Read Consciousness by Surya Prakash in Telugu లేఖ | మాతృభారతి

Featured Books
  • వైశాలి - 1

    వైశాలి అందమైన యువతి.  ఆమె ఎంత అందంగా ఉంటుందంటే ముందు ముందు న...

  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆవేదన

కన్న కూతురు తన మనస్సులోని బాధను, ఆవేదనను తన తండ్రికి చెప్పే ధైర్యం లేక ఎదురుగా నిలబడే ధైర్యం చాలక మనసంతా కన్నీటితో నిండిన భాధతో వ్రాస్తున్న చివరి లేఖ.

పూజ్యునీయులైన నాన్నగారికి మీ కుమార్తె నమస్కరించి వ్రాయునది ఏమనగా

నేను మీతో ఎన్నో మాట్లాడాలని, మీకు ఎప్పటినుంచో నా మనస్సులోని బాధను, ఆవేదనను ఎన్నో రకాలుగా చెప్పాలని ప్రయత్నించాను. ఎదురుగా నిలబడి చెప్పాలని చిసిన్ కానీ మీరు నాకు ఆ అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు. ఎంతసేపూ మీగురించి మీరు అలోచించుకున్నారేగాని పిల్లల గురించి గాని కుటుంబ భాద్యతలుగాని వారి ఇష్టాఇష్టాలు ఏంటి అని తెలుసుకోలేకపోయారు. మన పరిస్థితి చూసి మీ ఎదుట నిలబడే దైర్యం చేయలేక మీతో నా బాధను చెప్పుకోలేక ఈవిధంగా ఈ ఉత్తరం రాస్తున్నాను ఇది చదివైనా మీరు మారతారేమోనని మిగిలిన పిల్లల భవిష్యతుని ఒక మంచి మార్గంలోకైనా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నానను.

పిల్లలకు తల్లితండ్రుల అవసరం చాలా ముఖ్యం పిల్లల కోసం తల్లితండ్రులు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారు. వాళ్ళ సంతోషం కోసం మీ సంతోషాలని త్యాగం చేస్తారు .

కుటుంబం అనేది ఒక బండి లాంటిది. అందులో తల్లి తండ్రి రెండు చక్రాలు లాంటివారు. అందులోని ఏ ఒక్క చక్రం విరిగిపోయినా ఇంక ఆ బండి ముందుకు సాగడం చాలా కష్టం.

కానీ నా జీవితంలో అమ్మ చనిపోయిన దగ్గరనుండి ఈ ఇల్లు నరక ప్రాయమైంది. నా సమస్యలని చెప్పుకోలేక , చావలేక బ్రతుకుతున్నాను. ఇన్నాళ్లు అమ్మ లేదని అమ్మలేని లోటు నువ్వైనా తీరుస్తావని ఎదురుచూసాను. కానీ ఆ ఆశ నిరాసాగానే మిగిలిపోయింది. మారతావనే ఆశ చచ్చిపోయింది.

తల్లి లేకపోయినా తండ్రి అయినా సరిగ్గా మమ్మల్ని చూస్తాడనే నమ్మకం తో ఇన్నాళ్లు బ్రతికున్నాను. కాని ఆ అదృష్టం కూడా లేదు. నాకు మా భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలియనంతగా మారిపోయావు. ఏదైనా భాద కలిగితే చెప్పుకోవడానికి అమ్మ లేదు. నీతోచెప్పేంత ధైర్యం కూడా లేదు . ఎందుకంటే అమ్మ చనిపోయిన తరువాత నువ్వు మమ్మలి పట్టించుకోవడం మనేశావు. తాగుడికి బానిసవు అయ్యావు. ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు చనిపోతే ఆ లోటు తీరనిది కానీ ఆ భాదని మర్చిపోవడానికి మీరు ఎన్నకున్న మార్గం తాగుడు. తాగుడే మార్గమని మీరు ఎంచుకున్నారు. దానివల్ల మిమ్మల్ని నమ్ముకుని ఉన్నవాళ్ళు ఏమవుతారో వల్ల జీవితాలు ఎలా ఉంటాయో అని మాత్రం మీరు ఆలోచించలేదు. ఆలోచించే పరిస్థిని కూడా మీరు దాటిపోయారు. మేము తిన్నామా ఉన్నామా అని కూడా చూడలేనంతగా మారావు.

తల్లి లేకపోయినా తల్లిలేని లోటుని తీరుస్తావనే ఆశతో ఇన్నాళ్లు బ్రతికాను కానీ ఆ ఆశ కూడా ఇప్పుడు చచ్చి పోయింది. అలా అని మిమ్మల్ని నేను వదులుకోలేను. మిమ్మల్ని వదిలి నేను ఉండలేను.

ఆడపిల్ల బ్రతుకు పుట్టినప్పుడు తల్లి,తండ్రిమీద, పెళ్లి అయ్యినప్పుడు భర్తమీద, పిల్లలు పుట్టాక కొడుకు మీద ఇలా ఎవరో ఒకరు మీద ఆధారపడవలసిందే కదా.

అమ్మలేని లోటు ఎంత భాధాకరమో నాకు తెలుసు కానీ మీకు ఏదైనా జరిగిన అంతకన్నా ఎక్కువగా మేము భాదపడవలసిందేకదా.

తాగుడే అన్ని సమస్యలకు పరిష్కరమనుకుంటే ఈ లోకంలో అందరూ అదే మార్గాన్ని ఎన్నుకొంటారు కదా. మిమ్మల్ని మార్చాలని నేను ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. మీరు మారలేదు.

నాకు ఊహ తెలిసినప్పట్నుండి మన కుటుంబం ఎంతో సంతోషం గా ఉండేది నేను అమ్మతో గడిపినక్షణాలు కూడా నాకు సరిగ్గా జ్ఞాపకం లేదు. నేను నా చిన్నతనంలోనే నేను మా అమ్మను కోల్పోయాను. అమ్మను కోల్పోయిన సంవత్సరంలోనే మీరు రెండొ పెళ్లి చేసుకున్నారు. కానీ అది మా కిష్టమా లేదా అని మీరు ఆలోచించకుండానే మీరు నిర్ణయం తీసుకున్నారు. పోని ఆ అమ్మ అయిన మమ్మల్ని ప్రేమగా చూస్తుందేమోనని ఆశ పడ్డాను. ఆ అమ్మ ప్రేమ కూడా నాకు ఎక్కువ రోజులు దక్కలేదు

ఎంతైనా సవతి తల్లి . సవతి తల్లి ప్రేమ వాళ్ళ పిల్లలు మీద ఉంటుంది కదా అందుకేనేమో మమ్మల్ని దూరం పెట్టింది. అప్పుడుకుడా మేము మా భాదని చెప్పాలని ప్రయత్నించినా కూడా ఆ అవకాశం కూడా మీరు మాకు ఇవ్వలేదు.

ఆడదానికి ఓర్పు, సహనం ఎంతో ఉంటుంది. కానీ ఆ రెండు కోల్పోయిన రోజున ఈ జీవితం ఎందుకనే ప్రశ్న గా మిగిలిపోతుంది. ఆ సమయంలోనే తప్పుడు నిర్ణయాలు తీసుకొనే పరిస్థితి వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి కూడా ఆను ఆ తప్పుడు నిర్ణయం తీసుకొనేలా చేసింది. కాదు చేసేలా మీరు చేశారు.

కనీసం ఈ ఉత్తరం చదివైనా మీరు మారతారేమోనని అనుకుంటున్నాను. మీరు మారితేనైనా నా ఆత్మ సంతోషిస్తుంది. నా జీవితం లా కాకుండా మీరు మిగతా వాళ్లని ప్రేమగా వాళ్ళకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి.

కనీసం మీరు నా చావుతో నైనా నేను మిమ్మల్ని మార్చగలనేమోనని ఒక చిన్న ఆశ. కానీ ఎప్పటికైనా ఇంకో జన్మ అంటూ ఉంటే మీకు కూతురిగా పుట్టాలని కోరుకోతున్నాను. అప్పుడైన తల్లి తండ్రి ప్రేమని పొందాలని కోరుకుంటూ మీ కూతురు.