Those three - 18 books and stories free download online pdf in Telugu

ఆ ముగ్గురు - 18 - లక్కవరం శ్రీనివాసరావు

విశ్వనాథ శాస్త్రి గారి లోగిలిలో సందడి. అమల కొత్త బట్టల్లో మెరిసిపోతుంది . శాస్త్రి కి , సునీతకు పాదాభివందనం చేసింది. అమల తమ్ముడు ఆనందంతో చప్పట్లు కొడుతూ
అక్కను ' హాపీ బర్త్ డే టు యూ' అని అభినందిస్తున్నాడు.
అనంత్ రామ్ ( అన్వర్) వారినే కన్నార్పకుండా చూస్తున్నాడు . పెదవులపై చిరునవ్వు. కళ్ళల్లో నీలినీడలు .
" అన్నయ్యా " అమల అనంత్ రామ్ పాదాలు తాకింది.
" నేనా ?" అనంత్ రామ్ ఆశ్చర్య పడి పోయాడు .
" ఏం అన్నయ్య చెల్లెల్ని దీవించడా ?" సునీత అనింది.
ఆ మాటలకు అనంత్ రామ్ కళ్ళు మెరిసాయి. అక్షింతలు చల్లి అమలు తలను ప్రేమగా నిమిరాడు. జేబులోంచి యాభై రూపాయల నోటు తీసి అమలు చేతిలో పెట్టాడు.
" ఈ అన్నయ్య చిరు కానుక".
" కానుక విలువ డబ్బు తో కాదు . మనసుతో కొలవాలి."
అనంత్ రామ్ భుజం తడుతూ అన్నాడు విశ్వనాథ శాస్త్రి .
" మాకు బర్త్ డే స్పెషల్ ఏమిటో ?" కుతూహలంగా చూశాడు అనంత్ రామ్ అమలను.
" ఈ సాయంత్రం సమతా సదన్ సభ్యులకు మా ఇంట్లో కమ్మని విందు భోజనం" వివరణ ఇచ్చాడు విశ్వనాథం.
" అమ్మా ! మన వాళ్ళందరి బ్లెస్సింగ్స్ ......" అమల అమలు తమ్ముడు బయటకు వెళ్ళి పోయారు . అనంత్ రామ్ ఆలోచనలో పడ్డాడు.
" చెల్లెలు గుర్తు కొచ్చిందా ?" ఆప్యాయంగా అడిగింది సునీత.
చిరునవ్వు నవ్వాడు. గ్రామం లో తనకు అమ్మ, చెల్లి, తమ్ముడు ఉన్నారని, నాన్న లేరని ఓ సెంటిమెంటల్ కధ అల్లి సమతా సదన్ సభ్యుల ప్రేమ కొల్లగొట్టాడు. సునీత స్పందనకు రెఫరెన్స్ ఈ కధే !
" ఓ సారి మీ చెల్లెల్ని ఇక్కడకు తీసుకు రారాదా ? ఆ అమ్మాయి, అమలు కలిసి సరదాగా గడుపుతారు ." విశ్వనాధం సూచన .
" అవును అనంత
రామ్ ! ఆ పని చేయి . నీకు , మాకు కాస్త కాలక్షేపం గా ఉంటుంది ." సునీత వంతు పాడింది. అనంత్ రామ్ చిరునవ్వు తో తొలి వూపాడు .
గౌతం అంతరంగంలో కలకలం రేపగా సాయంకాలం విందుకు వస్తానంటూ పైకి వెళ్ళి తన గదిలో వాలు కుర్చీలో
నీరసంగా కూలిపోయాడు . ఆ రోజు తనకు శెలవు. డ్యూటీ లేదు . అతడి లో అంతర్మధనం మొదలయ్యింది.
పదిహేనేళ్ల వయసు , లోకం పోకడ తెలీదు, తెలిసీ తెలియని మానసిక స్ధితి, ఇంటి పరిస్థితి మీద విరక్తి, అబ్బాజాన్ పై కోపం , తన్నుకొస్తున్న ఏడుపు, రోషం , బింకం , ఇల్లు వదిలి వచ్చినప్పుడు తన మెంటల్ కమోషన్ అది . ఆ రోజు రాత్రి ఎక్కడెక్కడో పిచ్చి గా తిరిగాడు . ఆకలి పేగుల్ని నలిపేస్తోంది. అమ్మీజాన్ గుర్తొచ్చింది.
ఆ ఇంటి అరుగు మీద మోకాళ్ళలో తల దూర్చి రాయిలా కూర్చుండి పోయాడు. చెలి వణికిస్తోంది. ఆకలి వల్ల కంటి మీద కునుకు లేదు. మరి కాసేపట్లో తెల్లవారుతుందనగా
మీర్ కాశిం పరిచయమయ్యాడు.
అతడాక్షణంలో రాకుంటే, మరి కాస్త సమయం జరిగుంటే
తను తప్పక ఇంటికి వెళ్ళి వుండేవాడు. ఆకలి, ఒంటరి తనం , భయం తన కోపాన్ని, తెల్లవారుజామున పొగమంచు లా కరిగించి వేశాయి . కానీ విధి మరోలా ఉంది . కాశిం తన భుజం పై చేయి వేసి పలకరించిన తీరు తనకు ఊపిరి పోసినట్లైయింది .. ముందు తనకు నాలుగు సన్నులు, రెండు గ్లాసుల వేడి పాలు ఇప్పించాడు . ప్రాణం కుదుట పడినట్లైయింది . ఇంటి మీద ధ్యాస తగ్గింది. అతడు తన కన్నా అయిదారేళ్ళు పెద్దవాడు. పొడుగ్గా, బలంగా ఉంటాడు.
మనసులో కరకుదనం మొహం మీద స్పష్టంగా కనపడుతుంది . ఆ కరకుదనం వెనుక ఎన్నో భావాలు ! పరిస్థితి కి తగినట్లు మాట తీరు , స్వరం మార్చగలడు. చాలా నెమ్మదిగా, నిలకడగా మాట్లాడుతాడు. అంత చిన్న వయసులోనే అతడు సంపాదించిన లోకానుభవం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు . అప్పుడప్పుడు భయమేస్తుంది. ముఖ్యంగా జీవితానికి సంబంధించిన కొన్ని చేదు నిజాలు చెబుతున్నపుడు .
తనను ఇంటికి వెళ్ళొద్దని చెప్పలేదు. అసలు అప్పుడే ఎందుకు వెళ్ళాలి ? మరో నాలుగు రోజులు ఇంటికి వెళ్ళక పోతే అమ్మా నాన్నా కంగారు పడతారు. తన మీద మరింత ప్రేమ పెంచుకుంటారు. తన విలువ తెలిసొస్తుంది. అప్పుడు తను వెళితే తన బలం పెరుగుతుంది . తను ఆడింది ఆట పాడింది పాట. !
ఈ లాజిక్ తనను అతడి మాటలకు గంగిరెద్దులా తొలి వూపే స్థితికి తీసుకు వచ్చింది . ఆ తర్వాత జరగవలసిన అనర్థం చాలా సహజంగా జరిగిపోయింది.
హద్దు ల్లేని స్వేచ్ఛ, ఈజీ మనీ తనకు సంకెళ్లు అయినాయి. అతడి మాటలు ఇంద్రజాలం చాలా పవర్ ఫుల్. అతడు తన లోని బలహీనతను గమనించాడు. అందుకు తగినట్లుగా తనకు రంగుల లోకం చూపించాడు . అతడి చీకటి ప్రపంచం లో ఏ కట్టుబాట్లు లేవు . తప్పొప్పుల ప్రసక్తే లేదు . అనుకున్నది సాధించటం ఒక్కటే . అది ఎలాగైనా సాధించటమే ముఖ్యం.
మాటలతో ప్రపంచం మీద కసి పెంచాడు . నెమ్మదిగా మతం వైపు మళ్ళించాడు. మొదట్లో తనకు బాగా సంపాదించి ,
తన ప్రయోజకత్వం నిరూపించుకొని , అప్పుడు ఇంటికి తిరిగి వెళ్ళాలన్న కోరిక ఉండేది.
కాని తనకు తెలీకుండానే ఆ చీకటి ప్రపంచం లో ఇరుక్కు పోయాడు. సభ్య సమాజం లో ధైర్యంగా తిరగలేని పరిస్థితి.
' టోటలీ ఎంటాంగ్ల్డ్' రాను రాను ఇంటి కి తిరిగి వెళ్ళే ఆశ ఆవిరైపోయింది. రోబో లాంటి బ్రతుకు . సెంటిమెంట్స్ లేవు. ...సెన్స్ టివిటీ లేదు. ఒక యంత్రం లా , ఒకరి చేతుల్లో ఆయుధం లా ! ఇందుకు తను ఎవర్నీ తప్పు పట్ట దలచుకోలేదు. మీర్ కాశిం ని గానీ . తనకు మార్గం లో ఎదురైన మరెవరైనా కానీ ....! బేసిగ్గా తను వారికి దొరకటమే తప్పు. ఇలా దొరికి పోవటం తన దురదృష్టం.
ఆ తర్వాత జీవితం ఎన్నెన్నో మలుపులు తిరిగి , చివరకు మిలిటెంట్ ట్రైనీ గా పి.ఓ.కే కు ఎగుమతి చేయబడ్డాడు. అంతే .......నాగరిక ప్రపంచంతో తన సంబంధం పూర్తిగా తెగిపోయింది. పై.ఓ.కే ట్రైనీ క్యాంప్ తన అంతరాత్మ ను
పూర్తిగా చంపేసింది. ఆ లోకంలో ఎప్పుడూ కనిపించేవి వినిపించేవి మతం ... మారణహోమం. ఏదో ఉద్రేకం,, ఉన్మాదం. తనకంటూ ఒక వ్యక్తిత్వం లేదు . ఆ రాక్షస మూకుడులో తానూ ఒకడు. అందరూ ఒకేలా ఆలోచించాలి...ఒకేలా ప్రవర్తించాలి.
ఆ వాతావరణం లో ఇమడలేని వాడికి అదో నరకం మవుతుంది. అటూ ఇటూ కాని పరిస్థితి. ఇది తను ఊహించని ,ఆశించని జీవితం. పోనీ మనసు రాయి చేసుకుని వీరితోనే జీవితం అని సరిపెట్టుకోవాలనుకుంటే
అట్టడుగున ఉన్న ఆత్మ బాధ గా మూలుగుతూ ఉంది.
అంతరాత్మను పూర్తిగా చెప్పుకోలేని అశక్తత.
తన ప్రమేయం లేకుండా పి.ఒ.కె వచ్చాడు. తన ఇష్టానికి
వ్యతిరేకంగా హైదరాబాద్ కు దిగుమతి చేయబడ్డాడు. తన చేతుల్లో, చేతుల్లో లేని జీవితం ఎంత కాలం గడపాలి. తనకు స్వేచ్ఛ అందని పండేనా ! అర్థం కాలేదు అన్వర్ కు .
గుండె బరువెక్కి మిగతా నిద్ర లోకి జారుకున్నాడు. కొందరికి నిద్ర వరం .
కొనసాగించండి 19



షేర్ చేయబడినవి

NEW REALESED