Interment books and stories free download online pdf in Telugu

అంతర్మధనం

అమ్మ దగ్గరకు బయలు దేరిన కమల తన కిష్టమైన, కిటికీ పక్కన సీట్లో కూర్చుని బయటకు చూస్తూంది. ఇంతలో
రైలు కదిలింది. "ఎన్నాళ్ళ కు మళ్ళీ రైలెక్కి వెళుతున్నాను. "
అనుకుంటూ " ఆంటీ " అన్న పిలుపు కు తల తిప్పి చూసింది
చిన్న బాబుతో పాటు వచ్చి, "జరుగుతారా?" అని ఎదురు గా కూర్చున్న ఆమె ను ఓ అమ్మాయి అడుగుతోంది.
కంపార్ట్మెంట్ అంతా ఆ అమ్మాయి, వాళ్ళ బాబు మాటలతో
సందడిగా వుంది. బాగా కలిసి పోతుంది అందరితో అని
అనుకుంటూ ఉన్నారు.
మాట కలుపుతూ " మీరేం చేస్తుంటారు ? " అడిగాడు సురేష్.
నవ్వుతూ " టీచర్ " ,మరి మీరు ? ఒకే గూటి పక్షులం. మా ఆవిడ కూడా. మీనా"
" మీ పిల్లలు ?"
"ప్రస్తుతానికి మేమే మా పిల్లలం "
వింటున్న అందరూ " అయ్యో" అన్న ఫీలింగ్ చూపారు.
ఆమె మాత్రం " nice" అని నవ్వేసింది. ఆ అమ్మాయి వ్యక్తిత్వం భిన్నంగా వుందని అందరికీ అర్థ మయింది.
విజయవాడ వరకు మంచి కాలక్షేపం.
భర్త విజయ్ కూడా టీచరని, వాళ్ళకు స్నేహితులంటే చాలా ఇష్టమని , ఎన్నో విషయాలు అడక్కుండానే చెబుతోంది.
కమలకు తన గతం కళ్ళముందు కదులుతున్నట్లు అనిపించింది. ఆలోచిస్తూ, నిద్రలోకి జారుకుంది.
విజయవాడ స్టేషన్ లో దిగబోతూ , గమనించిన విషయం. సురేష్ చేతి లో బాబు, అందరూ ఒకే వైపు వెళుతున్నారు.
*†***
అమ్మ తో ఆ అమ్మాయి గురించి మాట్లాడుతూ, "ఏ స్నేహం తో ఏమవుతుందో ? " మంచి పిల్ల,అంది కమల.
"పేరేమన్నావు ?"
"జయ ".
ఫోను రింగవుతూంది. "కొత్త నెంబరు" , చూద్దాం, తీసింది కమల
"హలో" , " హలో ఆంటీ ,నేను, జయను. "
" నా నెంబరు నీకెలా తెలిసింది? "
"9మీతో మాట్లాడుతూ, మీ ఫోను లోంచి నాకు చేసుకున్నాను."
" అది సరే " ఇప్పుడెందుకు చేయటం, ?"
"సురేష్ గారింట్లో వున్నాం.విజయ్ కూడా వస్తున్నారు.
మీరు కూడా రండి. సందడి చేద్దాం."
"Sudden గా రమ్మంటే ఎలా "?"
"అడ్రస్ షేర్ చేయండి. కారు పంపిస్తాం."

******
అలా అనుకుంటూ ఉండగా నే, వారిద్దరి కుటుంబాలు కలిసిపోయాయి. విజయ్ వాళ్ళింట్లో జయ వాళ్ళు ఒకరై, వారి ఇంట్లో సంతోషానికి పునాదులేశారు.
దగ్గరుండి ,ధైర్యమిచ్చి, అందమైన బిడ్డ కు సురేష్ దంపతులను తల్లితండ్రులు చేసారు..ఆ దేవుని దయ వల్ల.

కధ సుఖాంతం అనుకుంటూ ఉన్నా రా ?
అప్పుడప్పుడూ కలుస్తూ, ఫోనులో మాట్లాడుతూ, వారి వివరాలు తెలుసుకుంటూ వుంది కమల.కాలం కరుగుతోంది
కధ మొదలైంది ఇప్పుడే.
గుడి కెళ్ళి ఒక క్షణం కూర్చుని పోదామని , అనుకుంటూ "ఆంటీ" అన్ని పిలుపు కు వెనుదిరిగింది కమల.
స్థాణువైపోయింది . "జయే నా ? " చాలా డల్ గా.
" ఏం జయా ? ఒక్క దాని వచ్చావు. అందరెక్కడ ? "
"ఒక్కటే వుండాలని వుంది." హాయిగా వుంది."
కాసేపు కూర్చొని వెళ్ళారు.ఏమీ మాట్లాడుకోలేదు.
********
సురేష్ వాళ్ళింటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళింది అమ్మ తో.
" నమస్తే ఆంటీ ! రండి, రండి ! ఎన్నాళ్ళకు మళ్ళీ !
ఆ కబుర్లు, ఈ కబుర్లు చెప్పుకుంటూ వున్నారు. వెళ్ళొస్తా నని
వచ్చేసింది .
నిద్ర పట్టలేదు కమలకు. జయ ముందులా లేదు.silent అయింది.
"భగవంతుడా ! నా వూహలన్నీ అబద్ధాలవాలి. అంతే."
అమ్మ వారి " దేవీ నవరాత్రులు" అద్భుతంగా జరుగుతున్నాయి.అందరూ ఒకరినొకరు అభివాదం చేసుకుంటూ, సాయంత్రాలు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకుంటున్నారు. చాలా ఉత్సాహం చూపే జయ నుండి
ఏలాంటి పిలుపు రాలేదు.
" సురేష్, జయ ఊర్లో లేదా? అడిగింది కోమల ఫోన్లో.
" ఉన్నారు. ఈసారి మూడు రోజుల పాటు మాత్రమే బొమ్మ లో కొలువు పెడుతుందట. సాయంత్రం అటు వెళ్తాం. మీకు
కబురు రాలేదా ?" అవతలి నుండి మిసెస్. సురేష్ , సుజాత వివరణ.
" అవునా, అయితే పిలవక పోయినా వస్తాలే . వుంటా."
ఫోను పెట్టేసింది కమల
******
తర్వాత చాలా సందర్భాలలో కలిసినా కూడా జయ నిర్వికారంగా కనిపించింది.
" Friendship day " రోజు " get together " లో
అందరినీ entertain చేయడం లో బాగంగా జయ
" ఓ కవిత" చదివింది .
స్రృష్టి లో తీయనిది స్నేహమేనోయి.
అని మాత్రమే తెలుసు మనకందరికోయి.
ఆ స్నేహం కున్నాయి పరిమితులోయి.
అది తెలియని అమాయకుల బ్రతుకు గల్లంతోయి.
అతి జాగ్రత్త, అతి అభిమానం
అతి నియంత్రణ, అతి అధికారం
అతి దీనత్వం, అతి సూచనలు
అతి సలహాలు, ఇంకెన్నో
ఆ స్నేహం ఒక నరకం, పద్మవ్యూహం.
నవ్వులు పంచమని, చనువిస్తే

నవ్వునే వద్దంటే,
మరి నేను ఆ స్నేహాన్నే వద్దంటా .
వింటున్న నాకు చాల అయోమయంగా అనిపించింది. అందరూ చప్పట్లు కొట్టారు.
విజయ్ కూడా 'nice' అన్నాడు.జయ నవ్వింది పేలవంగా.
ఆ తర్వాత కూడా సురేష్ వాళ్ళ కుటుంబం చాలా హాయిగా కనిపుస్తున్నారు. జయ మనసు తో పని లేదన్నట్లు, సురేష్
వాళ్ళు ఎప్పటి లాగే ఉన్నారు.
జయ మౌనం విజయ్ పని అలసట గా అర్థం చేసుకుంటున్నాడు.


*********

ఈ అమ్మాయి ని కాపాడాలి అనుకొని, ఒక ఆది వారం
ఇంటికి పిలిచింది కమల. వడియాలు పెట్టడానికి సాయం చేయాలి.ఒక్కదానవే రా అని ఫోను చేసింది.
బిడ్డ ను విజయ్ దగ్గర వదిలి వచ్చేసింది.

రా జయా ! కూర్చో. . జయ ఇల్లంతా తిరుగుతూ వడియాల పని లేదే, అమ్మగారు కూడా వేరే అని అడిగింది."

పిచ్చి దానా ! రైలు లోని 'జయ' ను చూడాలని పిలిచాను.
జయ కళ్ళలో నీరు. కనుక్కునేశారా.
ఆ జయ లేదాంటి.ఎక్కడికో వెళ్ళింది.
" అర్థ మయ్యింది. స్నేహం లో లోతుల్లో కి తీసుకెళ్ళాడు.
నాకే సొంతం అంటున్నాడు. మౌనంగా నరకంలో వుంటున్నాను.పాపం విజయ్ , అమాయకుడు.స్నేహాన్ని నమ్మాడు. వాళ్ళకు మేం కావాలి.
మా ఇష్టం తో పని లేకుండా.
.
రెండు కుటుంబాల పరువు .పిల్లల భవిష్యత్తు.
ఒక విధంగా యాంత్రిక జీవనం." ఇదే కదా నీ కధ ; వ్యధ..

కళ్ళప్పగించి చూస్తూ ఉండి పోయింది జయ.

" పిచ్చి దానా ! ఇరవై ఏళ్ల అంతర్మధనం. నా జీవితానుభవం నీ జీవితాన్ని చదివేలా చేసింది.మొదటి పరిచయం లోనే
నీవెంత మంచిదానివో, నిర్మలమైన దానివో తెలి‌సింది. ఇరవై ఏళ్ల కిందట నన్ను చూసి నట్లే ఉండింది. నా వూహ కరెక్ట్ అయ్యింది." నిట్టూరుస్తూ కోమల.
" మరి నేనిప్పుడు ఎలా బయట పడగలను ? హాలాహలం
జీవితాంతం మనసులో వుండిపోతుంది ఉంది కదా !
ఈ జీవిత మే వద్దని పిస్తూంది., నిర్లిప్తంగా జయ.
నేను చేసిన తప్పు నువ్వు చేయకూడదని హెచ్చరిస్తున్నాను.

నేను మీ అంకుల్ ని పవిత్రంగా ఉంచాను. నేను స్నేహం నరకం లో నలిగిపోతూ.
చెప్పినా ఎవరూ నమ్మరు.
కాని ఆయన ఆఖరి క్షణాల్లో దగ్గరుండి, ఈ జన్మకు క్షమించండి." అని మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాను.నాకదే ముక్తి. ఆజన్మ శాపం.

నీవు చిన్న దానిని. యుక్తి గా ,తప్పుకో. ముళ్ళ మీద గుడ్డ ను తీసుకుంటున్నట్లు.Transfer పెట్టుకుని వెళ్ళిపో.
కొన్ని రోజుల తర్వాత కోలుకొంటావు. మళ్ళీ ఉత్సాహంగా
ఉండు నీ బిడ్డ, భర్త కోసం.
నా లాగా వుంటే, అవతలి వ్యక్తి జీవితం శాపమవుతుంది..నీకు నరకమవుతుంది."

జయ మౌనంగా, వింటూ, రిలీఫ్ ఫీల్ అవుతూ కనిపించింది.

సరే భోంచేసి వెళ్ళు.అన్నీ విన్నావు గా.
తలవూపి బయలుదేరింది జయ.

*************


హమ్మయ్య! నా భారం తగ్గింది.ఆ పై ఆ దేవుని దయ.

" మనం చెయ్యని ,చేయవలసి వచ్చిన,ఆ తప్పు ఫలితం మన మీదే వుంటుంది. బయట పడే ప్రయత్నం చేయకపోతే
జీవితం వ్రృధా. ఈ అంతర్మధనం ఎవరూ వినరు, నమ్మరు."
కమల నిట్టూర్పు.
కొన్ని రోజుల తరువాత, జయ " థ్యాంక్స్ ఆంటీ !
నా మనసు చదివి, నా అంతర్మధనం లోంచి హాలాహలాన్ని
తీసి పారవేయమన్నారు. ప్రయత్నిస్తాను.. దూరంగా వెళుతున్నాను.
ఇక ఎవరితోనూ స్నేహం పేరుతో చనువు తీసుకోనివ్వను.
కాలంతో పాటు కోలుకుంటూ, విజయ్ ను,బాబును బాగా చూసుకుంటాను. మా అమ్మ కు కూడా తెలియని మీకు మాత్రమే తెలిసిన నా జీవితంలోని
మచ్చ ను తొలగించుకొని మళ్ళీ" పాత జయ " గా కనిపిస్తాను.------ నమస్తే ఆంటీ.
అంటూ మెసేజ్ పెట్టింది.

కమల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
అందరితో కలుపుగోలుగా వుండటం కూడా తప్పే.దానికి కూడా మెళకువలు అవసరం.
జయను. జయ లాంటి ఆడపిల్ల లను కాపాడు, తండ్రీ !
,***** లక్కవరం. శ్రీనివాసరావు. ( ల. శ్రీ )









షేర్ చేయబడినవి

NEW REALESED