Read My Prince - 2 by Rajani in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

My Prince - 2

స్వాతి ఓపెన్ చేసి చూస్తోంది ఒక లవ్ లెటర్ అని తెలియగానే బీపీ పెరిగినట్టు కోపం వచ్చేసింది అప్పుడే క్లాస్ రూం లోకి వచ్చిన తమ jr లెక్చరర్ ప్రకాష్ ను చూసి విష్ చేయడానికి నిల్చున్నారు స్టూడెంట్స్ అందరూ , స్వాతి కూడా వాళ్ల తో పాటే నిల్చుంది కానీ అందరి తో పాటు కూర్చోకుండా స్ట్రెయిట్ గా లెక్చరర్ దగ్గరికి వెళ్ళింది , ఇదెక్కడికి వెళుతుంది అని వల్లి వెనుకనుండి పిలిచే లోపే sir దగ్గరకు వెళ్ళిపోయింది స్వాతి ఫాస్ట్ గా, jr.లెక్చరర్ ప్రకాష్ వీళ్ళ కంటే 4years మాత్రమే సీనియర్ ఇంకా పెళ్లి కాలేదు , స్వాతి మీద ఆయనకు క్రష్ వుంది , చాలా మంది అమ్మాయిలకు ఈ ప్రకాష్ మీద క్రష్ ఉంది, ప్రకాష్ ఒక లెక్చరర్ కాబట్టి స్వాతి కి తన మీద రెస్పెక్ట్ ఉంది ,సో ప్రకాష్ తో స్వాతి బాగానే మాట్లాడుతుంది అనమాట , స్వాతి అలా తన ముందుకు వచ్చి నిలిచోగానే ముందు షాక్ అయ్యాడు ప్రకాష్ , స్వాతి ఇంకా క్లాస్ స్టార్ట్ కాకుండానే డౌట్స్ ఉన్నాయా అని అడిగాడు ప్రకాష్ ఎప్పటిలాగే సబ్జెక్ట్ లో డౌట్స్ clarify చేసుకోటానికి వచ్చింది అనుకొని , డౌట్ కాదు sir ఒకసారి ఇది చూడండి అని తన చేయి ముందుకు చాపి తన చేతిలో ఉన్న లెటర్ చూపించింది స్వాతి , క్లాస్ అంతా ఆశ్చర్యం గా చూస్తున్నారు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఆ లెటర్ రాసిన రాజేష్ తప్ప, ఏంటి స్వాతి ఇది అడిగాడు ప్రకాష్ ఆశ్చర్యం గా , లవ్ లెటర్ sir అంది కోపంగా , ఒకేసారి షాక్ అయ్యారు స్టూడెంట్స్ అంతా ప్రకాష్ తో పాటు , రాజేష్ మాత్రం టెన్షన్ పడిపోతున్నాడు ఒకసారి తల తిప్పి కుసుమ వైపు చూసాడు తను కూడా అందరితో పాటు అక్కడ జరిగేది చూస్తూ ఉంది , ఒక్క సెకన్ షాక్ అయ్యి తేరుకున్న ప్రకాష్ లోపల సిగ్గు పడిపోతూ పైకి మాత్రం మామూలుగా నే క్లాస్ తరువాత మాట్లాడతాను , ముందు వెళ్లి కూర్చో క్లాస్ స్టార్ట్ చేస్తాను అన్నాడు , ప్రకాష్ కి మనసు ఆకాశంలో తేలుతోంది , ఫైనల్ ఎగ్జామ్స్ అవగానే పెళ్లి ముహూర్తం పెట్టుంచాలి అని మనసు లోనే చాలా అనుకుంటున్నాడు , లేదు sir మీరు ఇప్పుడే చూడాలి వాడికి క్లాస్ అందరి ముందు పనిష్మెంట్ ఇవ్వాలి అంది కోపంగా , ఏంటి ఇది నువ్వు రాసింది కాదా అని ఒకే సారి మళ్ళీ డల్ అయిపోయాడు ప్రకాష్ , అయినా నేను ఉండగా నా స్వాతి కి ఎవడు లవ్ లెటర్ రాశాడు అని అనుకుంటూ , ఎవడ్రా ఆ లెటర్ రాసింది అరిచాడు కోపంగా , ఈ సైకో కి లవ్ లెటర్ ఎవరు రాస్తారు అని అన్నాడు బాక్ బెంచ్ లో నుండి ఒకడు , ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడు అంది స్వాతి , ఎవరూ మాట్లాడ లేదు , కానీ క్లాస్ అంతా చెవులు కొరుక్కుంటున్నారు పోయి , పోయి ఈ సైకో కి ఎవడు లవ్ లెటర్ రాసింది అని , రాజేష్ నువ్వే కదా రాసింది ఈ లెటర్ రా ఇక్కడికి అని అరిచింది స్వాతి , కుసుమ కి అనుమానం వచ్చి తల దించి తన బుక్ వైపు చూసుకొంది అది తెరిచి పెట్టి ఉంది ,వాడు నాకు లెటర్ రాస్తే దీనికెంటి నొప్పి అనుకుని రాజేష్ వైపు చూసింది , రాజేష్ అప్పటికే తన వైపు కోపంగా చూస్తున్నాడు , చచ్చాను రా దేవుడా వీడు ఆ లెటర్ నేనే దానికి ఇచ్చా అనుకుంటున్నాడు ఇంక నాతో చచ్చినా మాట్లాడడు అనుకుని తల పట్టుకుంది , రాజేష్ స్టాండ్ అప్ అని అరిచాడు ప్రకాష్ , రాజేష్ తల తిప్పి సడెన్ గా లేచి నిల్చున్నాడు, ఈ లెటర్ రాసింది నువ్వేనా అడిగాడు ప్రకాష్ , yes sir రాసింది నేనే కానీ అని చెబుతుంటే ఆపి say sorry to స్వాతి అన్నాడు ప్రకాష్ , sir ఆ సైకో కి నేనెందుకు sorry చెప్పాలి అన్నాడు రాజేష్ ,క్లాస్ అంతా ఒక్కసారిగా నవ్వేశారు , మైండ్ యువర్ వర్డ్స్ రాజేష్ అన్నాడు ప్రకాష్ కోపంగా , sorry sir , కానీ నేను స్వాతి కి ఏ లెటర్ రాయనప్పుడు నేను తనకెందుకు సారీ చెప్పాలి sir అన్నాడు రాజేష్ కోపంగా , నువ్వే కదా ఇందాక లెటర్ రాశానని ఒప్పుకున్నావు అన్నాడు ప్రకాష్ , sir లెటర్ రాసింది నేనే కానీ స్వాతి కి కాదు అన్నాడు రాజేష్ కొంచెం నిదానంగా , ప్రకాష్ షాక్ అయ్యి స్వాతి వైపు చూసి స్వాతి అతను చెప్పేది నిజమా అన్నాడు , నాకు లెటర్ రాసెంత సీన్ ఇక్కడ ఎవరికీ లేదు sir, వాడు రాసింది నా ఫ్రెండ్ కి అందుకే లెటర్ చదవ మన్నా మీరే చదవలేదు అంది స్వాతి తన తప్పేం లేదు అన్నట్టు , అయినా ఎవరికి రాస్తే ఏంటి కాలేజ్ కి వచ్చేది చదువు కోటానికా ఇలా లవ్ లెటర్స్ రాయడానిక అసలు ఈ లెటర్ చూడండి sir ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో ఇక ఎగ్జామ్స్ ఎలా రాస్తాడు , వాళ్ల పేరెంట్స్ పాపం ఏదో చదువుకుని ఉద్దరిస్తాడు అని అంత, అంత ఫీజులు కట్టి కాలేజ్ కి పంపుతూ ఉంటే వీళ్ళు అమ్మాయిల వెనుక తిరిగి టైం వేస్ట్ చేస్తున్నారు అని మాట్లాడటం ఆపింది మధ్యలో బ్రేక్ ఇచ్చినట్టు అలా నాన్ స్టాప్ గా మాట్లాడటం వల్ల కాస్త ఆయాసం వచ్చింది స్వాతి కి, లెక్చరర్ ప్రకాష్ వాటర్ బాటిల్ చేతికిచ్చాడు తాగమని , బాటిల్ తీసు కుని గడ గడా నీళ్ళు తాగేసింది స్వాతి , మళ్ళీ మాట్లాడడం స్టార్ట్ చేసింది స్వాతి , ఈ లోపు రాజేష్ వాయిస్ వినిపించి అటు వైపు చూసరంతా స్వాతి తో పాటు,sir ఇంక ఎప్పుడూ ఆ అమ్మాయికి లెటర్ కాదు కదా కనీసం కన్నెత్తి కూడా చూడను ఆ క్లాస్ ఆపమని చెప్పండి sir, ఇంక మీరు క్లాస్ స్టార్ట్ చేయండి sir మీకు దండం పెడతా అని రెండు చేతులు జోడించి ఏడుపు మొహం పెట్టాడు రాజేష్ , అవును ఇప్పుడు నేను క్లాస్ తీసుకోవాలి కదా అనుకుని స్వాతి వైపు చూసి వాడు తప్పు ఒప్పుకున్నాడు కదా మళ్ళీ అలా చేయనని కూడా చెప్పాడు , నువ్వు ఇంక వెళ్లి నీ place లో కూర్చో నేను క్లాస్ స్టార్ట్ చేస్తా అన్నాడు ప్రకాష్ ,థాంక్స్ sir అని వెళ్ళబోతూ ఏదో డౌట్ వచ్చిన దానిలాగా మళ్ళీ వెనక్కి తిరిగింది స్వాతి , మళ్ళీ ఏమయిందమ్మ అన్నాడు ప్రకాష్ , ఏం లేదు sir ఇలాంటివి మళ్ళీ జరిగితే సివియర్ పనిష్మెంట్ వుంటుందని వార్నింగ్ ఇవ్వండి sir, అప్పుడు మా అమ్మాయిలు ప్రశాంతం గా చదువు పై కాన్సంట్రేట్ చేయగలుగుతారు అంది స్వాతి , క్లాస్ లో అందరూ కోపం తో చూస్తున్నారు స్వాతి వైపు , ఇదెక్కడి గోల రా బాబు అని చిరాకు వచ్చింది ప్రకాష్ కి , చూడు స్వాతి నాకు తెలిసి మన క్లాస్ అమ్మాయి లతో రూడ్ గా బిహేవ్ చేసే వాళ్ళెవరూ లేరు సో , నువ్వు అంతలా భయపడకు కానీ అందరికీ చెప్తున్నాను క్లాస్ లో ఎవరికి ఏ ఇబ్బంది కలిగించినా నాకు ధైర్యం గా చెప్పొచ్చు , అని స్వాతి వైపు తిరిగి నువ్వు అందరి మీదా తీసుకునే కేరింగ్ నాకు నచ్చింది కీప్ ఇట్ అప్ అని చెప్పి now లెట్స్ స్టార్ట్ our క్లాస్ అని డైరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోయాడు ప్రకాష్ , స్వాతి కి మళ్ళీ మాట్లాడే ఛాన్స్ యివ్వకుండా , స్వాతి సైలెంట్ గా తన ప్లేస్ కి వెళ్లి కూర్చుంది ,తన పక్కనున్న కుసుమ మాత్రం స్వాతి మీద చాలా కోపంగా వుంది , ఈ సైకో ది నా లవ్ స్టొరీ స్టార్ట్ కాక ముందే ఎండింగ్ కార్డ్ పడేసింది , వాడికి one year నుండి సైట్ కొడుతుంటే ఇప్పటికి కరిగి లవ్ లెటర్ రాశాడు , వాడి కోసం అదే ట్యూషన్ లో కూడా జాయిన్ అయ్యాను మా అమ్మ , నాన్న లకు కూడా లేని నొప్పి దేనికెందుకు అని మనసులోనే తెగ బాధ పడిపోతోంది కుసుమ , స్వాతి కి మరో పక్క కూర్చున్న వల్లి మాత్రం తినేసే లాగా కొర కొర చూస్తూ ఉంది స్వాతి వైపు , వల్లిని గమనించి ఏన్టే బ్రేక్ఫాస్ట్ చేయలేదా మార్నింగ్ కళ్ల తో నన్ను తినేస్తున్నవ్ అంది స్వాతి గుస గుస లాడుతున్నట్టు , నీకెందుకు అందరి గురించి ఎందుకు అలా చేశావ్ అంది వల్లి కోపంగా గుస ,గుస లాడుతూనే . ముందు క్లాస్ విను నన్ను తర్వాత చూడచ్చు అంది స్వాతి , ఇది మారదు అని తల చిన్నగా కొట్టుకుంటూ క్లాస్ వినడం లో మునిగిపోయింది వల్లి , ఆ టైమ్ లో క్లాస్ మొత్తం ఒకటే అనుకున్నారు సైకో స్వాతి అని , ముగ్గురు తప్ప ఒకటి వల్లి , రెండు లెక్చరర్ ప్రకాష్ , ఇంకా స్వాతి ని ఇష్టపడే ఆకాష్ , అందరూ లెక్చరర్ వైపు చూస్తుంటే ఆకాష్ మాత్రం స్వాతి నే చూస్తూ నా అందాల రాక్షసి అనుకున్నాడు మనసులో .