Read My Prince - 1 by Rajani in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

My Prince - 1

ఉదయం 5 గంటలయింది చెవిలోని ఇయర్ ఫోన్స్ నుండి ఓం ఓం అని కంటిన్యూ స్ గా ఓం కారం వినపడుతోంది , అలా ఓంకారం వింటూ ప్రశాంతంగా ఒక్కటే నడుచుకుంటూ వెళుతోంది స్వాతి , 10 నిమిషాలలో యోగా క్లాస్ కి చేరుకుంది , 6 గంటలకు తిరిగి ఇంటికి చేరుకుంది B టెక్ ఫైనల్ చదువుతున్న స్వాతి , స్వాతి పేరుకు తగ్గట్టు స్వాతి ముత్యం లాగా అందం గా ఉంటుంది , తనను చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్క నిమిషం అలానే చూసేంత అందం గా ఉంటుంది , తనను చూసి పెద్దవాళ్ళు ఎవరయినా మహాలక్ష్మి లా ఉంటుంది అంటారు , అమ్మాయిలైతే అసూయ పడతారు , అబ్బాయిలైతే ప్రేమలో పడిపోతారు , దూరం నుండి చూడడం తప్పితే దగ్గరకు వెళ్ళి స్వాతి తో మాట్లాడాలి అంటేనే భయం అబ్బాయిలకి , దానికి కారణం తన బిహేవియర్ అబ్బాయిలను చూస్తేనే ఏదో పురుగుని చూసినట్టు పెడుతుంది ఫేస్ ఇక మాట్లాడాలి అని ఎవరికి అనిపిస్తుంది , ఎందుకు అలా అంటావు అను ఫ్రెండ్స్ అడిగితే అబ్బాయిలతో ఇలానే ఉండాలి, వాళ్ళకి లీనియన్స్ ఇవ్వకూడదు అంటుంది .స్వాతి ఒక మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయి , యోగ క్లాస్ నుండి ఇంటికి వచ్చిన స్వాతి కి గుమ్మం లో వుండగానే బ్రహ్మమురారి సురార్చిత్ లింగం అంటూ వాళ్ళ అమ్మ పాడుతున్న లింగాష్టకం వినపడింది అది విని ఈరోజు పూజ త్వరగానే చేసేస్తుంది అమ్మ అనుకుంటూ లోపలికి వెళ్ళింది , హాల్లో పేపర్ చదువుతున్న స్వాతి తండ్రి మూర్తి హమ్మయ్య టైం కి వచ్చావ్ బంగారం మన ఇంటి పూజారి, అదే మీ అమ్మ పూజ ఇప్పుడే స్టార్ట్ చేసింది పూర్తి అయ్యేసరికి ఇంకో గంట పడుతుంది నాకు కొంచెం టీ పెట్టి ఇవ్వరా బంగారం అని అడిగాడు స్వాతి ని , నేను టీ పెడతా గానీ అమ్మని డిస్టర్బ్ చేయకండి మీరు ప్రశాంతం గా పూజ చేసుకో నివ్వండి , అని కిచెన్ లోకి వెళ్లి ఒక చిన్న cup లో వాళ్ళ నాన్న కు టీ తనకు ఒక కప్ లో హార్లిక్స్ కలిపిన పాలు తీసుకుని వచ్చింది , వాళ్ల నాన్న టీ తాగి అబ్బ ఎంత బాగా పెట్టవు టీ అన్నాడు , మూర్తి గారు ఎప్పుడూ ఇంతే కూతురు ఏం చేసినా తెగ మెచ్చు కుంటాడు , కూతురు అంటే ప్రాణం , స్వాతి తల్లి రాణి పూజ ముగించుకుని వచ్చే సరికి తల్లి కి కూడా టీ ఇచ్చింది స్వాతి , వాళ్ల అమ్మ నాన్న లకి కాసేపు కబుర్లు చెప్పి ఫ్రెష్ అయ్యి breakfast ఫినిష్ చేసి స్కూటీ మీద కాలేజ్ కి వెళ్లిపోయింది స్వాతి, కాలేజ్ లోకి వెళ్ళేసరికి ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు స్వాతి ఫ్రెండ్స్ , బేబీ పింక్ కలర్ డ్రెస్ లో ఒక అందమైన గులాబీ లాగా కనిపిస్తోంది అక్కడ ఉన్న అబ్బాయిలకి , అబ్బ ఏం ఉందిరా ఈ డ్రెస్ లో అన్నాడు ఒకతను , నువ్వు తన వైపు చూస్తున్నావని తెలిసిందంటే రేపే రాఖీ తెచ్చి నీ చేతికి కడుతుంది జాగ్రత్త అన్నాడు పక్కనుండి ఒకడు , అవున్రా మామ రాఖీ పండగ ఏదో దీని కోసమే కనిపెట్టినట్టు కట్టలు కట్టలుగా రాఖీలు తెచ్చి అందరికీ వెతికి వెతికి కడుతుంది , ఇప్పటి వరకు తప్పించుకుంది నువ్వెరా అన్నాడు మరొకడు , వీడు తప్పించుకున్న సంగతి తెలిస్తే ఈ సారి ముందు వీడినే టార్గెట్ చేస్తుంది అన్నాడు ఇంకొకడు , ఇంతకీ స్వాతి ధైర్యం గా సైట్ కొడుతున్న అబ్బాయి పేరు చెప్పలేదు కదా అతని పేరు ఆకాశ్, అమ్మాయిలంతా తన వెనుక పడుతుంటే ఇతను మాత్రం స్వాతి అనే ఈ మోడర్న్ యోగిని వెనుక తిరుగుతున్నాడు . తన ఫ్రెండ్స్ కూర్చున్న చెట్టు దగ్గిరకి వెళ్లి అక్కడే వున్న సిమెంట్ బెంచ్ పైన తన ఫ్రెండ్స్ తో పాటు కూర్చుంది అందరికీ హై చెప్పి , స్వాతి ని చూడగానే కుళ్లు కుంది అక్కడే వున్న ప్రభ , ఇది స్లిమ్ గా ఉండటం వల్ల ఏ డ్రెస్ వేసినా అందం గా కనిపిస్తుంది , పైగా ఆ లూస్ హైర్ ఒకటి , అబ్బాయిలంతా దాని చుట్టు తిరుగుతారు అని తిట్టుకుంది పైకి నవ్వుతూ స్వాతి కి హై చెప్తూనే, ఆ కుళ్ళు కక్కడానికి అన్నట్టు మాట్లాడటం మొదలు పెట్టింది ప్రభ ,నేను కుసుమ నిన్న డైటీషియన్ దగ్గరికి వెళ్ళాం స్లిమ్ గా అవటానికి చాలా టిప్స్ చెప్పారు అంది ఆనందంగా, దీనికి డైటీషియన్ దగ్గరికి వెళ్ళి డబ్బు ఖర్చు పెట్టడం దేనికి నన్ను అడిగితే చెప్తాగ అంది స్వాతి , అవునా ఏం చేయాలి చెప్పు అంది పక్కనున్న స్వాతి బెస్ట్ ఫ్రెండ్ వల్లీ , పెద్దగా ఏం లేదు చిట్టి వల్లి ప్రభ లంచ్ బాక్స్ చూడు ఆ మూడు డబ్బాల్లో కనీసం ఒక డబ్బా తగ్గించి తింటే సరిపోతుంది తర్వాత నిదానం గా ఇంకొక డబ్బా తగ్గించవ్చని అంది స్వాతి , అందరూ నవ్వేశారు , ప్రభ కు మాత్రం ఒళ్ళు మండి పోయింది , మా మమ్మీ అన్నం వదిలితే అస్సలు ఊరుకోదు అంది తిప్పుకుంటూ ప్రభ , మరి ఫైనల్ ఇయర్ అవ్వగానే పెళ్లి చేస్తారు ఇంట్లో అన్నావ్ కదా అప్పటి వరకైనా తిండి తగ్గించక పోతే ఇంకా లావుగా అయిపోతావు కదా అంది స్వాతి అమాయకంగా , చుట్టూ ఉన్న అందరూ నవ్వు ఆపుకోడానికి ట్రై చేస్తున్నారు అని ప్రభ గమనిస్తోంది , నా పెళ్ళికి మా నాన్న కోటి రూపాయలు కట్నం ఇస్తారు అందుకే అబ్బాయిలు క్యూ కడతారు నాకు డైటింగ్ చేయాల్సిన అవసరం లేదు అంది పొగరుగా ప్రభ , ఒళ్ళు మండింది స్వాతికి ఓయ్ నువ్వే కదా డైటీషియన్ దగ్గరికి వెళ్ళా స్లిమ్ అవుతా అన్నావు ఇప్పుడేమో ఇలా అంటున్నావు, అసలు నీ లైఫ్ లో నువ్వేం చేయాలి అన్న క్లారిటి ఉందా నీకు అంది స్వాతి నొసలు చిట్లించి , ఒకే సారి గతుక్కు మంది ప్రభ , ఈ లోపు వల్లి క్లాస్ టైం అయింది పదండి వెళదాం అంది , ఒకేసారి అందరి మూడ్ డైవర్ట్ అయింది పదండి పదండి అంటూ కదిలారు అక్కడ కూర్చున్న పది మంది అమ్మాయిలు , హమ్మయ్య బ్రతికిపోయా లేదంటే ఈ సైకో ది ఇచ్చే క్లాస్ కి చచ్చేదాన్ని , పెళ్లి చేసుకుంటా అంటేనే గంట క్లాస్ పీకింది అప్పుడే పెళ్లెందుకు అని లైఫ్ అంటే ఒక గోల్ ఉండాలి అని ఇలా మనసులో గొణుక్కుంటూ నడిచింది ప్రభ , బాగ్ తీసుకుని వెళ్ళబోతున్న స్వాతి ని వెనక్కు పిలిచింది వల్లి, ఏన్టే పిలిచావు క్లాస్ కి టైం అయింది కదా పద అంది స్వాతి , నువ్వి లా ముక్కు సూటిగా మాట్లాడటం ఎవరికీ నచ్చదు స్వాతి , వాళ్ళ గురించి మనకెందుకు చెప్పు అంది వల్లి , వాళ్లకు నచ్చుతుందా లేదా అని ఆలోచించి మాట్లాడటం నాకు రాదు నాకు ఏది అనిపిస్తే అదే మాట్లాడతా అది నీకు కూడా తెలుసు కదా అంది స్వాతి , కానీ అందరూ నీ గురించి ఏమనుకుంటారు చెప్పు అంది వల్లి , చూడు మనం అంటే గిట్టని వాళ్ళ కి మనం మంచికి చెప్పినా చెడ్డ గానే అనిపిస్తుంది , అలాంటి వాళ్ల గురించి ఎందుకు ఆలోచించటం కానీ ఫ్యూచర్ లో మాత్రం మనం ఎందుకు చెప్పాం అని ఖచ్చితంగా తెలుసుకుంటారు , సరే క్లాస్ కి వెళదాం పద అంది స్వాతి , ఇద్దరూ క్లాస్ కి ఆవెళ్ళిపోయారు , class కి వెళ్ళాక స్వాతి పక్కన కూర్చున్న కుసుమ దగ్గరికి రాజేష్ అనే అతను వచ్చి తన నోట్ బుక్ ఇచ్చి థాంక్స్ చెప్పాడు , కుసుమ తన బుక్ తీసుకుంది నవ్వుతూ , ఇది గమనించిన స్వాతి ఇది నీ నోట్స్ కదా అతని దగ్గర ఎందుకు ఉంది అని అడిగింది , అతను 2డేస్ కాలేజ్ కి రాలేదు పాపం అందుకే నా నోట్స్ అడిగితే ఇచ్చా అంది కుసుమ , నోట్స్ కావాలంటే తన చుట్టూ అంతమంది అబ్బాయిలు ఉన్నారు కదా నిన్నే ఎందుకు అడగాలి , వాడిని చూస్తే ఏదో అనుమానం గా ఉంది కొంచం దూరం గా ఉండు అంది స్వాతి , అబ్బా మా అమ్మా, నాన్న కూడా ఇన్ని అడగరు ఈ సైకో కి ఇలా దొరికాను అనుకొని అతను నేను ఒకే ట్యూషన్ , ట్యూషన్ sir నే నా నోట్స్ అతనికి ఇచ్చారు , ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అయింది కాబట్టి నా నోట్స్ తెచ్చి ఇచ్చేశాడు అంది , సరేలే ఏదయినా పిచ్చి వేషాలు వేస్తే నాతో చెప్పు అని మాట్లాడుతూనే కుసుమ బుక్ ని casual గా తీసి ఓపెన్ చేసింది స్వాతి , దానిలో ఒక పింక్ కలర్ పేపర్ fold చేసి ఉంది , ఇదంతా కుసుమ గమనించ లేదు , తన ముందు కుందు కూర్చున్న అమ్మాయి హెయిర్ క్లిప్ బాగుంది అని తనను పిలిచి ఎక్కడ కొన్నావ్ నీ హైర్ క్లిప్ బాగుంది అని ముచ్చట్లు పెట్టింది , మరోపక్క స్వాతి కుసుమ నోట్ బుక్ లో ఉన్న పేపర్ ఓపెన్ చేసి చూసింది, అది ఒక లవ్ లెటర్ ..