Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

జీవితము అంటే ఏమిటి????

🌹జీవితము అంటే ఏమిటి?????

🌹మనిషి పుట్టుకకు చావుకు మధ్య ఉండే సమయం జీవితం ....మనం అబ్బాయిగా పుట్టాలా, అమ్మాయిగా పుట్టాలా, ఏ ఊరిలో పుట్టాలి .అనే విషయాలను మనం నిర్ణయించలేము.... అలాగే మనం ఎన్ని సంవత్సరాలు జీవిస్తాము. అనే విషయం కూడా మన చేతిలో లేదు... మనిషి ఈ భూమిపై పూర్తిగా ఉండే సమయం 100 సంవత్సరాలు అయితే, అది 36,525 రోజులతో సమానము.... మీకు ఊహ తెలిసే సరికి మీ వయస్సు 6 సంవత్సరాలు అయితే ఆ సమయం పూర్తిగా మీ ఆధీనంలో లేదు....

🌹ఉదాహరణకు ఇప్పుడు మీ వయసు 15 సంవత్సరాలు అయితే ,ఇప్పటికీ 5475 రోజులు ఖర్చు అయిపోయినవి.....మన జీవితంలో సగం పైగా సమయం నిద్రకూ, ఆహారానికి ,వినోదాలకు ఖర్చు అవుతుంది.... ఈ విధంగా చూస్తే మన అభివృద్ధికి ,ఏవైనా గొప్ప లక్ష్యాలను సాధించటానికి ,మనకు మిగిలే సమయం ఎంత అనేది, ఎంత విలువైనది, అర్థమవుతుంది.....

🌹మనం పుట్టుకకు ముందు మనము లేము.... మనం మరణం తర్వాత ఈ భూమిపై ఉండము... అంటే ....జీవితం అంటే మనం ఈ భూమిపై గడిపే సమయం.... అది అత్యంత విలువైనది .....అని గమనించవచ్చు... జీవితం అంటే సమయమే .....సమయాన్ని బాగా ఉపయోగించటమే.... అంటే జీవితాన్ని సార్థకం చేసుకోవటము......

🌹ఉదాహరణకు ఒక కోటీశ్వరుడు అయిన వ్యక్తి గుండెపోటుకు గురయ్యాడు అనుకుందాము... ఆయన కుమారుడు ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నా 20 మంది వైద్యులను పిలిచి, తన తండ్రిని 20 నిమిషాల పాటు స్పృహలోకి తేవడానికి 20 కోట్లు ఇస్తాను, అని చెప్పినా ...కూడా ఆ వైద్యులు ఆ విషయంలో కచ్చితంగా మాట ఇవ్వలేరు .....

🌹మన జీవితంలో సమయం ఖర్చు పెడితే చేయి జారిపోతుంది.... మన ప్రమేయం లేకుండానే మనము ఏ పని చేయకుండా కూర్చున్న సమయం దొర్లిపోతుంది... ఒక్కొక్క క్షణం వజ్రం కంటే విలువైనది..... అందువలన సమయం దుర్వినియోగం, జీవితం దుర్వినియోగముతో సమానం. ....మనం ఖర్చు చేసే ప్రతి నిమిషము ఎటువంటి పనిమీద చేస్తున్నాము ,అనే విచక్షణ అవసరము.... అలా ఆలోచించి చేసే వ్యక్తి, తనకున్న పరిమిత కాలాన్ని మంచి విధానములో ఉపయోగించుకుంటాడు....

🌹అందుకే మనం ప్రతి క్షణాన్ని విజ్ఞతతో, ప్రయోజనాత్మకముగా మనకి గాని, మన తోటి వారికి గాని, మన సమాజానికి గాని, ఉపయోగపడే, విధంగా ఉపయోగించాలి...... ఎవరైతే తాము చదువుకొనే సమయాన్ని జీవితాన్ని విలువైనదిగా మార్చుకోవటానికి నిరంతరము విజ్ఞానాన్ని సంపాదించుకుంటూ వినియోగిస్తారో,,, వారి జీవితాన్ని సక్రమమైన మార్గంలోనికి నడుపుకోగలుగుతారు...... చదువు అనేది తల్లిదండ్రుల కోసమో, కేవలం డబ్బు సంపాదించే తెలివితోటల కోసమో, కాకా ఇష్టముతో గొప్ప లక్ష్యాలను ,సమాజానికి మంచి చేసే గమ్యాలు సాధించాలని, ఆశలతో చదివిన వ్యక్తి క్రమంగా పేరు ప్రతిష్టలు, మంచి పేరు సంపాదించి ,తన తల్లిదండ్రులకు, కుటుంబానికి ,ఊరికి ,దేశానికి గౌరవ ప్రతిష్టలు సంపాదించగలుగుతాడు.....

🌹దురలవాట్లకు బానిసై, కేవలం డబ్బు సంపాదన కోసమే, తాత్కాలిక ప్రలోభాలకు గురై, అవినీతితో అక్రమ మార్గాలలో, పయనించే వ్యక్తి కాలక్రమములో అనేక ఇబ్బందులు, ఎదుర్కొని తన జీవితాన్ని చేజేతులా పాడు చేసుకుంటాడు.... దానివలన తనకే కాకుండా, తన వలన సమాజానికి కూడా, చెడు జరుగుతుంది.... మనం చేసే పనుల పైన, మన అలవాట్ల పైన ఆధారపడి మన జీవితం ఉంటుంది .....అంటే మనం ఈరోజు చేసే పనులు మన జీవిత భవిష్యత్తును నిర్ణయిస్తాయి..... తను చేసే పనులకు నిర్మాణాత్మకంగా, అభివృద్ధి దృష్టితో చేసినప్పుడు ప్రతి మనిషి జీవితంలో అభివృద్ధి తధ్యము.... ఎంతటి పేద కుటుంబంలో జన్మించిన, ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న, తన సమయాన్ని విచక్షణతో సంపూర్ణ ఏకాగ్రతతో ఉపయోగించుకునే వ్యక్తి, కాలక్రమములో గొప్ప వ్యక్తిగా రూపాంతరము చెందుతాడు .....

🌹అబ్దుల్ కలాం గారు, 15 అక్టోబర్ 1931 రామేశ్వరంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు.... చిన్నతనంలో చదువుకోవడానికి ధనము లేని కారణముతో, న్యూస్ పేపర్ ను పంచేపని ఉదయం సమయంలో చేసి, గొప్ప శాస్త్రవేత్త కావాలనే లక్ష్యమును కలలు కనేవాడు... అలా శాస్త్రవేత్తగా భారతదేశం గర్వించదగ్గ నాయకునిగా, భారత ప్రెసిడెంట్ గా, భారతరత్నగా, గొప్ప రచయితగా, ఎదిగి ఆయన జీవితాన్ని ఎంతో మంది ఆదర్శంగా తీసుకునే విధంగా ఎదిగారు..... దానికి అంతటికి మూలం, ఆయన తన జీవితంలో పాటించిన నియమాలు, సిద్దాంతాలు, గొప్ప అలవాట్లు... అంటే మనం కూడా మన జీవితాన్ని క్రమశిక్షణతో మలచుకుంటే గొప్ప నాయకులుగా ఎదగటం సులభ సాధ్యమని అర్థమవుతుంది .....


🌹స్వామి వివేకానంద సూక్తి 🌹
"నిలబడు, బలముతో ప్రయత్నించు, ఈ జీవిత బాధ్యతను మొత్తాన్ని నీ భుజస్తంభాలపై స్వీకరించు... నీ జీవిత గమ్యాన్ని నీవే సృష్టిస్తావు ....దానికి కావలసిన సకల శక్తి సంపదలు నీలోపలే దాగి ఉన్నాయి.... వెలికి తీసి నిన్ను నీవు నిర్మించుకో "......

🌹మనము జీవిత సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా?????

🌹నీవు ఒక రోజులో, హరంలో, నెలలో సంవత్సరంలో, చేయవలసిన పనులు ఒక ప్రణాళిక వేసుకొని, రాసుకోవాలి .....మలుపులు, ఏమిటి అనే దానిపై మనకు ఒక ఖచ్చితమైన అవగాహన వస్తుంది..... మనం మనసు నిండా మనం సాధించాల్సిన లక్ష్యాలపై దృష్టి ఉన్నప్పుడు ,మన సమయం ప్రతిక్షణం సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది..... ప్రతిరోజు నిద్రలేస్తూనే మనకు ఇంత గొప్ప మానవ జీవితాన్ని ప్రసాదించిన దైవానికి, తల్లిదండ్రులకు, గురువులకు, మానసికముగా కృతజ్ఞతలు తెలుపుకొని ,మన ముందున్న ఈ అపురూపమైన రోజును వినూత్నముగా సృజనాత్మకతతో ఎలా ఉపయోగించాలి...? ఈ రోజుల్లో మనం సాధించవలసిన పూర్తి చేయవలసిన విషయాలు ఏమిటి ?అనేది గుర్తు చేసుకోవాలి ...గంట గంటకు ప్రణాళిక వేసుకోవాలి... ఆ పనులు మన లక్ష్యం వైపు, మనల్ని తీసుకువెళ్లేవి అయి ఉండాలి...అప్పుడు మనం ప్రతి క్షణాల్ని సద్వినియోగం చేసుకుంటాము... మనము పనులు చేయుటము ప్రారంభించినప్పుడు, అనేక శక్తులు ,పరిస్థితులు ,వినోదాలు, స్నేహితులు ,మన దారి నుండి పక్కకు లాగే ప్రయత్నాలు చేయవచ్చు... మనం నిగ్రహముతో జీవించి మనం మన ప్రణాళికకు కట్టుబడి ఉండాలి.... ఎటువంటి పరిస్థితిలోనూ మనం అనుకున్న లక్ష్యాలకు కట్టుబడి ఉండాలి.... మనం అనుకున్నది సాధించినప్పుడు, మనలను దారి మళ్లించిన వారే మనల్ని గుర్తిస్తారు... అది మనం ఎప్పుడూ గుర్తించుకోవాలి. మనం చేసే పనులను ముఖ్యమైనవి త్వరగా చేయవలసినవి,
ముఖ్యమైనవి భవిష్యత్తులో చేయదగినవి,
ముఖ్యమైనది కానివి,
ముఖ్యమైనవి కానివి భవిష్యత్తులో చేయాలి అని మనం అనుకునేవి ,
అని నాలుగో విభాగాలుగా చేసి అందులో

🌹ముఖ్యమైనవి త్వరగా చేయవలసినవి ముందు ముగించాలి .....

🌹సాధ్యమైనంత వరకు ముఖ్యమైనవి భవిష్యత్తులో చేయగలిగినవి, ముఖ్యమైనవి త్వరగా చేయవలసినవిగా మారకుండా చూసుకోవాలి....

🌹మిగతా రెండు విభాగాలు ముఖ్యమైనవి కానివి, ,త్వరగా చేయాలి అని మనం అనుకునేవి ......

🌹ముఖ్యమైనవి కానివి, భవిష్యత్తులో చేయాలి... అని మనం అనుకునే పనుల కోసం తక్కువ సమయం కేటాయించాలి ....

🌹మనం చేసే పనుల ఫలితాలను ముందుగానే ఆలోచించి, మంచి ఫలితాలను మాత్రమే చేయాలి. మనం పనుల పర్యవసానాలను, వాటి వలన జరిగే ప్రయోజనాలను, అంచనా వేసుకోనప్పుడు మనం గుడ్డెద్దు చేలో పడ్డట్టు ప్రయాణం చేసే అవకాశం ....

🌹మన సమయం వృధా పనులపై గడిపే అవకాశం ఉంది ....అందువలన సంపూర్ణ విశ్లేషణతో ముందు చూపుతో మనం చేయబోయే పనులను అవగాహన చేసుకుంటూ, ముందుకు కదలాలి.... అంతే కాకుండా నీవు ప్రతి క్షణాన్ని ఆనందముతో నింపుకోగలవు.... మనం చేసే పనులలో వినోదానికి, క్రీడలకు ,20 శాతం లోపు సమయాన్ని మాత్రమే కేటాయించాలి.... అనవసరమైన సంభాషణలు, అతిగా టీవీ ప్రోగ్రాములు ,ఫోన్ లపై, నిరుపయోగమైన మాటలు తగ్గించి ,మన లక్ష్యాల వైపు ఉపయోగపడే పనులు కొనసాగించాలి.... ప్రతిరోజు పడుకోబోయే ముందు మనం అనుకున్న పనులు పూర్తి చేశామా లేదా !!అని ఆత్మ పరిశీలన చేసుకుని, డైరీలో రాసుకోవాలి... మనం సమయాన్ని ఎలా ఉపయోగించాము, మంచి పనులను ఏమి చేసినాము ,ఎటువంటి వృధా పనులు చేశాము, అనేది విశ్లేషించుకొని ,మనము రేపు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము, మన లక్ష్యాలను చేరుకోవడానికి మనం మార్చుకోవలసిన పద్ధతులను ,దాని కొరకు మనం పాటించబోయే ఉపాయాలను, ఆలోచించుకొని నిద్రకు ఉపక్రమించాలి....

🌹మనం చేస్తున్న పనిలో సంపూర్ణమైన ఏకాగ్రత ఉంచి ,దానిలో మెలకువలను పెంచుకుంటూ, కొత్త విధానాల ద్వారా తక్కువ శ్రమతో, ఎక్కువ ఫలితాలను సాధించే దిశగా పయనించాలి.... ప్రతిరోజు నిన్న కంటే మెరుగైన పద్ధతిలో మనం పనులు నిర్వహించగలము అని నమ్మి ,జీవితాన్ని గడపాలి అనుక్షణం ఆలోచన సాగించాలి.... మనం ఎదుర్కొనే ప్రతి సమస్యను ,సవాళ్లను మన చాతుర్యతతో ,బుద్ధిబలంతో పరిష్కరించవచ్చు.... మనం మెదడులో సాగే ఈ ఆలోచన మనలను సృజనాత్మకత వైపు నడిపిస్తుంది.....విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది....


🌹ప్రతి పనినీ మనం చేసే విధానంలో, చిన్న చిన్న అభివృద్ధి చేస్తూ పోయినప్పుడు ,కాలాంతరంలో ఆ మార్పు ఒక గొప్ప మార్పుగా మారుతుంది..... మనం ఏ రంగంలో అయితే ఎదుగుదము అనుకుంటున్నామో, ఆ రంగమ్మ గురించి సంపూర్ణ అవగాహన కొరకు, ప్రాక్టికల్ గా ప్రయోగాలు చేస్తూ ,అందులో ఉన్న నిపుణులతో ,సంభాషిస్తూ ,పుస్తకాలను చదువుతూ ,ఇంటర్నెట్లో సంభాషిస్తూ, విజ్ఞానాన్ని జిజ్ఞాసతో సంపాదిస్తూ, కొనసాగాలి.... ఈ విధమైన అలవాట్లు, మనలను, మనం ఎంచుకున్న రంగంలో సుప్రసిద్ధ వ్యక్తిగా మారుస్తాయి.... మనం ఎంచుకున్న గమ్యంలో ప్రయాణించి, విజయాన్ని సాధించిన వ్యక్తుల గురించి ,మనం తెలుసుకున్నప్పుడు ,వారి జీవిత సత్యాలు, వారి తీసుకున్న నిర్ణయాలు, మనలను ప్రభావితం చేస్తాయి ......మన జీవిత గమ్యానికి మనలను సిద్ధం చేస్తాయి..... మనలో ఉత్సాహాన్ని ,కార్యదీక్షను ,ఏకాగ్రతను, పెంపొందిస్తాయి ....నిరంతరము మనం చేసే కృషి ,పరిశోధన సంభాషణ, మనలో శక్తి సామర్థ్యాలను ,పెంచి ,మన మీద మనకు ఆత్మవిశ్వాసం పెంచుతుంది..... అనేక విషయాలు మనలను వరిస్తాయి......

🌹మనం గురి పెట్టిన, ఎటువంటి లక్ష్యాన్నైనా పూర్తి విశ్వాసంతో సాధించగలము...

🌹***జీవిత గమ్యాన్ని, లక్ష్యాలుగా మార్చుకుని సాధించటం ఎలా ????

🌹మన జీవిత గమ్యాన్ని, మనమే నిర్ణయించుకోగలము.... అది మనం చేసే పనులు ,ఆలోచనలు ,విధానాలు మరియు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది ....మన జీవిత కాలంలో, మనం నెరవేర్చే లక్ష్యాలన్నీ కలిపితే, మన జీవిత గమ్యముగా మారుతుంది..... అంటే మన జీవితంలో మనం చేసిన పనులు, చేసిన నిర్మాణాలు ,ఇచ్చిన కొత్త వస్తువులు, ప్రక్రియలు, అన్నమాట.... మనకు ఏది ఇష్టమైన పని అనేది మనం నిర్ణయించుకొని, నెరవేర్చాలనుకున్న లక్ష్యాలను గుర్తించి, మనం వాటిని సార్థకం చేసుకునే దిశగా, అడుగులు వేయాలి....

🌹రాబోయే రెండు సంవత్సరాలు ,5,10,15,20,25,30 సంవత్సరాల లో నీవు సాధించాలనుకున్న అన్ని విషయాలను, ఒక్కసారి ప్రణాళికగా మార్చుకొని ,వాటిని సాధించే దిశగా, నిరంతరం కృషి చేయాలి..... అప్పుడు మనకు జీవిత గమ్యం పై ఒక నియంత్రణ వస్తుంది..... ఎప్పుడైతే ,నీవు నడవాలి అనుకున్న మార్గం జీవిత లక్ష్యాలు అవుతాయో ,నీలో అనంతమైన శక్తి ,ప్రేరణ రావడం జరుగుతుంది.... ఈ లక్ష్యాలను ఒక వాల్ పోస్టర్ లాగా, మార్చుకొని, వాటిని కాల పరిమితి విధించి, నిరంతరం వాటి గురించే నీ ఆలోచనలు, పనులు, సాగినప్పుడు ఆ లక్ష్యాలు అన్నింటినీ ,సాధించటం అనేది చాలా సులభమైన మార్గం......నీ ఆలోచనలు అన్ని నీ లక్ష్యాలతో నిండిపోవాలి....


🌹"మీ విజయాలు వెనుక రహస్యం ఏమిటని, ప్రసిద్ధ శాస్త్రవేత్త " న్యూటన్ " ని అడిగినప్పుడు, తను ,అహర్నిశలు ప్రయోగాల గురించి ఆలోచించడం ,అని చెప్పాడు.....🌹

🌹గొప్ప వ్యక్తులంతా,, తమ మెదడున లక్ష్యాల వైపు మాత్రమే ,ఆలోచించేలా తయారు చేస్తారు...

🌹ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు సమయాన్ని తీసుకొని, నీవు సాధించవలసిన లక్ష్యాలు, సాధించినట్లుగా, దర్శించాలి..... అప్పుడు, మన లక్ష్యాల వైపు మనం పయనిస్తాము .....మన మీద మనం ఒత్తిడి పెంచుకోవాలి.... లక్ష్యాలను సాధించడానికి కావలసిన సానుకూల ఒత్తిడిని కలిగించుకుంటూ, ఉండాలి ......మనం సాధించబోయే లక్ష్యాలను, ఇతరులకు చెప్పడం, ద్వారా వాటిని సాధించడానికి కావాల్సిన ఒత్తిడి మనకు కలిగి, మనలను నడుపుతుంది.... నీ పనికి, లక్ష్యాలకు ,కావలసిన మానసిక, బలాన్ని ప్రోత్సాహాన్ని, ఇచ్చే వ్యక్తులను సంపాదించు .....వారితో నిత్యమూ నీ లక్ష్యాల గురించి, వాటిలోని ఒడిదుడుకుల గురించి , చర్చిస్తూ ఉంటే నీకు ఆ లక్ష్యాలను సాధించగల స్ఫూర్తి లభిస్తుంది..... వాటి నుండి ప్రోత్బలము, విశ్లేషణ ,లభిస్తాయి.... ఏ పనినైతే మనము క్రమం తప్పకుండా 21 రోజులు చేసినట్లయితే , అది మనకు ఒక అలవాటుగా మారుతుంది.... ఆ తరువాత, ఆ అలవాటును మనము ఆనందించటం ప్రారంభిస్తాము.... అందువలన మనము మంచి అలవాట్లను, ఈ సిద్ధాంతం ద్వారా మన జీవితంలోకి ఆహ్వానించాలి.... మన లక్ష్యాలకు సబంధించిన అలవాట్లను పెంచుకోవాలి .......

🌹*****జీవిత విజయాలకు మూలము క్రమశిక్ష, మరియు పట్టుదల********🌹

🌹జీవితంలో ఏదైనా సాధించాలి అనుకుంటే మొదట అలవర్చుకోవాల్సిన లక్షణాలు, క్రమశిక్షణ మరియు పట్టుదల..... ఈ రెండు లక్షణాలు ఉన్నప్పుడు, ఏకాగ్రత అభివృద్ధి చెంది అనుక్షణం అభివృద్ధి సాధిస్తూ, నీవు అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతావు.... మనలో దాగి ఉన్న అంతర్గత శక్తి ఈ రెండు లక్షణాల ద్వారా బయటకు తీయవచ్చును...... అనవసరమైన విషయాలవైపు వెళ్లకుండా అవి నివారిస్తాయి.... మనకు స్వీయ నియంత్రణ వస్తుంది....

🌹పట్టుదల అనేది మన లక్ష్యం వైపునకు, మనం వెళ్లేటట్లు చేస్తుంది.... క్రమశిక్షణ అనేది మన లక్ష్యం పైన మన దృష్టి ఉంచి ,దానికి కట్టుబడి నమ్మకంతో కృషి చేయటాన్ని నేర్పుతుంది.... ఏ విషయంలోనైనా విజయం సాధించడానికి, ఏకాగ్రత మరియు నిరంతర కృషి అవసరము.... క్రమశిక్షణ ఈ విషయాలను మనకు అలవాటు చేస్తుంది ....మొదలు పెట్టినప్పుడు ఇవి కష్టం అనిపించినప్పటికీ, అలవాటుగా మారిన తర్వాత ,నిత్య సంతోషాలను మనకు అందించి, సానుకూల దృక్పథాన్ని పెంచి , పెద్ద పెద్ద విజయాలను మనము సాధించగలిగే విధముగా తయారు చేస్తాయి.... అన్ని విధాల అభివృద్ధి సాధ్యం....

🌹ఈ రెండు గుణాలు లేని వ్యక్తి మనసుకు బానిసై, అనవసరమైన ఆలోచనలను, ఆహ్వానించి, దృష్టి పనికిరాని పనుల వైపు మళ్ళించబడి ,వినోద ప్రధానమైన కార్యక్రమాలతో, తృప్తి పడిపోతాడు .....

🌹మహాత్మా గాంధీ, వివేకానంద, మదర్ తెరిసా, హెలెన్ కేల్లెర్, జీవితాలను గమనిస్తే ,వారు క్రమశిక్షణ మరియు పట్టుదల ఎలా వాడారో తెలుస్తుంది..... వారి విజయానికి ఇవే కారణాలు...... బయట ప్రపంచంలో విజయాన్ని సాధించాలంటే, మనము ముందు మనం మనసులో సాధించాలి.... మనలను మనం తక్కువ అంచనా వేసుకుంటే, విజయాన్ని సాధించలేము.... మనం పట్టుదలను నిశ్చయముగా ఉంచుకోవటం, అభ్యాసం చేస్తే, ఎటువంటి కలనైనా సాధించగలము.... మన ఏకాగ్రతతో మన లక్ష్యం వైపు, ఒక గురి పెట్టిన బాణం లాగా ఉన్నప్పుడు ,మన లక్ష్యమును తప్పక సాధించగలుగుతాము ......

🌹క్రమశిక్షణ ,పట్టుదల అనే లక్షణాలు ప్రతి మనిషిలోను అంతర్గతంగా దాగి ఉంటాయి..... వాటిని నిరంతర సాధన, ద్వారా బయటకు తీయవచ్చును.... ఒకసారి వాటిని వాడడం మొదలు పెట్టిన తర్వాత ,అవి క్రమ క్రమముగా బలముగా మారి ,గొప్ప విజయాలను సాధించడానికి, మనిషిని నడిపిస్తాయి.... వీటి వలన మన లక్ష్యము ఎంత కఠినమైనను,, దానిని సాధించడానికి, నిరంతర ప్రయత్నం చేస్తాడు .....మనలో అంతర్గతంగా ఉండే భయాలు ,ఆందోళనలు, ఆలోచనలు ,మన శక్తిని తగ్గిస్తూ ఉంటాయి.... కానీ ఈ రెండు లక్షణాలు, ఆ బలహీనతల నుండి మనలను రక్షించి గొప్ప విజయాలు ,సాధించే విధముగ చేస్తాయి ....

🌹మనం చాలా విషయాలు సాధించాలి అని అనుకుంటాము.... కానీ మనము సాధించాలి అనుకున్న విషయంపై ఇష్టాన్ని పెంచుకోము.... దాని వలన ఆ పని మనకు ఇబ్బందిగా అనిపిస్తుంది.... మనము అలసిపోయినట్లుగా, అయిపోతాము.... ఈ స్థితి నుండి బయటకు వచ్చినప్పుడు, మనం అనుకున్న విజయాలను తప్పక సాధిస్తాము.... ఈ రెండు లక్షణాలు అందుకు సహాయం చేస్తాయి.... మన జీవితంలో నిజమైన ఆనందం, లక్ష్యాలను చేసుకుని వాటిని సాధించటం ద్వారానే వస్తుంది ....

🌹మన జీవిత చివరి దశలో ,మనము వెనుకకు తిరిగి చూస్తే ,మనం సాధించిన విజయాలే మనకు ఆనందాన్ని ఇస్తాయి ....విజయము అంటే ! డబ్బు ,సంపాదన కాదు ....మానసిక శాంతి, అన్ని విధాల అభివృద్ధి చెందిన వ్యక్తిత్వం, క్రమశిక్షణ మరియు పట్టుదలలు మనిషిని తన లక్ష్యాలు సాధించే విధముగా నడిపించి ,ప్రోత్సహించి ,ప్రేరేపించి మరియు స్ఫూర్తినిచ్చి,విజయాలు సాధించే విధముగా తయారు చేస్తాయి.......

🌹🌹🌹🌹 దన్యవాదములు 🌹🌹🌹🌹
🌻🌻🌻🌻🌻 జై హింద్ 🌻🌻🌻🌻🌻