Read Those three - 29 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 29

హాలంతా గుడ్డి వెలుతురు. ఏమీ కనిపించటం లేదు. గుండెల్ని తరిమే నిశ్శబ్దం. పది నిమిషాల తర్వాత ఎక్కడినుండో ఓ వాయిస్ వినిపించింది. ఆ వాయిస్ లో ఎమోషన్ ఉంది . లాజిక్ ఉంది. ఎలాంటి విషయాన్నైనా ఒప్పించే నేర్పు ఉంది. మీడియం మాడ్యులేషన్ లో, చక్కని ఉర్దూ లో విషయం వివరించే విధానం మిమ్మల్ని కట్టిపడేసింది. అతడు మిమ్మల్ని కొంతకాలం ఇస్లాం మరిచిపొమ్మన్నాడు. మేము ముస్లిం అన్న విషయం కూడా మరిచి పొమ్మన్నాడు. మా కిచ్చిన పాత్ర లో నేర్పుగా ఇమిడిపొమ్మన్నాడు . యువశక్తి బలపడితే గాని సమాజంలో ముస్లిం ల బలం పెరగదు. జీహాద్......... రాజకీయ రంగు పులుముకున్న జీహాద్ యువకుల్ని బలి తీసుకుంటుంది. అందుకే మా సోషియో - ఎకనామిక్ స్టేటస్ పెంచుకొమ్మన్నాడు. డ్రగ్స్ మత్తులో పడి భారతజాతి బలహీనపడుతుంది. వారి బలహీనతే మా బలం. చేతినిండా కాసులు. ప్రాణభయం లేదు. సింపుల్ హ్యాకర్స్ వర్క్. మాలాంటి పేదలకు ఇంతకన్నా ఏం కావాలి ?" యాకూబ్ పెదవులపై తృప్తి కలగలసిన చిరునవ్వు.
"అన్వర్ అడ్రస్ ఏమిటి ? అతడెలా ఉంటాడు?" చివరి ప్రశ్న.
" అన్వర్ ఈ మహానగరంలో ఏ మూల ఉంటాడో తెలియదు.
తెలుసుకోవలసిన అవసరం కూడా లేదు. నన్ను కలవడానికి గంట ముందు ఫోన్ చేస్తాడు. ఎక్కడ కలవాలో చెబుతాడు.
అక్కడి కెళ్ళి మాల్ తీసుకుంటాను. నా కమీషన్ పోను కలెక్షన్ చెల్లిస్తారు. అయిదు నిమిషాల్లో పని పూర్తవుతుంది.
తర్వాత ఎవరి దారి వారిదే ".
అన్వర్ ఎలా వుంటాడో, అతడి రూపురేఖలు, మాట తీరు,
మొబైల్ వెండార్ పాత్ర.... అన్నీ యాకూబ్ వివరంగా చెప్పాడు.
" మెహర్ ! మీరు ఊహించిందే కరెక్ట్ ."
ఆదిత్య వైపు అర్థం కానట్లు చూసింది మెహర్. " తనేం ఊహించింది " ఆ మాటే అడిగింది . చెప్పే ముందు రెండు క్షణాలు ఆగాడు ఆదిత్య. అతడిలో సంకోచం. అన్వర్ కు సంబంధించిన నిజాన్ని ఎలా చెప్పాలి? " అతడి మౌనం మెహర్ని మరింత అయోమయంలో పడేసింది.
" అన్వర్ anti social element. ఓ డ్రగ్స్ రాకెట్ లో
Key person. ఉగ్రవాది కూడా." మెల్లగా చెప్పాడు. చెప్పినా తర్వాత ఆమె మొహం చూసే సాహసం చేయలేకపోయాడు.
ఆమె outburst అవుతుందనుకున్నాడు. కానీ ఆమె కాలేదు. మంచు శిల్పంలా కదలిక లేకుండా ఉండిపోయింది. ఆదిత్య మూడు వాక్యాలు ఆమెను కృంగదీశాయి. ఈ స్థితి చాలా ప్రమాదకరమైనది. వెంటనే ఆమెలో చలనం రావాలి. అందుకే భుజంపై చెయ్యి వేసి చనువుగా దగ్గరకు తీసుకున్నాడు. అంతే అతడి గుండెల్లో తొలి పెట్టి మౌనంగా రోదించింది.
వారున్నది పబ్లిక్ ప్లేస్... పార్క్. వారి దరిదాపుల్లో ఎవరూ లేరు. అందుకే ఆదిత్య తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. కాసేపటికి తేలిక పడి తేరుకుంది మెహర్.
" అన్వర్ వివరాలు ఇంత త్వరగా మీకెలా తెలిసాయి. ?
తను 'బి' స్కూల్ లో చేరకముందు , చేరిన తర్వాత జరిగిన సంఘటన ల వివరాలు క్లుప్తంగా వివరించాడు ఆదిత్య.
" అన్వర్ ఉగ్రవాది అనుకొని షాకయ్యాను. కానీ బయటపడలేదు. అన్వర్ ను డిపార్ట్మెంట్ పట్టుకోకముందే
నేను కలవాలి. అమ్మ నిరీక్షణ, మీ ఫీలింగ్స్ అతడికి చెప్పాలి. అతడి లో మార్పు రావాలి. ప్రభుత్వం దృష్టిలో ఉగ్రవాదిగా ముద్ర పడకముందే మనిషిగా మీ అమ్మను కలవాలి."
" అన్వర్ ను కలవద్దు ఆదిత్యా "
అర్థం కానట్లు చూశాడు ఆదిత్య." అతడి వివరాలు తెలిసిన తర్వాత ఎందుకు కలవద్దంటున్నారు. ?
"ఒక ఉగ్రవాదిని కలవటం చాలా ప్రమాదకరం. అతడు సమాజానికి, మనుషులకు దూరమయ్యాడు. మనం చెప్పే మాటలు అతడిని కదిలిస్తాయి న్న నమ్మకం నాకు లేదు . అతడు కనిపించలేదన్న దిగులుతో అమ్మ తొందరగా దాటుకున్నా ఫర్వాలేదు.తనో రాక్షసుడని తెలిసి అమ్మ గుండె బద్దలవటం నేను తట్టుకోలేను." మెహర్ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఆమె పరిస్థితి కి ఆదిత్య కరిగి పోయాడు.
మీ అమ్మ మాట ఇచ్చానని ఈ ప్రయత్నం చేయటం లేదు. అతడు మారుతాడన్న నమ్మకం నాకుంది. ఒక మృగం మనిషిగా మారటం, అటు సమాజానికి ఇటు మీకూ మేలే . కచ్చితంగా అతడు మతోన్మాది కాడు. కారణం ఏదైనా అతడు సభ్య సమాజంలోకి వచ్చాడు. గన్ చేతిలో లేదు. మొబైల్ వెండార్ గా నటిస్తున్నాడు. ఇప్పుడు అతడిని నడిపిస్తున్నది ఆవేశం కాదు. అతడు చేసే పనికి అడుగడుగునా జాగ్రత్త కావాలి. చక్కటి ఆలోచన కావాలి.
ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నప్పుడు అతడి లో మార్పు రాదని ఎందుకనుకోవాలి? లెటజ్ బి పాజిటివ్ ".
విని ప్రశాంతంగా నవ్వింది మెహర్.
" మీ నమ్మకం నేనెందుకు కాదనాలి ? నాకోసం మీరంత ఆరాటపడుతున్నప్పుడు నేనెందుకు అభ్యంతరం చెప్పాలి ?"
" ఇంతియాజ్ అన్వర్ కోసం ఆకలితో ఉన్న సింహం లా ఉన్నాడు. మీ అన్నను వెదికే ప్రయత్నాలు ముమ్మరం చేస్తాడు. ఈ లోపలే అన్వర్ ని ట్రేస్ ఔట్ చేయాలి. ముందు అతడి కంప్యూటర్ ఇమేజెస్ డెవలప్ చేయాలి . తను అన్వర్ ని ఎక్కడెక్కడ కాలుస్తారో యాకూబ్ వివరంగా చెప్పాడు. ఆ ప్రదేశాల్లో ఒక్కరోజు లోనే అన్వర్ ని వెదకాలి. ఇంతియాజ్ కు అసలు విషయం అవకాశం ఇవ్వకూడదు. నా వానర సేనను రేపే రంగం లోకి దింపుతాను. రేపు సాయంత్రానికి అతని వేర్ అబౌట్స్ నాకు కావాలి."
అతడి పట్టుదల చురుకుదనం చూసి మెహర్ మళ్ళీ నవ్వింది.
" మీరే ఏ.సి.పీ లా తొందరపడుతున్నారే?"
ఆదిత్య సహజ చిరు మందహాసం.


కొనసాగించండి 30