Read Will this journey reach the coast.. - 21 by Lakshmi Venkatesh దేవేష్ in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఈ పయనం తీరం చేరేనా...- 21

ముందుగా 1-20 భాగాలూ చదివాకా ఇది చందవండి అప్పుడే కధ అర్ధం అవుతుంది..


అసద్ బ్లష్ అవ్వటం చూసి ప్రణయ్ నవ్వుకొని మళ్ళీ షివి వైపు చూపు తిప్పుతాడు..


షీవి వైపు చూసిన ప్రణయ్ కి షివి పక్కనే వున్న గీత తన కల్లని ఆకట్టుకుంది.. అలానే రెప్పవేయకుండా గీత నీ చూడటం లో ప్రణయ్, షివి నీ మనసులో నింపుకోవడం లో అసద్ మునిగిపోయి వాళ్లు వెళ్లిపోయిన ఇంక కళ్లముందే వున్నట్టు ఫీల్ అవ్వి అలానే ఉండి పోతారు..


పక్కనే ఏదో గొడవ వాళ్ల ట్రాఫిక్ జామ్ అవ్వటం తో హోరొన్ సౌండ్స్ కి మనుషుల అరుపులు.. తిట్లు కి ఈ లోకం లోకి వచ్చి ఒకరిని ఒకరు చూసుకొని చిన్నగా నవ్వుకొని ఇంటికి ప్రయాణం అవుతారు..


ఇలా రోజు ఎదో ఒక టైమ్ లో షివి అసద్ చూడటం.. చూడటానికి వెళ్ళే అప్పుడు ప్రణయ్ నీ కూడా తీసుకువెళ్లడం.. ప్రణయ్ దూరం నుండే గీత నీ గమనించటం మెల్లిగా తన మనసుని మౌనంగా గీతకి ఇవ్వటం జరిగిపోతోంది..


ఎందుకో ఒక రోజు షివి గురించి తెలుసుకోవాలి అని అసద్ ఒక ఏజెంట్ నీ కంటాక్ చేసి షివి గురించి మొత్తం డీటైల్స్ తెలుసుకుంటాడు..

పేరు : షివిధ ధరణి
తండ్రి పేరు : శ్రీకర్
తల్లి పేరు : శారద
ఒక అన్నయ్య వున్నాడు పేరు : అనిరుధ్ అతను కూడా షివి వాళ్ల కాలేజ్ లోనే మెడిసిన్ చేసి.. కెమిస్ట్ గా ట్రైనింగ్ తీసుకొని.. ఇప్పుడు జూనియర్ సైంటిస్ట్ గా ఆ కాలేజ్ సంస్థ లోనే వర్క్ చేస్తున్నాడు.. చాలా మంచి వాడు.. అతను అంటే ఆ కాలేజ్ లో అందరికి ఒకరకమైన గౌరవం, భయం వున్నాయి..


షీవి తండ్రి పుట్టు పూర్వోత్తరాలు నుండి అన్ని వివరాలు తెలుసుకొని అతను ఎలాంటివాడు అనేదాని మీద కూడా ఒక అవగాహనకి వచ్చాడు.. ఇవి ఇలా వుండగా ఇంకో పక్క బిజినెస్ పరంగా అసద్ అంచలంచెలుగా ఎదుగుతూ దూసుకుపోతున్నాడు..


అసద్ ఎదుగుదల, తెలివితేటలు, అందం చూసి ముచ్చటపడి అతనికి పోటీ వస్తున్న కూడా అసద్ తెగింపు చూసి బిజినెస్స్ పరంగానూ.. పర్సనల్ గాను అసద్ అండ అతనికి లాభమే అని గ్రహించి అసద్ కోసం తన కుతిరికి చెప్తాడు ప్రముఖ వ్యాపారవేత్త దామోదర్..


అసద్ గురించిన వివరాలు విని ఇంట్రెస్టింగ్ అనుకొని అసద్ నీ కలవటానికి సరైన సమయం కోసం వెయిట్ చెయ్యడం తన పని అయిపొయింది..


సదరు దామోదర్ అనే వ్యాపారవేత్త కి సంతానం ఇద్దరూ.. మొదట కూతురు.. పేరు కారా.. ఎంబీఏ పూర్తి చేసుకొని తను కూడా ఈ మధ్యనే తండ్రి వ్యాపారం చూసుకునే పనిలో వుంది.. కారా కి లేని అలవాట్లు అంటూ ఏమి లేవు.. స్మోకింగ్, డ్రింకింగ్ తో పాటు డ్రగ్ ఎడిక్ట్ అవ్వడమే కాకుండా సెక్సువల్ గా కూడా ఎంతో మంది బడా బాబులతో టచ్ లో వుంటుంది.. ఇంక దామోదర్ ఏకైక పుత్రుడు అతని వారసుడు కి అప్పుడే టైమ్ రాలేదు వచ్చినప్పుడు చెప్తా..


ఇలా ఒక సంవత్సరం పాటు దూరం నుండి చూసుకుంటూ ప్రేమలో మునగటంలో అసద్, ప్రణయ్ లకి కాలం తెలియలేదు..


అలాగే షివి అండ్ బ్యాచ్ కి మెడిసిన్ సెకండ్ ఇయర్ లోకి అడుగు పెట్టారు.. ( మనకి మెడిసిన్ లెక్క తెలియదు మనం డిగ్రీ స్టుడెంట్లం... తప్పు ఏమైనా వుంటే సోరి .. ఇక్కడ నా ఇంటెన్షన్ ఫస్ట్ ఇయర్ పూర్తి అయిపోయి సెకండ్ ఇయర్ సగం అవుతుంది నా భాషలో అయితే థర్డ్ సేమ్ ఫినిష్ చేసుకొని ఫోర్త్ సేమ్ కి రావటం.. 😑)


సేమ్ అయ్యేసరికి అప్పటి వరకు ఎక్సమ్స్ కోసం టెన్షన్ పడ్డ వాళ్ళు అందరు ఎంజాయ్ చెయ్యడానికి రకరకాల పనులు చేస్తున్నారు.. అలానే గీత అండ్ రూప ఒకరోజంతా బయట ఎంజాయ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు..


గీత మామూలుగానే ఎక్కడికి వెళ్లిన షివి నీ వెంట తీసుకువెళ్తుంది.. అలాంటిది అసలు ఇల్లు కాలేజ్ తప్పా ఎం చెయ్యని షివి నీ ఒప్పించి మరి తమతో షాపింగ్ కి తీసుకువెళ్తుంది గీత..


షివి తమతో రావటం అటు ఇష్టంగా ను లేదు ఇటు కష్టంగాను లేదు రూప కి.. మాములుగానే అన్ని చూస్తూ తిరుగుతూ ఉన్నరు.. ఎప్పుడో కానీ అనిరుధ్ తో బయటకి వచ్చే షివి అలా ఫ్రెండ్స్ తో రావటం ఫస్ట్ టైమ్ కావటం తో కాస్త ఎక్సయిట్ అవుతూ తిరుగుతుంది..


బిసినెస్ మీటింగ్ కోసం హోటల్ కి వెళ్లి వస్తున్నా అసద్ ప్రవీణ్ లకి దారిలో ఐస్ క్రీం తింటూ కనిపిస్తారు ముగ్గురు ఫ్రెండ్స్.. బయట్టున్నా పొల్యూషన్ కి మాస్క్ కచ్చితంగా కారీ చేసే అసద్ అప్పుడు కూడా మాస్క్ పెట్టుకొని ఈ సారి కార్ లో నుండి కాకుండా దగ్గరగా చూడాలనిపించటంతో కార్ దిగుతాడు.. అసద్ నీ ఫాలో చేస్తూ ప్రవీణ్ కూడా..


" ఏంటి అసద్ ఏమైనా పనుందా..?? " అడిగాడు ప్రవీణ్ ఎప్పుడు అసద్ కి షివి కనిపించిన కూడా కార్లో నుండే చూసే అసద్ ఇప్పుడు కార్ దిగటం కొంచోమ్ వింతగానే తోచింది..


" ఒకసారి షివి నీ డైరెక్ట్ గ చూడాలి.. " అన్నాడు మాస్క్ సరిగ్గా ఉందొ లేదో చూసుకుంటూ..


అసద్ మాటకి నవ్వుకుంటూ.. " మాస్క్ బానే వుంది కుదిరితే అదిగో అక్కడ కాప్స్ అమ్ముతున్నారు పెట్టుకో.. నిన్ను చూడకుండా నీ చెలీ గుర్తుపడుతుందో లేదో.. ఇదే నీ ప్రేమకి నీ ఉనికికి పరీక్ష.. " అన్నాడు ప్రవీణ్ అసద్ నీ టీస్ చేస్తూ..


ప్రవీణ్ అన్నాడని కాదు కానీ షివి తన మొహం తన ఆస్తి చూసి కాకుండా తన ఉనికిని తన మనసుని ప్రేమించాలని కోరుకుంటూ అసద్ కూడా వెళ్లి కాప్ బై చేసి పెట్టుకున్నాడు.. ఈలోగా ప్రవీణ్ ఆపొసిట్ రోడ్ లో వున్న వాళ్ల వైపు వెళ్లి వాళ్లకి కాస్త డిస్టెన్స్ లో ఫాలో చేస్తున్నాడు..


తలకి కాప్ పెట్టుకొని మొహం సగం పైగా కనిపించకుండా కవర్ చేసుకొన్న అసద్ ఫెస్ లో కళ్ళు మాత్రమే క్లారిటీగా కనిపిస్తాయి..


రోడ్ క్రాస్ చేసి అటు వైపు వున్న షివి వైపు వెళ్తున్నాడు అసద్.. కరెక్ట్ గా డివైడర్ దాటిన అసద్ దృష్టిలో పడుతుంది ఒక అదుపు తప్పి వస్తున్నా బస్..


ఆ బస్ వస్తున్నా స్పీడ్ అండ్ డైరెక్షన్ బట్టి అది జనాల్లోకి వెళ్తుందని తెలుస్తుంటే అనుమానంగా షివి వాళ్ళు వున్న వైపు చూస్తాడు అసద్..


రూప అప్పుడే అక్కడేదో రోడ్ సైడ్ ఫుడ్ కోసం పక్కకి వెళ్తే రూప కోసం వెయిట్ చేస్తూ వీళ్ళు రోడ్ మీదేవుంటారు...


వాళ్ళ వెనకే కాస్త డిస్టెన్స్ లో వున్న ప్రవీణ్ వైపు చుసిన అసద్ ప్రవీణ్ గీతనే రెప్పకొట్టకుండా చూస్తుండటం కనిపిస్తుంది..


గట్టిగా కళ్ళు మూసుకొని ప్రవీణ్ వైపు చుసిన అసద్ కి ఈ సారి ప్రవీణ్ తన వైపు చూస్తూ కనిపిస్తాడు..


రోడ్ దాటుతూ మధ్యలో ఆగి ఎదో ఆలోచిస్తున్న అసద్ నీ అనుమానంగా చూస్తాడు ప్రవీణ్.. అసద్ తనని ప్రవీణ్ చూడటమే.. వాళ్ళ వైపు దూసుకొస్తున్న ప్రమాదం నీ చూపిస్తాడు..


అడ్డదిడ్డంగా అదుపు తప్పి వస్తున్నా బస్ తన కంట పడి పెద్దగా అరుస్తూ అక్కడ వాళ్ళని ఎలర్ట్ చేసాడు ప్రవీణ్..


అప్పుడే తనకి కావాల్సింది కొనుక్కొని వచ్చిన రూప గీత చెయ్యి పట్టుకొని ఎదో చెప్తుంటే వినిపించిన అరుపుకి తను ఫుడ్ పాత్ మీదకి ఎక్కేసి గీతని కూడా తనతో లాగేస్తుంది..


చుట్టూ చూసుకుంటున్న షివికి ఒక్కసారిగా జనం లో వచ్చిన మార్పుకి హడలిపోయింది పక్కన గీత కోసం చుస్తే తను లేదు.. ఫుట్పత్ మీద వున్న గీత కోసం అటుగా వెళ్తున్న షివి ఆ తొక్కిసలాటలో ఎవరో తోసేయ్యడంతో రోడ్ కి కాస్త పక్కాగా వున్న షివి వెళ్లి రోడ్ మధ్యలో పడుతుంది..


షివిని చూస్తున్న గీత ఆగలేక షివి అని అరుస్తూ వెళ్తే రూప లో అయ్యో పాపం అన్న బాధ ఉంటుంది..


షివి మీదకే దూసుకొస్తున్న బస్.. డ్రైవర్ షివి అలా అడ్డంగా పడటం తో మొగిస్తున్న హోరేన్..


షివి కింద పడ్డప్పుడే బ్లాంక్ అయినా అసద్ ఈ లోకంలోకి వచ్చేది బస్ హోరేన్ సౌండ్ కే.. వెంటనే తేరుకొని షివి మోచేతి పైన పట్టుకొని తనతో పాటు లాగేస్తూ ఫుట్పత్ కూడా దాటేస్తాడు..


విసురుగా ఒకరోచ్చి తన చెయ్యి పట్టి లాగేయటం.. ఆ ఫోర్స్ కి అతన్ని అతుక్కుపోతుంది షివి..


ఆ టచ్.. తనని కవచంలా చుట్టేసి భద్రంగా తన గుండెల్లో దాచుకున్న బహువులు.. అతని ప్రెసెన్స్ ముఖ్యంగా అతని గుండె కొట్టుకునే వేగం..


తనకేమైనా అవుతుందేమో అని కంగారులో ఆతని గుండె చప్పుడు అతను గుర్తించలేదు కానీ ఆమె గుర్తించింది..


హ వాట్ నెక్స్ట్..??


ఏంటి కోపం వచ్చిందా.. మంచి సీన్ లో కట్ చేశాను అని.. పర్లేదు. నా స్టోరీ కోసం మీరెంత వెయిట్ చేస్తున్నారో నాకు తెలుస్తుందిగా..


కొనసాగుతుంది...