Read Those three - 47 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 47

అన్వర్ చిన్నగా దగ్గాడు. అలీ, యాకూబ్ లు అతడిని చిరునవ్వు తో చూశారు.
" ఇది కలా నిజమా! ఇక్కడ మనం ఇంత ప్రశాంతంగా కూర్చోవడం " అన్వర్ వారిద్దరినీ చూశాడు.
" ఈ కలను నిజం చేసిన వాడికి మనం జన్మంతా ఋణపడి ఉండాలి " అలీ స్పందన.
" ఎటు వెళుతున్నామో తెలీదు. ఏం చేస్తున్నామో తెలీదు.
గమ్యం లేని చీకటి ప్రయాణం. ఇప్పుడు తలుచుకుంటే భయమేస్తుంది. "
" ఇనాయతుల్లా సాబ్ చెప్పింది ముమ్మాటికీ నిజం. మతమే దేవుడు కాదు. మతమే జీవితం కాదు. రాముడైనా, రహీమైనా ఓ మంచి భావన. మాటల్లో చెప్పలేని ఓ గొప్ప అనుభవం. . " క్షణం ఆగాడు అన్వర్. అతడి కళ్ళల్లో మెరుపు.
భాషకందని అవ్యక్తానుభూతి. అలీ, యాకూబ్ తమ ఉనికినే మర్చిపోయారు.
" అలీని సెక్యూరిటీ సిబ్బంది తీసుకెళ్ళాక ఆ చీకటి లో చలిలో సాధువు ఆశ్రమం వరకు ఎలా నడిచానో ? ఒంటరి తనం, గుండెల్లో బాధ, -----ఆ సాధువు ఆదరించక పోతే నా పరిస్థితి ఏమిటి ?..... కాస్త కుదుట పడ్డాను. మనసు తేలికైంది. సాధువు ఎదురుగా కూర్చున్నాను. ఆయన కృష్ణ భక్తితో డు.
కళ్ళు మూసుకుని ధ్యానం లో ఉన్నాడు. కృష్ణుని బొమ్మ ముందు చిన్న దీపం. గాలి మెల్లగా వీస్తోంది. గాలి తెరలకు
కదిలి ఆశ్రమం గోడలపై వెలుగు నీడ దాగుడు మూతలు ఆడుతున్నాయి.

చీమ చిటుకుమన్నా వినిపించే నిశ్శబ్దం. నా గుండె చప్పుడు నాకు వినిపిస్తోంది. కళ్ళు మూసుకున్నాను. ఏం ఆలోచనలు లేవు. ప్రశాంతంగా ఉండి పోయాను. అలా ఎంత సేపు ఉండి పోయానో. కాలం నిలిచిపోయిందా అని అనిపించింది.
అలీ, యాకూబ్ లు పరిసరాలు మర్చిపోయారు.
" యా అల్లా "! అన్వర్ నమాజ్ చేసే భంగిమ లో కూర్చున్నాడు. చూపు ఆకాశం వైపు. పడమటి సింధూరం
అతడి మొహం పై మెరుస్తోంది.

ఆ అనుభవాన్ని ఈ జన్మ కు మర్చిపోలేను. నువ్వున్నావని, నువ్వొక్కడివే సత్యమని ఆ క్షణంలో తెలిసింది. సాధువు చూపిన సానుభూతి లో, ప్రేమలో నిన్ను చూడగలిగాను. ".
అలీ, యాకూబ్ అన్వర్ మాటల్లోనే ఆ " అనుభవం " పొందగలిగారు. వారూ పొంగిన గుండె లతో అల్లా ముందు మోకరిల్లారు.
వారి " ప్రస్థానం" ( Reaching the divine heights) చూసి ప్రకృతి పచ్చ, పచ్చగా నవ్వుతూ, గాలి తెమ్మెర లకు తేలిపోతూ పులకించి పోయింది.

***************************************************

ఆ ముగ్గురు

కధలో అంతర్లీనంగా, ముఖ్యోద్దేశం గా వ్యక్త పరిచిన అంశం........... మనమంతా భారతీయులం, మన యువతను కాపాడుకునే బాధ్యత మనది. ఇందుకు పరమత సహనం, ప్రేమ, ఓర్పు, సమిష్టి కృషి ఎంతో అవసరం.

ధనవంతుల బిడ్డలను డ్రగ్స్ కు అడిక్ట్ చేయిస్తూ, వారిని నిర్వీర్యం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్న ఆపరేషన్ జన్నత్ఒక ముస్లిం సంస్థ మిలిటెంట్ ట్రైనీలను దిగుమతి చేసుకొని హైదరాబాద్ కాలేజీ లలో వీళ్ళ ద్వారా డ్రగ్స్ సప్లై చేయిస్తోంది.

ఈ ట్రైనీ లు ముగ్గురు ఒక్కొక్క కారణంతో మిలిటెంట్స్

గా మారుతారు. బేసిక్ కారణం ఒకటే......

పేదరికం. తీరని ఆశలు.

మిషన్ జన్నత్ అనే పేరుగల మరొక ముస్లిం సంస్థ , ప్రొఫెసర్ .ఇనాయతుల్లా అధ్వర్యంలో గతి తప్పిన యువకులకు, మతం అంటే ఏమిటి ? జన్నత్ అంటే ఏమిటి ? అని వివరించి చెబుతూ భగవద్గీత, ఖురాన్, బైబిలు ........... మూడింటి సారాంశము మరియు సందేశము ఒక్కటే అదే మానవత్వం

· మనిషి గా పుట్టడం మన అదృష్టం. మనిషి లో మానవత్వం లేని నాడు ఏమి చేసినా జన్నత్అన్నది లేదు.జిహాదీ అన్నది ఉన్మాదం.

జన్మభూమి ని మరిచి, సోదర భావం లేని

మనిషి మనిషే కాడు. కాబట్టి ఒక మతాన్ని మట్టుబెట్టేందుకు ప్రయత్నించడమే పాపం.

అన్ని పవిత్ర గ్రంథాలకు అది వ్యతిరేకం. “

మిషన్ జన్నత్ సంస్థ వారు పోలీసుల సహాయంతో

ఆ ముగ్గురి నీ కాపాడుతారు. వారి ద్వారా డ్రగ్స్ రాకెట్ ను పట్టుకుంటారు.

బలైపోబోతున్న ముగ్గురు యువకులు " ఆ పరమాత్ముని" దయ వల్ల ప్రశాంతత పొందుతారు. పరమాత్ముని రూపాలు వేరే గానీ, భావన ఒక్కటే అని తెలుసుకుంటారు.

ఎంత బాగుంది ........ఈ అంతిమ వాక్యం. అలా ప్రతి ఒక్కరిలో జరిగితే "కలహాలు మాయం. కలిసిమెలిసి ఉండటం తథ్యం. ఆమీన్ !

***************************************************

రచయితకు ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్స్ అందరూ కలిసిమెలసి ఉంటారు. అందులో ముస్లిం ఫ్రెండ్స్

హిందూ స్నేహితులతో చాలా వరకు అభిప్రాయాలు సలహాలు పంచుకుంటారు.

బయట సమాజం లోని పరిణామాలకు

మనమూ ఒక సమాధానం చెప్పాలని ఈ ప్రయత్నం.

కథనం చూస్తున్నట్లు గా ఉంటుంది.

క్యారెక్టర్స్ ప్రత్యక్షం గా ఉన్నట్లు ఉంటుంది.

ఈ రచన చదివి కొందరైనా " మతానికి అర్థం తెలుసుకొని హాయిగా జీవిస్తే చాలు.

ఈ భావం నాలో కల్గించి, పదములో కూర్చి నాచే మీ ముందుంచిన ఆ రాం

రహీం

కు ధన్యవాదాలు.

***************************************************"