Read Hey infinity by LRKS.Srinivasa Rao in Telugu పద్యం | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 10

                   మనసిచ్చి చూడు - 10రెస్టారెంట్లోకి అడుగు పెట్ట...

  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

హే అనంతం

हे अनंत , ज्वलंत हो तुम ।
सृष्टि के कण _कण में ।


संध्या की लालिमा में ,
अंबर की नीलिमा में ,
धरती की हरियाली में ,
सूरज के उजियाले में ।
।। हे, अनंत। ।।
सरिता के कल _ कल में ,
सागर के हलचल में ,
पवित्र। मानसों। मे ,
प्रफुल्ल पुष्प हासों में ।
।। हे, अनंत ।।
न जाति की दीवार ,
न रीति का दुराचार ,
न मंदिर , न गुरुद्वार ,
न नियमों का व्यवहार ,
हे प्रभु ! मानस मेरा ,
तेरा सुंदर आवास ।
।। हे अनंत ।।


______लक्कवराम श्रीनिवास राव
( ल, श्री )

పరమాత్మా ! పరంజ్యోతి !


మనసు కు మించిన మందిరం లేదు
మానవత్వానికి మించి మరే పూజ శ్రేష్ఠమైనది కాదు.
భక్తి కేవలము బాహ్యారాధన అయింది.
భావన లో కూడా భగవంతుని ఆచూకీ అద్రృశ్యమైంది.

అందమైన ప్రకృతి లో, అణువణువున ,
అద్భుతమైన రూపం లో, క్షణ_క్షణా న ,
మనోహరం గా, మరువలేనంతగా ,
మెరిసే "మహా జ్యోతి " యే పరబ్రహ్మ.

మనోవీక్షణం తో , ఆ జ్యోతి ని దర్శించడమే ,
పరమాత్మా ! నా జీవిత పరమార్ధం .

పదిమంది కి నా సాయం అందించడమే ,
కదా ! నా పుట్టుక కో అర్థం.

లక్కవరం . శ్రీనివాసరావు
ల . శ్రీ


మనసు
మనిషి యొక్క అస్థిత్వం.
రూపమే లేనిది రూపాన్నిస్తుంది.
కానరాని ది ,కార్యాలెన్నో చేయిస్తుంది .
కలలో , ఇలలో తో డై వుంటుంది

బహు చంచలం , గాలి కన్నా వేగం ,
అతి సున్నితం , వెన్న కన్నా మృదువు .
గాజు కన్నా పెళుసు .

చేతితో కాదు ,. మాట తో విరుగు .
కరుణ చూపితే చాలు మంచు లా కరుగు .
భావనలకు నెలవు , అనుభూతికి ఆశ్రయం .
సాధన తో అవుతుంది ఆశ్రమం .
చేస్తుంది జీవితం ప్రశాంతం .
శోధన తో చూపుతుంది అమరత్వం .
చిరుగాలి కి ఊయల లూగుతుంది ,
చిరునవ్వు కు తేలి పోతుంది.

తల్లి లా లాలిస్తుంది,
చెల్లి లా అనురాగం పంచుతుంది .
స్నేహం లో సవరిస్తుంది .
గురు వై దారి చూపుతుంది .
బానిసయ్యా లో , బలం లాగేస్తుంది.
తస్మాత్ , జాగ్రత్త !
ఇంత ' మంచి' తోడుంటే , దూరాలు మాయం .
ఎంత మంది తో నైనా గడపగలం కాలం . కనులు మూసి కోరితే క్షణకాలం లో ప్రత్యక్షం .

"కోరిక " లౌకిక మా? దైవికమా ?
క్షణికమా ? శాశ్వతమా ?
నిర్ధారించారు , మిత్రమా !
పసిపిల్లల తో ప్రయాణం ,
పరమాత్మ దర్శనం సుగమం .
పసిపిల్ల ల్లా , వుండ గలిగితే ,
మరీ మంచిది జీవన గమనం .
లక్కవరం. శ్రీ నివాసరావు

ల. శ్రీ



కాలం చేసిన చిహ్నాలు

కాలం ఒకరి జీవితం .
ఒక సుదీర్ఘ పయనం .
ఒక మంచి పుస్తకం .
'కాలం' ఒక అనంతమైన జీవనబాట అయితే
నడిచే ప్రతి అడుగు, కలిసే ప్రతి తోడు ,
' కాల' బాట లో చెరగని చిహ్నాలే .

కొన్ని కరిగిస్తే , మరికొన్ని అలరిస్తాయి .
కొన్ని పాఠాలు నేర్పిస్తాయి , ఇంకొన్ని గుండె ను ఛేదిస్తాయి .
ఓం బాల్యం, ఓ కౌమార్యం , ఓ యవ్వనం
ఇక పెద్దరికం .
జీవితం " కాలం " లో మలచిన "చెరగని చిహ్నాలు "
ఓ పాటతో, ఓ మంచి వాక్యం తో ,
ఓం సంభాషణ తో , ఓ కల తో ,
ఆ చిహ్నాలు తళుకు మంటాయి .
తన " కాలం" లోకి తీసుకెళ్తాయి.
"కాలం" చేసిన మన వాళ్ళు మనకు
"జ్ఞాపకాల ఖజానాలు .


" కాలం" "మంచి " దా ? " చెడ్డ" దా ?
" ముద్ర " వేసే " మనసు". నడగాలి .
"మంచి"దైతే మళ్ళీమళ్ళీ ,
మనసు బాట లో వెనకడుగు వేసి మరీ
కొన్ని క్షణాలు గడిపేద్దాం .
"చెడు" అనిపిస్తే బాబోయ్ ! ముందడుగే మంచిది.
"ఈ క్షణమే " చాలు, ఇక్కడే వుందాం.
"ఈ కాలాన్ని" జాగ్రత్త గా , మెళుకువ తో ,
" మంచి"గా మార్చుకొనే , మన ప్రయత్నం మనం చేద్దాం.

" బాహుబలి " అయిన ఆ కాలాన్ని ,
అనుగ్రహించమని కోరుకుందాం.

కాలం తో కనుమరుగైన మహనీయులందరికీ
కరకమలాలతో అంజలి ఘటిస్తాం.
గానగంధర్వుడు "బాలు " గారి
జ్ఞాపకాల తో

లక్కవరం.శ్రీనివాసరావు.

ల. శ్రీ


నన్ను మలచిన , నా అభిమాన రచయిత లందరికీ
శిరసు వంచి, నమస్కరించి ,
నా మదిలో మెదిలే
భావాలకు, రూపం ఇచ్చే , నా ప్రయత్నం లో,
అడుగడుగునా ఆశీర్వదించమని
కోరుకుంటూ,
సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో,
మొదటి అడుగు వేస్తున్నాను.

బాపు గారి బొమ్మ లో , భావాన్ని
ముళ్ళపూడి గారి మాటల్లో రసాన్ని,
చలం గారి సరళ సాహిత్యాన్ని ,
దేవులపల్లి గారి సహజత్వాన్ని ,
ఆత్రేయ గారి మనసు సంగతులను,
యండమూరి వారి సున్నితత్వాన్ని ,
యద్దనపూడి గారి సొబగులను ,

సూర్య దేవర గా రి విశ్లేషణ ను ,
సురవరం వారి విజ్ఞానాన్ని ,

నారాయణ రెడ్డి గారి భాషా సౌందర్యాన్ని ,
శ్రీ శ్రీ గారి కవితా విప్లవాన్ని ,
మైథిలీ శరణ్ , దినకర్ , జయశంకర్ ప్రసాద్ ,
గుల్జార్ గారి విలక్షణ శైలిని
ఆస్వాదించిన అద్రృష్టవంతుడిని.

"అక్షరం " " అధ్యయనం" " ఆచరణ "

బ్రహ్మ, విష్ణు మహేశ్వరుల ని నమ్మిన వాడిని.