Read Those three - 32 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 32

కొడుకు మంచి స్థితిలో ఉన్నాడని యాకూబ్ తల్లిదండ్రుల గట్టి నమ్మకం. ఆ ప్రేమతో, ఆ నమ్మకం తోనే అతడి ఉద్యోగం
వివరాలు అడగలేదు. ఆ మహా నగరంలో యాకూబ్ కొద్ది పాటి జీతం అతడి. ఖర్చులకు సరిపోతుంది. తను గుప్త సంపాదనలో సింహభాగం నాలుగో అక్కయ్య పెళ్ళికి కూడబెడుతున్నాడు.
కొడుకు మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. అక్క నిఖా కు బాగానే కూడ పెడుతున్నాడు అని వారి నమ్మకం.
" నాన్నా ! బీడీ తాగటం మానేయవా ?" కొడుకు మందలింపుకు బీడీ నలిపి పారేశాడు కరీంఖాన్.
" బాగా తగ్గించానురా ! రోజుకు రెండే తాగుతున్నాను.
సాయంత్రం కొట్టు కట్టేశాక ఒకటైనా వెలిగించకపోతే ప్రాణం ఊరుకోదు." నవ్వాడు.
యాకూబ్ అక్క ఇద్దరికీ టీ ఇచ్చింది. వేడి వేడి తేనీరు ఆ చల్లని సాయంకాలం మెల్లగా చప్పరిస్తుంటే హాయిగా , హుషారుగా ఉంది.
" అక్కయ్య కు మంచి సంబంధాలు వస్తున్నాయి. ". కొడుకు మొహం లోకి చూస్తూ అన్నాడు కరీంఖాన్.
" ఆలస్యం ఎందుకు ? అన్ని విధాలా మనకు సరిపోతే ఖాయం చేసేయండి . డబ్బు గురించి ఆలోచించవద్దు. "
ఆ భరోసా తో తృప్తి గా నిట్టూర్చాడు తండ్రి.
" మీరిద్దరూ కలిస్తే నా పెళ్ళి విషయం తప్ప వేరేమీ మాట్లాడుకోరా ? చిరు కోపం నటిస్తూ టీ గ్లాసులు లోపలికి తీసుకెళ్ళింది యాకూబ్ అక్క.
దూరంగా విష్ణు మూర్తి ఆలయం నుండి గంటలు వినిపించాయి.
" స్వామి వారికి ఆరగింపు అయింది. అమ్మ వచ్చేస్తుంది. నేను స్నానానికి వెళుతున్నా ". ఏ కాలంలో నైనా రెండు పూటలా స్నానం చేసే అలవాటు కరీంఖాన్ కు. పగలంతా కుట్టు మిషను తో కుస్తీ పడే ఆ ఆరు పదుల శ్రమజీవికి స్నానం చేస్తేనే ప్రాణం లేచొస్తుంది.
తండ్రి వెళ్ళాక యాకూబ్ మంచం పై వాలి చుక్కలకేసి చూస్తూ ఆలోచిస్తున్నాడు. తను చీకటి వ్యాపారం కొద్ది రోజుల లోనే కుప్పకూలారు తుంది . సందేహం లేదు. ఇంతియాజ్ పట్టుదల చూస్తుంటే భయం వేస్తుంది. ఈ మార్గం అతి త్వరలో మూసుకు పోతుంది. తనిక హుషారు కావాలి. అక్క పెళ్ళికి దాచిన సొమ్ము అబ్బాజాన్ కి ఇచ్చి వేయాలి. అలాఅనుకుంటూ లేచి కూర్చున్నాడు. అమ్మ వచ్చింది.
" దిల్ ( దిల్ రుబా) ఇంట్లో ఉన్న కూతురుకు వినిపించేలా కేక పెట్టింది .
" బుట్టలో ఏముందమ్మా ? యాకూబ్ అడిగాడు .
" స్వామి వారి ప్రసాదం " చెప్పింది .
కరీం ఖాన్ చదువు ప్రాధమిక స్థాయి దాటలేదు . ఫక్తు పల్లెటూరి అమాయకజీవి . అతడి భార్య ఇంటర్ వరకు చదువుకుంది . లోకం పోకడ తెలుసు . లౌక్యం తెలుసు. నేటి సమాజంలో ఎలా బతకాలో తెలుసు. అయిదుగురు సంతానం. అందులో నలుగురు ఆడపిల్లలు. భర్త చాలీచాలని సంపాదనతో ముగ్గురు ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయటం ఆషామాషీ కాదు. ఆమె ఓర్పు, నేర్పు కరీంఖాన్ కు అల్లా ఇచ్చిన వరాలు. ఆమెలో ఉన్న గొప్ప గుణం స్నేహం అంటే ప్రాణం పెట్టటం.
ఫాతిమా తియ్య పొంగలిని సమానంగా నాలుగు కప్పుల్లో సర్దింది. బెల్లం, బియ్యం , ఆవునెయ్యి, చిక్కటి పాలతో కలిసిన పొంగలి ఘుమఘుమలాడుతోంది.
కరీంఖాన్, దిల్ రుబా పొంగలి తియ్యదనాన్ని ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. యాకూబ్ కప్పును కనీసం తాకలేదు.
" నువ్వు తినలేదేం పొంగలి నీ కిష్టం కదా "
" అది పొంగలి కాదు ప్రసాదం. "
కొడుకు అభ్యంతరం ఫాతిమా కు అర్థమైంది.
" పొంగలి ప్రసాదమైతే ఏమవుతుంది ? తింటే అల్లా శపిస్తాడా ? మాకు మాత్రం అలాంటి భయాల్లేవు. మేము ప్రసాదమనే తింటాం . నువ్వు పొంగలి అనుకునే తిను. కొంపలేం మునగవు. "
ఇంత చెప్పినా యాకూబ్ లో చలనం లేదు.
" నీకు ఈ ప్రసాదం లో విష్ణు మూర్తి కనబడుతున్నాడు. నాకు రెడ్డి గారి భార్య వర్థనమ్మ అభిమానం కనబడుతోంది.
అన్నీ ఊహలే. ఏది నిజం . ఏది కాదు. "
క్షణం తటపటాయించి యాకూబ్ కప్పు తీసుకున్నాడు.
ఫాతిమా పెదవులపై చిరునవ్వు.
********
సాయంకాలం భాగ్యనగరం పై చల్గ గాలులు మెల్లమెల్లగా వీస్తున్నాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అన్వర్ సమంతా సదన్ మెయిన్ గేటు ముందున్నాడు. సర్వీస్ ఆటో కోసం అతని నిరీక్షణ.
ఆ సందులో ఓ ఇంటి ముందు ఆటో ఆగింది. దాదాపు పదిహేడేళ్ల తర్వాత ఆ సందు లో అడుగు పెడుతున్నాడు.
ఇప్పుడు ఆ గల్లీ స్వరూపమే మారిపోయింది. చాలా చిన్న చిన్న ఇళ్ళు షొపులుగా మారిపోయాయి. రద్దీ పెరిగిపోయింది.
ఇంటి మెట్లెక్కుతుంటే గుండె లయ తప్పింది. గుమ్మం ముందు ఆగి తలుపు తట్టడానికి కొంచెంసేపు తటాపటాయించాడు. చివరికి ధైర్యం చేశాడు.
" కౌన్" తలుపు తెరచిన వ్యక్తి ని చూసి విస్తుపోయాడు. అయిదు నిమిషాల్లో విషయం మొత్తం తెలిసిపోయింది.

కొనసాగించండి 33