Read Fonts by murthy srinvas in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అక్షరాకృతి




ఎప్పుడూలాగానే కాలేజీకి వెళ్ళడానికి తయారవుతోంది అక్షర

"ఏక్కడికే బయలుదేరుతున్నావు" అక్షరను అడిగింది అక్షర తల్లి.

"ఇంకెక్కడికమ్మా... కాలేజీకే" చెప్పింది అక్షర

“నువ్వేమీ కాలేజీకి వెళ్ళక్కర్లేదు...ఇంత జరిగాక కాలేజీకి వెళ్ళటానికి నీకు సిగ్గు అనిపించటం లేదు".

"అమ్మా...ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు. ఏ తప్పూ చేయని నేను ఎందుకమ్మా సిగ్గు పడాలి. తప్పు చేసింది వాళ్ళు. వాళ్ళు సిగ్గు పడాలి"

"నువ్వేమీ తప్పు చేయ లేదా? మరైతే నిన్న, మొన్నా మనందరికీ జరిగిందంతా ఏమిటి ? గొంతుచించుకొని అరిచింది తల్లి..

నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి కూర్చుంది మానస
మొహానికి పట్టిన చెమటని తుడుచుకుంది

" ఏంటో ఈ జ్ఞాపకాలు నన్ను ఎప్పటికి వదిలిపోతాయో ఏంటో.?" అనుకొంటూ లేచి వంట గదిలోకి వెళ్ళింది

వంటింట్లో కూరగాయలు కట్ చెయ్యడం మొదలుపెట్టింది మానస

'అలూ...బైంగల్...సబ్జీ'- ప్రతి రోజూ సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు ఖంగుమని వినిపిస్తుంది కూరగాయలమ్ముకునే తాత గొంతు.

ఆ రోజు ఆ గొంతు వినబడ్డ వెంటనే నవ్వుకుంది..

పెళ్ళి చేసుకుని మహారాష్ట్రం వచ్చిన కొత్తలో హిందీ భాష ఒక ముక్క కూడా అర్ధమయ్యేది కాదు.

"నీకు హిందీ భాష వచ్చా?" గోరింటాకు పెట్టుకున్న భార్య చేతి వేళ్ళను మృధువుగా నొక్కుతూ ఫస్ట్ నైట్ రోజు అడిగాడు భర్త కైలాష్.

“వచ్చు” అన్నట్లు తల ఉపుతూ "హిందీలో మధ్యమ వరకు చదువుకున్నాను" చెప్పింది మానస

"అయితే...కొంచం తెలుసని చెప్పు"

"హూ" అంటూ తల ఊపింది

కానీ

మొదటిసారి కాపురానికి డిల్లీ వెళ్ళే రైలు ఎక్కి కూర్చున్నప్పుడు, చెన్నై నుండి మాహారాష్ట్రం వెడుతున్న ఒక గుంపు వాళ్ళకు ఎదురుగా కూర్చుని మాట్లాడిన హిందీ భాషను విని కొంచం భయపడింది అక్షర..వాళ్ళు భర్త కైలాష్ తో మాట్లాడిన హిందీ, కైలాష్ వాళ్ళకు హిందీలో ఇచ్చిన సమాధానం విన్న మానసకు తల తిరిగినంత పనైంది.

"ఏం మాట్లాడుతున్నారు...నా గురించి ఏదో చెబుతున్నారు?" భర్త చెవిలో గుశగుశలాడింది

"నీకు హిందీ బాగా వచ్చు కదా"

భర్త సమాధానంతో పరువు పోయినట్లు ఫీలయ్యింది

'ఏక్ గావోమే ఏక్ కిశాన్’ కంఠస్తం పట్టిన తన హింది పనికిరాదని తెలుసుకుంది.

ఇదిగో ఈ కూరగాయలు అమ్ముకునే తాత గొంతును మొదటిసారి విన్నప్పుడు, అతను అమ్ముతున్న కూరగాయలు ఏమిటో వాటిని చూసిన తరువాత మానసకు అర్ధమయ్యింది.

ఆ రోజు భర్త కైలాష్ ఇంటికి వచ్చిన వెంటనే కూరగాయలు అమ్ముకునే తాత గురించి, అతని దగ్గర కూరగాయలు ఎలా కొన్నది వివరించి చెప్పింది. పగలబడి నవ్వాడు భర్త కైలాష్.

“నాకు హిందీ బాగా వచ్చు...ఫస్ట్ నైట్ రోజు గొప్పగా చెప్పావు? మొదటి పనిగా హిందీ నేర్చుకో. ఇరుగు పొరుగు వారితో స్నేహం చేసుకో. హిందీ తానుగా వస్తుంది...కానీ అంతవరకు హిందిలో మాట్లాడ కూడదు" అంటూ మళ్ళీ పగలబడి నవ్వాడు. భర్త నవ్వుతుంటే సిగ్గుగా అనిపించింది మానసకు.

అది తలచుకునే ఇప్పుడు నవ్వుకుంటోంది. అలా కూరగాయలు అమ్ముకునే తాత దగ్గర, ఇరుగు పొరుగు వారితో తెలిసీ తెలియని హిందీలో మాట్లాడుతూ, వారి దగ్గర నుండి చాలా వరకు హిందీ నేర్చుకుంది.

మహారాష్ట్రం వచ్చి రెండేళ్ళు అవుతోంది. ఇప్పుడు మానసకు హిందీ భాష మాట్లాడడం, అర్ధం చేసుకోవడం బాగా అలవాటయ్యింది.

కైలాష్ కి అక్కడున్న సిమెంట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం. మంచి జీతం, కావలసిన వసతులతో కంపనీ క్వార్టర్స్, హాయిగా గడిచిపోయే జీవితం.

వంట పూర్తి అయ్యే సమయంలో ఎవరొ తలుపు తడుతున్న శబ్ధం. పక్కింటి “మెహతా బాబీ” అయ్యుంటుంది అనుకుని, గ్యాస్ స్టవ్ ను తగ్గించి, వంటింట్లో నుండి వచ్చి తలుపు తెరిచింది.

ఎదురుగా భర్త కైలాష్.

చేతిలోని బైక్ కీస్ గిరగిరా తిప్పుతూ "ఒక ముఖ్యమైన ఫైలు మర్చిపోయి వెళ్ళిపోయాను. అందుకే తీసుకు వెళ్ళటానికి వచ్చాను" అంటూ కొంటె చూపుతో భార్యను చూశాడు.

“ఫైల్ మర్చిపోయి వెళ్ళిపోయారా? ఇది నేను నమ్మాలా? ఇలాగే ఇంతకు ముందు మీరు ఫైల్ మర్చిపోయి, తిరిగి ఇంటికి వచ్చినప్పుడల్లా ఏం జరిగిందో నాకు బాగా గుర్తుంది. ఫైలూ లేదు, గీలూ లేదు...మీరు దయచేయండి" అంటూ ఆఫీసుకు తిరిగి వెళ్ళమని గుమ్మం వైపు చేయి చూపించింది.

"ఏయ్...ఏమిటి నువ్వు? ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ కాళ్ళ మీద వేడినీళ్ళు పడినట్లు కంగారుగా తిరుగుతున్నారు. తెలుసా? నేనేమో ఒక ముఖ్యమైన ఫైల్ నీ ఇంట్లో మర్చిపోయి వెళ్ళాను. ఇది తెలిస్తే జీ.ఎం గంతులేస్తాడు. పది నిమిషాలలో ఆ ఫైల్ తీసుకుని ఆయన ముందుకు వెళ్ళకపోతే మనం మూటా ముల్లె సర్దుకొని ఊరికి వెళ్ళి అడుక్కోవాలి"

భార్యను తోసుకుంటూ లోపలకు వెళ్ళాడు.

కంగారు కంగారుగా తన గది లోకి దూరాడు. అక్కడున్న టేబుల్ సొరుగులో నుండి మూడు ఫైళ్ళను తీసి, అందులో ఒక ఫైలును తీసుకుని బయటకు వచ్చాడు.

వంట గదిలో, పూర్తైన వంట గిన్నెలపై మూతపెడుతున్న భార్య వెనుక నిలబడి "మానసా" అని పిలిచాడు కైలాష్.

"ఊ" అన్నది మానస

"బాగా టయర్డ్ గా ఉంది...కొంచం కాఫీ ఇస్తావా"

"ఇప్పుడు ఏం చేసొచ్చారని...టయర్డ్ అవటానికి"

"ఫైలు వెతికి తీసుకున్నాను కదా...అదే టయర్డ్ అయ్యాను"

"అదేదో చాల కష్టమైన పని లాగా..."

"సరే, సరే. తొందరగా ఇవ్వు. పది నిమిషాల్లో ఆఫీసులో ఉండాలి"

"మీరు వెళ్ళి హాల్ లో కూర్చోండి...తెస్తాను"

కైలాష్ వెనక్కు తిరిగి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాడు.

కొద్ది నిమిషాల తరువాత అక్కడికి కాఫీ తీసుకు వచ్చిన మానస "ఇదుగోండి" అంటూ కాఫీ కప్పు అందించింది.

భార్య అందించిన కాఫీ కప్పు తీసుకుని రెండు గుటకలు వేసి , టీపాయి మీద పెట్టి,

అమె బుగ్గ మీద ముద్దు పెట్టి .

"జాగ్రత్త.." అని చెప్పి ఫైలు తీసుకుని బయలుదేరాడు.

"కాఫీ"

"నువ్వు తాగేయ్"

భర్త హడావిడి చూసి నవ్వుకుంది మానస

మైన్ డోర్ తలుపుకు గడియ వేసి, మిగిలిన పని చేసుకోవడానికి వంటింట్లోకి వెళ్ళింది .

ఇంతలో హల్ లో తన ఫోన్ మోగింది.

గబగబ హాలులోకి వచ్చి కాల్ లిఫ్ట్ చేసి "హలో" అన్నది.

"నేనమ్మా...నాన్నను మాట్లాడుతున్నాను"

ఆ గొంతు వినగానే మానస మొహం ఆనందంతో వెళ్ళివిరిసింది.

"నాన్నా....ఎలా ఉన్నావు?"

"బాగున్నానమ్మా"

"అమ్మ, చెల్లి ఎలా ఉన్నారు?"

"చాలా బాగున్నారమ్మా. నువ్వు, అల్లుడుగారు ఎలా ఉన్నారు?”

"బాగున్నాము నాన్నా…..మిమ్మల్నందరినీ చూడాలాని చాలా ఆశగా ఉన్నది"

"ఒకసారి వచ్చి వెళ్ళొచ్చు కదా"

"ఎక్కడ నాన్నా...ఆయనకు సెలవు దొరకాలి కదా"

"దూరంగా ఉంటే ఇదేనమ్మా ప్రాబ్లం...లాంగ్ లీవ్ పెట్టాలి. ఒక్కసారిగా లాంగ్ లీవ్ కంపనీ వాళ్ళు ఇవ్వరు. అల్లుడు గారిని హైదరాబాదుకు మార్చుకుని వచ్చేయమని చెప్పు"

"అది అంత సులభం కాదు నాన్నా”

"సరేనమ్మా! నీతో ఒక ముఖ్యమైన విషయం చెబుతామని ఫోన్ చేశాను"

"చెప్పు నాన్నా"

"పెళ్ళి చూపులకని సుజాతని చూడటానికి రాజమండ్రి నుంచి వచ్చారమ్మా"

"అలాగా? పెళ్ళి కొడుకు ఏం చేస్తున్నాడు?"

"పెళ్ళి కొడుకు బ్యాంకులో మేనేజర్. మంచి సంబంధం...బాగా ఉన్నవాళ్ళమ్మా. ...చూడటానికి కూడా బాగా హుందాగా, అందంగా ఉన్నాడమ్మా"

"అలాగైతే పెళ్ళి కుదుర్చుకుని ఉండొచ్చు కదా”

"ఈ సంబంధం ఓకే చేసుకుందామనే అనుకుంటున్నాము...జాతకం కూడా బాగా కలిసింది"

"చాలా ఆనందంగా ఉంది నాన్నా. త్వరగా ముహూర్తాలు పెట్టుకోండి"

"కానీ ఒక ప్రాబ్లం నన్ను వేదిస్తోందమ్మా"

"ఏమిటి నాన్నా అది?"

"డబ్బు ఎలా సర్ధుబాటు చేసుకోవాలో తెలియటం లేదమ్మా. నీ పెళ్ళి జరిగి రెండు సంవత్సరాలు అవుతోంది. నీ పెళ్ళికి చేసిన అప్పులు చాలా వరకు తీర్చాను. కొద్దిగా ఉంది...సుజాతకి రెండేళ్ళ తరువాత పెళ్ళి పెట్టుకుందాములే అనుకున్నాను. కానీ దానికి ఇలా సడన్ గా మంచి సంబంధం వస్తుందని అనుకోలేదు. ‘మంచి సంబంధం. వదులుకోకూడదండి. ఎలాగైనా డబ్బు సర్దుబాటు చెయ్యండి’ అంటోంది మీ అమ్మ. అందుకే ఏం చేయాలో తెలియటం లేదు"

"నేను కావాలంటే ఆయన దగ్గర అడిగి కొంత డబ్బు సర్ధుబాటు చేస్తాను"

“వద్దమ్మా... డబ్బు వద్దు. అమ్మ నిన్ను ఒకటి అడగమంది"

"చెప్పు నాన్నా"

"పెళ్ళి వారు యాబై కాసుల బంగారం అడుగుతున్నారు. నువ్వు నీ నగలలో ఏదైనా రెండు నగలు ఇస్తే...వాటిని కూడా ఇచ్చి తాంబూలాలు పుచ్చుకుందామని చెప్పింది"

"దానికేముంది నాన్నా....ఏం నగలు కావాలో అడగండి. ఇస్తాను. సుజాత పెళ్ళి బాగా గ్రాండు గా జరగాలి. దానికోసం ఇదికూడా చెయ్యకపోతే ఎలా నాన్నా? ఎన్ని నగలైనా నేను ఇస్తాను.”

"నువ్వలా చెబుతూంటే ఆనందంగా ఉందమ్మా. కానీ, అల్లుడుగారు ఏమంటారో? ఆయన్ని అడగ కుండా నువ్వే సమాధనం చెబుతున్నావు...ఎలాగమ్మా?"

“నాన్నా...ఆయన గురించి నాకు బాగా తెలుసు. ఆయన ఇమ్మనే చెబుతారు"

"అల్లుడు గారి మీద నీకున్న నమ్మకం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా. కానీ, ఆయన్ని అడగ కుండా నా దగ్గర ఇస్తానని చెప్పినట్లు ఆయనకు చెప్పకమ్మా. ‘నన్ను అడగ కుండా నగలు ఇస్తానని నువ్వెందుకు మాటిచ్చావు’ అంటూ నీతో గొడవకు దిగుతారేమో"

"నాన్నా...మీ అల్లుడు అలాంటి మనిషి కాదు. చాలా మంచి వారు. ఆయన తన స్నేహితుడి పెళ్ళికే డబ్బు సహాయం చేశారు. అలాంటిది, నా చెల్లి పెళ్ళికి సహాయం చేయరా?"

"ఏంటోనమ్మా...ఇంత మంచి అల్లుడు దొరికినందుకు నేనెంతో పుణ్యం చేసుకోనుండాలి. సుజాత కి కాబోయే అల్లుడు కూడా మంచి వాడుగా ఉంటే, నేనెంతో అద్రుష్ట వంతుడవుతాను. ఇద్దరి కూతుర్లనూ మంచి వారి చేతుల్లో పెట్టానని సంతోషంగా, త్రుప్తిగా మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడిపేస్తాను"

"నాన్నా...నీ మంచి మనసుకు అంతా మంచే జరుగుతుంది...నువ్వు అనవసరంగా భయపడకు"

"సరేనమ్మా....అల్లుడు గారిని అడిగానని చెప్పు. ఆయన్ని అడిగి నాకు ఫోన్ చెయ్యి”

“సరే నాన్నా...అమ్మ దగ్గర చెప్పు, దేనికీ కంగారు పడవద్దని. సుజాత పెళ్ళి గొప్పగా జరుపుదాం"

"సరేనమ్మా"

నాన్న ఫోన్ పెట్టాశారు.

మానసకు మహా ఆనందంగా ఉంది. వెంటనే చెల్లి సుజాతను చూడాలని, పెళ్ళి గురించి ఎన్నో విషయాలు మాట్లాడి, పెళ్ళి చేసుకోబోయే పెళ్ళికొడుకు గురించి ఆటపట్టించి, ఆమె ముఖంలో సిగ్గు తెప్పించి, అది చూసి ఆనందపడాలని ఉన్నది.

"వెంటనే వెళ్ళలేను...తాంబూలాలకు వెళ్ళినప్పుడు ఒక పది రోజులు,పెళ్ళికి వెళ్ళినప్పుడు ఒక నెల రోజులు అమ్మా, నాన్నల దగ్గర ఉండాలి. ఊర్లో అందరినీ పలకరించాలి" మనసులోనే ప్లాను వేసుకుంది.

పెళ్ళి తరువాత మానస రెండు సార్లు మహారాష్ట్ర వదిలి ఊరికి వెళ్ళీనా, తన సొంత ఊరు వెళ్ళలేదు. పిన్ని కూతురు పెళ్ళికి, ఏలూరు వెళ్ళింది.నేరుగా కల్యాణ మంటపానికి వెళ్ళి, మరునాడు అక్కడి నుండి తిన్నగా రైల్వే స్టేషన్ కు వచ్చి, తిరుగు రైలు ఎక్కింది. రెండో సారి అత్తయ్యకు సీరియస్ గా ఉన్నదని చెబితే తిన్నగా హాస్పిటల్ కు వెళ్ళి, అక్కడే రెండు, మూడు రోజులు ఉండి, అక్కడే అమ్మా, నాన్న, చెల్లి ని చూసి హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది.

మధ్యాహ్నం లంచ్ కు వచ్చిన కైలాష్..వంటకాలు చూసి ఆశ్చర్యపోయాడు కైలాష్ " ఇప్పటి నీ సంతోషానికి కారణమేమిటి శ్రీమతి "

"సంతోషమైన విషయం ఒకటుంది"

"వావ్...చెప్పు...చెప్పు"

"కనుక్కోండి చూద్దాం"

"చిన్ని మానస ?"

"దానికి ఇంకా టైముంది. మీరే కదా దానికి టైము పెట్టారు"

"మరైతే ఇంకేమిటో చెప్పు"

"సుజాతను చూడటానికి పెళ్ళి వారు వచ్చారట"

"అలాగా....సుజాత వాళ్ళకు బాగా నచ్చుంటుందే...ఓకే చెప్పుంటారే"

"అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు"

"సుజాత అందం అలాంటిది...ఎవరైనా ఆమె అందానికి బానిస అవాల్సిందే"

“మీరు కూడానా"

"అందులో సందేహం లేదు. నిజం చెప్పలంటే సుజాతనే పెళ్ళి చేసుకుందామనుకున్నాను. మా అమ్మే అడ్డుపడింది. అక్కయ్య ను చూడటానికి వచ్చి చెల్లెల్ను ఒకే చేస్తే, మనల్ని తన్ని తరుముతారు అని చెప్పింది. మొదటికే మోసం వస్తుందని నేనే నిన్ను చేసుకోవడానికి సరే అని చెప్పాను"

మానస మొహం ఎర్ర బడింది. వేడి వేడి ముక్కల పులుసును భర్త చేతి మీద పోసింది.

"ఆ... ….ఆ…… రాక్షసీ...మొగుడి మీద వేడి పులుసును పోసే నువ్వూ ఒక భార్యవేనా"అన్నాడు కైలాష్ డ్రామాటిక్ గా

“అదే నేనూ అడుగుతున్నా... మీరూ ఒక మొగుడేనా? …నా మెడలో తాలి కట్టి, ఇంకొక అమ్మయి అందం గురించి పొగడుతున్నారే..."

“ఇంకొక అమ్మాయా....నీ చెల్లెలు అందం గురించే కదా గొప్పగా చెప్పాను"

"సరే...మాట్లాడుతూనే ఉండండి" అని కోపం గా అక్కడ నుండి లేచి వెళ్ళిపోబోయింది..

వెళ్ళిపోతున్న మానస చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టి.."కోపమా? సరదాగా అన్నాను...సరే చెప్పు"

"పెళ్ళికొడుకు బ్యాంకులో మేనేజర్ గా చేస్తున్నాడట. బాగా ఉన్నవాల్లట"

"అలాగా! అయితే ఇంకేం...పెళ్ళి ఖాయం చేసుకోవచ్చుగా?"

"డబ్బు కోసం ఆలొచిస్తున్నారట. నా పెళ్ళికోసం చేసిన అప్పు ఇంకా కొంచం తీర్చాలట...ఈ లోపే మళ్ళీ పెళ్ళి, అప్పు అంటే భయపడుతున్నారు...కానీ మంచి సంబంధం, వదులుకోలేక పోతున్నానని చెప్పారు"

“ఎందుకు వదులుకోవాలి? ఖర్చుకోసం భయపడి వదులుకోకూడదు. కావలసిన డబ్బు నేను ఏర్పాటు చేసిస్తానని చెప్పకపోయావా? నగలు, బంగారం కావాలంటే నీ దగ్గరున్నవి ఇవ్వు"

అంతే, మానస కళ్ళలో గిర్రున నీళ్ళు తిరిగాయి. అమాంతం లేచి భర్త గుండెలపై వాలిపోయింది..

ఇంకా ఉంది..