Read Gold cage by murthy srinvas in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

బంగారు పంజరం

బంగారు పంజరం



" ఏంటే నోరు లేస్తోంది ఎక్కువ మాట్లాడావ్ అనుకో

పళ్ళు రాలగొడతా జాగ్రత్త" అంటూ అరుస్తోంది మా

అత్తగారు అన్నపూర్ణ

"ఎందుకు లేవదు నోరు అ పొగరుబోతు దగ్గరికి వెళ్లి

వెళ్ళొచ్చింది గా అక్కడ నీళ్లు వంటపట్టినట్టున్నాయ్

బాగా " అంటూ అగ్నికి అజ్య్o పోస్తోంది మా

ఆడపడుచు సుధ

" అత్త అసలా ఇపుడు మీరు పెద్దమ్మ ని ఎందుకు

అంటున్నారు " లేఖ నా కూతురు

మాటలు ఎక్కడ మొదలైన మా అక్క దగ్గరకి

రావాల్సిందే పాపం ఈ పిల్ల కి తెలియదు అనుకుని

నిట్టూర్చింది గీత

"ఏంటే దాన్ని అంటే నీకు పొడుచుకొస్తోంది రోషం" సుధ

"అయినా నా ముందు మా అమ్మ ముందే గా మీ

మాటలు ఆటలు పెద్దమ్మ ఎదురుగా ఒక్కమాట కూడా

మాట్లాడలేరు గా " లేఖ

మాటలు శృతి మించుతున్నాయి నేను వెళ్లాల్సిందే

అనుకుని పొయ్యి ఆపేసి గబగబా హాల్ లో కి నడిచా

లేదు పరిగెత్తా

" లేఖ ఏంటా మాటలు " కోపం గా అరిచాను

" నేను తప్పు ఎం మాట్లాడాను అమ్మ ఉన్నదేగా అన్నది " లేఖ


చూసావా అమ్మ మనం వద్దు అన్న వాళ్ళ అక్క దగ్గరకి

పంపించినది కాకా ఇపుడు చూడు ఎం ఎరగనట్టు

( తేలినట్టు ) నాటకాలు ఆడుతోంది ని కోడలు

నిప్పులు చెరుగుతూ నా వైపు చూస్తోంది మా

అత్తగారు

లేఖ లోపలికి పో వేళ్ళు అంటూ తనని లోపలికి

పంపించి గొడవ ఆపే ప్రయత్నం ప్రయత్నం చేశా

అమ్మ నేను లోపలికి వెళ్లడం కాదు నువ్వే బయటకి

రావాల్సింది అని నా వైపు అసహనం గా చూస్తూ

లోపలికి వెళ్ళింది

ఇంకా అక్కడే ఉంటే ఇంకెన్ని మాటలు వినాల్సొస్తుందో

అని లోపలికి గది లో కి వెళ్ళాను

లేఖ ఏంటమ్మా అత్త తో ఆలా నేనా మాట్లాడేది తప్పు

కదా
.
తప్పు ఎం మాట్లాడాను నేను ఉన్నదేగా అన్నది " లేఖ

మౌనం కలహం నాస్తి అంటారు వాళ్ళు మాట్లాడేటప్పుడు
కామ్ గా ఉన్నావ్ అనుకో గొడవ ఉండదు కదా తల్లి

అమ్మ మౌనం కలహం నాస్తి కాదు " మౌనాం అర్ధాంగికిరం" వాళ్ళు మాట్లాడుతున్నపుడు సైలెంట్ గా
ఉంటే వాళ్ళు అనే మాటలు నిజాలని మనమే ఒపుకున్నట్టు అవుతుంది " స్థిరంగా చెప్పింది లేఖ

మా అక్క నే కనిపిస్తోంది దాని మాటల్లో

ఈలోపు స్నానం కి వెళ్ళింది లేఖ

నా మనసు గతం లో కి వెళ్ళింది

" హే గీత ఈ పట్టుపరికిని వేసుకోవే సాయంత్రం ని పుట్టినరోజు వేడుకకి " మురిపంగా నా వైపు చూస్తూ ఇచ్చింది మా నాన్నమ్మ

హాయ్ ఎంత బావుందో నాన్నమ్మ అని నేను కేరింతలు కొడుతున్న ఎగురుతూ

మరి నాకు ఇది నాన్నమ్మ "సీత

తనవంక చిరాగ్గా చూసి మెహం పక్కకు తిప్పేసుకుంది

చిన్నబుచ్చుకుంది మా అక్క

కారణం మా ఒంటి రంగు నేను పాలలో ముంచినట్టు

తెల్లగా ఉంటే నాకు పూర్తి భిన్నాం గా ఉండేది అక్క రంగు

అంటే నల్లగా ఉండేది అనమాట

పుట్టినరోజు వేడుకలో కూడా అందరూ నన్ను పలకరిస్తున్నారు మా అక్క ని ఎవరు పాటించుకోవట్లా

అంతే కోపం గా లోపలికి వెళ్ళిపోయి ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఏడుస్తూ కూర్చుంది

తరువాత మా అమ్మ వెళ్లి బుజ్జగించి అన్నం తినిపించి పాడుకోపెట్టిoది ఇంట్లో ప్రతి చోట ఇదే తంతు

స్కూల్ లో కూడ ఇంతే తనకన్నా రంగు తక్కువ వాళ్లు

చాలా మంది రంగు తక్కువ ఉన్న మా అక్క నే క్లాస్

పిల్లలు అంత నల్ల పిల్ల అని ఏడిపించేవారు దానికి

కారణం మా అక్కని అంటే ఉరుకునేది కాదు గొడవ

పడి ఏడ్చిది ఏడ్చే వాళ్ళని ఇంకా ఏడిపించడం సరదా

కదా సమాజానికి అందుకే అందరూ తనని అనేవారు

ప్రతిచోటా నన్ను పొగడం వాళ్ళ నాకు అందం గా

ఉంటాను అనే భావం ఏర్పడింది ఎక్కడో మూలాన గర్వం

గా ఉండేది

ఆలా ఆలా మా అక్క పదవ తరగతి లో కి వచ్చింది

ఒకసారి సోషల్ పీరియడ్ లో అక్క ని ఇప్పటి లానే నల్ల

పిల్ల అని ఏడిపించారు అది విని అక్క ఏడవటం

మొదలు పెట్టింది

అది చుసిన సార్ తనని పక్కకి

తీసుకెళ్లి ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగారు

కారణం చెప్పింది దానికి అయన నవ్వి
ను ఇలా వాళ్ళ మాటలకి ఏడుస్తునవ్ కాబట్టే వాళ్ళు ఆలా అంటున్నారు
చూడు తల్లి మనం మనలో చూస్కోవాల్సింది, అందం కాదు
ఉండాలి అని కోరుకోవాల్సింది మన రంగు కాదు
మన వ్యక్తిత్వం
వాళ్ళ మాటలని పటించుకోవడం మానెయ్
నిన్ను అన్నారా మౌనం గా ఉండు అని చేపి వెళ్లిపోయారు

అంతే అ నాటి నుంచి తన మౌనం సంద్రం కన్నా లోతు గా అయిపొయింది

మాట్లాడాల్సిన చోట తగినంత వరకు మాట్లాడం

అక్కర్లేని చోట మౌనం తోనే సమాధానం చెప్పడం మొదలు పెట్టింది

ఏడిపిండానికి ప్రయత్నం చేసి చేసి ఇంకా చేయలేక ఊరకుండిపోయారు

అలానే చదువులో రాణించింది తన లక్ష్యాన్ని చేధించే బాణం లాగా దూసుకుపోయింది ఐ సి ల్ స్ (ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్ ) ఆఫీసర్ అయింది

ఆలా తన వృత్తి లో దూసుకుపోయింది

ఇంట్లో అమ్మ వాళ్ళు పెళ్లి సంబంధాలు చూదాం మొదలు

పెట్టారు ఎవరికీ అక్క నచ్చేది కాదు నేనే నచ్చేదాన్ని

అక్క పట్టించుకునేది కాదు అమ్మ వాళ్ళకి స్థిరంగా చెప్పేసింది నాకు నచ్చిన వాడిని నేనే చూస్కుంటా

మీరు నా గురించి దిగులు పడకండి అని

చెల్లి కి చుడండి తనకి పెళ్లి చేయండి అని

చాలా విధాలుగా చెప్పిచూసారు ఇంకా వినకపోయేసరికి నాకు చూదాం మొదలు పెట్టారు

వెంటనే కుదిరింది నాకు చేసేసారు సంవత్సరం తిరగకు ముందే లేఖ పుట్టింది

" తాను తనతో వర్క్ చేసేవాడిని ప్రేమించా అని చెప్పింది అమ్మ వాళ్ళ తో

వేరే క్యాస్ట్ అని చుట్టాలు మా అత్తగారు వాళ్ళు
అందరూ తప్పు పట్టారు
తాను ఎవర్ని లెక్కచేయల అమ్మ వాళ్ళు కూడా నాగురించి సమాజం గురించి అలోచించి వెనకడుగు వేశారు

అక్క మాత్రం వెనకడుగు వేసే విలే లేదని నిక్కచ్చి గా చెప్పేసింది
ఆలా తనని చేసుకుంది అ అబ్బయి వీపు వాళ్ళ అమ్మ తప్ప ఎవరు లేరు
ఆవిడా అంగీకరించారు

అప్పుడప్పుడు అమ్మ వాళ్ళ యోగక్షేమాలు చూసేది

వాళ్ళ ఆదాయాలు మొత్తం తగుమోకం పట్టాయి ఇంకా వాళ్ళ అవసరాలు అన్ని అక్కే చూసేది

నా అందమే నాకు శాపం గా మరి నన్ని బంగారు పంజరం లో పడేశాయి

మా వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు

వాళ్ళకి ఆర్ధికంగా సాయం చేయలేను

అత్తారింట్లో వాళ్ళకి పనులు చేయడం తో నే నాకు రోజులు వెళ్లిపోతున్నాయి

ఎపుడైనా ఎవైన ఫంక్షన్స్ లో అనుకోకుండా అక్క ని కలిసిన
వీళ్ళ తిక్క ప్రెశ్నలకి తనదైన శైలి లో సమాధానం చెప్పేది

దానితో తన ముందు నోరు విప్పలేక

తన వెనకాల నా ముందు మాట్లాడతారు
తనకి పొగరు అని కులం తక్కువడిని పెళ్లి చేసుకుంది అని చెవులు కోరుకునేవాళ్ళు

నాకా మాట్లాడే ధైర్యం లేక మిన్నకుండిపోయేదాన్నని

వెనకాల మాట్లాడే వాళ్ళ స్థానం ఇపుడు మన వెనకే అని అక్క పాటించుకునేది కాదు

వేసవి సెలవులకు లేఖ ఇంకా వెళ్తాను అని పట్టు పట్టడం తో అందరికి ఇష్టం లేకున్నా పంపించాం ఆలానే రాగానే గొడవ
అక్క గురించి ఇపుడు చెప్తూ ఉండేదాన్ని ఇపుడు కలిసింది ఇంకా లేఖ కూడా అక్క లానే మార్చుకుంటుంది తన వ్యక్తిత్వం

నిజానికి ఆలా మారాలనే తనని పంపించింది

తనని పంపే ముందే అక్కా ని కలిసి నాలా ఉండకుండా నిల ఉండలి అని చెప్తే నవ్వి ఊరుకుంది

అ మౌనం లో నే నాకు మాట ఇచ్చింది అని అపుడు గ్రహించలేదు
ఇపుడు చేసి చూపినావుడు అర్ధం అయింది


మనం మనలో చూస్కోవాల్సింది అందం కాదు వ్యక్తిత్వం అది లేక నేను ఇలా బంగారు పంజరం లో ఇరుక్కుపోయి అది ఉన్న అక్క స్వాతంత్రo గా నలుగురికి సహాయపడుతూ బ్రతుకుతోంది


🙏 సమాప్తం 🙏