దివ్య వాళ్ళ ఇల్లు ఒక్క ఇంద్రభవణంలా ఉంది అలాంటిది దానికి ఈరోజు పుష్పాలతో అలంకరించి ఆ భావనని మరింత అందంగా చేశారు ఎందుకంటే ఈరోజు దివ్య వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద మహా మృత్యుంజయ హోమం నిర్వహించారు దివ్య పేరు మీద ఆ హోమం చేయించడానికి దేశంలో ఉన్న పెద్ద పూజారులు పీఠాధిపతులు యోగులు మునులు ఋషులు వీళ్ళతో పాటు జగదీష్ చంద్ర వర్మ గారి వంశాన్ని... కుటుంబాని తరతరాలుగా రక్షిస్తూ వస్తున్న శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విశ్వనాథ గురువు గారు కూడా వచ్చారు వాళ్ళందారు దివ్య కోసం హోమం దగ్గర మంత్రాలు చదువుతూ ఎదురు చూస్తున్నారు.
ఇంతలో దివ్య వాళ్ళ మేనమామ పరశురామ్ వచ్చి.
పరశురామ్: ఇదిగో పి.ఎ చక్రి..ఆడంబరాలు చూస్తుంటే చాలా ఘనంగా చేస్తున్నారే ఎ మాత్రం కర్చు చేస్తున్నారు ఎంటి మా బావగారు...?
పి.ఎ చక్రి: పదిహేను వందలు దాకా కర్చు చేస్తున్నారు సార్.
పరశురామ్: ఎంటి పదిహేను వందల రుపైలే నా మరీ ఇంత తక్కువ ఖర్చుతో ఇంత ఘనంగా ఎలా చేస్తున్నాడు అబ్బా మా బావ అని ఆలోచిస్తుండగా.
పి.ఎ చక్రి: సార్ పదిహేను వందలు కాదు పదిహేను లక్షలు కాదు సార్ మీరు పొరపాటు పడ్డారు హోమం కి కర్చు చేస్తుంది పూర్తిగా పదిహేను వందల కోట్లు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్రోర్స్ సార్ అది...
పరశురామ్: ఎంటీ పదిహేను వందల కోట్లా అని🤯😲😵 నోరు వెళ్ళబెట్టుకొని మరీ షాక్ అయ్యారు.
అది చూసి వెంటనే పి. ఎ చక్రి తన మొహం మీద కొన్ని మంచి నీళ్ళు చల్లి పరశురామ్ నీ స్పృహలోకి తెప్పించదు.
పి. ఎ చక్రి: సార్.... సార్ పరశురామ్ గారు మీరు బాగానే ఉన్నారు గా మీరు అని అడిగారు.
పరశురామ్: సరే సరే మరి నువ్వు వెళ్ళు నేను వెళ్తాను అని చెప్పి ఎలాగైనా సరే ఈ విషయం అక్కాయ్ కు చేరవల్సిందే అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
తన అక్కాయ్ నీ వెతుకుతూ ఉన్నాడు. ఇంతలో దివ్య వాళ్ళ నాయనమ్మ గారు కనిపించి.
శారద దేవి: రేయ్ పరశు అటు ఇటు తిరుగుతూ ఉండే కంటే కాస్త మి అక్కయ్య కు సహాయంగా ఉండచ్చుగా తను చూడు ఎలా పని చేస్తుందో తోరణాలు కడుతూ అని అన్నారు.
పరశురామ్: ఈ ముసలి ఒక్కటి మధ్యలో పోయి పోయి ఈవిడగారి కంటికే పడాలా నేను అని మనసులో అనుకుంటూ. అది కాదు శారద దేవి అత్తయ్య నేను కూడా సహాయం చెద్దామనే అక్కయ్యను వెతుకుతున్నాను కాస్త ఎక్కడ ఉందొ చెప్తే నేను వెళ్లి సహాయం చేసుకుంటాను అని అన్నాడు.
శారద దేవి: అదిగో అక్కడ బయట హోమం దగ్గర నిలబడి పూజారులకు ఏం కావాలో చూసుకుంటుంది అని చెప్పి వంట గదికి వెళ్ళారు.
పరశురామ్: వెంటనే బాగ్ మిల్కా బాగ్ అని అంటూ తొందర తొందర గా తన అక్కయ్య దగ్గరకు చేరుకున్నాడు.
పరశురామ్: అక్క అక్క నికో ముఖ్యమైన విషయం చెప్పాలి
ఇటు రా అక్క ఒకసారి అని అన్నాడు.
చాముండి వర్మ: ఏంట్రా నీ బాధ ఎంత ముఖ్యమైన పని చేస్తున్నానో చూస్తున్నావ్ గా డిస్టర్బ్ చేస్తున్నావ్ ఎంటి...అని అన్నారు.
పరశురామ్: నేను చెప్పేది వింటే నిజంగానే డిస్టర్బ్ అవుతావు అక్క.
చాముండి : ఏంట్రా అంత ముఖ్యమైన విషయమా అది....
పరశురామ్: హా అవును అక్క ఇంకా చాలా చాలా పెద్ద ఇంపార్టెంట్ న్యూస్ ఇది.
చాముండి : ఏంటది...?
పరశురామ్: నికు తెలుసా బావగారు ఈ మృత్యుంజయ హోమం కోసం ఎంత కర్చు చేస్తున్నారు అని..
చాముండి : దీనికోసమే నా ముఖ్యమైన విషయం అని అన్నావు... ఇది చిన్న పిల్లాడిని అడిగినా చెప్తాడు రా పరశు.
పరశురామ్: అవునా అక్క అయితే చెప్పు ఎంత కర్చు చేస్తున్నారు.
చాముండి: ఎంత ఓ సుమారు యాభై కోట్లు ఉంటుంది లేదా ఓ వంద కోట్లు ఉంటుంది అంటే గా.
పరశురామ్: అక్కడే నువ్వు పప్పులో కలేసవ్ అక్క.
చాముండి: ఏంట్రా నువ్వు అనేది.
పరశురామ్: నిజం చెప్తున్నాను అక్క నేను చెప్పనా ఎంత కర్చు చేస్తున్నారో పూర్తిగా పదిహేను వందల కోట్లు కర్చు చేస్తున్నారు బావగారు తన ఒక్కగానొక్క గారాల పట్టి కోసం.
ఆ మాట వినగానే ఒక్కసారిగ చాముండి తన నోరు తెరుచుకొని ఆశ్చర్యం లో ఉండిపోయింది పరశురామ్ అది చూసి వెంటనే ఆ పక్కనే ఉన్న గ్లాస్ లో మంచి నీరు తీసుకొని మొఖం మీద చల్లాడు దానితో స్పృహలోకి వచ్చిన చాముండి ఎ.. ఎన్ ఎంత అన్నావు... అని తడబడుతూ అడిగింది.
పరశురామ్: పదిహేను వందల కోట్లు అక్క ఈ హోమం కోసం బావగారు కర్చు చేస్తున్నది.
చాముండి : ఆయనకి ఏమైనా పిచ్చా ఎందుకు ఇంతలా కర్చు చేస్తున్నాడు ఈ హోమం కోసం అని ఆగ్రహం చేసింది.
పరశురామ్: మరి ఇప్పుడు ఎం చేద్దాం అక్క.
చాముండి : అదే ఆలోచిస్తున్నాను రా సడెన్గా ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పి నా బ్రైన్ నీ బ్లాక్ చేశావ్ ఆలోచించడానికి అసలు నా బ్రౌన్ పని చేయట్లేదు అని అంటుండగా.
పరశురామ్ కంటికి ఒక పెద్ద కార్ వచ్చి ఆగింది ఆ కార్ లో నుండి ఒక వ్యక్తి దిగి నడుచుకుంటూ వస్తున్నారు ఆ వ్యక్తిని చూసిన పరశురామ్ ఒక్క నిమిషనికి షాక్ లో ఉండిపోయాడు ఈ విషయం తెలియని తిలోత్తమ...
చాముండి : నా బ్రౌన్ ఏం పని చేయట్లేదు నువ్వే ఎదో ఒకటి ఆలోచించు అని అడిగింది.
పరశురామ్ ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయడు.
చాముండి:రేయ్ పరశు నిన్నే అడుగుతుంది అల బెల్లం కొట్టిన రాయి లాగ ఉన్నావ్ ఏంట్రా అని పరశురామ్ నీ కదిలించి అడిగింది.
తన అక్క చేతి స్పర్శ తగలగానే పరశురామ్ షాక్ లో నుండి బయట పడ్డాడు.
చాముండి: ఏంట్రా ఏం అయింది అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావు ఎంటి అని అడిగింది.
పరశురామ్ భయపడుతూ నీ వెనక వచ్చే వ్యక్తి నీ చూస్తే నువ్వు కూడా షాక్ లో ఉంటావ్ అక్క అని చెప్పాడు, అది విన్న చాముండి.
చాముండి: ఎంటి నా వెనకాల వచ్చే వ్యక్తిని చూస్తే నేను కూడా షాక్ లో ఉంటానా ఏం మాట్లాడుతున్నావు రా అని అంటూ తను వెనక్కు తిరిగి చూసింది.
అప్పుడు ఆవిడకు ఎదురయ్యారు దివ్య వాళ్ళ పెద్దమ్మ శ్రీ లలిత దేవి వర్మ.... ఆవిడ చూడటానికి అచ్చం దుర్గ అమ్మవారు లా ఉన్నారు.
లలిత దేవి: ఏం చాముండి అలా చూస్తున్నావు ఎప్పుడూ చూడలేదా ఎంటి నన్ను కొత్తగా చూస్తున్నావ్ అని అడిగారు.
చాముండి: ఆ..అదేం లేదక్కా మీరు హోమం కి వస్తున్నారు అని తెలియదు మీరు ఎదో బిజినెస్ ట్రిప్ మీద యు ఎస్ కి వెళ్తున్నారు అని మి పిఎ చెప్పారు అందుకే చూస్తున్నాను.
లలిత దేవి: హా అవును వెళ్లాల్సి ఉండేది కాని ఆ ట్రిప్ నీ కేన్సిల్ చేసేసాను దివ్య క్షేమం కోసం చేసే ఈ హోమం కంటే ఎది ముఖ్యం కాదు అని వచ్చాను.
పరశురామ్: పెద్దక్క గారు బాగున్నారా.
లలిత దేవి: ఏం పరశురామ్ ఇంకా ఇక్కడే ఉన్నావా వెళ్ళలేద.
చాముండి: అంటే వాడికంటు నేను తప్పా ఇంకెవ్వరు ఉన్నారు అక్క అందుకే నాతో పాటు ఇక్కడే ఉంటున్నాడు.
లలిత దేవి: కష్టపడి పని చేస్తూ బ్రతికితే ఎక్కడైనా బ్రటకచ్చు అని అంటూనే ఇంతలో శారదా దేవి గారు వచ్చారు.
శారద దేవి: లలిత ఇదేనా రావడం అని పలుకరిస్తూ అడిగారు.
లలిత దేవి: హా అవును అత్తయ్య ఎలా ఉన్నారు అత్తయ్య మీరు.
శారద దేవి: బాగున్నాను లలిత పిల్లలు రాలేదా ఎంటి కనిపీయట్లేదు.
లలిత దేవి: వస్తున్నారు అత్తయ్య దారిలో ఉన్నారు అంతా మరో పది నిమిషాలలో ఉంటారు ఇక్కడ.....
చాముండి: అత్తయ్య మీకు తెలుసా లలిత అక్క వస్తున్నారు అని.
శారద దేవి: హా తెలుసు ఈరోజు ఉదయాన్నే కాల్ చేసి చెప్పింది వస్తున్నాను అని.
చాముండి: మారి మాకెందుకు చెప్పలేదు అత్తయ్య.
లలిత దేవి: నేనే చెప్పద్దు అని చెప్పాను...ఇక మాటలు ఆపితే హోమం గురించి చూద్దాము అని చెప్పి పీఠాధిపతుల దగ్గరకి వెళ్లి మాట్లాడుతున్నారు.
పరశురామ్: చూసావా అక్క మనల్ని ఎలా కూరలో కరివేపాకులా తీసి పక్కకి పడేసినట్లు పడేసరో.
చాముండి: అవును రా ఎదో ఒకటి చేయాలి లేకపోతే మనకు ఇక మళ్లీ గతం లో పట్టినట్లే పడుతుంది మనకు ఇక భవిష్యత్తే లేకుండా అవుతాం.
పరశురామ్: మరి ఏం చేద్దాం అక్క.
చాముండి: ఇప్పుడు కాదు రా తరవాత సరైన సమయం చూసి దెబ్బ కొట్టాలి ఎలా అంటే మళ్ళీ లేచే ప్రసక్తే ఉండకూడదు అలా కొట్టాలి అని పగతో చూసి అక్కడ నుండి వెళ్ళిపోయారు.
ఇంతలో దివ్య వాళ్ళ నాన్న గారు తన కుటుంబానికి పెద్ద గురువు గారు అయిన శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకాచార్య విశ్వనాథ్ గురువు గారిని వెంట పేట్టుకొని వస్తున్నారు.
జగదీష్ భద్ర వర్మ: ఏం వదిన గారు ఎలా ఉన్నారు🙂 అని అడిగారు.
లలిత దేవి: బాగున్నాను అని చెప్పాలి అంటే ఇక్కడ నా చెల్లెలు ఉండాలి కాని తనకి ఏవరి దూరదృష్టి పడిందో ఏమిటో అర్ధాంతరంగా తను మనల్ని వదిలేసి శ్వర్గస్తియులు అయింది అని భాద పడుతు చెప్పింది.
శారద దేవి: జరిగిన దాంట్లో మన తప్పేం ఉంది లలిత మనం పది మంది మంచి కోరుకుంటాం ఆదే విధంగా వాళ్ళు కూడా మన మంచి కోరాలని నియమం ఏం లేదు అది కనుక ఉంటే మనిషి కి ఎ కష్టం రాదు అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు అని అన్నారు.
ఇంతలో పెద్ద గురువు గారు దివ్య రావడం చూసి.
పెద్ద గురువు: గాయత్రి దేవి గారు లేకపోతే నెం ఆవిడ గారి యొక్క ప్రతిరూపం ఇక్కడే ఉన్నారు గా అని దివ్య నీ చూపిస్తూ అన్నారు.
ఆ మాటలను విన్న లలిత దేవి మరియు శారద దేవి గారు మరియు జగదీష్ వర్మ గారు మరియు వాళ్ళ ఉత్తర బందు మిత్రులు విని గురువు గారు చూపించే వైపుకి చూశారు....వాళ్ళందరూ ఒక్కసారిగా దుఃఖం నుండి బయటకి వచ్చి సంతోషంతో ఉన్నారు.
లలిత దేవి: నిజం చెప్పారు గురువు గారు దివ్య అచ్చం వాళ్ళ తల్లి పోలికే.
శారద దేవి: పోలిక ఒక్కటే కాదు లలిత గుణంలోను అదృష్టంలోనూ తెలివిలో సమయస్ఫూర్తిలో కూడా పుణికి పుచ్చుకుంది.... అందుకే తనని జూనియర్ గాయత్రి అని పిలుస్తున్నాం అని ఆనంద భాష్పలతో చెప్పింది.
దివ్య పెద్ద గురువు గారి దగ్గరకు వచ్చి పాద స్పర్శ చేసి ఆశీర్వచనాలు తీసుకుంది.
పెద్ద గురువు: ఆశీర్వాదాలు అందిస్తూ దీవించాడు.
దివ్య: ఎలా ఉన్నారు గురువు గారు.
పెద్ద గురువు: అంతా ఆ పరమేశ్వరుని యొక్క దీవెనలు తల్లి.
దివ్య: ఎలా ఉన్నావ్ పెద్దమ్మా బాగున్నారా అని వాళ్ళ పెద్దమ్మా పాద స్పర్శ చేసి ఆశీర్వచనాలు తీసుకుంది.
లలిత దేవి: ఆ లేవమ్మ నువ్వు ఎక్కడ ఉన్నా నేను ఒక్కటే కోరుకుంటాను నువ్వు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఎ కష్టం రాకుండా ఆరోగ్యంగా ఉండాలి అని.
దివ్య: ఉంటాలే పెద్దమ్మా ఇప్పుడు నాకేం అయింది అని ఇంత కర్చు చేసి మరీ ఈ హోమం చేయిస్తున్నారు, నాకోసం కర్చు చేసే డబ్బు తో ఎంత మందికి కొత్త జీవితం ఇవ్వచో తెలుసా అని అలుగుతు 🤨😗అన్నది.
శారద దేవి: మాకు నీకంటే ఎది ముఖ్యం కాదు స్వీటీ.
దివ్య: చూడు శబరి నాకు ఇలాంటివి నచ్చవు అని చెప్పాను అయిన సరే ఎందుకు చేస్తున్నానో తెలుసా.
శారద దేవి: ఎందుకు.
దివ్య: నువ్వు భాద పడతావు అని కాదు నాన్న బాధపడతాడు అని చేస్తున్నాను.
శారద దేవి: బాగుంది తల్లి ఎక్కడికైనా సరే వెళ్లి తిరిగి తిరిగి చివరకు మి నాన్న గూటికే చేరతావు గా.
దివ్య: హా అవును నా ఇష్టం నికెందుకే ముసలి ఎదో నీ అబ్బాయి నీ దోచుకున్నట్లు అలా కుల్లుకుంటున్నావు.... ఎందుకు మా నాన్నని నా దగ్గరే ఉంచుకుంటాను నీకేంటి ప్రాబ్లెమ్ హా.
శారద: నీకు నాన్న కాకముందు వాడు నాకు కొడుకే రాక్షసి రాకుమారి.
దివ్య: అదంతా నేను పుట్టకముందు ఆలోచించాలి శబరి ఇప్పుడు నేను వచ్చేసాను గా సో ఇప్పుడు నాకు నాన్న అంటే ఇది ఫిక్స్ అని ఆటపటిస్తూ అల్లరి చేస్తుంది దివ్య.
ఇంతలో దివ్య కి మళ్ళీ కాల్ వచ్చింది కానీ ఈసారి దివ్య ఫోన్ తీసుకునే లోపు లలిత దేవి గారు ఫోన్ తీసుకున్నారు.
దివ్య: పెద్దమ్మా అది నా ఫోన్ ఎదో ముఖ్యమైన వ్యక్తి అనుకుంటా కాల్ చేస్తున్నారు ఓసారి చూస్తాను ఇవ్వండి .
లలిత దేవి: ముందు హోమం పూర్తి అయ్యాకే ఫోన్ నీ చేతికి వస్తుంది అప్పటి దాకా నో ఫోన్ కాల్స్ నో మెసేజెస్ అని ఖరాఖండిగా చెప్పేశారు.
ఇంతలో ఒక పూజారి వచ్చి లలిత దేవి గారు గురువు గారు దివ్య అమ్మాయి గారిని తీసుకురామ్మన్నారు హోమం లో కూర్చునే సమయం వచ్చింది అని చెప్పారు.
లలిత దేవి: వస్తున్నాం పూజారి గారు అని చెప్పి దివ్య ను హోమం ముందు కూర్చోబెట్టారు.
నాగదోషం రాకుండా ఉండటానికి నాగ పీఠాధిపతి అయిన శ్రీ శ్రీ శ్రీ వేంకట ద్రోణ శాస్త్రి గారు: తల్లి దివ్య ఈరోజు నువ్వు రాత్రి వరకు ఒక్క చుక్క పచ్చి మంచి నీరు కూడా ముట్ట కుండ ఉపవాసం ఉండాలి రాత్రి నువ్వు ఉపవాసం వదిలే టప్పుడు పంచ భూతాలకు అధిపతి అయిన ఆ పరమేశ్వరునికి నైవేద్యం పెట్టి ఆ తరవాతే నువ్వు తినాలి అప్పటిదాకా నువ్వు ఆహారాన్ని తీసుకోరాదు నీటిని సేవించారాదు.
దివ్య: అలాగే పీఠాధిపతి గారు
పెద్ద గురువు: లలిత దేవి దివ్య వాళ్ళ తల్లిని ముందుకు రమ్మన్నంది.
లలిత దేవి: ఎందుకు గురువు గారు.
పెద్ద గురువు: నిజానికి దివ్య వాళ్ళ కన్న తల్లి ఈ కార్యం చేయాలి కానీ ఆవిడగారు కాలం చేసి స్వర్గస్థులు అయ్యారు. కనుక ఆ స్థానంలో ఉన్న దివ్య వాళ్ళ తల్లి స్థానంలో వచ్చిన చాముండి గారు వచ్చి ఈ కార్యం చేయాలి అప్పుడే ఈ హోమం మొదలవుతుంది.
చాముండి: నా బిడ్డ కోసం ఈ కార్యం ఎంటి గురువు గారు ఎ కార్యం అయిన చేస్తాను తను నిందు నూరేళ్ళు సంతోషంగా ఎ కష్టం రాకుండా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను.
పెద్ద గురువు: ఈ కంకణాన్ని దివ్య చేతికి కట్టండి.
పరశురామ్: ఇది ఎంటి గురువు గారు.
పెద్ద గురువు: ఇది దివ్య రక్షణ కోసం పీఠాధిపతులు యోగులు మునులు ఋషులు మా నాన్నగారు వీళ్ళందరు పూజ చేసి మరీ తయారు చేసిన కంకణం ఇది..... దీనిని ధరించిన వారికి ఎ కష్టం రాకుండా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారు ఎ దోషం ఎ గండం రాకుండా తనని రక్షిస్తూ ఉంటుంది ఇది కేవలం ఒక్క తల్లి మాత్రమే తన బిడ్డకి కట్టాలి అని చెప్పారు.
చాముండి: అర్ధం అయింది గురువు గారు ఈ కంకణాన్ని తన చేతికి కడితెనే తను క్షేమంగా ఉంటుంది అని అదేలేకపోతే అప్పుడు దీన్ని రక్షించేది ఎవ్వరూ అని తన మనసులో అనుకుంటూ దివ్య చేతికి కంకణాన్ని కట్టినట్లే కట్టి ఎవ్వరికీ తెలియకుండా తొందరగా ఊడిపోయేలా కటింది.
ఇంతలో దివ్య వాళ్ళ మేన మామయ్య కు కాల్ వచ్చింది.
పరశురామ్: హెల్లొ ఎవ్వరూ మాట్లాడుతుంది.
కీర్తి: హెల్లొ అంకుల్ నేను కీర్తి నీ మాట్లాడుతున్నాను కాస్త దివ్య కి కాల్ ఇస్తారా ఎమర్జెన్సీ ఉంది ఇక్కడ.
దివ్య: ఎవ్వరూ ఫోన్ పరశురాం మావయ్య 🙂.
పరశురామ్: మి ఫ్రెండ్ కీర్తి అమ్మా.
దివ్య: అవునా ఎది ఇటివ్వండి అని ఫోన్ అడిగింది.
పరశురామ్: ఆ ఇదిగో తీసుకో అమ్మ తొందరగా మాట్లాడు మళ్ళీ మి పెద్దమ్మా చూశారో ఇక అంతే నా పని అని భయపడుతూ ఫోన్ ఇచ్చాడు.
దివ్య: ఏం జరగదు మావైయ మీరేం భయపడకండి అని అంటూ ఫోన్ తీసుకుంది.
దివ్య: హెల్లొ కీర్తి చెప్పు నేను దివ్య నీ మాట్లాడుతున్నాను.
కీర్తి: దివ్య ఎక్కడ ఉన్నవు అస్సలు మార్నింగ్ నుండి నీకు ఎన్ని కాల్స్ చేశానో తెలుసా, అసలు నీ ఫోన్ ఎక్కడ ఉంది మార్నింగ్ నుండి ఫోన్ చూడకుండా ఏం చేస్తున్నావ్ అని ఆవేశంగా కంగారు పడుతూ అరిచింది.
దివ్య మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది కానీ మాట్లాడటానికి అవకాశమే దొరకట్లేదు అందుకే మౌనంగా ఉండిపోయింది.
కీర్తి: ఎంటే నేను ఇక్కడ లోడ లోడ మాట్లాడుతుంటే ఏం పట్టనట్లు మౌనంగా నిలబడి ఉన్నావ్.
దివ్య: నేను మాట్లాడటానికి నువ్వు ఛాన్స్ ఇస్తే గా నేను మాట్లాడటానికి నువ్వే ఆపకుండా మాట్లాడుతుంటే ఇక నేనేం మాట్లాడాలి చెప్పు.
దివ్య: సరే ఇప్పుడు ఏం అయింది ఏమైనా సీరియస్ ఆ ఎంటి అని అడిగింది.
కీర్తి: మాములు సీరియస్ కాదే చాలా పెద్ద సీరియస్ ఇష్యూ అయింది ఇక్కడ.
దివ్య: అవునా అని ఏం అయింది అని కంగారు పడుతూ అడిగింది.
కీర్తి: నువ్వు ఆపరేషన్ చేసి కాపాడావు గా ఒక వ్యక్తిని.
దివ్య: హా అవును కానీ అతను కోమా లో ఉన్నాడు గా ఈ విషయం వాళ్ళ అమ్మా గారికి వాళ్ళ అన్నయ్య కి నేనేగా చెప్పింది.
కీర్తి: హా చెప్పావ్ కానీ ఇక్కడ ప్రాబ్లెమ్ వాళ్ళ పేరెంట్స్ తో కాదు.
దివ్య: మరి...?
కీర్తి: నువ్వు కాపాడిన అతనే పెద్ద ప్రాబ్లెమ్ అయ్యాడు.
దివ్య: ఎయి నీకేమైనా పిచ్చా కోమాలో ఉన్న వ్యక్తి ఎలా ప్రాబ్లెమ్ అవుతాడు అని సీరియస్ గా అడిగింది.
కీర్తి: ఎందుకంటే అతను కోమాలో లేడు కాబటి.
ఈ వార్త వినగానే షాక్ లో పైకి లేచి నిలబడింది.
దివ్య: వాట్....?
కీర్తి: ఎస్ నువ్వు విన్నది నిజం అతను కోమాలో నుండి బయటకి వచ్చాడు.
దివ్య: నమ్మలేక పోతున్నాను ఇది ఎలా జరిగింది అని అడిగింది.
కీర్తి: జరిగిందంతా దివ్య కి చెప్పేసింది.
దివ్య: వాట్...ఇంత జరిగితే మిలో ఒక్కరూ కూడా నాకు చెప్పాలనిపించలేదా అని కోపంగా అడిగారు.
కీర్తి: మార్నింగ్ నుండి నీకు దాదాపు వందకు పైగా కాల్స్ చేశాం నీకు ఈ విషయం చెప్పడానికి కానీ నీ ఫోన్ రింగ్ అవ్తుంది కానీ ఆన్సర్ మాత్రం అవ్వలేదు అందుకే మీ పరశురామ్ మావయ్య కు కాల్ చేశాను అతను తప్ప ఇంట్లో ఖాలిగా ఎవ్వరూ ఉండరు అని.
దివ్య: సరే ఇప్పుడు అతని పరిస్తితి ఎలా ఉంది అని కంగారు పడుతూ అడిగింది.
కీర్తి: నిమిష నిమిషానికీ కోపం పెరుగుతూ ఉంది అతను చూడటానికి క్యూట్ గా ఉన్నాడు అని అన్నావ్ కాని నువ్వు ఇక్కడకి వచ్చి చూస్తే తెలుస్తుంది వాడు ఎంత క్రూరంగా ఉన్నడో ఒక రాక్షసుడిలా వాడుకి ఎవరు అడ్డు వచ్చిన ఏదో కాగితం తీసి పడేసినట్లు ఒక్కొక్కరిని ఎత్తి పడేస్తున్నాడు అందులో పాపం వాళ్ళ అమ్మ అన్నయ్య కూడా ఉన్నారే నా లైఫ్ లో ఫస్ట్ టైం డాక్టర్ గా అయినందుకు భయం వేస్తుంది ఏం చేయాలో కూడా అర్ధం కావట్లేదు అని భయపడుతూ ఏడుస్తూ చెప్పింది.
దివ్య: హేయ్ పిచ్చి భయపడకు నేను ఉన్ననుగా నీకేం కాదే నేను వస్తున్నాను హాస్పిటల్ కి భయపడకు ధైర్యంగా ఉండు అని చెప్పి కాల్ కట్ చేసి వెంటనే హోమం మధ్యలో నుండి లేచి హాస్పిటల్ కి బయలుదేరుతుంది.
కానీ ఇంతలో దివ్య వాల నాన్నమ్మ దివ్య ను అపి.
శారద దేవి: అగు దివ్య ఎక్కడకు వెల్తున్నావు.
దివ్య: నాన్నమ్మ హాస్పిటల్ లో ఒక ఎమర్జెన్సీ అంత అర్జెంట్ గా వెళ్ళాలి లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లెమ్ అవ్తుంది ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు.
శారద దేవి: నీకేమైనా పిచ్చా ఇంత ముఖ్యమైన హోమం పెట్టుకొని హాస్పిటల్ కి వెళ్తాను అని అంటున్నావేంటి... కుదరదు నువ్వు ఎక్కడకి వెల్లట్లేదు... ఈ హోమం అయ్యే అంతవరకు నువ్వు ఇక్కడ నుండి కదలటానికి విలు లేదు. ఖరాఖండిగా చెప్పేశారు.
దివ్య: కానీ నాన్నమ్మ ప్లీజ్ అక్కడ ఒక్కరికీ సీరియస్ గా ఉంది నేను వెళ్లకపోతే అతని ప్రాణాలు ప్రమాదంలో పడతాయి
శారద: హాస్పిటల్ లో నువ్వు ఒక్కదానివే లేవు....ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు నువ్వు ఈ హోమం చూసుకో అని కోపం గా చెప్పారు.
వీళ్లిద్దరి సంభాషణ లలిత దేవి గారి దాకా వినిపించింది.
లలిత దేవి గారు వారి మాటలు విని ఏం జరుగుతుందో అని చూడటానికి వచ్చారు.
లలిత దేవి: ఎంటి అత్తయ్య ఏం అయింది ఇద్దరు గట్టిగ సీరియస్గా మాట్లాడుకుంటున్నారు.
శారద దేవి: లలిత నువ్వైనా చెప్పు దానికి వింటుందేమో
లలిత దేవి: ఏం జరిగింది అత్తయ్య.
శారద దేవి: స్వీటీ హాస్పిటల్ కి వెళ్తుందట
లలిత దేవి: ఎంటి హాస్పిటల్ కా ఎందుకు అంత అయిన నీ ఫోన్ నా దగ్గరే ఉంది గా మరి నికు హాస్పిటల్ నుండి కాల్ ఎలా వచ్చింది అని సీరియస్ గా అడిగారు.
ఆ మాటలు విన్న పరశురామ్ గుండె ఒక్కసారి భయంతో జిగేల్ మన్నది.
దివ్య: ఎలాగో అలాగ వచ్చింది ఇప్పుడు ఎందుకు పెద్దమ్మ అక్కడ ఒకరికీ సీరియస్ గా ఉంది అంట.... తొందరగా వెళ్ళాలి లేకపోతే అతనికి ప్రమాదం పెద్దమ్మ కనీసం నువ్వైనా చెప్పు శబరి కి నన్ను వెల్లనివ్వు అని.
లలిత దేవి: అస్సలు చెప్పను నేనే కాదు ఇక్కడ ఒక్కరూ కూడా నీకు అనుమతి ఇవ్వరు నువ్వు హాస్పిటల్ కి వెళ్ళడానికి వీన్లేదు... హాస్పిటల్ ఎంటి నువ్వు అసలు ఈ ఇంటి గేట్ కూడా దాటడానికి విలు లేదు అని కోపంగా చెప్పారు.
దివ్య మొట్ట మొదటి సారిగా తన పెద్దమ్మ మొఖం లో మరియు తన నాన్నమ్మ మొఖంలో కోపం చూసింది.
నెక్స్ట్ ఎపిసోడ్ త్వరలో