Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నాన్నకు ప్రేమతో శ్రావ్య

అమ్మ నన్ను క్షమించు యిలాంటి సమయంలో నిన్ను ఒంటరిగా వదిలేస్తున్నాను. ప్రతి క్షణం నరకం అనుభవిస్తు బతకడం నా వల్ల కావడం లేదు. తప్పు ఎవ్వరో చేస్తే శిక్ష నకు పడింది. అందరూ నేనేదో తప్పు చేసినట్లు చూస్తున్నారు. నాన్నని వాళ్లు మోసం చేసారు. ఆస్తి పోయినా భరించాను. కానీ అస్తి తో పాటు నాన్న కూడా పోయారు. అప్పులు మిగిలాయి. కానీ అయినా వాళ్లు దూరం అయ్యారు. ప్రేమించినవాడు మోసం చేసాడు. నాకు ఇంకా బతకాలి అని లేదు నన్ను క్షమించు అమ్మా!

ఇట్లు

మి శ్రావ్య

కళ్ళు ధారాపాతంగా వరిషించసాగాయి. మనసును ఎవరో మెలిపెడుతునట్టు బాధ. కానీ అమ్మ కోసం అయిన సరే బతకాలినీ ఉన్నా బలవంతంగా ఎవరో ఊపిరి అపెస్తునట్లు ఉంది. బతుకు భారంగా ఉంది. గడిచిన జివితం అంత ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది. గడిచిన కాలం తిరిగి రాదనే నిజం మనసు అంగీకరించడం లేదు. బతకడానికి ఒక్క అవకాశం ఉంటే. జీవితాన్ని కొత్తగా రాయాలని ఉంది.

*****

ఇవన్నీ ఆలోచించడం ఇప్పుడు అనవసరం. అప్పుడే తనకి చేయాల్సిన గుర్తుకు వచ్చింది. ఊరి తాడు సీలింగ్ ఫ్యాన్ కి వేలాడుతోంది. కన్నీటి సంద్రంలో ఉన్నట్లు ఉంది. మెడకు తాడు బిగిసుకుంది. ఇంకో రెండు నిమిషాలకి ప్రాణం పోయేలా ఉంది. ఇంతలో ఎవరో చెయ్యిని పట్టుకునీ లాగినట్లు ఉంది.

అమ్మా!



రెండు నిమిషాల మౌనం. అమ్మ కొట్టలేదు, తిట్టలేదు. కేవలం ఒక మాట అంది. నువ్వు ప్రాణం తీసుకునే అంత గొప్ప ప్రేమికుడ అతను. అంతే చెంప మీద గట్టిగా కొట్టినట్లు అనిపించింది. కర్తవ్యం గుర్తుకు వచ్చింది. అవును అలాంటి వాది కోసం నేను చావడం ఏంటి. ప్రేమ అన్నాడు. నువ్వు లేకపోతే బతకలేనన్నడూ. ఇప్పుడు డబ్బు కోసం మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధపడ్డాడు. అలాంటి వాడి కోసం నేను చావడం ఏంటి. బిడ్డను కనడం అంటే చావుకి చివరంచుల వరకు వెళ్ళడం అంటారు. అయినా అంతటి కష్టన్ని ఇష్టం గా బరించి కంది మా అమ్మ. అమ్మ ప్రేమ కంటే ఎక్కువ..?. 20 ఏళ్లు గుండెల పై ప్రేమగా మోసాడు నాన్న. నాన్న చూపించిన మమత కంటే ఎక్కువ న అతని ప్రేమ. నా కలలు, ఆశలే వాళ్ళ జీవితంగా మలుచుకున్న వాళ్ళ కోసం నేను ఇచ్చిన బహుమతి నా చావెనా. లేదు నేను గడిచిన కాలాన్ని పోయిన ప్రాణాల్ని వెనక్కి తీసుకు రాలేక పోవచ్చు. కానీ భవిషత్తు నీ మార్చగల శక్తి మనలోనే ఉంది. నా కోసం జీవితాని త్యాగం చేసిన అమ్మకి నాన్నకి నేను ఇవ్వగలిగిన బహుమతి నా చెల్లెలికి ఉజ్వల భవిష్యత్ నా పెదవుల పై చిన్న చిరు నవ్వు మాత్రమే. ఈ ఆలోచన వచ్చిన వెంటనే తనలో తెలియని ఏదో కొత్త శక్తి వచ్చినట్లు అనిపించింది.

గతం:

శ్రావ్య వాళ్ళ నాన్న సూర్యనారాయణ గారు పెద్ద పేరుమోసిన వ్యాపారవేత్త. అమ్మ అంజలి దేవి. పేరుకు తగట్టే ఉత్తమ ఇల్లాలు. విల్లదరికి ఇద్దరు కూతుర్లు. వీరి పెద్ద కురురి పేరు శ్రావ్య. శ్రావ్య అంటే సూర్యనారాయణ గారికి పంచ ప్రాణాలు. శ్రావ్య పుట్టిన తరువత వీరికి బాగా కలిసి వచ్చింది. శ్రావ్య నీ ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేరు సూర్యనారాయణ. ఎం. ఏ ఎకనామిక్స్ చివరి సంవత్సరం చదువుతుంది. చిన్న కూతురు కావ్య 9వ తరగతి చదువుతోంది. కావ్య సూర్య నారాయణ గారికి సొంత కూతురు కాదు. సూర్య నారాయణ గారి దగ్గర పని చేసే కార్ డ్రైవర్ కూతురు. అతను చనిపోవడంతో ఆ అమ్మాయినీ చేరదీసి కావ్య అని పేరు పెట్టి సొంత కూతురిలా చూసుకుంటున్నారు. అంజలి దేవి గారు కూడా వారిద్దరి మధ్యా వత్యసం చూపలేదు. శ్రావ్య పై చూపించే ప్రేమనే కావ్య పై కూడా చూపించేది. మోహనరావు, సూర్య నారాయణ గారి బిజినెస్ పార్టనర్. మరియు స్నేహితుడు.

శ్రావ్య రోజు కాలేజ్ కి వెళ్ళే సమయం లో ఒకడు వెంట పడేవాడు. ప్రేమించమని బెదిరించే వాడు. ఒకరోజు వాడు రోడ్ మీద శ్రావ్య నీ ఎదిపిస్తున్నడు అందరూ చూస్తున్నారు తప్ప ఎవ్వరూ ముందుకు రావడం లేదు. ఇంతలోనే వచ్చాడు మహేష్. తనని తాను పరిచయం చేసుకుంటూ శ్రావ్య కి కాబోయే భర్త నీ అంటూ పరిచయం చేసుకున్నాడు. సారీ బ్రదర్ శ్రావ్య ఎప్పుడూ చెప్పలేదు తనకి మేరేజ్ ఫిక్స్ అయింది అని. హ్యాపీ మేరేజి లైఫ్ అని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఏమి అర్ధం కాక చూస్తూ నిలబడి పోయింది శ్రావ్య. హోం సారి అండి వాడు మళ్లీ మి జోలికి రాకుండా ఉండాలనే అల చెప్పాను అని అన్నాడు మహేష్. ఒకే థాంక్స్ అండి అంది శ్రావ్య. మి పేరు అని అడిగింది శ్రావ్య. హోం నా పేరు చెప్పలేదు కదా నా పేరు మహేష్. మోహన్ రావు గారి అబ్బాయినీ. మి డాడీ చేప్పే ఉంటాడు నా గురించి అన్నాడు శ్రావ్య కళ్ళలోకి సూటిగా చూస్తూ. హ నేను వెళ్తాను అని వెళ్ళిపోయింది శ్రావ్య. తననే చూస్తూ నిలబడి పోయాడు మహేష్. వాళ్ళ నాన్న చెప్పిన సంబంధం ఈ అబ్బాయి గురించే అన్నమాట. చూడడానికి బాగున్నాడు. మంచివాడిలా ఉన్నాడు. ఆలోచించి చెప్తాను అని అంది శ్రావ్య. ఇంటికి వెళ్ళాక తన అభిప్రాయం అడగగానే మి ఇష్తం నాన్న అని సిగ్గు పడుతూ చెప్పి వెళ్ళిపోయింది. అక్క బుగ్గలో గులాబీలు పూయిస్తుంది నాన్న. ఆ సిగ్గు చూస్తూ ఉంటే అక్కకి ఆ అబ్బాయి నచ్చినట్లు ఉన్నాడు అంది కావ్య. తరువాత అప్పుడప్పుడు కొన్ని ఫంక్షన్ లలో కలవడం. మాట్లాడుకోవడం. కలిసి బయటకు వెళ్ళడం, తన అల్లరి పనులతో మహేష్ శ్రావ్య కు నచడం మొదలెట్టసాగాడు. ఇళ్ళ రోజులు గడుస్తున్నాయి.

ఒక రోజు శ్రావ్య తన స్నేహితులతో కలిసి టూర్ కి వెళ్ళింది. వారం రోజుల తరువాత ఈ రోజే వస్తుంది. బస్ దిగి తన స్నేహితులకు బై చేప్పి వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తూ " ఏంటి డాడీ ఇంకా రాలేదు. నన్ను చూడకుండా ఆయన అస్సలు ఉండలేరు. ఈ రోజు వస్తున్నని తెలుసు కదా ! ఏంటి ఇంకా రాలేదు డాడీ ఎక్కడ ఉన్నావు. అని తనలో తనే మాట్లాడుతోంది. ఇంతలో ఎవరో వెనక నుంచి బుజం పైన చేయి వేసినట్లు అనిపించడం తో వెనక్కి తిరిగి చూసింది శ్రావ్య. " చంద్రం అంకుల్ మీరా! మీరు ఏంటి ఇక్కడ. డాడీ రాలేదా. అని అడిగింది. ముందు వెళ్దాం పదమ్మ? అన్నాడు చంద్రం. శ్రావ్య ఎన్నో ప్రశ్నలు అడుగుతోంది. కానీ ఒక్కదానికి కూడా సమాధానం చెప్పడం లేదు. ఏంటి అంకుల్ ఏం అయింది. ఎందుకలా ఉన్నారు. అడిగింది శ్రావ్య.



*****

గౌరీ శంకర్ హాస్పిటల్. హాస్పిటల్ ఇక్కడకి ఎందుకు తీసుకువచ్చారు. ఇంటికి తీసుకొని వెళ్లకుండా??

ఏం అయింది అంకుల్ అడిగింది శ్రావ్య. ఎం మాట్లాడడం లేదు. హాస్పిటల్ లోకి అడుగు పెట్టారు. అమ్మా! నువ్వు ఏంటి ఇక్కడ డాడీ ఎరి అని అడిగింది శ్రావ్య. ICU దగ్గరికి తీసుకువెళ్ళింది శ్రావ్య వాళ్ళ అమ్మ అంజలి దేవి. బెడ్ పైన సూర్య నారాయణ గారు. డాడీ డాడీ ఏం అయింది డాడీ కి ఏం అయింది. అరుస్తుంది శ్రావ్య. హార్ట్ ఎటాక్. ముడో సారి. చెప్పింది శ్రావ్య వాళ్ళ అమ్మగారు. ఎలా జరిగింది అమ్మ ఇదంతా ప్రశ్నించింది శ్రావ్య.

మి నాన్న మంచితనాన్ని చేతకాని తనం గా తీసుకున్నారు. నమ్మిన వాళ్ళే మోసం చేసారు. తప్పుడు లెక్కలు చూపించి బిజినెస్ నీ దెబ్బ తీశారు. స్నేహితులే కదా అని నమ్మి బాధ్యతలు వారికి అప్పగిస్తే వారు మోసం చేశారు. ప్రభుత్వం కంపెనీ నీ సిజ్ చేసింది. నమ్మిన వారి మోసం చేయడం తో తట్టుకోలేకపోయాడు.అని ఏడుస్తూ చెప్పింది అంజలి దేవి గారు. మరి ఇంత జరుగుతుంటే మోహన్ రావు అంకుల్ ఏం చేస్తున్నారు అని అడిగింది శ్రావ్య. అసలు ఇదంతా చేసిందే అతను. డబ్బు కోసం మి నాన్న గారి దగ్గర నటించారు అంతే. మి పెళ్ళి కూడా కాన్సిల్ చేశారు. డబ్బు ఉన్న మరో అమ్మాయితో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఆ బాధ తోనే మి డాడీ కి ఇలా. . . .

మాట్లాడలేక పోతుంది అంజలి దేవి గారు.

అమ్మా నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మ ఇప్పుడు ఆ మోహన్ రావు ఇంటికే నా వద్దు అని చెప్పింది శ్రావ్య వాళ్ళ అమ్మగారు అయిన అవి ఎవి వినిపించుకోకుండా వెళ్ళిపోయింది శ్రావ్య. ఆ వెనకాల చంద్రం కూడా శ్రావ్య ను అనుసరిస్తూ వెళ్ళాడు.

మోహన్ రావు గారి ఇంట్లోకి అడుగు పెడుతూనే అరుస్తుంది శ్రావ్య. మోహన్ రావు గారు బయటకి వచ్చి ఏమి తెలియని వాడిలా మంచిగా మాట్లాడుతున్నారు.

శ్రావ్య కి కోపం వస్తుంది. ఇంకా అపంది అంకుల్ ఎందుకిలా చేశారు అని అడిగింది శ్రావ్య. ఒహ్హో అయితే అంతా తెలుసుకునే వచవన్నమాటా! అవును అంతా నేనే చేశాను. డబ్బు కోసం మే నటించాను. ఇప్పుడు ప్రపంచం అంతా డబ్బు తోనే నడుస్తుంది. డబ్బు ఉంటేనే గౌరవం. నేను మి నాన్న పార్టనర్. ఇద్దరికీ ఆ కంపెనీ పైన సమాన అధికారాలు ఉన్నాయి కని ఎక్కడికి వెళ్ళిన మి నాన్న గారిని ఎక్కువగా చూసేవారు. అది నకు నచ్చలేదు. మీ నాన్న అంటే కోపం ఏర్పడింది. పగ తీర్చుకోవాలి అనుకున్నాను. మి నాన్నకి తెలియకుండ సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేసాను. తప్పుడు లెక్కలు చూపించి దెబ్బ తీశాను అన్నాడు మోహన్ రావు. షాక్ లో చూస్తూ ఉండిపోయింది శ్రావ్య.

పక్కనే ఉన్న మహేష్ వైపు చూసింది శ్రావ్య. ఏంటి వడి వైపు చూస్తున్నావు. వాడు నిన్ను నిజంగా ప్రేమించాడు అని అనుకుంటున్నావు కదూ! కాదు నటించాడు. ఇదంతా మా ప్లాన్ లో ఒక భాగం. కావాలనే వాడు ఇలా చేశాడు. ఇదంతా తెలియక నువ్వు దీన్ని నిజం అని నమ్మవు. ఈ జీవిత చదరంగంలో నిన్ను ఒక పావు లా వడుకున్నము. అన్నాడు మోహన్ రావు. అవును శ్రావ్య డాడీ చెప్పిందంతా నిజమే డబ్బు కోసం నిన్ను పెళ్లి చేసుకుందాం అని అనుకున్నాను. ఆ డబ్బు లేనప్పుడు నువ్వు నాకు ఎందుకు అని అన్నాడు మహేష్. బరువెక్కిన శ్రావణ మేఘం లా వర్షించయి శ్రావ్య కళ్ళు. ఇంకా ఏమి మాట్లాడలేక మౌనంగా నడిచింది శ్రావ్య.

వారం రోజుల తరువాత చావు తో పోరాడి కన్ను మూశారు సూర్య నారాయణ గారు. చనిపోయేముందు. తండ్రి అన్న మాటలే పదే పదే గుర్తుకు వస్తున్నాయ్ శ్రవ్యకి. "" నన్ను క్షమించు తల్లీ నువ్వు కోరుకున్న జీవితాన్ని నికు ఇవలేకపోయాను "" తండ్రి గుర్తుకి వచ్చి ఏడ్చేసింది శ్రావ్య.

ప్రస్తుతం:

అమ్మ! నాకు జాబ్ వచ్చింది. అంటూ స్వీట్ తీసుకువచ్చింది శ్రావ్య. ఇంతకు ముందు ఎప్పుడూ లేని ఒక మెరుపు, ఆత్మవిశ్వాసం శ్రావ్య కళ్ళలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. శ్రావ్య ను చూస్తే ఇప్పుడు ఆమెకు చాలా సంతోషంగా ఉంది. ప్రేమగా శ్రావ్య కళ్ళలోకి చూస్తూ ఉంది. ఎంటామ్మా అల చూస్తున్నావు అంది శ్రావ్య. శ్రావ్య నిలో ఇంత మార్పు ఊహించలేదు తల్లి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది అంది శ్రావ్య వాళ్ళ అమ్మ. గతాన్ని ఒక కలలా మర్చిపోతే మంచిదనీ తెలుసుకున్నాను అంది శ్రావ్య.

ఇళ్ళ రెండు నెలలు గడిచాయి. శ్రావ్య వాళ్ళ పరిస్తితి కూడా ఇప్పుడు కాస్త బాగుంది. ఒక రోజు తను ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా వల్ల ఎండి వచ్చాడు. సార్ మీరు ఏంటి సార్ ఇలా వచ్చారు. పిలిస్తే నేనే వస్తానుగా అంది శ్రావ్య. నన్ను క్షమించు అమ్మ. నువ్వు ఎవరో ఇన్ని రోజులు పటించుకొలేధు అన్నాడు ఆయన. సార్ మీరు ఎం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కావడం లేదు సార్ అంది శ్రావ్య. నేను మి నాన్నగారి గురించి మాట్లాడుతున్నాను. మి నాన్న గారు నాకు చాలా సహాయం చేశారు. ఇప్పుడు నేను నా కుటుంబం ఈరోజు ఈ స్థాయిలో ఉంది అంటే దానికి కారణం నాన్న గర్ నమ్మ. ఆయన ఆఖరి రోజులలో నేను ఆయనకు సహాయం చేయలేకపోయినందుకు చాలా బాధగా ఉంది. అందుకు ఇప్పుడు నేను నికు సహాయపడలనుకుంటున్నను అన్నాడు అతను. నికు ఇప్పుడు ఒక్కరినీ పరిచయం చేస్తాను అన్నాడు శ్రావ్య వాళ్ళ ఎండి.

శివ అని పిలిచాడు. వెంటనే ఒక అబ్బాయి వచ్చాడు. వీడిని గుర్తు పట్టవా. విడు నా కొడుకమ్మ. పేరు శివ. చిన్నపుడు నీతో కలిసి చదువుకున్నాడు. మి ఇంటికి వచ్చేవాడు. మీరు కలిసి ఆడుకున్నారు. హా గుర్తు వచ్చింది సార్. సార్ కాదమ్మా అంకుల్ అని పిలువు పర్లేదు. సరే మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను వస్తాను అంటూ వెళ్లిపోయారు శివ వల్ల నాన్న గారు. జరిగినవి ఎవి శివ కు తెలీదు. నువ్వు ఏంటి. ఇక్కడ జాబ్ చేయడం ఎంటి అసలు అని అడిగాడు శివ జరిగిందంతా చెప్పింది శ్రావ్య. అవునా సరే అయితే మనం వాడికి గుణపాఠం చెప్పే తీరాలి లేదా వాడు ఇంకా ఎంత మందిని మోసం చేస్తాడో అన్నాడు శివ. మౌనంగా ఉండి శ్రావ్య. అవును మి నాన్న గారి బిజినెస్ నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయవచ్చు కదా. మి నాన్న గారి కల కూడా ఇదే కదా అన్నాడు శివ. నిజమే కావచ్చు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అది కుదరదు. ఇన్వెష్ట్ చేయడానికి డబ్బు కూడా లేదు అంది శ్రావ్య. దని గురించి నువ్వు ఆలోచించకు అది నేను చూసుకుంటాను అని అన్నాడు శివ. థాంక్స్ శివ కని వద్దు. నా సొంతం గానే నేను బిజినెస్ చేయాలని అనుకుంటున్నాను అండి శ్రావ్య. నచ్చచెప్పి చూసాడు శివ. కానీ శ్రావ్య వినలేదు. సరే అయితే లోన్ తీసుకుందాం. ఇది నికు ఓకే కదా అన్నాడు శివ.

శివ శ్రావ్య కు సాయం గా ఉన్నాడు. ఈ క్రమంలో నే వాళ్ళు మంచి స్నేహితలయ్యారు. శివ పరిచయం తో శ్రావ్య, కావ్య, అంజలి దేవి గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలా రెండు నెలలు గడిచాయి. ఒక రోజు శ్రావ్య , శివ బయటకి వెళ్లి తిరిగి వస్తుండగా శివ ఫ్రెండ్ సిరి కనిపించింది. శివ, సిరి, శ్రావ్య ఒక కాఫీ షాప్ లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏంటి శివ అసలు కాల్ కూడా చేయడం లేదు పెళ్లికి కూడా రాలేదు అడిగింది సిరి. హోం సారి సిరి కొంచెం పని ఉండడం వల్ల రాలేదు. హ్యాపీ మెరేజే లైఫ్ అన్నాడు శివ. అవును మి హస్బెండ్ నీ చూపించవా. కనీసం ఫోటో అన్న చూపించు అన్నాడు శివ సిరి తన ఫోన్లో ఒక ఫోటో తీసి చూపించింది సిరి. ఆ ఫోటో చూసి ఇద్దరు షాక్. అందులో ఉంది ఎవ్వరో కదు మహేష్. శివ సిరి కి నిజం చెప్పాలనుకున్నాడు. శ్రావ్య అడ్డు పడింది. నువ్వు ఉండు శ్రావ్య నిజం సిరికి తెలియాలి. తను కూడా మోసపోయింది. ఎంటి శివ ఏం నిజం అని అడిగింది సిరి. జరిగిందంతా చెప్పాడు శివ. ఇంత మోసం చేస్తారా. వల్ల సంగతి ఇప్పుడే తేలుస్తా అంది సిరి. సిరి కూల్ డౌన్. జరిగింది ఎదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు గొడవ చేస్తే ఏం లాభం లేదు. మనకు కావల్సింది వాళ్ళు మారడం. నువ్వు కూడా మాకు సాయం చేయాలి అన్నాడు శివ. ఒకే అంది సిరి. శ్రావ్య వాళ్ళను వాళ్ళు ఎలా మోసం చేశారో మనం కూడా అలానే దెబ్బ కోట్టాలి. అప్పటిదాకా నేను చెప్పింది చై. అన్నాడు శివ. వాళ్ళు కొంచం సేపు మాట్లాడుకుని వెళ్లిపోయారు.

ఇలా కొన్ని రోజులు గడిచాయి. శ్రావ్య కు లోన్ రావడం లేదు. ఎం చెయ్యాలో అర్ధం కావడం లేదు. ఆలోచిస్తూ కూర్చున్నారు శివ, శ్రావ్య. ఇంతలో శివ వాళ్ళ నాన్న గారు వచ్చారు ఏవో పేపర్స్ పట్టుకొని. ఎంటి నాన్న ఇవి అడిగాడు శివ. అమ్మ శ్రావ్య మి నాన్న గారు నాకు చాలా సహాయం చేశారు. నేను బిజినెస్ మొదలు పెట్టినా మొదట్లో లాభాలు లేవు అప్పుడు ఆయన నాకు కొంత భూమినీ ఇచ్చారు. దానిని అమ్మి ఆ డబ్బు తో డబ్బుతో వ్యాపారం మొదలు పెట్టాను. తరువాత ఈ భూమిని కొనుగోలు చేసి ఎన్నో సార్లు తిరిగి ఇచ్చిన మి నాన్న గారు తీసుకోలేదు. ఎదో ఒక్క రోజు అవసరం అయినప్పుడు కచ్చితంగా తీసుకుంటాను మి దగ్గర ఉంచండి అన్నారు. ఇప్పుడు ఇది నికు అవసరం అంటూ ఆ పేపర్స్ ఇచ్చాడు. మా సాయం నికు అవసరం లేదు. కానీ ఇది మి నాన్న గారిదే కదా. ఆయన ముందే భవిషేత్తు నీ ఊహించరనుకుంటా. ఇవి న దగర ఉండిపోయాయి. అన్నాడు శివ వాళ్ళ నాన్న గారు.

శ్రావ్య బిజినెస్ స్టార్ట్ చేసింది. కేవలం రెండు నెలల్లోనే బాగా లాభాలు తెచ్చిపెట్టాయి. మరో పక్క మోహన్ రావు కి పతనం మొదలయింది. శ్రావ్య ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే మోహన్ రావు గారు మాత్రం దిగజారిపోసగారు. సిరి సహాయం తో మోహన్ రావు కి తగిన బుద్ది చెప్పారు శివ,శ్రావ్య. శ్రావ్య వాళ్ళు ను ఎలా మోసం చేశారో అలానే వీళ్ళు చేయసాగారు. మోహన్ రావు కి చేసిన పాపాలు ఒక్కోటి గుర్తుకు వస్తున్నాయ్. శ్రావ్య విషయం లో చేసిన తప్పుకు బాధ పడ్డాడు.

అతి తక్కువ కాలంలో లోనే శ్రావ్య ఆంధ్ర లో నెంబర్ వన్ వ్యాపారవేత్త గా ఎదిగింది. ఈ కారణం గా వాళ్ళు ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశారు. సమాజం లో పలుకుబడి ఉన్న పెద్దలు అందరూ వస్తున్నారు. బందువులు, స్నేహితులు కూడా తిరిగి చేరువయ్యారు.

ఈ సమయం లో మోహన్ రావు కి శ్రావ్య తప్ప వేరే దారి కనిపించలేదు. వెంటనే మోహన్ రావు వెళ్లి శ్రావ్య కళ్ళ మీద పడి వేడుకున్నారు. అందరి ముందు. క్షమాపణ చెప్పారు. శ్రావ్య కూడా అతనిని క్షమించి పోయినా అస్తినీ తిరిగి ఇప్పించింది.

అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. శ్రావ్య నెంబర్ వన్ వ్యాపారవేత్త కావడం వలన తనని పెళ్ళి చేసుకోవడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఈ విషయం తెలిసి శివ చాలా బాధపడ్డాడు. ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఇంతా లో స్టేజ్ పైన శ్రావ్య వచ్చి మాట్లాడుతుంది. అమ్మ నికు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నను. ఇప్పుడు నికు సంతోషమే కదా అంది శ్రావ్య. అంజలి దేవి గారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు.

శ్రావ్య మాట్లాడుతుంది. మన జీవితంలో చాలా మంది ఎదురవుతూ ఉంటారు. కొంత మంది పాఠాలు నేర్పిస్తే మరికొందరు గుణపాఠం నేర్పిస్తారు. నేను ముగ్గురికి థాంక్స్ చెప్పాలి. ఒకరు మోహన్ రావు గారు ప్రపంచం అంటే ఎలా ఉంటుందో చూపించారు. సిరి సొంత వాళ్ళు అయిన న్యాయం వైపు నిలబడి మాకు సాయం చేసింది. మూడు శివ స్నేహం లో నీ గొప్పతనాన్ని ప్రేమలోని మాధుర్యాన్ని తెలియజేశాడు. " శివ నువ్వు నా తో ఉంటే కేవలం ఒక సంవత్సరం లోనే ఇంతా సాధించాను. నువ్వు నాకు లైఫ్ లాంగ్ తోడు ఉంటే ఈ ప్రపంచమే నా సొంతం అవ్తుంది. విల్ యూ మ్యారి మి" అని ప్రపోజ్ చేసింది శ్రావ్య. ఆ మాటలు విన్న శివకి అంతులేని ఆనందం సంతోషం ఒక్కసారి వచ్చింది దాంతో అతను ఆకాశం లో ఎగురుతున్న అనుభూతి కలిగింది శివకి. హాల్ అంతా చప్పట్లతో నింది పోయింది. శివ కూడా మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉన్నాడు. దూరం గా ఉన్న తన తండ్రి ఫోటో చూస్తూ మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది శ్రావ్య.



************







మంచి మాట.....

వెళుతున్న దారిలో ఎన్నో ముళ్ళు ఉంటాయి.

వాటిని తీసేసి నదిస్తెనే ప్రయాణం సులువు అవుతుంది.

కాదని కూర్చుంటే మనం ఉన్న చోటే నిలబడిపోతం.

ఒంటరిగా మిగిలిపోతం. జీవితం కూడా అంతే. కష్టాలు వస్తున్నాయి అని పోరదకుంట ఉంటే ఒడిపోటం. అదే ఎదురు తిరిగి ధైర్యంగా పోరాడితేనే జీవితాన్ని గెలుస్తాం, జీవితాన్ని సాసిస్తం.......





అందరూ బాగుండాలి అని కోరుతూ సెలవు తీసకుంటున్నాను.

ఇట్లు

మి

రావణ లంకాధిపతి

సర్వేజనా సుఖినోభవంతు


🌅🌄🙏🏻🙂 గుడ్ మార్నింగ్ 🙂🙏🏻🌄🌅