అంతా మారి పొయింది.

రోజు ఓ కొత్త అనుబవం,ఏదో తెలియని సంతోషం కానీ ఒక్కసారిగా అంతా ముక్కలైపోయినట్టు అనిపించింది.

సెల్ ఫోన్ లో
ఏం టైప్ చేస్తున్నానో కనిపించలేదు,కళ్ళు నీటితో నిండిపోయాయి,కన్నీటి బొట్లు ఒకదాని వెంట ఒకటి సెల్ ఫోన్ పై పడ్డాయి.

నాకు గుర్తున్నంత వరకు అదే మొదటిసారి ఒక వ్యక్తి కోసం కన్నీరు కార్చడం.


తానికి చెప్పేకంటే ముందే నిర్ణయం తీసుకున్న తను ఒప్పుకున్నా లేకున్నా ఇదే ఆకరిసారి అని, అవును అదే ఆకరిసారైంది కూడా.

నాకు నా పాత జీవితమే బాగున్నాటు అనిపించింది .

ఎందుకంటే ...!!

ఆ జీవితం లో నాకు నేనే ఉండేవాడిని,ఎపుడు నాకు నచ్చింది చేసేవాడిని,ఒక యంత్రం లా పని చేసేవాడిని, ఆ జీవితంలోకి వెళ్ళడానికి వేసే మొదటి అడుగే ఈ కధ రాయడం.


ఎంత నేర్చుకున్న ఎంతగా ఏంచేసిన తనని మర్చిపోలేకపోతున్న .

రోజురోజుకి పని గంటలు పెంచుకుంటూ వెళ్ళాను కొన్నిరోజులు తరువాత ప్రశాంతంగా అనిపించింది .